lotus symbol
-
రాజస్థాన్‌లో బీజేపీ ముఖచిత్రం ఎవరంటే..?
చిత్తోఢ్: రాజస్థాన్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీల్లో అంతర్గత పోరు రచ్చకెక్కుతోంది. సీటు దక్కించుకోవడానికి నాయకుల అలకలు బయటపడుతున్నాయి. ఇటీవల బీజేపీ నిర్వహించిన పలు సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వసుందర రాజేతో పాటు మరికొందరు సీనియర్ నాయకులు గౌర్హాజరైన నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సీఎం అభ్యర్థిపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చిత్తోఢ్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. నేరాల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రథమ స్థానంలో నిలిపిందని ఆరోపించారు. సీఎం అశోక్ గహ్లోత్ హయంలో రాష్ట్రంలో అల్లర్లు, రాళ్లదాడులు, మహిళలపై ఆకృత్యాలు, దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఇందుకే ఓటేశారా..? అని ప్రశ్నించారు. బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు చెలరేగుతున్న క్రమంలో సీఎం అభ్యర్థి ఎవరని ప్రధాని మోదీని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు..' బీజేపీకి ముఖచిత్రం కమలమే. ప్రజలు కమలాన్ని మాత్రమే చూస్తారు. బీజేపీ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. రాజస్థాన్ అభివృద్ధికే కేంద్ర ప్రభుత్వం ప్రధాన్యతనిస్తుంది.' అని అన్నారు. ఈ మేరకు చిత్తోఢ్‌లో రూ.7000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. మాజీ సీఎం వసుంధర రాజే, సీనియర్ నాయకుల మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి. సీఎం అభ్యర్థిగా తమను ప్రకటించాలని సీనియర్ నాయకులు అధిష్ఠానాన్ని అభ్యర్థిస్తున్నారు. మళ్లీ రాజేకే పట్టం కట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్ షాతో సహా బీజేపీ చీఫ్ నడ్డా రాష్ట్ర నాయకులతో ఇప్పటికే సమావేశమయ్యారు. ఇదీ చదవండి: విపక్షాలకు విజన్ లేదు, రోడ్‌మ్యాప్ లేదు -
మీరేసే ప్రతి ఓటు నా బలాన్ని పెంచుతుంది
సిమ్లా: బీజేపీని మరోసారి గెలిపించి, చరిత్ర తిరగరాయాలని ప్రధాని మోదీ హిమాచల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కమలం గుర్తుకు వేసే ప్రతి ఓటు తన ధైర్యాన్ని ఇనుమడింపజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ మేరకు ప్రధాని ఫొటో, సంతకంతో కూడిన లేఖను బీజేపీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్లి అందిస్తున్నాయి. ‘గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా మీరు బీజేపీనే ఆశీర్వదిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. కమలం గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటుతో నా బలం పెరుగుతుంది’ అని హిందీలో రాసిన ఆ లేఖలో ఉంది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సరిహద్దు ప్రాంతాలు సహా రాష్ట్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేశాయని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి గమనం ముందుకు సాగించాలని ఓటర్లను ప్రధాని కోరారు. ఈ సందేశాన్ని వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు అందేలా చేస్తామని బీజేపీ నేత సంజయ్ టాండన్ చెప్పారు. -
..అందుకే పాస్‌పోర్ట్‌లో కమలం
న్యూఢిల్లీ: కొత్తగా జారీ చేస్తున్న పాస్‌పోర్ట్‌ల్లో కమలం గుర్తును ముద్రించడంపై గురువారం విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. కమలం గుర్తును ముద్రించడం నకిలీ పాస్‌పోర్ట్‌లను గుర్తించేందుకు ఉద్దేశించిన భద్రతాచర్యల్లో భాగమని తెలిపింది. ‘కమలం జాతీయ పుష్పం. భద్రతా చర్యల్లో భాగంగా దీన్ని ముద్రించాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. మిగతా జాతీయ చిహ్నాలను కూడా రొటేషన్ పద్దతిలో ముద్రిస్తామని వివరించారు. ఈ అంశాన్ని బుధవారం లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు ఎంకే రాఘవన్ ఈ అంశాన్ని లేవనెత్తి.. కేరళలోని కోజికోడ్‌లో కమలం గుర్తు ముద్రించిన పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయని, ఇది ప్రభుత్వ కాషాయీకరణలో భాగమని విమర్శించారు. -
సీఎం పెయింటింగ్.. రాజకీయాల్లో మార్పులు!
పాట్నా: బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ వేసిన ఓ పెయింటింగ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. నితీశ్ పెయింటింగ్ ఉద్దేశం ఏంటో తెలియదు గానీ, బిహార్ రాజకీయాలను ఆ పెయింటింగ్ సూచిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో శనివారం జరిగిన బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో నితీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీయూ నేత నితీశ్ పెయింటింగ్ బ్రష్ చేతపట్టి బీజేపీ పార్టీ రాజకీయ చిహ్నమైన కమలం గుర్తును గీశారు. అది మొదలుకుని ఆర్జేడీ, బీజేపీ నేతల మధ్య రాజకీయ చర్చ మొదలైంది. సీఎం నితీశ్ తాను ఇండిపెండెంట్ వ్యక్తిగా భావిస్తున్నారని, తన చిరకాల మిత్రుడు, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు ఈ రూపంలో పరోక్షంగా సంకేతాలు పంపించారని వదంతులు వ్యాపించాయి. దీనికి తోడు బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. బిహార్ లో సొంతంగా వ్యవహరించాలని నితీశ్ భావిస్తున్నారని, తన రాజకీయ రంగు, తన విధానం ఎలా ఉండబోతుందన్న దానిపై పెయింటింగ్ ద్వారా బహిర్గతం చేశారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా.. నితీశ్ మాత్రం ఆ నిర్ణయానికి మద్ధతు తెలిపారని గుర్తుచేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆర్జేడీ చీఫ్ లాలూ తనయుడు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు. కమలం అనగానే అది కేవలం బీజేపీకే చెందినట్లయితే, ఆర్జేడీ సింబల్ లాంతర్ దేశంలో చాలా ప్రాంతాల్లో ఇళ్లల్లో ఉంటుంది కదా.. దీంతో దేశమంతా ఆర్జేడీకే మద్ధతుగా ఉందని ప్రచారం చేస్తారా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. తమ పార్టీ గుర్తు పెయింటింగ్ వేశారని, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే బీజేపీ నేతలు సంబరపడతారంటే తమకు వచ్చిన నష్టమేమి లేదని తేజస్వి యాదవ్ అన్నారు.