Passport issue
-
పాస్‌పోర్ట్ గడువు ముగిసిందా.. ఎలా రెన్యువల్ చేయాలంటే..
భారత్ నుంచి ఏటా విదేశాలకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇతర దేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి. పాస్‌పోర్ట్ జారీ అయిన పదేళ్లు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత దాన్ని పునరుద్ధరించుకోవాలి. పాస్‌పోర్ట్ రిన్యువల్ సులభంగా ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యటన ఇలా పలు రకాల పనుల కోసం చాలా మంది విదేశాలకు పయనమవుతుంటారు. అలాంటి వారు ప్రభుత్వ నుంచి పాస్‌పోర్ట్ తీసుకోవాలి. ప్రయాణికులకు సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉంటాయి. 18 ఏళ్లలోపు వయసు ఉన్నవారికి పాస్‌పోర్ట్ గడువు ఐదు సంవత్సరాలు లేదా 18 ఏళ్లు పూర్తయ్యే వరకు ఉంటుంది. ఆ తర్వాత పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకోవాలి. ఇక 15 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు 10 సంవత్సరాల పాస్‌పోర్ట్‌ను తీసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత, దాన్ని సులభంగా ఆన్లైన్లో రెన్యువల్ చేసుకోవాలంటే కింది పద్ధతి పాటిస్తే సరిపోతుంది. రెన్యువల్ ఇలా.. ‘పాస్‌పోర్ట్ సేవ’ వెబ్సైట్లోకి వెళ్లాలి. ఒకవేళ వెబ్సైట్లో ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోకపోతే నియమాలకు అనుగుణంగా రిజిస్టర్ చేసుకొని లాగిన్ ఐడీని పొందవచ్చు. తర్వాత లాగిన్ ఐడీతో లాగిన్ అవ్వాలి. Apply for fresh passport/Reissue of Possport ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తగిన వివరాలను నమోదు చేయాలి. Pay and Schedule appointment మీద క్లిక్ చేయాలి. పేమెంట్ పద్ధతుల్లో ఏదైనా ఒక దాని ద్వారా పేమెంట్ పూర్తి చేయాలి. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత ఫాంను సబ్మిట్ చేయాలి. Print Application Receipt మీద క్లిక్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫాంను తీసుకుని నిర్ణీత తేదీన దగ్గరలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లాలి. అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలంటే.. ‘పాస్‌పోర్ట్ సేవ’ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. View Saved and Submit Applicationను సెలెక్ట్ చేసి, Pay and Schedule appointment మీద క్లిక్ చేయాలి. పేమెంట్ పద్ధతిని, పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంచుకోవాలి. పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లోకేషన్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. అపాయింట్మెంట్ కోసం తేదీ, సమయాన్ని సెలెక్ట్ చేసి Pay and Book the Appointment మీద క్లిక్ చేయాలి. రెన్యువల్ కోసం అవసరమయ్యే ధ్రువపత్రాలు.. ఒరిజినల్ పాస్‌పోర్ట్ స్వీయధ్రువీకరణతో ECR/Non-ECR పేజీ ఫోటోకాపీలు. అడ్రస్ ప్రూఫ్ పాస్‌పోర్ట్ మొదటి, చివరి పేజీల జిరాక్స్ కాపీలు. చెల్లుబాటు అయ్యే ఎక్స్టెన్షన్ పేజీ జిరాక్స్ కాపీ. సెల్ఫ్ అటెస్టెడ్ పేజ్ ఆఫ్ అబ్జర్వేషన్ జిరాక్స్ కాపీ. ఇదీ చదవండి: రిస్క్ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్బీఐ చాలామంది రీఇష్యూ, రెన్యువల్ రెండు ప్రక్రియలు ఒకటే అని అనుకుంటారు. కానీ రెండు ఒకటే తరహాలో ఉండే వేరువేరు ప్రక్రియలు అని గుర్తించుకోవాలి. రెండింటికి రెండు వేర్వేరు దరఖాస్తులు ఉంటాయి. అలాగే రిన్యువల్కి దరఖాస్తు చేసుకున్న నాలుగు నుంచి ఆరు వారాల్లో పాస్‌పోర్ట్ రిన్యువల్ జరుగుతుంది. -
..అందుకే పాస్‌పోర్ట్‌లో కమలం
న్యూఢిల్లీ: కొత్తగా జారీ చేస్తున్న పాస్‌పోర్ట్‌ల్లో కమలం గుర్తును ముద్రించడంపై గురువారం విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. కమలం గుర్తును ముద్రించడం నకిలీ పాస్‌పోర్ట్‌లను గుర్తించేందుకు ఉద్దేశించిన భద్రతాచర్యల్లో భాగమని తెలిపింది. ‘కమలం జాతీయ పుష్పం. భద్రతా చర్యల్లో భాగంగా దీన్ని ముద్రించాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. మిగతా జాతీయ చిహ్నాలను కూడా రొటేషన్ పద్దతిలో ముద్రిస్తామని వివరించారు. ఈ అంశాన్ని బుధవారం లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు ఎంకే రాఘవన్ ఈ అంశాన్ని లేవనెత్తి.. కేరళలోని కోజికోడ్‌లో కమలం గుర్తు ముద్రించిన పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయని, ఇది ప్రభుత్వ కాషాయీకరణలో భాగమని విమర్శించారు. -
నెటిజన్‌కు సుష్మా స్వరాజ్ ఝలక్!
న్యూఢిల్లీ : భిన్న మతాలకు చెందిన ఒక జంటకు పాస్‌పోర్ట్ జారీ కావడానికి సహకరిస్తూ.. ఆ జంటను వేధించిన అధికారిని బదిలీ చేసేలా ఆదేశాలిచ్చిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు, దూషణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం సుష్మాకు మద్దతుగా నిలిచి, అలా వ్యక్తిగత దూషణలు చేయడం తప్పు అని నెటిజన్లకు సూచించారు. ఈ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో.. ఓ నెటిజన్ మంచి రోజులు అంటే ఇవేనా.. అయితే మీరు నన్ను బ్లాక్ చేయండి అని ట్వీట్ చేయగా.. సరే అంటూ మంత్రి సుష్మాస్వరాజ్ తగిన రీతిలో స్పందించారు. సోనమ్ మహాజన్ అనే నెటిజన్.. ‘ఆమె(సుష్మా) మంచి పాలన అందించడానికి వచ్చారు. మీకు మంచి రోజులు వచ్చేశాయి. సుష్మాజీ ఒకప్పుడు నేను మీకు వీరాభిమానిని. మీపై దూషణకు, అసభ్య పదజలానికి దిగిన వాళ్లతో పోరాడాను. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. నన్ను మీరు బ్లాక్ చేయండి. రుణం తీర్చుకోండి. ఇందులో ఎదురచూడడానికి ఏం లేదంటూ’ ట్వీట్ చేశారు. సోనమ్ ట్వీట్‌కు తగిన రీతిలో సుష్మా స్పందించారు. ‘ఎదురుచూడటం ఎందుకు? ఇదుగో నిన్ను బ్లాక్ చేసేస్తున్నా’ అంటూ సుష్మా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. Intezaar kyon ? Lijiye block kr diya. https://t.co/DyFy3BSZsM — Sushma Swaraj (@SushmaSwaraj) 3 July 2018 Yeh good governance dene aaye the. Yeh lo bhai, achhe din aa gaye hain. @SushmaSwaraj ji, I was once a fan and fought against those who abused you, ab aap please, mujhe bhi block kar ke, inaam dijiye. Intezaar rahegaa. https://t.co/a2AlYczY5j — Sonam Mahajan (@AsYouNotWish) 2 July 2018 కాగా, లక్నోకు చెందిన మహ్మద్ అనాస్ సిద్ధిఖీ, తన్వీ సేథ్ దంపతులు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోగా అధికారి వికాస్ మిశ్రా అనాస్‌ను పేరు మార్చుకోవాల్సిందిగా సూచించారు. దీనిపై బాధితులు సుష్మాకు ఫిర్యాదు చేయగా.. ఆమె వెంటనే స్పందించి పాస్‌పోర్టు మంజూరు చేయించారు. అంతేకాకుండా వికాస్‌ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యను కొందరు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. సుష్మా తీసుకున్న నిర్ణయంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒక వ్యక్తి ఏకంగా ఇటీవల మీకు ఒక ముస్లిం వ్యక్తి కిడ్నీని అమర్చారు.. ఇది మీకు అమర్చిన ఇస్లామిక్ కిడ్నీ ప్రభావమా అంటూ తీవ్ర విమర్శల పాలవుతున్నారు. -
సుష్మా స్వరాజ్‌కు కాంగ్రెస్ బాసట
న్యూఢిల్లీ : విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. ఓ హిందు- ముస్లిం జంటకు పాస్‌పోర్ట్ జారీకి నిరాకరించి వివాదంలో చిక్కుకున్న వికాస్ మిశ్రా అనే అధికారిని బదిలీ చేయడంపై నెటిజన్లు సుష్మాపై విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై కాంగ్రెస్ తాజాగా స్పందించింది. ఈ అంశంలో తాము సుష్మా నిర్ణయానికి మద్దతు పలుకుతున్నట్టు ట్విటర్లో పేర్కొంది. ఈ విషయంలో సుష్మాని నిందించడానికి, అగౌరవపరచడానికి ఎలాంటి అస్కారం లేదని అభిప్రాయపడింది. సొంత పార్టీకి చెందిన వ్యక్తులే విమర్శలు గుప్పిస్తున్నప్పటికి.. సుష్మా నిర్ణయాన్ని తాము అభినందిస్తున్నామని తెలిపింది. కాగా, లక్నోకు చెందిన మహ్మద్ అనాస్ సిద్ధిఖీ, తన్వీ సేథ్ దంపతులు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోగా అధికారి వికాస్ మిశ్రా అనాస్‌ను పేరు మార్చుకోవాల్సిందిగా సూచించారు. దీనిపై బాధితులు సుష్మాకు ఫిర్యాదు చేయగా.. ఆమె వెంటనే స్పందించి పాస్‌పోర్టు మంజూరు చేయించారు. అంతేకాకుండా వికాస్‌ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యను కొందరు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. సుష్మా తీసుకున్న నిర్ణయంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒక వ్యక్తి ఏకంగా ఇటీవల మీకు ఒక ముస్లిం వ్యక్తి కిడ్నీని అమర్చారు.. ఇది మీకు అమర్చిన ఇస్లామిక్ కిడ్నీ ప్రభావమా అంటూ ప్రశ్నించాడు. -
దేవయానికి ప్రమోషన్
న్యూఢిల్లీ : పనిమనిషి పాస్‌పోర్టు విషయంలో తప్పుడు పత్రాలు సమర్పించారని, ఆమెకు సరిగా జీతం చెల్లించకుండా వేధింపులకు గురిచేశారనే కారణంగా 2013లో అరెస్టైన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకు సెంట్రల్ అడ్మినిస్ట్రేవ్ ట్రిబ్యునల్(క్యాట్)లో ఊరట లభించింది. 1999 బ్యాచ్‌కు చెందిన దేవయానికి పదోన్నతి కల్పించడంతో పాటు 2016 నుంచి దీనిని వర్తింపచేయాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను క్యాట్ ఆదేశించింది. దీంతో జాయింట్ సెక్రటరీగా ఆమె పదోన్నతి పొందనున్నారు. ఆమెపై నమోదైన కేసు విచారణలో జాప్యం చేసినందుకు ఆ శాఖను తప్పుపట్టింది. భారత్‌కు చెందిన తన పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా విషయంలో తప్పుడు పత్రాలు సమర్పించారనే కారణంతో 2013లో న్యూయార్క్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దీనివల్ల భారత్- అమెరికాల మధ్యనున్న దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. మీడియాలో కూడా ఈ విషయం గురించి చర్చ జరగడంతో దేవయానిపై విమర్శలు వెల్లువెత్తాయి. తన పిల్లల పౌరసత్వానికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేసిందనే కారణంగా విదేశీ వ్యవహారాల శాఖ ఆమె ప్రమోషన్‌ను నిలిపివేసింది. అంతేకాకుండా తండ్రితో పాటు అమెరికాలో నివసిస్తున్న దేవయాని ఇద్దరు కుమార్తెలకు భారత పౌరసత్వాన్ని తిరస్కరించింది. ఇండియన్ పాస్‌పోర్టు, పౌరసత్వ చట్టాన్ని ఉల్లంఘించించారన్న ఆరోపణలతో ఆమెపై క్రమశిక్షణ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అంశం గురించి దేవయాని మాట్లాడుతూ... ‘ఈ కేసులో పిటిషనర్ తల్లి(దేవయాని) ఎప్పుడూ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయలేదు. తన భర్త, తనపై ఆధారపడిన వారి గురించి కూడా విదేశీ పౌరసత్వం కల్పించాలని కోరలేదు. భారత విదేశీ విధానం-1961 నిబంధనల ప్రకారం ఇది చట్టాన్ని మీరినట్టు కాదు. 16 ఏళ్ల సర్వీసులో నేను చాలా బాగా పనిచేశానని’ పేర్కొన్నారు. ఈ అంశాల గురించి అఫిడవిట్లో కూడా ప్రస్తావించారు. -
నయన పట్టు పడ్డారా?
సంచలన తారగా పేరొందిన నయనతార మరోసారి కలకలానికి కేంద్రంగా మారారు. ఈ క్రేజీ నటి మలేషియా విమానాశ్రయంలో నకిలీ వీసాతో అక్కడి అధికారులకు పట్టుబడ్డారనే ప్రచారం శుక్రవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. దీంతో కోలీవుడ్‌లో కలకలం చెలరేగింది.ఆ మధ్య నానుమ్ రౌడీదాన్ చిత్ర సన్నివేశంలో నయనతార ఒక టాస్మార్క్ షాపులో మద్యం బాటిల్ కొంటున్న ఫొటో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. దీంతో ఈ తాజా సంఘటన కూడా చిత్రానికి ఫ్రీ ప్రచారంలో ఒక భాగం అని ఒక వర్గం పేర్కొంటున్నారు. అయితే మలేషియా విమానాశ్రయంలో నయనతారను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేసింది వాస్తవమే అన్నది తెలియవచ్చింది. వివరాల్లకెళితే నయనతార ప్రస్తుతం విక్రమ్ సరసన ఇరుముగన్ చిత్రంతో నటిస్తున్నారు. మలేషియాలో జరుగుతున్న ఆ చిత్ర షూటింగ్లో పాల్గొని ఇండియాకు తిరుగు ముఖం పట్టిన నయనతార మలేషియా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కేఎల్1, కేఎల్2 అనే రెండు రకాల టెర్మినల్ విధాలను అమలు పరుస్తున్నారు. ఇండియాకు వచ్చే ప్రయాణికులు కేఎల్1 టెర్మినల్ ద్వారా ప్రవేశించాల్సి ఉండగా కేఎల్2 టెర్మినల్ వద్ద ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా తనిఖీ చేసి సరిగా లేవంటూ చిన్న కలకలానికి కారణం అయ్యారు. అయితే వారికి నటి నయనతార క్లారిఫికేషన్ ఇచ్చి ఇండియాకు చేరుకున్నారని ఇరుముగన్ చిత్ర యూనిట్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా నయనతార పాస్‌పోర్టు నకలు మలేషియా ఇంటర్నెట్లలో ప్రచారం కావడంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసి నయనతారపై సాగుతున్న వదంతులకు పుల్‌స్టాప్ పెట్టారు.