పాస్‌పోర్ట్‌ గడువు ముగిసిందా.. ఎలా రెన్యువల్‌ చేయాలంటే.. | Passport Renewal Process Through Online | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్ట్‌ వ్యాలిడిటీ అయిపోయిందా.. ఎలా రెన్యువల్‌ చేయాలంటే..

Published Wed, Mar 6 2024 8:56 AM | Last Updated on Wed, Mar 6 2024 10:37 AM

Passport Renewal Process Through Online - Sakshi

భారత్‌ నుంచి ఏటా విదేశాలకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇతర దేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్‌ తప్పనిసరి. పాస్‌పోర్ట్‌ జారీ అయిన పదేళ్లు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత దాన్ని పునరుద్ధరించుకోవాలి. పాస్‌పోర్ట్‌​ రిన్యువల్​ సులభంగా ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యటన ఇలా పలు రకాల పనుల కోసం చాలా మంది విదేశాలకు పయనమవుతుంటారు. అలాంటి వారు ప్రభుత్వ నుంచి పాస్‌పోర్ట్‌ తీసుకోవాలి. ప్రయాణికులకు సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉంటాయి. 18 ఏళ్లలోపు వయసు ఉన్నవారికి పాస్‌పోర్ట్‌ గడువు ఐదు సంవత్సరాలు లేదా 18 ఏళ్లు పూర్తయ్యే వరకు ఉంటుంది. ఆ తర్వాత పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకోవాలి. ఇక 15 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు 10 సంవత్సరాల పాస్‌పోర్ట్‌ను తీసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత, దాన్ని సులభంగా ఆన్‌లైన్‌లో రెన్యువల్ చేసుకోవాలంటే కింది పద్ధతి పాటిస్తే సరిపోతుంది.

రెన్యువల్ ఇలా..

  • ‘పాస్‌పోర్ట్‌ సేవ’ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఒకవేళ వెబ్‌సైట్‌లో ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోకపోతే నియమాలకు అనుగుణంగా రిజిస్టర్ చేసుకొని లాగిన్ ఐడీని పొందవచ్చు.
  • తర్వాత లాగిన్ ఐడీతో లాగిన్ అవ్వాలి.
  • Apply for fresh passport/Reissue of Possport ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • తగిన వివరాలను నమోదు చేయాలి.
  • Pay and Schedule appointment మీద క్లిక్ చేయాలి.
  • పేమెంట్ పద్ధతుల్లో ఏదైనా ఒక దాని ద్వారా పేమెంట్ పూర్తి చేయాలి.
  • అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత ఫాంను సబ్మిట్ చేయాలి.
  • Print Application Receipt మీద క్లిక్ చేయాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫాంను తీసుకుని నిర్ణీత తేదీన దగ్గరలోని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రానికి వెళ్లాలి.

అపాయింట్‌మెంట్‌ ఎలా బుక్ చేసుకోవాలంటే..

  • ‘పాస్‌పోర్ట్‌ సేవ’ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.
  • View Saved and Submit Applicationను సెలెక్ట్ చేసి, Pay and Schedule appointment మీద క్లిక్ చేయాలి.
  • పేమెంట్ పద్ధతిని, పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాన్ని ఎంచుకోవాలి. 
  • పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం లోకేషన్​, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి.
  • అపాయింట్‌మెంట్‌ కోసం తేదీ, సమయాన్ని సెలెక్ట్ చేసి Pay and Book the Appointment మీద క్లిక్ చేయాలి.

రెన్యువల్ కోసం అవసరమయ్యే ధ్రువపత్రాలు..

  • ఒరిజినల్ పాస్‌పోర్ట్‌
  • స్వీయధ్రువీకరణతో ECR/Non-ECR పేజీ ఫోటోకాపీలు.
  • అడ్రస్ ప్రూఫ్
  • పాస్‌పోర్ట్‌ మొదటి, చివరి పేజీల జిరాక్స్​ కాపీలు.
  • చెల్లుబాటు అయ్యే ఎక్స్‎టెన్షన్ పేజీ జిరాక్స్​ కాపీ.
  • సెల్ఫ్ అటెస్టెడ్‌ పేజ్‌ ఆఫ్ అబ్జర్వేషన్ జిరాక్స్​ కాపీ.

ఇదీ చదవండి: రిస్క్‌ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్‌బీఐ

చాలామంది రీఇష్యూ, రెన్యువల్ రెండు ప్రక్రియలు ఒకటే అని అనుకుంటారు. కానీ రెండు ఒకటే తరహాలో ఉండే వేరువేరు ప్రక్రియలు అని గుర్తించుకోవాలి. రెండింటికి రెండు వేర్వేరు దరఖాస్తులు ఉంటాయి. అలాగే రిన్యువల్‎కి దరఖాస్తు చేసుకున్న నాలుగు నుంచి ఆరు వారాల్లో పాస్‎పోర్ట్ రిన్యువల్ జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement