passport applications
-
పాస్‌పోర్ట్ గడువు ముగిసిందా.. ఎలా రెన్యువల్ చేయాలంటే..
భారత్ నుంచి ఏటా విదేశాలకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇతర దేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి. పాస్‌పోర్ట్ జారీ అయిన పదేళ్లు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత దాన్ని పునరుద్ధరించుకోవాలి. పాస్‌పోర్ట్ రిన్యువల్ సులభంగా ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యటన ఇలా పలు రకాల పనుల కోసం చాలా మంది విదేశాలకు పయనమవుతుంటారు. అలాంటి వారు ప్రభుత్వ నుంచి పాస్‌పోర్ట్ తీసుకోవాలి. ప్రయాణికులకు సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉంటాయి. 18 ఏళ్లలోపు వయసు ఉన్నవారికి పాస్‌పోర్ట్ గడువు ఐదు సంవత్సరాలు లేదా 18 ఏళ్లు పూర్తయ్యే వరకు ఉంటుంది. ఆ తర్వాత పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకోవాలి. ఇక 15 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు 10 సంవత్సరాల పాస్‌పోర్ట్‌ను తీసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత, దాన్ని సులభంగా ఆన్లైన్లో రెన్యువల్ చేసుకోవాలంటే కింది పద్ధతి పాటిస్తే సరిపోతుంది. రెన్యువల్ ఇలా.. ‘పాస్‌పోర్ట్ సేవ’ వెబ్సైట్లోకి వెళ్లాలి. ఒకవేళ వెబ్సైట్లో ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోకపోతే నియమాలకు అనుగుణంగా రిజిస్టర్ చేసుకొని లాగిన్ ఐడీని పొందవచ్చు. తర్వాత లాగిన్ ఐడీతో లాగిన్ అవ్వాలి. Apply for fresh passport/Reissue of Possport ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తగిన వివరాలను నమోదు చేయాలి. Pay and Schedule appointment మీద క్లిక్ చేయాలి. పేమెంట్ పద్ధతుల్లో ఏదైనా ఒక దాని ద్వారా పేమెంట్ పూర్తి చేయాలి. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత ఫాంను సబ్మిట్ చేయాలి. Print Application Receipt మీద క్లిక్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫాంను తీసుకుని నిర్ణీత తేదీన దగ్గరలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లాలి. అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలంటే.. ‘పాస్‌పోర్ట్ సేవ’ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. View Saved and Submit Applicationను సెలెక్ట్ చేసి, Pay and Schedule appointment మీద క్లిక్ చేయాలి. పేమెంట్ పద్ధతిని, పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంచుకోవాలి. పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లోకేషన్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. అపాయింట్మెంట్ కోసం తేదీ, సమయాన్ని సెలెక్ట్ చేసి Pay and Book the Appointment మీద క్లిక్ చేయాలి. రెన్యువల్ కోసం అవసరమయ్యే ధ్రువపత్రాలు.. ఒరిజినల్ పాస్‌పోర్ట్ స్వీయధ్రువీకరణతో ECR/Non-ECR పేజీ ఫోటోకాపీలు. అడ్రస్ ప్రూఫ్ పాస్‌పోర్ట్ మొదటి, చివరి పేజీల జిరాక్స్ కాపీలు. చెల్లుబాటు అయ్యే ఎక్స్టెన్షన్ పేజీ జిరాక్స్ కాపీ. సెల్ఫ్ అటెస్టెడ్ పేజ్ ఆఫ్ అబ్జర్వేషన్ జిరాక్స్ కాపీ. ఇదీ చదవండి: రిస్క్ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్బీఐ చాలామంది రీఇష్యూ, రెన్యువల్ రెండు ప్రక్రియలు ఒకటే అని అనుకుంటారు. కానీ రెండు ఒకటే తరహాలో ఉండే వేరువేరు ప్రక్రియలు అని గుర్తించుకోవాలి. రెండింటికి రెండు వేర్వేరు దరఖాస్తులు ఉంటాయి. అలాగే రిన్యువల్కి దరఖాస్తు చేసుకున్న నాలుగు నుంచి ఆరు వారాల్లో పాస్‌పోర్ట్ రిన్యువల్ జరుగుతుంది. -
రాహుల్ కొత్త పాస్‌పోర్ట్ ప్రయత్నం.. సుబ్రమణ్యస్వామి కౌంటర్ ఇదే..
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. ఈ నెల 31 నుంచి రాహుల్.. పది రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, రాహుల్.. జూన్ 4న న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఏర్పాటు చేసే బహిరంగ సభతో పాటు వాషింగ్టన్, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక, రాహుల్ అమెరికా పర్యటన నేపథ్యంలో కొత్త పాస్‌పోర్టు కోసం ఢిల్లీ హైకోర్టును కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సాధారణ పాస్‌పోర్టును పొందేందుకు అనుమతి(ఎన్వోసి) ఇవ్వాలని రాహుల్ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. మే 26(శుక్రవారం)తేదీన విచారణ జరుపనున్నట్టు స్పష్టం చేసింది. అయితే, మోదీ ఇంటి పేరు వ్యవహారంలో రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో, రాహుల్ తన లోక్‌సభ సభ్యత్వం కోల్పోవడం, అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే రాహుల్ తన పాస్‌పోర్టు సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులు సమర్పించారు. అంతకు ముందు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ.. రాహుల్ పాస్‌పోర్టును సీజ్ చేసింది. దీంతో ఇప్పుడు కొత్తగా సాధారణ పాస్‌పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. అందుకే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ కొత్త పాస్‌పోర్టుపై కోర్టును ఆశ్రయించడంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి స్పందించారు. రాహుల్ విజ్ఞప్తిని ఆయన వ్యతిరేకించారు. ఇప్పుడు రాహుల్ గాంధీని విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు ఆటంకం కలుగుతుందని సుబ్రమణ్యస్వామి తెలిపారు. పాస్‌పోర్టు ఇవ్వకపోవడమే మంచిదని పరోక్షంగా స్పష్టం చేశారు. #Breaking BJP leader Subramanian Swamy opposes Rahul Gandhi's plea for grant of a fresh passport. Swamy says that if Gandhi is allowed to travel abroad, it may hamper the probe in the National Herald case. #RouseAvenueCourt @RahulGandhi @Swamy39 #Passport pic.twitter.com/tO28Q5ykjm — Bar & Bench (@barandbench) May 24, 2023 ఇది కూడా చదవండి: పెద్ద నోట్ల రద్దు.. ఇంతకీ వాటిని ఏం చేశారు.. ఎక్కడున్నాయో తెలుసా? -
Passport Drive: డిసెంబర్ 3న ప్రత్యేక పాస్‌పోర్టు డ్రైవ్
రాంగోపాల్‌పేట్: పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వస్తుండటంతో డిసెంబర్ 3వ తేదీన ప్రత్యేక పాస్‌పోర్టు డ్రైవ్ నిర్వహించనున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, బేగంపేట, టోలిచౌకిలోని పీఎస్కేలు, నిజామాబాద్, కరీంనగర్ పీఎస్కేలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని 14 పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో డిసెంబర్ 3వ తేదీన తత్కాల్, సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు. ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారు, కొత్తగా చేసుకునేవారికి కూడా స్లాట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆ ఒక్క రోజు 3,500 దరఖాస్తులను ఆయా కేంద్రాల ద్వారా సమర్పించే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఇందులో 70 శాతం తత్కాల్, 30 శాతం సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తులుంటాయని వివరించారు. బుధవారం ఉదయం నుంచి పాస్‌పోర్టు సేవా పోర్టల్, ఎంపాస్‌పోర్ట్ సేవా యాప్ ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవడం లేదా, దరఖాస్తు చేసుకున్న వారు 3వ తేదీకి ప్రీపోన్ చేసుకోవచ్చని సూచించారు. డిసెంబర్ 3న ఒక రీ షెడ్యూలింగ్, ఒక ప్రీపోన్కు మాత్రమే అవకాశం ఉంటుందని.. మరో తేదీ మార్చుకునే వెసులుబాటు ఉండదని గుర్తుంచుకోవాలని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య స్పష్టం చేశారు. -
పాస్‌పోర్టు కోసం అప్లై చేసేవాళ్లకి సూపర్ గుడ్ న్యూస్
-
పాస్‌పోర్టులకు దరఖాస్తుల వెల్లువ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ సమయంలో విదేశాలకు వెళ్లేందుకు ఆంక్షలు ఉండటంతో ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. తాజాగా విదేశాల్లోని కాలేజీలు, యూనివర్సిటీల్లో అడ్మిషన్లు మొదలుకావడం, అంతర్జాతీయంగా కోవిడ్ ఆంక్షలు సడలించడంతో దరఖాస్తులు ఊపందుకున్నాయి. కోవిడ్ సమయంలో విజయవాడ, విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలతో పాటు తిరుపతి పాస్‌పోర్టు సేవా కేంద్రానికి రోజుకు 300 చొప్పున దరఖాస్తులు మాత్రమే వచ్చేవి. అంటే మూడింటిలో కలిపి 900 మాత్రమే అందేవి. ఇప్పుడా సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్కో కేంద్రంలో 500 చొప్పున రోజుకు 1,500 వరకు స్లాట్లు విడుదల చేస్తున్నారు. అలాగే 22 పోస్టాఫీసుల నుంచి రోజుకు వెయ్యి స్లాట్లు ఇస్తున్నారు. అంటే రోజుకు మొత్తమ్మీద 2,500 స్లాట్లు లభిస్తున్నాయి. అయినప్పటికీ 20 రోజుల పాటు వెయిటింగ్ లిస్టు వస్తోంది. దరఖాస్తుల్లో 40 శాతం విద్యార్థులవే కావడం గమనార్హం. కెనడా, అమెరికా, యూకే దేశాలకు చదువుల నిమిత్తం వెళుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అదేవిధంగా అమెరికా, ఇతర దేశాల్లో స్థిరపడిన పిల్లలను చూసేందుకు, వాళ్లకు ప్రసవ సమయంలో తోడ్పాటు అందించేందుకు వెళ్తున్న తల్లిదండ్రుల సంఖ్య సైతం పెరిగింది. దరఖాస్తు మరింత సరళతరం దరఖాస్తుదారులకు పాస్‌పోర్టును మరింత చేరువ చేసేందుకు నిబంధనలను సరళతరం చేశారు. జనన ధ్రువీకరణకు ఎస్ఎస్సీ, చిరునామా ధ్రువీకరణకు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ) ఉంటే పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఆరేడు డాక్యుమెంట్లు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదని పాస్‌పోర్టు అధికారులు తెలిపారు. ఏజెంట్లను, నకిలీ వెబ్సైట్లను నమ్మొద్దు పాస్‌పోర్టు దరఖాస్తుల కోసం ఏజెంట్లను ఆశ్రయించవద్దు. మేం ఎలాంటి ఏజెంట్లనూ గుర్తించడం లేదు. నకిలీ వెబ్సైట్ల వల్ల చాలామంది నష్టపోతున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుదారులు కేవలం www. passportindia. gov. in వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఏవైనా అనుమానాలుంటే ఈ వెబ్సైట్ నుంచే తెలుసుకోవచ్చు. అత్యవసరం లేనివారు తత్కాల్ కింద బుక్ చేసుకోవద్దు. – డీఎస్ఎస్ శ్రీనివాసరావు, రీజనల్ పాస్‌పోర్టు అధికారి, విజయవాడ -
నిమిషాల్లో ఈ-పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్ సేవలకు ఈ–టోకెన్ విధానం సత్ఫలితాన్నిస్తోంది. ఆన్లైన్లో పాస్‌పోర్ట్ పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ–టోకెన్ నంబర్ ఎస్ఎంఎస్ రూపంలో మొబైల్‌కు అందుతుంది. దీంతో పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్ ప్రతులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అక్కడి సిబ్బందికి మీ సెల్‌ఫోన్‌కు అందిన మీ దరఖాస్తు రిఫరెన్స్ నంబర్ (ఏఆర్ఎన్) చూపితే చాలు. ఈ పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియను అక్కడి సిబ్బంది నిమిషాల్లో పూర్తి చేస్తారు. అమీర్‌పేట్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అమలు చేసిన ఈ ప్రయోగాత్మక విధానం సఫలీకృతం కావడంతో ఇటీవల మరో 4 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, 23 పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లోనూ అమలు చేస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం వర్గాలు తెలిపాయి. దేశంలో ఢిల్లీ తర్వాత ఈ విధానాన్ని మన నగరంలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇక ఏఆర్ఎన్ ద్వారా తమ పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఏస్థాయిలో ఉందన్న అంశాన్ని ఈ–ట్రాకింగ్‌తో తెలుసుకునే సౌలభ్యాన్ని విదేశాంగ శాఖ కల్పించడం విశేషం. 6 నెలల ముందే అలర్ట్.. పాస్‌పోర్టు గడువు తీరిన వినియోగదారుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ అందించే సేవలను ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రారంభించింది. వినియోగదారులకు 6 నెలల ముందుగానే ఈ సమాచారాన్ని తెలియజేయడం ద్వారా వారు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందుకోసం వినియోగదారులందరి పాస్‌పోర్ట్ డేటాను డిజిటల్ మాధ్యమంలో భద్రపరిచామని పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ అలర్ట్ సైతం కంప్యూటర్ ద్వారా ఆటోమేటిక్‌గా వినియోగదారులకు చేరేలా ఏర్పాట్లు చేయడం విశేషం. దరఖాస్తు సమయంలో జాగ్రత్త.. పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే వినియోగదారులు విధిగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ https://www.passportindia.gov.in/ నుంచే చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఇతర లింక్‌లను ఆశ్రయించి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. రోజూ 3 వేల దరఖాస్తులు.. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యాటకం, మెడికల్ టూరిజం ఇలా విదేశాలకు వెళుతోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో పాస్‌పోర్ట్ దరఖాస్తులు సైతం అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం పాస్‌పోర్ట్ కార్యాలయాలకు సుమారు 3 వేల దరఖాస్తులు అందుతున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీస్ క్లియెరెన్స్ అందిన 3–4 రోజుల్లో పాస్‌పోర్టును జారీ చేస్తున్నామని, పోలీసులు సైతం వెరిఫికేషన్‌ను సత్వరం పూర్తి చేస్తున్నారన్నారు. -
పాస్‌పోర్టు మంజూరులో మైనర్లకు మినహాయింపులు
మర్రిపాలెం(విశాఖపట్నం) : పాస్‌పోర్ట్ మంజూరు దరఖాస్తు ప్రక్రియలో 18 ఏళ్ల లోపు మైనర్లకు ఆంక్షల వర్తింపులో కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ప్రకటించినట్టు విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయం పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలియజేశారు. గతంలో మైనర్ పాస్‌పోర్ట్ దరఖాస్తు పరిశీలన సమయంలో తల్లిదండ్రుల ఒరిజినల్ పాస్‌పోర్ట్‌లు తప్పక చూపించాలని ఆంక్షలు ఉన్నాయన్నారు. ఇకపై తల్లిదండ్రుల పాస్‌పోర్ట్ జెరాక్స్ కాపీలు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ పాస్‌పోర్ట్‌ల కాల పరిమితి ముగిసినచో ఏదైనా చిరునామా ధ్రువపత్రం చూపించాలన్నారు. మైనర్ల పాస్‌పోర్ట్ దరఖాస్తు పరిశీలనకు తల్లిదండ్రులు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో హాజరు కావాలన్నారు. విదేశాలలో ఉన్నట్టయితే ఇండియన్ మిషన్ ధ్రువీకరించిన ‘అనెక్సార్-హెచ్’ ఫారమ్ కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రులలో ఒక్కరే అందుబాటులో ఉన్నచో ‘అనెక్సార్-జి లేక సి’ ఫారమ్ జత చేయాలన్నారు. వైవాహిక జీవితానికి దూరమైన తల్లి లేక తండ్రి సంరక్షణలో ఉన్న మైనర్ జ్యుడీషియల్ లేదా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కాపీ కలిగి ఉండాలన్నారు. అనెక్సార్ సి,హెచ్,జి ఫారమ్‌లు త్వరలో పాస్‌పోర్ట్ వెబ్ పోర్టర్లో కేంద్రం అందుబాటులో ఉంచుతుందని పేర్కొన్నారు.