new passport
-
New e-passports: కొత్త పాస్‌పోర్ట్‌లు వచ్చేస్తున్నాయ్..
దేశంలో అన్ని వ్యవస్థలూ డిజిటల్ వైపు పయనిస్తున్నాయి. ఇదే ఒరవడిలో కొత్త పాస్‌పోర్ట్‌లు వచ్చేస్తున్నాయి. పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0 కింద కొత్త ఈ-పాస్‌పోర్ట్‌లను ఏడాది చివరి నాటికి ప్రవేశపెట్టడం ద్వారా గణనీయమైన డిజిటల్ మార్పునకు నాంది పలికేందుకు భారత్ సిద్ధమైంది. కొత్త ఈ-పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.. ఇంటిగ్రేటెడ్ చిప్ కొత్త ఈ-పాస్‌పోర్ట్ ఇంటిగ్రేటెడ్ చిప్‌తో వస్తుంది. సంబంధిత వ్యక్తికి చెందిన బయోమెట్రిక్ డేటా (ఫొటోగ్రాఫ్, వేలిముద్రలు) ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. దీని వల్ల భద్రత మెరుగుపడుతుందని, అంతర్జాతీయ సరిహద్దుల్లో పాస్‌పోర్టులను నకిలీ చేయడం కష్టతరం అవుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. దీనికి సంబంధించి గత జూన్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి అనుగుణంగా 'ఈజ్ ఆఫ్ లివింగ్'ని మెరుగుపరిచే లక్ష్యంతో విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొంది. ఈజ్ (EASE)ని విపులీకరిస్తే.. E అంటే డిజిటల్ వ్యవస్థను ఉపయోగించి పౌరులకు మెరుగైన పాస్‌పోర్ట్ సేవలు అందించడం, A అంటే కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవా డెలివరీ, S అంటే చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి సులభతరమైన విదేశీ ప్రయాణం, E అంటే మెరుగుపరచబడిన డేటా భద్రత. ప్రభుత్వ 'డిజిటల్ ఇండియా' లక్ష్యంలో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం గణనీయమైన పాత్ర పోషిస్తోందని జైశంకర్ అన్నారు. ఇందులో భాగంగానే mPassport పోలీస్ యాప్, mPassport సేవా మొబైల్ యాప్, డిజీలాకర్ (DigiLocker)తో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమాన్ని అనుసంధానించడం వంటి మైలురాళ్లు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. మొదట ఫిన్లాండ్లో.. అవాంతరాలు లేని అంతర్జాతీయ ప్రయాణ అనుభవాన్ని అందించడానికి డిజిటల్ పాస్‌పోర్ట్‌లను ప్రారంభించిన మొదటి దేశంగా ఫిన్లాండ్ అవతరించింది. ఆ దేశ ప్రయాణికులు భౌతిక పాస్‌పోర్ట్‌లకు బదులుగా ఈ-పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి యూకేకి ప్రయాణించవచ్చు. ఫిన్లాండ్ మాదిరిగానే యూకే, యూఎస్, దక్షిణ కొరియా, పోలాండ్ కూడా డిజిటల్ పాస్‌పోర్ట్ ప్రాజెక్ట్‌లపై పని చేస్తున్నాయని ఒక నివేదిక తెలిపింది. -
..అందుకే పాస్‌పోర్ట్‌లో కమలం
న్యూఢిల్లీ: కొత్తగా జారీ చేస్తున్న పాస్‌పోర్ట్‌ల్లో కమలం గుర్తును ముద్రించడంపై గురువారం విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. కమలం గుర్తును ముద్రించడం నకిలీ పాస్‌పోర్ట్‌లను గుర్తించేందుకు ఉద్దేశించిన భద్రతాచర్యల్లో భాగమని తెలిపింది. ‘కమలం జాతీయ పుష్పం. భద్రతా చర్యల్లో భాగంగా దీన్ని ముద్రించాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. మిగతా జాతీయ చిహ్నాలను కూడా రొటేషన్ పద్దతిలో ముద్రిస్తామని వివరించారు. ఈ అంశాన్ని బుధవారం లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు ఎంకే రాఘవన్ ఈ అంశాన్ని లేవనెత్తి.. కేరళలోని కోజికోడ్‌లో కమలం గుర్తు ముద్రించిన పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయని, ఇది ప్రభుత్వ కాషాయీకరణలో భాగమని విమర్శించారు. -
పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్టులు
పైలెట్ ప్రాజెక్ట్ కింద మైసూర్ ఎంపిక విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి ధ్యానేశ్వర్ మూలే వెల్లడి తిరుపతి: కొత్త పాస్‌పోర్టులను ఇకపై పోస్టాఫీసుల ద్వారా జారీ చేయనున్నట్లు విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి ధ్యానేశ్వర్ మూలే వెల్ల డించారు. ఇందుకోసం మైసూరులోని పోస్టాఫీసు లను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశమంతటా ఈ విధా నాన్ని అమలు చేస్తామన్నారు. రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్విని సత్తారుతో కలసి శుక్రవారం సాయంత్రం «ఆయన తిరుపతి పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38 పాస్‌పోర్టు కార్యాలయాలు, 89 సేవా కేంద్రాలు ఉన్నాయని, వీటి ద్వారా రోజుకు దాదాపు 50 వేల చొప్పున ఏడాదికి సుమారు 1.30 కోట్ల పాస్‌పోర్టులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. దళారుల బెడదను తగ్గించి దరఖాస్తుదారుని ఇంటి వద్దకే పాస్‌పోర్టు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. త్వరలో స్టూడెంట్ కనెక్ట్ పేరిట సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నామనీ, దీని ద్వారా విద్య, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్‌పోర్టు, వీసాలపై అవగాహన కలిపిస్తామన్నారు. ప్రస్తుతం పాస్‌పోర్టు జారీని సులభతరం చేసినట్లు వెల్లడించారు. త్వరలో నెల్లూరు కేంద్రంగా పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడామన్నారు. భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు అధీకృత ఏజెంట్ల ద్వారానే వెళ్లాలనీ, దళారుల ద్వారా వెళితే అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. విజయవాడలో శనివారం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైనప్పుడు ఈ విషయంపై మాట్లాడను న్నట్లు తెలిపారు. తిరుపతిలో త్వరలోనే జర్నలిస్టుల కోసం ప్రత్యేక పాస్‌పోర్ట్ మేళాను నిర్వహించ నున్నట్లు ధ్యానేశ్వర్ మూలే వెల్లడించారు.