
సాక్షి, వైస్సార్ కడప: సౌదీలో యజమాని చెరలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైఎస్సార్ కడప వాసులకు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విముక్తి కల్పించారు. కడపకు చెందిన గొరెంట్ల రమణయ్య, సతీష్ చౌదరి ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీవెళ్లారు. ఆ తర్వాత సౌదీ యజమాని వారి నుంచి పాస్‌పోర్టులు లాక్కొని సరైన ఆహరం పెట్టకుండా పొలం పనులు చేయిస్తూ చిత్రహింసలకు గురిచేశారు.
ఈ మేరకు బాధితుల కుటుంబ సభ్యులు తమవారి బాధను ఎంపీ మిథున్‌రెడ్డికి తెలియజేశారు. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని విదేశాంగశాఖ దృష్టికి తీసుకెళ్లారు. విదేశాంగశాఖ అధికారులు బాధితులకు రావాల్సిన జీతం డబ్బులు ఇప్పించి, త్వరలోనే తిరిగి వారి స్వస్థలాలకు చేరేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎంపీ మిథున్‌రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment