soudi
-
ప్రపంచంలో టాప్ రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీ ఏదో తెలుసా?
Worlds Most Richest Royal Family: ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజ కుటుంబాలు మధ్యప్రాచ్యం నుండి వచ్చాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం అమలులోకి రాకముందు రాజులు, రాజకుటుంబాల పాలన నడిచేది. ప్రస్తుతం ఆ యుగం ముగిసింది. కానీ బ్రిటిష్ రాజకుటుంబం ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబంగా భావిస్తారు. కింగ్ చార్లెస్ III అధికారికంగా అతని భార్య క్వీన్ కన్సార్ట్ కెమిల్లాతో పాటు దేశాధినేతగా పట్టాభిషేక్తిడైన నేపథ్యంలో, యునైటెడ్ కింగ్డమ్ రాయల్ ఫ్యామిలీ రిచెస్ట్ ఫ్యామిలీ అనుకుంటారు. భారీ సంపద గురించి పట్టాభిషేక వేడుకకు ఖర్చు చేసిన డబ్బు గురించే మాట్లాడుకుంటారు. కానీ ఆశ్యర్యకరంగా ది రాయల్ ఫ్యామిలీ ఆఫ్ సౌదీ ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకుటుంబంగా నిలుస్తోంది. ఎందుకంటే 1.4 ట్రిలియన్లు డాలర్ల సంపదతో బ్రిటిష్ రాజకుటుంబం కంటే 16 రెట్లు విలువైన సంపద ఈ సౌదీ ఫ్యామిలీ సొంతం. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలోని సౌదీ రాజ కుటుంబంలో 15,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు, వారి సంపదలో ఎక్కువ భాగం దేశంలోని విస్తారమైన చమురు నిల్వల ద్వారా వచ్చిన ఆదాయమే. సౌదీ అరేబియా రాజు ప్రస్తుతం 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమై అల్ యమామా ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. అగ్రశ్రేణి లగ్జరీ బ్రాండ్లను మాత్రమే ధరించే వీరి ఖజానాలో టన్నుల కొద్దీ బంగారం-వెండితో పాటు విలువైన వజ్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. గ్రాండ్ ప్యాలెస్‌లో కోట్ల విలువైన లగ్జరీ కార్లు, క్రూయిజ్‌లతో పాటు బిలియన్ల విలువైన ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. ఖరీదైన బంగారు పూతతో కూడిన కారు కూడా ఉంది. ఇంకా కోట్ల విలువైన లగ్జరీ కార్లు లంబోర్ఘిని అవెంటడోర్ సూపర్‌వెలోస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే, మెర్సిడెస్ జీప్ , బెంట్లీ ఉన్నాయి. 2011లలోనే ఫోర్బ్స్ అతని , అతని తక్షణ కుటుంబ సంపద సుమారు 21 బిలియన్లుగా అంచనా వేసింది. యమామా ప్యాలెస్‌లో సినిమా థియేటర్ అనేక స్విమ్మింగ్ పూల్స్ మసీదు కూడా ఉంది. ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ 400 మిలియన్ డాలర్ల సెరీన్ సూపర్‌యాచ్, విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లు కలిగి ఉన్నారు. ఈ భారీ క్రూయిజ్‌లో 2 హెలిప్యాడ్లు , స్పోర్ట్స్ గ్రౌండ్‌తో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య విమానం బోయింగ్ 747-400 రాజకుటుంబం సొంతం. ప్రత్యేక విమానంలో ప్యాలెస్‌లో ఉండే సౌకర్యాలుండటం మరో విశేషం. సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా తన కుమార్తెకు బంగారంతో చేసిన టాయిలెట్‌ను బహుమతిగా ఇచ్చాడని ప్రతీతి. సౌదీ అరేబియా రాజకుటుంబం తర్వాత, ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న రాజ కుటుంబీకులు కువైట్ నుండి వచ్చారు, మొత్తం కుటుంబం 360 బిలియన్ల డాలర్లకు పైగా ఉంది. ఇక కింగ్ చార్లెస్ III నేతృత్వంలోని యూకే రాయల్ ఫ్యామిలీ మొత్తం నికర విలువ 88 బిలియడాలర్లు. భారతీయ కరెన్సీలో రూ. 7.22 లక్షల కోట్లతో ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన రాయల్లలో 5వ స్థానంలో ఉన్నారు. -
హజ్‌యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే..
ఇస్లాంలో హజ్ యాత్రను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇస్లాంను అనుసరించే ప్రతీఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని భావిస్తారు. ఇస్లాంను అనుసరించేవారు తప్పనిసరిగా ఐదు విధులు పాటించాలని ఆ మత పెద్దలు చెబుతారు. దానిలో ఒకటే హజ్ యాత్ర. మిగిలినవి కల్మా, రోజా, నమాజ్, జకాత్. ముస్లింలు తమ జీవితంలో వీటిని పాటించేందుకు ప్రయత్నిస్తారు. యాత్ర ఎన్నాళ్లు సాగుతుంది? ఇస్లాంను అనుసరిస్తున్న పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం 628వ సంవత్సరంలో తొలిసారి పాగంబర్ మొహమ్మద్ తన 1,400 మంది అనుచరులతో ఒక పవిత్ర యాత్ర చేశారు. ఇస్లాంను నమ్మేవారు దీనినే తొలి తీర్థయాత్రగా చెబుతారు.ఈ యాత్ర ద్వారానే పాగంబర్ ఇబ్రహీమ్ ఇస్లాం సంప్రదాయాలను పునరుద్ధరించారని అంటారు. తరువాతి కాలంలో దీనినే హజ్ అంటూ వచ్చారు. ప్రతీయేటా ప్రపంచంలోని ఇస్లాం మతస్థులు సౌదీ అరబ్‌లోని మక్కాకు హజ్ కోసం వెళుతుంటారు. ఈ పవిత్ర హజ్ యాత్ర 5 రోజులు కొనసాగుతుంది. ఈ యాత్ర ఈద్ ఉల్ అజహ అంటే బక్రీద్‌తో పూర్తవుతుందని చెబుతారు జిల్-హిజాలోని 8వ తేదీన.. ఈ యాత్ర అధికారికంగా ఎప్పుడు ప్రారంభవుతుందనే విషయానికి వస్తే ఇస్లాం మాసం జిల్-హిజాలోని 8వ తేదీన ప్రారంభమవుతుంది. ఇదే రోజున హాజీ మక్కా నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరాన ఉన్న మీనా పట్టణానికి వెళ్లారని చెబుతారు. అక్కడ హాజీ రాత్రంతా గడిపారని అంటారు. మర్నాడు హాజీ అరాఫత్ మైదానానికి చేరుకున్నారట. ఈ అరాఫత్ మైదానంలో నిలుచుని హజ్‌యాత్రికులు అల్లాను గుర్తుచేసుకుంటారు. తాము చేసిన తప్పులను మన్నించాలని వేడుకుంటారు. తరువాత సాయంత్రానికి సౌదీ అరబ్‌లోని ముజదల్ఫా పట్టణం చేరుకుంటారు. రాత్రంతా అక్కడే ఉంటారు. మర్నాటి ఉదయం మీనా పట్టణానికి చేరుకుంటారు. హజ్‌యాత్రలో ముస్లింలు ఏం చేస్తారంటే.. హజ్ యాత్రకు వెళ్లిన ముస్లింలు ఒక విధానాన్ని ఫాలో అవుతారు. బీబీసీ రిపోర్టును అనుసరించి ముందుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హజ్ యాత్రికులు ముందుగా జోద్దా పట్టణంలో కలుసుకుంటారు. సరిగ్గా మక్కాకు ముందుగా ఉన్న ఒక ప్రాంతం నుంచి అధికారికంగా యాత్ర ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతాన్ని మీకత్ అని అంటారు. ఈ ప్రాంతం మక్కాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అహ్రమ్, ఉమ్రాలకు ఎంతో ప్రాధాన్యం హజ్‌కు వెళ్లిన యాత్రికులంతా మీకత్కు చేరుకోగానే ఒక తరహా దుస్తులు ధరిస్తారు. దీనిని అహ్రమ్ అని అంటారు. అయితే కొందరు యాత్ర ప్రారంభించినది మొదలు అహ్రమ్ ధరిస్తారు. ఇది తెలుపు రంగు కలిగిన వస్త్రం. దీనిని సూదితో కుట్టరు. ఉమ్రా విషయానికొస్తే మక్కా చేరుకున్న ప్రతీ ముస్లిం తప్పనిసరిగా ఉమ్రా పాటించాల్సి ఉంటుంది. ఉమ్రా అనేది ఇస్లాంలోని ప్రముఖ ధార్మిక ప్రక్రియ. ఇది కేవలం హజ్ మాసంలోనే కాకుండా సంవత్సరం పొడవునా ఎప్పుడైనా చేయవచ్చు. అయితే చాలామంది హజ్‌యాత్రకు వెళ్లినప్పుడు ఉమ్రాను తప్పకుండా ఆచరిస్తారు. -
సౌదీ అరామ్కో లాభం రికార్డ్
దుబాయ్: గ్లోబల్ చమురు దిగ్గజం సౌదీ అరామ్కో గతేడాది(2022) కొత్త చరిత్రను లిఖిస్తూ 161 బిలియన్ డాలర్ల(రూ. 13 లక్షల కోట్లకుపైగా) నికర లాభం ఆర్జించింది. వెరసి ఏడాది కాలంలో ఆర్జించిన లాభాలరీత్యా లిస్టెడ్ కంపెనీలలో సరికొత్త రికార్డును సాధించింది. సౌదీ అరామ్కోగా పిలిచే సౌదీ అరేబియన్ ఆయిల్ కో కొద్ది నెలలుగా చమురు ధరలు జోరందుకోవడంతో తాజా ఫీట్‌ను సాధించింది. ప్రధానంగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడం ఇందుకు సహకరించింది. రష్యా చమురు, నేచురల్ గ్యాస్ అమ్మకాలపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడం ప్రభావం చూపింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. 2021లో సాధించిన 110 బిలియన్ డాలర్లతో పోలిస్తే నికర లాభం 46 శాతంపైగా ఎగసింది. కాగా.. కోవిడ్–19 సంక్షోభం తదుపరి ఇటీవల చైనా ఆంక్షలు సడలించడంతో చమురుకు డిమాండ్ మరింత ఊపందుకోనున్నట్లు సౌదీ అరామ్కో భావిస్తోంది. వెరసి ఉత్పత్తిని పెంచే యోచనలో ఉంది. అయితే మరోపక్క వాతావరణ మార్పులకు కారణమవుతున్న శిలాజ ఇంధనాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. శిలాజ ఇంధనాల విక్రయం ద్వారా ఒక కంపెనీ 161 బిలియన్ డాలర్లు ఆర్జించడం షాక్‌కు గురిచేసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఏన్స్ కాలమార్డ్ వ్యాఖ్యానించారు. -
ఎంపీ ప్రత్యేక చొరవ.. సౌదీలో చిక్కుకున్న బాధితులకు విముక్తి
సాక్షి, వైస్సార్ కడప: సౌదీలో యజమాని చెరలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైఎస్సార్ కడప వాసులకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విముక్తి కల్పించారు. కడపకు చెందిన గొరెంట్ల రమణయ్య, సతీష్ చౌదరి ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీవెళ్లారు. ఆ తర్వాత సౌదీ యజమాని వారి నుంచి పాస్‌పోర్టులు లాక్కొని సరైన ఆహరం పెట్టకుండా పొలం పనులు చేయిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ మేరకు బాధితుల కుటుంబ సభ్యులు తమవారి బాధను ఎంపీ మిథున్‌రెడ్డికి తెలియజేశారు. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని విదేశాంగశాఖ దృష్టికి తీసుకెళ్లారు. విదేశాంగశాఖ అధికారులు బాధితులకు రావాల్సిన జీతం డబ్బులు ఇప్పించి, త్వరలోనే తిరిగి వారి స్వస్థలాలకు చేరేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎంపీ మిథున్‌రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చదవండి: భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి -
సౌదీ ఆరామ్‌కోకి గుడ్‌బై చెప్పిన రిలయన్స్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన పెట్రోకెమికల్ (ఓ2సీ) వ్యాపారంలో సౌదీ ఆరామ్కో ప్రతిపాదిత పెట్టుబడుల డీల్ రద్దయింది. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకుని విలువను మరోసారి మదింపు చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించుకున్నాయి. ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల విషయంలో సౌదీ ఆరామ్కో తమకు ప్రాధాన్య భాగస్వామిగా కొనసాగుతుందని రిలయన్స్ (ఆర్ఐఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. 2019 ఆగస్టులో రిలయన్స్ తమ ఓ2సీ వ్యాపారం విలువను 75 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. దీన్ని ప్రత్యేక విభాగంగా కూడా విడగొట్టాలని భావించింది. నిర్దిష్ట ప్రతిపాదనల ప్రకారం ఓ2సీ విభాగంలో సౌదీ ఆరామ్కో సంస్థకు 15 బిలియన్ డాలర్లకు 20 శాతం వాటాలు విక్రయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకు ముందుగా 2020 మార్చి డెడ్‌లైన్‌గా పెట్టుకుంది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తి కాగలదని ప్రకటించింది. అయితే, ఈలోగా పర్యావరణ హిత ఇంధనాల ఉత్పత్తి దిశగా కంపెనీ కొత్తగా భారీ ప్రణాళికలు ప్రారంభించడం, క్రమంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు, ఓ2సీని ప్రత్యేక విభాగంగా విడగొట్టే ప్రతిపాదనను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి రిలయన్స్ వెనక్కి తీసుకుంది. ఈ అంశాల నేపథ్యంలో తాజాగా రిలయన్స్ ఓ2సీ విభాగంలో సౌదీ ఆరామ్కో పెట్టుబడుల ప్రతిపాదన రద్దు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిలయన్స్ బ్రాండ్స్‌తో వెస్ట్ ఎల్మ్ జట్టు.. ఫర్నిచర్, హోమ్ డెకరేషన్ ఉత్పత్తుల సంస్థ వెస్ట్ ఎల్మ్ తాజాగా భారత మార్కెట్లో ప్రవేశించింది. ఇందుకోసం రిలయన్స్ బ్రాండ్స్‌తో చేతులు కలిపింది. జియో వరల్డ్ డ్రైవ్‌లో తొలి స్టోర్‌ను అక్టోబర్‌లో ప్రారంభించగా, గత వారం రెండో స్టోర్‌ను గుర్గావ్లో ఆరంభించింది. అటు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ ఆశీష్ షాతో కూడా జట్టు కట్టింది. రిలయన్స్ బ్రాండ్స్ ఇప్పటికే దాదాపు 35 అంతర్జాతీయ బ్రాండ్స్‌ను దేశీ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టైల్స్‌లో 40 శాతం వాటాలు కొనుగోలు చేసింది. -
శత్రువుల మధ్య చిగురించిన స్నేహం!
అల్ఉలా: సంవత్సరాల తరబడి సాగుతున్న కయ్యానికి తెరదించుతూ ఖతార్, సౌదీ అరేబియా స్నేహం దిశగా అడుగులు వేశాయి. మంగళవారం ఖతార్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని సౌదీ అరేబియా పర్యటనకు వచ్చారు. ఆయనకు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. యూఎస్‌కు నమ్మకమైన మిత్రులుగా ఉన్న ఈ రెండు దేశాలకు మధ్య చాలా సంవత్సరాలుగా పొసగడం లేదు. ఈ వివాదానికి తెరదించుతూ రెండు దేశాలు తమ సరిహద్దులు తెరుస్తున్నట్లు ప్రకటించాయి. గల్ఫ్ అరబ్ నేతల వార్షిక సమావేశం అల్ఉలాలో జరగనుంది. ఇరాన్‌తో సంబంధాలు, ఇస్లామిస్టు గ్రూపులకు ఖతార్ సాయాన్ని నిరసిస్తూ నాలుగు అరబ్ దేశాలు (ఈజిప్టు, యూఏఈ, సౌదీ, బహ్రైన్) 2017 నుంచి ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. వీటిని గాడిన పెట్టేందుకు షేక్ తమిమ్ యత్నించనున్నారు. అమెరికా, కువైట్‌లు ఖతార్‌కు ఇతర అరబ్ దేశాలకు మధ్య సత్సంబంధాల కోసం మధ్యవర్తిత్వం నెరిపాయి. రాజీకి ఖతార్ ఎలాంటి ప్రతిపాదనలు ఒప్పుకున్నది ఇంకా తెలియరాలేదు. గల్ఫ్ ఐక్యత తిరిగి సాధించేందుకు తాము కృషి చేస్తామని ఖతార్ మంత్రి అన్వర్ గారాఘ్ష్ చెప్పారు. తాజా సమావేశాల్లో సౌదీతో ఖతార్ రాజు ఒప్పందాలపై సంతకాలు చేయవచ్చని ఓ అంచనా. ఖతార్‌తో సత్సంబంధాలు సాధించడం ద్వారా బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వంతో బంధం బలోపేతం చేసుకోవాలని సౌదీ యోచిస్తోంది. యెమెన్‌తో యుద్ధం, ఇరాన్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం నేపథ్యంలో సౌదీకి యూఎస్ సాయం ఎంతో అవసరం ఉంది. అయితే ఇప్పటికీ టర్కీ, ఇరాన్‌తో ఖతార్‌కు మంచి సంబంధాలుండడం, టర్కీ మరియు ఖతార్‌లు ముస్లిం బ్రదర్‌హుడ్‌కు మద్దతు ఇవ్వడం వంటివి అరబ్ దేశాలను ఆందోళనపరుస్తూనే ఉన్నాయి. అరబ్‌దేశాల బహిష్కరణతో ఖతార్ ఎకానమీ బాగా దెబ్బతిన్నది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇకపై ఖతార్ అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
2020 హజ్ యాత్ర లేనట్టే..!
సాక్షి, హైదరాబాద్ : 2020 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం ఏ సమాచారం తెలియజేయడం లేదు. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో హజ్ యాత్ర ప్రారంభం కావాలి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు జరగలేదని, దీంతో కేంద్ర హజ్ కమిటీ ఈ ఏడాది యాత్ర రద్దయినట్టేనని చెబుతోందని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లా, ఎగ్జిక్యూటివ్ అధికారి బి.షఫీవుల్లా బుధవారం విలేకరులకు తెలిపారు. ఈఏడాది హజ్ యాత్రకు ఎంపికైన యాత్రికులు మొదటి విడతగా రూ. 81 వేలు జమ చేశారన్నారు. (హజ్ యాత్రపై కోవిడ్ ప్రభావం) మరికొంత మంది రెండవ కిస్తు రూ.1.20 లక్షలు కూడా చెల్లించారని, రాష్ట్ర యాత్రికులు చెల్లించిన డబ్బు కేంద్ర హజ్ కమిటీ వద్ద ఉందన్నారు. ఈ ఏడాది కరోనా ప్రభావంతో హజ్ యాత్ర రద్దయిన నేపథ్యంలో కేంద్ర హజ్ కమిటీ యాత్రికులకు వంద శాతం డబ్బులు తిరిగి ఇస్తుందన్నారు. తమ యాత్రను రద్దు చేసుకుంటూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి తిరిగి వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. యాత్ర రద్దు చేసుకునే వారు కేంద్ర హజ్ కమిటీ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చని లేని పక్షంలో రాష్ట్ర హజ్ కమిటీని 040–23298793లో సంప్రదించాలన్నారు. -
సౌదీ ఆరామ్‘కింగ్’!
దుబాయ్: సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కో స్టాక్ మార్కెట్ అరంగేట్రం అదిరిపోయింది. ఇష్యూ ధర 32 రియాల్స్‌తో పోలిస్తే 10 శాతం అప్పర్ సర్క్యూట్‌తో 35.3 రియాల్స్ ధరను (9.39 డాలర్లు –రూ.662) తాకింది. ఈ ధర వద్ద కంపెనీ విలువ 1.88 లక్షల కోట్ల డాలర్లు. మన రూపాయల్లో 132.5 లక్షల కోట్లు. గురువారం కూడా ఈ షేర్ మరో 10 శాతం పెరిగితే సౌదీ అరేబియా పాలకులు ఆశించిన 2 లక్షల కోట్ల డాలర్ల విలువ గల కంపెనీ అనే మైలురాయిని సాదీ ఆరామ్కో చేరనున్నదని అంచనా. సౌదీ ఆరామ్కో కంపెనీ తర్వాతి స్థానాల్లో ఉన్న ఇతర ఐదు చమురు కంపెనీల (ఎక్సాన్ మొబిల్, టోటల్, రాయల్ డచ్ షెల్, షెవ్రాన్, బీపీ) మొత్తం మార్కెట్ విలువ కన్నా కూడా సౌదీ ఆరామ్కో కంపెనీ విలువే ఎక్కువ కావడం విశేషం. వచ్చే ఐదేళ్ల పాటు ఏడాదికి 7,500 కోట్ల డాలర్ల చొప్పున డివిడెండ్‌ను ఇవ్వాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఐపీఓ, మార్కెట్ విలువలోనూ అగ్రస్థానం.... ఇటీవలే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా 1.5 శాతం వాటా షేర్లను విక్రయించి 2,560 కోట్ల డాలర్లు (రూ.1,80,480 కోట్లు) సమీకరించి ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ అవతరించింది. ఇప్పటివరకూ 2,500 కోట్ల డాలర్లతో అలీబాబా పేరిట ఉన్న అతి పెద్ద ప్రపంచ ఐపీఓ రికార్డ్‌ను సౌదీ ఆరామ్కో బ్రేక్ చేసింది. ఇక బంపర్ లిస్టింగ్‌తో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా ప్రపంచ నెంబర్–1 కంపెనీగా సౌదీ ఆరామ్కో అవతరించింది. అంతే కాకుండా లిస్టెడ్ కంపెనీల పరంగా ప్రపంచంలోనే టాప్ 10 స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ఒకటిగా (తొమ్మిదవ స్థానాన్ని) సౌదీ అరేబియా స్టాక్ ఎక్సే్ఛంజ్ నిలిచేందుకు ఈ కంపెనీ తోడ్పడింది. ఇప్పటిదాకా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువను సాధించిన కంపెనీలు ప్రపంచంలో రెండే ఉన్నాయి. 1.19 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో యాపిల్, 1.15 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్‌తో మైక్రోసాఫ్ట్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల తర్వాతి స్థానాల్లో గూగుల్ మాతృ కంపెనీ ఆల్ఫాబెట్ (92,600 కోట్ల డాలర్లు), ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ (86,200 కోట్ల డాలర్లు), సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ (57,200 కోట్ల డాలర్లు) నిలిచాయి. ► 1938లో ఒక చమురు బావితో సౌదీ ఆరామ్కో ప్రస్థానం మొదలైంది. ► ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత లాభదాయక, అతి పెద్దదైన చమురు కంపెనీగా మారింది. ► ప్రపంచవ్యాప్తంగా మొత్తం ముడి చమురు సరఫరాల్లో 10% ఈ సంస్థేదే. ► 2018లో కంపెనీ నికర లాభం 46% ఎగసి 11,110 కోట్ల డాలర్లకు పెరిగింది. 35,600 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. 13 రిలయన్స్‌లకు మించి... ఇక మన దేశంలో అత్యధిక మార్కెట్ క్యాప్ కంపెనీగా రూ.9,90,564 కోట్లతో(14,050 కోట్ల డాలర్లు) రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి 13 కంపెనీలు కలిసినా... ఒక సౌదీ ఆరామ్కో కన్నా తక్కువే!! -
8వ రోజూ పెట్రో సెగ
సాక్షి, న్యూఢిల్లీ: చమురు ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా 8వ రోజు కూడా పెట్రో ధరలు భగ్గుమన్నాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర రూ. 74 మార్క్‌కు చేరగా, ముంబై 80 రూపాయలకు చేరింది. పెట్రోల్ పై 22 పైసలు, డీజిల్‌పై 14 పైసలు పెంచుతూ చమురు ఉత్పత్తి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 8 రోజుల్లో లీటరు పెట్రోల్‌పై 2.20 రూపాయలు, డీజిల్‌పై 1.64 రూపాయలు పెరిగింది. సౌదీలో చమురు బావులపై డ్రోన్ దాడులు తర్వాత.. ముడి చమురు ధరల పెరుగుదల దేశంలో కూడా ప్రభావం చూపుతోందని చమురు సంస్థలు చెబుతున్నాయి. 2014 నుంచి పెట్రోల్ పైన 211.7శాతం , డీజిల్ పైన 443శాతం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెరిగింది. దాదాపుగా 12సార్లు ఎన్‌డిఎ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని సవరించింది. విజయవాడ : లీటర్ పెట్రోల్ ధర రూ. 78.10, డీజిల్ ధర రూ. 72.10 హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ. 78.80, డీజిల్ ధర 73.11 ఢిల్లీ : లీటర్ పెట్రోల్ ధర రూ. 74.13, డీజిల్ ధర రూ. 67.07 ముంబై : లీటర్ పెట్రోల్ ధర రూ. 79.79, డీజిల్ ధర 70.37 చెన్నై: లీటర్ పెట్రోల్ ధర రూ. 77.06, డీజిల్ ధర రూ. 70.91 చదవండి : సౌదీ ప్రభుత్వ ఆయిల్ కంపెనీపై డ్రోన్‌దాడి కలకలం -
రమణమ్మ కుటుంబాన్ని ఆదుకుంటాం
నెల్లూరు ,మర్రిపాడు: సౌదీలోని రియాద్‌లో మృతిచెందిన మండలంలోని చాబోలు గ్రామానికి చెందిన గుండబోయిన రమణమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు తెలిపారు. మర్రిపాడు తహసీల్దార్ డీవీ సుధాకర్ బుధవారం సిబ్బందితో కలిసి చాబోలుకు చేరుకుని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. వివరాలు తెలుసుకున్నారు. సౌదీలో ఉంటున్న గ్రామానికి చెందిన వారితో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ రమణమ్మ రెండున్నర సంవత్సరాల క్రితం ఉపాధి కోసం సౌదీకి వెళ్లినట్లు చెప్పారు. అక్కడి యజమానే ఆమెను హత్య చేసినట్లుగా కుటుంబసభ్యులు చెప్పారని వెల్లడించారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి ఆదేశాల మేరకు సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్ఐ సురేంద్ర, వీఆర్వో రమణయ్య ఉన్నారు. పాపం పిల్లలు రమణమ్మ మృతితో ఆమె ఇద్దరు కుమారులు, కుమార్తె తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మృతురాలి భర్త ఐదేళ్ల క్రితం డెంగీతో మృతిచెందాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో బతుకుదెరువు కోసం రమణమ్మ సౌదీకి వెళ్లింది. కష్టపడి డబ్బు సంపాదించి పిల్లలను బాగా చుసుకోవాలనుకున్న ఆమె కలలు నెరవేరకుండానే చనిపోయింది. చిన్నారులను ఎలా చూసుకోవాలో అంటూ మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మామ అక్రమాలను నిలదీసినందుకు..
సాక్షి హైదరాబాద్: బోగస్ పత్రాలతో కోడలు సహా 25 మంది పేరిట బ్యాంకు ఖాతాలు, గ్యాస్ కనెక్షన్లు తీసుకొని వాటి ద్వారా ప్రతి నెలా వంట గ్యాస్ సబ్సిడీ కాజేయడమే కాకుండా దీనిపై నిలదీసిన కోడలికి కొడుకు చేత తలాక్ ఇప్పించిన ఉదంతం నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం సైదాబాద్‌కు చెందిన మహ్మద్ రహ్మన్ కూతురు నస్రీన్‌కు ఫలక్‌నుమా పోలీస్టేషన్ పరిధిలో ఉంటున్న మహ్మద్ యూసుఫ్ కుమారుడు మహ్మద్ అలీకి 2014లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు సౌదీ అరేబియాలో వెళ్లిపోయారు. నకిలీ ఖాతా తెరిచి... ఇటీవల అనారోగ్యానికి గురైన నస్రీన్ వైద్యం కోసం హైదరాబాద్ వచ్చింది. చికిత్స ఖర్చుల కోసం భర్తను డబ్బు పంపాలని కోరింది. దీంతో భర్త.. జహానుమాలోని సిండికేట్ బ్యాంకులో నస్రీన్ పేరిట ఉన్న ఖాతాలోంచి సొమ్ము తీసుకోవాల్సిందిగా భార్యకు సూచించాడు. అయితే తనకు ఖాతా లేకున్నా ఆ బ్యాంకులోకి సొమ్ము ఎలా వచ్చిందని మామ మహ్మద్ యూసఫ్‌ను అడగ్గా ఆయన అదేమీ చెప్పకుండానే డబ్బును బ్యాంకు నుంచి తీసుకొచ్చి కోడలికి ఇచ్చాడు. దీనిపై అనుమానం వచ్చిన నస్రీన్... ఆ బ్యాంకుకు వెళ్లి ఖాతా వివరాలు పరిశీలించగా 2014లో తన పేరిట బోగస్ పత్రాలతో తెరిచినట్లు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా 2014 నుంచి ఆ ఖాతాలో తన భర్త జమ చేస్తున్న సొమ్మును మామ కాజేసిట్లు తెలుసుకుంది. అలాగే తన పేరిట, తోటికోడళ్లు, ఇతర మహిళల పేరిట బోగస్ పత్రాలతో 25 బ్యాంకు ఖాతాలను తెరిచి వాటి ద్వారా గ్యాస్ కనెక్షన్లను మామ సంపాదించాడని నస్రీన్ తెలుసుకుంది. ఈ కనెక్షన్ల పేరిట ప్రతి నెలా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకొని అక్రమంగా సబ్సిడీ సొమ్మును పొందుతున్నట్లు ఆమె గుర్తించింది. పోస్టులో తలాక్..: ఈ అక్రమాలకు తన పేరును ఎందుకు వాడుకున్నావంటూ మామను నిలదీయగా సౌదీలో ఉన్న కొడుకుకు లేనిపోనివి చెప్పి పోస్టు ద్వారా తలాక్ ఇప్పించాడని నస్రీన్ ‘సాక్షి’కి తెలిపింది. మామపై ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేయగా 14న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వివరించింది. తాను జూలై 11న సౌదీ నుంచి వస్తే సెప్టెంబర్ 24న అందిన తలాక్ లేఖలో జూలై 2వ తేదీన తనకు తలాక్ ఇచ్చినట్లు భర్త అందులో పేర్కొన్నాడని బాధితురాలు చెప్పింది. తన పిల్లలు సౌదీలోనే ఉన్నారని, మామ, భర్త కలసి తన జీవితాన్ని నాశనం చేశారని వాపోయింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. మహ్మద్ యూసఫ్ గతంలోనూ పలు అక్రమాలకు పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. మరణించిన అల్లుడి పిల్లలను తన పిల్లలుగా చూపుతూ వారి పేరిట నకిలీ పాస్‌పోర్టులను తయారు చేసి గతంలో తాను పని చేసిన సౌదీ కంపెనీ నుంచి ఆర్థిక సాయం కూడా పొందాడని తెలిపింది. తనకు న్యాయం చేస్తానని పోలీసు కమిషనర్ హామీ ఇచ్చారని నస్రీన్ వివరించింది. -
పొదుపు అంటూనే.. లగ్జరీ ప్లైట్‌లో ప్రయాణం!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో కొత్తగా ఏర్పాటైన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పొదుపు మంత్రాన్ని పాటిస్తోన్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా దేశ అధ్యక్షుడితో సహా, మంత్రులు, అధికారులంతా పొదుపు పాటించాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల అదేశాలు జారీ చేశారు. తాను మాత్రం దానికి మినహాయింపు అన్నట్టు తన తొలి విదేశీ పర్యటనకు పయనమయ్యారు. సౌదీ రాజు సల్మాన్ బీన్ అబ్దుల్ అజీజ్ ఆహ్వానం మేరకు సౌదీ వెళ్లిన ఇమ్రాన్ వీవీఐపీ వసతులు కలిగిన ప్రత్యేక విమానంలో పర్యటనకు వెళ్లారు. ఇమ్రాన్ పాక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికారుల, మంత్రుల ప్రయాణల్లో కోత విధించి.. అందరూ సాధారణ వాహనాల్లో ప్రయాణం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఖర్చుల్లో పొదుపు పాటించాలని.. ప్రజాధనాన్ని వృథా చేయకూడదంటూ అదేశాలు జారీ చేశారు. పొదుపు పాటించాలని ఆదేశాలు జారీ చేసి.. తాను మాత్రం లగ్జరీ విమానాల్లో విదేశాలకు వెళ్లడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇటీవల 102 లగ్జరీ కార్లను, గేదెలను వేలంలో అమ్మేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇమ్రాన్ తన తొలి పర్యటనకే ప్రత్యేక సదుపాయాలున్న వీవీఐపీ విమానాన్ని ఉపయోగించడంపై రాజకీయ పార్టీలు గుర్రుమంటున్నాయి. గత ఏడాది చివరినాటికి పాక్ ఆర్థిక వ్యవస్థలో 87 శాతం.. అంటే రూ.30 లక్షల కోట్ల అప్పును కలిగివున్న విషయం తెలిసిందే. కాగా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజు అజీజ్‌తో ఇమ్రాన్ భేటీ కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై వీరు చర్చించనున్నారు. సౌదీ వెళ్లిన ఇమ్రాన్ దుబాయ్‌లో జరిగే పాక్-భారత్ మ్యాచ్‌కు ఇమ్రాన్ హాజరైన విషయం తెలిసిందే. -
విమానం మోత !
సాక్షి, సిటీబ్యూరో: హజ్ యాత్రకు వెళ్లే ప్రయాణికులతో సౌదీ ఎయిర్‌లైన్స్‌కు కాసుల పంట కురుస్తోంది. సాధారణ రోజుల్లో కంటే ఈ సీజన్లో ధరలు రెట్టింపునకు మించి పెరిగాయి. దీంతో ఆ ఎయిర్‌లైన్స్‌కు సిరుల వరద పారుతోంది. హజ్ సీజన్లో మినహా మామూలు రోజుల్లో అప్ అండ్ డౌన్ విమాన టికెట్ చార్జీ రూ. 25 వేలు దాటదు. కాని హజ్ సీజన్లో అప్ అండ్ డౌన్ టికెట్ చార్జీ రూ. 68 వేల నుంచి రూ.72 వేలకు చేరడమే ఇందుకు ఉదాహరణ. అంటే సాధారణ రోజుల్లో తీసుకుంటున్న టికెట్ చార్జీల కంటే రూ.35 వేల నుంచి రూ.40 వేలు ఎక్కువగా వసూలు చేస్తున్నారన్నమాట. యేటా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరఫున 8 వేల మంది, ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా 2 వేల మంది హజ్ యాత్రకు వెళుతున్నారు. ఏడాది పాటు నగరం నుంచి ఉద్యోగులు, ఉమ్రా, విజిట్ వీసాలపై నిత్యం వందల మంది సౌదీ అరేబియాకు పయనమవుతున్నారు. గ్లోబల్ టెండర్ విధానం..సౌదీ ఎయిర్‌లైన్స్ పెత్తనం ప్రపంచ దేశాల నుంచి హజ్ యాత్రకు వివిధ దేశాల నుంచి యాత్రికులు సౌదీ అరేబియాకు హజ్ సీజన్లో వెళుతుంటారు. ఆయా దేశాలు తమ సొంత విమాన యాన కంపెనీల ద్వారా లేదా ఇతర దేశాల విమాన సర్వీసుల ద్వారా హజ్ యాత్రికులను పంపిస్తారు. సొంత విమాన సర్వీసులు లేని పక్షంలో ఆయా దేశాలు గ్లోబల్ టెండర్ విధానంతో తక్కువ టికెట్ ధర పలికిన లేదా కోడ్ చేసిన విమాన సర్వీస్‌కు హజ్ యాత్రికులను తీసుకెళతారు. దీంతో «టికెట్ ధరలు తక్కువగా ఉంటాయి. అమలుకు నోచుకోలేదు.. హజ్ యాత్ర నిర్వహణ మొత్తం కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ అధీనంలో ఉంటుంది. మూడే ళ్ల నుంచి హజ్ యాత్రికులను సౌదీ అరేబియా తీసుకెళ్లడానికి గ్లోబల్ టెండర్ విధానాన్ని పాటించడం లేదు. లోపాయికారిఒప్పందాలతో పెద్దమొత్తంలో ముడుపులు తీసుకొని సౌదీ ఎయిర్‌లైన్స్‌కు దేశ వ్యాప్తంగా వివిధ మహానగరాల నుంచి హజ్ యాత్రికులకు తీసుకెళ్లే బాధ్యత అప్పగిస్తున్నారు. దీంతో సౌదీ ఎయిర్‌లైన్స్ ఇష్టారీతిగా టికెట్ చార్జీలు వసూలు చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. హజ్ యాత్రలో మోసాలు సరికాదు హజ్ యాత్ర పుణ్య యాత్ర ఇందులో మోసాలకు, అధిక డబ్బులు వసూలు చేయడం సరికాదని హజ్ యాత్రికులు అంటున్నారు. సాధారణ రోజుల్లో కంటే హజ్ సీజన్లో సౌదీ విమానాల టికెట్ ధరలు పెంచడం సరికాదంటున్నారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖతో పాటు సౌదీ ఎయిర్‌లైన్ హజ్ యాత్ర ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వచ్చే ఏడాది హజ్ సీజన్లో విమానాల టికెట్ ధరలు తగ్గించేయందుకు చర్యలు తీసుకోవాలని హజ్ యాత్రికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆగస్టు 1 నుంచి హజ్‌యాత్ర
సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర–2018 షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి ప్రయాణం ప్రారంభమవుతుందని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసీవుల్లాఖాన్ తెలిపారు. బుధవారం ఉమ్రాయాత్ర ముగించుకొని నగరానికి చేరుకున్నారు. గురువారం తన కార్యాలయంలో 2018 హజ్‌యాత్ర షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర హజ్‌కమిటీ ఎంపిక చేసినవారు ఆగస్టు 1 నుంచి 16వ తేదీ వరకు హజ్‌యాత్రకు వెళతారన్నారు. ఈ ఏడాది తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పలువురు యాత్రికులు రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా వెళ్లనున్నట్లు తెలిపారు. మొత్తం 16 విమానాల ద్వారా దాదాపు 6 వేల మంది యాత్రకు వెళుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అజీజియా, రుబాత్ కేటగిరీ వారికి వంట చేసుకునే సౌకర్యం ఉందని, గ్రీన్ కేటగిరీ వారికి ఈ సౌకర్యం లేదని పేర్కొన్నారు. రూ.రెండు వేలు అదనంగా వసూలు చేస్తుండడంతో రాష్ట్ర యాత్రికులకు భారమవుతోందని, ఈ విషయమై పునరాలోచించాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. యాత్రకు వెళ్లే ముందే యాత్రికులకు సిమ్‌కార్డులు కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. -
సౌదీ, యూఏఈలో తొలిసారి వ్యాట్
దుబాయ్: ఇంతవరకూ పన్ను రహిత దేశాలుగా పేరుపడ్డ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లు గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చాయి. సౌదీ అరేబియా కొత్త సంవత్సర కానుకగా.. పెట్రోల్ ధరల్ని అమాంతం 127 శాతం పెంచింది. ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రపంచ ధరల్లో మాంద్యం కారణంగా ఏర్పడ్డ బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు గత రెండేళ్లుగా గల్ఫ్‌లోని ముడిచమురు ఉత్పత్తి దేశాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా వ్యాట్‌ను అమల్లోకి తెచ్చారు. అధిక శాతం వస్తువులు, సేవలకు వర్తించే ఐదు శాతం అమ్మకం పన్నుతో రెండు ప్రభుత్వాలు 2018లో 21 బిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. -
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి శిరచ్ఛేదం
రియాద్ (సౌదీఅరేబియా): మద్యం మత్తులో వాహనం నడిపి ఆరుగురి మరణానికి కారణమైన వ్యక్తిని సౌదీ పోలీసులు బహిరంగంగా శిరచ్ఛేదం చేశారు. నాలుగేళ్ల కిందట రియాద్‌లోని అల్-యాస్మీన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. వివరాలు.. అబ్దుల్ మాలిక్ అల్-దిహైమ్ బ్రిటన్‌లో చదువుకునేవాడు. తీర్థయాత్ర కోసం 2013 అక్టోబర్ లో తన స్వదేశమైన సౌదీకి వచ్చాడు. తీర్థయాత్ర ముగించుకున్న తర్వాత తన ఆడి కారులో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా బయటకు వెళ్లారు. అదే సమయంలో అతివేగంగా వచ్చిన మరో వాహనం, వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆడి కారులో ప్రయాణిస్తున్న అబ్దుల్ మాలిక్ అల్-దిహైమ్, అయన చెల్లెళ్లు హిస్సా అల్-దిహైమ్, నడా అల్-దిహైమ్, నూహా అల్-దిహైమ్, అబీర్ అల్-దిహైమ్, మేనకోడలు నోరా అల్-దిహైమ్లు మృతిచెందారు. అయితే ఆ సమయంలో మరో వాహనం నడిపిన మహ్మద్ అల్-ఖతాని మద్యం సేవించడమే కాకుండా, గంటకు 180-200 కి.మీ వేగంతో వాహనాన్ని నడిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆరుగురి చావుకు కారణమైన మహ్మద్ అల్-ఖతానికి కోర్టు బహిరంగ మరణశిక్ష అమలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని చంపేసి ఆ కుటుంబానికి మహ్మద్ అల్-ఖతాని తీరని అన్యాయం చేశాడని కోర్టు పేర్కొంది. మహ్మద్ అల్-ఖతానిలాంటి వ్యక్తులకు భూమ్మీద బతికే అర్హత లేదని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ప్రజలందరూ చూస్తుండగానే సౌదీ పోలీసులు మంగళవారం బహిరంగంగా మహ్మద్ అల్-ఖతానికి శిరచ్ఛేదనం చేశారు. తాగుడుకు బానిసను చేసిన ఎయిడ్స్ ప్రమాదానికి కారణమైన మహ్మద్ అల్-ఖతానికి 26 ఏళ్ల వయస్సులోనే ఎయిడ్స్ వ్యాధి సోకింది. దీంతో కుటుంబ సభ్యులు, మిత్రులు అతన్ని దూరం పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపానికిలోనై తాగుడుకు బానిసగా మారాడు. తర్వాత ఎయిడ్స్ బాధితులకు సహాయం చేయడానికి పలు ఎయిడ్స్ ఆర్గనైజేషన్స్లలో వాలంటీర్‌గా పని చేశాడు. తన వ్యాధి కొద్దిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఉద్యోగంలో కూడా చేరాడు. మరో ఎయిడ్స్ బాధితురాలిని వివాహం కూడా చేసుకోవాలనుకున్నాడు. సరిగ్గా రోడ్డు ప్రమాదం జరిగిన రోజే ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అంతలోనే ఘోర ప్రమాదం జరగడంతో ఆరుగురు మృతిచెందారు. ఆ ప్రమాదానికి తాను చేసిన పొరపాటే కారణం అని తెలుసుకుని తీవ్ర పశ్చాత్తాపపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత మూడు రోజులపాటూ ఆహారం కానీ, మెడిసిన్స్ కానీ తీసుకోలేదు. కష్టాల్లో నుంచి తేరుకొని మంచి జీవితం కోసం నేను చేసిన కృషి మొత్తం చిన్న తప్పిదంతో నాశనమైపోయిందని శిక్ష అమలుకు ముందు మహ్మద్ అల్-ఖతాని వాపోయాడు. -
సౌదీలో నంద్యాల వాసి దుర్మరణం
నంద్యాల: సౌదీ అరేబియాలోని ఒమన్ ప్రాంతంలో ఉద్యోగం కోసం వెళ్లిన నంద్యాలకు చెందిన ఓ ఫార్మాసిస్ట్ శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విజయ మిల్క్‌డెయిరీలోని ఎలక్ట్రిసిటీ విభాగంలో పని చేస్తున్న అబ్దుల్‌రహీంకు సయ్యద్ హుసేన్, రఫీ కుమారులు. ఆయన నూనెపల్లెలోని విజయభాను కాటన్ మిల్ ప్రాంతంలో నివాసం ఉన్నారు. పెద్ద కుమారుడు సయ్యద్ హుసేన్ కర్నూలులోని సఫా కాలేజీలో ఫార్మసీ కోర్సును పూర్తి చేశాడు. రఫీ ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సయ్యద్ హుసేన్ గత ఏడాది నవంబర్‌లో సౌదీలోని ఓమన్కు వెళ్లి ఒక కంపెనీలో ఫార్మాసిస్ట్‌గా చేరాడు. ఆయన స్నేహితుడితో కలిసి మస్కట్‌కు కారులో వెళ్లి తిరిగి ఒమన్‌కు వెళ్తుండగా కారు బోల్తా పడింది. దీంతో ఆయన మృతి చెందాడు. ఈ సమాచారం అందడంతో అబ్దుల్‌రహీం కుటుంబం విషాదంలో మునిగింది. ఆయన మృతదేహం నంద్యాలకు రావడానికి రెండు మూడు రోజులు అవుతుందని సోదరుడు రఫీ చెప్పారు. -
ఉపాధి కోసం వెళ్లి అనంత లోకాలకు...
సౌదీలో ఉరివేసుకుని మదనపల్లె మహిళ ఆత్మహత్య – చిత్రహింసలు భరించలేకే ఉరివేసుకుందన్న కుటుంబ సభ్యులు – రూ.1.50 లక్షలు చెల్లిస్తే శవాన్ని పంపుతామంటున్న సేట్ మదనపల్లె టౌన్: ఆమె బతుకుదెరువు పొట్ట చేతపట్టుకుని సౌదీకి వెళ్లింది. నాలుగు రాళ్లు సంపాదించి అప్పులు తీర్చుకోవాలని, పిల్లలను బాగా చదివించుకోవాలని ఆశపడింది. అక్కడ ఒక ఇంట్లో పనికి కుదిరింది. ఆమె ఆశలు అడియాసలయ్యాయి. ఆ ఇంటి యజమాని పెట్టే చిత్రహింసలు భరించలేక, సొంత ఊరు వచ్చేందుకు వీలులేక అల్లాడింది. చావే శరణ్యమని భావించి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు... నిమ్మనపల్లె మండలం బాలినాయునిపల్లెకు చెందిన రామిశెట్టి కృష్ణమూర్తి, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు మంజునాథ 15 ఏళ్ల క్రితం మదనపల్లెకు వచ్చి స్థిరపడ్డాడు. నీరుగట్టువారిపల్లెలో అద్దె ఇంటిలో ఉంటూ కూలి మగ్గాలు వేసుకుంటూ భార్య హేమలత, పిల్లలు యోగీష్, దీ„ý ను పోషించుకుంటున్నాడు. సొంత మగ్గాలు వేసేందుకు రూ.2 లక్షలు అప్పు చేశాడు. పనులు సక్రమంగా జరగకపోవడం, ముడిసరుకు ధరలు పెరగడంతో అప్పులు తీర్చలేకపోయాడు. అప్పులు తీర్చుకుందామని... సౌదీకి వెళితే బాగా డబ్బు సంపాదించవచ్చని స్థానికంగా ఉన్న ఏజెంట్ శ్రీనివాసులు చెప్పడంతో మంజునాథ నమ్మాడు. తన భార్య హేమలత(27)ను సౌదీకి పంపించాలనుకున్నాడు. నాలుగు డబ్బులు సంపాదించుకుని అప్పులు తీర్చుకోవడంతోపాటు పిల్లలను బాగా చదివించుకోవచ్చని ఆమె కూడా సౌదీ వెళ్లేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో సౌదీ దేశం రియాద్‌లోని ఓ సేటు వద్దకు ఈ ఏడాది ఏప్రిల్ 17న హేమలత వెళ్లింది. వెళ్లిన కొద్ది రోజులకే అక్కడి సేటు ఆమెను చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. వాటిని భరించలేక ఆమె తనను ఇండియాకు పంపేయాలని పలుమార్లు అతన్ని వేడుకున్నా కనికరించలేదు. తాను పడుతున్న బాధలను కుటుంబ సభ్యులకు ఫోన్లో వివరించి కన్నీరుమున్నీరైంది. ఎలాగైనా తనను కాపాడాలని, లేకుంటే చచ్చిపోతానని చెప్పింది. భార్య కన్నీటి బాధను ఫోన్లో విన్న మంజునాథ స్థానికంగా ఉన్న ఏజెంట్ శ్రీనివాసులును నిలదీశాడు. తన భార్యను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని బతిమాలాడాడు. అతను పట్టించుకోలేదు. కడసారి చూపునకు కూడా నోచుకోలేనని... హేమలతపై సేట్ చిత్రహింసలు మరింత ఎక్కువయ్యాయి. దీనికితోడు తన వద్ద ఉన్న ఫోన్‌ను కూడా వారు లాగేసుకోవడంతో మరింత కుంగిపోయింది. ఇండియాకు వచ్చే మార్గంలేక చావడమే మార్గంగా ఎంచుకుంది. సోమవారం రాత్రి తాను ఉంటున్న ఇంటిలో చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయిన మూడు రోజుల తర్వాత సేటు హేమలత భర్త మంజునాథకు ఫోన్ చేశాడు. నీ భార్య ఉరివేసుకుని చనిపోయిందని, శవాన్ని పంపించాలంటే రూ.1.50 లక్షలు చెల్లించాలని పేర్కొన్నాడు. దీంతో ఏమి చేయాలో తెలియక మంజునాథ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ మేరకు బాధితుడు గురువారం టూటౌన్ పోలీసులను కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ గంగిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సౌదీలో ఆత్మకూర్ వాసి దుర్మరణం
గొల్లపల్లి: మండలంలోని ఆత్మకూర్ గ్రామానికి చెందిన కోమటñ ట్టి లచ్చయ్య(40) సౌదీలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వ్యవసాయభూమి లేకపోవడం.. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగానే నాలుగేళ్ల క్రితం సౌదీవెళ్లాడు. అక్కడ బల్దియా పనుల్లో భాగంగా రోడ్డుపై పనిచేస్తుండగా.. వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహం నుజ్జునుజ్జుయింది. అక్కడి స్నేహితులు సర్పంచ్ పాదం రజిత భర్త రమేశ్‌కు సమాచారం అందించారు. లచ్చయ్యకు భార్య జమున, కొడుకు, కూతురు ఉన్నారు. -
భారత కార్మికులకు న్యాయం చేస్తాం
రాయికల్ : సౌదీలోని భారతీయ కార్మికులందరికి న్యాయం చేసేలా చర్యలు చేపడతామని సౌదీ కార్మిక శాఖ మంత్రి అల్హక్బాని అన్నారు. గురువారం భారత విదేశాంగ మంత్రి వీకే.సింగ్ సౌదీలోని రియాద్‌లో పర్యటించగా సౌదీ కార్మిక శాఖ మంత్రితో భారతీయ కార్మికులు పడుతున్న కష్టాలపై వివరించారు. సానుకూలంగా విన్న కార్మిక శాఖ మంత్రి దేశరాజు సల్మాన్ ఆదేశాల మేరకు S భారతీయ కార్మికులను ఆదుకుంటామని, అంతేకాకుండా యుద్ధప్రతిపాదికన స్వదేశాలకు పంపించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరికొంత మందికి ఉపాధి కల్పించేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ సంప్రదింపుల విషయాలను భారత విదేశాంగ సహాయ మంత్రి వీకే.సింగ్, భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు సమాచారం అందించారు. సౌదీలోని భారత కార్మికులకు ఆహార ,వైద్యసేవాలçను కార్మికులకు అందిస్తామని ఎ వరూ ఆందోళన చెందవద్దన్నారు. అవసరమైతే న్యాయ సలహాలు పొందేందుకు న్యాయవాదులను సైతం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
సౌదీలో నగర్‌తండా వాసి మృతి
లోకేశ్వరం : మండలంలోని నగర్‌తండాకు చెందిన రాథోడ్ గణేశ్(32) సౌదీ అరేబియాలో మృతి చెందాడు. విషయాన్ని గురువారం లోకేశ్వరం తహసీల్దార్ లోకేశ్వర్‌రావు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంబసీ సమాచారం మేరకు నగర్‌తండాకు వెళ్లి గణేశ్ మృతి విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మూడు నెలలుగా గణేశ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం అతడి మరణ వార్త తెలిసింది. మృతుడికి భార్య నీలాబాయి, కుమారుడు సురేశ్, కూతురు గౌరి ఉన్నారు. శుక్రవారం కుటుంబానికి సంబంధించిన పూర్తి నివేదికలను తయారు చేసి వీలైనంత త్వరగా గణేశ్ మృతదేహాన్ని తెప్పించే ఏర్పాట్లు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. -
నన్ను విడిపించండి ప్లీజ్..!
పనికోసం సౌదీకి వెళ్లి యజమాని పెడుతున్న వేధింపులను తాళలేక ఓ మహిళ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఓ గదిలో బందీగా ఉంటూ కష్టాలను ఓర్వలేక ఆందోళన చెందుతోంది. అక్కడే ఉండలేక, తిరిగి స్వదేశానికి రాలేక సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఆవేదన చెందుతోంది. తన కష్టాలను వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. తనను సురక్షితంగా స్వదేశానికి చేర్చమంటూ భారత ప్రభుత్వం, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను వేడుకుంటోంది. ముంబైకి చెందిన 47 ఏళ్ల మిష్భా షేక్ పనికోసం సౌదీ అరేబియా వెళ్లి యజమానుల ఉచ్చులో చిక్కుకుంది. తనను ఎలాగైనా ఇండియాకు రప్పించమంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. యజమాని ఓ గదిలో బంధించి తీవ్రమైన మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అవేదన వ్యక్తం చేస్తోంది. జయమాని 10,000 రియాల్స్ కట్టమని డిమాండ్ చేస్తున్నాడని, ఇటు పని, అటు డబ్బు లేక తాను ఎంతో కష్టాల్లో ఉన్నానని, తనను ఎలాగైనా అక్కడి నుంచి స్వదేశానికి రప్పించాలని వేడుకుంటోంది. పనికోసం వెళ్లి మిష్ఫా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోందని, సౌదీ యజమానుల వద్ద బందీగా ఉన్న ఆమెను సురక్షితంగా భారత్ కు తిరిగి తీసుకొచ్చేందుకు సహకరించమని ఆమె కుటుంబసభ్యులు సైతం భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
సౌదీలో భారత్ వర్కర్ కష్టాలు...!
ఉపాధి కోసం సౌదీకి వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కొందరు, కుటుంబ భారాన్ని మోసేందుకు మరికొందరు సుదూర తీరాల నుంచి దుబాయ్ కి వలసలు వెళ్తుంటారు. వీరిలో కొందరు కొన్నాళ్ల తర్వాత స్వదేశానికి వచ్చి స్థిరపడుతున్నా... ఎక్కువశాతం మంది అక్కడ యజమానులు పెట్టే హింసలకు, ఇబ్బందులకు గురై తీవ్ర కష్టాల్లో కూరుకుపోతున్నారు. ప్రస్తుతం ఫేస్బుక్లో కలకలం సృష్టించిన వీడియో ఈ కష్టాలు, కన్నీళ్లను కంటికి కట్టినట్లు చూపిస్తోంది. భారత్ నుంచి సౌదీ అరేబియాకు డ్రైవర్ పనికోసం వెళ్లి యజమాని పెట్టే హింసలను భరించలేక కన్నీటి పర్యంతమౌతున్న అబ్దుల్ సత్తార్ మకందర్ వీడియో సౌదీ కష్టాలను కళ్లకు కట్టింది. రెండేళ్ల క్రితం ఉపాధి కోసం వెళ్లి సౌదీ అరేబియాలో డ్రైవర్‌గా చేరిన 35 ఏళ్ల సత్తార్ మకందర్ అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సత్తార్ కన్నీటి కథ వీడియో ను ఢిల్లీకి చెందిన కార్యకర్త కుందన్ శ్రీవాస్తవ గతవారం ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఇంటర్నెట్లో ఆ వీడియో దేశ విదేశాల్లోనూ వైరల్‌గా వ్యాపించింది. తన యజమాని స్వదేశానికి (ఇండియాకు) పంపించడం లేదంటూ వీడియోలో సత్తార్ కన్నీరు మున్నీరయ్యాడు. తనకు జీతం కూడా సరిగా చెల్లించడం లేదని, కనీసం తిండికి కూడా డబ్బు ఇవ్వడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే సత్తార్ వీడియో అతడికి మేలు చేయకపోగా, మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. సౌదీలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సత్తార్ వీడియో ఇంటర్నెట్లో వ్యాపించడంతో సౌదీ అధికారులు అతడిని అరెస్టుచేశారు. తప్పుడు సమాచారం వ్యాపింపజేయడం సౌదీ అరేబియాలో క్రిమినల్ చర్యగా భావించిన అధికారులు అతడ్ని అరెస్ట్ చేశారు. దీంతో వెంటనే సౌదీ అధికారులను సంప్రదించి వెంటనే అసలు వీడియోను ఇంటర్నెట్ నుంచి తొలగించి, క్షమాపణలు చెప్పానని శ్రీవాస్తవ తెలియజేశాడు. మానవ హక్కుల కార్యకర్త అయిన శ్రీవాస్తవ మానవత్వమే తన కుటుంబమని, మానవులంతా తమకుటుంబంలోని వారిగానే భావిస్తానని, అందుకే సత్తార్ ను సైతం తన కుటుంబంలోని వ్యక్తిగా భావించి అతడి తరపున క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించాడు. ఈ సందర్భంలో సత్తార్ మకందర్ ఎ1 సరూర్ యునైటెడ్ గ్రూప్ లో పని చేస్తున్నాడని, అతడికి కంపెనీ సమయానికి జీతం చెల్లిస్తోందని, అతడికి పనిచేయడం ఇష్టం లేకపోతే స్వేచ్ఛగా వైదొలగవచ్చునని రిక్రూట్ మెంట్ ఏజెన్సీకి చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. అయితే తాను చెప్పిన క్షమాపణలతో సత్తార్ ను విడిచి పెట్టారని, కానీ మర్నాడు వెంటనే మరో కారణంతో అరెస్టు చేశారని శ్రీవాస్తవ చెప్తున్నాడు. మకందర్ తల్లి కూడా అతడితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. అరెస్టు కాకముందు ఐదురోజుల క్రితం సత్తార్ ఓసారి తనతో మాట్లాడాడని, ఆ తర్వాత సత్తార్ ను అరెస్టు చేసినట్లు స్నేహితులు చెప్పారని ఆమె తెలిపింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించలేదని శ్రీవాస్తవ అన్నాడు. ఇప్పటికీ మకందర్ ఖైదీగానే ఉన్నాడని, ఏ ప్రభుత్వం అతడికి సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. -
సౌదీలో ఖానాపూర్ వాసి మృతి
ఖానాపూర్(అదిలాబాద్): పొట్టకూటి కోసం సౌదీ వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన తోట రాజన్న(48) రెండు సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం సౌదీలోని జిద్దా పట్టణానికి వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం అక్కడ గుండెపోటుకు గురై మృతిచెందాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు సత్వరం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
సౌదీలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు కామారెడ్డివాసుల మృతి
కామారెడ్డి: సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కామారెడ్డి, వికాస్‌నగర్ కాలనీకి చెందిన యూసుఫ్ (38), విద్యుత్ నగర్ కాలనీకి చెందిన సోహెల్ (27)తో పాటు షానవాజ్, సిరాజ్‌లు సౌదీలోని దమ్మమ్‌లో ఉంటున్నారు. నలుగురు కలిసి కారులో శుక్రవారం జబల్ అనే ప్రాంతానికి వెళ్లి నమాజ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా, వారి కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో యూసుఫ్, సోహెల్‌లు అక్కడికక్కడే మృతిచెందగా, షానవాజ్ కాలు విరిగింది. సిరాజ్ పరిస్థితి విషమంగా ఉంది. యూసుఫ్, సోహెల్‌లు రెండు నెలల క్రితమే సౌదీకి వెళ్లారు. షానవాజ్, సిరాజ్‌లు గతంలోనే సౌదీ వెళ్లారు. యూసుఫ్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.