Do You Know Which Is Richest Royal Family In The World With Net Worth Of Usd 1.4 Trillion - Sakshi
Sakshi News home page

Richest Royal Family In World: ప్రపంచంలో టాప్‌ రిచెస్ట్‌ రాయల్‌ ఫ్యామిలీ ఏదో తెలుసా? 

Published Thu, Jul 27 2023 5:27 PM | Last Updated on Thu, Jul 27 2023 5:49 PM

Do you know Which is richest royal family in the world - Sakshi

Worlds Most Richest Royal Family:  ప్రపంచంలోని అత్యంత  సంపన్న రాజ కుటుంబాలు మధ్యప్రాచ్యం నుండి వచ్చాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం అమలులోకి రాకముందు రాజులు, రాజకుటుంబాల పాలన నడిచేది. ప్రస్తుతం ఆ యుగం ముగిసింది. కానీ బ్రిటిష్ రాజకుటుంబం ప్రపంచంలోనే అత్యంత  ధనిక కుటుంబంగా భావిస్తారు.  కింగ్ చార్లెస్ III అధికారికంగా అతని భార్య క్వీన్ కన్సార్ట్ కెమిల్లాతో పాటు దేశాధినేతగా పట్టాభిషేక్తిడైన నేపథ్యంలో,  యునైటెడ్ కింగ్‌డమ్ రాయల్ ఫ్యామిలీ  రిచెస్ట్‌ ఫ్యామిలీ అనుకుంటారు. భారీ సంపద గురించి పట్టాభిషేక వేడుకకు ఖర్చు చేసిన  డబ్బు గురించే మాట్లాడుకుంటారు. 

​కానీ ఆశ్యర్యకరంగా ది రాయల్ ఫ్యామిలీ ఆఫ్ సౌదీ ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకుటుంబంగా  నిలుస్తోంది. ఎందుకంటే 1.4 ట్రిలియన్లు  డాలర్ల సంపదతో  బ్రిటిష్ రాజకుటుంబం కంటే 16 రెట్లు   విలువైన సంపద ఈ  సౌదీ ఫ్యామిలీ   సొంతం.  కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలోని సౌదీ రాజ కుటుంబంలో 15,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు, వారి సంపదలో ఎక్కువ భాగం దేశంలోని విస్తారమైన చమురు నిల్వల ద్వారా వచ్చిన ఆదాయమే.

సౌదీ అరేబియా రాజు ప్రస్తుతం 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమై అల్ యమామా ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. అగ్రశ్రేణి లగ్జరీ బ్రాండ్‌లను మాత్రమే ధరించే వీరి ఖజానాలో  టన్నుల కొద్దీ బంగారం-వెండితో పాటు విలువైన వజ్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి.  గ్రాండ్ ప్యాలెస్‌లో కోట్ల విలువైన లగ్జరీ కార్లు, క్రూయిజ్‌లతో పాటు బిలియన్ల విలువైన ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. ఖరీదైన బంగారు పూతతో కూడిన కారు కూడా ఉంది. ఇంకా  కోట్ల విలువైన లగ్జరీ కార్లు లంబోర్ఘిని అవెంటడోర్ సూపర్‌వెలోస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే, మెర్సిడెస్ జీప్ , బెంట్లీ ఉన్నాయి. 2011లలోనే ఫోర్బ్స్ అతని , అతని తక్షణ కుటుంబ సంపద సుమారు 21 బిలియన్లుగా అంచనా వేసింది.

యమామా ప్యాలెస్‌లో  సినిమా థియేటర్ అనేక స్విమ్మింగ్ పూల్స్ మసీదు కూడా ఉంది. ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ 400 మిలియన్ డాలర్ల సెరీన్ సూపర్‌యాచ్‌, విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లు కలిగి ఉన్నారు. ఈ భారీ క్రూయిజ్‌లో 2 హెలిప్యాడ్‌లు , స్పోర్ట్స్ గ్రౌండ్‌తో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య విమానం  బోయింగ్ 747-400 రాజకుటుంబం సొంతం. ప్రత్యేక విమానంలో ప్యాలెస్‌లో ఉండే సౌకర్యాలుండటం మరో విశేషం. 

సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా తన కుమార్తెకు బంగారంతో చేసిన టాయిలెట్‌ను బహుమతిగా ఇచ్చాడని   ప్రతీతి.

సౌదీ అరేబియా రాజకుటుంబం తర్వాత, ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న రాజ కుటుంబీకులు కువైట్ నుండి వచ్చారు, మొత్తం కుటుంబం  360 బిలియన్ల డాలర్లకు పైగా ఉంది. ఇక కింగ్ చార్లెస్ III నేతృత్వంలోని యూకే రాయల్ ఫ్యామిలీ మొత్తం నికర విలువ  88 బిలియడాలర్లు. భారతీయ కరెన్సీలో రూ. 7.22 లక్షల కోట్లతో ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన రాయల్‌లలో 5వ స్థానంలో ఉన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement