దుబాయ్: ఇంతవరకూ పన్ను రహిత దేశాలుగా పేరుపడ్డ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లు గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చాయి. సౌదీ అరేబియా కొత్త సంవత్సర కానుకగా.. పెట్రోల్ ధరల్ని అమాంతం 127 శాతం పెంచింది. ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రపంచ ధరల్లో మాంద్యం కారణంగా ఏర్పడ్డ బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు గత రెండేళ్లుగా గల్ఫ్‌లోని ముడిచమురు ఉత్పత్తి దేశాలు చర్యలు కొనసాగిస్తున్నాయి.
అందులో భాగంగానే తాజాగా వ్యాట్‌ను అమల్లోకి తెచ్చారు. అధిక శాతం వస్తువులు, సేవలకు వర్తించే ఐదు శాతం అమ్మకం పన్నుతో రెండు ప్రభుత్వాలు 2018లో 21 బిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
సౌదీ, యూఏఈలో తొలిసారి వ్యాట్
Published Tue, Jan 2 2018 2:35 AM | Last Updated on Tue, Jan 2 2018 2:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment