vat
-
అదనపు వ్యాట్ బాబు వేసిందేగా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడి హయాంలోనూ అదే 31 శాతం వ్యాట్. ఇప్పుడూ అదే వ్యాట్. చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చాక పెట్రోలు, డీజిల్ రెండింటిపైనా లీటర్‌కు 4 రూపాయలు అదనపు వ్యాట్ విధించారు. ఇప్పుడూ అదే అదనపు వ్యాట్ కొనసాగుతోంది. కాకపోతే చంద్రబాబు హయాంలో రోడ్లను పట్టించుకోకపోవటంతో... దారుణంగా తయారైన రహదారుల మరమ్మతుల కోసం ఈ ప్రభుత్వం లీటరు డీజిల్, పెట్రోల్‌పై ఒక రూపాయి సెస్‌ను మాత్రం వసూలు చేస్తోంది. విచిత్రమేంటంటే ‘ఈనాడు’కు గానీ.. పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న దాని అధిపతి రామోజీరావుకు గానీ ఈ పన్నులన్నీ మునుపటి నుంచే కొనసాగుతున్నాయన్న వాస్తవం తెలిసి కూడా తెలియనట్టే వ్యవహరిస్తుండటం!!. ఇప్పుడేదో కొత్తగా పన్నులు పెంచేసినట్లు... దీనివల్ల ఇంధన ధరలు రాత్రికి రాత్రే హఠాత్తుగా పెరిగిపోయినట్లు ‘ఈనాడు’ రాసిన కథనం చూస్తే ఎవ్వరికైనా ‘ఔరా..!’ అనిపించకమానదు. పైపెచ్చు తాను పెంచిన అదనపు వ్యాట్ 4 రూపాయలు కాగా... కేవలం ఎన్నికలకు మూడునాలుగు నెలల ముందు ఏదో ఉపశమనం ఇస్తున్నట్లుగా అందులో 2 రూపాయలు తగ్గించారు చంద్రబాబు. తన పదవీకాలం మొత్తం పెంచిన ఛార్జీల్ని వసూలు చేసి... చివర్లో నాలుగు నెలలు ఎన్నికల్లో ఓట్ల కోసం... అందులోనూ సగం మాత్రమే తగ్గిస్తే... అప్పట్లో ‘ఈనాడు’ దీన్ని ప్రశ్నిస్తే ఒట్టు!. ఇదంతా ఎన్నికల గిమ్మిక్కేనని ఒక్క అక్షరం కూడా రాయని రామోజీరావు... ఇప్పుడూ అవే ఛార్జీలను కొనసాగిస్తున్నా.. ఏదో రాత్రికి రాత్రే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరల్ని పెంచేసినట్లు వార్తలు రాయటం చూస్తే ఇదెక్కడి పాత్రికేయమని అనిపించకమానదు. పన్నులన్నీ కేంద్రానివేనని తెలియదా? అంతర్జాతీయంగా ముడి చమురు ధరల కదలికలను బట్టే దేశంలో ధరలు పెరగటం, తగ్గటం జరుగుతోందన్నది వాస్తవం. కాకపోతే అంతర్జాతీయంగా బాగా తగ్గినపుడు... కేంద్రం ఆ ఉపశమనాన్ని వినియోగదారులకు బదలాయించటం లేదు. రకరకాల పన్నులను పెంచటం ద్వారా ఆ ప్రయోజనాన్ని తన ఖాతాలో వేసుకుంటోంది. ఇలా కేంద్రం అదనపు ఎక్సైజ్ డ్యూటీలు, సెస్‌ల పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వల్లే ఇంధన ధరలు భగ్గుమంటున్నాయన్నది రామోజీరావుకు తెలియనిదేమీ కాదు. నిజం చెప్పాలంటే ఇంధన ధరలు రూపాయి అటూఇటుగా ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో ఒకే మాదిరిగా ఉన్నాయి. ఒక పక్క చార్జీలు, సెస్‌లు పేరిట కేంద్రం వాతలు పెడుతుంటే వాటిపై స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపటం చూస్తుంటే రామోజీరావు ఏ స్థాయికి దిగజారుతున్నారన్నది అర్థం కాక మానదు. ► ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో గణనీయంగా తగ్గినప్పటికీ దేశీయ మార్కెట్లో అందుకు అనుగుణంగా ధరలను తగ్గించలేదు. 2019 మే నెలలో లీటరు పెట్రోలు రూ.76.89, డీజిల్ రూ.71.50 చొప్పున ఉండగా 2021 నవంబర్ 1న పెట్రోలు రూ.115.99, డీజిల్ రూ.108.66కి పెరిగాయి. ఇప్పుడు పెట్రోల్ లీటర్ రూ.111.87, డీజిల్ రూ.99.61 ఉంది. ► పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం వసూలు చేస్తున్న మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటా కేవలం 5.8 శాతం. నేరుగా పన్నుల పేరిట వసూలు చేస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది కనక సెస్‌లు, సర్ చార్జీలు, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ పేరిట కేంద్రం వసూలు చేస్తోంది. ఇలా వసూలు చేస్తున్న మొత్తంలో ఒక్క పైసా కూడా రాష్ట్రాలకు వాటా ఇవ్వడం లేదు. ►పెట్రో ఉత్పత్తుల విక్రయాలపై వార్షికంగా రూ.3.35 లక్షల కోట్లు వసూలవుతున్నా రాష్ట్రాలకు ఇస్తున్న వాటా రూ.19,475 కోట్లు (5.8%) మాత్రమే. వాస్తవానికి కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాల వాటాగా 41 శాతం పంచాల్సి ఉంది. అయితే పెట్రో ఆదాయం ఇలా డివిజబుల్ పూల్‌లోకి రాకుండా సెస్‌లు, సర్‌చార్జీ రూపంలో కేంద్రం సుమారు రూ.2,87,500 కోట్లు వసూలు చేస్తోంది. ఈ వాస్తవం ‘ఈనాడు’కు తెలియదనుకోలేం!!. ► టీడీపీ అధికారంలో ఉండగా రహదారులపై దృష్టి పెట్టకపోవడంతో నిర్వహణ లోపం కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఏటా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఫలితంగా రోడ్లు ఇబ్బందికరంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో రూ.2,205 కోట్లతో 8,970 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి, మరమ్మతులు చేపట్టింది ప్రభుత్వం. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా లీటరుపై కేవలం రూ.1 మాత్రమే సుంకంగా విధించాల్సి వచ్చింది. ఇది మినహా వ్యాట్ గానీ, గత సర్కారు విధించిన అదనపు నాలుగు రూపాయలకు మించిగానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక్క పైసా పెంచలేదు. గత ప్రభుత్వంలో ఉన్నట్లే వ్యాట్, అదనపు రూ.నాలుగు ఇప్పుడూ ఉన్నాయి. మరోవైపు కోవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల రాబడిని కోల్పోయింది. అయినప్పటికీ వాహనదారులపై భారం మోపలేదు. -
వ్యాట్ పెంచం.. కొత్త పన్నులు ఉండవు: సీఎం యోగి
లక్నో: అధిక ధరలు, పన్నుపోటు పరిస్థితులు ప్రస్తుతం దేశం మొత్తం కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ ప్రజలకు యోగి సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రజా ప్రయోజనాల దృష్ట్యా.. రాబోయే రోజుల్లో వ్యాట్VATను పెంచడం, కొత్త పన్నుల విధింపు లాంటి కఠిన నిర్ణయాలు ఉండవని స్వయంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయ సేకరణ మీద శుక్రవారం సాయంత్రం తన నివాసంలో ట్యాక్స్ విభాగంతో సుదీర్ఘ మంతనాలు జరిపిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్‌ను సమీప భవిష్యత్తులో పెంచే ప్రసక్తే ఉండదని, అలాగే కొత్తగా ప్రజలపై ఎలాంటి పన్నులు విధించబోమని ఆయన స్పష్టం చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలను ఇబ్బంది పెట్టకుండా ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని ఆయన అధికారులను కోరారు. అలాగే.. జీఎస్టీ రిజిస్టర్డ్ పరిధిలోకి బడా వ్యాపారులెవరినీ వదలకుండా తీసుకురావాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ఆయన అధికారులకు సూచించాడు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ లక్షా యాభై వేల కోట్ల ఆదాయాన్ని జీఎస్టీ, వ్యాట్ రూపంలో వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది యోగి సర్కార్. చదవండి: 'మహా' కేబినెట్ విస్తరణ ఆలస్యం అందుకేనా? -
వస్తు సేవల పన్ను విధానం సూపర్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అడ్డంకులను తగ్గించడం ద్వారా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం వ్యాపారాన్ని సులభతరం చేసిందని 90 శాతం మంది భారత్ పారిశ్రామిక ప్రతినిధులు భావిస్తున్నారని డెలాయిట్ సర్వే బుధవారం తెలిపింది. జీఎస్టీ విధానం అంతిమ వినియోగదారులకు సంబంధించి వస్తువులు, సేవల ధరల ప్రక్రియను సానుకూలం చేసిందని తెలిపింది. తమ సరఫరా చైన్లను పటిష్టం చేసుకోవడంలో కంపెనీలకు సైతం పరోక్ష పన్నుల విధానం దోహదపడుతోందని వివరించింది. ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, వ్యాట్, 13 సెస్సులు వంటి 17 స్థానిక లెవీల స్థానంలో దేశవ్యాప్తంగా 2017 జూలై 1వ తేదీ నుంచి జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘జీఎస్టీ:5 సర్వే 2022’ పేరుతో జరిపిన ఈ సర్వేలో వెల్లడయిన మరికొన్ని అంశాలు.. ► నాలుగు వారాల పాటు జరిగిన సర్వేలో 234 మంది చీఫ్ ఎక్పీరియన్స్ ఆఫీసర్లు (సీఎక్స్‌వో), సీఎక్స్‌వో–1 స్థాయి ఇండివిడ్యువల్స్ పాల్గొని తమ అప్రాయాలను వ్యక్తం చేశారు. వినియోగదారులు, ఇంధన వనరులు, పరిశ్రమలు, ఆర్థిక సేవలు, ప్రభుత్వ, ప్రజా సేవలు; లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ సహా పలు కీలక రంగాలపై జీఎస్టీ ప్రభావాన్ని సర్వే ట్రాక్ చేసింది. ► కీలక రంగాల్లోని తొంభై శాతం మంది సీఎక్స్‌వోలు జీఎస్టీ పరోక్ష పన్ను విధానాన్నికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ’ఒక దేశం, ఒకే పన్ను’ సంస్కరణ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అడ్డంకులను తగ్గించి, వ్యాపారాన్ని సులభంగా, ప్రభావవంతంగా మార్చిందని వారు అభిప్రాయపడ్డారు. అటు వ్యాపారవ్తేలకు ఇటు పన్ను చెల్లింపుదారులకు జీఎస్టీ విధానం ఎంతో ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నారు. ► పన్నుల చెల్లింపునకు సంబంధించి ఆటోమేషన్, ఈ–ఇన్వాయిస్/ఈ–వే సౌకర్యాన్ని ప్రవేశపెట్ట డం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రయోజనకరమైన సంస్కరణ అని వారు తెలిపారు. ► వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడానికి పన్ను వ్యవస్థ మరింత సరళతరం కావాలని విజ్ఞప్తి చేశారు. ► నెలవారీ, వార్షిక రిటర్న్స్ పక్రియను సులభతరం చేయడానికి సాంకేతికతను అప్‌గ్రేడ్ చేయడం కీలకమని తెలిపారు. ► ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మ్యాచింగ్‌ను సరళీకృతం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. పన్ను చెల్లింపుదారుల కోసం నిర్వహణా సంక్లిష్టతలను తగ్గించాలని, పన్ను వివాదాల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమలు కోరుతున్నాయి. ఆయా అంశాలు తీవ్రమైన దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలకు దారితీస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారీ పన్ను వసూళ్లే విజయ సంకేతం ఇటీవలి నెలల్లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ వ్యవస్థ గణనీయమైన విజయం సాధించిందనడానికి ఇదే ఉదాహరణ. వ్యవస్థ పట్ల పన్ను చెల్లింపుదారుల స్నేహ పూర్వక విధానాన్ని ఇది సూచిస్తోంది. ఈ పన్ను విభాగం మరింత విస్తృతంగా ప్రజాదరణ పొందడానికి మరిన్ని చర్యలు అమల్లోకి వస్తాయని అభిప్రాయపడుతున్నాం. – మహేశ్ జైసింగ్, డెలాయిట్ విశ్లేషణ విభాగం ప్రతినిధి ఎకానమీకి శుభ సంకేతం గత మూడు నెలల్లో వరుసగా రూ. 1.4 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి, వృద్ధికి సంకేతం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సంఖ్యలతో సహా ఇతర ఆర్థిక విభాగాల్లో రికవరీ పరిస్థితి ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పటిష్ట ఆడిట్లు, ప్రభుత్వ చర్యలు పన్ను ఎగవేతల నిరోధానికి దోహదపడుతున్నాయి. – ఎంఎస్ మణి డెలాయిట్ ఇండియా పార్ట్నర్ -
మన దేశంలోనే పెట్రోల్ ధరలు తక్కువ.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి కాలంలో చాలా దేశాలలో ఇంధన ధరలు 50 శాతానికి పైగా పెరిగితే భారతదేశంలో కేవలం ధరలు 5 శాతం పెరిగాయని సభకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నేడు రాజ్యసభలో తెలిపారు. గత ఏడాది నవంబర్ 4న ఇంధన ధరలపై కేంద్రం పన్నులు తగ్గిస్తే మహారాష్ట్ర, కేరళతో సహా తొమ్మిది రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించలేదని అని అన్నారు. "మేము గత ఏడాది సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాము. కానీ, మహారాష్ట్ర & కేరళతో సహా తొమ్మిది రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించలేదు. చమరు ధరలను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము" మంత్రి తెలిపారు. "కరోనా మహమ్మారి సమయంలో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యుకె, స్పెయిన్ దేశాలలో పెట్రోల్ ధరలు 50, 55 & 58 శాతం పెరిగితే.. భారతదేశంలో చమరు ధరలు 5 శాతం మాత్రమే పెరిగాయి. ఇందుకు మనం సంతోషించాలి" అని అన్నారు. ముడి చమురుపై రష్యా అందిస్తున్న డిస్కౌంట్లను కూడా పరిశీలిస్తున్నట్లు సింగ్ రాజ్యసభలో తెలిపారు. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గత మూడు సంవత్సరాలు, ప్రస్తుత సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం(సెస్‌లతో సహా) విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించిన మొత్తం వివరాలను మంత్రి రాజ్యసభకు తెలియజేశారు. 2018-29లో సేకరించిన మొత్తం సుంకం రూ.2.14 లక్షల కోట్లు అయితే, 2019-20లో ఇది రూ.2.23 లక్షల కోట్లుగా ఉంది. ఇక 2020-21లో ఈ మొత్తం రూ.3.73 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు పెట్రోలియం ఉత్పత్తుల నుంచి సేకరించిన మొత్తం సుంకం రూ.1.71 లక్షల కోట్లు వసూలు అయినట్లు హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. (చదవండి: రష్యాతో బిజినెస్ చేస్తాం.. లాభం ఉక్రెయిన్‌కు ఇస్తాం!) -
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా..?
ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగినప్పటి నుంచి బంగారం, చమరు ధరలు భారీగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ రోజు బ్యారెల్ బ్రెంట్ క్రూయిడ్ ఆయిల్ ధర 115 డాలర్లకు చేరుకుంది. అయితే, ఒకవైపు అంతర్జాతీయంగా చమరు ధరలు భారీగా పెరగడంతో ఆ ధరల నుంచి మన దేశ ప్రజలకు ఉపశమనం అందించడానికి కేంద్రం మార్గాలను అన్వేషిస్తోంది. వినియోగదారులపై చమురు ధరల ప్రభావం పడకుండా ఉండటానికి లీటరు పెట్రోల్, డీజిల్'పై రూ.8-10 ఎక్సైజ్ సుంకన్నీ తగ్గించడానికి కేంద్రం ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు బిజినెస్ టుడే మీడియాకు తెలిపాయి. గత ఏడాది నవంబర్ నెలలో 68 డాలర్లు ఉన్న బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర నేడు 115 డాలర్లకు చేరుకుంది. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పులేదు. "అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో డీజిల్ & పెట్రోల్ ధరలు ఇప్పటి వరకు లీటరుకు రూ.9-14 ఎక్కువగా ఉండాలి" అని ఎస్బిఐ ఎకోర్యాప్ కొద్ది రోజుల క్రితం తన నివేదికలో తెలిపింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లయితే, అప్పుడు ఖజానాకు లక్ష కోట్ల రూపాయలు నష్ట వస్తుంది. కాబట్టి, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో డీజిల్ & పెట్రోల్ ధరలు పెంచే అవకాశం కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చమురు ధరల ప్రభావం వినియోగదారుడి మీద పడకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకన్నీ, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే పరిస్థితి చక్కదిద్దుకొనే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగిన ప్రకారం దేశంలో చమురు ధరలను పెంచితే ద్రవ్యోల్బణం 52-65 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, రేట్లు పెరగకుండా చూడటం కోసం ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు సుమారు రూ.7 తగ్గించినట్లయితే, అప్పుడు నెలకు రూ.8,000 కోట్ల ఎక్సైజ్ సుంకం నష్టం వాటిల్లుతుంది అని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. చూడాలి మరి మార్చి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. (చదవండి: కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి షాకిస్తున్న బ్యాంకులు..!) -
ఆ డబ్బు రాష్ట్రాలకు సమానంగా పంచాలి
కోల్‌కతా: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పెంచిన చమురు ధరలతో కేంద్రానికి వచ్చిన రూ.4 లక్షల కోట్లను రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బెంగాల్ శాసనసభలో మంగళవారం ఆమె మాట్లాడుతూ... ‘పెరిగిన ధరలకు వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ విక్రయించడం ద్వారా విధించిన పన్నులతో కేంద్ర సర్కారు ఖాజానాకు దాదాపు రూ.4 లక్షల కోట్లు వచ్చాయి. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని బీజేపీ ఇపుడు డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రూ.4 లక్షల కోట్లను రాష్ట్రాలకు కేంద్రం సమానంగా పంచాల’ని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చిందని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. (చదవండి: బీజేపీ నేతలు పేదల రక్తం పీలుస్తున్నారు) ఎన్నికలు దగ్గర పడినప్పుడల్లా ధరలు పెంచి, తర్వాత మళ్లీ పెంచడం మోదీ సర్కారుకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. చమురుపై వ్యాట్ తగ్గించకపోతే ఆందోళనలకు దిగుతామని చెబుతున్న బీజేపీ నాయకులు... కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను గురించి ప్రశ్నించాలని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీలోనూ తమ రాష్ట్రంపై మోదీ సర్కారు సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. (‘టచ్ చేయమంటున్నారు కదా.. సంజయ్ టచ్‌చేయ్’) -
బండి ఓకే.. ఆయిలే గుదిబండ!
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్స్ మార్కెట్లలో ఇండియా కూడా ఒకటి. కొనేది కారైనా, బైకైనా మనోళ్లు చూసేది మాత్రం వాల్యూ ఫర్ మనీ! అందుకే కార్ల కోసం మారుతి సుజుకీ వైపు, బైకుల కోసం హీరో కంపెనీ వైపు చూస్తారు. హీరో ఇండియాలో అతి పెద్ద బైకుల తయారీ కంపెనీ. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. బైకులు, కార్లు కొనే ముందు ఓ సారి పెట్రోల్, డీజిల్ ధరల గురించి సగటు భారతీయుడు ఆలోచిస్తున్నాడు. గడచిన పదేళ్లలో వాహనాల ఇంధన రేట్లు పెరగడం ఒక ఎత్తైతే, ఈ పదిహేను రోజుల్లో పెరిగిన తీరు మరో ఎత్తు. పెట్రోల్, డిజీల్ ధరలు ఆకాశానికి ఎగబాకడం వినియోగదారుల్లో గుబులుపుట్టిస్తోంది. దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 రూపాయలను తాకాయి. ఇలా వాహనదారుల ముక్కుపిండి వసూలు చేస్తున్న మొత్తం నిజంగా ఆయిల్ కంపెనీలకే వెళ్తుందా అంటే సమాధానం లేదు అనే చెప్పాలి. (అప్లికేషన్లో దగ్గు మందు.. తెచ్చింది కరోనా మందు) ప్రతి లీటరుకు చెల్లిస్తున్న మొత్తంలో 60 శాతానికిపైగా పన్ను కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది. మే ఆరో తేదీన ఢిల్లీలో లీటరు పెట్రోల్ రేటు 71.26 రూపాయలు కాగా, లీటరు డీజిల్ ధర 69.39. వీటి నుంచి పన్నుతీసేస్తే లీటరు పెట్రోల్ అసలు ధర 18.28 రూపాయలుగా, లీటరు డీజిల్ ధర 18.78 రూపాయలుగా తేలింది. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై 32.98 రూపాయలు, లీటరు డీజిల్ పై 31.83 రూపాయల ఎక్సైజ్ సుంకం విధిస్తోంది. ఇక ఢిల్లీ ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై 16.44 రూపాయల వ్యాట్ విధిస్తోండగా, లీటరు డీజిల్ పై 16.26 రూపాయల పన్ను వడ్డిస్తోంది. అతి కొద్ది మొత్తం డీలర్ మార్జిన్ కింద పోతోంది. వీటన్నింటినీ కలిపితే లీటరు ఆయిల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 శాతానికి పైగా పన్ను వేస్తున్నాయి.(ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు) కరోనా వైరస్ వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి కేంద్రం ఇటీవల ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీంతో ఆయిల్ పై పన్ను శాతం 75ని తాకింది. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 55 శాతం పైగా సుంకాలను చమురుపై వడ్డిస్తున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ సెక్టార్ నుంచి భారత ప్రభుత్వానికి 2.14 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పన్నుల రూపంలో వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 1.50 లక్షల కోట్లను చమురు రంగం ఆర్జించిపెట్టింది. -
పెట్రో మంట
ముడిచమురు అంతర్జాతీయంగా భారీగా పడిపోయినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం రికార్డు స్థాయి వైపు పరుగులు పెడుతున్నాయి. జూన్ 6న మొదలైన రేట్ల పెంపు దాదాపుగా ప్రతీ రోజు కొనసాగుతూనే ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీ సంగతి తీసుకుంటే జూన్ 6న లీటరు పెట్రోల్ రేటు రూ.71.26గా ఉండగా, జూన్ 17 నాటికి రూ.77.28కి చేరింది. డీజిల్ రేటు లీటరుకు రూ.69.39గా ఉండగా, రూ. 75.79కి ఎగిసింది. ఇదే తీరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో రేటు రూ. 100 కూడా దాటేస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ట్యాక్సులు, కమీషన్లు లేకుండా వాస్తవానికి డీలరు స్థాయిలో రూ.22.44 స్థాయిలో ఉన్న పెట్రోలు ధర.. రిటైల్‌గా కొనుగోలుదారు స్థాయికి వచ్చేటప్పటికి ఏకంగా అనేక రెట్లు పెరిగిపోవడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు, వ్యాట్ మోత మోగిస్తుండటమే కారణం. ఇంధనాల రేటులో దాదాపు 60 శాతం పైగా భాగాన్ని ఇవే ఆక్రమిస్తున్నాయి. ఎందుకంటే.. కరోనా వైరస్ కట్టడికి ఉద్దేశించిన లాక్‌డౌన్‌తో పన్ను ఆదాయాలకు గండి పడిన నేపథ్యంలో కొంత భాగాన్నైనా పూడ్చుకునేందుకు ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడుతున్నాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేటు 30 డాలర్ల దిగువకు పడిపోయినప్పుడు కేంద్రం మే 5న ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్‌పై రూ.10 మేర (లీటరుకు), డీజిల్‌పై రూ.13 మేర పెంచింది. ఇలా వచ్చే ఆదాయాన్ని ఇన్ఫ్రా, ఇతరత్రా అభివృద్ధి ప్రాజెక్టులకు మళ్లిస్తామని తెలిపింది. ప్రస్తుతం క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇంధనాలపై సుంకాలు, పన్నులను తగ్గించే ఆస్కారం ఉండకపోవచ్చని తెలిపాయి. అటు చమురు కంపెనీలు తమ ఆదాయ నష్టాలను భర్తీ చేసుకునేందుకు రేట్లను క్రమంగా పెంచుకుంటూ పోతున్నాయి. ఈ పెంపు 30 పైసలు.. 40 పైసల స్థాయికి తగ్గినా.. మొత్తం మీద చూస్తే జూన్ ఆఖరు దాకా రేట్ల పెంపు కొనసాగడం మాత్రం తప్పకపోవచ్చన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. సుంకాల భారం.. దేశ రాజధాని ఢిల్లీ సంగతి తీసుకుంటే లీటరు పెట్రోలు వాస్తవ ధర రూ. 22.44. వ్యాట్, ఎక్సైజ్ సుంకం, డీలర్ల కమీషన్ ఇవన్నీ కలిపితే మంగళవారం నాటి రిటైల్ రేటు ఏకంగా రూ. 76.73 పలికింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్స్ఛైజ్ సుంకం పెట్రోల్‌పై లీటరుకు రూ. 32.98గా, డీజిల్‌పై లీటరుకు రూ. 31.83గా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రాష్ట్రాన్ని బట్టి మారుతుంటుంది. మధ్యప్రదేశ్, కేరళ, రాజస్తాన్, కర్ణాటక మొదలైనవి అత్యధికంగా 30% వ్యాట్ విధిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు, డీలర్ కమీషన్ విషయానికొస్తే.. పెట్రోల్ బంకు ఉన్న ప్రాంతాన్ని బట్టి ఇది రూ. 2–4 మధ్య ఉంటుంది. ఢిల్లీ సంగతి తీసుకుంటే పెట్రోల్‌పై డీలరు కమీషన్ లీటరుకు రూ. 3.57, డీజిల్‌పై రూ. 2.51గా ఉంది. పెట్రోలియం రంగంపై పన్నులతో కేంద్రానికి రూ. 3.48 లక్షల కోట్లు, రాష్ట్రాలకు రూ. 2.27 లక్షల కోట్లు వస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. -
పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ వాయింపు
లక్నో: దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు స్వల్పంగా వెనక్కి తగ్గగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్ వ్యాట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్‌పై వ్యాట్‌ను 26.80 శాతానికి, డీజిల్‌పై 17.48 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తరువాత ఇంధన ధరలు పెరిగాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఒక లీటరు పెట్రోల్‌కు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 98 పైసలు పెరగ్గా, లీటరు డీజిల్‌కు రూ .2.35 పెరిగింది. దీంతో పెట్రోలు ధర లీటరు రూ. 73.66 గా ఉండగా, డీజిల్ ధర రూ. 65.28గా ఉంది. -
జీఎస్టీ...అయితే ఏంటి?
ఒకే దేశం..ఒకే పన్ను నినాదంతో రూపుదిద్దుకున్న జీఎస్టీ(వస్తు సేవల పన్ను) విధానం దేశంలో అమల్లోకి వచ్చి 18 నెలలు గడిచినా ఆచరణలో వినియోగదారుడికి కలిగిన ప్రయోజనం శూన్యంగా ఉంది. జీఎస్టీ అమల్లోకి వస్తే ధరలు అమాంతం దిగివస్తాయని కేంద్ర ప్రభుత్వం ఆడంబరంగా చెప్పిన మాటలు వాస్తవ రూపం దాల్చలేదు. ధరలు ఏమాత్రం తగ్గకపోగా, మరింత పెరిగాయి. అక్రమ వ్యాపారం కూడా యథేచ్ఛగా జరుగుతూనే ఉంది. సాక్షి, పాతగుంటూరు: జీఎస్టీ అమల్లోకి వచ్చాక వ్యాట్ కంటే ఈ విధానం కింద ప్రభుత్వానికి గణనీయంగా పన్ను వసూళ్లు పెరిగిన మాట వాస్తవమే. అయితే ఇదే సందర్భంలో కొద్దిమంది వ్యాపారులు ఈ పన్నును సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చి పలు దఫాలుగా పన్ను రేట్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చినా ధరల్లో ఏమాత్రం వ్యత్యాసం కనబడటం లేదు.పూర్తిస్థాయిలో ఆన్లైన్ ప్రక్రియ అమలు కాక, రూ.200 దాటిన సరుకులకు బిల్లులు ఇవ్వకపోవడంతో వినియోగదారుల జేబుకు చిల్లుపడుతోంది. వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించకపోవడం ఈ విషయంలో ఆ వ్యాపారులకు కలిసివస్తోంది. రాత్రి వేళల్లో సరుకు ఎలాంటి వేబిల్లు లేకుండా రవాణా జరుగుతున్నా అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు.దీంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. 30 శాతం పెరిగిన రాబడి దేశంలో 2017 జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. దీంతో జిల్లాలో గతం కంటే పన్ను రాబడులు ఆశాజనకంగా ఉన్నాయి. వ్యాట్‌తో పోలిస్తే జీఎస్టీ వలన 30 శాతం రాబడి అధికంగా వస్తోందని సీటీవో వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి జీఎస్టీ పన్ను విధానం ఫలితంగా ఆదాయం పెరిగినా వినియోగదారులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం కలగడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ అమలులో కొందరు వ్యాపారులు సాగిస్తున్న అక్రమాలపై ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.బిల్లులు లేకుండా ఇష్టారాజ్యంగా ధరలను పెంచి విక్రయాలు నిర్వహిస్తున్నారనే క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో డెకాయ్ ఆపరేషన్ పేరుతో దుకాణాలపై దాడులు తనిఖీలు చేపట్టారు. ఇదే సందర్భంలో వ్యాపార సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గింది. ఆపై తదుపరి చర్యలను పక్కన పెట్టింది. దీన్ని కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రూ.200 విలువ దాటిన ఏ వస్తువుకైనా డీలర్‌కు కేటాయించిన రిజిస్ట్రేషన్ గుర్తింపుతో బిల్లు ఇవ్వాలన్న నిబంధన ఉండేది. జీఎస్టీ ప్రకారం పన్ను వసూలు, వినియోగదారులకు చిల్లు పడకుండా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పర్యవేక్షణ ఉన్నా అక్కడక్కడ వ్యాపారులదే పైచేయి అవుతోంది. తెల్ల కాగితాలపై కాకుండా దుకాణం, సంస్థ పేరు మీదుగా బిల్లులు ఇవ్వడం లేదు. అయినా వినియోగదారుల నుంచి రాతపూర్వక ఫిర్యాదులు అందడం లేదన్న కారణం చూపి అధికారులు చర్యలకు ఉపక్రమించడం లేదు. జిల్లాలోని రెండు డివిజన్ల(నరసరావుపేట, గుంటూరు)లో జీఎస్టీ వసూళ్లు పెరిగి ఆదాయం గణనీయంగా లభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో ప్రారంభమైన 2018–19 ఆర్థిక సంవత్సరంలో నరసరావుపేట డివిజన్‌కు రూ.211,72,47 కోట్లు, వాహన తనిఖీల ద్వారా రూ.61,71 లక్షల రూపాయలు ఆదాయం రాగా, గుంటూరు డివిజన్లో రూ.45254.51 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నరసరావుపేట డివిజన్లో రెగ్యులర్ డీలర్లు మొత్తం 14746 వేల మంది ఉండగా, కాంపోజిషన్ స్కీమ్ ద్వారా 6753 మంది డీలర్లు నమోదై ఉన్నారు.గుంటూరు డివిజన్లో మొత్తం డీలర్లు 18,899 మంది ఉండగా,వారిలో రెగ్యులర్13,339, కాంపోజిషన్ స్కీంలో 5,689 మంది డీలర్లు నమోదై ఉన్నారు. పన్ను పరిధిలోకి... వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు దాటిన వ్యాపారులు జీఎస్టీ కింద డీలర్‌గా నమోదు చేసుకోవాల్సి ఉంది. ఏడాదికి రూ.1.50 కోట్ల లావాదేవీలు దాటితే కాంపోజిట్ డీలర్‌గా గుర్తింపు పత్రం తీసుకోవాలి. నిబంధనలు ప్రకారం కాంపోజిట్ డీలరు వినియోగదారుల నుంచి జీఎస్టీ వసూలు చేయరాదు. ఈ విషయాన్ని తెలిపేందుకు దుకాణాల ముందు బోర్డు ప్రదర్శించాల్సి ఉంది. 2018 ఏప్రిల్ నుంచి రూ.50 వేలు దాటితే సరుకు, సామాగ్రి, ఇతర వాటికి వేబిల్లు ఉండాల్సిందేనని జీఎస్టీలో నిబంధన విధించారు. రూ.200 దాటిన విక్రయాలపై బిల్లులేవీ? రూ.200 దాటిన విక్రయాలపై ఆన్లైన్ బిల్లులు ఇవ్వని కారణంగా వినియోగదారుడి జేబుకు చిల్లు పడుతుంది. ధరల వ్యత్యాసంలో కూడా తేడా కనిపించడం లేదు.కొందరు వ్యాపారులు సరకు నాణ్యతను సాకుగా చూపించి ఇష్టారాజ్యంగా ధరలను వసూలు చేస్తున్నారు. ప్రధాన వ్యాపార కూడళ్లలోని దుకాణాలలో ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. జీఎస్టీలో గుర్తింపు పొందిన వ్యాపారి(డీలర్)విధిగా జారీ చేసిన ధ్రువీకరణ పత్రం దుకాణాల్లో ప్రదర్శించాలి. దీన్ని బేఖాతరు చేసిన వర్తకులపై ఆకస్మిక తనిఖీలు చేసి అపరాధ రుసుం విధించాల్సి ఉంది. కానీ అలాంటి దాఖలాలేవీ కనిపించడం లేదు.రూ.50 వేలు విలువ దాటిన సరుకు, సామాగ్రిని రవాణా చేసే కొందరు వ్యాపారులు వేబిల్లు లేకుండా రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు జీఎస్టీలో వినియోగదారుల ప్రయోజనాలకు గండికొడుతున్న వ్యాపారులపై రాత పూర్వకంగా ఫిర్యాదులు అందలేదు. రూ.200 విలువ దాటిన వస్తువులపై తప్పకుండా బిల్లు తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపాలి. అప్పుడే ధరలు వ్యత్యాసం కనబడి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. వ్యాపారులు ప్రతి లావాదేవీ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించాలి.జీఎస్టీ పరంగా వినియోగదారులను మోసగించవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని డీలర్ల సమావేశాల్లో స్పష్టం చేస్తున్నాం. రూ.50 వేలు దాటిన సరుకు వేబిల్లుతో రవాణా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. –పి.రాజాబాబు, జాయింట్ కమిషనర్, రాష్ట్ర పన్నుల శాఖ, గుంటూరు డివిజన్ -
పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ఎందుకు ఎత్తేయలేదు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ఎందుకు తగ్గించలేదని కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్ ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వ్యాట్‌ను తగ్గించని కారణంగా వ్యవసాయ రైతులపై పెనుభారం పడిందని విమర్శించారు. 2014లో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ధర 110 డాలర్లు ఉందని, ప్రస్తుతం 60 డాలర్లకు తగ్గిందని చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఒకే తరహా పాలన సాగిస్తున్నారన్నారు. బ్యారెల్ ధర తగ్గినా ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ల పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తులపై ధరలు తగ్గించలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ విధిస్తున్న వ్యాట్ డీజీల్‌పై 26%, పెట్రోల్‌పై 33.32 శాతం అధికమని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలపై భారం తగ్గిస్తామన్నారు. విద్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, సర్వశిక్షా అభియాన్ కింద చేసిన కేటాయింపుల్లో సగం నిధులను మాత్రమే ఖర్చు చేసిందన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, 19 లక్షల మందిని నిరుద్యోగులను చేశారని జితిన్ విమర్శించారు. -
రాజధానిలో స్తంభించిన రవాణా..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆటోలు, ట్యాక్సీలు నిలిచిపోయాయి. ట్రక్ డ్రైవర్ల సమ్మెతో పాటు పెట్రోల్ డీలర్ల సమ్మెతో రవాణా వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవడంతో సోమవారం సమ్మెకు పిలుపు ఇచ్చామని ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన తప్పుడు రవాణా విధానాలతో ఆటో రిక్షా, ట్యాక్సీ డ్రైవర్లు తమ ఉపాధిని కోల్పోతున్నారని, యాప్ ఆధారిత క్యాబ్ సేవలు తమ ఉపాధిని దెబ్బతీశాయని సింగ్ చెప్పారు. మరోవైపు రవాణా సమ్మెతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిరాకరించినందుకు నిరసనగా దేశ రాజధానిలో 400కు పైగా పెట్రోల్ పంపులను మూసివేయాలని పెట్రోల్ పంపుల యజమానులు నిర్ణయించడం పరిస్థితిని మరింత దిగజార్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ 2.50 మేర సుంకాన్ని తగ్గించిన క్రమంలో యూపీ, హర్యానాలు సైతం వ్యాట్‌ను తగ్గించి ఊరట కల్పించాయని, ఢిల్లీ ప్రభుత్వం మాత్రం వ్యాట్‌ను తగ్గించేందుకు నిరాకరిస్తోందని ఢిల్లీ పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నిశ్చల్ సింఘానియా ఆందోళన వ్యక్తం చేశారు. -
బిగ్ రిలీఫ్
-
ప్రధాన ఆదాయ వనరుకు వ్యాపారుల చిల్లు..!
సాక్షి, హైదరాబాద్ : వాణిజ్య పన్నుల శాఖలో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. జీఎస్టీ అమలుకు ముందు ఉన్న బకాయిలు చెల్లించేందుకు వ్యాపారులు మొండికేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వసూలయ్యే పన్నులు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి మొత్తం 12 డివిజన్లు, 232 సర్కిళ్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి రూ.39,261.40 కోట్ల పన్నులు విధించగా రూ.37,856.83 కోట్ల మేర వ్యాపారులు చెల్లించారు. ఇంకా రూ.1,404.56 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. జీఎస్టీకి ముందు రాష్ట్రవ్యాప్తంగా 2,19,561 మంది డీలర్లు ఉన్నారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవ పన్ను(జీఎస్టీ)ని 2017, జూలై ఒకటి నుంచి అమలు చేస్తోంది. గతంలో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను), టీఓటీ (టర్నోవర్ ట్యాక్స్), సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్‌లను ప్రభుత్వం వసులు చేసేవి. ఈ పన్నులన్నీ రద్దు చేసి కొత్తగా వస్తు సేవ పన్ను(జీఎస్టీ)ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పన్ను విధానాన్ని ఐదు శ్లాబ్లుగా విభజించారు. ఇందులో 5, 8, 12, 28, 40 శాతం పన్నులు ఉంటాయి. జీఎస్టీ విధానంతో వ్యాపారాల్లోనూ మార్పులు వస్తున్నాయి. ప్రతీ డీలర్ ఆన్లైన్లో అన్ని వివరాలను నమోదు చేస్తున్నారు. ప్రతినెలా 25న ఆన్లైన్లో వివరాలను పొందుపరిచి పన్నులు చెల్లిస్తున్నారు. నో రైడ్స్.. జీఎస్టీ అమలుకు ముందు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వ్యాపార సంస్థల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించగా ప్రస్తుతం అలాంటివేవీ కనిపించడం లేదు. దీంతో పాత బకాయిలు వసూలు కావడంలేదు. గతంలో పన్నులు చెల్లించకుంటే వ్యాపారస్తులకు సంబంధించిన సీ ఫాంలు నిలిపివేసేవారు. దేశమంతా ఒకే పన్ను విధానం ఉండడంతో సీ ఫాంలు అవసరం లేకుండాపోయాయి. వ్యాపారులపై వాణిజ్య పన్నుల శాఖకు ఎలాంటి పెత్తనం లేకపోవడంతో బకాయిలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. ప్రత్యేక బృందాలు.. పాత బకాయిలను వసూలు చేసేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. డివిజన్, సర్కిల్ స్థాయిల్లో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మొండి బకాయిలను వసూలు చేయనున్నారు. -వరంగల్ రూరల్ నుంచి గజవెళ్లి షణ్ముఖరాజు -
సౌదీ, యూఏఈలో తొలిసారి వ్యాట్
దుబాయ్: ఇంతవరకూ పన్ను రహిత దేశాలుగా పేరుపడ్డ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లు గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చాయి. సౌదీ అరేబియా కొత్త సంవత్సర కానుకగా.. పెట్రోల్ ధరల్ని అమాంతం 127 శాతం పెంచింది. ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రపంచ ధరల్లో మాంద్యం కారణంగా ఏర్పడ్డ బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు గత రెండేళ్లుగా గల్ఫ్‌లోని ముడిచమురు ఉత్పత్తి దేశాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా వ్యాట్‌ను అమల్లోకి తెచ్చారు. అధిక శాతం వస్తువులు, సేవలకు వర్తించే ఐదు శాతం అమ్మకం పన్నుతో రెండు ప్రభుత్వాలు 2018లో 21 బిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. -
నో మోర్ టాక్స్ ఫ్రీ: ఇక బాదుడే..!
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. టాక్స్ ఫ్రీ అనే మాటకు ఈ రెండు గల్స్ దేశాలు చరమ గీతం పలికాయి. ఇప్పటివరకు ఎలాంటి పన్నులు లేకుండా ఉన్న గల్ఫ్ దేశాల్లో తొలిసారిగా విలువ ఆధారిత పన్ను(వ్యాట్) అమల్లోకి రానుంది. దీని ద్వారా రెండు ప్రభుత్వాలు 2018 నాటికి 21 బిలియన్ డాలర్లను ఆర్జించాలని ప్రణాళిక వేశాయి. తద్వారా జీడీపీలో 2 శాతం వృద్ధి సాధించనున్నట్టు అంచనా వేశాయి. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగులు, కార్మికులపై ఈ ప్రభావం పడనుంది. ఇటీవలికాలంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనమవడంతో గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. బడ్జెట్ లోటుకు దారితీసింది. దీంతో గత రెండు సంవత్సరాల్లో ఆదాయం పెంచడం, వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టిన ఆయిల్ దేశాలు కొత్త ఏడాది తొలిరోజు (సోమవారం) నుంచి వ్యాట్ అమలు చేయనున్నాయి. మొదటి సంవత్సరంలోఆదాయం సుమారు 12 బిలియన్ దిర్హామ్‌లు (3.3 బిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా వేసింది. దీని ద్వారా సౌదీ ప్రభుత్వానికి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల వృద్ధికి సహాయపడుతుందని షాహారా (కౌన్సిల్) కౌన్సిల్ సభ్యుడు మహ్మద్ అల్-ఖునిజీ చెప్పారు. తాజా ఆదేశాల ప్రకారం ఇక అక్కడివారు వివిధ వస్తువులు, సేవలపై సేల్స్ టాక్స్ 5 శాతం చెల్లించాలి. ముఖ్యంగా ఆహారం, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, గ్యాసోలిన్, ఫోన్, నీరు, విద్యుత్ బిల్లులు, హోటల్ రిజర్వేషన్లులాంటి వాటిపై ఈ పన్నును విధించనుంది. అయితే మెడికల్, బ్యాంకులు, ప్రభుత్వ రవాణాను దీన్నుంచి మినహాయింపు ఇవ్వనుందని తెలుస్తోంది. మరోవైపు ఇతర నాలుగు గల్ఫ్ రాష్ట్రాలు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్ కూడా వ్యాట్ ను విధించాలని యోచిస్తోన్నాయి. 2019 ప్రారంభంలో ఈ పన్ను బాదుడుకు శ్రీకారం చుట్టనున్నాయని సమాచారం. -
పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం తాజా ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్‌ను తగ్గించాలంటూ కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. వినియోగదారులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ఆదేశించారు. ''పలు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. మరోసారి మేము అభ్యర్థిస్తున్నాం. ఎక్కువ మొత్తంలో వ్యాట్‌ను కలిగి ఉన్న రాష్ట్రాలు, వినియోగదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని పన్ను రేట్లను తగ్గించాలి'' అని మంత్రి చెప్పారు. అంతేకాక పెట్రోలియం రంగాన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ పరిధిలోకి తీసుకురానున్నట్టు కూడా తెలిపారు. అంతర్జాతీయ ధరల ప్రభావంతో ఇటీవల విపరీతంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పెంపుదలను నియంత్రణలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. లీటరు పెట్రోల్‌కు 21.48గా ఉన్న ఎక్సైజ్ డ్యూటీని రూ.19.48కు తీసుకొచ్చింది. అదేవిధంగా డీజిల్‌పై రూ.17.33గా ఉన్న ఎక్సైజ్ డ్యూటీని రూ.15.33కు కుదించింది. ఈ తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు అందించాలని, అన్ని రాష్ట్రాలు వ్యాట్ల్లో కోత పెట్టాలని కేంద్రం అంతకముందే ఆదేశించిన సంగతి తెలిసిందే. -
పెట్రోల్ ధరలు దిగి రావాల్సిందే...
-
5 శాతం వ్యాట్ తగ్గించండి
న్యూఢిల్లీ: సామాన్యునికి మరింత ఊరట కలిగించేలా ఇంధన ధరలపై వ్యాట్ లేదా అమ్మకం పన్నును 5 శాతం తగ్గించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు త్వరలోనే లేఖలు రాయనున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం వెల్లడించారు. ‘మేం చొరవ తీసుకుని డీజిల్, పెట్రోల్ ఎక్సైజ్ సుంకాన్ని కుదించాం. ఇక రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించే సమయమొ చ్చింది. కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రాలు వ్యాట్ లేదా అమ్మకం పన్నును తగ్గించాలని కోరుతున్నాం. ఇంధనం నుంచి లభిస్తున్న ఆదాయంలో ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నది రాష్ట్రాలే. వ్యాట్‌కు అదనంగా, కేంద్ర ఎక్సైజ్ వసూళ్లలో 42 శాతం వారి ఖాతాలోకే చేరుతోంది’ అని ప్రధాన్ తెలిపారు. రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై 26–38% వ్యాట్ విధిస్తున్నాయి. వ్యాట్‌ను కుదించడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్రాలను కోరారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం లీటరుకు రూ.2 చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే. రూ.2.50 తగ్గిన పెట్రోల్ కేంద్రం ఎక్సైజ్ సుంకంలో కోత విధించిన నేపథ్యంలో బుధవారం పెట్రోల్ ధర లీటరుకు రూ.2.50, డీజిల్ రూ.2.25 మేర తగ్గాయి. రాజ ధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.68.38కి, డీజిల్ ధర రూ.58.69కి చేరినట్లు ఐఓసీ తెలిపింది. -
జీఎస్టీ షురూ..
♦ అమల్లోకి వచ్చిన నూతన విధానం ♦ పన్నులపై వినియోగదారుల ఆరా ♦ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లో సదస్సులు సాక్షి, వరంగల్ రూరల్: జీఎస్టీ అమలు విధానం ప్రారంభమైంది. నిన్నటి వరకు విలువ ఆధారిత పన్ను(వ్యాట్), టర్నోవర్ ట్యాక్స్, వినోదపు పన్ను, లగ్జరీ ట్యాక్స్ రూపంలో రాష్ట్రం, సెంట్రల్ ఎక్సైజ్, అడిషనల్ సెంట్రల్ ఎక్సైజ్, సర్వీసు ట్యాక్స్ రూపంలో కేంద్రప్రభుత్వం పన్నులు వసూలు చేసేవి. అయితే ఈ పన్నులన్నీ రద్దయి వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలులోకి వచ్చింది. దేశ వాణిజ్య విధానం ఇన్నాళ్లు వేర్వేరుగా ఉండేది. ఇప్పుడు జీఎస్టీ అమలులోకి రావడంతో ఆ పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నా రు. పన్నుల విధానాన్ని ఏడు రకాలుగా విభజించారు. దీంతో శనివారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వ్యాపార సంస్థల యాజమాన్యాలు జీఎస్టీ పన్నుతో కూడిన బిల్లులను వినియోగదారులకు అందించారు. ఇక వినియోగదారులు తమపై ఎంత మేరకు జీఎస్టీ భారం పడుతుందని ఆసక్తిగా తెలుసుకోవడం కనిపించింది. కార్యాలయాల్లో.. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖల సర్కిల్ కార్యాలయాల్లో అధికారులు జీఎస్టీకి స్వాగతం పలుకుతూ శనివారం కేక్ కట్ చేశారు. ఆ తర్వాత వివిధ వ్యాపార సంస్థల డీలర్లు, సిబ్బందితో సమావేశం అయ్యారు. జీఎస్టీపై వారికి అవగాహన కల్పించడంతో పాటు పలు సూచనలు చేశారు. జీఎస్టీ కొత్త నిబంధనలను వివరించారు. సీటీఓ ఆఫీస్‌లో.. కరీమాబాద్: ‘ఒక దేశం, ఒక పన్ను, ఒక మార్కెట్..’ విధానంతో దేశ చరిత్రలో ప్రతిష్టాత్మక గూడ్స్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) శనివారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు వరంగల్ హంటర్‌రోడ్డులోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం(సీటీఓ)లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఏసీ, సీటీఓ నేహా కేక్ కట్ చేసి ఉద్యోగులు, డీలర్లకు అందజేశారు. కార్యక్రమంలో సీటీఓలు, ఏసీటీఓలు, డీసీటీఓలతో పాటు వివిధ వ్యాపార సంస్థల డీలర్లు పాల్గొన్నారు. -
శ్రీశైలంపై జీఎస్టీ పిడుగు!
· దేవస్థానానికి వచ్చే రాబడి, వసూళ్లపై ట్యాక్స్ ? · అన్నదాన నిర్వహణ, ఉచిత ప్రసాదాలపై ప్రభావం · ముడిసరుకులు, ఇతరత్రా కోసం ఏటా రూ. 25కోట్లకు పైగా కొనుగోళ్లు · ఇప్పటి వరకు వ్యాట్ ద్వారా మినహాయింపు · జీఎస్టీ వస్తే ట్యాక్స్ కట్టాల్సిందే · ప్రత్యేక దర్శన, ఆర్జితసేవా టికెట్లపై కూడా పన్ను · దేవస్థానాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు లేదన్న ఆర్థిక మంత్రి జైట్లీ శ్రీశైలం: జీఎస్టీ (వస్తుసేవల పన్ను) భారం శ్రీశైల దేవస్థానంపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమల తిరపతి దేవస్థానం తరువాత అత్యధిక ఆదాయం కలిగిన క్షేత్రంగా శ్రీశైలం పేరొందింది. ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాబడి, ఆదాయం.. తదితర వాటిపై పన్ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. వ్యాట్ (వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్) చట్టం.. 2003లో అమలులోకి వచ్చింది. అయితే మతపరమైన ధార్మిక సంస్థలకు పన్ను మినహాయింపును ఇచ్చారు. దీంతో ఆయా దేవస్థానాలకు పన్ను కట్టాల్సిన భారం లేకుండా పోయింది. అయితే జూలై నుంచి అమలులోకి వస్తుందనుకుంటున్న జీఎస్టీపై గత ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ..వివరణ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఇతర ఏ దేవస్థానాలకు కూడా పన్ను కట్టే విషయంలో సడలింపు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలులోకి వస్తే అన్ని దేవస్థానాలు, తప్పనిసరిగా పన్నులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల రాబడి తగ్గడంతో పాటు అదనపు ఆదాయం కోసం ఆ భారాన్ని భక్తులపై వేసే అవకాశం కూడా కనిపిస్తోంది. దర్శన ఆర్జితసేవలపై.. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక, అతిశీఘ్ర దర్శనాలు, అభిషేకాది ఆర్జిత సేవా టికెట్లపై కూడా జీఎస్టీ బాదుడు కనిపించనుంది. గత ఏడాది మల్లన్న అభిషేకాది ఆర్జితసేవలు, ఇతర పూజలు, వ్రతాలు, కల్యాణోత్సవం.. తదితర వాటిపై రూ. 58 కోట్లకు పైగా ఆదాయం లభించింది. అలాగే దేవస్థానం భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన వసతి గదులు, సత్రాలు, కాటేజీలు, ఇతర భవనాల అద్దె మొదలైన వాటి ద్వారా 2016–17 సంవత్సరంలో సుమారు రూ. 6.50 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఇవే కాకుండా దేవస్థానం టోల్గేట్, తలనీలాల వేలాలు, కొబ్బరి చిప్పల విక్రయం, దుకాణాల అద్దెలు మొదలైన వాటి ద్వారా రూ. 13 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వార్షికంగా శ్రీశైల దేవస్థానానికి పలు మార్గాల ద్వారా గత ఏడాది రూ. 250 కోట్లకు పైగా రాబడి లభించింది. దాతలు ఇచ్చే విరాళాలు.. ఇంకా ఎన్నో మార్గాల ద్వారా వచ్చే రాబడిపై జీఎస్టీ భారం పడితే కనీసం 12 శాతం నుంచి గరిష్టంగా 18 శాతం వరకు దేవస్థానం పన్ను చెల్లించాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉచిత భోజన పథకానికి కష్టాలు.. దేవస్థానం ఎన్నో ఏళ్లుగా ఉచిత భోజన పథకాన్ని అమలు చేస్తోంది. దాతల విరాళాలను ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంచి వాటి ద్వారా వచ్చే వడ్డీతో అన్నదానాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం ముడిసరుకులైన కాయగూరలు, పాలు, పెరుగు, నెయ్యి, వంటగ్యాస్ తదితరాలకు.. రూ. కోట్లలో ఖర్చు చేస్తోంది. గత ఏడాది రూ.5.32 కోట్లకు పైగా వ్యయం చేసింది. జీఎస్టీ అమలైతే ఆయా ముడి సరుకులను బట్టి 12 శాతం నుంచి సుమారు 28 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంది. దీంతో ఉచిత భోజన పథాకానికి కష్టాలు వచ్చినట్లేనని అంటున్నారు. మల్లన్న ప్రసాదాలపై.. శ్రీశైల దేవస్థానం.. లాభాపేక్ష లేకుండా నష్టాలను భరిస్తూనే భక్తులకు నాణ్యమైన లడ్డూ ప్రసాదాలను అందజేస్తోంది. ఇందు కోసం గత ఏడాది రూ.18 కోట్ల వరకు ముడిసరుకులను కొనుగోలు చేశారు. ఇతర ఆర్జితసేవలు, పూజా సామగ్రి, ప్రసాద వితరణ కోసం సుమారు రూ. 2.60 కోట్లకు పైగా వ్యయం చేశారు. వీటన్నింటిపై కూడా ట్యాక్స్ పడితే ప్రసాదాల నిర్వహణ ఎలా అనే విషయంపై దేవస్థానం ఇప్పటికే ఆలోచనలో పడింది. పూర్తిస్థాయిలో సమాలోచన చేస్తున్నాం: నారాయణ భరత్‌గుప్త, ఈఓ వచ్చే నెల నుంచి అమలు కానున్న జీఎస్టీ విషయంలో ఉన్నతస్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి. లాభనష్టాలతో సంబంధం లేకుండా భక్తుల సౌకర్యం కోసం నిర్వహించే పథకాల అమలు విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటాం. జీఎస్టీ, ఇతర ఆర్థిక వ్యవహరాల పర్యవేక్షణకై చీఫ్ ఫైనాన్సియర్ అడ్వైజర్‌ను శ్రీశైలదేవస్థానంలో నియమించుకున్నాం. జీఎస్టీ చట్టాన్ని అనుసరించి విధి విధానాలను రూపొందించే ప్రయత్నంలో ఉన్నాం. -
రైతులను తెరపైకి తెచ్చి..
► డిమాండ్ నోటీసుల జారీకి ‘విజిలెన్స్’ సమాయాత్తం ► ఎగవేసిన పన్ను చెల్లించకుంటే కేసులేనంటున్న అధికారులు సాక్షి, నిజామాబాద్: అడ్డగోలుగా వ్యాట్, సీఎస్టీ ఎగవేసిన వర్ని బ్రోకర్లు రైతులను తెరపైకి తెచ్చి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రూ.లక్షల్లో ఎగవేసిన పన్నును వసూలు చేసేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉచ్చు బిగిస్తుండటంతో ఈ బ్రోకర్లు అడ్డదారులు వెతుకుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన రికార్డులు విజిలెన్స్ అధికారులు తీసుకెళ్లడంతో తాము రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడానికి వీలు కుదరడం లేదనే సాకు చెబుతుండటం విమర్శలకు దారితీస్తోంది. విజిలెన్స్,ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన రోజు మే 23 నాడే ఈ బ్రోకర్ల వద్ద స్వాధీనం చేసుకున్న రికార్డులకు సంబంధించిన జిరాక్స్ కాపీలను వారికి ఇచ్చేశామని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సంబంధిత బ్రోకర్లే సంతకాలు పెట్టి మరీ ఈ రికార్డుల జిరాక్స్ కాపీలు తీసుకెళ్లారని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కేఆర్ నాగరాజు ‘సాక్షి’తో పేర్కొన్నారు. నేతలతో ఒత్తిళ్లు.. వర్ని, కోటగిరి, బోధన్, బాన్సువాడ తదితర మండలాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని అక్రమంగా సరిహద్దులు దాటించిన ఎనిమిది మంది వర్ని బ్రోకర్లకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే సుమారు రూ.56 లక్షలు పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన ఆ విభాగం ఈ మేరకు వారి వద్ద పన్ను వసూలు చేసే చర్యలకు ఉపక్రమించింది. త్వరలో వీరికి డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు విజిలెన్స్ విభాగం రంగం సిద్ధం చేస్తోంది. ప్రాథమికంగా తేలింది రూ.56 లక్షలే అయినప్పటికీ వీరు ఎగవేసిన వ్యాట్, సీఎస్టీ రూ.కోటికిపైగా ఉంటుందని విజిలెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ రవాణా చేసిన ఈ బ్రోకర్లు విజిలెన్స్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. రైతుల ప్రయోజనం కోసం వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేశారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎగవేసిన ఈ పన్ను వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేయాలని ఫోన్లు చేయిస్తున్నట్లు సమాచారం. అధికారుల అలసత్వమే కారణమా? రూ.కోట్లు విలువ చేసే ధాన్యం యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం రెండు నెలల క్రితం చూసీ చూడనట్లు వదిలేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాంటి లైసెన్సులు లేకుండా.. పైసా పన్ను చెల్లించకుండా.. రూ.కోట్లు విలువ చేసే ధాన్యాన్ని నిత్యం వందలాది లారీల్లో అక్రమ రవాణా చేస్తుంటే సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కళ్లుమూసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. ఈ లారీలు ఏకంగా జిల్లాలు, ఇతర రాష్ట్ర సరిహద్దులు దాటి కర్నాటకకు రవాణా అవుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. కాగా అప్పట్లో ట్యాక్స్ పేరుతో వీరి వ్యాపారాన్ని అడ్డుకట్ట వేస్తే ఈ ధాన్యమంతా సర్కారు కొనుగోలు కేంద్రాలకు పోటెత్తే అవకాశాలుండటంతో జిల్లా అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టకేలకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం దృష్టి సారించడంతో ఈ బాగోతం తెరపైకి వచ్చినట్లుయింది. -
పెట్రోల్ ధర రూ.3 పెంపు..ఎక్కడ?
ముంబై: ముంబై వాహనదారులకు మహారాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి పెట్రోల్ ధరలను పెంచేసింది. ఇంధనంపై అదనపు పన్నును(వ్యాట్) పెంచిన నేపథ్యంలో రిటైల్ మార్కెట్లలో పెట్రోలు ధర లీటరుకు 3రూపాయలు పెంచింది. అయితే డీలర్ ధరను మాత్రం యథాతథంగా ఉంచింది. ఫలితంగా ముంబై, థానే పెట్రోలు వినియోగదారులకు రూ. ప్రస్తుత పన్ను రేటు 26శాతం ప్లస్ 9 రూపాయల భారం పడుతోంది. కాగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఇది 25 శాతం ప్లస్ రూ. 9 రూపాయలుకు పెరిగింది. అయితే డీజిల్ ను వ్యాట్ నుంచి మినహాయించింది. దీంతో మెట్రోపాలిటన్ రీజన్, ఇతర ప్రాంతాలలో డీజిల్ ధరలే యథాతథంగా ఉండనున్నాయి. కాగా ఇటీవల లీటర్ పెట్రోల్ ధరలను రూ. 3.77లు తగ్గించింది. అలాగే డీజిల్ ధరను రూ. 2.91లు తగ్గించింది. గత మూడు నెలలకాలంలో పెట్రోల్ ధరలను పెంచడం ఇదే మొదటి సారి. -
ప్రభుత్వ ఉద్యోగికి రెండేళ్ల జైలు
కర్నూలు(లీగల్): ఓ వ్యాపారి నుంచి వ్యాట్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఉద్యోగికి రెండేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ కర్నూలు ఏసీబీ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. వైఎస్సార్ జిల్లా కడప నగరంలో వ్యాపారి కృష్ణమోహన్‌రెడ్డికి అవసరమైన వ్యాట్ సర్టిఫికెట్‌ను ఇవ్వాలని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సంప్రదించాడు. ఇందుకు రూ.1500 లంచం ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ ఎల్.జితేంద్ర డిమాండ్ చేశారు. దీంతో వ్యాపారి 2014 జూన్ నెలలో కడప ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వలపన్ని సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకుని కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగా కేసు విచారణలో అవినీతి అధికారిపై నేరం రుజువు కావడంతో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె.సుధాకర్ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున పీపీ భగవాన్‌రెడ్డి వాదించారు. -
జీఎస్టీతో దేశమంతా ఒకే ధర..ఒకే పన్ను
వాణిజ్యపన్నుల అధికారి(కర్నూలు) పి. నాగేంద్రప్రసాద్ వెల్లడి కర్నూలు(హాస్పిటల్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే జీఎస్టీ అమల్లోకి వస్తే దేశమంతా ఒకే ధర...ఒకే పన్ను ఉంటుందని వాణిజ్యపన్నుల అధికారి(కర్నూలు) పి. నాగేంద్రప్రసాద్ చెప్పారు. జీఎస్టీ పన్నుపై సోమవారం స్థానిక మామిదాలపాడు రోడ్డులోని ఓ హోటల్లో సెంట్రల్ ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ వ్యాట్ స్థానంలో త్వరలో జీఎస్టీ అమల్లోకి రానుందన్నారు. ప్రస్తుతం వివిధరాష్ట్రాల్లో ఒక్కో వస్తువుపై ఒక్కో విధంగా పన్నులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 24వ తేదీ వరకు వాణిజ్యపన్నులు, పాతబకాయిలు పాతనోట్ల ద్వారానే వ్యాపారులు, డీలర్లు చెల్లించవచ్చన్నారు. సమావేశంలో సెంట్రల్ ఎక్సైజ్ శాఖ నుంచి సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ ఏసీలు, వాణిజ్యపన్నుల శాఖ నుంచి ఏసీలు, సీటీఓలు, డీసీటీఓలు, ఏసీటీఓలు పాల్గొన్నారు. డీలర్ల వివరాలు అప్లోడ్ చేయండి జిల్లాలోని అధీకృత డీలర్లు తమ వివరాలను ఎSఖీN పోర్టల్‌లో జనవరి ఒకటి నుంచి 15వ తేది వరకు అప్లోడ్ చేసుకోవాలని వాణిజ్యపన్నుల శాఖ అధికారి నాగేంద్రప్రసాద్ చెప్పారు. డీలర్లు వారి స్టేట్/సెంట్రల్ అధికారుల నుంచి పొందిన ప్రొవిజనల్ ఐడీ, పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ ¯ð ంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ తిరిగి అప్లోడ్ చేయాలని సూచించారు. -
పేదల వస్తువులపై పన్ను భారం ఉండొద్దు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయం: ఈటల సాక్షి, న్యూఢిల్లీ: పేదలు వాడే వస్తువులపై అధిక పన్ను భారం ఉండొద్దని దాదాపు అన్ని రాష్ట్రాలు అభిప్రాయం వ్యక్తం చేశాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 4వ సమావేశంలో ఈటల పాల్గొన్నారు. అనంతరం సమావేశం వివరాలను వెల్లడించారు. రాష్ట్రాల ఆదాయాలు తగ్గకుండా ఉండే పద్ధతులు, నష్టపరిహారం అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాల్లో గతంలో 5 శాతం వ్యాట్ ఉన్న అన్ని వస్తువులపై జీఎస్టీలో యథాతథంగా 5 శాతం పన్నులు విధించాలని నిర్ణయించినట్లు చెప్పారు.9 నుంచి 15 శాతం మధ్య పన్ను ఉన్న వస్తువులపై 12 శాతం పన్నులు వసూలు చేసేందుకు కౌన్సిల్ ఆమోదించిందన్నారు. బంగారం, వజ్రాలు మినహా అన్ని వస్తువులపై పన్ను 5, 12, 18, 28 శాతాలుగా విధించడానికి అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని చెప్పారు. గతంలో 40 నుంచి 45 శాతం పన్ను ఉన్న వస్తువులపై జీఎస్టీ ద్వారా 28 శాతం పన్ను విధించాలని నిర్ణయించినందున రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని సమకూర్చేందుకు ఆ వస్తువులపై సెస్ విధించి నష్టాన్ని కొంత మేర భర్తీ చేయాలని నిర్ణయించారని చెప్పారు. పొగాకు సంబంధిత వస్తువులపై పన్ను శాతం తగ్గించాలని నిర్ణయించినందున వాటిపై కూడా సెస్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైన్... ఇక చౌక!
రాష్ట్రంలో వైన్‌పై వ్యాట్‌ను 150 శాతం నుంచి 70 శాతానికి తగ్గించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో విక్రయించే దేశీయ తయారీ వైన్ చౌకగా లభించనుంది. వైన్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ప్రభుత్వం భారీగా తగ్గించింది. దేశంలో తయారయ్యే వైన్ మీద వాణిజ్య పన్నుల శాఖ 150 శాతం పన్ను విధిస్తుండగా, దానిని 70 శాతానికి తగ్గించింది. అలాగే వైన్ మీద ఎక్సైజ్ డ్యూటీ, దేశీయ తయారీ పన్నులను కూడా క్రమబద్ధీకరించింది. రూ. 2 వేల లోపు ధర గల కార్టన్ (కేసు) వైన్ ప్రాథమిక ధరపై 28% ఉన్న ఎక్సైజ్ డ్యూటీని ఏకంగా 90 శాతానికి పెంచింది. కాగా ఇప్పటి వరకు రూ. 2 వేలకు పైబడిన వైన్ కేసు ప్రాథమిక ధరపై 15% లేదా రూ. 560లలో గరిష్టంగా ఉన్న మొత్తాన్ని ఎక్సైజ్ డ్యూటీగా విధిస్తున్నారు. దానిని క్రమబద్ధీకరించి రూ. 2 వేల నుంచి రూ. 3 వేలు గల వైన్ కేసు ప్రాథమిక ధరపై 15% లేదా రూ.1,800లలో గరిష్ట మొత్తాన్ని ఎక్సైజ్ డ్యూటీగా విధించనున్నారు. ఇక రూ. 3వేల పైబడి ధర గల వైన్ కార్టన్ల ప్రాథమిక ధరలపై 10% పన్ను లేదా రూ. 450 లలో గరిష్ట మొత్తాన్ని పన్నుగా విధించనున్నారు. అంటే ఎక్కువగా విక్రయించే తక్కువ ధర గల వైన్ ఉత్పత్తులపై పన్నును పెంచిన ప్రభుత్వం అధిక ధర గల వైన్ తయారు చేసే కంపెనీలకు పన్ను తగ్గించింది. దీంతో వ్యాట్ సగానికి పైగా తగ్గినా సర్కార్ ఆదాయానికి ఢోకాలేని పరిస్థితి. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా దేశంలో పూర్తి ద్రాక్ష పండ్లతో తయారయ్యే వైన్ బాటిళ్ల ఎంఆర్పీ ధరలు 30 నుంచి 35% వరకు తగ్గనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ తెలిపారు. ఫోర్ట్‌ఫైడ్ వైన్ ధర సీసాకు రూ. 5 పెరుగుతాయని వివరించారు. -
మందుల ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి
– ఎక్సైజŒ టాక్స్, వ్యాట్‌ను ఎత్తివేయాలి – మెడికల్ రిప్స్ యూనియన్ డిమాండ్ ఒంగోలు టౌన్ : ప్రజలు వాడుకునే మందుల ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈ గిరి డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ పిలుపుమేరకు మందులకు సంబంధించిన ధరలపై జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన నిత్యావసర, అత్యవసర మందులపై ఎక్సైజŒ టాక్స్, వ్యాట్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ ఫార్మా కంపెనీలను కాపాడాలన్నారు. హిందూస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్‌ను మూసివేయాలన్న ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఆన్లైన్ ద్వారా మందుల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తయారీ ఖర్చులకు అనుగుణంగా మందుల ధరలు ఉండాలన్నారు. మందుల తయారీలో జరుగుతున్న లోపాలను గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు కొండారెడ్డి మాట్లాడుతూ విదేశీ కంపెనీల ఆధిపత్యాన్ని భారత ఫార్మా రంగంపై పడకుండా చూడాలన్నారు. ఈ థర్నాలో సీఐటీయూ నగర అధ్యక్షుడు దామా శ్రీనివాసులు, కార్యదర్శి బి.వెంకట్రావు, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ జిల్లా నాయకులు కె.వి.శేషారావు, ఐ.కె. కృష్ణమోహన్, సీహెచ్ చిరంజీవి, ఎం.నాగరాజు, అంజిరెడ్డి, బాషా, మాధవ, ఎ.మూర్తి తదితరులు పాల్గొన్నారు. తొలుత స్థానిక ఏనుగుచెట్టు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. -
ప్రజలకు 'అచ్చేదిన్ బదులు చచ్చేదిన్'..
హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం పెంచిన వ్యాట్ లను ఉపసంహరించుకోవాలని ఏపీసీసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ మాజీ సభ్యుడు డా.ఎన్. తులసిరెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 2019 ఎన్నికల్లో కేంద్రలోని ఎన్డీఏ ప్రభుత్వం 'ముక్త భారత్', టీడీపీ ప్రభుత్వం 'ముక్త ఆంధ్రా'గా మారక తప్పదని, ప్రజలు 'అచ్చేదిన్ బదులు చచ్చేదిన్'లను చవిచూస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఇందిరాభవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు సూర్యానాయక్ తో కలిసి పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆరు వారాల్లో నాలుగు సార్లు పెంచడం దారుణమన్నారు. మన దేశ అవసరాలలో దాదాపు 75 శాతం వరకు పెట్రోలు, డీజిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2013లో అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ముడి చమురు ధర 140 డాలర్లుగా ఉన్నప్పుడు దేశంలో పెట్రోలు ధర రూ.60, డీజిల్ ధర రూ.50 ఉండేదన్నారు. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 49.29 డాలర్లు ఉంది. ఆ ప్రకారం ఇక్కడ లీటర్ పెట్రోలు ధర రూ.22, డీజిల్ ధర రూ.18 గా ఉండాలని కానీ, మోదీ, చంద్రబాబుల జోడీ పాలనలో పెట్రోలు ధర రూ.70, డీజిల్ ధర రూ.60లుగా ఉండటం విడ్డూరమన్నారు. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య దళారీలుగా వ్యవహరించడమేనని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై ఆరుసార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. చంద్రబాబు ప్రభుత్వం 2015 మార్చి 1 నుంచి నాలుగు రూపాయల వ్యాట్ అదనంగా విధించి ప్రజలపై మరింత భారం మోపిందన్నారు. దీని ద్వారా గత రెండేళ్లలో మోదీ, బాబు ప్రభుత్వాలు దాదాపు రూ.3 లక్షల కోట్లను ప్రజల నుంచి దోచుకున్నారని మండిపడ్డారు. మోదీ, బాబు ప్రభుత్వాలు అదనంగా విధించిన ఎక్సైజ్ సుంకాన్ని, వ్యాట్ లను ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. -
పెట్రో ట్యాంకర్ల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై 14.5 వాల్యూ యాడెడ్ ట్యాక్స్(వ్యాట్) విధించడాన్ని నిరసిస్తూ చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు తెలంగాణ పెట్రోలియం ట్యాంకర్ల ఓనర్స్ అసోసియేషన్ సోమవారం సాయంత్రం ప్రకటించింది. పన్ను మినహాయింపుపై చర్చించేందుకు ప్రధాన చమురు సంస్థల ప్రతినిధులు మంగళవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌మిశ్రాతో సమావేశం కానున్నారు. సమ్మె ఫలితంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన ఏడు టెర్మినల్స్ నుంచి సుమారు మూడు వేల ట్యాంకర్లు కదలలేదు. చమురు సంస్థల అధికారులు ట్యాంకర్ల ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పెట్రో ఉత్పత్తుల రవాణాపై వ్యాట్‌ను భరించడంతోపాటు బకాయిలు చెల్లించేందుకు చమురు సంస్థలు అంగీకరించాయి. దీంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ట్యాంకర్ల ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. కాగా, చమురు సంస్థల ప్రతినిధులు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌తో సమావేశమయ్యారు. పెట్రో ఉత్పత్తులపై రవాణా పన్ను భరించేందుకు హామీ ఇవ్వడంతో ట్యాంకర్ల ఓనర్స్ సమ్మె విరమించారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. పన్నులో మినహాయింపు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశం ఏర్పాటుకు అనిల్ కుమార్ అంగీకరించారు. -
రేపు అర్ధరాత్రి నుంచి.. పెట్రో ట్యాంకర్ల సమ్మె
పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై ప్రభుత్వం 14.5 శాతం వ్యాట్ విధించినందుకే.. వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ మద్దతు ప్రకటించిన డీలర్స్ అసోసియేషన్ జూన్ 5 నుంచి సొంత ట్యాంకర్లనూ నిలిపేస్తాం: టీపీడీఏ హైదరాబాద్: పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం 14.5 శాతం వ్యాట్ విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ అసోసియేషన్ ఈ నెల 29 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (టీపీడీఏ) మద్దతు పలికింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ (హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీడీఏ అధ్యక్షుడు ఎన్. దినేశ్‌రెడ్డి, ఆల్ ఇండియా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి రాజీవ్ అమరం, తెలంగాణ పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు కె. రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆరీఫ్- ఉల్-హుస్సేన్‌లు మాట్లాడారు. సమాజాభివృద్ధికి ఇంధనం ఎంతో కీలకమని... పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై ప్రభుత్వం 14.5 వ్యాట్ విధించడం సరికాదని...వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రవాణా బంద్ వల్ల జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన, విధించబోయే పన్నులను చమురు కంపెనీలే భరించాలని, రవాణా, కాంట్రాక్ట్‌దారులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాము ఇప్పటికే తక్కువ ధరకు పెట్రోలియం రవాణా టెండర్లను దక్కించుకున్నామని...అటువంటి తమపై వ్యాట్ విధింపు సరికాదన్నారు. రాష్ట్ర సమస్యలపై మానవత్వంతో స్పందించే సీఎం కేసీఆర్ పెట్రోలియం రవాణాపై విధించిన వ్యాట్‌ను తగ్గించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ పెట్రోలియం రవాణా చార్జీలపై వ్యాట్ లేదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతినిధులు ఆరోపించారు. జూన్ 5 నుంచి తమ సొంత ట్యాంకర్ల రవాణానూ నిలిపేసి పెట్రోలియం రవాణాను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. వ్యాట్‌పై ఆర్థిక మంత్రి, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్, ఆయిల్ కంపెనీ అధికారులను కలసి వినతిపత్రాలను సమర్పించామని... అయినా ప్రభుత్వం స్పందించకుంటే ఉధృతంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ట్యాంకర్స్ ఓనర్స్, డీలర్స్ కూడా పాల్గొన్నారు. -
వ్యాట్ మార్పుతో రాష్ట్రానికి రూ.300 కోట్లు
పీడీఎస్ బియ్యంపై పన్నును భరించేందుకు కేంద్రం ఓకే! సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రతా చట్టం కింద పేదలకు సరఫరా చేస్తున్న బియ్యంపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను ఇక ముందు కేంద్రం భరించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది. ఆహార భద్రతా చట్టాన్ని కేంద్రమే నిర్వహిస్తున్నందున.. దాని తరఫున పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యంపై వ్యాట్‌ను కేంద్రమే చెల్లించాలని రాష్ట్ర అధికారులు ఇటీవల కోరారు. దీనిపై కేంద్ర అధికారులతో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అధికారులు చర్చలు జరిపారు. ఆహార భద్రత చట్టంలో సెక్షన్ 4.4 కింద ఈ మేరకు వెసులుబాటు ఉందని వివరించారు. దీంతో పన్ను మొత్తాన్ని భరించేందుకు కేంద్ర అధికారులు అంగీకరించినట్లు తెలిసింది. తదనుగుణంగా చట్టం చేసుకోవాలని కూడా సూచించినట్లు ఓ అధికారి తెలిపారు. రాష్ట్రంలో ఆహార భద్రత కింద ఏటా 18 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నారు. అందులో 13.5 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం, 4.5 లక్షల టన్నులు రాష్ట్రం సమకూరుస్తున్నాయి. మొత్తంగా బియ్యం పంపిణీపై రూ.2,200 కోట్ల సబ్సిడీని భరిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ క్వింటాలు బియ్యానికి రూ.800 చొప్పున ధర నిర్ణయించి, 5% పన్ను కింద ఏటా సుమారు రూ.120 కోట్లను వాణిజ్య పన్నుల శాఖకు జమ చేస్తోంది. అయితే ప్రభుత్వంలోనే భాగమైన పౌరసరఫరాల శాఖ తిరిగి వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించడం వల్ల.. రాష్ట్ర నిధులే తిరిగి రాష్ట్రానికి సమకూరుతున్నాయి. మరోవైపు కేంద్రం క్వింటాలు బియ్యానికి అవసరమైన ధాన్యం విలువ ను లెక్కగట్టి రాష్ట్రానికి చెల్లిస్తుంది. ఈ లెక్కన చూస్తే మరింత ఎక్కువగా పన్ను సమకూరుతుంది. తాజాగా వ్యాట్ సొమ్మును భరించేందుకు కేంద్రం సిద్ధమైన నేపథ్యంలో... ఇప్పటివరకూ పౌర సరఫరాల శాఖ చెల్లిస్తున్న రూ.120 కోట్లను కేంద్రమే చెల్లించడంతోపాటు, ఎక్కువగా సమకూరే పన్ను కింద మరో రూ.180 కోట్ల వరకు వస్తాయని రాష్ట్ర అధికారులు అంచనా వేశారు. మొత్తంగా కేంద్రం నుంచి రూ.300 కోట్ల వరకు అదనంగా ఖజానాకు అందనుంది. -
గుజరాత్లో ఉప్పుపై పన్ను నేటి నుంచి ఆందోళనలు
అహ్మదాబాద్: గుజరాత్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఉత్పత్తిదారులు నేటి నుంచి సమ్మెకు దిగుతున్నారు. ఉప్పు తయారీని, సరఫరాను నిలిపివేస్తామని చెబుతున్నారు. ‘సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ వినియోగించే ఉప్పుపై గుజరాత్ ప్రభుత్వం 5%విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను విధించింది. దీనిని ప్రజలతోపాటు తయారీదారులూ వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మూడురోజులపాటు ఉత్పత్తి, సరఫరాను నిలిపివేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తాం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి. లేదంటే మా నిరసనను మరిన్ని రోజులు కొనసాగిస్తామం’ అని చిన్నతరహా ఉప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు బచ్చుభాయ్ అహిర్ తెలిపారు. దీనికి నమక్ సత్యాగ్రహ్ సమితి కూడా మద్దతు పలికింది. -
ఓ రూ.10 వేల కోట్లు లాగేద్దాం!
కొత్త బడ్జెట్లో పన్నులద్వారా రాబట్టాలని ప్రభుత్వ నిర్దేశం వ్యాట్‌లో ఏకంగా రూ.8,500 కోట్లు లక్ష్యం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా రూ.1,600 కోట్లు.. మద్యంపైనా భారీగా ఆదాయాన్ని సముపార్జించాలని లక్ష్యం భారీగా ఆదాయ లక్ష్యాల నిర్దేశం పట్ల ఆదాయ వనరుల శాఖల గగ్గోలు ఆచరణ సాధ్యం కాదని స్పష్టీకరణ పన్నులు పెంచితేనే సాధ్యమని కుండబద్దలు అయితే పన్నులు పెంచేందుకు వీల్లేనందున బడ్జెట్ అమల్లో తిప్పలు తప్పవని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17) బడ్జెట్లో పన్నుల రూపంలో అదనంగా రూ.పదివేల కోట్లకుపైగా ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించడం పట్ల ఆదాయ వనరుల శాఖలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా వచ్చిన ఆదాయానికి అనుగుణంగా పదిశాతం వృద్ధితో ఆదాయ లక్ష్యాల్ని నిర్ధారించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా ఆర్థిక శాఖ భారీ లక్ష్యాల్ని నిర్దేశించిందని ఆయా శాఖలు పేర్కొంటున్నాయి. బడ్జెట్లో ప్రధానంగా ఆదాయ వనరులు ఆర్జించే వ్యాట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రవాణా, ఎ క్సైజ్ రంగాల లక్ష్యాలు అశాస్త్రీయంగా, ఆచరణ సాధ్యం కానివిగా ఉన్నాయని ఆయా శాఖల అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఆయా శాఖలతో సంప్రదింపులు జరపకుండానే ఆర్థికశాఖ ఏకపక్షంగా లక్ష్యాల్ని నిర్ధారిస్తూ వచ్చే బడ్జెట్‌ను రూపొందించిందని, దీంతో ఆ బడ్జెట్ అమల్లో తిప్పలు తప్పవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంత భారీస్థాయిలో వ్యాట్ లక్ష్యమా? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ద్వారా రూ.32,840 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించగా.. ఫిబ్రవరి నాటికి రూ.27,600 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి నెలాఖరుకు ఇది రూ.29,200 కోట్లకు మించదని వాణిజ్య పన్నులశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యాట్ లక్ష్యాన్ని రూ.37,435 కోట్లుగా ఆర్థికశాఖ నిర్ణయించడం గమనార్హం. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వచ్చిన ఆదాయంకంటే అదనంగా రూ.8,500 కోట్లకుపైగా ఆర్జించాలని ఆర్థికశాఖ నిర్ధారించింది. ఇంత పెద్ద మొత్తంలో అదనంగా వ్యాట్ ద్వారా ఆదాయం సముపార్జన సాధ్యమవదని వాణిజ్య పన్నులశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వ్యాట్ పన్ను ఇప్పటికే ఎక్కువగా ఉందని, అదనంగా పన్ను పెంచడానికి ఆస్కారం లేదని వారంటున్నారు. ఒకవైపు రాష్ట్రప్రభుత్వమే బియ్యం, పప్పుల మిల్లర్లు చెల్లించాల్సిన సీఎస్టీ బకాయిల్ని రూ.500 కోట్ల మేరకు రద్దు చేసిందని, ఇలా రాయితీలిచ్చుకుంటూ మరోవైపు పన్నులు పెంచకుండా వ్యాట్ ఆదాయం పెంచడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా అదనంగా రూ.1,600 కోట్లు లక్ష్యం.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,500 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించగా ఫిబ్రవరికి రూ.3,200 కోట్ల ఆదాయం లభించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.4,060 కోట్ల ఆదాయం ఆర్జించగలమని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టం చేయగా ఆర్థికశాఖ మాత్రం ఏకంగా రూ.5,180 కోట్లు లక్ష్యంగా నిర్దేశించింది. అంటే ప్రస్తుత సంవత్సరం లక్ష్యం కంటే ఏకంగా రూ.1,600 కోట్లు అదనంగా ఆర్జించాలని నిర్ధారించారు. అయితే ఇంత పెద్దమొత్తంలో ఆదాయం సమకూర్చడం సాధ్యపడదని ఆ శాఖ అధికారులంటున్నారు. గతేడాది ఆగస్టులోనే భూముల విలువల్ని పెంచినందున వచ్చే ఏడాదిదాకా మళ్లీ పెంచేందుకు ఆస్కారం లేదంటున్నారు. 'మద్యం' లక్ష్యం సాధించాలంటే మరింత మందితో తాగించాలి! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా రూ.4,680 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టగా.. రూ.4,400 కోట్లు ఆర్జించారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.5,756 కోట్లు లక్ష్యంగా పెట్టారు. ఆ మేరకు ఇప్పటికంటే అదనంగా రూ.1,300 కోట్లు ఆర్జించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆర్జించాలంటే వీలైనంత ఎక్కువ మందితో మద్యం తాగించాలని, లేదంటే ధరలు పెంచాలని ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఇక రవాణా ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,977 కోట్లు ఆర్జించాలనేది లక్ష్యంకాగా ఫిబ్రవరి నాటికి రూ.1,950 కోట్లు వచ్చింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.2,412 కోట్లు ఆర్జించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. అమలు తలకిందులవక తప్పదా? ఆచరణ సాధ్యం కాని, వ్యూహలతో కూడిన ఆదాయ లక్ష్యాల్ని నిర్ధారిస్తూ బడ్జెట్‌ను రూపొందించడంతో దీని అమలు తలకిందులు కాక తప్పదనే భావనను ఆయా శాఖల అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పన్నులు పెంచితేనే ఆదాయ లక్ష్యాల్ని చేరుకోవడం సాధ్యమని, కానీ ఇప్పటికే పన్నులు పెంచినందున.. ఇప్పుడు పెంచడం సాధ్యపడదని వారు చెబుతున్నారు. రెవెన్యూ మిగులుతోపాటు 53 శాతం ఆదాయం వచ్చే తెలంగాణ సర్కారు వచ్చే బడ్జెట్లో రాష్ట్ర సొంత ఆదాయాన్ని రూ.54,849 కోట్లుగా నిర్ధారించగా.. 47 శాతం ఆదాయం వచ్చే ఆంధ్రప్రదేశ్ సర్కారు వచ్చే బడ్జెట్లో రాష్ట్ర సొంత ఆదాయాన్ని రూ.57,800 కోట్లుగా నిర్ధారించడంలోనే బడ్జెట్లోని డొల్లతనం బయటపడుతోంది. -
ఎగుమతి బియ్యాన్నీ వదలని ‘ముడుపు’ దయ్యం
ఐదేళ్లుగా వ్యాట్ చెల్లించని మిల్లర్లు * రూ.1300 కోట్లకు పైగా బకాయిలు * బకాయిలు మాఫీ చేయించాలని ఇద్దరు మంత్రులకు మిల్లర్ల మొర! * రూ.200 కోట్లు ముడుపులిస్తేనే మాఫీ అంటూ చినబాబు షరతు * ‘డీల్’ కుదిర్చిన మంత్రులు సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి పది రూపాయలు చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోవైపు వ్యాట్ రూపంలో మిల్లర్లు బకాయిపడిన రూ.1300 కోట్లను మాఫీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో రూ.200 కోట్లకు పైగా ముడుపులు చేతులు మారినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారవర్గాలు చెబుతోండటం గమనార్హం. రాష్ట్రంలో ఉత్పత్తయిన బియ్యంపై ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఐదు శాతం పన్నుగా వసూలు చేస్తోంది. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), పౌర సరఫరాల సంస్థ(సివిల్ సప్లయిస్ కార్పొరేషన్)లకు సీఎమ్మార్(కస్టమ్ మిల్లింగ్ బియ్యం) రూపంలో అందించే బియ్యంపై కూడా ఐదు శాతం వ్యాట్‌ను వసూలు చేస్తోంది. కానీ.. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే బియ్యంపై (దిగుమతి చేసుకున్న వారి నుంచి సి-ఫారం తీసుకుని వాణిజ్య పన్నుల శాఖకు అందిస్తేనే) మాత్రం వ్యాట్ రూపంలో రెండు శాతం పన్నును వసూలు చేస్తున్నారు. ఏపీ వ్యాట్ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే 2005 నుంచి ఇదే పన్నుల విధానం అమల్లో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2011 నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన మిల్లర్లు ఏటా భారీ ఎత్తున బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కానీ.. వ్యాట్‌ను చెల్లించడం లేదు. ‘సీ-ఫారం’లను వాణిజ్య పన్నుల శాఖకు సమర్పించడంలోనూ అదే వైఖరిని అనుసరిస్తున్నారు. దాంతో పన్ను బకాయిలు పేరుకుపోయాయి. 2011 నుంచి 2015 వరకూ రూ.1300 కోట్ల మేర వ్యాట్ రూపంలో మిల్లర్లు బకాయిపడ్డారు. కొరడా ఝుళిపించిన వాణిజ్యాధికారులు ఐదేళ్లుగా పేరుకుపోయిన బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మిల్లర్లకు ఆర్నెళ్ల క్రితం నోటీసులిచ్చారు. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసిన బియ్యానికి సీ-ఫారంలు సమర్పించని నేపథ్యంలో.. ఆ బియ్యానికి కూడా ఐదు శాతం వ్యాట్‌ను చెల్లించాల్సిందేనన్నారు. దీంతో మిల్లర్లు గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు కీలక మంత్రులను ఆశ్రయించారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బియ్యంపై పన్నులు విధించడం లేదని ఇక్కడా వ్యాట్‌ను రద్దు చేయాలని కోరారు. పనిలో పనిగా రూ.1300 కోట్ల బకాయిలను మాఫీ చేయించాలని ప్రతిపాదించారు. దీనితో ఏకీభవించిన మంత్రులు మాఫీకి హామీ ఇచ్చారు. మిల్లర్లు బకాయిపడిన రూ.1300 కోట్ల మాఫీకి సంబంధించిన ప్రతిపాదనలను వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారికి పంపేలా చక్రం తిప్పారు. ఆ ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేయాలంటూ ఉన్నతాధికారిపై ఒత్తిడి తెచ్చారు. కానీ.. ఆ అధికారి వారి ప్రతిపాదనను తోసిపుచ్చారు. రెండోసారి కూడా ఆ మంత్రుల ప్రతిపాదనను తిరస్కరించారు. రంగంలోకి దిగిన చినబాబు.. వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి అడ్డం తిరగడంతో పక్షం రోజుల క్రితం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఇద్దరు మంత్రులు భేటీ అయ్యారు. మిల్లర్ల బకాయిల మాఫీపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఆ సమావేశం తర్వాత మిల్లర్ల బకాయిల మాఫీ అంశంపై చర్చించే బాధ్యతను ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కార్మిక మంత్రి అచ్చెన్నాయుడులకు సీఎం అప్పగించారు. బకాయిలు ఏ మేరకు చెల్లించడానికి మిల్లర్లు సిద్ధంగా ఉన్నారో వారినే విచారించి నివేదిక ఇవ్వాలని ఆ మంత్రులకు సీఎం ఆదేశించినట్లు వాణిజ్య శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో బియ్యంపై వ్యాట్ విధించడం లేదని.. ఉమ్మడి రాష్ట్రంలోనూ వ్యాట్ బకాయిలను రద్దు చేశారని.. ఇప్పుడూ అదే రీతిలో రద్దు చేయాలని మంత్రులపై మిల్లర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చినబాబు రంగంలోకి దిగారు. రూ.200 కోట్లు ముడుపులుగా ఇస్తే మిల్లర్ల వ్యాట్ బకాయిలు మాఫీ చేస్తామంటూ మంత్రులతో ప్రతిపాదించారు. ఇదే ప్రతిపాదనను మంత్రులు మిల్లర్ల ముందు ఉంచారు. బకాయిల రద్దుతోపాటు ఇకపై ఎగుమతి చేసే బియ్యంపై వ్యాట్‌ను రద్దు చేస్తే ఆ మేరకు ముడుపులు ఇవ్వడానికి సిద్ధమంటూ మిల్లర్లు షరతు విధించినట్లు సమాచారం. మిల్లర్ల సూచనల మేరకు చినబాబు ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ నివేదికపై సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారని వాణిజ్య పన్నుల శాఖ కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో రూ.1300 కోట్ల వ్యాట్ బకాయిల మాఫీ ఉత్తర్వులు వెలువడనున్నాయి. -
వ్యాట్ చెల్లించాల్సిందే..!
సాక్షి, ముంబై: భక్తుల పాలిట కొంగుబంగారం ‘లాల్బాగ్ చా రాజా’.. ప్రభుత్వానికి ఒక శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లించాల్సిందేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భక్తులు సమర్పించుకున్న కానుకలకు వ్యాట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ‘లాల్బాగ్ చా రాజా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండలి’ దాఖలు పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. కానుకల వేలం, హుండీ నగదు రూపంలో వచ్చే డబ్బును ఏడాది కాలంలో పేదలకు ఆర్థిక సాయం, ఉచిత వైద్య శిబిరాలు, దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి వైద్యానికి అయ్యే ఖర్చులు, కరువు పీడిత ప్రాంత ప్రజలకు చేయూత వంటి సామాజిక, సహాయక కార్యక్రమాలు చేపడతామని, ఇందుకోసం తమకు వ్యాట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉత్సవ మండలి దాఖలు చేసిన పిటిషన్ విచారణను కోర్టు చేపట్టింది. విచారణ అనంతరం జస్టిస్ ఎస్.సీ.ధర్మాధికారి నేతృత్వంలోని బెంచి పిటిషన్‌ను తిరస్కరించింది. ‘భక్తులు సమర్పించుకున్న కానుకలు అసలు ధరకు విక్రయించడం లేదు. వాటిని వేలంలో విక్రయించడం వల్ల మండలికి అదనపు ఆదాయం వస్తుంది. ఇది ఒక వ్యాపారం లాంటిదే’ అని బెంచి అభిప్రాయపడింది. వ్యాట్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యాపారుల ఇక్కట్లు ‘లాల్బాగ్ చా రాజా’ వల్ల స్థానిక వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారు. గణేశ్ ఉత్సవాలు ప్రారంభానికి రెండు రోజుల ముందు నుంచి ముగిసేవరకు దాదాపు పక్షం రోజులపాటు బేరాలు లేక వారి వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో వారు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లాల్బాగ్ చా రాజా ను దర్శించుకునేందుకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖులు వస్తుంటారు. దీంతో వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. రోడ్లపై దారి పొడవునా బారికేడ్లు, భారీ పోలీసు బలగాలు, వ్యాన్లు వంటి వాటి వల్ల కొనుగోలుదారులు షాపుల దరిదాపులకు కూడా రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని లాల్బాగ్ ప్రాంత వ్యాపారుల సంఘటన అధ్యక్షుడు సూర్యకాంత్ పాంచాల్ హెచ్చరించారు. -
వ్యాట్ అమలులో రాష్ట్రాలకు అన్యాయం
హైదరాబాద్ : జీఎస్టీ పన్నుల విధానంపై ఆస్ట్రేలియా పర్యటనలో అధ్యయనం చేశామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈటల రాజేందర్ మాట్లాడుతూ... అన్ని రాష్ట్రాల ఆర్థిక నిపుణులు ఈ పర్యటనలో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా జీఎస్టీ అమలు చేయాలని కేంద్రానికి ఈటల విజ్ఞప్తి చేశారు. వ్యాట్ అమలు తీరులో రాష్ట్రాలకు కొంత అన్యాయం జరిగిందన్నారు. అది పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరతామని ఈటల రాజేందర్ వెల్లడించారు. -
వాటిపై వ్యాట్‌ను తగ్గించాలి
- వైఎస్సార్సీపీ డిమాండ్ - ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో పెట్రోలు ధరలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌పై పెంచిన 4 రూపాయల వ్యాట్‌ను తగ్గించాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలున్నాయన్నారు. ఏపీలో లీటరు డీజిల్ ధర రూ.53.97గా ఉంటే భువనేశ్వర్, బెంగళూరులో రూ.47, చెన్నైలో రూ.46గా ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికంగా పన్నులు వేసిందని, మరోవైపు రాష్ట్రప్రభుత్వం లీటరుపై రూ.4 చొప్పున వ్యాట్‌ను పెంచిందని ఆయన విమర్శించారు. రైతులపై లాఠీచార్జీయా?: గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులపై జరిగిన లాఠీచార్జిని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని, ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని కోరుతోందని బొత్స అన్నారు. చంద్రబాబు పాలనలో రైతులపై దాడులు, లాఠీచార్జిలు, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఇబ్బందుల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలన్నింటికీ ఆర్థిక పరిపుష్టి చేకూర్చి బాగా నడిచేలా చేస్తామని హామీఇచ్చారని, అధికారంలోకొచ్చాక ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేసి వాటన్నింటినీ లాభాల్లోకి వచ్చేలా చూశారని గుర్తుచేశారు. సహకార షుగర్ ఫ్యాక్టరీల్ని నష్టాలొస్తున్నాయన్న సాకుచూపి కొన్నింటిని తన వందిమాగధులకు చంద్రబాబు గతంలో అమ్మేశారని, ఇపుడూ అలానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ దీక్షపై ప్రధాని స్పందిస్తారని ఆశిస్తున్నాం రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరులో తలపెట్టిన నిరవధిక నిరాహారదీక్ష ఈ నెల ఏడోతేదీ ఉదయం ప్రారంభమవుతుందని బొత్స తెలిపారు. ఈ నెల 22న రాష్ట్రానికొస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. తమ పార్టీ అధినేత చేసే దీక్షకు స్పందించి ప్రత్యేక హోదాను ప్రకటిస్తారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. -
రేపట్నుంచి పెట్రోల్ బంకుల నిరవధిక బంద్
- పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణస్పష్టీకరణ గుంటూరు వెస్ట్/సాక్షి, హైదరాబాద్/సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ ఒకటోతేదీ ఉదయం ఆరు గంటల నుంచి పెట్రోలు బంకులు నిరవధికంగా మూతపడనున్నాయి. డీజిల్, పెట్రోలుపై లీటరుకు రూ.4 చొప్పున అదనంగా పెంచిన వ్యాట్‌ను రద్దు చేయాలని కోరుతూ పెట్రోల్ బంకుల నిరవధిక బంద్‌ను పాటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.గోపాలకృష్ణ మంగళవారం గుంటూరులో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు అక్టోబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక రవాణా బంద్ చేపడుతున్నట్టు, ఇందులో భాగంగా మన రాష్ట్రంలోని సరుకు రవాణా వాహనాలు, పెట్రోలు, డీజిల్ రవాణా వాహనాలు, పెట్రోలు బంకుల కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. -
వ్యాట్ వాత.. ‘పెట్రో’ మూత
పాలకుల చేతగానితనం ప్రజలను కష్టాల పాలు చేస్తోంది. నిత్యావసరాలు మొదలు.. పెట్రోలు, డీజిల్ వరకు ఎందులో చూసినా రాష్ట్రంలో ధరలు మండుతున్నాయి. జనం గుండెను మండిస్తున్నాయి. వ్యాట్ భారంతో పెట్రోలు, డీజిల్ ధరలు రాష్ట్రంలో కొండెక్కి కూర్చొన్నాయి. వ్యాట్ మంట తగ్గించాలని కోరినా, పాలకులు పట్టించుకోకపోవడంతో విధిలేని పరిస్థితిలో పెట్రోల్ బంక్‌ల యజమానులు బంద్ బాటపట్టారు. - జిల్లాలో 220 పెట్రోలు బంకులు మూత - ఇబ్బడిముబ్బడిగా వ్యాట్‌తో వ్యతిరేకత - పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరలకు పెట్రోలు, డీజిల్ - ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు బంద్ ఒంగోలు సబర్బన్ : వ్యాట్‌పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలోని పెట్రోలు బంకుల యజమానులు 24 గంటల పాటు బంద్‌తో తమ నిరసనను తెలియజేసేందుకు సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా పెట్రోలు బంకుల ఆపరేటర్లు అందరూ ఒక్కతాటిపై నిలిచి ఒక్క రోజు బంకులు మూసేయాలని నిర్ణయించారు. ఆదివారం అర్ధరాత్రి 12 నుంచి సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పెట్రోలు బంక్‌లను మూసేస్తున్నారు. దీంతో జిల్లాలోని 220 పెట్రోలు బంకులు బంద్ కానున్నాయి. మన రాష్ట్రంతో పోల్చుకుంటే అన్ని రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. దీనికి కారణం రాష్ట్రంలో ప్రతి లీటరు డీజిల్, పెట్రోల్‌పై రూ.4 వాల్యు యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) విధించటమే. దీంతో పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ధరలు అధికంగా ఉండటం వల్ల ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాహనదారులు నామమాత్రంగా డీజిల్ కొట్టించుకొని ట్యాంకులు, ట్యాంకులు పక్క రాష్ట్రాల్లో నింపుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలోని పెట్రోలు బంకుల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐఓసీ, హెచ్పీసీ, బీపీసీ సంస్థలు పెట్రోలు బంకులు ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసుకొని వినియోగదారులకు పెట్రోలు, డీజిల్ సరఫరా చేస్తున్నాయి. ప్రతి రోజూ లక్షల కొద్దీ లీటర్లు వినియోగదారులకు విక్రయిస్తున్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే లీటరుకు రూ.2 నుంచి రూ.5.20 వరకు ధర మన రాష్ట్రంలో అధికంగా ఉంది. ఇంతెందుకు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకంటే రూ.2 తక్కువకు పెట్రోలు, డీజిల్ వినియోగదారులకు అందుతోంది. సరిహద్దు రాష్ట్రమైన అటు తమిళనాడులో మనకంటే రూ.5.20 ధర తక్కువ. మరి మనోళ్లయినా.. పరాయి రాష్ట్రం వాళ్లయినా డీజిల్, పెట్రోలు మన రాష్ట్రంలో ఎందుకు కొట్టించుకుంటారు. వందల కిలో మీటర్ల ప్రయాణంలో వేల రూపాయలు ఆదా చేసుకోవాలని వాహనాల యజమానులు చూసుకుంటారు. ఇదే ప్రస్తుతం జరుగుతోంది. ఈ పరిస్థితే వ్యతిరేకతకు దారితీసింది. ఒక రోజు పెట్రోలు బంకులు మూత పడితే కోట్లలో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయి. ఒక పక్క ఉల్లి లొల్లి కలవర పెడుతోంది. కిలో ఉల్లి ధర రూ.60 దాటుతోంది. కంది పప్పు, నూనెలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత పట్టీ తయారవుతోంది. బంకు ఆపరేటర్లు సహకరించాలి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జిల్లాలో పెట్రోలు బంకులు 24 గంటలు మూసేయాలని నిర్ణయించాం. అందుకు జిల్లాలోని డీలర్లు అందరూ సహరించాలి. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా చేస్తున్న ఈ ఆందోళన బంకుల డీలర్లతో పాటు ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి. వ్యాట్ తగ్గితే ప్రజలకు కూడా ధర వెసులుబాటు కలుగుతుంది. వర ప్రసాదరావు, జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
వ్యాట్‌కు నిరసన
విజయవాడ : పొరుగు రాష్ట్రాల్లో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమపై విధించిన వ్యాట్ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్న పెట్రోలు, డీజిల్ డీలర్లు పోరాటానికి సిద్ధమయ్యారు. ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ పిలుపు మేరకు సోమవారం పెట్రోలు బంకుల బంద్ పాటిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు జిల్లాలో అన్ని పెట్రోలు బంక్‌లను మూసివేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ తొలి హెచ్చరికగా బంకులన్నింటినీ 24 గంటలపాటు బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ ఆందోళనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 220 పెట్రోలు బంకులను మూసివేసి, వాటి యజమానులు నిరసనలో పాల్గొంటారు. సోమవారం రోజంతా పెట్రోలు, డీజిల్ విక్రయాలు, కొనుగోళ్లు నిలిపివేయనున్నారు. జిల్లాలో రోజుకు 12 లక్షల లీటర్ల డీజిల్, సుమారు 10 లక్షల లీటర్లు పెట్రోలు విక్రయాలు జరుగుతాయి. పెట్రోలియం కంపెనీల నుంచి డీలర్లు రోజుకు పెట్రోలు, డీజిల్ కలిపి రోజుకు 30 లక్షల లీటర్లు కొనుగోలు చేస్తారని అంచనా. విక్రయాలు, కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు అన్నింటిని బంకుల యజమానులు ఒక్కరోజు నిలిపివేస్తారు. ఈ ఆందోళనలో జిల్లాలో అన్ని పెట్రోలు బంకుల యజమానులు పాల్గొంటున్నారని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ జిల్లా అధ్యక్షుడు చుంచు నరసింహారావు తెలిపారు. న్యాయమైన తమ ఆందోళనకు సహకరించాలని జిల్లా ప్రజలను కోరారు. సమ్మెకు కారణాలు ఇవీ.. రాష్ట్ర ప్రభుత్వం ఆరు మాసాల క్రితం పెట్రోలు, డీజిల్ విక్రయాలపై 4 శాతం వ్యాట్ విధించింది. దీన్ని ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం డీలర్లు వ్యతిరేకిం చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ప్రభుత్వం రాష్ట్రంలో 4 శాతం వ్యాట్ విధించడం వల్ల లారీల యజమానులు పక్క రాష్ట్రాలకు వెళ్లి డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్నాటక వెళ్లి లారీ యజమానులు డీజిల్‌ను కొనుగోలు చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,400 బంకుల్లో డీజిల్ విక్రయాలు 40 శాతం పడిపోయాయి. మరోవైపు పెట్రోలు బంకులపై ఇటీవల కాలంలో అగ్నిమాపక అధికారులు, సిబ్బంది చేస్తున్న దాడులను ఆపాలని డీలర్లు కోరుతున్నారు. మామూళ్లకోసం అగ్నిమాపక సిబ్బంది తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని బంకుల యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఫారం-ఎఫ్, ఫారం-వీ లెసైన్సులను రద్దు చేయాలని పెట్రోలు డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. రవాణా వాహనాలకు సంబంధించి ఆయిల్ ట్యాం కర్లకు వచ్చే కిరాయిపై కూడా ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్‌ను ఎత్తివేయాలని పెట్రోలు డీలర్లు విజ్ఞప్తిచేస్తున్నారు. -
అమ్మకాలపైనే ఆశలు!
-
అమ్మకాలపైనే ఆశలు!
సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానంతో ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గిపోతుందా, పెరుగుతుందా..? అన్నదానిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. కొత్త విధానం ప్రకారం చీపెస్ట్ లిక్కర్‌ను రూ.15కు 90 ఎంఎల్ సీసా చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరలో అమ్మాలంటే మద్యంపై ఇప్పుడున్న వ్యాట్‌ను 49 శాతానికి తగ్గించాలని భావిస్తున్నారు. దీనివల్ల సర్కారుకు వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోతుంది. కానీ అతి తక్కువ ధరకు మద్యం వస్తుందనే ఉద్దేశంతో వినియోగం భారీగా పెరుగుతుందని.. తద్వారా మొత్తంగా వచ్చే ఆదాయం దాదాపు ప్రస్తుత స్థాయిలోనే ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చీపెస్ట్ లిక్కర్ అందుబాటులోకి వస్తే ఎక్కువ ధర ఉన్న మద్యం విక్రయాలు పడిపోతాయని, దానివల్ల ఎక్సైజ్‌పై వచ్చే వ్యాట్ ఆదాయం తగ్గుతుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. మొత్తంగా కొత్త మద్యం విధానమంతా ‘అమ్మకాల’ చుట్టే తిరుగుతోంది. ప్రస్తుతం 90 ఎంఎల్ చీప్ లిక్కర్ రూ.30 ధరకు విక్రయిస్తున్నారు. వివిధ రకాల మద్యంపై కనిష్టంగా 70 శాతం నుంచి గరిష్టంగా 190 శాతం వరకు వ్యాట్ ఉంది. దీన్ని తగ్గించటంతో వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుందని ఆర్థిక శాఖ లెక్కలేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌పై వ్యాట్ ద్వారా రూ.8,291 కోట్లు రాబట్టాలని ప్రభుత్వం అంచనాలు వేసుకుంది. కానీ కొత్తగా వచ్చే చీపెస్ట్ లిక్కర్ కారణంగా వ్యాట్ ఆదాయం తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం రూ.60 చెల్లించి మద్యం కొనుగోలు చేస్తున్నవారు తక్కువ ధరకు వస్తుందని రెండు చీపెస్ట్ బాటిళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుం దని... వినియోగం పెరిగితే వ్యాట్ శాతం తగ్గినా ప్రమాదమేమీ లేదనే వాదన ఉంది. నష్టమని చెబుతున్న ఎక్సైజ్ శాఖ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చీప్‌లిక్కర్ 48 బాటిళ్లు (180 ఎంఎల్) ఉన్న పెట్టెపై రూ.1,885 పన్ను రూపంలో రాష్ట్ర ఖజానాలో జమవుతుంది. వ్యాట్ తగ్గింపు కారణంగా ఇది రూ.734కు తగ్గిపోతుంది. అంటే ఒక్కో పెట్టెపై రూ.1,151 ఆదాయం తగ్గిపోతుందని ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కానీ వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం అమ్మకాలతో ముడిపడి ఉన్నందున దీని ప్రభావం రూ.200 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్యలో ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వ్యాట్, అమ్మకపు పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంచనా వేసిన స్థాయిలో ఉండడం లేదు. ప్రతి నెలా రూ.3,000 కోట్లు రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ గత నాలుగు నెలల ఆదాయ గణాంకాలను చూస్తే ఒక్క జూలైలో గరిష్టంగా రూ.2,500 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త విధానంతో వచ్చే లాభనష్టాలను ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదించనుంది. లెసైన్సు ఫీజుతో లోటు భర్తీ.. వ్యాట్ ద్వారా తగ్గే ఆదాయాన్ని లెసైన్స్ ఫీజు, స్టేట్ ఎక్సైజ్ ద్వారా రాబట్టుకునే ప్రత్యామ్నాయాలను సైతం ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించింది. దీనికి అనుగుణంగా కొత్త విధానానికి రూపకల్పన చేసింది. ప్రస్తుతమున్న మద్యం దుకాణాల లెసైన్సుల ద్వారా ప్రభుత్వానికి రూ.900 కోట్ల ఆదాయం వచ్చింది. నిర్దేశించిన కోటాకు మించి మద్యం అమ్మకాలు చేసినందుకు దుకాణాదారులు చెల్లించిన ఫీజు మరో రూ.420 కోట్లు ఖజానాలో జమ అయింది. మొత్తంగా ఆదాయం రూ.1,320 కోట్లకు మించింది. దీంతో ఈసారి లెసైన్సులకు నిర్దేశించే రుసుము అంతకంటే ఎక్కువగా ఉండాలని ప్రభుత్వం లెక్కలేసుకుంది. దీనిద్వారానే దాదాపు రూ.2,000 కోట్లు సంపాదించాలని భావిస్తోంది. వ్యాట్‌కు గండి పడినా... ఇలా ఆదాయం రాబట్టుకోవాలనేది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా రూ.3,916 కోట్ల రాబడిని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తొలి నాలుగు నెలల్లో రూ.1,150 కోట్లు ఆదాయం వచ్చింది. దీంతో కొత్త మద్యం విధానం లాభసాటిగా ఉంటుందా, నష్టం వస్తుందా.. అని తేల్చలేకపోతోంది. అమ్మకాలతో ముడిపడి ఉన్నందున విక్రయాలు పెరిగితే, వ్యాట్ తగ్గించినా ఇబ్బందేమీ లేదని.. విక్రయాలు ఇప్పుడున్న స్థాయిలో ఉంటే ఆదాయం తగ్గిపోతుందని భావిస్తోంది. ఈ ఏడాది మద్యం విక్రయాల ఆదాయం.. ఏప్రిల్ ⇒ రూ.185 కోట్లు మే ⇒ రూ.190 కోట్లు జూన్ ⇒ రూ.525 కోట్లు జూలై ⇒ రూ.250 కోట్లు -
సుగర్ పెరుగుతోంది..
వ్యాట్ పోటుతో కొనుగోళ్ల స్తంభన గణనీయంగా పడిపోయిన ధర గోదాముల్లో భారీగా పంచదార నిల్వలు సహకార చక్కెర కర్మాగారాలు నష్టాలతో అవస్థలు పడుతున్నాయి. టన్నుల కొద్దీ పేరుకుపోయిన పంచదార నిల్వలు భారంగా మారాయి. వాటిని వదిలించుకునే మార్గం లేక జిల్లాలోని సుగర్ ఫ్యాక్టరీలు సతమతమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మోపిన వ్యాట్, ఎగుమతి సుంకాలు పంచదార కొనుగోళ్లకు గుదిబండగా మారాయి. విశాఖపట్నం: యూపీఏ ప్రభుత్వంలో అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు క్వింటాలు పంచదార ధర రూ.3 వేలకు పైనే ఉండేది. పంచదార ఉత్పత్తి వ్యయం రూ.3 వేలవుతోంది. ఇతర ఆదాయ వనరులతో సుగర్ ఫ్యాక్టరీలు ఆర్థికంగా లాభపడ్డాయి. కానీ ఏడాది నుంచి పరిస్థితి తారుమారయ్యింది. క్వింటాలు పంచదార రూ.2200లకు పడిపోయింది. ఇప్పుడది మరింతగా దిగజారి రూ.2050లు పలుకుతోంది. అంటే ఏడాది క్రితంతో పోల్చుకుంటే క్వింటాలు వద్ద రూ.వెయ్యి చొప్పున జిల్లాలోని నాలుగు చక్కెర కర్మాగారాలకు రూ.80 కోట్ల నష్టం వాటిల్లుతోందన్న మాట! దీంతో రైతులకు నెలల తరబడి బకాయిలు తీర్చలేని పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి కర్మాగారం యాజమాన్యాలు తమ వద్ద ఉన్న పంచదార నిల్వలపై అప్పు తెచ్చి రైతుల బకాయిలు చెల్లిస్తుంటాయి. పంచదార అమ్మకం జరిగాక అప్పులు తీరుస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం నిల్వలు అమ్ముదామంటే కొనేవారే కరువయ్యారు. జిల్లాలోని గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో 4.65 లక్షల క్వింటాళ్లు, ఏటికొప్పాకలో 1.40 లక్షలు, తాండవలో 1.60 లక్షలు, తుంపాలలో 20 వేల క్వింటాళ్ల వెరసి దాదాపు ఎనిమిది లక్షల క్వింటాళ్ల పంచదార నిల్వలున్నాయి. ఎందుకిలా? రాష్ట్ర ప్రభుత్వం పంచదార కొనుగోళ్లపై వ్యాట్, కొత్తగా ఎగుమతి సుంకాలను విధిస్తోంది. దీంతో క్వింటాలుపై వ్యాట్ చార్జి కింద రూ.150లు, ఎగుమతి సుంకం కింద రూ.60-70లు చొప్పున కొనుగోలుదారుడు ప్రభుత్వానికి అదనంగా చెల్లించాల్సి వస్తోంది. పొరుగున ఉన్న కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఈ బాదుడు లేదు. దీంతో బడా వర్తకులు మన పంచదారను కాదని ఆయా రాష్ట్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. స్థానికంగా కొనుగోలు చేసే వారు కూడా తక్కువ ధరకే దొరికే పొరుగు రాష్ట్రాల పంచదార వైపే ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా జిల్లాలోని ఫ్యాక్టరీల్లో నిల్వలు కొండల్లా పేరుకుపోతున్నాయి. చక్కెర కర్మాగారాలను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో చాలా సుగర్ ఫ్యాక్టరీలు నష్టాల్లో చిక్కుకుని మూతపడ్డాయి. మరికొన్ని ఆ దిశగా పయనిస్తున్నాయి. ఎప్పుడూ లాభాల్లో నడిచే గోవాడ ఫ్యాక్టరీ కూడా ఆర్థిక సంక్షోభంలో పడింది. మరోవైపు రైతులకు గత సీజను బకాయిలతో పాటు రాయితీపై ఇచ్చే ఎరువులను కూడా కర్మాగారాలు రైతులకు అందించలేక పోతున్నాయి. దీంతో ఖరీఫ్ సీజనులో పెట్టుబడులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం చెరకు రైతులకు రూ.6 వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ సొమ్మును రైతుల ఖాతాల్లో నేరుగా వేయనుంది. ఇది కొంతవరకు రైతులకు ఊరటినిచ్చే అంశం. ప్రభుత్వం ఆదుకోవాలి.. సంక్షోభంలో ఉన్న చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం ఆదుకోవాలి. చక్కె ర ధర పెంచాలి. మార్కెట్ ధరను స్థిరీకరించాలి. క్వింటాలుకు కనీసం రూ.3 వేలు చేయాలి. వ్యాట్ రద్దు చేస్తే కొనుగోలుదార్లు ముందుకొస్తారు. దాంతో నిల్వలు క్లియర్ అవుతాయి. లేదంటే సుగర్ ఫ్యాక్టరీల మనుగడకు ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఆర్థిక సాయం అందించాలి. -వి.వి.రమణారావు, ఎమ్.డి., గోవాడ సుగర్స్. -
పెట్రోల్ బంకులకు పన్నుపోటు!
-
విదేశీ పెట్టుబడులకే పెద్దపీట
2015-2020 పారిశ్రామిక విధానం ప్రకటించిన ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన రంగం, అనుబంధ రంగాల అభివృద్ధే లక్ష్యం పరిశ్రమల కోసం 15 నుంచి 20 లక్షల ఎకరాల భూ సేకరణ పరిమితంగానే రాయితీలు విద్యుత్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ మినహాయింపులతోనే సరి రాయితీలకు కాలపరిమితిపై పారిశ్రామిక వర్గాల్లో అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: విదేశీ పెట్టుబడులకే అత్యధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015-2020 పారిశ్రామిక విధానాన్ని బుధవారం ప్రకటించింది. మౌలిక వసతుల కల్పన రంగం, అనుబంధ రంగాల అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమల ఏర్పాటుకు 15 నుంచి 20 లక్షల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో స్థానిక వనరులను పరిగణనలోనికి తీసుకుని, పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చింది. కేంద్రం ప్రత్యేక హోదా కల్పిస్తుందని నిరీక్షించిన రాష్ట్రం, అది సాధ్యం కాకపోవడంతో పారిశ్రామిక రాయితీలను పరిమితం చేసింది. విద్యుత్ చార్జీలు, స్టాంపు డ్యూటీ, వ్యాట్ల నుంచి మినహాయింపులే ప్రత్యేకంగా పేర్కొనదగిన వరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపినా.. పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే యంత్ర సామాగ్రిపై రాయితీలకు కొత్త విధానంలో చోటు కల్పించలేదు. తీర ప్రాంతాలను పరిశ్రమల స్థాపనకు అనువైనవిగా గుర్తించినా, అక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా వాయు, జల, రోడ్డు మార్గాల ఏర్పాటునే తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంది. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని టార్గెట్‌గా పెట్టుకుంది. ఆయా ప్రాంతాల్లో ప్రతిపాదిత ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా పరిశ్రమలకు స్వల్పంగానే రాయితీలను అందించాలని నిర్ణయించింది. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ప్రభుత్వ విధానమైనప్పటికీ, భూ లభ్యతకు ఉన్న సందేహాలకు, ఉత్పాదక విద్యుత్ సరఫరాపై స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలకు గరిష్టంగా పదేళ్ల కాలపరిమితిని నిర్ణయించింది. కొత్త రాష్ట్రం కావడం, మౌలిక సదుపాయాల కల్పనకు సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉండటంతో.. పరిశ్రమలు స్థాపించి, ఉత్పత్తి మొదలు పెట్టేసరికే రాయితీల కాలపరిమితి తీరిపోతుందని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యాంశాలు.. 2029 నాటికి పారిశ్రామికంగా తూర్పు, దక్షిణ ఆసియా దేశాలతో పోటీ లక్ష్యం. ఇప్పుడున్న 15 శాతం తయారీ రంగ వృద్ధి రేటును 17 శాతానికి, పారిశ్రామిక వృద్ధి రేటును 20.7 నుంచి 25 శాతానికి పెంచాలి. ఆహారశుద్ధి, ఫార్మా, బయోటెక్, వైద్య, జౌళి, ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, పెట్రోలియం, రసాయనాలు, ఇంధనం, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, తోళ్ల పరిశ్రమల్లో వృద్ధి సాధించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా 15 నుంచి 20 లక్షల ఎకరాలతో లాండ్ బ్యాంక్ ఏర్పాటు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి అర్హత, సామర్థ్యాన్ని బట్టి 99 ఏళ్ల పాటు భూముల లీజు. పారిశ్రామిక టౌన్ షిప్పులు, మెగాపార్కులు, స్టార్టప్ విలేజీల ఏర్పాటు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ 21 రోజుల్లోనే క్లియర్ చేసేలా సింగిల్ డెస్క్ ఏర్పాటు. కొన్ని రకాల పరిశ్రమలకు ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీల్లో యూనిట్‌కు రూ.1చొప్పున రీ యింబర్స్‌మెంట్ ఉంటుంది. పారిశ్రామిక అవసరాలకు కొనుగోలు చేసే భూమి లీజుకు, కుదవ పెట్టేందుకు స్టాంప్ డ్యూటీ నుంచి 100 శాతం మినహాయింపు. వ్యాట్, ఎస్జీఎస్టీ నుంచి.. సూక్ష్మ స్థాయి, చిన్నతరహా పరిశ్రమలకైతే ఐదేళ్ల పాటు 100 శాతం, మధ్యతరహా పరిశ్రమలకు 75 శాతం (7 ఏళ్లు) భారీ పరిశ్రమలకు 50 శాతం (7 ఏళ్లు) మినహాయింపు. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా రాయితీలు. స్టాంప్ డ్యూటీలో, భూ బదలాయింపు చార్జీల్లో రాయితీ. విద్యుత్ స్థిర చార్జీల రీయింబర్స్మెంట్. జౌళి, బయో టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించిన విధానాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. జౌళి విధానం కింద టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తారు. జిన్నింగ్, ప్రాసెసింగ్, వీవింగ్, డైయింగ్, గార్మెంట్ తయారీ తదితరాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. విశాఖ తీరంలో వెయ్యి ఎకరాలతో ఇంటిగ్రేటెడ్ అపేరల్ సిటీ ఏర్పాటు లక్ష్యం. విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు కొత్త విధానంలో భాగం.ఇందులో 956 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయం. బయోటెక్నాలజీ పాలసీ కింద 120 పాలిటెక్నిక్, 225 ఇంజనీరింగ్, 35 ఫార్మా ఇనిస్టిట్యూట్ల ద్వారా నిపుణులను తయారు చేసుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం 200 ఎకరాలతో విశాఖలో మెగా లైఫ్‌సైన్స్ పార్క్‌ను అభివృద్ధి చేస్తారు. ఈ రంగంలో 100 కోట్ల డాలర్ల పెట్టుబడిని ఆహ్వానిస్తారు. ఆటోమొబైల్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యం. 318 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి, 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావించారు.ఈ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి ఆటో క్లస్టర్లలో 50 శాతం సబ్సిడీతో మౌలికవసతులు కల్పిస్తారు. 10 ఏళ్ల పాటు 100 శాతం సీఎస్టీ టాక్స్ మినహాయింపు ఇస్తారు. వ్యాట్ ను తిరిగి చెల్లిస్తారు. విశాఖపట్నంలో కొత్తగా ఎలక్ట్రానిక్ హబ్‌ను ఏర్పాటు చేస్తారు. కాకినాడలో హార్డ్‌వేర్ పార్క్‌తో పాటు రాష్ట్రంలో మరో 20 చోట్ల ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు.ఈ పరిశ్రమల ఏర్పాటుకు స్టాంపు డ్యూటీలో 100 శాతం, రిజిస్ట్రేషన్, సేల్స్ డీడ్లకు 50 శాతం సబ్సిడీ ఇస్తారు. -
ముందు జీవో...ఆపై వాపస్ లావో!
సర్కారు పిల్లిమొగ్గలు పెట్రోలు, డీజిల్‌పై 5 శాతం వ్యాట్ పెంపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రెండు గంటల్లోనే ఉపసంహరణ సాక్షి, హైదరాబాద్: పెట్రోలు.. డీజిల్‌పై వ్యాట్ పెంపు విషయంలో తెలంగాణ సర్కారు పిల్లి మొగ్గలేసింది. రెండు నెలలు తిరక్కముందే వీటి ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేసింది. ఆదాయాన్ని పెంచుకోవటమే లక్ష్యంగా.. అడ్డగోలు భారం మోపేందుకు ఫైళ్లు కదిపింది. పెట్రోలు, డీజిల్‌పై 5 శాతం వ్యాట్‌ను పెంచుతూ వాణిజ్య పన్నుల విభాగం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఏపీ వ్యాట్-2005’ నిబంధనలను తెలంగాణకు యథాతథంగా స్వీకరిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. చివరి పేజీలో జారీ చేసిన నోటిఫికేషన్లో పెట్రోలుపై 4.80 శాతం, డీజిల్‌పై 5 శాతం వ్యాట్ పెంచుతున్నట్లు అందులో పేర్కొంది. ఇలా ప్రస్తుతం పెట్రోలుపై 35.2 శాతం ఉన్న వ్యాట్‌ను 40 శాతానికి... డీజిల్‌పై 27 శాతం ఉన్న వ్యాట్‌ను 32 శాతానికి పెంచినట్లు అందులో స్పష్టం చేసింది. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్‌పై అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ తొలి స్థానంలో ఉంది. అదేమీ పట్టించుకోకుండా అమాంతం మరో 5 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయటం హాట్ టాపిక్‌గా మారింది. విమర్శలు వెల్లువెత్తడంతో: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుంటే.. రాష్ట్రంలో పెంచుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే అన్ని వర్గాలపై రూ.కోట్లాదిగా అదనపు భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమైంది. ప్రసార సాధనాల్లో ఈ వార్తలు రావటంతో.. ప్రభుత్వం అప్పటికే జారీ చేసిన జీవో నం.31లో చివరి పేజీని తొలగించింది. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ పెంచాలనే ప్రతిపాదనలున్నాయని.. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. పొరపాటు వల్ల ఉత్తర్వులు వెలువడ్డాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ధ్రువీకరించారు. గత నెలలోనే పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ పెంచామని... అప్పటి రేట్లే ఇప్పటికీ అమల్లో ఉన్నాయని.. సీఎం కార్యాలయం ప్రకటన జారీ చేసింది. కొత్తగా వ్యాట్‌ను పెంచే ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసింది. ఇదో హెచ్చరికా..?: ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ. 68,35, డీజిల్ రూ. 56.24 ధరకు లభ్యమవుతోంది. 5 శాతం వ్యాట్ పెంచితే కనీసం రూ. 2 నుంచి రూ.3 వరకు ధరలు పెరిగే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో వ్యాట్ పెంపునకు జీవో జారీ.. వెను వెంటనే ఉపసంహరణ పరిణామాలు సామాన్యులకు సైతం ఆశ్చర్యంగొలిపాయి. ఆదాయ పెంపును లక్ష్యంగా ఎంచుకున్న ప్రభుత్వం.. పన్నుపోటుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోందని... అందులో భాగంగానే ఈ ఉత్తర్వులు బయటకు పొక్కినట్లు స్పష్టమవుతోంది. తాత్కాలికంగా సర్కారు వెనక్కి తగ్గినా... పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేందుకు సర్కారు ప్రయత్నిస్తోందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. -
తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంపు
-
తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంపు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ పెంచింది. పెట్రోల్, డీజిల్‌పై 5 శాతం చొప్పున వ్యాట్ పెంచారు. దీంతో పెట్రోల్‌పై 35 నుంచి 40కి, డీజిల్‌పై 27 నుంచి 32 శాతం వరకు వ్యాట్ పెరిగింది. -
వస్త్ర వ్యాపారులపై వ్యాట్ ఉండదు: తలసాని
రాంగోపాల్‌పేట్: వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ను అమలు చేయబోవడం లేదని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం జనరల్‌బజార్‌లో సికింద్రాబాద్ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చీర శ్రీకాంత్ అలియాస్ సత్యనారాయణతో పాటు 500 మంది వ్యాపారులు, కార్మికులు, విద్యార్థులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.వందల కోట్ల విలువైన సరుకు షాపులో ఉంచుకుని కూడా వ్యాట్ చెల్లించకుండా తప్పించుకునే బడా వ్యాపారులకు అమలు చేస్తే ఎలా ఉంటుందని తాను అధికారులకు సూచించానని వివరించారు. కానీ ఇలా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారికి దీన్ని అమలు చేసే ప్రసక్తి లేదని అన్నారు. గత ప్రభుత్వం వస్త్ర వ్యాపారులపై వ్యాట్ విధిస్తే ఇందిరాపార్కు వద్ద ధర్నాతో పాటు వ్యాపారులకు సంఘీభావం ప్రకటించి ముందుకు వచ్చానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దండె విఠల్, నాగేందర్, అత్తెల్లి మల్లికార్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులపైనా 'వ్యాట్'..!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ బాదుడు నుంచి రైతులనూ మినహాయించడం లేదు. సబ్సిడీపై సూక్ష్మసేద్యం పరికరాలు పొందే రైతుల నుంచి ముక్కుపిండి మరీ వ్యాట్ వసూలు చేస్తోంది. నీటి యాజ మాన్య పద్ధతులను పాటించడం ద్వారా తక్కు వ నీటితో ఎక్కువ సాగు చేసే సూక్ష్మసేద్యం పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రోత్సహిస్తూ, సబ్సిడీ కూడా ఇస్తూ.. మరోవైపు ఇలా రైతులపై భారం మోపడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాట్ భారం లేకుండా చూడాలని రైతులు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో రైతులు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావును సంప్రదించినట్లు సమాచారం. ఒక హెక్టారుకు మించితే 'వ్యాటే'.. సూక్ష్మసేద్యం కోసం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం(ఉచితంగా), బీసీలకు, ఐదెకరాలలోపున్న ఓసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ అందిస్తోంది. తమకు ఇష్టమైన సూక్ష్మ సేద్య కంపెనీ పరికరాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. గతేడాది వరకు కేవలం ఒక హెక్టారు మేరకే సూక్ష్మసేద్యం పరికరాలపై సబ్సిడీ ఇచ్చేవారు. తెలంగాణ సర్కారు దీనిని ఐదు హెక్టార్ల వరకూ పెంచింది. గతంలో ఒక హెక్టారుకు రూ. లక్ష ఖర్చు అయ్యేది. దానికి 5 శాతం వ్యాట్ చొప్పున రూ. 5 వేలను ప్రభుత్వమే చెల్లించేది. రెండు హెక్టార్లు మొదలుకొని ఐదు హెక్టార్ల వరకూ రైతులు సూక్ష్మసేద్యం పరికరాలను కొనుగోలు చేయాలంటే 5 శాతం వ్యాట్ చెల్లించాల్సిందేనని.. దాన్ని తాము చెల్లించబోమని సర్కారు చేతులెత్తేసింది. దీంతో వేలాదిమంది రైతులు వ్యాట్ భారం మోయాల్సి వస్తోంది. విచిత్రమేంటంటే ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీపై సూక్ష్మసేద్యం పరికరాలను ఇస్తున్నా.. హెక్టారుకు రూ. 5 వేల చొప్పున వారు వ్యాట్ చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది 75 వేల మంది రైతులు సూక్ష్మసేద్యం కోసం దరఖాస్తు చేసుకోగా.. అందులో 15 వేల మందికి ఇప్పటికే సూక్ష్మసేద్యం పరికరాలను మంజూరు చేశారు. వీరిలో సుమారు 4 వేల మంది వ్యాట్ నుంచి మినహాయింపు పొందగా.. 11 వేల మంది వ్యాట్ చెల్లించారని ఒక అధికారి అంచనా వేశారు. ఆ ప్రకారం రైతులు రూ.10 కోట్లకుపైగా వ్యాట్ చెల్లిం చినట్లు ఆ అధికారి వెల్లడించారు. వీరిలో రెండున్నర వేల మంది ఎస్సీ, ఎస్టీ రైతులు ఉన్నారు. మరోవైపు 59 వేల మంది రైతులు పరికరాల మంజూరు కోసం వేచి చూస్తున్నారు. ముందే డీడీ చెల్లించాలి.. రైతుల నుంచి వ్యాట్‌ను ముందే ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. రైతులు పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నాక వారి పంట భూములను సంబంధిత అధికారు లు వచ్చి పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే సూక్ష్మసేద్యం పరికరాలకు అనుమతిస్తున్నట్లు ప్రకటిస్తారు. అనంతరం రైతులు హెక్టారుకు మించి ఉండే భూమికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సొమ్ముపై 5 శాతం చొప్పున వ్యాట్‌ను బ్యాంకులో డీడీ తీసి సమర్పించాలి. ఆ తర్వాత వారికి సూక్ష్మసేద్యం పరికరాలను సంబంధిత కంపెనీ నుంచి ఏర్పాటు చేయిస్తారు. కూరగాయలు సాగు చేసే భూముల్లో సూక్ష్మసేద్యం పరికరాలకు రూ. లక్షకు పైగా ఖర్చవుతుంది. ఆ ప్రకారం చూస్తే ఒక హెక్టారున్న రైతులు ఆ మేరకు వ్యాట్ చెల్లించాల్సిందే. -
జేబులు గుల్ల!
ఆదాయం పెంపుపై రాష్ట్ర సర్కారు దృష్టి వస్త్రాలు, బంగారం, సిగరెట్లపైనా వ్యాట్ మోత విలాస వస్తువులు, సేవలపై పన్నుల భారం బడ్జెట్ తర్వాత పెంచాలని సర్కారు యోచన వసూళ్లను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయం కార్పొరేట్ ఆస్పత్రులు, ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టి వచ్చే ఏడాది వాణిజ్య శాఖకు రూ. 39,000 కోట్ల లక్ష్యం నిరుటి కంటే రూ. 15,000 కోట్లు అదనం.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై పన్ను పోటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆదాయం పెంచుకునే మార్గాన్వేషణలో పడిన టీఆర్ఎస్ సర్కారు.. వస్త్ర పరిశ్రమ, బంగారం, సిగరెట్లతో పాటు విలాస వస్తువులు, సేవలపై పన్నుల భారం మోపాలని యోచిస్తోంది. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమపై పన్నుల భారమేమీ లేదు. గతంలో వ్యాట్ విధించినా.. వస్త్ర వ్యాపారుల ఆందోళనతో రాష్ట్ర విభజనకు ముందే కాంగ్రెస్ సర్కారు ఎత్తివేసింది. అయితే ఇప్పుడు వస్త్ర పరిశ్రమపై ఐదు శాతం పన్ను విధించాలని సర్కారు భావిస్తోంది. దీంతో పాటు బంగారంపై ఉన్న ఒక శాతం పన్నును ఐదు శాతానికి పెంచాలని, సిగరెట్లపై ఇరవై శాతం ఉన్న పన్నును మరింతగా పెంచాలని యోచిస్తోంది. ఇక రెస్టారెంట్లు, స్పాలు, షాపింగ్ మాల్‌లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, మెగా స్టోర్లపై పన్ను మరింత పెంచాలని భావిస్తోంది. అంతేగాకుండా పన్నుల వసూలును మరింత కట్టుదిట్టం చేసే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యసేవలకు ఇబ్బడి ముబ్బడి చార్జీలు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు పన్నుల ఎగవేతలో మొదటి స్థానంలో ఉన్నాయని.. వీటి నుంచి పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సర్కారు యోచిస్తోంది. ఆ తర్వాతే.. ఎంతమేరకు పన్ను పెంచాలి, ఏయే వస్తువులు, సేవలపై పెంచాలనే విషయంలో స్పష్టత లేకున్నా.... పన్నులు పెంచటం ఖాయమని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇప్పటికే వెల్లడించారు. ఆయన సారథ్యంలో ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం వివిధ రాష్ట్రాల్లో పన్నుల తీరుపై అధ్యయనం చేస్తోంది. అయితే ఈ నెల 11న ప్రవేశపెట్టే బడ్జెట్లో కొత్త పన్నుల విషయాన్ని ప్రస్తావించకుండా... తర్వాతే పన్ను పోటు వేయాలనేది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చే సిఫారసుల ఆధారంగా పన్నుల పెంపు, సవరణ ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పేదలపై పన్నుల భారం పడకుండా, సంపన్న, వ్యాపార వర్గాలను లక్ష్యంగా ఎంచుకొని కొంత మేర పన్నులు పెంచడం తప్పనిసరని అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించిన కేబినెట్ భేటీలో తీర్మానించినట్లు సమాచారం. పెంచక తప్పని పరిస్థితి.. గత ఏడాది ఆదాయ వ్యయాల స్థితిగతుల్లోని డొల్లతనం ఈ సారి బడ్జెట్ తయారీ సమయంలో బయటపడింది. దీంతో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్రం నుంచి ఆశించినన్ని నిధులు రాకపోవటం, తెలంగాణను ఆర్థిక సంఘం మిగులు రాష్ట్రంగా గుర్తించటం, అదనంగా రుణ పరిమితి పెరగకపోవటం, గత ఏడాది భూముల అమ్మకంపై ఆశించిన ఆదాయం రాకపోవటం వంటి అంశాల నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఇరకాటంలో పడింది. మిగులు రాష్ట్రమని సంబురపడాలో, అంచనాలకు తగినట్లుగా ఆదాయం లేదని చింతించాలో తెలియని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది. గాడిలో పెట్టాల్సిందే.. ఆదాయం తెచ్చే మార్గాలను అన్వేషించడంతో పాటు వ్యయాన్ని నియంత్రించే చర్యలు చేపడితే తప్ప రాష్ట్ర ఆర్థిక పురోగతి గాడిలో పడే పరిస్థితి లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే సర్కారును అప్రమత్తం చేసింది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పది నెలల వ్యవధిలోనే ఆశల పల్లకీ నుంచి దిగివచ్చి, ఆర్థిక వ్యవహారాల్లో వాస్తవాలను గుర్తించింది. ఆదాయం తెచ్చి పెట్టాల్సిన విభాగాలు ఆశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడంపై ఇటీవల వివిధ శాఖలతో చర్చల సందర్భంగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల విభాగం ద్వారా 2014-15లో మొత్తం రూ. 27,777 కోట్ల ఆదాయం వస్తుందని గత బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది. కానీ జనవరి నెలాఖరు వరకు కేవలం రూ. 18,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఫిబ్రవరి, మార్చి రెండు నెలల వ్యవధిలో కనీసం మరో రూ. 6,000 కోట్లు ఆదాయం రాబట్టాలని ఆర్థిక శాఖ సూచించింది. ఈ లెక్కన చూసినా మొత్తంగా రూ. 24,000 కోట్లకు మించి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. భారీ అంచనా ‘మోత’కేనా? సర్కారు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వచ్చే ఏడాది రూ. 39,000 కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వాస్తవ రాబడి అయిన 24,000 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రూ. 15 వేల కోట్లు ఎక్కువ. సాధారణ వృద్ధి రేటు ప్రకారం ఏటా పది నుంచి ఇరవై శాతం వరకు పన్నుల ఆదాయం పెరుగుతుందనేది వాణిజ్య పన్నుల శాఖ అంచనా. ప్రభుత్వం ఎంచుకున్న ఆదాయ లక్ష్యాన్ని చూస్తే.. సాధారణంగా పెరిగేది పోను మరో రూ. 8 వేల కోట్లు అదనంగా సంపాదించాలనేది సర్కారు ధ్యేయంగా కనిపిస్తోంది. -
పసిడి పరుగు పైపైకేనా..
- తెలంగాణలో బంగారంపై భారీగా వ్యాట్ మోత! - ఐదు శాతానికి పెంచాలని సర్కారు సూత్రప్రాయ నిర్ణయం - సీఎం ఆమోదమే ఆలస్యం.. ప్రస్తుతం విధిస్తున్నది ఒక్క శాతమే - పెంపుతో రూ. 500 కోట్లకు పెరగనున్న ఆదాయం - గిరాకీ పక్క రాష్ట్రాలకు పోతుందని తెలంగాణ వ్యాపారుల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సామాన్యులకు బంగారం మరింత ప్రియం కాబోతుంది. ఏ స్థాయి వారైనా పెళ్లిళ్లు, శుభకార్యాలకు తప్పనిసరిగా కొనుగోలు చేసే బంగారం, ఆభరణాలపై భారీగా పన్ను విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బంగారంపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను ప్రస్తుతమున్న 1 శాతం నుంచి 5 శాతానికి పెంచాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. నిత్యావసర వస్తువులపైనా 5 శాతం పన్ను విధిస్తున్న నేపథ్యంలో ఖరీదైన బంగారు ఆభరణాలపై ఒక శాత మే పన్ను వేయడం చాలా తక్కువని, దాన్ని 5 శాతానికి పెంచితే సామాన్యులకు నష్టమేమీ ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా బంగారంపై 5 శాతం వ్యాట్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సర్కారు నిర్ణయించినట్లు అత్యున్నతవర్గాల సమాచారం. ఈ అంశంపై రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో వాణిజ్య మంత్రి తలసాని ఇటీవలే సమావేశమై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. పన్ను పెంపు వల్ల వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా బంగారం తరలిరాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై కూడా ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. బంగారంపై వ్యాట్ పెంపు ప్రతిపాదనపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకోవడమే తరువాయి. దేశంలో మహారాష్ట్రలో మాత్రమే బంగారం, ఆభరణాలపై 1 శాతం ఉన్న వ్యాట్‌ను 1.10 శాతానికి పెంచుతూ అక్కడి ప్రభుత్వం రెండేళ్ల కిందట నిర్ణయం తీసుకుంది. ఒకవేళ రాష్ర్ట ప్రభుత్వం 5 శాతం పన్ను విధిస్తే బంగారంపై ఈ స్థాయిలో వ్యాట్ వసూలు చేసే ఏకైక రాష్ర్టంగా తెలంగాణ నిలుస్తుంది. అలాగే ఇప్పటికే పేదలు, దిగువ మధ్య తరగతికి అందని ద్రాక్షలా ఉన్న బంగారం ఇక ఎప్పటికీ అందకుండా పోతుంది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం రాష్ట్రంలో బంగారం విక్రయాలకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు పెట్టింది పేరు. సీజన్, బులియన్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా రాజధానిలో నిత్యం కోట్ల విలువైన బంగారు ఆభరణాల విక్రయాలు సాగుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ప్రజలంతా ఇతర జిల్లాల నుంచి రాజధానికే వచ్చి బంగారం కొనుగోలు చేయడం పరిపాటి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని 10 జిల్లాల్లో బంగారం విక్రయాల మీద 1 శాతం వ్యాట్ రూపంలో నెలకు సరాసరి రూ. 7.50 కోట్లు వసూలవుతోంది. అంటే వాణిజ్య శాఖకు ఏటా రూ. 90 కోట్ల వరకు రెవెన్యూ వస్తోంది. బులియన్ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రెవెన్యూలో స్వల్ప తేడాలున్నా ఏటా వంద కోట్లను వాణిజ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో బంగారంపై విలువ ఆధారిత పన్ను రేటును 5 శాతానికి పెంచితే ఏటా రూ. 500 కోట్ల రెవెన్యూ సాధించవచ్చని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో అటూఇటుగా రూ. 27 వేలు ఉంది. దీనికి వ్యాట్ రూపంలో రూ. 270 చెల్లించాల్సి ఉంటుంది. వ్యాట్‌ను 5 శాతానికి పెంచితే పన్ను చెల్లింపు రూ. 1,350కి పెరుగుతుంది. ఇలాగైతే రాష్ర్ట ప్రజలు బంగారం కొనుగోళ్ల కోసం పక్క రాష్ట్రాలకు వెళతారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కాగా పన్ను వసూళ్లకు రూ.5 కోట్లతో సాఫ్ట్వేర్ సర్కారుకు ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పన్నుల శాఖలోని లోపాలను సవరించి పన్ను వసూళ్లను పెంచుకునేందుకు సర్కారు కొత్త మార్గాలను కనిపెడుతోంది. ప్రధానంగా ప్రైవేటు ఆసుపత్రులు, రెస్టారెంట్లు, బట్టల దుకాణాలు వంటి వాటిపై దృష్టి పెట్టింది. వినియోగదారుల నుంచి వ్యాట్ పేరుతో వసూలు చేస్తున్న పన్నుకు, ఆయా సంస్థలు సర్కారుకు చెల్లిస్తున్న దానికి భారీ వ్యత్యాసం ఉం టోంది. ఈ నేపథ్యంలో 5 కోట్లతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆసుపత్రులు, హోటళ్లు, బట్టల దుకాణాలు, ఇతరత్రా గుర్తించిన వ్యాపార కేంద్రాల్లో ఏర్పాటు చేయడం ద్వారా బిల్లింగ్ ప్రక్రియ పూర్తిగా వాణిజ్యపన్నుల శాఖ అధీనంలోకి వెళ్తుంది. తద్వారా వినియోగదారుడి నుంచి పన్ను వసూలు చేసి వాణిజ్య శాఖకు చెల్లించకుండా ఎగవేసే వారికి చెక్ పడనుంది. -
సరిహద్దులో పెట్రోల్‌కు డిమాండ్
ఏపీలో వ్యాట్ విధించడంతో కర్ణాటకకు వస్తున్న వాహనాలు బళ్లారి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విధించడం కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల పెట్రోల్ బంకుల యజమానులకు వరంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గిపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగినంతగా తగ్గించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యాట్ రూపంలో ఆంధ్రాలో మరింత భారాన్ని రుద్దడంతో ఈ రెండు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీగా వ్యత్యాసం ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక సరిహద్దుకు పెట్రోలు, డీజిల్ కోసం భారీగా వాహనాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాట్ ప్రభావంతో పెట్రోల్ లీటరుకు రూ.4 పెరిగింది. గత పరిస్థితులకు భిన్నం ఆంధ్రప్రదేశ్‌లో మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ లేదు. దీంతో ధరలు కర్ణాటక కంటే ఆంధ్రప్రదేశ్‌లో లీటరుకు నాలుగు రూపాయలు తక్కువ ఉండేది. దీంతో పదేళ్లపాటు ప్రతి నిత్యం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని పెట్రోల్ బంకులకు కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్లేవి. ప్రస్తుతం ప్రతి లీటరుకు నాలుగు రూపాయలు ఎక్కువగా ఉండడంతో ఏపీలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారు క్యాన్లలో పెట్రోల్ తీసుకెళ్లుతున్నారు. రైతులు ట్రాక్టర్లలో వచ్చి పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లుతున్నారు. -
చమురు మంటలు
విజయవాడ : పెట్రోలు, డీజిల్ ధరల పెంపు కారణంగా చెలరేగిన మంటలు జిల్లాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పేరుతో దొంగదెబ్బ తీసిందని వినియోగదారులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమానికి సద్ధమయ్యాయి. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ విధించడం వల్ల ప్రత్యక్షంగా వాహన యజమానులపై, పరోక్షంగా సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో దాదాపు 10 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటిలో 70శాతం మధ్య తరగతి ప్రజలు వినియోగించే ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. జిల్లాలో ఐవోసీ, హెచ్‌పీ, బీపీసీకి చెందిన 220 బంకులు నడుస్తున్నాయి. ఈ బంకుల్లో సగటున రోజుకు 2.20లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్ విక్రయిస్తున్నారు. వ్యాట్ పేరుతో శుక్రవారం నుంచి లీటరు పెట్రోలుపై రూ.4.04, డీజిల్‌పై రూ.4.03 పైగా పెంచడంతో మోటారు వాహనాల యజమానులపై రోజుకు రూ.8.80లక్షలు, నెలకు రూ.2.64కోట్ల అదనపు భారం పడుతుంది. బైక్ వినియోగించేవారిపై సగటున రోజుకు రూ.8, కార్లు వినియోగించేవారిపై రూ.80 చొప్పున అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రజలపై పరోక్షంగా భారం ఇంధన ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై కూడా పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. రవాణా వ్యవస్థపై భారం పడుతుంది. లారీలు, ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు కిరాయిలు పెంచే ప్రమాదం ఉంది. దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్టీసీకి అదనపు భారంగా మారింది. జిల్లాలోని 900 ఆర్టీసీ బస్సులకు రోజూ 90వేల లీటర్ల డీజిల్ వినియోగిస్తుంటారు. లీటరకు రూ.4.03 చొప్పున పెరగడంతో రోజుకు రూ.3.60లక్షలకు పైగా భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వ్యాట్ పెంపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తమను నిలువునా ముంచిందని పెట్రోల్ బంకుల యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముందుగానే స్టాక్ ఉన్నందున దానికి తాము టాక్స్ చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రజలపై భారం పడుతుంది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ధర పెంచుతోంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పేరుతో రూ.4కు పైగా పెంచింది. ఆదాయం కోసమే ప్రభుత్వం వ్యాట్ విధించింది. ఈ భారం పేద, మధ్య తరగతి వర్గాలపై పడుతుంది. మన రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాల్లో ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. లారీలు, కార్లు ఇతర దూర ప్రాంతాలు వెళ్తాయి కాబట్టి అక్కడ ఆయిల్ కొనుగోలు చేస్తారు. మన రాష్ట్రంలో అమ్మకాలు తగ్గుతాయి. దీనిపై మంత్రులకు లేఖ రాశాం. - వైవీ ఈశ్వర్, జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ -
అక్కడ తగ్గినా.. ఇక్కడ తగ్గలేదు!
-
ఆ పెంపును ఉపసంహరించాల్సిందే
వైఎస్సార్సీపీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను, పెట్రోలు, డీజిల్‌పై పెంచిన వ్యాట్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విద్యుత్ చార్జీల పెంపుపై ఒక్క అడుగు ముందుకు పడినా, ఒక్క పైసా చార్జీలు పెంచినా ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో పైసా విద్యుత్ చార్జీలు పెంచేది లేదని, 2013-14లో పెంచిన విద్యుత్ చార్జీలు కూడా తగ్గిస్తామని 2013 ఏప్రిల్ 2న కాకినాడలో తాను చేసిన ప్రకటన కనీసం చంద్రబాబునాయుడుకు గుర్తుందా అని ప్రశ్నించింది. 1994 నుంచి నేటివరకు ఈ 21 ఏళ్ల కాలంలో టీడీపీ మొదటి పదేళ్లు పరిపాలించి ఏటా కరెంటు చార్జీల వాత పెట్టే విధానాన్ని అనుసరించిందని గుర్తుచేసింది. 2004-2009 మధ్య దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల మూడు నెలల కాలంలో మాత్రమే రాష్ట్రంలో ఏ ఒక్క కేటగిరీకి ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తుచేసింది. 2004-2009 మధ్య రైతులకు సరఫరా చేసిన ఉచిత విద్యుత్తు 800 కోట్ల యూనిట్ల నుంచి 1,400 కోట్ల యూనిట్లకు పెరిగినా ఆ ఐదేళ్లలో ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని, ఆర్టీసీ చార్జీలు, పన్నులు కూడా పెంచని ఏకైక సువర్ణయుగం అదేనని పేర్కొంది. వైఎస్సార్ మరణం తరువాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు.. చంద్రబాబు బాటలో నడిచి వేలకోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారని, ఆనాడు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు టన్నుకు 130 నుంచి 140 డాలర్ల మధ్య ఉండడాన్ని కారణంగా పేర్కొన్నారని తెలిపింది. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ధర ఒకప్పటి 110 డాలర్ల నుంచి బ్యారల్‌కు 50 డాలర్లు పడిపోయిందని, బొగ్గు ధరలు కూడా 130-140 డాలర్ల నుంచి 62 డాలర్లకు పడిపోయాయని ఇలాంటి సమయంలో కరెంటు చార్జీలు తగ్గించాల్సింది పోయి పెంచే ప్రయత్నం చేయడం అంటే ప్రజలతో చెలగాటం ఆడటమేనని పేర్కొంది. దేశంలోనే వ్యాట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని ప్రతిపక్ష నాయకుడిగా వాదించిన చంద్రబాబు ఈ రోజున పెట్రో ఉత్పత్తులపై మరో రెండు శాతం వ్యాట్ పెంచడం సిగ్గుచేటని విమర్శించింది. పెంచిన వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. 2013 మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యుత్ చార్జీలు పెంచినపుడు చంద్రబాబునాయుడు ఏం మాట్లాడారో గుర్తుతెచ్చుకోవాలని సలహా ఇచ్చింది. 2013లో చంద్రబాబు ఏం మాట్లాడారు? పెంచిన కరెంటు చార్జీలను బేషరతుగా తగ్గించాలని లేకుంటే ప్రభుత్వం నుంచి వైదొలగాలని, విద్యుత్ చార్జీల పెంపు ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని, ప్రభుత్వ చేతకాని తనానికి ప్రజలు పరిహారం చెల్లించాలా.. అని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు ప్రశ్నించారని గుర్తుచేసింది. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు సర్కారుపై తిరగబడాలని చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారని.. మరి ఈ రోజున ప్రజలు చంద్రబాబు సర్కారు మీద తిరగబడరా? అని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని 2013 ఏప్రిల్ 1న కాకినాడలో చంద్రబాబు ప్రకటించారని, ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక్క పైసా విద్యుత్ చార్జీలు పెంచినా ప్రజలు వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. -
సర్కారు దొంగ దెబ్బ!
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంపు..ఇకపై ధరలెప్పుడు పెరిగినా భారీ వడ్డనే! జనవరి 16న రూ. 2 పెంపుకు సవరణ పేరిట 5 శాతం వ్యాట్ పెంపు పెట్రోల్ 31 శాతం నుంచి 35.2 శాతానికి,డీజిల్ 22.25 శాతం నుంచి 27 శాతానికి వ్యాట్ ఇప్పటికీ పక్క రాష్ట్రాలకన్నా లీటర్‌పై రూ. 2.60 అదనపు వసూలు సాక్షి, హైదరాబాద్: పెట్రో బాదుడు విషయం లో తాత్కాలిక ప్రయోజనంకన్నా వ్యాట్ ద్వారా శాశ్వత ఆర్థిక ప్రయోజనాలకే రాష్ట్ర సర్కారు మొగ్గు చూపింది. తద్వారా వినియోగదారులను దొంగదెబ్బ తీసింది. అంతర్జాతీ యంగా ముడి చమురు ధరలు తగ్గినా, పెరి గినా తన రాబడికి భంగం కలగకుండా విలువ ఆధారంగా పన్ను పెరిగేలా నిర్ణయం తీసుకుంది. జనవరి 16న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినప్పుడు లీటర్‌కు రూ 2 చొప్పున నికరంగా అదనపు వ్యాట్ వసూలు చేసిన ప్రభుత్వం, సవరణ పేరుతో దీన్ని వ్యాట్ శాతాల్లోకి మార్చి శాశ్వతీకరించింది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రెండు రూపాయల చొప్పున వ్యాట్ పెంచడం వల్ల అది ఎంత శాతం పెరుగుదలో లెక్క కట్టి ఆ మేరకు సర్దుబాటు చేసినట్లు చూపుతూ...కొత్త కసరత్తు చేసింది. పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతం ఉన్న విలు వ ఆధారిత పన్ను (వ్యాట్)ను ఏకంగా ఐదు శాతం వరకు పెంచింది. దాంతో వ్యాట్ పెట్రోల్‌పై 31 శాతం నుంచి 35.2 శాతానికి, డీజిల్‌పై 22.25 శాతం నుంచి 27 శాతానికి పెరిగాయి. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయి. తద్వా రా ఇకపై ఎప్పుడు పెట్రో ధరలు పెరిగినా అది వ్యాట్ శాతంలోకి మారి తెలంగాణలో రిటైల్ ధరలు అమాంతం పెరుగుతాయి. అంతేకాదు, పెట్రోల్, డీజిల్‌పై ఇప్పటికే దేశంలోనే అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్న రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రికార్డును తెలంగాణ తిరగరాసి మొదటిస్థానానికి ఎగబాకింది. తాజా పెంపు వల్ల బుధవారం కేంద్రం పెట్రో ధరలు తగ్గిం చాక రాష్ట్రంలో రిటైల్ మార్కెట్లో పెద్దగా తేడా కనిపించకపోయినా, జనవరి 16న పెంచిన రూ.2 తేడా దాదాపు అలాగే కొనసాగుతోంది. ఎందుకంటే కిందటి తగ్గుదల వల్ల వినియోగదారులకు చేకూరాల్సిన సుమారు రూ.2 లబ్ధి వ్యాట్ పెంపు వల్ల దక్కకుండాపోయింది. దాంతో బుధవారంనాటి తగ్గింపు తర్వాత కూడా ఏపీ సహా పలు పొరుగు రాష్ట్రాలకన్నా తెలంగాణలో పెట్రోలు ధర లీటర్‌కు రూ.2.6 ఎక్కువగా ఉంది. జనవరి 16న లీటర్‌కు 2 రూపాయలు పెంచడం వల్ల ప్రజలకు నెలకు రూ. 80 కోట్ల లబ్ధి రాలేని స్థితి ఉంది. ఇప్పుడు వ్యాట్శాతాన్ని పెంచడంవల్ల ఆ మొత్తంలో తేడా లేకపోగా, ఒకవేళ ఏ మాత్రం ధర పెరిగినా వ్యాట్ప్రకారమే భారం పడనుంది. వ్యాట్ పెంపు వల్ల ధరలు పెరగలేదు ఇటీవల పెంచిన వ్యాట్‌ను సవరిస్తూ విలువపై పన్ను వేశాం. దీనివల్ల ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ లీటర్ ధరలో తేడా ఉండదు. చమురు సంస్థలు ధర తగ్గించినప్పుడల్లా ఇక్కడ కూడా ధరలు తగ్గుతాయి. - వాణిజ్యపన్నుల శాఖ , అదనపు కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి కేంద్రం ధరలు పెంచితే వినియోగదారుడిపై భారం తెలంగాణ సర్కార్ చాలా తెలివిగా వ్యవహరించింది. వ్యాట్ మీద లీట ర్‌పై పెరిగిన రెండు రూపాయల పన్నును సవరిస్తున్నట్టు చెప్పినా, భవిష్యత్తులో ఇది ఆందోళనకరమే. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగి తే ఆ విలువ ఆధారంగా ఐదు శాతం వరకు పన్ను పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వానికి లభించింది. ఈ నిర్ణయం వల్ల 10 నుంచి 15 పైసలు రేపటి నుంచి రిటైల్‌లో తగ్గినట్టు కనిపించినా, జనవరి 16 నాడే పెరిగిన రెండు రూపాయల వల్ల ఇప్పటికీ పక్క రాష్ట్రాలకన్నా రాష్ట్రంలో రూ. 2.60 ఎక్కువగా ఉంది. -వినయ్, తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి -
ఏపీలోనూ పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ బాదుడు!
హైదరాబాద్: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలతో వినియోగదారుడికి ఉపశమనం లభించిందనే లోపులే వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిరి చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. అదే బాటను ఏపీ ప్రభుత్వం కూడా అనుసరించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో వ్యాట్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందన్నారు.ఇందులో భాగంగానే వ్యాట్ ను పెంచేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. -
మరోసారి పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచిన టీ.ప్రభుత్వం
హైదరాబాద్: మరోసారి తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పెట్రోల్ పై ఉన్న 31 శాతం వ్యాట్ ను 35. 25 కు పెంచగా, డీజిల్ పై 22.25 శాతం నుంచి 27 శాతానికి పెంచింది. ఈ మేరకు గురువారం కేసీఆర్ ప్రభుత్వం ఓ ప్రకటనలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా తగ్గినా.. ఆ రాయితీ వినియోగదారుడికి అందని ద్రాక్షగానే మిగిలిపోనుంది. ఆదాయ మార్గాల అన్వేషణలో ఉన్న సర్కారుకు పెట్రో ధరలపై విధించే పన్ను అయాచిత వరంగా కలిసొచ్చింది. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకునే పేరుతో వ్యాట్ గతనెల్లో కూడా బాది మరీ ప్రజల నడ్డి విరిచింది. అంతర్జాతీయ చమురు ధరలు తీవ్రస్థాయిలో పడిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రో ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. వరుసుగా రెండో సారి వ్యాట్ ను పెంచడం వినియోగదారుల్లోఆందోళన కల్గిస్తోంది. -
పెట్రోల్,డీజిల్ పై వ్యాట్ మోత!
-
తెలంగాణలో పెట్రోల్‌పై వ్యాట్ వాత!
-
తెలంగాణలో వ్యాట్‌తో వాత
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం లీటర్‌కు రూ. 2 పెంచుతూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలు చేసిన సర్కారు నెలకు రూ. 80 కోట్ల వరకు పెరగనున్న ఆదాయం దేశవ్యాప్తంగా రూ. 2.50 వరకు పెట్రో ధరలు తగ్గినా.. రాష్ట్రంలో మాత్రం 50 పైసల్లోపే ఎక్సైజ్ సుంకం పెంపుతో కేంద్రం కూడా అదే బాట అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా వినియోగదారులకు దక్కని ప్రయోజనం సాక్షి, హైదరాబాద్:‘సందట్లో సడేమియా’ అన్నట్లుగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం దొంగదెబ్బ కొట్టింది! ఆదాయ మార్గాల అన్వేషణలో ఉన్న సర్కారుకు పెట్రో ధరలపై విధించే పన్ను అయాచిత వరంగా కలిసొచ్చింది. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకునే పేరుతో ‘వ్యాట్’తో బాది మరీ రాష్ర్ట ప్రజల నడ్డి విరిచింది. అంతర్జాతీయ చమురు ధరలు తీవ్రస్థాయిలో పడిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రో ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. నిజానికి పెట్రోలు ధర లీటర్‌కు రూ. 4.42, డీజిల్‌పై రూ. 4.25 తగ్గినప్పటికీ.. పనిలోపనిగా కేంద్రం కూడా ఎక్సైజ్ సుంకాన్ని రెండు రూపాయలు పెంచుకుని తన ఖజానా నింపుకొన్నది. దీంతో వినియోగదారునికి మాత్రం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.42, రూ. 2.25 వరకే ప్రయోజనం చేకూరింది. గత శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే రాష్ర్టం కూడా అదే బాటను అనుసరించింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్‌ను ఉన్నపళంగా లీటర్‌కు రెండు రూపాయలు పెంచేసింది. శుక్రవారం అర్ధరాత్రే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ర్టంలోని వినియోగదారులకు పెట్రో ధరల తగ్గింపు ప్రయోజనం పైసలకే పరిమితమైంది. కానీ వాహనదారుల జేబుల్లోకి వెళ్లాల్సిన డబ్బును లాక్కున్న రాష్ర్ట ప్రభుత్వానికి మాత్రం ఏటా దాదాపు రూ. 960 కోట్లు సమకూరనున్నాయి. అంటే నెలకు రూ. 80 కోట్ల అదనపు ఆదాయమన్నమాట! మొత్తానికి అంతర్జాతీయంగా చమురు ధరలు అంతకంతకూ పడిపోతున్నా.. ఆ ప్రయోజనాన్ని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలే సొమ్ము చేసుకుంటున్నాయి. చమురు ధరలు పెరిగినప్పుడు వెంటవెంటనే పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచేసిన ప్రభుత్వాలు.. అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు కూడా తమ ఖజానా నింపుకోడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. ఒకేసారి భారీ మోతకే నిర్ణయం కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని కొంతమేర పెంచుతూ వస్తోంది. ఈ నెల 2న కూడా ధరలు పడిపోయినప్పుడు అంతమేర ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుని వినియోగదారుడికి మొండిచేయి చూపింది. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ మీద రెండు శాతం వ్యాట్ పెంచాలని భావించింది. ప్రస్తుతం పెట్రోల్ మీద 31 శాతం, డీజిల్ పై 22.25 శాతం వ్యాట్‌ను వసూలు చేస్తోంది. ఈలోగానే మళ్లీ ధరలు తగ్గడంతో రాష్ర్ట ప్రభుత్వం లెక్కలేసుకుంది. రెండు శాతం వ్యాట్ పెంచడం వల్ల పెట్రోల్ మీద రూ. 1.50 మేర, డీజిల్పైరూపాయిలోపే ఆదాయం పెరిగే అవకాశముంది. దీనివల్ల పన్ను పెంచిన పేరే తప్ప ఆదాయం సమకూరదని సర్కారు భావించింది. దీంతో కనీసం రెండు రూపాయలు పెంచాలని నిర్ణయించింది. తద్వారా ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు నెల రోజుల్లో దాదాపు రూ. 78 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆమోదంతో రాత్రికి రాత్రే జీవో నంబర్ 3ను జారీ చేశారు. ఈ పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగస్టు నుంచి ఆదాయంలో తగ్గుదల రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో వచ్చే ఆదాయంలో ఎక్సైజ్ తర్వాత పెట్రోల్, డీజిల్ వాటానే ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల 90 వేల కిలో లీటర్ల పెట్రోల్, 3 లక్షల కిలో లీటర్ల డీజిల్ వినియోగం ఉంటుందని అంచనా. దీని ప్రకారం నెలకు రూ. 500 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. అయితే పెట్రో ధరల తగ్గుదల నేపథ్యంలో ఆగస్టు నుంచి నెలనెలా రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు వ్యాట్ ఆదాయంలో కోత పడుతోంది. గత ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వ్యాట్ కింద రూ. 3,921 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా, దాదాపు రూ. 700 కోట్ల లోటు ఏర్పడింది. దీన్ని పూడ్చుకోడానికి వినియోగదారులపై భారం మోపడం తప్పలేదని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సుంకం పెంపు శోచనీయం సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాలు విధించడం శోచనీయమని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినా కేంద్రం ధరలు తగ్గించకుండా ప్రతీ లీటర్‌పై రూ.2 సుంకాన్ని విధించడం సహేతుకం కాదని, వెంటనే పెంచిన సుంకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్నారు. చమురు ధరలు పెరిగితే మధ్యతరగతి, ఇతర వర్గాల ప్రజలపై జీవనవిధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రెండు ప్రభుత్వాలు దొడ్డిదారిన ప్రజలపై పన్నుల భారాన్ని మోపేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పెట్రోల్, డీ జిల్ధరలపై రెండుశాతం వ్యాట్ విధించడం తగదన్నారు. పెంచిన సుంకాన్ని ఎత్తేయాలి సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేసి. వినియోగదారులకు వెసులుబాటు కలిగించాలని సీపీఎం తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధర లు తగ్గుతున్నా, దానికి అనుగుణంగా ధరలు తగ్గించకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెం చడాన్ని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. గత ఏడాది జూన్‌లో 115 డాలర్లున్న గ్యాలన్ ముడిచమురు ధర నేడు 46 డాలర్లకు పడిపోయిందని, అందువల్లే పెట్రోల్,డీజిల్ ధరలను రూ.రెండుకు పైగా తగ్గించారన్నారు. అయితే సందట్లో సడేమియాగా కేంద్రం ఎక్సైజ్ సుంకం లీటర్‌కు పెట్రోల్‌పై రూ.7.96, డీజి ల్‌పై రూ.8.95 పెంచిందని విమర్శించారు. ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయని పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రభుత్వం, ఈ ధరలు తగ్గినపుడు కూడా ధర లు తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. -
మొబైల్ఫోన్ల ధరలు తగ్గే ఛాన్స్!
న్యూఢిల్లీ: దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించే దిశగా ఆయా కంపెనీలకు 15 ఏళ్ల పాటు పన్నుపరమైన మినహాయింపులు ఇవ్వాలని కేంద్ర టెలికం విభాగం (డాట్) ప్రతిపాదించింది. అలాగే, విలువ ఆధారిత పన్నులనూ (వ్యాట్) తక్కువ స్థాయిలో ఉంచాలని పేర్కొంది. వియత్నాంలో తయారీ రంగానికి 30 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా అలాంటి విధానమే తీసుకురావాలని డాట్ యోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు డాట్ ఇన్వెస్ట్మెంట్ సెల్.. ఆర్థిక శాఖకు పలు సిఫార్సులు చేసింది. ప్రస్తుతం 8.8-15 శాతం దాకా ఉంటున్న వ్యాట్‌ను 4 లేదా 5 శాతం స్థాయికి తగ్గించి, ఒకే రీతిగా అమలు చేయాలని పేర్కొంది. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గగలవని తెలిపింది. అలాగే పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు కల్పించేలా ఆదాయపు పన్ను చట్టంలోని 35 ఏడీ నిబంధన పరిధిలోకి మొబైల్ ఫోన్లను, ట్యాబ్లెట్ల తయారీ సంస్థలను కూడా తీసుకురావాలని సూచించింది. మరోవైపు, దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పరిశ్రమతో కలిసి ప్రభుత్వం సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. -
వంటగ్యాస్‌పై వ్యాట్ వాత!
* 32.71 లక్షల వినియోగదారులపై రూ. 7.19 కోట్ల వ్యాట్ భారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలోని మూడు జిల్లాల్లో శనివారం నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. తొలిదశలో పథకం అమలవుతున్న హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని వినియోగదారులు ఇకపై రాయితీయేతర సిలిండర్‌కు రూ. 952 ధర చెల్లించాలి. తర్వాత ప్రభుత్వ సబ్సిడీ వినియోగదారుల ఖాతాలో జమవుతుంది. ఇంతమొత్తాన్ని ఒకేసారి చెల్లించడమే పేద, దిగువ మధ్యతరగతి వినియోగదారులకు తలకు మించిన భారం కాగా, వ్యాట్‌రూపంలో మరో రూ. 22 అదనంగా వడ్డించబోతున్నారు. తొలిదశలో 3 జిల్లా ల్లో ఉన్న 32.71 లక్షల మంది వినియోగదారులపై వ్యాట్ రూపంలో సుమారు రూ. 7.19 కోట్ల భారం పడనుంది. ఈ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తేనే రాయితీ మొత్తం రూ. 508 వినియోగదారుని ఖాతాలో జమ అవుతుందని, లేకుంటే వ్యాట్ మినహాయించి రూ.486 ఖాతాలో పడుతుందని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. రాయితీరహిత సిలిండర్ ధర రూ. 952లో 5 శాతం అంటే రూ. 45 వరకు వ్యాట్ ఉంటుంది. వినియోగదారుడు చెల్లించే ధర రూ. 444 పోనూ... మిగతా రూ. 508లో వ్యాట్ రూ. 22 వరకు ఉంటుంది. ఈ మొత్తం పోగా మిగిలిన రూ. 486 మాత్రమే వినియోగదారుని ఖాతాలో జమయ్యే అవకాశముంది. అయితే వ్యాట్ ను తెలంగాణ ప్రభుత్వం భరించాలని కోరుతూ సంబంధిత అధికారులకు లేఖ రాసినట్లు చమురు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. దీనిపై శనివారం స్పష్టత వచ్చే అవకాశముంది. ఇప్పటికే నగదు బదిలీ మార్గదర్శకాలను ప్రకటించిన ప్రభుత్వం ఈ పథకానికి ఆధార్ తప్పనిసరి కాదని తెలిపింది. నగదు బదిలీకి బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుందని, ఎల్పీజీ కనెక్షన్‌కు ఖాతాను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా ఆ ఖాతాలో జమవుతుందని వెల్లడించింది. ఫిబ్రవరి 14 వరకు పథకంలో చేరకపోయినా, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినా.. ఈ 3 నెలలు రాయితీ ధరకే సిలిం డర్ అందిస్తామని ప్రకటించింది. నగదు బదిలీ అమలు కానున్న 3 జిల్లాల పరిధిలో దాదాపు 32.71 లక్షల మంది వినియోగదారులున్నారు. వీరిలో సుమారు 25.04 లక్షల మంది వినియోగదారులకే బ్యాంకు ఖాతాల అనుసంధానం జరి గింది. ఈ లెక్కన 74.9 శాతం మందే శనివారం నుంచి నగదు బదిలీ పరిధిలోకి వస్తారు. మిగతా వారికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలోనే సబ్సిడీ సిలిండర్‌ను అందజేస్తారు. 3 నెలల్లో వీరు తమ గ్యాస్ కనెక్షన్‌కు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలి. గ్యాస్ అక్రమ మార్గాలను నివారించేందుకే దీన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం కింద ఆధార్‌తో సంబంధం లేకుండా వినియోగదారులకు బ్యాంక్ ఖాతా ఉంటే సబ్సిడీ నగదు రూపంలో బదిలీ అవుతుందని హెచ్‌పీసీఎల్ సీనియర్ మేనేజర్, రాష్ట్రస్థాయి సమన్వయకర్త శ్రీనివాస్, ఎల్పీజీ ముఖ్య ప్రాంతీయ మేనేజర్ ఎంబీ ఇంగోలే శుక్రవారం స్పష్టం చేశారు. బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోని వినియోగదారులకు నవంబర్ 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకు సబ్సిడీపై సిలిండర్ సరఫరా జరుగుతుందన్నారు. ఆ తర్వాత మరో మూడు మాసాల (మే 14) వరకు అదనపు మినహాయింపుకాలంగా పరిగణిస్తామని వివరించారు. ఆలోగా అందరూ నగదు బదిలీ పథకంలోకి మారాలని కోరారు. -
చౌక విమానయానం మరికొన్నాళ్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొంతకాలంగా నష్టాలను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు దిగొస్తున్న ఇంధన ధరలు కలిసొస్తున్నాయి. గత రెండు నెలల్లో ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు 11 శాతం మేర తగ్గాయి. ఇంధన ధరలు తగ్గుతుండటంతో విమానయాన సంస్థలు చౌక టికెట్ల పోటీని మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. సాధారణంగా శీతాకాలంలో ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసంలో విమానయానానికి డిమాండ్ అధికంగా ఉంటుందని, దీంతో ఈ సమయంలో టికెట్ల ధరలు పెంచేవాళ్లమని, కానీ ఈసారి ఇంధన ధరలు తగ్గడంతో ధరలను పెంచకుండా ప్రస్తుత తగ్గింపు ధరలనే కొనసాగించనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్లు, తగ్గింపు ధరలను మరికొంత కాలం కొనసాగిస్తామని ఎయిర్ కోస్టా మేనేజింగ్ డెరైక్టర్ ఎల్.వి.ఎస్.రాజశేఖర్ చెప్పారు. ఇంధన ధరలు తగ్గినప్పటికీ ఇంతకంటే విమానయాన ధరలు తగ్గే అవకాశం లేదని ఆయన అన్నారు. ప్రపంచంలోని విమాన టికెట్ల సగటు ధరలతో పోలిస్తే ఇక్కడే తక్కువున్నాయని, దీంతో ప్రస్తుత ఇంధన ధరల తగ్గింపు ప్రయోజనాన్ని ప్రయాణికులకు బదలాయించలేమని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదే బాటలో ప్రభుత్వరంగ ఎయిర్ ఇండియా కూడా తక్షణం టికెట్ల ధరలను మరింత తగ్గించలేమని స్పష్టం చేసింది. ఇండిగో, జెట్ ఎయిర్వేస్, గో ఎయిర్ వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. కంపెనీలకు ఊరట... విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 నుంచి 50 శాతం వాటా కేవలం ఇంధనానిదే. ఇప్పుడు ఆ ఇంధన ధరలు దిగొస్తుండటంతో విమానయాన సంస్థలకు నష్టాలను భర్తీ చేసుకునే అవకాశం ఏర్పడుతోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం విమానయాన సంస్థలు ఏటా రూ. 25,000 కోట్లు ఇంధనం కోసం ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు ధరలు 11 శాతం తగ్గడంతో పరిశ్రమకు రూ. 2,750 కోట్లు ప్రయోజనం లభించిందంటున్నారు. ఈ ధరల తగ్గింపు వల్ల రూ. 320 కోట్లు తక్షణ ప్రయోజనం కలిగినట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. గతేడాది స్పైస్ జెట్ ఆదాయం రూ. 5,200 కోట్లు కాగా, నిర్వహణా వ్యయం రూ. 6,200 కోట్లు అవ్వడంతో రూ.1,000 కోట్ల నష్టం వచ్చింది. ఇప్పుడు ఇంధన ధరలు తగ్గడంతో నష్టాలు తగ్గుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ ఇంధన ధరలు తగ్గడం వల్ల నిర్వహణా వ్యయం 6 శాతం వరకు తగ్గినట్లు రాజశేఖర్ తెలిపారు. గత కొన్ని త్రైమాసికాలుగా నష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ ఈ త్రైమాసికం లాభాల్లోకి ప్రవేశించింది. ఒక పక్క ఇంధన ధరలు తగ్గుతున్నా రూపాయి విలువ క్షీణించి డాలరు విలువ పెరుగుతుండటంపై పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. విమానాల లీజింగ్ దగ్గర నుంచి చాలా సేవల ఒప్పందాలన్నీ డాలర్లలోనే ఉంటాయని, డాలరు విలువ పెరగడంతో ఇంధన ధరల తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. విస్తరణపై దృష్టి..: గత కొంతకాలంగా విస్తరణకు దూరంగా ఉన్న విమానయాన సంస్థలు ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇంధన ధరలు దిగిరావడం దేశీయ విమానయాన రంగ వృద్ధికి ఊతమిస్తుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. దీంతో ద్వితీయ, తృతీయ స్థాయి నగరాలపై కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త విమానాలను సమకూర్చుకునే పనిలో ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో రూ. 47,200 కోట్లతో 58 విమానాలను కొనుగోలు చేయనున్నాయి. వచ్చే ఫిబ్రవరికి మరో రెండు కొత్త విమానాలు వస్తాయని, దీంతో మరిన్ని పట్టణాలకు విస్తరించడమే కాకుండా, సర్వీసుల సంఖ్యను పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఎయిర్కోస్టా తెలిపింది. స్పైస్ జెట్ మరో మూడు విమానాలను కొనుగోలు చేసే పనిలో ఉంది. దేశీయ ప్రయాణికులను ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్లతో రైలు టికెట్ల కంటే తక్కువ రేటుకే విమానయానాన్ని అందిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వంటి పట్టణాలకు పరిమిత సంఖ్యలో రూ.300కే టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. -
అక్రమార్కులకు పండుగే..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : దీపావళి పండుగ.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం దేవుడెరుగు.. ఈ దీపావళి పటాకులు మాత్రం అధికారుల జేబులు నింపుతున్నాయి. యథేచ్ఛగా కొనసాగుతున్న ఈ వ్యాపారంతో సర్కారు ఆ దాయానికి వ్యాట్ రూపంలో రూ.కోట్లలో గండి పడుతుండటం ఒకెత్తయితే.. అక్రమ నిల్వలతో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. దీపావళి పండుగ అంటేనే పటాకలకు ఎంతో ప్రాధాన్యం. పేద, ధనిక తారతమ్యం లేకుండా ఈ పండుగను ఆనందంగా జరుపుకోవడం సంప్రదాయం. అయితే జిల్లాలో బాంబుల వ్యాపారం జోరోగా కొనసాగుతోంది. వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఇవ్వాల్సిన మామూళ్లు ఇచ్చి కొందరు బడా వ్యాపారులు రూ.లక్షల్లో వ్యాట్‌ను ఎగవేస్తున్నారు. పండుగ సీజన్లో జిల్లాలో సుమారు రూ.ఐదు కోట్ల వరకు ఈ వ్యాపారం జరుగుతుందని అంచనా. అధికారికంగానే సుమారు 500 వరకు క్యాజువల్ ట్రేడ్ లెసైన్సులు మంజూరవుతుండగా, అనధికారికంగా మరో 500 వరకు రిటైల్ షాపులు వివిధ పట్టణాల్లో వెలుస్తాయి. ఒక్కో షాపులో సగటున కనీసం రూ.80 వేల వ్యాపారం జరుగుతుంది. ఈ లెక్కన రూ.ఎనిమిది నుంచి రూ.పది కోట్ల వరకు బాంబుల టర్నోవర్ అవుతోంది. పటాకలపై 14.5 శాతం వ్యాట్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ.1.40 కోట్లు వ్యాట్ రూపంలో జమ కావాల్సి ఉంటుంది. కానీ.. వ్యాట్ పన్ను రాబడి రూ.25 లక్షలకు మించడం లేదు. గతేడాది అంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఈ పటాకలపై కేవలం రూ.22 లక్షలు మాత్రమే వ్యాట్ ఆదాయం వచ్చిందంటే ఏ మేరకు జీరో దందా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంటే.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మాత్రం తమ అక్రమ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ శాఖలో రిజిస్ట్రేషన్ అయిన డీలర్లు జిల్లాలో సుమారు 20 మంది వరకు ఉంటారు. శివకాశి, తమళనాడు, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తుంటారు. ఈ డీలర్లు తీరా దీపావళి అయిపోయాక, సరుకంతా విక్రయించుకున్నాక రిటర్న్ (అమ్మకం వివరాలు) దాఖలు చేస్తారు. డీలర్లు కట్టిందే పన్ను.. వచ్చిందే ఆదాయం అనుకుని అధికారులు రిటర్న్ ఎంత అమ్మినట్లు పేర్కొంటే అంతే మొత్తంలో పన్ను వసూలు చేసుకుంటారు. పండగకు ముందు ఈ శాఖ అధికారులు ఒక్క డీలరు గోదాములపై ఆకస్మిక దాడులు చేసి, స్టాకు వివరాలు తీసుకున్న దాఖలాల్లేవంటే వ్యాపారులతో వాణిజ్య పన్నుల అధికారులకు ఉన్న ‘సన్నిహిత’ సంబంధాలను అర్థం చేసుకోవచ్చు. ఆ మూడు శాఖల్లో కూడా.. బాంబుల విక్రయాల కోసం రెవెన్యూ శాఖ జారీ చేస్తున్న క్యాజువల్ ట్రేడ్ లెసైన్సులు ఆ మూడు శాఖల అధికారులకు కూడా కాసుల వర్షం కురుస్తోంది. క్యాజువల్ ట్రేడ్ లెసైన్సు మంజూరు కావాలంటే అగ్నిమాపక, మున్సిపల్, పోలీసు శాఖల నుంచి ఎన్వోసీ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్లు) తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు శాఖల నుంచి ఎన్వోసీ వస్తేనే రెవెన్యూ అధికారులు ఈ లెసైన్సులు జారీ చేస్తున్నారు. ఈ ఎన్వోసీలు ఆయా శాఖల అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎన్వోసీ కోసం రూ.500 చొప్పున చాలాన్ రూపంలో ఆయా శాఖలకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ లెసైన్స్ మంజూరుకు నిబంధనల ప్రకారం రూ.రెండు వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ.. మరో రూ.12 నుంచి రూ.15 వేల వరకు అధికారులకు సమర్పించుకోనిదే ఎన్వోసీ మంజూరు కాదనేది బహిరంగ రహస్యం. ఒక్కో శాఖకు ఒక్కో రేటు.. ఒక్క ఎన్వోసీ కోసం మున్సిపల్ అధికారులకు అదనంగా రూ.రెండు నుంచి రూ.మూడు వేల చొప్పున ముట్టజెప్పాల్సిందే. పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి ఇంకా ఎక్కువే. ఒక్కో ఎన్వోసీ ఈ శాఖల అధికారులు రూ.ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగ రహస్యంగా తయారైంది. ఇక లెసైన్స్ మంజూరు చేసే రెవెన్యూ శాఖలో కూడా చేయి తడపనిదే పని జరగడం లేదు. మొత్తం మీదా ఒక్క క్యాజువల్ ట్రేడ్ లెసైన్స్ మంజూరు కావాలంటే కనీసం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అధికారుల చేతులు తడపాల్సి వస్తోంది. ఇదంతా ఏటా జరుగుతున్న తంతే. ఈ లెసైన్సుల జారీకి కొందరు వ్యాపారులు దళారులుగా అవతారమెత్తారు. ఈ లెసైన్సుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వద్ద ఈ దళారులు వసూలు చేసి ఏక మొత్తంగా సంబంధిత అధికారులకు ముట్టజెప్పడం పరిపాటిగా తయారైంది. ఈ మామూళ్ల దందా ఒకెత్తయితే.. పటాకలకు సంబంధించిన గిఫ్ట్ ప్యాక్‌లు అదనం. ఏరియా కౌన్సిలర్లు, చోటామొటా నాయకుల నుంచి మొదలు.. ఫైర్ మెన్లు, కానిస్టేబుళ్లు, ఆయా కార్యాలయాల సిబ్బందికి ఈ గిఫ్ట్ ప్యాక్‌లు ముట్టజెప్పాల్సిందే. -
ఆర్టీసీకి వ్యాట్ గుదిబండలా తయారైంది!
-
‘వ్యాట్’లో ఎక్సైజ్దే అధిక వాటా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న కీలక శాఖల్లో ఎక్సైజ్ కూడా ఒకటి. అయితే దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నుల విధానం కింద జీఎస్టీ అమలుచేస్తే ఈ శాఖ నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడనుంది. అందువల్లే జీఎస్టీ నుంచి ఎక్సైజ్ ఆదాయాన్ని మినహాయించాలని కేంద్రానికి టీ సర్కారు స్పష్టంచేసింది. వాస్తవానికి రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖకు ఏటా సమకూరుతున్న ఆదాయంలో ఎక్సైజ్ జమ చేస్తున్న ‘వ్యాట్ బై ఎక్సైజ్’ అకౌంటే 20 శాతానికి పైగా ఉంది. మద్యం అమ్మకాలపై 75 శాతానికి పైగా వ్యాట్ రూపంలో పన్ను వసూలు చేస్తున్న నేపథ్యంలో జీఎస్టీ అమలైతే ఈ ఆదాయం నేరుగా కేంద్రం ఖాతాలోకే వెళుతుంది. వ్యాట్‌లో రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఇవ్వకుండా 2 శాతం సీఎస్టీతోనే సరిపుచ్చుకోమంటున్న నేపథ్యంలో కేంద్రం జీఎస్టీని ఆచరణలోకి తెస్తే సీఎస్టీ ఆదాయాన్ని కూడా రాష్ట్రాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికే వ్యాట్ బకాయిల కింద కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రూ.5వేల కోట్లకు పైగా రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనే గత బుధవారం ఢిల్లీలో 14వ ఆర్థిక సంఘంతో జరిగిన ఆర్థిక మంత్రుల సమావేశంలో రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్.. ఎక్సైజ్ పన్నులను రాష్ట్రానికే వదిలేయాలని స్పష్టంచేశారు. ఐదు నెలల వాటా రూ. 2,890 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ విధానం జూలై నుంచి అమలవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదలైన ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ. 4,350 కోట్లు ఎక్సైజ్ ఆదాయంగా సమకూరింది. ఇందులో వ్యాట్ బై ఎక్సైజ్ కింద వాణిజ్య పన్నుల శాఖకు నేరుగా సమకూరిన విలువ ఆధారిత పన్ను రూ. 2,890 కోట్లు. మిగతా రూ.1,460 కోట్లు మాత్రమే ఎక్సైజ్ శాఖ నికర ఆదాయం అన్నమాట. జూలైలో లెసైన్స్ ఫీజులతో కలిపి రూ.1,024 కోట్ల ఆదాయం సమకూరగా, అందులో వ్యాట్ కింద వాణిజ్య పన్నుల శాఖకు చేరిన మొత్తం ఏకంగా రూ.734 కోట్లు. అంటే వచ్చిన ఆదాయంలో 71 శాతం పన్ను రూపంలోనే వెళుతుంది. ఇంత మొత్తాన్ని కేంద్రానికి వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడం వల్లే ఎక్సైజ్ ఆదాయాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని 14వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖకు దక్కుతోంది స్వల్పమే... వ్యాట్ అమల్లోకి వచ్చాక 2005-2011 మధ్యకాలంలో మద్యం అమ్మకాల ద్వారా సమకూరిన ఆదాయం నుంచి ఎక్సైజ్ శాఖ వ్యాట్ కింద వాణిజ్యపన్నుల శాఖకు పన్ను చెల్లించేది. అయితే 2012 నుంచి మద్యం అమ్మకాలపై వచ్చిన మొత్తం ఎప్పటికప్పుడు నేరుగా వాణిజ్యపన్నుల శాఖ ఖాతాలోకి చేరేలా మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో రాబడి భారీగా కని పించినా, మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖకు 30 శాతం నుంచి 40 శాతమే దక్కుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖకు మద్యం అమ్మకాల ద్వారా రూ.20,250 కోట్లు రాగా, అందులో రూ.13,500 కోట్లు ‘వ్యాట్ బై ఎక్సైజ్’ ఖాతాలోకే చేరాయి. మిగిలిన రూ.6,750 కోట్లలో రూ.500 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్‌కు చేరగా, నికరంగా ఎక్సైజ్‌కు దక్కింది రూ.6,250 కోట్లే. ఇప్పుడు టీ ఎక్సైజ్‌శాఖ రూ.11వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇందులో వ్యాట్ బై ఎక్సైజ్ కింద వెళ్లే పన్ను మినహాయిస్తే కేవలం రూ. 3వేల కోట్లే మిగులుతుంది. అందువల్ల జీఎస్టీ నుంచి ఎక్సైజ్ శాఖను మినహాయిస్తే మొత్తం రూ.11వేల కోట్లు రాష్ట్రానికే దక్కుతుందని ప్రభుత్వ భావిస్తోంది. -
ఇకపై బిల్డింగ్‌లపై వ్యాట్ ఉండదు!
-
ఏపీ ఆదాయానికి ఢోకా లేదు
-
తెలంగాణ రెవిన్యూ పై ఖుష్
-
తెలంగాణ ఖజానా భేష్
* జూలైలో అంచనాలను మించిన రాష్ర్ట ఆదాయం * పన్ను, పన్నేతర వసూళ్లు రూ. 3822 కోట్లు * వ్యాట్, మద్యం ఆదాయం మెరుగు * పడిపోయిన రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం * రాష్ర్ట విభజన ప్రభావం అంతంతే! సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలంగాణ ఆదాయంపై నెలకొన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. విభజన తర్వాత ఆదాయం తగ్గుపోతుందన్న వాదనలు తప్పని రుజువయ్యాయి. తెలంగాణ ప్రాంత ఆదాయ వనరుల్లో ఎలాంటి లోటు లేదని తాజాగా తేలింది. జూలై నెలలో ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ నిధులు ఖజానాకు రావడమే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఇప్పటివరకు తెలంగాణ ఆదాయాన్ని అంచనా వేశారు. అంతేతప్ప ఈ ప్రాంతం నుంచి ఎంత ఆదాయం వస్తుందన్న కచ్చితమైన లెక్కలు లేవు. తాజాగా ఈ విషయంలో స్పష్టత వచ్చింది. అన్ని రకాల పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జూలైలో తెలంగాణకు వచ్చిన ఆదాయాన్ని అధికారులు నిర్ధారించారు. రాష్ర్ట ఆదాయం ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉన్నట్లు తేల్చారు. ఈ ఒక్క నెల ఆదాయం రూ. 3822 కోట్లుగా తేలింది. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో ఎంత ఆదాయం వస్తుందో అర్థంకాక అధికారులు మొదట్లో హైరానా పడ్డారు. రాష్ర్ట విభజన తర్వాత నిత్యం ఖజానాకు జమ అవుతున్న ఆదాయంపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ వచ్చారు. తాజాగా వచ్చిన అధికారిక లెక్కలతో స్పష్టత వచ్చింది. వ్యాట్, ఎక్సైజ్ ఆదాయం బాగానే ఉన్నా.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం ఆశించిన మేరకు రాలేదని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్రానికి ఆధారం కావడంతో.. ఈ రెండు జిల్లాలపై అధికారులు ఎక్కువగా దృష్టి పెట్టారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక హైదరాబాద్ శివార్లలో ఆశించిన స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగని కారణంగా.. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెద్దగా లేనట్లు సమాచారం. అదీకాక గత నెలలో బిల్డర్లు సిమెంట్ కొనుగోళ్లు ఆపేయడంతో నిర్మాణ రంగంలో పనులు మందగించాయి. దీంతో గృహ నిర్మాణ రంగంలో ఆశించిన పురోగతి లేదు. అయితే మొత్తంగా మాత్రం కొత్త రాష్ర్ట ఆదాయం సంతృప్తికరంగానే ఉన్నట్లు సమాచారం. జూన్‌లో వచ్చిన ఆదాయంతో పోల్చినా జూలైలో ఆదాయం పెరిగినట్లు ఓ అధికారి వివరించారు. -
ఏపీ ఆదాయానికి ఢోకా లేదు
* రాష్ట్రం విడిపోయాక జూలై నెలలో రూ. 5,480 కోట్లు ఆదాయం * రెండు నెలలు జీతం ఇచ్చినా లోటు రూ.124 కోట్లకే పరిమితం * రాష్ట్ర పన్ను, కేంద్ర పన్నుల వాటా వనరులు బాగానే వచ్చాయి * వ్యాట్, మద్యం ఆదాయం అదిరింది * పైసా అప్పు కూడా చేయలేదు.. భయపడాల్సిన పరిస్థితి లేదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయ వనరులు తగ్గిపోతాయన్న అంచనాలు నిజం కాదని తేలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయానికి ఢోకా లేదని తేటతెల్లమైంది. రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల వాటా ద్వారా వచ్చిన ఆదాయం మెరుగ్గా ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ముందుగా ఆందోళన చెందినట్లుగా పరిస్థితి లేదని, జూలై నెలలో ఆదాయం బాగా వచ్చిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జూలై నెలలో రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర, కేంద్ర పన్నుల వాటా నుంచి రూ.5,480 కోట్లు ఆదాయం వచ్చింది. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు వ్యాట్ ఆదాయం 45 శాతమే వస్తుందని అంచనా వేయగా, 47 శాతం వచ్చింది. కొత్త మద్యం లెసైన్సుల విధానం కారణంగా మద్యం ద్వారా వచ్చే ఆదాయం కూడా జూలై నెలలో బాగా పెరిగింది. మోటారు వాహనాల పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా బాగానే ఉంది. కేంద్ర పన్నుల వాటా నుంచి ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ. 1,960 కోట్లు వచ్చేవి. రాష్ట్రం విడిపోయిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర పన్నుల వాటా నుంచి జూలై నెలలో రూ. 1,200 కోట్లు వచ్చింది. రాష్ట్రం విడిపోయి రెండు నెలలు కావస్తున్నా ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు పైసా కూడా అప్పు చేయలేదు. జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు రెండు నెలల జీతాలు, పింఛన్ల కింద రూ.5,800 కోట్లు చెల్లించింది. అయినా ఇతర లావాదేవీలన్నీ సరిచూసిన తరువాత జూలై నెలాఖరుకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటును 124 కోట్ల రూపాయలకే ఆర్థిక శాఖ పరిమితం చేయగలిగింది. -
వ్యయాల కారణంగానే ధర పెరిగింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ వ్యయాలు దూసుకెళ్లడం వల్లే సిమెంటు ధర పెరుగుతోందని కంపెనీలు అంటున్నాయి. వ్యయంలో 80-90 శాతం మేర తమ చేతుల్లో లేదని పరిశ్రమల ప్రతినిధులు మంగళవారమిక్కడ మీడియాకు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒక్కో బ్యాగు తయారీకి రూ.335 అవుతోంది. అమ్మకం ధర ఇంత కంటే తగ్గితే కంపెనీలు నష్టాలను చవిచూస్తాయని స్పష్టం చేశారు. సిమెంటు ధర వ్యయాలకు అనుగు ణంగా స్థిరీకరణ జరిగిందని వారు చెప్పారు. మీడియా సమావేశంలో సాగర్ సిమెంట్స్ జేఎండీ ఎస్.ఆనంద్ రెడ్డి, మై హోం ఇండస్ట్రీస్ ఈడీ ఎస్.సాంబశివరావు, ఇండియా సిమెంట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె.సాయి ప్రకాశ్, భవ్య సిమెంట్స్ ఎండీ వి.ఆనంద ప్రసాద్, పరాశక్తి సిమెంట్ ఈడీ యశ్వంత్ కృష్ణ, పెన్నా సిమెంట్స్ డెరైక్టర్ ఆర్.పి.సింగ్ మాట్లాడారు. నిర్మాణంలో సిమెంటు వ్యయం..: ఖరీదైన భవంతి నిర్మాణంలో సిమెంటుకు అయ్యే వ్యయం కేవలం 2-3 శాతమే. సాధారణ భవంతికి ఈ వ్యయం 4-5 శాతానికి మించదు. ఒక్కో బ్యాగు ధర రూ.50-60 పెరిగినా, నిర్మాణంలో ఒక్కో చదరపు అడుగుకు రూ.15-20 కంటే వ్యత్యాసం రాదన్నారు. ‘బిల్డర్లు సిమెంటును 2 శాతం సీఎస్టీ చెల్లించి కర్నాటక, మహారాష్ట్ర నుంచి తెప్పిస్తున్నారు. తెలంగాణలో వ్యాట్ 14.5 శాతముంది. ఇతర రాష్ట్రాల నుంచి బిల్డర్లు సిమెంటు కొనుగోలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.200 కోట్ల దాకా ఆదాయం కోల్పోతోంది’ అన్నారు. అన్నీ పెరిగాయి..: 2010లో ఒక టన్ను బొగ్గును సింగరేణి గనులు రూ.2,553కు విక్రయించాయి. ప్రస్తుతం ఇది రూ.5,459 ఉంది. విద్యుత్ చార్జీలు రెండేళ్లలో 60-70 శాతం పెరిగాయి. డీజిల్, రైల్వే రవాణా చార్జీలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రభావంతో సిమెంటు రవాణా చార్జీలు కూడా పెరిగాయని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక్కో బ్యాగు ధర రూ.315-330, వైజాగ్‌లో రూ.325 ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో రూ.395 వరకు ఉందన్నారు. 2013 జూలైలో బ్యాగు ధర రూ.325-340 ఉందని గుర్తు చేశారు. బిల్డర్లు సిమెంటు ప్లాంటు పెట్టాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తన ప్లాంటును వారు ఉచితంగా తీసుకోవాల్సిందిగా భవ్య సిమెంట్స్ ఎండీ వి.ఆనంద ప్రసాద్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. లాభంలో 10% తనకు ఇస్తే చాలన్నారు. -
ఆరునూరైనా అ‘ధనం’ తెండి..
సాక్షి, రాజమండ్రి : జనం నుంచి పన్నుల ద్వారా వచ్చే సొమ్ములను ముక్కు పిండి వసూలు చేయడమే ప్రస్తుత ప్రభుత్వం కర్తవ్యంగా మారింది. దీంతో ఖజానా సంబంధ శాఖలు సర్కారు గల్లాపెట్టె ఎలా నింపాలా అని మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయ మార్గాలకు కీలకమైన వాణిజ్య పన్నుల శాఖపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. ఆ శాఖకు భారీ లక్ష్యాలను నిర్దేశించింది. ‘పాత బకాయిలు వసూలు చేస్తారో లేక మరింత మందిని పన్ను పరిధిలోకి తెస్తారో తెలీదు.. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికాంతానికి రూ.పది కోట్లకు పైగా అదనపు ఆదాయం తేవా’లని జిల్లా అధికారులపై భారం మోపింది. దీంతో ముందుగా పాత బకాయిలను ముక్కు పిండి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఆ శాఖ అధికారులు. అంతే కాక పన్నుల పరిధిలోకి రాని వారిని గుర్తించి పన్నుల చట్రంలోకి లాగేందుకూ కసరత్తు చేస్తున్నారు. కాకినాడ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ పరిధిలో 11 సర్కిళ్లుండగా ఒక్కో దాన్నుంచి ప్రతి త్రైమాసికంలో రూ.నాలుగు కోట్ల నుంచి రూ.ఆరు కోట్ల ఆదాయం లభిస్తుంది. పన్ను లక్ష్యంలో 60 నుంచి 80 శాతం వసూలవుతుంటుంది. 13 జిల్లాలతో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆదాయ మార్గాల్లోనే అదనపు సొమ్ము రాబట్టే పనిలో పడింది. తూర్పుగోదావరి వంటి పెద్ద జిల్లా నుంచి వచ్చే ఆదాయంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల నుంచి పాత టార్గెట్లకు మించి పన్ను వసూలు చేయాలని వాణిజ్యపన్నుల శాఖను ఆదేశించింది. సీటీఓల కసరత్తు అదనపు ఆదాయాన్వేషణలో భాగంగా సర్కిళ్ల వారీ సీటీఓలు రెండు రోజులుగా ఇదే కసరత్తులో నిమగ్నం అయ్యారు. కోర్టు కేసుల్లో ఉన్న బకాయిలు మినహా మిగిలిన వాటిని ముక్కు పిండి వసూలు చేసేందుకు కార్యాచరణ తయారు చేస్తున్నారు. జూలై నుంచి సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికానికి ఒక్కో సర్కిల్ నుంచి కనీసం రూ. కోటి అదనంగా రాబట్టాలని చూస్తున్నారు. పన్ను బకాయిదారులకు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. సీటీఓల వారీ ప్రస్తుతం వరకూ ఉన్న బకాయిల చిట్టాలను డిప్యూటీ కమిషనర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. కాగా వివిధ వ్యాపారాలు, వాణిజ్య కార్యలాపాలు నిర్వహిస్తూ పన్ను చెల్లింపు పరిధిలోకి రాని వారిని గుర్తించి పన్ను పరిధిలోకి తీసుకురావడంతో పాటు ఎంత కాలం నుంచి పన్ను పరిధిలోకి రాకుండా ఉన్నారో గుర్తించి అప్పటి నుంచే పన్ను విధించాలని చూస్తున్నారు. వస్త్రాలపై మళ్లీ ‘వ్యాట్’ వడ్డన..? మిల్లు తయారీ వస్త్రాలపై విధించే ఐదు శాతం విలువ ఆధారిత పన్నును వస్త్ర వ్యాపారులు ఆందోళన చేసి రద్దు చేయించుకున్నారు. ఇందు కోసం 2011, 2012 సంవత్సరాల్లో జరిగిన ఉద్యమంలో హోల్‌సేల్ వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరైన తూర్పుగోదావరి జిల్లా కీలక పాత్ర పోషించింది. విభజనానంతరం ఆర్థిక దుస్థితిని సాకుగా చూపి ఇప్పుడు వస్త్రాలపై వ్యాట్‌ను పునరుద్ధరించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారులు అలాంటిదేమీ లేదని పైకి చెబుతున్నా.. కాదేదీ పన్ను కనర్హం అంటూ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. -
ఏపీ వ్యాట్ ఆదాయం రూ.25,986 కోట్లు
* 2014-15కు అధికారుల అంచనా * తెలంగాణ వ్యాట్ ఆదాయం రూ.28,514 కోట్లు * వచ్చే ఏడాదిలో ఆంధ్రాకు రూ.28,322 కోట్లు * తెలంగాణకు వ్యాట్ ద్వారా రూ.31,078 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ద్వారా అధికమొత్తంలో ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో వస్తు వినియోగం ఆధారంగా వ్యాట్‌తో ఏ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో అధికార యంత్రాంగం అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో సైతం తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని అంచనా వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చే ఆదాయూన్ని విభజించిన తర్వాత తెలంగాణకు 52 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 48 శాతం మేర ఆదాయం వస్తోంది. 2014-15లో వ్యాట్ ద్వారా ఏపీకి రూ.25,986 కోట్లు సమకూరనుండగా, తెలంగాణకు రూ.28,514 కోట్లు రానున్నారుు. అలాగే 2015-16లో వ్యాట్‌తో ఏపీకి రూ.28,322 కోట్లు రానుండగా, తెలంగాణకు రూ.31,078 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అలాగే ప్రస్తుతం, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఎక్సైజ్, రవాణా, రిజస్ట్రేషన్లు..స్టాంపులు, గనులు, అటవీ, ల్యాండ్ రెవెన్యూ రంగాల ద్వారా రెండు రాష్ట్రాలకు ఎంత ఆదాయం వస్తుందో కూడా అంచనా వేశారు. ఈ అంచనాల ప్రకారం.. ప్రస్తుత పన్నుల విధానం, లెసైన్స్, పన్ను రేటుల ఆధారంగా వాణిజ్య పన్నుల ఆదాయంలో 9 శాతం మేర వృద్ధి ఉంటుది. ఎక్సైజ్ ఆదాయంలో వృద్ధి 5 శాతం మేర ఉంటుంది. స్టాంపులు..రిజిస్ట్రేషన్ల ఆదాయూనికి సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 25 శాతం మేర పెరుగుదల ఉంటుంది. కృష్ణా, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో 20 శాతం మేర, మిగిలిన జిల్లాల్లో 15 శాతం మేర పెరుగుదల ఉంటుంది. రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయంలో పెద్ద పెరుగుదల ఉండదని, మొత్తం మీద 3 శాతం మేర మాత్రమే ఆదాయ వృద్ధి ఉంటుందని అధికారుల అంచనా వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వాణిజ్య పన్నుల బకాయిలు రూ.8,500 కోట్లుగా అంచనా వేశారు. కొన్ని సంస్థలకు పన్ను రాయితీలో భాగంగా రూ.350 కోట్లను ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలపై ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రభుత్వాలు సంప్రదింపుల ద్వారా ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర అమ్మకం పన్ను పరిహారంగా కేంద్రం నుంచి రూ.11,277 కోట్లు రావాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆదాయం పన్నుగా రూ.4,000 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ రెండు అంశాలపై కూడా రెండు ప్రభుత్వాలు సంప్రదింపులు ద్వారా ఒక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేవిధంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పరిష్కారాలు చూపెట్టని అంశాలను రెండు రాష్ట్రాలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అవగాహనతో నిధుల పంపిణీని చేసుకోవాల్సి ఉంటుంది. -
ఎల్బీటీ రద్దు యోచనలో సర్కార్!
ముంబై: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర స్థానిక సంస్థల పన్ను(ఎల్బీటీ)ని పూర్తిగా రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా ఏర్పడే లోటును విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను పెంచడం ద్వారా పూడ్చుకోవాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. ముంబై మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అక్ట్రాయ్ను రద్దు చేస్తూ దశల వారీగా ఎల్బీటీ పన్నును విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎల్బీటీపై వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్దమొత్తంలో ఆందోళనలు చేపట్టారు. రోజుల తరబడి బంద్ పాటించి, దుకాణాలను తెరవకుండా నిరసన తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ఎల్బీటీని వసూలు చేసింది. 2010 నుంచి కొనసాగుతున్న ఈ ప్రక్రియకు ముగింపు పలకాలని, వ్యాపారులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఎల్బీటీని పూర్తిగా రద్దు చేసి, వ్యాట్‌ను పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. పన్నుభారం నేరుగా ప్రజలపైనే... రాష్ట్రంలో వ్యాట్ అమల్లో ఉండగా ఎల్బీటీని విధించడంపై వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆర్థికంగా భారమైన ఈ పన్ను విధానాన్ని రద్దు చేయాలని, ఈ పన్ను విధానం వల్ల అధికారుల ఒత్తిడి తమపై పెరుగుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలే చేశారు. కావాలనుకుంటే వ్యాట్‌ను పెంచుకోండంటూ ప్రభుత్వానికి వినతిపత్రాలు కూడా సమర్పించారు. వ్యాట్‌ను పెంచడం ద్వారా సమకూరే ఆదాయాన్ని స్థానిక సంస్థలకు గ్రాంటు రూపంలో ఇవ్వాలని, తద్వారా స్థానిక సంస్థల ఆర్థిక అవసరాలకు ఎటువంటి సమస్య ఉండదంటూ పలువురి చేసిన సూచన లను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఇలా వ్యాట్‌ను పెంచడం ద్వారా దాని ప్రభావం నేరుగా వినియోగదారులపైనే పడే అవకాశముందని సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
రెండు రాష్ట్రాలకూ వ్యాటే ఆక్సీజన్!
-
మద్యం అమ్మకాలపై అదనపు వ్యాట్ తగదు
సాక్షి, బళ్లారి : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మద్యం అమ్మకాలపై ఉన్నఫళంగా అదనంగా 5.5 శాతం వ్యాట్ విధించడం తగదని జిల్లా మద్యం అమ్మకాల సంఘం అధ్యక్షుడు సాహుకార్ సతీష్‌బాబు అన్నారు. ఆయన మంగళవారం నగరంలోని గ్రీన్ చిల్లీ హోటల్లో మద్యం అమ్మకాల సంఘం గౌరవాధ్యక్షుడు గురుమూర్తి, సంఘం కార్యదర్శి బసవలింగారెడ్డి, సంఘం ప్రముఖులు రామిరెడ్డి, మారుతి, గోపాలకృష్ణ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం మద్యం అమ్మకాలపై కేవలం 10 శాతం మాత్రమే మార్జిన్ పెట్టుకుని అమ్మకాలు సాగిస్తున్నారని, ఇందులో అన్ని ఖర్చులు పోను ఎలాంటి లాభాలు రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో వ్యాట్ రూపంలో మరో 5.5 శాతం విధిస్తే తాము 4.5 శాతంతో ఎలా వ్యాపారం చేయాలని ప్రశ్నించారు. ఈ భారం వినియోగదారులపై పడుతుందని, ప్రభుత్వం వెంటనే తమ గోడును వినిపించుకుని వ్యాట్‌ను రద్దు చేయాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మద్యం వ్యాపారులు కోరుతున్నా డిమాండ్లను పరిష్కరించకుండా మరో విధమైన నష్టాలను ఏర్పరిచేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం సరి కాదన్నారు. ఈ నెల 20న బెంగళూరులో సీఎం సిద్ధరామయ్యను కలిసి తమ సమస్యలను విన్నవిస్తామని, ఆయన పట్టించుకోకపోతే తీవ్ర పోరాటం చే స్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న మద్యం అమ్మకాలపై ప్రభుత్వం చిన్న చూపు చూడటం సరికాదన్నారు. బళ్లారిలో మైనింగ్ వ్యాపారం పూర్తిగా నిలిచిపోవడంతో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు.