జీఎస్‌టీతో దేశమంతా ఒకే ధర..ఒకే పన్ను
జీఎస్‌టీతో దేశమంతా ఒకే ధర..ఒకే పన్ను
Published Mon, Nov 21 2016 10:07 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
వాణిజ్యపన్నుల అధికారి(కర్నూలు) పి. నాగేంద్రప్రసాద్ వెల్లడి
కర్నూలు(హాస్పిటల్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే జీఎస్‌టీ అమల్లోకి వస్తే దేశమంతా ఒకే ధర...ఒకే పన్ను ఉంటుందని వాణిజ్యపన్నుల అధికారి(కర్నూలు) పి. నాగేంద్రప్రసాద్ చెప్పారు. జీఎస్‌టీ పన్నుపై సోమవారం స్థానిక మామిదాలపాడు రోడ్డులోని ఓ హోటల్‌లో సెంట్రల్ ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ వ్యాట్ స్థానంలో త్వరలో జీఎస్‌టీ అమల్లోకి రానుందన్నారు. ప్రస్తుతం వివిధరాష్ట్రాల్లో ఒక్కో వస్తువుపై ఒక్కో విధంగా పన్నులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 24వ తేదీ వరకు వాణిజ్యపన్నులు, పాతబకాయిలు పాతనోట్ల ద్వారానే వ్యాపారులు, డీలర్లు చెల్లించవచ్చన్నారు. సమావేశంలో సెంట్రల్ ఎక్సైజ్ శాఖ నుంచి సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ ఏసీలు, వాణిజ్యపన్నుల శాఖ నుంచి ఏసీలు, సీటీఓలు, డీసీటీఓలు, ఏసీటీఓలు పాల్గొన్నారు.
డీలర్ల వివరాలు అప్‌లోడ్ చేయండి
జిల్లాలోని అధీకృత డీలర్లు తమ వివరాలను ఎSఖీN పోర్టల్‌లో జనవరి ఒకటి నుంచి 15వ తేది వరకు అప్‌లోడ్ చేసుకోవాలని వాణిజ్యపన్నుల శాఖ అధికారి నాగేంద్రప్రసాద్ చెప్పారు. డీలర్లు వారి స్టేట్/సెంట్రల్ అధికారుల నుంచి పొందిన ప్రొవిజనల్ ఐడీ, పాస్‌వర్డ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ ¯ð ంబర్, బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ తిరిగి అప్‌లోడ్ చేయాలని సూచించారు.
Advertisement
Advertisement