లక్నో: అధిక ధరలు, పన్నుపోటు పరిస్థితులు ప్రస్తుతం దేశం మొత్తం కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ ప్రజలకు యోగి సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రజా ప్రయోజనాల దృష్ట్యా.. రాబోయే రోజుల్లో వ్యాట్VATను పెంచడం, కొత్త పన్నుల విధింపు లాంటి కఠిన నిర్ణయాలు ఉండవని స్వయంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు.
ప్రభుత్వ ఆదాయ సేకరణ మీద శుక్రవారం సాయంత్రం తన నివాసంలో ట్యాక్స్ విభాగంతో సుదీర్ఘ మంతనాలు జరిపిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్‌ను సమీప భవిష్యత్తులో పెంచే ప్రసక్తే ఉండదని, అలాగే కొత్తగా ప్రజలపై ఎలాంటి పన్నులు విధించబోమని ఆయన స్పష్టం చేశారు.
పేద, మధ్య తరగతి వర్గాలను ఇబ్బంది పెట్టకుండా ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని ఆయన అధికారులను కోరారు. అలాగే.. జీఎస్టీ రిజిస్టర్డ్ పరిధిలోకి బడా వ్యాపారులెవరినీ వదలకుండా తీసుకురావాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ఆయన అధికారులకు సూచించాడు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ లక్షా యాభై వేల కోట్ల ఆదాయాన్ని జీఎస్టీ, వ్యాట్ రూపంలో వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది యోగి సర్కార్.
Comments
Please login to add a commentAdd a comment