New taxation policy
-
PM Narendra Modi: చచ్చినా వదలరట!
అంబికాపూర్/సాగర్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ పన్నుతో ప్రజల నడ్డి విరవడం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. బతికున్నంత కాలం ప్రజలను పన్నులతో పీడించడమే గాక మరణించిన తర్వాత కూడా వదలకుండా లూటీ చేసే కుట్రలకు పదును పెడుతోందని మండిపడ్డారు.కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా తాజాగా సంపద పంపిణీ గురించి మాట్లాడుతూ అమెరికాలో అమల్లో ఉన్న వారసత్వ పన్ను గురించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమన్నారు. ‘‘మరణించిన వారి ఆస్తులపైనా కాంగ్రెస్ పంజా (హస్తం గుర్తునుద్దేశించి) విసరనుంది. వారసత్వంగా పిల్లలకు దక్కకుండా లాగేసుకోనుంది. ‘జిందగీ కే సాథ్ భీ... జిందగీ కే బాద్ భీ... (బతికున్నప్పుడు కూడా, చనిపోయాక కూడా)’.ఇదే కాంగ్రెస్ నయా దోపిడీ మంత్రం!’’ అని ఎల్ఐసీ పాపులర్ స్లోగన్ అన్వయిస్తూ ప్రధాని దుయ్యబట్టారు. ‘‘సమాజంలో సంపద పునఃపంపిణీ అనే ముసుగులో ప్రజల స్థిర చరాస్తులను జీవితాంతమూ, మరణించిన తర్వాతా అడ్డంగా లూటీ చేయడమే కాంగ్రెస్ విధానం. ఆ క్రమంలో చివరికి వారసత్వ ఆస్తులను కూడా వదలిపెట్టడం లేదు. కాంగ్రెస్ తాలూకు ఈ రహస్య అజెండాను, పిట్రోడా వ్యాఖ్యలు బయటపెట్టాయి.మన సామాజిక, కుటుంబ విలువలకు కాంగ్రెస్ పూర్తిగా దూరమైపోయింది. అందుకే ప్రజల జీవితాంతం పొదుపు చేసి తమ వారసులకు అందజేయాలనుకునే సొమ్మును కూడా చట్టబద్ధంగా లాగేసుకోవాలని కుట్ర చేస్తోంది. ఆ పార్టీ చేస్తున్న ఇలాంటి ప్రమాదకర ఆలోచనలన్నీ ఎన్నికల వేళ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి’’ అని బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ ఎన్నికల ర్యాలీలో మోదీ తూర్పారబట్టారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్, హర్దా ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే...చట్టబద్ధంగా దోచేస్తారు ‘‘మీ (ప్రజల) ఆస్తులను, మీ పిల్లల హక్కులను కాజేయడానికి కాంగ్రెస్ పథకం వేసింది. జనం ఆస్తులను, పిల్లల కోసం జీవితాంతం కష్టపడి పొదుపు చేసుకున్న మొత్తాలను చట్టబద్ధంగా దోచేయజూస్తోంది. మధ్యతరగతి ప్రజలపై, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొనేవారిపై మరింత పన్ను విధించాలని కాంగ్రెస్ యువరాజు (రాహుల్) సలహాదారు (పిట్రోడా) అంటున్నారు.గతంలో యువరాజు తండ్రికి కూడా ఆయనే సలహాదారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే తల్లిదండ్రుల నుంచి సంతానానికి వారసత్వంగా వచ్చే ఆస్తులపై కచ్చితంగా పన్ను విధిస్తుంది. అప్పుడిక తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు బదిలీ కావాలంటే పన్ను కట్టాల్సిందే. బతికున్నంత కాలమూ మీనుంచి వీలైనంతగా పన్నులు పిండుతారు. మరణించాక వారసత్వ పన్ను విధిస్తారు!ఓబీసీలకు కాంగ్రెసే అతి పెద్ద శత్రువు‘‘మతపరమైన రిజర్వేషన్ల నుంచి వెనక్కి తగ్గే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు. అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్టీల రిజర్వేషన్లను తగ్గించి, స్వీయ రాజకీయ లబ్ధి కోసం మరో వర్గానికి వర్తింపజేస్తుంది. ఇందులో సందేహం లేదు. కర్ణాటకలో గతంలో కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగానికి, అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మతాధారంగా రిజర్వేషన్లు అమలు చేశారు.అక్కడ బీజేపీ అధికారంలోకి అవి రద్దయ్యాయి. కొన్ని నెలల క్రితం కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పెద్ద పాపం చేసింది. ముస్లింల్లోని అన్ని వర్గాలను ఓబీసీ కేటగిరీలో చేర్చి దొడ్డిదారిన రిజర్వేషన్లు ఇచ్చేసింది. దీనివల్ల ఓబీసీ కేటగిరీలోని ఇతర కులాలకు అన్యాయం జరుగుతోంది. కాంగ్రెస్ ఆడుతున్న ఈ ప్రమాదకరమైన ఆటతో భవిష్యత్తు తరాలు నాశనమవుతాయి. దేశమంతటా కర్ణాటక మోడల్ అమలు చేయడానికి కుట్ర పన్నింది’’ రాజ్యాంగమంటే కాంగ్రెస్‌కు లెక్కలేదు ‘‘ఎన్నికల్లో నెగ్గడానికి ఓటు బ్యాంకు రాజకీయాలనే నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ మతాధారితంగా రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది. దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలో బలహీన ప్రభుత్వం అధికారంలోకి రావాలని కొన్ని శక్తులు కోరుకుంటున్నాయి. బలమైన ప్రభుత్వముండి దేశం స్వావలంబన సాధిస్తే తమ దుకాణం మూత పడుతుందని ఆ శక్తులు భయపడుతున్నాయి. కాంగ్రెస్‌ది ముమ్మాటికీ ముస్లిం లీగ్ ఆలోచనా ధోరణే. ఆ పార్టీ మేనిఫెస్టో ముస్లింలీగ్ సిద్ధాంతాలకు నకలు.మతాధారంగా రిజర్వేషన్లు ఉండొద్దని రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అంబేడ్కర్ భావించారు. దళితులకు, గిరిజనులకే రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆశయాలను కాంగ్రెస్ లెక్కచేయడం లేదు. కొన్నేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మతాధారంగా రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రయతి్నంచింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధించి, మతం ఆధారంగా ఓ వర్గానికి 15 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గట్టిగా వాదించింది. 2009, 2014 మేనిఫెస్టోల్లో ఇదే అంశాన్ని చేర్చింది’’‘ఇండియా’ వస్తే ఏడాదికో ప్రధానికేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుతీరితే ప్రతి ఏడాదికో ప్రధాని మారతారని మోదీ ఎద్దేవా చేశారు. నాయకత్వ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇండియా కూటమి ఈ ఫార్ములాను అమలు చేస్తుందన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ఏడాదికో ప్రధాని మారితే ప్రపంచం దృష్టిలో మనం నవ్వులపాలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలన వస్తే ప్రజలకు ఒకటి కంటే ఎక్కువ కార్లు, మోటార్ సైకిళ్లు, ఇళ్లుంటే ప్రభుత్వపరమవుతాయన్నారు. -
ట్యాక్స్‌పేయర్లకు కొంత ఊరట..
న్యూఢిల్లీ: ఆదాయం రూ. 7 లక్షలకన్నా స్వల్పంగా ఎక్కువుండి, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేవారికి కొంత ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 7 లక్షల పరిమితిని దాటిన మొత్తానికి మాత్రమే పన్ను విధించేలా ఆర్థిక బిల్లును సవరించింది. కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పన్ను విధానం ప్రకారం రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను భారం ఉండదు. (ఇదీ చదవండి: బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్‌బర్గ్) కానీ రూ. 7,00,100 ఉంటే మాత్రం రూ. 25,010 మేర పన్ను కట్టాల్సిరానుంది. అంటే రూ. 100 ఆదాయానికి రూ. 25,010 పన్ను భారం పడనుంది. ఈ నేపథ్యంలో పరిమితికన్నా ఆదాయం కాస్త ఎక్కువ ఉంటే, దానికి మించి పన్ను భారం ఉండరాదంటూ స్వల్ప ఊరటను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఎంత మేర అధిక ఆదాయానికి ఇది వర్తిస్తుందనేది ప్రభుత్వం నిర్దిష్టంగా వివరించలేదు. సుమారు రూ. 7,27,700 వరకు ఆదాయం ఉన్న వారికి దీనితో ప్రయోజనం ఉండగలదని నాంగియా ఆండర్సన్ పార్ట్నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. (శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!) విషాదం: ఇంటెల్ కో-ఫౌండర్, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత -
Union Budget 2023-24: కొత్త పన్ను విధానం ఆకర్షణీయం
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానం 2023–24 బడ్జెట్‌తో ఆకర్షణీయంగా మారినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఇది ప్రయోజనకరమని, తక్కువ పన్ను రేటును వారు ఆస్వాదిస్తారని చెప్పారు. బడ్జెట్ అనంతరం ఓ వార్తా సంస్థతో గుప్తా మాట్లాడారు. తగ్గింపులు, మినహాయింపులను క్రమంగా దూరం చేయడం కోసమే నూతన పన్ను విధానంలో (మినహాయింపుల్లేని) కొత్త శ్లాబులు, రేట్లు ప్రకటించడానికి కారణంగా పేర్కొన్నారు. దీని ద్వారా వ్యక్తులు, సంస్థలపై పన్ను రేట్లు తగ్గించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను చేరుకోవడం సాధ్యపడుతుందన్నారు. ‘‘నూతన పన్ను విధానాన్ని రెండేళ్ల క్రితం (2020–21 బడ్జెట్లో) ప్రతిపాదించాం. అయినప్పటికీ తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం శ్లాబులను మార్చింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు రేట్లు, శ్లాబులు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతాయి’’అని చెప్పారు. కార్పొరేట్ విభాగంలో పన్ను చెల్లింపుదారులకు ఇదే మాదిరి చర్యలను కొంత కాలం క్రితం ప్రకటించగా, వారికి ప్రయోజనకరంగా మారినట్టు గుప్తా తెలిపారు. నూతన పన్ను విధానంతో లబ్ధి పొందని వర్గాలు చాలా తక్కువన్నారు. దీనిలో స్టాండర్డ్ డిడక్షన్ కల్పించినందున, అది పాత విధానంలోని ప్రయోజనాలకు ఏ మాత్రం తీసిపోదన్నారు. పన్ను చెల్లింపు దారుల ఇష్టమే.. నూతన పన్ను విధానం డిఫాల్ట్ (ప్రమేయం లేని)గా ఉంటున్నందున, పాత పన్ను విధానంలో ఉన్నవారిపై ప్రభావం పడుతుందా? అన్న ప్రశ్నకు.. ఏ విధానం అయినా ఎంపిక చేసుకుని రిటర్నులు దాఖలు చేసే స్వేచ్ఛ పన్ను చెల్లింపుదారులకు ఉంటుందని నితిన్‌గుప్తా చెప్పారు. కావాలంటే పాత పన్ను విధానానికి కూడా మారిపోవచ్చన్నారు. ‘‘డిఫాల్ట్ అంటే ఫైలింగ్ పోర్టల్ స్క్రీన్‌పై ముందు కనిపిస్తుంది. కానీ, అక్కడ ఏ పన్ను విధానం అనే ఆప్షన్ ఉంటుంది. కావాల్సిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు’’అని గుప్తా వివరించారు. ఏ వర్గం పన్ను చెల్లింపుదారులను కూడా నిరుత్సాహపరచబోమన్నారు. నూతన పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను చెల్లించే అవకాశం లేకుండా రిబేట్ కల్పించడం తెలిసిందే. దీనికి అదనంగా రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా ప్రకటించారు. పాత విధానంలో అయితే రూ.5 లక్షలకు మించిన ఆదాయంపై 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే వివిధ సెక్షన్ల కింద తగిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతిమంగా కొత్త విధానమే తక్కువ పన్ను రేట్లతో, మినహాయింపుల్లేని, సులభతర పన్నుల విధానానికి (నూతన పన్ను విధానం) మళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. రెవెన్యూ శాఖ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం ఏటా రూ.15 లక్షలు ఆర్జించే వ్యక్తి పాత పన్ను విధానంలో రూ.3.75 లక్షల వరకు క్లెయిమ్‌లు పొందొచ్చని.. కానీ, తక్కువ పన్ను రేట్లతో దీనికి ప్రత్యామ్నాయ పన్నుల విధానాన్ని ప్రతిపాదించినట్టు చెప్పారు. నూతన పన్ను విధానం తప్పనిసరి చేయడానికి ఎలాంటి గడువు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. -
వ్యాట్ పెంచం.. కొత్త పన్నులు ఉండవు: సీఎం యోగి
లక్నో: అధిక ధరలు, పన్నుపోటు పరిస్థితులు ప్రస్తుతం దేశం మొత్తం కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ ప్రజలకు యోగి సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రజా ప్రయోజనాల దృష్ట్యా.. రాబోయే రోజుల్లో వ్యాట్VATను పెంచడం, కొత్త పన్నుల విధింపు లాంటి కఠిన నిర్ణయాలు ఉండవని స్వయంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయ సేకరణ మీద శుక్రవారం సాయంత్రం తన నివాసంలో ట్యాక్స్ విభాగంతో సుదీర్ఘ మంతనాలు జరిపిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్‌ను సమీప భవిష్యత్తులో పెంచే ప్రసక్తే ఉండదని, అలాగే కొత్తగా ప్రజలపై ఎలాంటి పన్నులు విధించబోమని ఆయన స్పష్టం చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలను ఇబ్బంది పెట్టకుండా ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని ఆయన అధికారులను కోరారు. అలాగే.. జీఎస్టీ రిజిస్టర్డ్ పరిధిలోకి బడా వ్యాపారులెవరినీ వదలకుండా తీసుకురావాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ఆయన అధికారులకు సూచించాడు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ లక్షా యాభై వేల కోట్ల ఆదాయాన్ని జీఎస్టీ, వ్యాట్ రూపంలో వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది యోగి సర్కార్. చదవండి: 'మహా' కేబినెట్ విస్తరణ ఆలస్యం అందుకేనా? -
మీ ‘పన్ను’ దారేది?
ఆదాయపన్ను రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురు చూసిన వారిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నూతన పన్ను రేట్లతో అయోమయంలో పడేశారు. ప్రస్తుత పన్ను విధానం లేదా నూతన పన్ను విధానంలో తమకు అనుకూలమైన విధానంలోనే రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని ప్రకటించారు. రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఆదాయపన్నును కొంత మేరకు తగ్గిస్తూ నూతన పన్ను రేట్లను మంత్రి ప్రతిపాదించారు. అంటే ప్రస్తుతమున్న విధానంలోనే కొనసాగడం లేదా నూతన విధానానికి మారడం పన్ను చెల్లింపుదారుల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మరి నూతన పన్ను విధానానికి మారిపోవాలా..? లేక ఇప్పుడున్న విధానంలోనే కొనసాగాలా..? అని ప్రశ్నిస్తే.. అది ఒక్కో వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. తమ ఆదాయాన్ని బట్టి దీనిపై నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. పాత, కొత్త విధానంలో పన్ను భారంపై అవగాహన కల్పించే ప్రాఫిట్ కథనం ఇది. రూ.15 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి నూతన పన్ను విధానంలో రూ.78,000ను ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ఇది నిజమే. కానీ, ఎవరికి ఈ ప్రయోజనం నిజంగా అంటే.. ఎటువంటి మినహాయింపులను క్లెయిమ్ చేసుకోని వారికే నూతన పన్ను విధానంతో ప్రయోజనమని క్లుప్తంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆదాయపన్ను విధానంలో ఎన్నో మినహాయింపులు(ఎగ్జంప్షన్), తగ్గింపులు(డిడక్షన్) ఉన్నాయి. అయితే, కొందరు కొన్ని రకాల మినహాయింపులనే వినియోగించుకుంటుంటే, కొందరు అయితే అస్సలు ఏ ప్రయోజనాన్ని కూడా వాడుకోకుండా రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. ఇలా ఏ డిడక్షన్, ఎగ్జంప్షన్ వినియోగించుకోని వారికి నూతన పన్ను రేట్లు ప్రయోజనకరం. అలాగే, తీసివేతలు, మినహాయింపుల గందరగోళాన్ని అర్థం చేసుకోలేని వారు నూతన విధానానికి మారిపోవచ్చు. లేదు, చట్ట పరిధిలో అన్ని మినహాయింపులు, తగ్గింపులను ఉపయోగించుకుంటానంటే ప్రస్తుత విధానంలోనే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ‘‘ఇదొక మంచి నిర్ణయం. తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇచ్చినట్టయింది’’ అని ట్యాక్స్‌స్పానర్ సహ వ్యవస్థాపకుడు సుధీర్ కౌశిక్ పేర్కొన్నారు. ‘‘హౌస్ రెంట్ అలవెన్స్, సెక్షన్ 80సీ కింద మినహాయింపులు పొందుతున్న వారికి నూతన పన్ను విధానానికి మారిపోవడం ప్రయోజనకరం కాదు’’ అని అశోక్ మహేశ్వరి అండ్ అసోసియేట్స్ ట్యాక్స్ లీడర్ అమిత్ మహేశ్వరి తెలిపారు. చాప్టర్ 6ఏ పరిధిలోని సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 80సీసీడీ మినహాయింపులు రూ.2,50,000ను పూర్తిగా వినియోగించుకున్నట్టు అయితే రూ.7,50,000 వరకు ఆదాయం ఉన్న వారూ ప్రస్తుత విధానంలో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే, రుణంపై ఇంటిని కొనుగోలు చేసిన వారు చాప్టర్ 6ఏకు అదనంగా సెక్షన్ 24 కింద ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులు రూ.2,00,000పై, స్టాండర్డ్ డిడక్షన్ 50,000ను కూడా వినియోగించుకుంటే అప్పుడు మొత్తం రూ.10,00,000 ఆదాయం ఉన్నప్పటికీ చెల్లించాల్సిన పన్ను బాధ్యత సున్నాయే అవుతుంది. ఇక సెక్షన్ 80టీటీఏ కింద డిపాజిట్లపై వడ్డీ రూ.10,000 వరకు మినహాయింపు కూడా ఉంది. నూతన పన్ను విధానానికి మారితే జీవిత బీమా, వైద్య బీమా ప్రీమియం, ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులతోపాటు ఎల్‌టీఏ తరహా మినహాయింపులను కోల్పోవాల్సి వస్తుంది. నూతన విధానంలోనూ ఎన్పీఎస్(రిటైర్మెంట్ సాధనం) పై పన్ను ఆదా చేసుకునే ఒక అవకాశాన్ని కొనసాగించారు. అది వ్యక్తిగతంగా ఎన్‌పీఎస్‌లో చేసే పెట్టుబడులు కాకుండా.. ఉద్యోగుల తరఫున కంపెనీలు ఎన్పీఎస్కు జమ చేసే చందాలకు సెక్షన్ 80సీసీడీ (2) కింద పన్ను ఆదా ప్రయోజనం వర్తిస్తుంది. మూలవేతనం, కరువు భత్యం (డీఏ)పై వార్షికంగా 10% ఎన్పీఎస్ చందాలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు వార్షిక మూలవేతనం, కరువు భత్యం రూ.5 లక్షలు ఉందనుకుంటే ఇందులో 10% రూ.50,000పై పన్ను చెల్లించక్కర్లేదు. ఎన్పీఎస్ అయినా లేదా ఈపీఎఫ్ అయినా ఉద్యోగ సంస్థ చేసే చందా లకు ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఒక ఉద్యోగి తరఫున సంస్థ వార్షికంగా రూ.7.5 లక్షలకు మించి జమ చేస్తే అప్పుడు పన్ను పడుతుంది. ఒక్కసారి మారిపోతే..? ప్రస్తుత విధానంలో కొనసాగొచ్చు లేదా నూతన విధానానికి మారిపోవచ్చన్న వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే, ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఏటేటా ఉంటుందా..? లేక ఒక్కసారి నూతన విధానానికి మారిపోతే అందులోనే మరుసటి ఏడాది నుంచి రిటర్నులు దాఖలు చేయాలా..? అన్న సందేహం రావచ్చు. ఏ విధానంలో రిటర్నులు దాఖలు చేయవచ్చన్నది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబం ఎటువంటి వ్యాపార ఆదాయం లేకపోతే, గడిచిన ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయంపై రిటర్నులు ఏ విధానంలో దాఖలు చేయాలన్నది ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. ఇతర కేసుల్లో అయితే, ఒక్కసారి నూతన విధానానికి మారిపోతే ఆ తర్వాత నుంచి అదే విధానంలో కొనసాగాల్సి ఉంటుంది’’ అని బడ్జెట్ మెమొరాండం స్పష్టం చేస్తోంది. ‘‘ప్రతీ ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు ఏ పన్ను విధానాన్ని అయినా ఎంచుకోవచ్చు. పన్ను మినహాయింపులు, తగ్గింపులతో రిటర్నులు దాఖలు చేయవచ్చు లేదా నూతన విధానంలో తక్కువ పన్ను రేట్ల ప్రకారం రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని షరతులు ఉన్నాయి. ఎటువంటి వ్యాపార ఆదాయం లేని వారు నూతన పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ వ్యాపార ఆదాయం ఉన్న వారు మినహాయింపులు, తగ్గింపులను వినియోగించుకుని ప్రస్తుత విధానంలో పన్ను రిటర్నులు దాఖలు చేసినట్టయితే అప్పుడు పాత విధానంలోనే కొనసాగినట్టవుతుంది. తర్వాతి సంవత్సరాల్లోనూ నూతన విధానానికి మారే అవకాశం ఉండదు’’ అని ట్యాక్స్‌మన్ డాట్ కామ్ డీజీఎం వాధ్వా తెలిపారు. వ్యాపార ఆదాయం లేని పన్ను చెల్లింపుదారుడు ప్రస్తుత విధానం లేక నూతన ప్రతిపాదిత విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, వ్యాపార ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారునికి ఈ రెండింటిలో ఎందులో కొనసాగాలన్న ఆప్షన్ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఏ విధానంలో ఎంత భారం రూ.7.5 లక్షల ఆదాయం ఉన్న వారు ► స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, సెక్షన్ 80సీ సాధనాల్లో రూ.1,50,000 పెట్టుబడులతోపాటు ఎన్‌పీఎస్‌లో అదనంగా రూ.50,000 ను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మొత్తం రూ.2,50,000 ఆదాయంపై మినహాయింపులు పొందొచ్చు. ఎన్పీఎస్ లేకపోతే సెక్షన్ 80డీ కింద తన కుటుంబానికి, తల్లిదండ్రులకు చెల్లిస్తున్న వైద్య బీమా ప్రీమియంను మినహాయింపుగా చూపించుకున్నా సరిపోతుంది. మొత్తం ఆదాయం రూ.7,50,000 నుంచి మినహాయింపులు రూ.2.5 లక్షలను తీసివేయగా మిగిలిన పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 అవుతుంది. పన్ను వర్తించే ఆదాయం మినహాయింపుల తర్వాత రూ.5లక్షలు దాటనందున సెక్షన్ 87ఏ కింద పన్ను చెల్లించకుండా రిబేటు పొందొచ్చు. ► కొత్త విధానంలో ఈ మినహాయింపులు లేవుకనుక.. మొదటి రూ.2,50,001 –5,00,000పై 5% కింద రూ.12,500, తర్వాతి రూ.2.5 లక్షలపై 10% పన్ను రేటు ప్రకారం రూ.25,000.. మొత్తం రూ.37,500 పన్ను చెల్లించాలి. ► ఒకవేళ పాత విధానంలోనే కొనసాగుతూ కొన్ని మినహాయింపులనే క్లెయిమ్ చేసుకునేట్టు అయితే.. ఉదాహరణకు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయని వారు, సెక్షన్ 80సీ కింద రూ.150,000, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, సెక్షన్ 80డీ కింద వైద్య బీమా ప్రీమియంను మినహాయింపులుగా చూపించుకోవచ్చు. అలా రూ.2,00,000ను మినహాయింపుగా చూపించుకున్నారనుకుంటే.. మిగిలిన రూ.50,000పై ప్రస్తుత విధానంలో 20 శాతం పన్ను రేటు ప్రకారం రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రస్తుత విధానమే బెస్ట్. ► ఒకవేళ సెక్షన్ 80సీ కింద కేవలం రూ.1,00,000 మాత్రమే వినియోగించుకుని, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000ను కూడా క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.1,00,000 అవుతుంది. దీనిపై 20% అంటే రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ ప్రయోజనమే. ► సెక్షన్ 80సీ కింద రూ.50,000 వరకూ పెట్టుబడులు ఉంటే, దీనికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 కలుపుకోవచ్చు. వైద్య బీమా ప్రీమియం రూ.12,000 వరకు చెల్లిస్తున్న వారు చాలా మందే ఉంటారు. ఈ విధంగా చూస్తే కనీస మినహాయింపులు రూ.1,00,000–1,50,000 వరకు ఎక్కువ మందికి ఉంటుంటాయి. వీరికి ప్రస్తుత విధానమే లాభకరం. రూ.10 లక్షల ఆదాయం విషయంలో... ► వీరు కూడా స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ, 80సీసీడీ కింద పూర్తిగా రూ.3,00,000ను వినియోగించుకుంటే అప్పుడు రూ.2,00,000 మొత్తంపై ప్రస్తుత విధానంలో 20 శాతం కింద రూ.40,000 పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ గృహ రుణం తీసుకుని వడ్డీ చెల్లిస్తుంటే ఆ విధంగా మరో రూ.2,00,000పైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. దీంతో నికరంగా చెల్లించాల్సిన పన్ను సున్నాయే అవుతుంది. ఇప్పటి వరకు ఇల్లు సమకూర్చుకోని వారు రుణంపై ఇంటిని తీసుకోవడం ద్వారా ఈ ఆదాయ వర్గాల వారు ఏటా రూ.40,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ► అదే నూతన విధానంలో రూ.2,50,001–5,00,000పై 5 శాతం కింద రూ.12,500, 5,00,001–7,50,000 ఆదాయంపై 10 శాతం ప్రకారం రూ.25,000వేలు, తర్వాత రూ.2,50,000పై 15 శాతం పన్ను రేటు ప్రకారం రూ.37,500 మొత్తం రూ.75,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ► ప్రస్తుత విధానంలో కనీసం సెక్షన్ 80సీ, 80సీసీడీ, 80డీ, స్టాండర్డ్ డిడక్షన్లు వినియోగించుకున్నా నూతన విధానంతో పోలిస్తే తక్కువ పన్ను చెల్లిస్తే చాలు. ► ప్రస్తుత విధానంలో ఏ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోని వారు, అదే సమయంలో సెక్షన్ 80సీలో కేవలం రూ.లక్ష వరకు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే అప్పుడు వీరు రూ.4,00,000పై ప్రస్తుత విధానంలోనే 20 శాతం పన్ను రేటుపై రూ.80,000 చెల్లించాల్సి వస్తుంది. కనుక వీరికి కొత్త విధానం బెటర్. ► ఒకవేళ ఇంటి రుణం లేని వారికి హెచ్ఆర్ఏ మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. కనుక దాన్ని పరిగణనలోకి తీసుకుని చూడాలి. హెచ్ఆర్ఏ క్లెయిమ్‌కు మూడు విధానాలున్నాయి. వేతనంలో భాగంగా ఉద్యోగి పొందుతున్న వాస్తవ హెచ్ఆర్ఏ మొత్తం.. లేదా మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50%, అదే నాన్ మెట్రో ప్రాంతాల్లోని వారి మూల వేతనంలో 40%.. లేదా మీరు వార్షికంగా చెల్లించిన అద్దె నుంచి మీ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. ఈ మూడింటింలో ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ► 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు తమ పెట్టుబడులను అన్నింటినీ లిస్ట్ చేసుకుని, మినహాయింపులను పరిగణనలోకి తీసుకుని అప్పుడు ఏ విధానంలో రిటర్నులు దాఖలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. -
5 బ్యాంకులపై ఆర్బీఐ దిద్దుబాటు చర్యలు: ఇక్రా
ముంబై: మొండి బకాయిలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని బ్యాంకులపై దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. నికర మొండి బకాయిలు 6 శాతం దాటిపోవడంతో ఆయా బ్యాంకులకు సంబంధించి ఆర్బీఐ తగిన దిద్దుబాటు చర్యలకు అవకాశం ఉందని ఒక నివేదికలో పేర్కొంది. ఇదిలాఉండగా, దుస్తుల ఎగుమతులకు ఇటు దేశీయంగానూ, అటు అంతర్జాతీయంగానూ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు మరో నివేదికలో ఇక్రా పేర్కొంది. కొత్త పన్నుల విధానం, ఎగుమతులకు ప్రోత్సాహం, అంతర్జాతీయ పోటీ పరిస్థితుల వంటి అంశాలపై దుస్తుల పరిశ్రమ వృద్ధి ఆధారపడి ఉంటుందని నివేదిక పేర్కొంది. -
రెడీ.. వన్.. టూ.. త్రీ
►నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తు సేవల పన్ను ► స్వాతంత్య్ర భారత చరిత్రలో అతి పెద్ద పన్ను సంస్కరణ ►18 రకాల పరోక్ష పన్నుల స్థానంలో ఒకే పన్ను ►నాలుగు శ్లాబుల్లో అన్ని రకాల వస్తువులపై పన్నులు ►సామాన్య, మధ్య తరగతి వర్గాలకు కొంత ఊరట ► పూర్తిగా అమల్లోకి వచ్చాకే లాభనష్టాలపై స్పష్టత స్వాతంత్య్ర భారత చరిత్రలో అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్న ‘వస్తు సేవల పన్ను (జీఎస్టీ’ శుక్రవారం అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తోంది. ఒక దేశం–ఒకే పన్ను నినాదంతో 18 రకాల పరోక్ష పన్నుల స్థానంలో ప్రవేశపెడుతున్న జీఎస్టీ... ఎలాంటి ఫలితాలను అందిస్తుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాలు.. ఇలా అన్ని వర్గాలపైనా జీఎస్టీ ప్రభావం ఎలా ఉంటుంది!? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది!? అనే సందేహాలకు ఇప్పటికీ స్పష్టత లేదు. కొన్ని వర్గాలకు జీఎస్టీతో లాభం ఉంటుందని చెబుతున్నా.. ఏ మేరకు లాభం ఉంటుంది, ఏ తరహాలో ప్రయోజనం చేకూరుతుంది, అసలు లాభం ఉంటుందా లేదా అన్నదానిపైనా ఎన్నో సందేహాలున్నాయి. దేశంతో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ, ప్రజా జీవనంతో ముడిపడిన ఈ కొత్త పన్నుల విధానంపై ఎన్నో రకాల అంచనాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేటి అర్ధరాత్రి నుంచి కొత్త పన్నుల విధానం అమల్లోకి రానుంది. ఈ విధానం ఎటువంటి ప్రభావం చూపనుందనే అంశంపై వివిధ వర్గాల భయసందేహాలు ఇలా ఉన్నాయి. చిరు వ్యాపారులు ఊరట :ఇప్పటివరకు రూ.5 లక్షల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు, సంస్థలు పన్ను కట్టాల్సి వచ్చేది. అయితే జీఎస్టీలో రూ.20 లక్షల కన్నా తక్కువ వార్షిక టర్నోవర్ ఉంటే పన్ను పరిధిలోకి రారు. వారు తయారుచేసే లేదా విక్రయించే వస్తువులకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. సందేహాలు: రూ.20 లక్షలలోపు టర్నోవర్ ఉందని చూపించేందుకు చిరు వ్యాపారులు ఏం చేయాలన్న దానిపై స్పష్టత లేదు. వ్యాపార లావాదేవీల తనిఖీ, టర్నోవర్ అంచనాల పేరుతో ముందు ముందు ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయా? లాభమా/నష్టమా :జీఎస్టీ అమలుతో చిరు వ్యాపారులకు ఆన్లైన్ ద్వారా అన్ని లావాదేవీలను నిర్వహించడం కష్టం కానుంది. ముఖ్యంగా ప్రతి ఇన్వాయిస్ను అప్లోడ్ చేయాల్సి రావడం, ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి రావడం ఇబ్బందికరమే. పారిశ్రామికవేత్తలు ఊరట: జీఎస్టీలో అంతర్రాష్ట్ర వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉండడం పెద్ద వ్యాపారులకు ఊరట కలిగించనుంది. సందేహాలు: జీఎస్టీ ప్రకారం.. వస్తువును తయారుచేసిన రాష్ట్రాలకు ఎలాంటి పన్ను అందదు. వాటిని వినియోగించే రాష్ట్రాలకే పన్ను వెళుతుంది. అదే రాష్ట్రంలో తయారుచేసి అక్కడే అమ్ముకుంటే ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. దీనివల్ల ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసే వస్తువుల తయారీ పరిశ్రమలకు సబ్సిడీలు ఇచ్చేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. లాభమా/నష్టమా: జీఎస్టీతో పెద్ద వ్యాపారులు, పారిశ్రామికవేత్తలపై ప్రభావం ఎలా ఉంటుందనేది ఆచరణలోనే అనుభవంలోకి వస్తుంది. అంతిమంగా వినియోగదారుడిపై పన్ను ప్రభావం పడుతుంది కనుక లాభనష్టాల బేరీజు అవసరం లేదు. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి జీఎస్టీ అమల్లో ఏ మార్పు తీసుకువస్తుందనే దానిని బట్టి పెద్ద వ్యాపారులు/పారిశ్రామికవేత్తల ప్రయోజనం ఆధారపడి ఉంది. వినియోగదారులు ఊరట: వస్తువును బట్టి గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అన్ని రకాల పన్నులు కలిపి 42 శాతం వరకు పన్నుగా చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు నాలుగు శ్లాబుల్లో గరిష్టంగా 28 శాతం మాత్రమే పన్ను ఉంటుంది. దీనివల్ల ధరలు తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి. సందేహాలు: జీఎస్టీతో వాస్తవంగా వినియోగ వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయి? వేటి ధరలు తగ్గుతాయి, ఏవి పెరుగుతాయి.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోనికి ఎందుకు తీసుకురాలేదు? అలా తెస్తే కచ్చితంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేవి కదా? పన్ను సంస్కరణల ప్రభావం పేరుతో వ్యాపారులు తమపై భారం వేస్తారా? లాభమా/నష్టమా: వినియోగదారులకు జీఎస్టీ ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుందన్నది కొద్దిరోజుల తర్వాతగానీ అర్థమయ్యే పరిస్థితి లేదు. ముఖ్యంగా ధరల పెరుగుదల, వ్యాపారుల దృక్పథం, జీఎస్టీ కౌన్సిల్ విధానాలు వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఊరట: జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వ పన్ను వసూళ్ల రాబడిలో తగ్గుదల కనిపిస్తే ఆ మేరకు కేంద్రమే పరిహారం చెల్లిస్తుంది. అయితే ఇది ఐదేళ్ల పాటు మాత్రమే. ఆలోగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ వనరులను పెంచుకోవాలి. సందేహాలు:జీఎస్టీ వల్ల రాబడి తగ్గితే నెలవారీ లావాదేవీలకు ఇబ్బందులెదురవుతాయా? తక్షణ అవసరాలను ఎలా సర్దుబాటు చేసుకోవాలి? ఐదేళ్లు ఇచ్చే పరిహారాన్ని ఎప్పుడెప్పుడు ఇస్తారో స్పష్టంగా చెప్పని నేపథ్యంలో.. ఆ నిధులకు ఎదురు చూడాల్సిందేనా? రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బందిని ఎలా అధిగమించాలి? ఈ విషయంలో కేంద్రం ఏవైనా మినహాయింపులిస్తుందా? లాభమా/నష్టమా: దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం వల్ల రాష్ట్రాలు ఏ వస్తువుపైనైనా పన్ను వి«ధించే అధికారాన్ని శాశ్వతంగా కోల్పోనున్నాయి. మళ్లీ పార్లమెంటులో చట్టం చేస్తేనే రాష్ట్రాలకు ఆ అధికారాలు వస్తాయి. ఇక జీఎస్టీ అమలు కోసం సర్దుబాటు చేసుకోవాల్సిన ఉద్యోగాలు రాష్ట్రాలపై అదనపు భారమే. మూడు పన్నులు.. నాలుగు శ్లాబులు జీఎస్టీ ప్రకారం మార్కెట్లో లభ్యమయ్యే ప్రతి వస్తు వుపై (పెట్రోలియం ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులు, మద్యం మినహా) నాలుగు శ్లాబుల్లో మూడు రకాల పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర వస్తు సేవల పన్ను (సీజీఎస్టీ), రాష్ట్ర వస్తుసేవల పన్ను (ఎస్జీ ఎస్టీ), సమీకృత వస్తుసేవల పన్ను (ఐజీఎస్టీ)గా పేర్కొనే ఈ మూడు రకాల పన్నులూ కలిపే జీఎస్టీగా వ్యవహరిస్తారు. జీఎస్టీలో నిర్ణయించిన పన్ను శ్లాబుల్లో ఈ మూడు రకాల పన్నులూ కలిసే ఉంటాయి. ఒకే రాష్ట్రంలో తయారుచేసి, వినియోగిస్తే (సీజీఎస్టీ), (ఎస్జీఎస్టీ) కలిపి ఉంటాయి. అంతర్రాష్ట్ర లావాదేవీల్లో ఐజీఎస్టీ ఉంటుంది. నేరుగా వినియోగం కోసం విక్రయించే చోట ఈ పన్నులను వసూలు చేస్తారు. ఆయా వస్తుసేవలను వినియోగిం చిన రాష్ట్రాన్ని బట్టి కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల సొమ్ము పంపకం జరుగుతుంది. వస్తుసేవలను నాలుగు రకాలుగా విభజించి 5, 12, 18, 28 శాతాలుగా జీఎస్టీని నిర్ధారించారు. ఆ వస్తుసేవలు ఏ కేటగిరీలో ఉన్నాయనే దానిని బట్టి గరిష్టంగా అంత శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతా ఆన్లైన్లోనే.. జీఎస్టీ నిబంధనల ప్రకారం.. డీలర్లు, వ్యాపారులు పన్నును ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. రిజి స్ట్రేషన్, రిటర్నులు, చెల్లింపులూ ఆన్లైన్లోనే చేయా లి. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అన్ని ఇన్వాయిస్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా జీఎస్టీ కింద ప్రతి నెలా దేశవ్యాప్తంగా 200కోట్లకు పైగా ఇన్వాయిస్లు అప్లోడ్ అవుతా యని అంచనా. అన్ని లావాదేవీలకు సంబంధించిన వివరాలన్నీ ఆన్లైన్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి 20 ఏళ్ల పాటు రికార్డుల్లో ఉండేలా పోర్టల్‌ను రూపొందిం చారు. ఈ జీఎస్టీ పోర్టల్‌లోకి డీలర్ టిన్ నంబర్‌తో నమోదైతే.. ఆ డీలర్ జీఎస్టీ నెట్‌వర్క్‌లో చేరినట్టే. కొన్నాళ్లు ఆగాల్సిందే..! జీఎస్టీ పన్ను శ్లాబుల్లో చేర్చిన వస్తువులను బట్టి చూస్తే.. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపై పూర్తిగా పన్ను ఎత్తివేయడంతో నిత్యావసరాల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అవి మినహా నిత్యం వినియోగించే వస్తువుల ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్న దానిపై కొంతకాలం తర్వాతే స్పష్టత రానుంది. అయితే వ్యవసాయ ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించినా.. ఎరువులపై పన్ను పెంచడంతో ఆ మేరకు రైతాంగంపై భారం పడనుంది. బొట్టుబిళ్లలు, కుంకుమ, స్టాంపులు, పుస్తకాలు, న్యూస్ పేపర్లు, గాజులు, చేనేత, మెట్రోరైళ్లు, లోకల్ రైళ్లు, మాంస ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాలు, బ్రెడ్, తేనె లాంటి వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించడం మేలు చేకూర్చనుంది. ఇక రబ్బరు టైర్లు, ప్లాస్టిక్ వస్తువులపై గతంలో కన్నా 10 శాతం ఎక్కువ పన్ను పడనుండడం భారమైనట్టే. గతంలో పన్ను లేని ఆటోమొబైల్ విడిభాగాలను ఏకంగా 28 శాతం పన్ను శ్లాబు కిందకు తీసుకురావడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర రవాణా వాహనాల ధరలు పెరిగే అవకాశాలున్నాయి. విలాసాలపై మాత్రం మోతే జీఎస్టీతో విలాస వస్తువులు, సేవలపై మాత్రం పన్ను మోత మోగనుంది. సినిమాలు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, మ్యారేజ్ ఫంక్షన్ హాళ్లు, ఫైవ్‌స్టార్ హోటళ్లు, రేస్‌క్లబ్ బెట్టింగ్‌లు, బ్యూటీకేర్ వస్తువులు వంటివాటి ధరలు, చార్జీలు బాగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ పన్ను విధానం శనివారం నుంచే అమల్లోకి వచ్చినా.. దానిద్వారా వ్యాపార లావాదేవీలు పూర్తిస్థాయిలో జరిపి.. ధరల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు పది పదిహేను రోజులు పట్టే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. లాభమెంత? నష్టమెంత? న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుతో లాభమెంత? నష్టమెంత.. వర్తకులు, వ్యాపారులు, వినియోగదారులకు ఎంత మేరకు ప్రయోజనం.. ఏ ధరలు తగ్గుతాయి.. ఏవి పెరుగుతాయి అన్న ఆందోళనల మధ్య మరికొద్ది గంటల్లో జీఎస్టీ అమల్లోకి రానుంది. వ్యాపారుల రోజువారీ కార్యకలాపాలతో పాటు, వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలపై వస్తు, సేవల పన్ను భారీ ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఏడాది అనంతరం పూర్తి స్థాయి విశ్లేషణ తర్వాతే జీఎస్టీ అసలు ప్రభావం తెలుస్తుందని చెపుతున్నారు. ధర పెరిగేవి.. బ్యాంకింగ్, టెలికం సేవలు..., ఏసీ రెస్టారెంట్లలో భోజనం, మొబైల్ బిల్లులు, ట్యూషన్ ఫీజులు, సెలూన్ ఖర్చులు, రూ. 1000 దాటిన వస్త్రాలపై 6 శాతం పన్నును 12 శాతానికి పెంచారు. రూ. 1000 లోపు వస్త్రాలపై ఒక శాతం తగ్గించారు. ఫ్లాట్, షాపుల కొనుగోలుపై ప్రస్తుతమున్న 6 శాతం పన్నును 12 శాతానికి పెంచారు. ధర తగ్గేవి.. వంటింట్లో వాడే కత్తులు, స్పూన్లు, కెచప్, సాస్, పచ్చళ్ల ధరలు.. బరువు తూచే యంత్రాలు, యూపీఎస్‌లు, ట్రాన్స్ఫార్మర్లు, పారిశ్రామిక ఎలక్ట్రానిక్ వస్తువులు, వైండింగ్ వైర్లు, వాకీ టాకీలు, పోస్టల్, రెవెన్యూ స్టాంపుల ధరలు తగ్గనున్నాయి. ప్లేయింగ్ కార్డులు, చెస్, క్యారమ్ బోర్డు, ఇతర బోర్డు గేమ్స్‌పై పన్ను తగ్గించారు. ఉప్పు, చిన్నారుల రంగుల పుస్తకా లు, ఆహార ధాన్యాల్ని జీఎస్టీ నుంచి మినహాయి ంచారు. ఇక 20 లక్షల్లోపు వార్షికాదాయమున్న వర్తకుల్ని జీఎస్టీ నుంచి మినహాయించారు. ఇక జీఎస్టీ అమలులో ఇబ్బందుల వల్ల 2017–18లో పన్ను ఆదాయం తగ్గవచ్చని ప్రభుత్వం అంచనావేస్తోంది.