ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్ | Yogi Adityanath Introduces Strict Food Regulations In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్

Published Tue, Sep 24 2024 7:30 PM | Last Updated on Wed, Sep 25 2024 3:43 PM

Yogi Adityanath Introduces Strict Food Regulations In Uttar Pradesh

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు.  యూపీ సర్కార్‌ కొత్త నిబంధనల మేరకు.. విధి నిర్వహణలో  చెఫ్‌లు, వెయిటర్‌లు మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలి. హోటళ్లు, రెస్టారెంట్‌లలో సీసీ టీవీ కెమెరాలు తప్పని సరిగా ఇన్‌ స్టాల్‌ చేయాలి. నిర్వాహకులు, మెనూ బోర్డ్‌లపై నిర్వాహకుల పేర్లు, అడ్రస్‌ వివరాలు తప్పని సరిగా ఉండాలని సీఎం యోగి ఆధిత్యనాథ్‌ స్పష్టం చేశారు.  

ఫ్రూట్‌జ్యూస్‌లో మూత్రం
కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లో ఖుషీ జ్యూస్ కార్నర్ షాపు యజమాని పండ్ల రసాల్లో మూత్రం కలిపి అమ్ముతూ పట్టుబడ్డాడు. జ్యూస్‌లో మూత్రం కలుపుతుండగా..అక్కడే ఉన్న వినియోగదారుడు నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

రాష్ట్రంలో కొత్త నిబంధనలు
ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆధిత్యనాథ్‌ ఆద్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోటల్స్‌లో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు.

సమావేశం అనంతరం ఆధిత్యనాథ్‌ మాట్లాడుతూ.. తినే ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న ఘటనల నేపథ్యంలో ఆహార పదార్థాలలో మానవ వ్యర్థాలను కలపడం అసహ్యకరమైంది. ఆమోదయోగ్యం కాదు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా ఉండేందుకు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త నిబంధనల్ని అమలు చేస్తున్నారా? లేదా అని పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు, స్థానిక అధికారులు తనిఖీ చేస్తారని అన్నారు.

ప్రజారోగ్యం విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు. ఆహారం కలుషితం లేదా అపరిశుభ్రమైన పద్ధతుల్ని అవలంభించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. 

చదవండి : రేసుగుర్రం నటుడు రవి కిషన్‌పై సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement