ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయ్యాయని, జనవరి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గుర్తింపు కార్డులను సిద్ధం చేసుకునేందుకు తగినంత సమయం ఇచ్చినట్లు సమాచారం.
ఉత్తరప్రదేశ్ మాదిరిగానే పరిశుభ్రమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించే ఉద్దేశ్యంతో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మేము నిర్ణయించుకున్నాము’ అని పట్టణాభివృద్ధి మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
BIG NEWS 🚨 Himachal Congress Minister Vikramaditya Singh announces that all restaurants, food outlets will have to display owner’s identification.
SHOCKING part is he referenced recent directive from CM Yogi Adityanath in his post
YOGI MAGIC ACROSS INDIA 🔥🔥
Yesterday CM… pic.twitter.com/J8YltyFvF4— Times Algebra (@TimesAlgebraIND) September 25, 2024
పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహించిన సమావేశంలో ఆహార లభ్యతపై ప్రజల్లో నెలకొన్న భయాలు, ఆందోళనలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఈ కొత్త నిబంధనల్ని అమలు చేయాలని భావించినట్లు విక్రమాదిత్య సింగ్ చెప్పారు.
👉 చదవండి : రాష్ట్రంలో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్
యూపీ యోగి సర్కార్ సైతం
కాగా,మంగళవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత‍్యనాథ్ రాష్ట్రంలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారం అందించేలా కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్లతో పాటు తినుబండరాలు అమ్మే ప్రదేశాల్లో యజమానులు, సిబ్బంది, చెఫ్‌లు తప్పని సరిగా మాస్క్‌లు, గ్లౌజ్స్ ధరించాలి. హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు సిబ్బంది, ఇతర మేనేజర్లు ఇతర ఉద్యోగులు తప్పని సరిగా వారి వివరాల్ని మెనూ కార్డ్‌లో ప్రదర్శించాలని సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే మధ్యప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment