
ఏపీలోనూ పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ బాదుడు!
హైదరాబాద్: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలతో వినియోగదారుడికి ఉపశమనం లభించిందనే లోపులే వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిరి చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. అదే బాటను ఏపీ ప్రభుత్వం కూడా అనుసరించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో వ్యాట్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.
గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందన్నారు.ఇందులో భాగంగానే వ్యాట్ ను పెంచేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.