
లక్నో: దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు స్వల్పంగా వెనక్కి తగ్గగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్ వ్యాట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్‌పై వ్యాట్‌ను 26.80 శాతానికి, డీజిల్‌పై 17.48 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తరువాత ఇంధన ధరలు పెరిగాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఒక లీటరు పెట్రోల్‌కు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 98 పైసలు పెరగ్గా, లీటరు డీజిల్‌కు రూ .2.35 పెరిగింది. దీంతో పెట్రోలు ధర లీటరు రూ. 73.66 గా ఉండగా, డీజిల్ ధర రూ. 65.28గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment