ప్రభుత్వ ఉద్యోగికి రెండేళ్ల జైలు
Published Tue, Mar 28 2017 7:22 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
కర్నూలు(లీగల్): ఓ వ్యాపారి నుంచి వ్యాట్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఉద్యోగికి రెండేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ కర్నూలు ఏసీబీ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. వైఎస్సార్ జిల్లా కడప నగరంలో వ్యాపారి కృష్ణమోహన్‌రెడ్డికి అవసరమైన వ్యాట్ సర్టిఫికెట్‌ను ఇవ్వాలని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సంప్రదించాడు. ఇందుకు రూ.1500 లంచం ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ ఎల్.జితేంద్ర డిమాండ్ చేశారు. దీంతో వ్యాపారి 2014 జూన్ నెలలో కడప ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వలపన్ని సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకుని కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగా కేసు విచారణలో అవినీతి అధికారిపై నేరం రుజువు కావడంతో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె.సుధాకర్ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున పీపీ భగవాన్‌రెడ్డి వాదించారు.
Advertisement
Advertisement