అవినీతి కేసులో జైలు, జరిమానా
Published Wed, Mar 8 2017 12:51 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
కర్నూలు (లీగల్): కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకొని అవినీతి నిరోధక శాఖ అధికారులు దొరికిన కేసులో బనగానపల్లె విద్యుత్ కార్యాలయం అకౌంట్స్ ఆఫీసర్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ కర్నూలు ఏసీబీ న్యాయస్థానం మంగళవారం తీర్పు చెప్పింది. బనగానపల్లె ఏపీసీపీడీసీఎల్ రెవెన్యూ కార్యాలయానికి సెక్యూరిటీ గార్డులను నియమించేందుకు ఒప్పందం చేసుకున్న వి.వెంకటేశ్వర్లు అనే కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నాడు. తనకు రావాల్సిన సెక్యూరిటీ గార్డుల వేతన బిల్లులను పంపాలని 2013 మే 18న కార్యాలయంలో కలిసి అడుగగా లంచం ఇస్తేగాని పని చేయనన్నాడు. దాంతో కాంట్రాక్టర్ 3 రోజుల తర్వాత ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మే 21వ తేదీన రూ.27 వేలు లంచం తీసుకుంటుండగా అప్పటి ఏసీబీ డీఎస్పీ, సీఐలు వలపన్ని పట్టుకున్నారు. నిందితుడిపై చార్జీషీటు దాఖలు చేయగా కేసు విచారణ అనంతరం జైలు శిక్ష, జరిమాన విధిస్తూ న్యాయమూర్తి కె.సుధాకర్ తీర్పు చెప్పారు.
Advertisement