మందుల ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి
మందుల ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి
Published Thu, Jul 21 2016 11:09 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
– ఎక్సైజŒ టాక్స్, వ్యాట్‌ను ఎత్తివేయాలి
– మెడికల్ రిప్స్ యూనియన్ డిమాండ్
ఒంగోలు టౌన్ : ప్రజలు వాడుకునే మందుల ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈ గిరి డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ పిలుపుమేరకు మందులకు సంబంధించిన ధరలపై జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన నిత్యావసర, అత్యవసర మందులపై ఎక్సైజŒ టాక్స్, వ్యాట్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ ఫార్మా కంపెనీలను కాపాడాలన్నారు. హిందూస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్‌ను మూసివేయాలన్న ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా మందుల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తయారీ ఖర్చులకు అనుగుణంగా మందుల ధరలు ఉండాలన్నారు. మందుల తయారీలో జరుగుతున్న లోపాలను గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు కొండారెడ్డి మాట్లాడుతూ విదేశీ కంపెనీల ఆధిపత్యాన్ని భారత ఫార్మా రంగంపై పడకుండా చూడాలన్నారు. ఈ థర్నాలో సీఐటీయూ నగర అధ్యక్షుడు దామా శ్రీనివాసులు, కార్యదర్శి బి.వెంకట్రావు, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ జిల్లా నాయకులు కె.వి.శేషారావు, ఐ.కె. కృష్ణమోహన్, సీహెచ్ చిరంజీవి, ఎం.నాగరాజు, అంజిరెడ్డి, బాషా, మాధవ, ఎ.మూర్తి తదితరులు పాల్గొన్నారు. తొలుత స్థానిక ఏనుగుచెట్టు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు.
Advertisement
Advertisement