Exice
-
ప్రశాంతంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్ష
నల్లగొండ క్రైం: ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పరీక్షలు ఆదివారం జిల్లాలోని నల్లగొండ, భువనగిరి, పోచంపల్లిలోని 71 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 30,244 మంది అభ్యర్థులకు గాను 24,759 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా 5,485 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తంగా 82 శాతం మంది పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షను నిర్వహించారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఐదుగురు అభ్యర్థులను వెనక్కి పంపారు. జిల్లా కేంద్రంతో పాటు భువనగిరి పట్టణంలోని పరీక్షా కేంద్రాలను టీఎస్పీఎస్సీ సభ్యుడు మతీనుద్దీన్ ఖాద్రీ పరిశీలించారు. అదే విధంగా జిల్లా కేంద్రంలో జేసీ సత్యనారాయణ, ఏజేసీ వెంకట్రావు, డీఆర్ఓ రవినాయక్, ఆర్డీఓ వెంకటాచారి, డీఈఓ మధుసూదన్‌లు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
మందుల ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి
– ఎక్సైజŒ టాక్స్, వ్యాట్‌ను ఎత్తివేయాలి – మెడికల్ రిప్స్ యూనియన్ డిమాండ్ ఒంగోలు టౌన్ : ప్రజలు వాడుకునే మందుల ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈ గిరి డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ పిలుపుమేరకు మందులకు సంబంధించిన ధరలపై జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన నిత్యావసర, అత్యవసర మందులపై ఎక్సైజŒ టాక్స్, వ్యాట్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ ఫార్మా కంపెనీలను కాపాడాలన్నారు. హిందూస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్‌ను మూసివేయాలన్న ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఆన్లైన్ ద్వారా మందుల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తయారీ ఖర్చులకు అనుగుణంగా మందుల ధరలు ఉండాలన్నారు. మందుల తయారీలో జరుగుతున్న లోపాలను గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు కొండారెడ్డి మాట్లాడుతూ విదేశీ కంపెనీల ఆధిపత్యాన్ని భారత ఫార్మా రంగంపై పడకుండా చూడాలన్నారు. ఈ థర్నాలో సీఐటీయూ నగర అధ్యక్షుడు దామా శ్రీనివాసులు, కార్యదర్శి బి.వెంకట్రావు, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ జిల్లా నాయకులు కె.వి.శేషారావు, ఐ.కె. కృష్ణమోహన్, సీహెచ్ చిరంజీవి, ఎం.నాగరాజు, అంజిరెడ్డి, బాషా, మాధవ, ఎ.మూర్తి తదితరులు పాల్గొన్నారు. తొలుత స్థానిక ఏనుగుచెట్టు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. -
విజయవాడలో కస్టమ్స్, ఆడిట్ కమిషనరేట్లు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల సాక్షి, గుంటూరు: కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విజయవాడకు నూతనంగా కస్టమ్స్ ప్రివెంటివ్, ఆడిట్ కమిషనరేట్లు మంజూరయ్యాయి. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు కానున్న కస్టమ్స్ కమిషనరేట్ పరిధి విశాఖపట్నం పోర్టు మినహా మిగిలిన సీమాంధ్ర జిల్లాలు, యానాం ప్రాంతం వరకు ఉంటుంది. ఆడిట్ కమిషనరేట్ పరిధిలోకి సీమాంధ్రలోని 13 జిల్లాలు వస్తాయి. విజయవాడలో ఆడిట్ ప్రధాన కార్యాలయంతోపాటు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలలో ఆడిట్ డివిజనల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.