విజయవాడలో కస్టమ్స్, ఆడిట్ కమిషనరేట్‌లు | Custom, Audit Commissionarates at Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో కస్టమ్స్, ఆడిట్ కమిషనరేట్‌లు

Published Fri, Sep 19 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

Custom, Audit Commissionarates at Vijayawada

  •  కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల
  •  సాక్షి, గుంటూరు: కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విజయవాడకు నూతనంగా కస్టమ్స్ ప్రివెంటివ్, ఆడిట్ కమిషనరేట్లు మంజూరయ్యాయి. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు కానున్న కస్టమ్స్ కమిషనరేట్ పరిధి విశాఖపట్నం పోర్టు మినహా మిగిలిన సీమాంధ్ర జిల్లాలు, యానాం ప్రాంతం వరకు ఉంటుంది. ఆడిట్ కమిషనరేట్ పరిధిలోకి సీమాంధ్రలోని 13 జిల్లాలు వస్తాయి. విజయవాడలో ఆడిట్ ప్రధాన కార్యాలయంతోపాటు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలలో ఆడిట్ డివిజనల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement