Customs
-
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పాముల బ్యాగు కలకలం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు(Indira Gandhi Airport)లో కలకలం చెలరేగింది. కస్టమ్స్ అధికారులు అరుదైన జీవ జాతులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ఉదంతంలో ముగ్గురు భారత పౌరులను అదుపులోనికి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే నిన్న(శనివారం) రాత్రి బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం ఏఐ 303లో ముగ్గురు ప్రయాణికులు అరుదైన జీవ జాతులను అక్రమంగా భారతదేశానికి తీసుకువచ్చారు. వీరి బ్యాగులను చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు(Customs officials) షాక్ తిన్నారు. ఆ బ్యాగులో పాములు, బల్లులు, కప్పలు, కీటకాలతో పాటు అంతరించిపోతున్న కొన్ని జీవ జాతులు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ జీవ జాతులను వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ అథారిటీకి అప్పగించారు. గతంలోనూ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇటువంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి: రోడ్డెక్కిన అత్తాకోడళ్లు.. చూసి తీరాల్సిందే! -
పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు విదేశీయులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.26 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. జనవరి 24న ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసి... అనంతరం కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. జనవరి 24న సావోపాలో నుంచి వచ్చిన బ్రెజిల్ మహిళ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకొనేందుకు గ్రీన్ చానల్ దాటుతుండగా పట్టుకున్నారు. డ్రగ్స్ క్యాప్సూల్స్ తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసి 100 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. వాటిలో కొకైన్‌గా అనుమానిస్తున్న తెల్లటి పొడి ఉన్నట్లు తేలింది. స్వా«దీనం చేసుకున్న డ్రగ్స్ బరువు 802 గ్రాములు కాగా, వీటి విలువ రూ.12.03 కోట్లు ఉంటుందని అంచనా. అదే రోజు అడిస్ అబాబా నుంచి వస్తున్న కెన్యా ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. విచారణలో కొకైన్ క్యాప్సూల్స్ మింగినట్లు అంగీకరించాడు. అతడిని కూడా ఆస్పత్రికి తరలించి మొత్తం 70 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. క్యాప్సుల్స్‌లో 996 గ్రాముల హై ప్యూరిటీ కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. రూ.14.94 కోట్ల విలువైన డ్రగ్స్‌గా గుర్తించారు. ఇద్దరినీ అరెస్టు చేసి.. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న మాదకద్రవ్యాల సిండికేట్‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
చౌకగా ప్రీమియం మోటార్ సైకిళ్లు
అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత ప్రభుత్వం దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ 2025లో భాగంగా హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్, సుజుకీ వంటి బ్రాండ్ల ప్రీమియం మోటార్ సైకిళ్లపై సుంకాలను 5-20 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపారు.దిగుమతి సుంకాల తగ్గింపు అమెరికా నుంచి వస్తున్న వస్తువులపై డిమాండ్ స్థిరంగా కొనసాగించేదిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ టారిఫ్ విధానాలను, హార్లే డేవిడ్సన్ దిగుమతులకు సంబంధించి విమర్శించారు. భారత్‌ను ‘టారిఫ్ కింగ్’గా అభివర్ణించిన ట్రంప్.. అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని పదేపదే పిలుపునిచ్చారు.కొత్త విధానం ప్రకారం 1600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై గతంలో ఉన్న 50 శాతం నుంచి 40 శాతానికి కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. 1600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై సుంకాన్ని 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దీంతోపాటు సెమీ నాక్ డౌన్ (ఎస్కేడీ-తయారీదారు ప్లాంట్‌లో పాక్షికంగా అసెంబుల్ చేసిన వాహనం(లైట్ మోటార్ సైకిళ్లు లేదా కార్లు)), పూర్తిగా నాక్ డౌన్ (సీకేడీ-తయారీదారు ప్లాంట్ వద్దే పూర్తిగా విడి భాగాలుగా చేయడం) యూనిట్లపై సుంకాలను కూడా తగ్గించారు.ఇదీ చదవండి: రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..ఈ చర్య భారతీయ వినియోగదారులకు ప్రీమియం మోటార్ సైకిళ్లను మరింత చౌకగా మారుస్తుందని, ఈ హై-ఎండ్ బ్రాండ్ల అమ్మకాలను పెంచుతుందని భావిస్తున్నారు. అమెరికా లేవనెత్తిన వాణిజ్య ఫిర్యాదులను పరిష్కరించడానికి, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి భారతదేశం సుముఖంగా ఉందని ఈ నిర్ణయం సూచిస్తుంది. కస్టమ్స్ సుంకాల తగ్గింపు దేశీయ తయారీని ప్రోత్సహించడానికి, విదేశీ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాన్ని పెంచే విస్తృత వ్యూహంలో భాగం. -
రూ.14.37 కోట్ల బంగారం స్వాదీనం
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.14.37 కోట్ల విలువైన 17.90 కిలోల బంగారాన్ని విజయవాడ కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకొని.. ఒక మహిళ సహా 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను విజయవాడ కస్టమ్స్ కమిషనర్ ఎస్.నరసింహారెడ్డి ఆదివారం మీడియాకు తెలియజేశారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం మేరకు విజయవాడ కస్టమ్స్(ప్రివెంటివ్) కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు.తాడిపత్రి, నెల్లూరు రైల్వేస్టేషన్‌తో పాటు బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద కస్టమ్స్(ప్రివెంటివ్), తిరుపతి, గుంటూరు సెంట్రల్ జీఎస్టీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయని తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్న 17.90 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని 16 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని చెప్పారు. నిందితులను విశాఖపట్నం ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్టు నరసింహారెడ్డి తెలిపారు. -
HYD: ఎయిర్‌పోర్టులో పాముల కలకలం
సాక్షి,హైదరాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి.సోమవారం(నవంబర్ 25) బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళల దగ్గర పాములున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.దీంతో మహిళల బ్యాగులను తనిఖీ చేసిన సిబ్బంది వారి నుంచి విషపూరితమైన పాములను స్వాధీనం చేసుకున్నారు. పాములను స్మగ్లింగ్ చేస్తున్నారా లేక దీని వెనుక ఇంకేదైనా వ్యవహారం ఉందా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పోలీసులకు మహిళ బెదిరింపులు -
‘గోల్డెన్’ డేస్!
బంగారం ధరలు దిగొచ్చాయి. గత ఐదేళ్లుగా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తూ రెట్టింపైన ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ స్థాయిలో ధరలు తగ్గడం చరిత్రలో ఇదే తొలిసారి. దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం. దీంతో బంగారం దుకాణాలు కొనుగోలుదార్లతో కిటకిటలాడు తున్నాయి. ‘శ్రావణం’ పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బంగారం విక్రయాలు ఇలా.. (కేజీల్లో )రోజుకు 107నెలకు 3,210ఏడాదికి 38,520సాక్షి ప్రతినిధి, కర్నూలు: బంగారం ధరలు ఇటీవల వేగంగా పెరిగాయి. 2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ.5 వేలుంటే.. 2019 నాటికి రూ.35 వేలకు చేరింది. గత ఐదేళ్లలో ఏకంగా రెట్టింపై.. రూ.70 వేల మార్క్‌ను దాటింది. 24 క్యారెట్ల ధర అత్యధికంగా రూ.75,050కు చేరితే, 22 క్యారెట్ రూ.68,800 వరకూ ట్రేడ్ అయింది. బంగారం, వెండి, ప్లాటినంతో పాటు విలువైన లోహాలపై 10 శాతం బీసీడీ(బేసిక్ కస్టమ్ డ్యూటీ) ఉండేది. దీనికి అదనంగా ఏఐడీసీ(అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్) 5% ఉండేది. కేంద్రం బీసీడీని 5శాతం, ఏఐడీసీని 4% తగ్గించింది. దీంతో కస్టమ్స్ సుంకాన్ని కేవలం 6 శాతానికే పరిమితం చేసింది. జీఎస్టీలో మాత్రం మార్పుల్లేవు.. 3 శాతంగానే ఉంది. దీంతో మొత్తంగా జీఎస్టీతో కలిపి బంగారు, వెండిపై 18 శాతం ఉన్న సుంకం 9 శాతానికి తగ్గింది. దీంతో బంగారు, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.6 వేల దాకా తగ్గింది. రూ.63 వేల వరకూ తగ్గిన బంగారం తిరిగి కాస్త పెరిగి రూ.63,850 చేరింది. ధరలు మరింత తగ్గే అవకాశం 22 క్యారెట్ల ధర రూ.68,800 నుంచి రూ.63 వేలకు తగ్గింది. అంటే 5,800 తగ్గిందన్నమాట. కొన్ని ప్రాంతాల్లోని మార్కెట్లలో రూ.6 వేలకు పైగా తగ్గింది. అయితే మరింతగా ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నెల 5వ తేదీ నుంచి శ్రావణమాసం మొదలవుతుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారు కొనుగోలుకు డిమాండ్ పెరిగింది. వివాహాల కోసం అన్ని వర్గాలు అనివార్యంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఈ కారణంగానే ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నాయని, శ్రావణం తర్వాత 10 గ్రాములపై మరో రూ.2 వేలు లేదా 3 వేల వరకూ ధరలు తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. కొనుగోలుదారులతో కిటకిట శ్రావణమాసం, పైగా ధరలు భారీగా తగ్గడంతో బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. నగదు దాచుకున్న వారు వడ్డీలకు డబ్బులివ్వడం కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం మేలని భారీగా కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలల తర్వాత బంగారం ధర తిరిగి పుంజుకుంటుందని.. 24 క్యారెట్ల ధర రూ.80 వేల వరకూ చేరొచ్చని వ్యాపారులు చెబుతున్నారు. మరి కొద్దిరోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం రేటు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ఏడాదికి రూ.28.89 వేల కోట్లు మలబార్, ఖజానా, జోయ్ అలూక్కాస్, లలిత లాంటి ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు 10 వరకూ ఉన్నాయి. దాదాపు ప్రతి ఉమ్మడి జిల్లాలో వీటి బ్రాంచ్‌లున్నాయి. వీటిలో ప్రముఖమైన నాలుగు సంస్థల్లో రోజూ 1–1.5 కిలోల బంగారం విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. తక్కిన వాటిలో అరకిలో వరకూ విక్రయం అవుతోంది. వీటితో పాటు స్వర్ణకారుల దుకాణాల్లో విక్రయాలున్నాయి. ఇలా కార్పొరేట్ కంపెనీలు, స్వర్ణకారుల దుకాణాల్లో 13 ఉమ్మడి జిల్లాల్లో రోజూ సగటున 107 కిలోల బంగారం విక్రయం అవుతోందని తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో నెలకు 3,210 కిలోలు విక్రయం జరుగుతోంది. రోజువారి బంగారం ధరలతో పాటు.. దానికి తరుగు, జీఎస్టీ కలిపితే సగటున ఒక కిలో రూ.75 లక్షల వరకూ పలుకుతోంది. ఈ లెక్కన నెలకు రూ.2,407 కోట్ల చొప్పున.. ఏడాదికి రూ.28.89 వేల కోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. దీన్నిబట్టే బంగారం వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. స్మగ్లింగ్ నివారణకే సుంకం తగ్గింపు.. బంగారు విక్రయాలు ‘భారత్’లో ఎక్కువ. దీంతో కేంద్రం దీనిపై మొన్నటి వరకూ జీఎస్టీతో కలిపి 18 శాతం సుంకం వసూలు చేసేది. దుబాయి, సౌదీ, కువైట్‌తో పాటు పలు గల్ఫ్ దేశాల్లో భారత్‌తో పోలి్చతే సుంకం సగాని కంటే తక్కువగా ఉంది. దీంతో గల్ఫ్‌కు, భారత్‌కు 10 గ్రాములపై రూ.7 వేల వరకూ ధరల్లో వ్యత్యాసం ఉంది. అందువల్లే గల్ఫ్ నుంచి వచ్చేవారు అక్రమంగా బంగారాన్ని తెచ్చేవారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, విజయవాడ విమానాశ్రయాల్లో నిత్యం ‘గోల్డ్ స్మగ్లింగ్’ వెలుగు చూసేది. పట్టుబడకుండా దేశంలోకి పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల ద్వారా భారీగా చేరుతోందని కేంద్రం గ్రహించింది. స్మగ్లింగ్‌కు గల కారణాలపై ఆరా తీస్తే ధరల్లో వ్యత్యాసమేనని స్పష్టమైంది. అక్రమంగా వచ్చిన బంగారాన్ని కొనుగోలు చేసి నగలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో మన ఖజానాకు గండిపడుతోంది. ధరల్లో వ్యత్యాసాన్ని తగ్గించగలిగితే స్మగ్లింగ్ తగ్గుతుందని, అప్పుడు కొనుగోళ్లు దేశీయంగానే జరుగుతాయి కాబట్టి ఖజానాకు లాభం చేకూరుతుందని భావించిన కేంద్రం సుంకాన్ని తగ్గించింది. దీంతో పాటు బంగారాన్ని పెట్టుబడిగా భావించి కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువ. ధరలు తగ్గిస్తే నగదును దాచుకున్న వారు బంగారాన్ని కొనే అవకాశం ఉంది. దీంతో మార్కెట్లో నగదు చెలామణి పెరిగి.. దేశ ఆరి్థక వృద్ధికి దోహదపడుతుందని భావించి సుంకాన్ని తగ్గించారు. ధరలు తగ్గడం సంతోషకరం మొన్నటి దాకా బంగారం కొనాలంటే ధరలు షాక్ కొట్టేవి. 10గ్రాములు కొనాలంటే తరుగుతో కలిపి రూ.80 వేలు అయ్యేది. వారం కిందట ధరలు భారీగా తగ్గాయని తెలిసింది. మా అమ్మ నగలు కొందాం, మళ్లీ పెరుగుతాయంట అని చెప్పడంతో కొనుగోలు చేసేందుకు వచ్చాం. ధరలు తగ్గడంతో తులంపై రూ.5 వేల నుంచి 6 వేల దాకా ఆదా అవుతోంది. – అఖిల, కర్నూలు ధరలు తగ్గాయని కొనేందుకు వచ్చా.. బంగారం ధర తగ్గడమన్నది శుభావార్తే. పెళ్లిళ్ల సీజన్ కావడంతో సామాన్య, మధ్య తరగతి వారికి వెసులు బాటు లభించినట్టే. ధరలు తగ్గాయని తెలియగానే మళ్లీ పెరుగుతాయేమోనన్న ఆందోళనతోనే కొనేందుకు వచ్చాం. మా నాన్న గిఫ్ట్‌గా గోల్డ్ ఇప్పిస్తున్నారు. అయితే ధరలు ఇంకా తగ్గాలి. సామాన్యులకు మరింత అందుబాటులోకి రావాలి. – డాక్టర్ దివ్య, పీజీ విద్యార్థి, విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్ -
బంగారం అక్రమ రవాణా తగ్గుతుంది..
న్యూఢిల్లీ: బంగారంపై భారీగా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనే నిర్ణయం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి దోహదపడుతుందని సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డ్) చైర్మన్ సంజయ్ కుమార్ మల్హోత్రా తెలిపారు. అలాగే దేశంలోని రత్నాలు ఆభరణాల ఎగుమతులు పెరగడానికి, ఉపాధి వృద్ధికి సహాయపడుతుందని ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2023–24) కస్టమ్స్ శాఖ, డీఆర్ఐ కలిసి 4.8 టన్నుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2022–23లో ఈ పరిమాణం 3.5 టన్నులు కావడం గమనార్హం. యల్లోమెటల్సహా పలు విలువైన లోహాల దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి భారీగా తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ ఉపాధి కల్పన రత్నాలు, ఆభరణాల రంగంలో దాదాపు 50 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, ఎగుమతుల్లో ఈ రంగం వాటా 8 శాతం వరకూ ఉందని కుమార్ మల్హోత్రా తెలిపారు. దేశానికి 2023–24లో 45.54 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు జరిగాయి. వెండి విషయంలో ఈ విలువ 5.44 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో ఆభరణాల ఎగుమతులు విలువ 13.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా భారత్ 800 నుంచి 900 టన్నుల పసిడి దిగుమతులను చేసుకుంటోంది. బంగారం దిగుమతులలో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. మొత్తం దిగుమతుల్లో ఈ దేశం వాటా దాదాపు 40 శాతం. తరువాతి 16 శాతానికిపైగా వాటాతో యూఏఈ రెండవ స్థానంలో ఉంది. 10 శాతం వాటాలో దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో నిలుస్తోంది. 2022లో పెరిగిన సుంకాలుదేశంలోకి వచీ్చ–వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) భారీ పెరుగుదలను నివారించడానికి 2022 జూలైలో (10.75 శాతం నుంచి 15 శాతానికి) కస్టమ్స్ సుంకాన్ని భారీగా పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2022–23లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతంగా ఉన్న క్యాడ్, 2023–24లో ఏకంగా 0.7 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా మిగులు నమోదయ్యింది. -
ప్రిస్క్రిప్షన్ బాగు.. బాగు..
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖకు 2024–25 బడ్జెట్లో రూ.90,958.63 కోట్లను కేటాయించారు. ఇది 2023–24 సవరించిన అంచనాల కంటే (రూ.80,517.62 కోట్లు) 12.96 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అలాగే ఈ బడ్జెట్లో కేన్సర్ చికిత్సకు ఉపయోగించే మూడు కీలక మందుల (ట్రాస్తుజుమబ్ డెరక్స్‌టెకన్, ఒసిమెర్టినిబ్, డుర్వాలుమాబ్)పై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ‘కేన్సర్ రోగులకు ఉపశమనం ఇచ్చేందుకు మరో మూడు మందులపై కస్టమ్స్ డ్యూటీని మినహాయిస్తున్నాం. అలాగే ఎక్స్‌రే ట్యూబ్స్, మెడికల్ ఎక్స్‌రే మిషన్లలో వాడే ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)లో మార్పులు చేస్తున్నాం’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖకు గత ఏడాది రూ.3వేల కోట్లు ఇవ్వగా, ఈసారి 3,712.49కోట్లకు పెంచారు. ఆరోగ్య శాఖకు కేటాయించిన మొత్తం రూ.90,958.63 కోట్లలో రూ.87,656.90 కోట్లను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, ఆరోగ్య పరిశోధన విభాగానికి రూ.3,301.73 కోట్లను కేటాయించారు. గత ఏడాది ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.77,624.79 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.100కోట్ల మేర పెరగడం విశేషం. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేటాయింపులు గత ఏడాది రూ.31,550.87 కోట్లు ఉండగా, ఈసారి అది 36,000 కోట్లకు పెరిగింది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జేఏవై)కి కేటాయింపులు రూ. 6,800 కోట్ల నుంచి రూ.7,300 కోట్లకు పెరగడం గమనార్హం. జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌కు కేటాయింపులను రూ.65 కోట్ల నుంచి రూ.90 కోట్లకు పెంచారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌కు గత ఏడాది మాదిరే రూ.200 కోట్లు కేటాయించారు. స్వయంప్రతిపత్తి విభాగాలకు గత ఏడాది (రూ.17,250.90) కేటాయించిన దాని కంటే స్వల్పంగా పెంచుతూ రూ.18,013.62 కోట్లు కేటాయించారు. ఢిల్లీ ఎయిమ్స్‌కు గత ఏడాది రూ.4,278 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో రూ.4,523 కోట్లు ఇచ్చారు. భారత మెడికల్ కౌన్సిల్‌కు గత ఏడాది రూ.2295.12 కోట్ల ఇవ్వగా ఈసారి రూ.2,732.13 కోట్లు కేటాయించారు.మూడు కేన్సర్ మందులు 20% మేర తగ్గుతాయికేన్సర్ చికిత్సలో వాడే మూడు రకాల మందులపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించడంపై ఆరోగ్యరంగ నిపుణులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సుంకం తగ్గింపు వల్ల మందుల ధరలు 10–20 శాతం మేర తగ్గుతాయని ఢిల్లీలోని సీకే బిర్లా ఆస్పత్రికి చెందిన సర్జికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ మన్దీప్ సింగ్ మల్హోత్రా చెప్పారు. అయితే, ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలన్న సుదీర్ఘ డిమాండ్‌ను ఈ బడ్జెట్ కూడా నెరవేర్చకపో వడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. -
ఆ ఘటన షాక్‌కు గురిచేసింది: శశి థరూర్
ఢిల్లీ: తన మాజీ సిబ్బందిలో ఒకరిని గోల్డ్ స్మగ్లింగ్ విషయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకోవటం షాక్‌కు గురిచేసిందని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో రూ. 35 లక్షల బంగారంతో శివ ప్రసాద్ అనే వ్యక్తి కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో అధికారులు అయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత శిశి థరూర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘‘లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నేను ధర్మశాలలో ఉన్నా. నా వద్ద తాత్కాలికంగా పని చేసిన సిబ్బందిని బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న విషయంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకోవటంపై షాక్‌కు గురయ్యాను. 72 ఏళ్ల వ్యక్తి తరచూ డయాలసీస్ చేయించుకుంటున్నారు. ఆ వ్యక్తిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు నా పూర్తి మద్దతు తెలుపుతున్నా. చట్టం తన పని తాను చేస్తుంది’’ అని థరూర్ అన్నారు.While I am in Dharamshala for campaigning purposes, I was shocked to hear of an incident involving a former member of my staff who has been rendering part-time service to me in terms of airport facilitation assistance. He is a 72 year old retiree undergoing frequent dialysis and…— Shashi Tharoor (@ShashiTharoor) May 30, 2024 బుధవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 3 లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 500 గ్రాములో బంగారంలో శవ ప్రసాద్ అనే వ్యక్తి పట్టుబడ్డారు. ఆయన వద్ద ఉన్న బంగారంపై ప్రశ్నించగా సంబంధం లేని సమాధానం చెప్పటంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ నేత శశిథరూర్ సహాక సిబ్బంది అని అధికారులు గుర్తించారు. -
ఖండాంతరాలు దాటిన ప్రేమ
లక్నో: వారి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది.. ఖండంతరాలు దాటిన ఆ ప్రేమకు పెద్దల ఆంగీకారం తోడైంది.. ఇంకేముంది మూడు ముళ్ల బందంతో ఆ జంట ఒక్కటైంది. నెదర్లాండ్స్ అమ్మాయి, యూపీ అబ్బాయి ప్రేమపెళ్లి ఇరువురి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. హార్దిక్ వర్మ(32), ఉత్తరప్రదేశ్ ఫతేపూర్‌కు చెందిన వ్యక్తి. ఇటీవల ఆయన ఉద్యోగ రీత్యా నెదర్లాండ్స్ వెళ్లారు. అక్కడ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో సూపర్వైజర్గా ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలోనే తన సహోద్యోగి గాబ్రిలాతో స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు వివాహంతో ఒక్కటవ్వాలనుకున్నారు. గత వారం గాబ్రిలాను వెంటబెట్టుకుని ఇండియా వచ్చిన హర్దిక్ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు కూడా అంగీకరించడంతో నవంబర్ 29న హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. 'మా కుటుంబీకులు అంతా గుజరాత్లో ఉంటారు. కానీ మా పూర్వికుల నుంచి ఇళ్లు ఇక్కడే ఉంది. అందుకే అందరం ఫతేపూర్‌కు వచ్చాం. హిందూ సాంప్రదాయం ప్రకారమే గాబ్రిలాను వివాహం చేసుకున్నా. డిసెంబర్ 25న నెదర్లాండ్స్ వెళ్లిపోతాం. అక్కడ క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతుల్లో కూడా వివాహం చేసుకుంటాం.' అని హర్దిక్ తెలిపారు. ఇదీ చదవండి: బెంగళూరులో పదుల సంఖ్యలో స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు -
ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి? అల్లుని మృతదేహాన్ని చూసి నెహ్రూ ఏమన్నారు?
అది 1960, సెప్టెంబరు 7.. ఫిరోజ్ గాంధీ వారం రోజులుగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. ఆ నొప్పి ఇక భరించలేక తన స్నేహితుడైన డాక్టర్ హెచ్ఎస్ ఖోస్లాకు ఫోన్ చేశారు. తరువాత తానే కారు నడుపుతూ ఢిల్లీలోని వెల్లింగ్టన్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య ఇందిరా గాంధీ ఢిల్లీకి దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరంలోని త్రివేండ్రంలో ఉన్నారు. ఈ వార్త తెలియగానే ఇందిర వెంటనే ఢిల్లీ బయలుదేరారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు... ఇందిరా గాంధీ ఆ రాత్రంతా ఫిరోజ్ పక్కనే కూర్చున్నారు. ఫిరోజ్ అపస్మారక స్థితిలో ఉన్నారు. సెప్టెంబర్ 8న ఉదయం కొద్దిసేపు స్పృహలోకి వచ్చారు. అయితే ఆయన తన 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు కన్నుమూశారు. ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని వెల్లింగ్టన్ హాస్పిటల్ నుండి తీన్ మూర్తి భవన్‌కు తీసుకువచ్చారని బెర్టిల్ ఫాక్ తన పుస్తకం ‘ఫిరోజ్ – ది ఫర్గాటెన్ గాంధీ’లో రాశారు. అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని... తీన్ మూర్తి భవన్‌కు చేరుకున్న ఇందిర.. ఫిరోజ్ గాంధీ భౌతికకాయానికి తానే స్నానం చేయించి, అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని, ఈ సమయంలో అక్కడ ఎవరూ ఉండకూడదని, అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని కోరారు. తీన్ మూర్తి భవన్‌లోని కింది అంతస్తు నుంచి ఫర్నిచర్ తదితరాలన్నింటినీ తొలగించి, అక్కడ ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని తెల్లటి షీట్‌పై ఉంచి, అందరికీ చివరి చూపు కోసం ఉంచారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి... బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజుల్లో బ్రిటిష్ నటి, సినీ విమర్శకురాలు మేరీ సెటన్ జవహర్లాల్ నెహ్రూ ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు తీన్ మూర్తి భవన్లో ఉండేవారు. జవహర్లాల్ నెహ్రూ, సంజయ్ గాంధీతో కలిసి ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని ఉంచిన గదికి చేరుకున్నారని మేరీ రాశారు. ఆ సమయంలో నెహ్రూ ముఖం పూర్తిగా వాడిపోయింది. ఇందిరా గాంధీ కూడా లోలోపల తీవ్రంగా ఆవేదన చెందున్నారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి వచ్చిన జనాన్ని చూసి నెహ్రూ ‘ఫిరోజ్ని జనం ఇంతలా ఇష్టపడతారని నాకు తెలియదు’ అని అన్నారు. మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు... సెప్టెంబర్ 9 ఉదయం, ఫిరోజ్ గాంధీ భౌతికకాయం అంత్యక్రియల కోసం నిగంబోధ్ ఘాట్‌కు తరలించారు. ఫిరోజ్ గాంధీ తనకు మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు పార్సీ ఆచారాల ప్రకారం తన అంత్యక్రియలు చేయకూడదని తన స్నేహితులకు తెలిపారు. పార్సీ సమాజ ఆచారంలో మృత దేహాన్ని కాల్చడం లేదా పూడ్చివేయడం చేయరు. దీనికి బదులుగా మృతదేహాన్ని ‘టవర్ ఆఫ్ సైలెన్స్’లో ఉంచుతారు. ఇక్కడ డేగలు, కాకులు, జంతువులు ఆ మృతదేహాన్ని ఆహారంగా తీసుకుంటాయి. కాథరిన్ ఫ్రాంక్ తన పుస్తకం ‘ది లైఫ్ ఆఫ్ ఇందిరా గాంధీ’లో ఇలా రాశారు ‘ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు హిందూ ఆచారాల ప్రకారం జరిగినప్పటికీ, ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని దహనం చేసే ముందు కొన్ని పర్షియన్ ఆచారాలను ఇందిర పాటించారు. ‘అహనవేటి’ అధ్యాయం మొత్తం చదివారు. అనంతరం 18 ఏళ్ల రాజీవ్ గాంధీ తన తండ్రి అంత్యక్రియల చితికి నిప్పంటించారు. చితాభస్మాన్ని మూడు భాగాలుగా.. ఫిరోజ్ గాంధీ కుటుంబం చాలా కాలం సూరత్‌లో ఉండేది. తర్వాత ఫిరోజ్ అలహాబాద్ వచ్చాడు. దహన సంస్కారాల అనంతరం అతని చితాభస్మాన్ని మూడు భాగాలుగా విభజించారు. పండిట్ నెహ్రూ సమక్షంలో అలహాబాద్ సంగమంలో ఒక భాగం నిమజ్జనం చేశారు. రెండవ భాగం అలహాబాద్‌లో, మూడవ భాగాన్ని సూరత్‌లోని ఫిరోజ్ పూర్వీకుల స్మశాన వాటికలో ఖననం చేశారు. ఇది కూడా చదవండి: డిజిటల్ విలేజ్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? ఆన్లైన్ సేవలు ఎలా వృద్ధి చెందుతాయి? -
డిసెంబర్‌కు రెడీ!
సాక్షి, అమరావతి: రామాయపట్నం పోర్టును డిసెంబర్‌కి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకనుగుణంగా పటిష్టమైన ప్రణాళికతో పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. రూ.3,736 కోట్లతో 850.79 ఎకరాల వీస్తీర్ణంలో ఏడాదికి 34.04 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రామాయపట్నం తొలి దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. రూ.2,634.65 కోట్ల విలువైన పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్‌ను నవయుగ–అరబిందో భాగస్వామ్య కంపెనీ చేపట్టింది. జూన్, 2022లో నిర్మాణ పనులు ప్రారంభించిన ఈ సంస్థ తొలి దశలో డిసెంబర్‌కి బల్క్ కార్గో బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం 4 బెర్తులు నిర్మిస్తుండగా అందులో 2 మల్టిపర్పస్ బెర్తులు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా, ఒక మల్టీపర్సస్ బెర్తు ఇండోసోల్ క్యాపిటివ్ (సొంత) అవసరాలకు ప్రభుత్వం కేటాయించింది. బల్క్ కార్గో హ్యాండిల్ చేసే నాలుగో బెర్త్‌ను ఏపీ మారిటైమ్ బోర్డు నిర్వహించనుంది. పోర్టు నిర్మాణంలో కీలకమైన బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు పూర్తి కావడంతో పాటు నార్త్ బ్రేక్ వాటర్‌ను ఆనుకొని బల్క్ కార్గో బెర్త్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనికి అదనంగా సముద్రపు ఒడ్డుపై (ఆఫ్‌షోర్) అవసరమైన కస్టమ్స్, సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్ పనులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను చేపట్టింది. డిసెంబర్‌కి పోర్టులో వాణిజ్య పరంగా కార్యకలాపాలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారని, దీనికనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు రామాయపట్నం పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ పి.ప్రతాప్ ‘సాక్షి’కి తెలిపారు. బెర్తుల నిర్మాణంలో కీలకమైన అప్రోచ్ టెస్టెల్ నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయని, పోర్టు నిర్వహణకు అవసరమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ లేఖ రాయడంతో పాటు కస్టమ్స్ కార్యకలాపాల కోసం 27.88 ఎకరాలను కేటాయించినట్లు చెప్పారు. కస్టమ్స్ నిబంధనలు అనుసరించి సరుకు నిర్వహణ చేపట్టడం, రామాయపట్నం పోర్టును ఇమ్మిగ్రేషన్ ల్యాండింగ్ పాయింటింగ్ ప్రకటించడం వంటి దానికోసం కేంద్ర సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. పోర్టు నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులు నవంబర్‌లోగా తీసుకువస్తామని తెలిపారు. మౌలిక వసతుల కల్పన పోర్టు నిర్మాణంతో పాటు పోర్టుకు అవసరమైన రహదారి, రైలు మార్గం, నీటి వసతి వంటివాటిపై ఏపీ మారిటైమ్ బోర్డు వేగంగా అడుగులు వేస్తోంది. జాతీయ రహదారి నుంచి రామాయపట్నం పోర్టును అనుసంధానిస్తూ 4 లైన్ల రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 5.5 కి.మీ పొడవైన రహదారి మార్గాన్ని కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు. 5 కి.మీ రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి రైల్వేతో చర్చిస్తున్నారు. పోర్టు నిర్వహణకు అవసరమైన నీటిని కావలి వాటర్ ట్యాంక్ నుంచి వినియోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. -
భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు
-
డీవీడి రైటర్లో రూ. 40 లక్షలు ఖరీదు చేసే బంగారం
చెన్నై: అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు వేర్వేరు ఘటనల్లో దాదాపు 40 లక్షలు ఖరీదు చేసే బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారలు తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 29న దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు బ్యాగ్‌లో ఉంచిన పోర్టబుల్ డిజిటల్ వీడియో డిస్క్(డీవీడీ) రైటర్లో దాచిన బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు. ఆ బ్యాగ్‌ను మరింతగా చెక్ చేయగా సుమారు 15 మొబైల్ ఫోన్లు, దాదాపు 9 వేల విదేశీ సిగరెట్లు లభించినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. మరోక ఘటనలో దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడు ఏకంగా పేస్ట్ రూపంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఇద్దరు ప్రయాణకుల నుంచి దాదాపు రూ. 40 లక్షలు విలువ చేసే 900 గ్రాముల బంగారం, మొబైల్ ఫోన్లు, సుమారు రూ. 3.15 లక్షలు విలువ చేసే విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: యమునా నదిపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు... ప్రూవ్ చేసిన అధికారి) -
ల్యాప్‌టాప్ కీబోర్డులో పట్టుబడ్డ రూ. 1.3 కోట్ల బంగారం
సాక్షి, చెన్నై: తమిళనాడు విమానాశ్రంయలో ల్యాప్‌టాప్‌లో దాచిన సుమారు 1.3 కోట్ల విలువైన బంగారం దొరికింది. తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు చెందిన ల్యాప్‌టాప్‌లో దాదాపు ₹ 1.3 కోట్ల విలువైన బంగారాన్ని దాచి ఉంచారని పోలీసులు తెలిపారు. ముగ్గురు ప్రయాణికులు నుంచి సుమారు రూ. 1.98 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ల్యాప్‌టాప్ కీబోర్డు కింద ఉండే ప్రాంతంలో బంగారాన్ని దాచినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు మే 11న షార్జా మీదుగా భారత్‌కు చేరుకున్న ఆ ముగ్గురు ప్రయాణికులను కస్టమ్స్ విభాగం అరెస్టు చేసింది. (చదవండి: పెళ్లి ఊరేగింపులో విషాదం...వధువు తల్లిని కత్తితో పొడిచి...) -
‘మీ చెత్త మాకెందుకు?’.. దిమ్మతిరిగే షాక్
Sri Lanka Returns Tonnes Of Garbage: అక్రమంగా దిగుమతి అవుతున్న వేలాది టన్నుల వ్యర్థాలతో నిండిన అనేక వందల కంటైనర్లను శ్రీలంక సోమవారం బ్రిటన్‌కు పంపించిందని అధికారులు తెలిపారు. అవన్నీ బ్రిటన్ నుంచి వచ్చిన వ్యర్థాలు. 2017, 2019 మధ్య కాలంలో శ్రీలంకకు పెద్ద ఎత్తున చేరాయి. వాటిలో ఉపయోగించిన పరుపులు, తివాచీలు, రగ్గులు, మార్చురీల నుండి శరీర భాగాలతో సహా ఆసుపత్రుల నుండి బయోవేస్ట్ కూడా ఉందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అంతేకాదు ఆ కంటైనర్ల నుంచి ఘోరమైన దుర్వాసన వస్తుందని చెప్పారు. ఈ మేరకు సోమవారం కొలంబో ఓడరేవులోని ఓడల్లో లోడ్ చేయబడిన కంటైనర్లలోదాదాపు 3 వేల టన్నుల వ్యర్థాలు ఉన్నాయి. దీంతో కస్టమ్స్ చీఫ్ విజిత రవిప్రియ ఈ విషయమై స్పందించి.. "ఇలాంటి ప్రమాదకర వాటిని దిగుమతి చేసుకోం అప్రమత్తంగా ఉండటమే కాక మళ్లీ జరగకుండా చూసుకుంటాం." అని వివరణ ఇచ్చారు. అయితే కస్టమ్స్ ఒక స్థానిక సంస్థ బ్రిటన్ నుంచి వ్యర్థాలను దిగుమతి చేసుకుంటోందని చెబుతోంది కానీ కచ్చితమైన ఆధారాలను చూపించడంలో విఫలమైంది. ఈ క్రమంలో స్థానిక పర్యావరణ కార్యకర్త బృందం వ్యర్థాలను పంపినవారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీలంక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే శ్రీలంక అప్పీల్ కోర్టు 2020లో ఆ పిటిషన్‌ను సమర్థించింది కూడా. ఈ నేపథ్యంలోనే శ్రీలంక ఆ వ్యర్థాలను యూకేకి తిరిగి పంపించేసింది. ధనిక దేశాలు చాలావరకు ఇలా చెత్తను దిగుమతి చేసి.. సముద్ర మార్గాల గుండా పంపించి చేతులు దులుపుకుంటాయి. ఈ క్రమంలో ఆసియా దేశాల్లో చాలావరకు ఇలాంటి చెత్త కంటెయినర్లు చేరి.. ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతాయి. శ్రీలంకలాగే.. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా కూడా దిగుమతవుతున్న వందలాది చెత్త కంటైనర్లను గతంలో ఆయా దేశాలకు తిరిగి పంపించాయి. (చదవండి: చంద్రుడిని ఢీ కొట్టనున్న రాకెట్!.మాది కాదంటున్న చైనా) -
అందులో దాచి తరలిస్తుండగా.. కోట్ల విలువైన వజ్రాలు సీజ్
తిరువొత్తియూరు: చెన్నై నుంచి దుబాయ్‌కి టెలిస్కోప్‌లో దాచి తరలిస్తున్న రూ. 5.76 కోట్ల విలువవైన 1052 క్యారెట్ వజ్రాలు నగలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చెన్నైకి చెందిన యువకుడిని అధికారులు అరెస్టు చేశారు. గురువారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి వెళ్లే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులను, వారి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో చెన్నైకి చెందిన 30 ఏళ్ల యువకుడి సూట్‌కేసు, బ్యాగ్‌లను తనిఖీ చేయగా నాలుగు టెలిస్కోపులు ఉన్నాయి. వాటిని విప్పి చూడగా 22 చిన్న ప్లాస్టిక్ సంచుల్లో వజ్రాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని యువకుడిని అరెస్టు చేశారు. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. నిర్వాహకుల అరెస్టు
సాక్షి, మల్లాపూర్ (హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరితో పాటు మరో వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాచారం సావర్కర్‌నగర్ అపార్టుమెంట్‌లోని ఓ ఇంట్లో మగ్దూం అలీఖాన్ (44), మల్లికార్జున్ (55) ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ, నాచారం పోలీసులు సోమవారం ఇంటిపై దాడి చేసి నిర్వాహకులతో పాటు ఓ విటుడిని రిమాండ్‌కు తరలించారు. చదవండి: పిచ్చోడి చేతికి ఫోన్.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు! ఏసీ ఓల్టేజీ కన్వర్టర్‌లో బంగారం స్మగ్లింగ్ శంషాబాద్: అక్రమంగా తరలించిన బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఎఫ్‌జెడ్–439 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద ఉన్న ఏసీ వోల్టేజీ కన్వర్టర్‌ను పరిశీలించగా అందులో 316 గ్రాముల బంగారం బయటపడింది. బంగారం విలువ రూ.15.71 లక్షలుంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అంత బంగారాన్ని నోట్లో ఎలా దాచర్రా సామి..!
దేశంలో బంగారం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎంత వీలైతే అంత దేశాల సరిహద్దులు దాటించేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త పద్దతుల్ని అన్వేషిస్తున్నారు. సినిమా స్టైల్లో బంగారాన్ని తరలిస్తున్నారు.కొన్ని సార్లు అధికారులకు అడ్డంగా దొరికేస్తున్నారు. తాజాగా ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్లు విచిత్రంగా బంగారాన్ని తరలిస్తూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. సినిమాల్లో బంగారాన్ని కడుపులో, లేదంటే తలపై విగ్గులో పెట్టుకొన్ని స్మగ్లింగ్ చేసే సన్నివేశాల్ని చూసే ఉంటాం. ఆ సన్నివేశాలు ఈ ఉబ్బెకిస్తాన్ గోల్డ్ స్మగ్లర్లు బాగా నచ్చినట్లన్నాయి. అందుకే తెలివిగా బంగారాన్ని నోట్లో పెట్టుకొని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దుబాయ్ నుంచి వచ్చిన ఉజ్బెకిస్తాన్ స్మగ్లర్లను ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరి వద్ద నుంచి సుమారు 951 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేశారో తెలుసా? బంగారాన్ని పళ్ల సెట్ల తరహాలో డిజైన్ చేయించారు.ఆ సెట్ ను నోట్లో అమర్చుకుని దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చారు. అంత బంగారాన్ని నోట్లో ఎలా పెట్టుకున్నారనేదే ఆశ్చర్యంగా ఉన్నా.. ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించగా..స్మగ్లింగ్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నోట్లో బంగారం పెట్టుకొని స్మగ్లింగ్ చేయడంపై నెటిజన్లు తమదైన స్టైల్లో 'అంత బంగరాన్ని నోట్లో ఎలా దాచర్రా సామి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా.. -
నాకు కస్టమ్స్ అధికారులు తెలుసు, మంచి అవకాశం వదులుకోకండని..
హిమాయత్‌నగర్: నాకు తెలిసిన కస్టమ్స్ అధికారులు ఉన్నారు. వారి వద్ద పట్టుబడిన బంగారం తక్కువకు వస్తుంది. ఇది మంచి అవకాశంగా తీసుకోవాలంటూ నగర వాసి టి.మల్లికార్జున్‌రెడ్డికి టోకరా వేశాడు బెంగుళూరుకు చెందిన కిరణ్ అనే వ్యక్తి. కిరణ్, మల్లికార్జున్‌లు కొంతకాలంగా స్నేహితులు. బెంగుళూరు ఎయిర్‌పోర్టులో విధులు నిర్వర్తించే కస్టమ్స్ అధికారులతో పరిచయాలు ఉన్నాయన్నాడు కిరణ్. దుబాయి తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ బంగారం తెచ్చి ఇక్కడ పట్టుబడ్డ వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం అధికారులు బయట రేటు కంటే తక్కువకు ఇస్తారని నమ్మించాడు. పదేపదే ఫోన్లు చేసి బంగారం కొనగోలు చేయమనడంతో 15 తులాల బంగారు ఆభరణాలకు గాను మల్లికార్జున్‌రెడ్డి కిరణ్‌కు రూ.4లక్షలు పంపాడు. డబ్బు పంపినాక బంగారం ఇవ్వకపోగా.. ఫోన్లకు కూడా సరిగ్గా స్పందించకపోడంతో కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని మంగళవారం బాధితుడు మల్లికార్జున్‌రెడ్డి సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కస్టమ్స్ ఎదుట సీఎం మాజీ ఐటీ అధికారి
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్కామ్ కేసు విచారణ మరో అడుగు ముందుకు పడింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మాజీ ఐటీ అధికారి అరుణ్ బాలచంద్రన్ శుక్రవారం కొచ్చిలో కస్టమ్స్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్మగ్లింగ్ నిందితులకు చేసిన సహాయంపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా అరుణ్ ఈ కేసులో కీలక పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఇతను ఈ కేసులో నిందితుడైన సీఎం మాజీ సలహాదారు ఎం శివశంకర్‌కు అత్యంత సన్నిహితుడుగా అధికారులు పేర్కొంటున్నారు. (చదవండి: కేరళ గోల్డ్ స్కామ్ : మరో కీలక అప్ డేట్) శివశంకర్.. మరో నిందితురాలైన స్వప్న సురేశ్ కోసం సచివాలయం సమీపంలో మంచి ఫ్లాట్ చూసి పెట్టాలని బాలచంద్రన్‌ను కోరినట్లు తెలిపారు. అక్కడైతే ఎవరికీ ఏ అనుమానం రాకుండా బంగారం అక్రమ రవాణాను సులభంగా చేసుకోవాలనుకున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు ఇప్పటివరకు 20 మందిని అరెస్ట్ చేయగా మరో ఐదుగురి కోసం గాలింపు చేపట్టారు. కాగా జూలై 5న కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో యూఏఈ కాన్సులేట్‌కు బంగారంతో వచ్చిన పార్శిల్ గుట్టు ఆ రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. (చదవండి: తిరుచ్చిలో ఎన్ఐఏ దూకుడు) -
న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్స్ సుంకాన్ని తొలగించండి
హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రింట్ మీడియాను ఆదుకోవాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఓవైపు ప్రకటనల ఆదాయాలు కోల్పోయి, మరోవైపు ముడి వస్తువుల వ్యయాలు.. న్యూస్‌ప్రింట్ దిగుమతి సుంకాలు భారీగా పెరిగిపోయి పత్రికా రంగం కుదేలవుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో తక్షణం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. న్యూస్‌ప్రింట్‌పై విధిస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని, న్యూస్‌పేపర్ సంస్థలకు రెండేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని ఐఎన్ఎస్ కోరింది. అలాగే, బీవోసీ ప్రకటన రేటును 50 శాతం, ప్రింట్ మీడియాకు బడ్జెట్‌ను 100% పెంచాలని విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించిన బకాయిలన్నీ తక్షణమే సెటిల్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి రవి మిట్టల్‌కు ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ శైలేష్ గుప్తా ఈ మేరకు లేఖ రాశారు. ‘ముద్రణ వ్యయాలు అధికంగా ఉండే పత్రికలకు ప్రకటనల ఆదాయాలే కీలకం. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో పలు వ్యాపారాలు మూతబడి, ప్రకటనలు లేకపోవడంతో ఆదాయవనరు కోల్పోయినట్లయింది’ అని గుప్తా వివరించారు. చాలా మటుకు చిన్న, మధ్య స్థాయి పత్రికలు ఇప్పటికే ప్రచురణ నిలిపివేశాయని, మిగతావి పెను సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇవి కూడా కుప్పకూలిన పక్షంలో దేశీ న్యూస్‌ప్రింట్ తయారీ పరిశ్రమపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడగలదన్నారు. అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే వారితో పాటు డెలివరీ బాయ్స్ దాకా చాలా మంది ఉపాధి కోల్పోయే ముప్పు ఉందని గుప్తా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రింట్ మీడియా కోలుకునేందుకు తక్షణ తోడ్పాటు చర్యలు తీసుకోవాలని కోరారు. -
అందుకే క్రిస్మస్ ట్రీకి వీటిని వేలాడదీస్తారు!
ప్రపంచ వ్యాప్తంగా జరిగే ముఖ్యమైన పండుగలలో ముందు వరుసలో నిలిచేది క్రిస్మస్. ప్రపంచంలోని పలు దేశాల్లో పలు క్రిస్మస్ ఆచారాలు ఉన్నాయి. అందులో కొన్ని ఎప్పుడో పురతాన కాలంలో ప్రారంభం కాగా, మరికొన్ని నూతనంగా ప్రవేశించాయి. ఈ క్రిస్మస్కు వారు ఎలాంటి ఆచారాలు పాటిస్తారో అవి ఎలా పుట్టుకొచ్చాయో తెలుసుకుందాం రండి. క్రిస్మస్ ట్రీకి ఎందుకు ‘షూ’ బోమ్మలను ఉంచుతారో తెలుసా.. క్రిస్మస్ చెట్టుకు క్రిస్మస్ తాత ‘షూ’ను వేలాడదీసి కట్టడం మీరు చూసే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ పండుగకు టపాసులు కాలుస్తారు. కానీ కేవలం పిల్లలు మాత్రమే ఈ టపాసులను కాలుస్తారు. ఓ నిరుపే దవ్యక్తికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే క్రిస్మస్ రాగానే వారు తమ తండ్రి టపాసులు కావాలని అడిగారు. అయితే ఆ తండ్రి ఇప్పడు వద్దమ్మా తరువాత కొనిస్తాను అని చెప్పాడు. చుట్టుపక్కల పిల్లలు టపాసులు కాల్చడం చూసి తమకూ కావాలని వారు పట్టుబట్టారు. కానీ తండ్రి వద్ద కొనడానికి డబ్బులే లేవు. ఎలాగైనా సరే అవి మాకు తెచ్చి పెట్టు అంటూ పిల్లులు మారాం చేశారు. అలా ఏడుస్తున్న పిల్లలు టపాసుల శబ్థం వచ్చి బయటికి వచ్చి చుశారు. అక్కడ వారి ఇంటి ముందు ‘షూ’లో బోలేడన్ని బహుమతులు, టపాసులు పెట్టి ఉండటం వారు గమనించారు. ఇవి ఎవరు తెచ్చారా అని చుట్టూ చూసిన వారు ఎరుపు రంగు ఉలను టోపి, అదే రంగులో ఉన్ని కోటును ధరించి చేతి కర్రతో వెలుతున్న ఓ ముసలి వ్యక్తిని చూశారు. అలా చూస్తూ ఉండగానే ఆయన మంచులో మాయమైపోయాడు. ఆ తర్వాత వారు ఇంటి లోపలికి వెళ్లి వాళ్ల నాన్నతో క్రిస్మస్ తాత వచ్చి మాకు టపాసులు ఇచ్చాడంటూ సంబర పడిపోయారు. అలా అప్పటీ నుంచి ప్రతి క్రిస్మస్కు పిల్లలందరూ క్రిస్మస్ చెట్లకు, ఇంటి ముందు ‘షూ’ను వెలాదీసీ ఉంచడం మొదలు పెట్టారు. ఎందుకంటే క్రిస్మస్ తాత వచ్చి వాటిలో క్రిస్మస్ బహుమతులు, టపాసులు పెట్టి వెడతాడని వారి నమ్మకం. రాను రానూ క్రిస్మస్ ట్రీకి ‘షూ’ను వేలాడదీయడం ఆనవాయితీగా మారింది. జర్మనీ రాజు తెచ్చిన గ్రీటింగ్ కార్డులు: 1843లో ఇంగ్లాండు దేశానికి చెందిన సర్ హెన్నీ కోల్ తన బంధు మిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు వినూత్న రీతిలో తెలపాలని అనుకున్నాడు. వెంటనే కొన్ని కార్డులను తయారు చేసి దాని మీద క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రాయించాడు. వాటిని తన మిత్రులకు పంపడంతో ఈ ఆచారం పుట్టుకొచ్చింది. కార్డులు ఒక్కసారి ఇస్తే అవి జీవితాంతం దాచుకుంటారు. అనుకోని సంఘటనలు ఎదురైతే తప్ప వాటిని కోల్పోరు కదా. అందుకే ఈ గ్రీటింగ్ కార్డులు ఇస్తే అవి ఎప్పటికీ తీపి గుర్తులుగా ఉండిపోతాయి.. ఇది మంచి ఆలోచన. ఎప్పటికీ ఎండిపోని ఫిర్ చెట్టు(క్రిస్మస్ ట్రీ).. క్రిస్మస్ చెట్టు ఆచారం జర్మనీ నుంచి పుట్టుకొచ్చింది. సాధారణంగా ఫిర్ చెట్టును క్రిస్మస్ చెట్టుగా అలంకరిస్తారు. ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది అన్ని కాలాల్లోనూ ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది.అలాగే మన జీవితాల్లో కూడా దేవుని దీవెనలను అలాగే ఉండాలన్న ఆలోచనలతో ఈ ఆచారం పుట్టుకొచ్చింది. 1846లో విక్టోరియా రాణి, జర్మనీ రాకుమారుడు అల్బర్ట్‌ను కలసి అలంకరించిన క్రిస్మస్ ట్రీ పక్కన నిలుచుని ఫొటో దిగారు. అతి అన్ని వార్తాపత్రికలలో ప్రచురితం కావడంతో క్రిస్మస్ ట్రీ డిమాండ్ పెరిగింది. అనంతరం జర్మన్ ప్రజలు అమెరికాలో స్థిరపడటం వల్ల అమెరికాలో కూడా ఈ ఆచారం వాడుకలోకి వచ్చింది. చైనాలో అతిపెద్ద క్రిస్మస్ సిజన్ షాపింగ్ : క్రిస్మస్ సీజన్లో చైనాలో అత్యధిక కొనుగోళ్లు జరుగుతాయి. ఆ దేశంలో జరిగే అతి పెద్ద షాపింగ్ సీజన్ క్రిస్మస్ ముందు రోజే. క్రిస్మస్ ఆచారాల్లో అక్కడక్కడా కనిపించే యాపిల్ పండ్ల ఆచారం చైనా నుంచే వచ్చింది. మండారిన్ భాషలో యాపిల్ పండు ఉపయోగించే పదరం క్రిస్మస్ ఈవ్‌కు దగ్గరగా ఉంటుంది. అందుకే అక్కడ యాపిల్‌తో చేసిన అలంకరణలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ముందు రోజు ఉపవాసం: క్రిస్మస్ ముందు రోజైన డిసెంబర్ 24న రష్యన్ ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. సాధారణంగా సూర్యుడు వెళ్లిపోయి చుక్కలు కనిపించినప్పుడు మాత్రమే ఆహారాన్ని భుజిస్తారు. అయితే మాంసం మాత్రం ముట్టుకోరు. కుత్యా అనే వంటకం అక్కడ ఫేమస్. ఆ వంటకంలో వివిధ రకాలైన ధాన్యాలు, తెనె, వంటి విత్తనాలు వేసి తయారు చేస్తారు. అయితే ఉపవాసం విరమించేటప్పుడు బోధకులు వారి ఇళ్లకు వెళ్లి వాటిపై పవిత్ర జలం చల్లి ప్రార్థనలు చేసిన తర్వాతే దానిని స్వీకరిస్తారు. - స్నేహలత (వెబ్ డెస్క్) -
స్తూపిక... జ్ఞాన సూచిక
ఆలయ విమానం పైభాగంలో కనిపించే కలశంలాంటి నిర్మాణాన్నే ఆగమ, శిల్పశాస్త్ర పరిభాషలో స్తూపిక అంటారు. చాలామంది శిఖర కలశం అని పిలుస్తారు. ఆలయంలో ఇది అంతిమభాగం, అతి ముఖ్యమైన భాగమని సంప్రదాయం చెప్తోంది. ఆలయంలోనికి అనంతశక్తిని ప్రసరింపజేయడంలో ఈ స్తూపిక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆలయానికి బ్రహ్మభాగంలో అంటే నట్టనడిమిన ఇది ప్రతిష్ఠించబడుతుంది. ఇందులో అమృతం నిండి ఉంటుంది. అందుకే ఇది బిందుస్థానం(మధ్యభాగం)లో ఉండి నిరంతరం అమృతాన్ని స్రవిస్తుందని విశ్వకర్మీయ శిల్పశాస్త్రం చెప్పింది. ఆలయానికి శ్రీయంత్రానికి (శ్రీచక్రం) అవినాభావ సంబంధం ఉంది. ఈ యంత్రం నుండి పైకి లేచి ఆలయం రూపు దాలిస్తే సరిగ్గా బిందుస్థానంలో స్తూపి ఉంటుంది. బిందువు శక్తి అంశ. అందుకే ఈ స్తూపి అత్యంత శక్తివంతమైనది. సాధారణంగా స్తూపిని అరటిమొగ్గవలె రూపొందిస్తారు. అయితే కొన్ని చోట్ల త్రిశూలం, చక్రం వంటి లాంఛనాలు కూడా కనిపిస్తాయి. మొగ్గ వికసించని సృష్టికి ప్రతీక. అంటే ఇక్కడే సృష్టి ప్రారంభం అవుతోందని గమనించాలి. బిందువు నుండి ప్రారంభమై క్రమక్రమంగా విస్తరిస్తూ ఆలయం పూర్ణాకృతి పొందుతుంది. ఇది అవరోహణక్రమం. పూర్ణదేవాలయం క్రమ క్రమేపి చిన్నదవుతూ ఈ స్తూపి మూలంగానే శూన్యంలో కలిసిపోతుంది. ఇది ఆరోహణ క్రమం. ఉన్నది ఒకటే ’సత్’ అని ఋగ్వేదం చెప్పిన మాటకు ప్రతీకగా ఈ స్తూపి కనిపిస్తుంది.త్రిశూలస్తూపి ద్వారా త్రిశూలంలోని మూడు శూలాలతో త్రిమూర్తి తత్త్వం ఆవిష్కృతమౌతుంది. చక్రస్తూపికతో సమస్త విశ్వం ప్రతిబింబిస్తుంది. ఆలయానికైనా, విమానానికైనా ఒకటి మొదలు ఇరవై ఒక్క స్తూపికల వరకు ప్రతిష్ఠించవచ్చు. అలాగే పారలౌకిక కాములు అంటే మోక్షం కోరువారు సమసంఖ్యా కలశాలను, ఐహిక ఫలాన్ని కోరువారు బేసిసంఖ్యలో కలశాలను ప్రతిష్ఠించుకోవచ్చని ఆగమశాసనం. -
పరుగులు తీస్తున్న పుత్తడి!
సాక్షి, కామారెడ్డి: కేంద్ర బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన నేపథ్యంలో ఒక్కసారిగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. బడ్జెట్‌కు ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.33,700 వరకు ఉండగా, కస్టమ్స్ సుంకం పెరగడంతో ధర రూ.34,700 లకు చేరింది. అంటే ఒక్కసారిగా రూ. వెయ్యి వరకు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండడంతో కొనుగోళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కూడా కాకపోవడంతో బంగారం క్రయవిక్రయాలు తక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో బంగారంపై సుంకం పెంచడంతో ధరలు మాత్రం పెరుగుతున్నాయి. దీంతో కొనుగోళ్లు చాలావరకు పడి పోయినట్టు బంగారం వర్తకులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో అరవైకి పైగా బంగారం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ భారీ ఎత్తున బంగారం అమ్మకాలు సాగుతుంటాయి. అయితే పెళ్లిళ్ల సీజన్ కాకపోవడం, ధరలు పెరగడంతో బంగారం దుకాణాలు వెలవెలబోతున్నా యి. పెరుగుతున్న ధరలను చూసి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం ధర లు పెరగడంతో బంగారం కొనేదెలా అం టూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం విక్రయదారులు కూడా అమ్మకాలు తగ్గిపోవడంతో ఇబ్బంది పడతున్నారు. సుమారు మూడు నెలల వరకు శుభ ముహూర్తాలు కూడా లేవు. అటు సీజన్ లేకపోవడం, ఇటు ధర పెరగడంతో బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు పని లేక ఆందోళన చెందుతున్నారు. -
మూడేళ్లు ముప్పుతిప్పలు
నేరేడ్మెట్: కస్టమ్స్, ఏసీబీ అధికారి ముసుగులో నాలుగు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతూ దాదాపు మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని రాచకొండ, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో రాచకొండ కమిషనర్ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం, ఉలుబెరియా జిల్లా, అంతిలా గ్రామానికి చెందిన సౌమన్ బెనర్జీ సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. 2013లో అతను తన గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీగా డబ్బులు దండుకొని మోసం చేశాడు. స్థానికుల నుంచి ఒత్తిడి పెరగడంతో అక్కడి నుంచి తన భార్య సుపర్ణ బెనర్జీ, కుమారుడు సుసోవన్ కలిసి పారిపోయాడు. అక్కడ అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మేడిపల్లి ఠాణా పరిధిలోని చెంగిచెర్లకు చేరుకున్న అతను విశాఖపట్నం హార్బర్లో కస్టమ్స్ అధికారిగా పని చేస్తున్నట్లు స్థానికులతో పరిచయం చేసుకున్నాడు. ఎలాంటి అనుమతులు, రసీదులు లేకుండా తనిఖీల్లో ప్రయాణీకుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్లు, నాణెలు సగం ధరకు అందిస్తానని చెప్పడంతో అతడి వల్లో పడిన పలువురు డబ్బులు చెల్లించారు. మొదట వారి నమ్మకం పొందటానికి బంగారు నాణెలు ఇస్తూ వచ్చాడు. అనంతరం పలువురి నుంచి రూ. కోట్లు వసూలు చేశాడు. అనంతరం రుణాల కోసం బ్యాంకులను మోసం చేయాలనే ఉద్దేశంతో చెంగిచెర్ల, మారేడుపల్లి ప్రాంతాల్లో రెండు కిరాణా సంస్థలను ఏర్పాటు చేసిన అతను పలు ప్రైవేట్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడు. ఈ సొమ్ముతో రూ.60లక్షల విలువ చేసే రెండు విల్లాలు, రెండు కార్లు, మూడు బైక్‌లు కొనుగోలు చేశాడు. ఇందులో భాగంగా తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని, ఇందుకు 30శాతం వడ్డీ చెల్లిస్తానని ప్రచారం చేయడంతో పలువురు పెట్టుబడులు పెట్టారు. తన మోసాలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో అతను చెంగిచెర్లలోని తన ఇంట్లో పెట్టుబడిదారులకు విలాసవంతమైన విందులు ఏర్పాటు చేసేవాడు. ఫ్లయిట్ టికెట్లు, ఖరీదైన గదులను సమకూర్చడం ఇతర ఖర్చులూ భరిస్తూ విహార యాత్రలు ఏర్పాటు చేయడమేగాక, వారికి ఖరీదైన సెల్ఫోన్లు కానుకగా ఇచ్చేవాడు. ఇలా పలువురి నుంచి రూ.5కోట్ల వరకు వసూలు చేశాడు. చెంగిచెర్ల నుంచి పరారీ... 2017–జనవరి 31న తన వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చెంగిచెర్ల నుంచి బిచాణ ఎత్తేశాడు. సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి, ఇంట్లో విలువైన వస్తు లన్నీ తీసుకొని మారుతి ఎర్టిగా వాహనంలో పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం... సీపీ మహేష్‌భగవత్ ఆదేశాలతో మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఓటీ బృందాలు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చేపట్టాయి. పెట్టుబడిదారులను నిందితుడు తరచూ షిర్డీ, నాగ్‌పూర్, ఢిల్లీ,పూణె, ముంబై, గోవా,బెంగాల్ తదితర ప్రాంతాలకు విహార యాత్రలకు తీసుకువెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఆరా తీయగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అమృత్సర్లోనూ మోసాలు.. ఇందులో భాగంగా నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడి మారుతి ఎర్టిగా వాహనం ఉన్నట్లు ఎస్ఓటీ బృందానికి సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకునేలోగా అతను అక్కడి నుంచి అమృత్‌సర్‌కు వెళ్లినట్లు తెలియడంతో వారు అమృత్‌సర్‌కు వెళ్లారు. అమృత్‌సర్‌లో ఆరు నెలలు ఉన్న నిందితుడు అక్కడ ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసి పారిపోయినట్లు గుర్తించారు. అక్కడి ఛాత్రా ఠాణాలో కేసు నమోదైంది. అమృత్‌సర్‌లో జ్యోత్ప్రీత్కౌర్, హరినాథ్‌రెడ్డి ఆధార్‌కార్డుల ద్వారా కొనుగోలు చేసిన సిమ్ కార్డులను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో మరింత లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు అతను జార్ఘండ్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడి వెళ్లలోపే అక్కడినుంచి మాయమయ్యాడు. అనంతరం అతను ఒడిశా రాష్ట్రం, భువనేశ్వర్ పరిధిలో ని ధౌలి ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పుబససనా –కౌసల్య గంగ వద్ద ఓ ఇంట్లో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య, కొడుకు సహకారం నిందితుడు సౌమన్ బెనర్జీ మోసాల్లో భార్య, కుమారుడి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతని నుంచి నకిలీ కస్టమ్స్, ఏసీబీ ఇన్‌స్టిగేషన్ అధికారి, జీఎం సీహాక్ సెక్యూరిటీ సర్వీసెస్, నకిలీ ఓటరు గుర్తింపు కార్డు, 25 రకాల నకిలీ రబ్బర్స్టాంప్లతోపాటు పెద్ద కంపెనీల్లో పలుహోదాల్లో నకిలీ గుర్తింపు కార్డులతోపాటు కుమారుడు, భార్య నకిలీ ఆధార్‌కార్డులను, జార్ఘండ్‌లో కొడుకు ఇంటర్ చదివినట్లు నకిలీ ప్రొవిజనల్ను, కారు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమను ఎలా మోసచేశాడో వివరించారు. మేడిపల్లి, కుషాయిగూడ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసును చేధించిన ఎస్ఓటీ సీఐ నవీన్‌కుమార్, సిబ్బందిని సీపీ నగదు అవార్డులతో సత్కరించారు. సమావేశంలో అదనపు సీపీ సుధీర్‌బాబు, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్‌రెడ్డి, ఎస్ఓటీ సీఐ నవీన్‌కుమార్, మేడపల్లి సీఐ అంజిరెడ్డి,ఎస్ఐలు అవినాష్‌బాబు, రత్నం, ఎస్ఓటీ పోలీసులు పాల్గొన్నారు. ఆధారాలు లభించకుండా జాగ్రత్త నిందితుడు తన ఆధారాలు లభించకుండా మొదటి నుంచి జాగ్రత్త తీసుకుంటున్నాడు. తన పేరు మీద సెల్సిమ్లు తీసుకోకుండా, స్థానికుల ఆధార్‌కార్డులో రెండుమూడు సిమ్‌కార్డులను పొంది వాటినే ఉపయోగించేవాడు. 20 బ్యాంకుల్లో తన పేరున ఖాతాలు తెరిచిన అతను పోలీసులకు తన ఆచూకీ తెలుస్తుందని ఏటీఎంల ద్వారా, నేరుగా డబ్బులు డ్రా చేయకుండా జాగ్రత్త పడ్డాడు. -
విమానాల్లో నిషిద్ధ వస్తువులు...
సాక్షి, సిటీబ్యూరో: కస్టమ్స్ నిబంధనలపై సరైన అవగాహన లేని కారణంగా నిత్యం అనేక మంది సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశాలకు వెళ్లేటప్పుడో, తిరిగి వచ్చేటప్పుడో సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. అలా కాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కస్టమ్స్ అదనపు కమిషనర్ మంజుల హోస్మానీ, డిప్యూటీ కమిషనర్ కళ్యాణ్ రేవెళ్ల శుక్రవారం వివరించారు. æ రోజువారీ వినియోగించుకునే వస్తువులు (జ్యువెలరీ మినహా), రెండు లీటర్ల వరకు మద్యం, 100 సిగరెట్లు, ఓ ల్యాప్‌టాప్... ఎలాంటి పన్ను లేకుండా తెచ్చుకోవచ్చు. వాడుకుంటున్న సెల్‌ఫోన్ కాకుంటే మరొకటి తీసుకురావాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. రూ.50 వేల లోపు విలువైన ఒకటి తీసుకురావచ్చు. రేటు, సంఖ్య పెరిగితే 38.5 శాతం పన్ను విధిస్తారు. ఎక్స్పోర్ట్ సర్టిఫికెట్... ఏవైనా విలువైన వస్తువులను విదేశాలకు తీసుకువెళ్తూ ఉంటే తిరిగి వాటిని భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంటే వాటికి సంబంధించి ఎక్స్పోర్ట్ సర్టిఫికెట్లను పొందాల్సి ఉంటుంది. విమానాశ్రయాల్లోని ఇంటర్నేషనల్ డిపార్చర్ హాళ్లలోని కౌంటర్లలో వాటిని చూపించి ఈ సర్టిఫికెట్లు పొందవచ్చు. తద్వారా తిరిగి వచ్చేప్పుడు ఆయా వస్తువులపై సుంకం చెల్లించాల్సిన అవసరం ఉండదు. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిషిద్ధ వస్తువులు... మాదకద్రవ్యాలు, నకిలీ, అటవీ ఉత్పత్తులు, అశ్లీల సాహిత్యము తదితరాలు, జంతువులు (చిన్న, పెద్ద) విమానాల్లో తీసుకువెళ్లడంపై నిషేధం ఉంది. వీటిని గుర్తిస్తే స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. మారణాయుధాలు, నిర్దిష్ట ఫ్రీక్వెన్సీకి మించిన సమాచార సాధనాలు, కొన్ని రకాల మొక్కలు, వాటి ఉత్పత్తులు, మందులతో పాటు తీసుకువెళ్లేందుకు అనుమతించిన వస్తువులు సైతం వ్యక్తిగత అవసరాలకు మించి వాణిజ్య స్థాయిలో తీసుకువెళ్లకూడదు. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కస్టమ్స్ అధికారులు ‘ఇండియన్ కస్టమ్స్ ట్రావెల్స్ గైడ్’ పేరుతో యాప్ నిర్వహిస్తున్నారు. దీన్ని ప్లేస్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు పొందవచ్చు. -
‘గిఫ్ట్’ దిగుమతులకు కేంద్రం చెక్
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: గిఫ్ట్ ఐటమ్స్ దిగుమతుల నిబంధనలు దుర్వినియోగం అవుతుండటంపై కేంద్రం దృష్టి సారించింది. కస్టమ్స్ సుంకాలను ఎగవేసే ఉద్దేశంతో బహుమతుల పేరిట రూ. 5,000 దాకా విలువ చేసే ఐటమ్స్ దిగుమతి చేసుకుంటుండటాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం రూ. 5,000 దాకా ఉన్న మినహాయింపును ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే ఒక వ్యక్తికి ఏడాదిలో గరిష్టంగా నాలుగు కన్సైన్మెంట్స్ మాత్రమే బహుమతులుగా అనుమతించే విషయమూ పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఈ–కామర్స్ రంగంపై జరిగిన కార్యదర్శుల అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు వివరించాయి. దీనిపై తాము చేసిన సిఫార్సులపై కస్టమ్స్ విభాగం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఒక అధికారి తెలిపారు. రూ. 5,000 దాకా విలువ చేసే గిఫ్ట్ ఐటమ్స్ దిగుమతులకు కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపునిస్తున్న భారత విదేశీ వాణిజ్య చట్టంలోని నిబంధనలను చైనాకి చెందిన పలు ఈ–కామర్స్ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ పరిశ్రమ వర్గాలు చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. -
బంగారం మింగేశారని..
విశాఖపట్నం, గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరో మారు బంగారం స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు. బంగారం బిస్కెట్లు అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖ విమానాశ్రయంలో శనివారం రాత్రి పది గంటలకు ఎయిర్ ఏషియా విమానం నుంచి తమిళనాడుకు చెందిన జహుబర్ సాధిక్ అజారుద్దీన్, జహుబర్ సాధిక్ షేక్ అబ్దుల్లా, నైనాఎండీ సయ్యద్‌లు బ్యాగులతో దిగారు. వీరు టాయ్లెట్ల వైపు వెళ్లటంతో కస్టమ్స్ అధికారులు అనుమానించి తనిఖీ చేశారు. వారి వద్ద రూ.2,33,600 విలువైన బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరింత బంగారం మింగేసి ఉంటారన్న అనుమానంతో వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. -
ఎయిర్‌పోర్టులో 1.24 కేజీల బంగారం పట్టివేత
శంషాబాద్: బంగారం అక్రమ రవాణాదారులు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. విదేశాల నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని విమానాశ్రయాల్లోని మరుగుదొడ్లలో దాచి దేశీయ ప్రయాణికుల ద్వారా బయటికి తరలిస్తున్నారు. ఈ నెల 27న ఇలాంటి సంఘటనే శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుందని కస్టమ్స్ అధికారులు శుక్రవారం రాత్రి వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 27న సాయంత్రం 4:30 గంటలకు ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలోని పురుషుల పరిశుభ్రత గది వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, అతడిని గమనించిన కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అక్రమ రవాణాదారులు దుబాయ్ నుంచి తీసుకొచ్చిన 1.24 కిలోల బంగారాన్ని టాయిలెట్ వద్ద దాచిపెట్టిన సంగతిని వెల్లడించాడు. దేశీయ ప్రయాణికుడిగా వచ్చిన తాను ఆ బంగారాన్ని బయటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను రెడ్ చానల్ వద్ద అధికారులు తనిఖీ చేస్తుండడంతో అక్రమ రవాణాదారులు బంగారాన్ని ఎయిపోర్టులోని టాయిలెట్లో దాచి దేశీయ ప్రయాణికుల ద్వారా బయటికి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. -
‘సీటు’లోనే మతలబు!
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు శుక్రవారం పట్టుకున్న ఉత్తరప్రదేశ్ వాసి విచారణలో బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించిన కొత్త పంథా వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి ఇంటర్నేషనల్ సర్వీస్‌గా వచ్చి... నగరం నుంచి దేశవాళీ సర్వీసుగా మారిపోయే కొన్ని విమానాలను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చు కుంటున్నారు. సీట్లు బుక్ చేసుకోవడంలో తెలివిగా వ్యవహరిస్తున్న వ్యవస్థీకృత ముఠాలు... ఎవరికీ అనుమానం, ‘చేతికి పసిడి’ అంటకుండా పని పూర్తి చేస్తున్నాయని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఇలాంటి అక్రమ రవాణాదారులకు చెక్ చెప్పడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఏళ్లుగా క్యారియర్లతో దందా... సాధారణంగా పసిడి అక్రమ రవాణా చేసే ముఠాలు క్యారియర్లను ఏర్పాటు చేసుకుంటాయి. తమ ముఠాతో ఎలాంటి సంబంధం లేని వారిని ఎంచుకుని, కమీషన్ల ఆశచూపి, కొన్ని సందర్భాల్లో విషయం చెప్పకుండా వాడుకుంటాయి. ఇలాంటి క్యారియర్లకు అందించే బ్యాగుల అడుగు భాగంలోని తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పౌడర్ డబ్బాలతో పాటు మెబైల్ చార్జర్స్‌లోనూ పసిడిని దాచి విమానాల్లో స్మగ్లింగ్ చేయించేవి. ఆ తరవాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం చేసి అక్రమ రవాణా చేయించేవి. వీటన్నింటికీ మించి ‘రెక్టమ్ కన్సీల్మెంట్’ అనే ప్రక్రియకూ వ్యవస్థీకృత ముఠాలు శ్రీకారం చుట్టాయి. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని పట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కొత్త విధానం ‘చూపిన’ యూపీ వాసి... ఎయిర్ ఇండియాకు చెందిన 952 విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖపట్నానికి అక్కడి నుంచి ఢిల్లీకి 1.2 కేజీల బంగారం అక్రమ రవాణా చేసేందుకు సహకరిస్తూ శుక్రవారం చిక్కిన ఉత్తరప్రదేశ్ వాసి కేసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారానికి ప్రాధాన్యం ఇచ్చి న కస్టమ్స్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానంలో ఉండే ‘మధ్య సీట్లే’ స్మగ్లర్లకు అనుకూలమని వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ సర్వీసులను నడి పే అన్ని విమానయాన సంస్థలూ మార్గ మధ్యం లో దేశవాళీ సర్వీసుగా మార్పును ప్రోత్సహించవు. కేవలం కొన్ని మాత్రమే ఈ విధానాన్ని అవలంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ తదితర దేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుగా ప్రారంభమైన ఓ విమానం దేశంలోకి ప్రవేశించిన తరవాత దాన్ని దేశవాళీ సర్వీసుగా వినియోగిస్తుంది. డొమెస్టిక్ ట్రావెల్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న, అప్పటికప్పుడు కొనుగోలు చేసిన ప్రయాణికులను దేశీయంగా అంతర్జాతీయ ప్రయాణికులతో కలిపి గమ్య స్థానాలకు చేరుస్తుంటుంది. ఎక్కడికక్కడ ‘ప్రయాణికుల’ ఏర్పాటు... ఈ విధానంతో పాటు ఈ ఎయిర్‌లైన్స్ టిక్కెట్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సమయంలో కల్పిస్తున్న మరో సౌకర్యం కూడా స్మగ్లర్లకు కలిసి వస్తోందని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. యూపీకి చెందిన స్మగ్లర్ శుక్రవారం చెన్నైకి 1.2 కేజీల బంగారంతో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. బంగారం ఉన్న బ్యాగ్‌ను తన సీటు కిందే వదిలి అంతర్జాతీయ ప్రయాణికుడిగా విమానం దిగి కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకునేందుకు వచ్చాడు. ఇతడి వద్ద తనిఖీల్లో ఎలాంటి అనుమానిత వస్తువులూ లభించలే దు. అయితే పాస్‌పోర్ట్‌లోని వివరాలతో పాటు కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. ఇతడు సదరు ఫ్లైట్ దిగి కస్టమ్స్ చెకిం గ్ సైతం పూర్తి చేసుకుని నేరుగా డిపార్చర్ లాం జ్‌కు వెళ్లిపోతాడు. అదే విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లడానికి ముఠాకు చెందిన మరో వ్యక్తి ముందే డొమెస్టిక్ టికెట్ బుక్ చేసుకుని సిద్ధంగా ఉంటాడు. ఇతను దేశ వాళీ ప్రయాణికు డిగా ఎక్కి అంతకు ముందు యూపీ వ్యక్తి కూ ర్చున్న సీటులోనే కూర్చుంటాడు. అనుకున్న ప్ర కారం ఇతడు విశాఖపట్న ం చేరేసరికి దేశవాళీ ప్రయాణికుడే (డొమెస్టిక్ పాసింజర్) కావడంతో ఎలాంటి కస్టమ్స్ తనిఖీలు లేకుండా అక్కడి విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేయవ చ్చు. ఇలా ఈ విమానం డొమెస్టిక్‌గా ఎన్ని ప్రాం తాలకు తిరిగితే వాటిలో తమకు అనుకూలమైన చోట స్మగ్లర్లు బంగారాన్ని ‘దేశవాళీగా’ బయటకు తెచ్చేసుకోవచ్చు. డిమాండ్ లేని సీట్లే అనుకూలం.... శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ విభాగం ఆధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అప్రమత్తతతో ఈ అక్రమ రవాణాకు బ్రేక్ పడింది. ఈ కేసుపై అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అంతర్జాతీయ ప్రయాణికుడిగా వచ్చిన ముఠా సభ్యుడు కూర్చున్న సీటులోనే... దేశవాళీ సర్వీసుగా మారిన తరవాత ఎక్కే ముఠా సభ్యుడు ఎలా కూర్చోగలుగుతున్నాడు? అతడికి అదే సీటు ఎలా దొరుకుతోంది అనే అంశంపై లోతుగా ఆరా తీసింది. కొన్ని విమానయాన సంస్థలు విమాన టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేప్పుడు ప్రయాణికుడు తమకు అనువైన సీటునూ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ‘చూస్ యువర్ సీట్’ పేరుతో ప్రయాణికుల సౌకర్యార్థం విమానయాన సంస్థ ఈ అవకాశం కల్పించింది. దీన్నే స్మగ్లింగ్ గ్యాంగ్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని తేలింది. దుబాయ్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖ నుంచి ఢిల్లీలకు ముఠా సభ్యుల కోసం నిర్ణీత సమయం ముందుగానే విడివిడిగా ఒకే విమానంలో టిక్కెట్లు బుక్ చేస్తున్న స్మగ్లర్లు అన్ని సర్వీసుల్లోనూ ఒకే సీటును ఎంచుకున్నారు. విమానంలో రెండు వైపులా మూడేసి చొప్పున సీట్లు ఉంటాయి. వీటిలో మధ్యలో ఉండే రెండు సీట్లకూ డిమాండ్ తక్కువగా ఉంటుంది. దీంతో ఆ సీట్లనే ఎంచుకుని ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలు చేస్తున్నారని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఇలాంటి విమాన సర్వీసుల ద్వారా మరికొందరు స్మగ్లర్స్ ఇదే తరహాలో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్న కస్టమ్స్ అధికారులు ‘ఎస్కార్ట్ ఆఫీసర్స్’ సంఖ్యను పెంచి నిఘా ముమ్మరం చేశారు. ఈ ఎస్కార్ట్ ఆఫీసర్లు సాధారణ ప్రయాణికుల మాదిరిగానే విమానంలో ప్రయాణిస్తూ ఇలాంటి అక్రమ వ్యవహారాలను కనిపెడుతుంటారు. -
వద్దని గ్రూప్‌కి ఎక్కినందుకు పెద్దలకు కోపం వచ్చింది!
ఆచారాలు ఉండాల్సిందే. కానీ అవి ‘అత్యాచారాలు’ కాకూడదు! కొన్ని ఆచారాలైతే అసలే ఉండకూడదు. కానీ ఉన్నాయి. ఇంకా ఉంటూనే ఉన్నాయి. ‘ఇంకా’ అంటే.. మనం నాగరికులం, నవనాగరికులం అనుకుంటున్నాం కదా! మహారాష్ట్రలో ఏం జరిగిందో చూడండి. పుణెకి దగ్గరల్లోని పింప్రీ అనే ప్రాంతంలో కంజర్భట్ అనే కమ్యూనిటీ ఉంది. వాళ్లకో ఆచారం ఉంది. వధువు కన్యా? కాదా? అని తెలుసుకునే ఆచారం! అయితే పెళ్లికి ముందు తెలుసుకోరు. పెళ్లయ్యాక మొదటి రాత్రి తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు? తెలుసుకుని ఏం చేస్తారు అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మొన్న ఆదివారం ఏం జరిగిందో చూద్దాం. కమ్యూనిటిలో ఒక అమ్మాయికి పెళ్లయింది. మిగిలిన తంతు ఇక ఆమె కన్యత్వ పరీక్ష. తొలిరాత్రికి ముందు రోజు కమ్యూనిటీలోని కుర్రాళ్లు ఈ దురాచారానికి వ్యతిరేకంగా ఒక వాట్సాప్ గ్రూపు ప్రారంభించారు. ‘స్టాప్ ది వి రిచువల్’ (కన్యత్వ దురాచారాన్ని ఆపండి) అని ఆ గ్రూపుకు పేరు పెట్టుకున్నారు. ఒకే విధంగా ఆలోచించే వాళ్లంతా ఆ గ్రూపులో చేరారు. కన్యత్వ పరీక్షకు వ్యతిరేకంగా మిగతావాళ్లకు చైతన్యం కలిగించడం మొదలుపెట్టారు. ఆ విషయం కమ్యూనిటీలోని పెద్దవాళ్లకు తెలిసింది. గ్రూపులోని ఒక్కో ఫోన్ నెంబర్నీ పట్టుకుని, ఒక్కొక్కర్నీ కొట్టిపడేశారు. ఒక గుంపుగా వచ్చి కొట్టారు. దాడి చేసినవాళ్లలో నలభై మందిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు అయింది. వాళ్లలో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మిగతావాళ్లు పింప్రీ వదిలి పారిపోయారు. పారిపోవలసింది కొట్టినవాళ్లు, కొట్టించుకున్నవాళ్లు కాదు. దురాచారం పారిపోవాలి. దాన్ని తరిమి తరిమి కొట్టాలి. పింప్రీలోని కంజర్భట్ కమ్యూనిటీలో ఈ దురాచారం ఎంత ఘోరంగా ఉంటుందంటే.. ఫస్ట్‌నైట్ వధూవరులకు ఏర్పాటు చేసిన పట్టెమంచంపై తెల్లటి దుప్పటిని పరుస్తారు. తెల్లారగానే వచ్చి ఆ దుప్పటిని చూస్తారు. దానిపై మరకలు ఉన్నాయా.. అమ్మాయి కన్య అయినట్లు! లేవా.. ఆమె బతుకు బట్టబయలు అయినట్లు! అమ్మాయిని అబ్బాయి వదిలేస్తాడు! లేదా.. ఎవరితో కలిసి ఆమె ‘తప్పు చేసిందో’ అతని పేరు కనుక్కుని అతని చేత, ఆమె చేత ఫైన్ కట్టించి అప్పుడు అమ్మాయిని వరుడు దగ్గరికి కాపురానికి పంపిస్తారు పెద్దలు. సైన్స్ ఎంత డెవలప్ అయినా, కామన్సెన్స్ డెవలప్ కాకపోతే ఇలాంటి దురాచారాలే జీవితాలను శాసిస్తుంటాయి. అసలు స్త్రీకొక న్యాయం, పురుషుడికొక న్యాయం ఉండడంలోనే మన ఆచారాల్లోని డొల్లతనమంతా ఉంది. ఆచారం అన్నది మానవ జీవితం మెరుగవ్వడానికి తోడ్పడాలి తప్ప, ఎవరి జీవితానికీ ప్రతిబంధకం కాకూడదు. -
రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం కార్గో నుంచి మలేషియా వెళ్తున్న లగేజిలో ఎపిడ్రిన్ అనే మత్తుపదార్థం(డ్రగ్) ఉన్న కస్టమ్స్ అధికారుల సోదాల్లో గురువారం బయటపడింది. ఈ డ్రగ్స్‌ను చిన్న పిల్లల బ్యాగులో పెట్టి అక్రమంగా రవాణా చేస్తున్నారు. 35 బ్యాగుల్లో ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నార్కొటిక్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి సింగపూర్, హంకాంగ్, శ్రీలంక తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బూట్లలో బంగారం!
జెడ్డా నుంచి స్మగ్లింగ్ చేసిన హైదరాబాదీలు పట్టుకున్న కస్టమ్స్, కేజీపైగా పసిడి స్వాధీనం సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమ రవాణా చేసే స్మగ్లర్లు నానాటికీ తెలివి మీరిపోతున్నారు. ఓ కొత్త పంథాను అధికారులు ఛేదించేసరికి మరో సరికొత్త మార్గాన్ని అనుసరిస్తున్నారు. పాదాలకు బంగారం అమర్చుకుని, కడియాలుగా మార్చుకుని వచ్చిన ఇద్దరు హైదరాబాదీలను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వీరి నుంచి రూ.32.6 లక్షల విలువైన 1.1 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఇరువురు సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి మంగళవారం ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం(నంబర్ ఏఐ–966)లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరు బంగారం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం అందుకున్న కస్టమ్స్ ఆధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐయూ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. చేతులకు కడియాల రూపంలో, బూట్లలో దాచిన బంగారం బయటపడింది. స్మగ్లర్లు మొత్తం 1.1 కేజీల బంగారాన్ని రెండు కడియాలు, నాలుగు బిస్కెట్ల రూపంలోకి మార్చారు. కడియాలను ఇరువురూ తమ చేతులకు ధరించారు. బిస్కెట్లను మాత్రం పాదాలకు కింది భాగంలో పెట్టి ఊడిపోకుండా సెల్లో టేప్ వేశారు. దానిపై సాక్స్ వేసుకుని బూట్లు ధరించారు. ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. -
సౌదీ టు ముంబై వయా హైదరాబాద్
బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు చేసిన శంషాబాద్ కస్టమ్స్ అధికారులు l ‘రెక్టమ్ కన్సీల్మెంట్’ ద్వారా తీసుకొచ్చిన క్యారియర్ సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి ముంబై చేరుతున్న బంగారం అక్రమ రవాణా గుట్టును శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. నిఘాకు చిక్కకుండా స్మగ్లర్లు అనుసరిస్తున్న ఈ విధానంపై కొంతకాలంగా కన్నేసిన అధికారులు ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ సహకారంతో (ఏఐయూ) చెక్ చెప్పారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్ మీదుగా ముంబై తరలించాలని ప్రయత్నించిన 1.19 కేజీల బంగారాన్ని ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ముంబై వాసిని అరెస్టు చేసిన కస్టమ్స్ విభాగం దీని వెనుక ఉన్న వ్యవస్థీకృత ముఠా కోసం గాలిస్తోంది. అంతర్జాతీయంగా నడిచే విమానాలకే కస్టమ్స్ తనిఖీలు పక్కాగా ఉంటాయి. దీంతో ఇటీవల అక్రమ రవాణాదారులు తమ పంథా మార్చారు. దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించే వరకు అంతర్జాతీయ సర్వీసుగా, ఆపై డొమెస్టిక్‌గా మారిపోయే విమానాలను ఎంచుకుని వాటి ద్వారా రవాణా ప్రారంభించారు. ప్రధానంగా ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలే ఈ తరహాకు చెందినవి ఎక్కువగా ఉన్నాయి. స్మగ్లింగ్ ముఠా సభ్యులు ఆ విమానం ప్రారంభమయ్యే ప్రాంతంతో పాటు దేశీ సర్వీసుగా మారే ప్రాంతంలోనూ ముందే కాసుకుని ఉంటున్నారు. సాంకేతిక పరిభాషలో వీరే క్యారియర్లు. వీరు చిక్కినా... లింకు ముందుకు సాగడం కష్టం. దుబాయ్‌లో అసలు ఆదాయపు పన్ను అనేది లేకపోవడంతో మనీలాండరింగ్ అన్నదే ఉత్పన్నం కాదు. ఇక్కడ నుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని పంపి, బంగారం కొని తీసుకువస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఆదివారం చిక్కిన ముంబై వాసి తక్కువ కాలంలోనే జెడ్డా నుంచి తిరిగి వచ్చాడు. ఇతడు ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం జెడ్డా నుంచి హైదరాబాద్ వరకు అంతర్జాతీయ సర్వీసుగా నడుస్తుంది. ఆపై డొమెస్టిక్ సర్వీసుగా మారిపోయి ఇక్కడ నుంచి ముంబైకి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే స్మగ్లర్లు దీన్ని ఎంచుకున్నట్టు కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. అత్యధిక శాతం స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పౌడర్ డబ్బాలతో పాటు మొబైల్ చార్జర్స్‌లోనూ దాచి తీసుకువచ్చే వారు. ఆ తరువాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తీసుకువచ్చారు. తాజాగా రెక్టమ్ కన్సీల్మెంట్ జోరుగా సాగుతోందని ఆదివారం చిక్కిన ముంబై వాసి ఉదంతం బయటపెట్టింది. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మల ద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా రెండు కేజీల వరకు బంగారాన్ని చిన్న బిస్కెట్ల రూపంలో పెట్టేలా ఏర్పాటు చేస్తున్నా రు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుం టున్న క్యారియర్లు అక్రమ రవాణాకు పాల్పడు తున్నారని ఆదివారం నాటి ఉదంతం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన కస్టమ్స్ అధికారులు సూత్రధారులు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు. -
వెంటనే బంగారం అమ్మేయండి
కస్టమ్స్ విభాగానికి రెవెన్యూ శాఖ ఆదేశాలు న్యూఢిల్లీ: స్వాధీనం చేసుకున్న బంగారం అమ్మడానికి సత్వర చర్యలు చేపట్టాలని కస్టమ్స్ విభాగాన్ని రెవెన్యూ శాఖ కోరింది. ఇందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు(బంగారం అమ్మకం, దిగుమతికి ఆర్బీఐ అనుమతి ఉన్నవి), ఎంఎంటీసీ(మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), ఎస్టీసీ(స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సేవలు వినియోగించుకోవడానికి అనుమతిచ్చింది. ఇంతకు పూర్వం కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ద్వారానే అమ్మకాలు చేపట్టేవారు. బంగారం ఏ రూపంలో ఉన్నా దాని అమ్మకం ధరను అంతకు ముందు రోజున్న మార్కెడ్ ధర ఆధారంగా నిర్ణయిస్తారు. అమ్మినందుకు బ్యాంకులు కస్టమ్స్ విభాగం నుంచి ఎలాంటి కమిషన్ ఆశించకూడదు. అయితే ఈ ప్రక్రియకు అయ్యే ఖర్చులను తిరిగి చెల్లిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలోని కస్టమ్స్ నిల్వల నుంచి సుమారు 67.4 కిలోల బంగారం కనిపించకుండా పోయిందని పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. గత మూడేళ్ల (2013–2016) కాలంలో న్యూఢిల్లీ, ముంబై, త్రిచీ విమానాశ్రయాల్లో కస్టమ్స్ విభాగాల నుంచి 12 సందర్భాల్లో సుమారు 65.39 కిలోల బంగారం మాయమైనట్లు గుర్తించారు. -
‘గోల్డ్’ స్ట్రైక్స్
తణుకు : పెద్ద నోట్ట రద్దుతో కుబేరులకు ఊపిరి ఆడటం లేదు. దాచుకున్న నల్లధనాన్ని మార్చేందుకు బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించారు. సందట్లో సడేమియా అన్నట్టుగా వ్యాపారులు సైతం ప్రభుత్వానికి లెక్క చూపని బంగారాన్ని వదిలించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి వ్యవహారాలపై దృష్టి సారించిన కస్టమ్స్, టాస్క్‌పోర్స్, ఆదాయ పన్ను శాఖల అధికారులు ముప్పేట దాడులకు దిగుతున్నారు. తణుకు పట్టణంలోని వేల్పూరు రోడ్డులో బంగారాన్ని కరిగించే ఇద్దరు వ్యక్తుల నుంచి శనివారం రాత్రి సుమారు కేజీ బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆదివారం కూడా దాడులను కొనసాగించారు. పలు దుకాణాలతోపాటు, కొందరు వ్యక్తుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.17.80 లక్షల విలువ చేసే 6 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా తణుకులోనే.. తణుకు పట్టణంలో నల్లధనం మార్పిడి, బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించిన వివిధ శాఖల అధికారులు నాలుగు రోజులుగా తణుకులో మకాం వేసినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సామాన్యుల మాదిరిగా వీధుల్లో ఆటోల్లో తిరుగుతూ నల్లధనం ప్రవాహ మూలాలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. ఆదివారం పట్టణంలోని కొందరి నివాసాలకు వెళ్లి సోదాలు జరిపారు. ఇదిలా ఉంటే టీడీపీకి చెందిన ఓ వార్డు కౌన్సిలర్‌ను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఆయన నుంచి వాంగ్మూలం తీసుకుని విడిచిపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. శనివారం రాత్రి టాస్క్‌ఫోర్స్, ఐటీ శాఖ అధికారులు వేల్పూరు రోడ్డులోని ఒక దుకాణానికి వెళ్లి బంగారం కావాలని అడిగారు. అక్కడి వ్యాపారి సుమారు పది బంగారం బిస్కెట్లను బయటకు తీయడంతో దానికి లెక్కలు అడిగారు. నోరెళ్లబెట్టడంతో మహంతి శ్రీరాములు, కలిశెట్టి సూరిబాబు అనే యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వ్యాపారుల గుండెల్లో రైళ్లు కస్టమ్స్, టాస్క్‌ఫోర్స్, ఆదాయ పన్ను శాఖ అధికారులు తణుకులో మకాం వేయడంతో జిల్లాలోని బంగారం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇన్నాళ్లు లెక్కలేని విధంగా వ్యాపారం చేసిన బంగారు బాబులు అధికారుల దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. దీంతో అధిక శాతం వ్యాపారులు ఆదివారం దుకాణాలు తెరవలేదు. మరోవైపు సీసీ కెమెరాలు లేని దుకాణాల్లో బంగారు ఆభరణాలను కొందరు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాటిని బంధులు, నమ్మకస్తుల వద్ద అనుమానం రాని ప్రాంతాల్లో ఉంచుతున్నట్టు సమాచారం. -
శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు..
- పట్టుబడ్ల స్మగ్లర్లు శంషాబాద్(రంగారెడ్డి జిల్లా) శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇద్దరు స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 792 గ్రాముల బంగారాన్ని, సుమారు రూ.22 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరు దోహ నుంచి ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానంలో శంషాబాద్‌కు బ్యాగ్‌లో పెట్టుకుని వస్తుండగా పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చక్కెర చేదు!
* కేజీ ధర రూ.42.. గత ఏడాదితో పోలిస్తే 50 శాతం పెరుగుదల * సాగు డీలా, కర్మాగారాల మూసివేతే ప్రధాన కారణం * ఎగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచి ధరల నియంత్రణ ఆరంభించిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చక్కెర చేదెక్కుతోంది. గణనీయంగా పడిపోయిన సాగు విస్తీర్ణంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఏడాది కాలంలో చక్కెర ధరల్లో 50 శాతం మేర పెరుగుదల కనిపిస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి కిలో రూ.27.50 పైసలు ఉండగా ప్రస్తుతం అది రూ.42కి పైనే పలుకుతోంది. రాష్ట్రంలో చక్కెర సాగు విస్తీర్ణం వేగంగా పడిపోతుండటం, గిట్టుబాటు ధరలు లేకపోవడం, ప్రభుత్వ భాగస్వామ్య సంస్థ ‘నిజాం దక్కన్ సుగర్స్’ మూసివేత వెరసి చక్కెర ఉత్పత్తి, ధరలపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో 2015-16లో ఏడు ప్రైవేటు కర్మాగారాల పరిధిలో 27,76,180 క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి కాగా.. ప్రస్తుతం 12,65,238 క్వింటాళ్ల మేర నిల్వ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. పండుగల సీజన్ సమీపిస్తుండటంతో ఈ నిల్వలు కేవలం మరో మూడు లేదా నాలుగు నెలలకు సరిపోతాయని లెక్కలు వేస్తున్నారు. డిసెంబర్ వరకు రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తి జరిగే పరిస్థితి లేనందున.. మరో ఐదు నెలల పాటు పొరుగు రాష్ట్రాలపై ఆధార పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. చక్కెర ఉత్పత్తిపై మూసివేత ప్రభావం.. 2015-16లో నిజాం దక్కన్ సుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) పరిధిలోని మూడు కర్మాగారాలు మూత పడటంతో చక్కెర ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చెరుకు సాగు విస్తీర్ణం సుమారు లక్ష ఎకరాలు కాగా.. నిజాం సుగర్స్ పరిధిలోనే 20 వేల ఎకరాల మేర ఉండేది. ఎన్డీఎస్ఎల్ నష్టాలతో ఈ సాగు విస్తీర్ణం గత ఏడాది 7వేల ఎకరాలకు పడిపోయింది. నిజాం సుగర్స్ మూసివేతతో రాష్ట్రంలో చక్కెర దిగుమతి సుమారు 1,80,000 వేల క్వింటాళ్ల మేర తగ్గిందని అంచనా. ఈ నేపథ్యంలో చక్కెర ధరలపై ప్రభావం చూపెడుతోంది. ప్రస్తుత ఖరీఫ్ పంట అందుబాటులోకి వ చ్చేందుకు మరో నాలుగు నుంచి ఐదు నెలలు పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకు ధరల పెరుగుదల మరింత హెచ్చుగా ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చక్కెర ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా.. చక్కెర ఎగుమతులపై 20 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది. చక్కెర కొరత తీవ్రమైతే సుంకాన్ని మరింత పెంచడమో లేదా ఎగుమతులను పూర్తిగా నిషేధించడమో జరుగుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సజ్ అండ్ కస్టమ్స్ వర్గాలు వెల్లడించాయి. కాగా.. గత ఏడాది చక్కెర దిగుమతులపై 40 శాతం మేర కస్టమ్స్ సుంకాన్ని విధించిన కేంద్రం.. ఈ ఏడాది ఎగుమతులపై సుంకం విధించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఎగుమతులపై ఆంక్షల నేపథ్యంలో ఈ నిల్వలు స్థానిక మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో చక్కెర దిగుమతులపై ఎంట్రీ టాక్స్ లేకపోవడంతో స్థానిక మార్కెట్లలో ధరల నియంత్రణ కొంత మేర సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
మహిళలు మందిరాలు
► స్త్రీలను నిరోధిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు ► శని శింగణాపూర్‌లో తైలాభిషేకానికి స్త్రీలకు అనుమతి లేదు ► హాజీ అలీలో ప్రవేశం కోసం హైకోర్టు జోక్యం ► కాలంతో పాటు ఆచారాలూ మార్చుకోవాలని స్త్రీల ఉద్యమం ► మహిళా పూజారుల ఏర్పాటు కోసం డిమాండ్ ► ఖాజీల స్థానం తీసుకుంటున్న ముస్లిం మహిళలు ► శబరిమలపై కూడా సాగుతున్న చర్చ వ్యక్తులు ఎప్పటికప్పుడు తమను తాము కనుగొంటూ ఉంటారు. తాము ఏమి పొందుతున్నారో, ఏమి కోల్పోతున్నారో చైతన్యవంతమైన దృష్టితో తెలుసుకుంటూ ఉంటారు.ఆ తెలుసుకున్నది వెంటనే సాధించుకుంటే ఘర్షణ లేదు. ఆ తెలుసుకోవడమే ఒక ఘర్షణకు కారణమైతే అది శింగణాపూర్ ఘటన అవుతుంది. గుడికొస్తాం. రండి. పూజిస్తాం. పూజించండి. తైలాభిషేకం చేస్తాం. అది మాత్రం కుదరదు. కేవలం మగవారికి మాత్రమే. ఏం... ఆడవాళ్లు ఏం పాపం చేశారు? అదీ ప్రశ్న. అదీ ఘర్షణ. అదే ఇప్పుడు దేశంలో నలుగుతున్న చర్చ. 2015.. నవంబర్ 28. ఆ రోజు ఉదయం.. ఓ మహిళ శింగణాపూర్ దేవాలయంలోకి వెళ్లింది. ఆ ఆలయంలో స్త్రీలకు ప్రవేశం ఉంది కాబట్టి అది విశేషం కాదు. కాని ఆవరణలోని శని శిలకు మగవాళ్లు నిర్వహించినట్టే తైలాభిషేకం చేసింది. అది మాత్రం విశేషమే. ఆ సమయంలో దీనికి ఆలయ పూజారులు కానీ, అక్కడున్న సిబ్బంది కానీ అడ్డు చెప్పలేదు. కాని ఈ సంఘటన సోషల్ మీడియాలో వీడియోగా ప్రచారం కావడంతో ఆలయ ధర్మకర్తల మండలి విస్తుపోయింది. మహిళ చేసిన తైలాభిషేకం వల్ల శనిదేవుడి శిల, ఆ ప్రదేశం అపవిత్రమైందంటూ శని దేవుడి శిలకు క్షీరాభిషేకం చేసి శుద్ధి నిర్వహించింది. సమస్య మొదలు.. ఈ ఉదంతం దావానలంలా వ్యాపించింది. కొందరు తప్పు పట్టారు. కొందరు దీనికి మద్దతు పలికారు. మహారాష్ట్రలోని ‘భూమాతా రణరాగిణి బ్రిగేడ్’ అనే మహిళా ఉద్యమాల సంస్థ ఈ సమస్యను తన ప్రస్తుత ఎజెండాగా స్వీకరించింది. ఈ బ్రిగేడ్ అధ్యక్షురాలైన 32 ఏళ్ల తృప్తి దేశాయ్ శని శింగణాపూర్ ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలనే ఆందోళనకు అభిప్రాయ సమీకరణ చేస్తున్నారు. ‘ఇప్పటికే అనేక మూఢనమ్మకాలు, అర్థంలేని ఆచారాలతో మహిళలను అణగదొక్కుతున్నారు. స్త్రీలను దేవుడి దగ్గరకు కూడా రానీయకుండా చేస్తున్నారు. దైవం దైవమే. అక్కడ ఆడ, మగ తేడా ఏంటి? ఏ సంప్రదాయాలైనా మనం సృష్టించుకున్నవే. సతి ఆచారంగా సాగిన భూమి మీదే అది దురాచారంగా మారిన సందర్భం లేదా? మారుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలూ మారాలి.. మార్చుకోవాలి. ఆ మాటకొస్తే రాజ్యాంగమే స్త్రీ, పురుషులకు సమాన హక్కులు కల్పించింది’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తృప్తి ్తదేశాయ్. వీళ్లకు మహారాష్ట్రలోని అంధశ్రద్ధ నిర్మూలన సమితి (మూఢనమ్మకాల నిర్మూలన సమితి)తోపాటు దేశంలోని ఎన్నో మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. అయితే శని శింగణాపూర్ ధర్మకర్తల మండలి మాత్రం శని దేవుడి శిలకు మహిళలు తైలాభిషేకం చేసేందుకు ససేమిరా అన్నది. దీనికి తృప్తి దేశాయ్ సేన వెనక్కి తగ్గలేదు. జనవరి 26న మొత్తం 400 మంది మహిళలతో కలిసి శనిశింగణాపూర్‌లో పూజలు చేసేందుకు ప్రయత్నించారు. వీళ్ల ప్రయత్నాన్ని మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. దీనిపై ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఓ మధ్యేమార్గాన్ని సూచించడానికి ముందుకు వచ్చారు. ఆ ప్రస్తావనా తమకు సమ్మతంగా లేదని తృప్తి దేశాయ్ బృందం నిరాకరించింది. ట్రస్టీలో మహిళలకు చోటు పదకొండు మంది సభ్యులున్న శని శింగణాపూర్ ఆలయ ట్రస్టీలో ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా స్థానం లేదు. పూజలు ఎలాగూ చేయనివ్వట్లేదు కనీసం ట్రస్టీలోనైనా స్త్రీలకు స్థానం కల్పించాల్సిందిగా స్థానిక మహిళలు పోరాడారు. దాంతో మొన్న జనవరి 11న జరిగిన ట్రస్టీ ఎన్నికల్లో ఆడవాళ్లకు అవకాశం కల్పించారు. అనితా శెట్యే అనే మహిళ గెలవడమే కాక ట్రస్టీ అధ్యక్షురాలు కూడా అయ్యింది. అయితే ఆ పాయింట్‌నే పట్టుకొని తమ నిరసనను తీవ్రం చేసింది తృప్తి దేశాయ్ బృందం. మహిళా అధ్యక్షురాలు ఉన్న ఆలయంలో మహిళలకు పూజార్హత లేకపోవడమేంటి? అంటూ ప్రశ్నలపరంపరను సంధించింది. శని దేవుని పూజలు చేసేందుకు మహిళలను అనుమతించేంత వర కు ఆందోళన విరమించేది లేదు అంటూ హెచ్చరిక కూడా చేసింది ఈ బృందం. హాజీ అలీ... శని శింగణాపూర్‌లో మహిళల ప్రవేశానికి పోరాటం జరుగుతుండగానే ఇంకోవైపు ముంబైలో హజీ అలీ దర్గాలోకీ మహిళలకు ప్రవేశం కల్పించాలని ఆ వర్గపు స్త్రీల పోరాటం ప్రారంభమైంది. దానికీ తృప్తి దేశాయ్ బృందం మద్దతు పలికింది. అయితే ఇటీవలే ముంబై హైకోర్ట్ హజీ అలీ దర్గాలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని చెప్పింది. మరోవైపు రాజస్థాన్‌లోని దేవ్బంద్లో దారుల్ ఉలూమ్ ఇద్దరు మహిళలను ఖాజీలుగా నియమించింది. ఇంతకాలం కేవలం పురుషుల గుత్తాధిపత్యంలో ఉన్న ఖాజీ హోదా ఇప్పుడు మహిళలకు కూడా దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నవారు ఉన్నారు. ఈ సందర్భంగా దారుల్ ఉలూమ్ అధికార ప్రతినిధి మౌలానా అష్రాఫ్ ఉస్మానీ మాట్లాడుతూ ‘ఖాజీలు, పండితులు అవడానికి జ్ఞానం, అనుభవం, శిక్షణ ముఖ్యం కానీ జెండర్ ప్రధానం కాదు. ఈ లెక్కన ముస్లిం మహిళలకూ అన్ని హక్కులూ ఉన్నాయి’ అని స్పష్టం చేశారు. - గుండారపు శ్రీనివాస్ / చక్రవర్తి సాక్షి ముంబై దైవం దైవమే.. అక్కడ ఆడ, మగ తేడా ఏంటి? ఏ సంప్రదాయాలైనా మనం సృష్టించుకున్నవే. మగవాళ్లు తమ ప్రయోజనాలకు అనుగుణంగా పెట్టుకున్నవే. సతి ఆచారంగా సాగిన భూమి మీదే అది దురాచారంగా మారిన సందర్భం లేదా? మారుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలూ మారాలి.. మార్చుకోవాలి. ఆ మాటకొస్తే రాజ్యాంగమే స్త్రీ, పురుషులకు సమాన హక్కులు కల్పించింది. - తృప్తి దేశాయ్, భూమాతా రణరాగిణి బ్రిగేడ్ అధ్యక్షురాలు శని దేవుడిని శుభంగా ఎవరూ భావించరు. నిరాశనిస్పృహలు, రోగాలురొష్టులు, వినాశకాలకు అధిపతిగా ఉంటాడు. శని వెలసిన చోటు చాలా ప్రమాదకర శక్తులకు ఆలవాలం. స్త్రీ, పురుషులు సమానమైనప్పటికీ శరీరనిర్మాణరీత్యా పురుషులకు ఉన్న దృఢత్వం స్త్రీలకు ఉండదు. శని ఆలయంలోని ఆ ప్రమాదకర శక్తులను పురుషుడు తట్టుకోగలడు.. కానీ స్త్రీ తట్టుకోలేదు. అందుకే అలాంటి చోట్లకు ఆడవాళ్లు వెళ్లకపోవడం మంచిది అనే ఆచారం వచ్చింది. - జగ్గీవాసుదేవ్, ఆధ్యాత్మిక గురువు నిషిద్ధ ప్రదేశాలు శని శింగణాపూర్తోపాటు మన దేశంలో పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మహిళలదాకా ప్రవేశంలేని మరో ఆలయం కేరళలోని శబరిమలై అయ్యప్పస్వామి దేవాలయం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వివక్ష మందిరాల్లో కనిపించకపోయినా మరికొన్ని చోట్ల కనిపిస్తుంది. అమెరికాలోని బెతెస్డా అనే ప్రాంతంలో ఉన్న బర్నింగ్ట్రీ క్లబ్ అనే గోల్ఫ్కోర్స్కి స్త్రీలు వెళ్లడం నిషిద్ధం.సౌది అరేబియాలో మహిళలకు పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదు. అలాగే వాటికన్లో కూడా మహిళలను పోలింగ్ కేంద్రాలకు అనుమతించరు. టూర్ దె ఫ్రాన్స్ అనేది ప్రతి యేడు ఫ్రాన్స్‌లో జరిగే ఓ సైకిల్ పందెం. ఈ పందెంలో పాల్గొనడానికి మహిళలకు అనుమతి లేదు. ఇరాన్‌లోని ‘ఆజాద్ సాకర్ స్టేడియం’ లోకి మహిళలను నిషేధించి ఫుట్‌బాల్ ఆటను చూడాలనే వాళ్ల ఇచ్ఛను, స్వేచ్ఛను హరించారు. జపాన్‌లోని అతిపెద్ద కొండ ప్రాంతం మౌంట్ ఒమైన్. 1300 ఏళ్ల కిందటి ఈ బౌద్ధక్షేత్రంలో మహిళలకు ప్రవేశం లేదు. {Xస్లోని మౌంట్ అథోస్ తీర ప్రాంతం ఎంతోమంది సన్యాసుల తపోకేంద్రం. అయితే ఇప్పటికీ ఇక్కడికి మహిళలు వెళ్లకూడదనే నిబంధన అమల్లో ఉంది. -
హైదరాబాద్‌లో సీఈఎస్‌టీఏటీ రీజనల్ బెంచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ సర్వీస్‌ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (సీఈఎస్‌టీఏటీ) రీజనల్ బెంచ్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. దీన్ని సోమవారం సీఈఎస్‌టీఏటీ ప్రెసిడెంట్‌గా ఉన్న జస్టిస్ గూడ రఘురామ్ ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన కార్యాలయం మొదటి అంతస్థులో పని ప్రారంభించింది. వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, వ్యక్తులకు కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ కమిషనర్లు పన్నులు, డ్యూటీలు తదితర బకాయిలకు సంబంధించి ఇచ్చే ఆదేశాలను సవాల్ చేయడానికి ఈ బెంచ్ ఉపకరించనుంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బెంగళూరులోనే బెంచ్ ఉంది. ఏడాదికి ఒకటిరెండు రోజులు మాత్రం హైదరాబాద్‌లో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటయ్యేది. ఫలితంగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే వారంతా బెంగళూరు వెళ్ళాల్సి వచ్చేంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో రీజనల్ బెంచ్ ఏర్పాటు డిమాండ్ ఏళ్ళుగా పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు స్పందించిన కేంద్రం దేశ వ్యాప్తంగా ఆరు బెంచ్‌ల ఏర్పాటుకు ఈ ఏడాది జనవరిలో అనుమతించింది. హైదరాబాద్‌లో బెంచ్ అందుబాటులోకి రాగా... మిగిలిన ఐదింటిలో చండీఘర్, అలహాబాద్‌ల్లో కొత్తగా, న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నైల్లో అదనపు బెంచ్‌లు ఏర్పాటుకానున్నాయి. -
షూ సాక్స్‌లో రెండు కేజీల బంగారం!
శంషాబాద్: ఓ ప్రయాణికుడు తన షూ సాక్స్‌లో అక్రమంగా తీసుకొచ్చిన రెండు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథ నం ప్రకారం.. సోమవారం ఉదయం దోహా నుంచి వచ్చిన ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానంలోని ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడు షూ సాక్స్‌లో 2 కిలోల బంగారు బిస్కెట్లను దాచుకొని తీసుకొస్తుండగా, గుర్తించి స్వా ధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికుడిని పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తిం చారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. -
వెయ్యి కోట్లు కట్టాల్సిందేనా?
రాష్ట్ర ఆబ్కారీకి సర్వీస్ ట్యాక్స్ చిక్కులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీ శాఖకు సర్వీస్ ట్యాక్స్ విభాగం కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010 నుంచి ఇప్పటి వరకు మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, బాట్లింగ్‌కు సంబంధించి సర్వీస్ ట్యాక్స్ చెల్లించ లేదని నిర్ధారించిన కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ శాఖ మూడు రోజుల క్రితం సెర్చ్ వారెంట్లతో రెండు రాష్ట్రాల బేవరేజెస్ కార్పొరేషన్లకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం సరఫరా, డిపోల నిర్వహణ చూసిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచే బకాయిలను వసూలు చేయాలని సర్వీస్ ట్యాక్స్ విభాగం భావించింది. రెండు రాష్ట్రాలకు కలిపి సర్వీస్ ట్యాక్స్ సుమారు రూ.1,000 కోట్ల వరకు ఉన్నట్లు లెక్కలు తేలడంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఎక్సైజ్ శాఖ ద్వారా సర్వీస్ ట్యాక్స్ అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఏపీ పునర్విభజన చట్టంలోని నిర్దేశిత అంశాలు, ఇప్పటి వరకు వివిధ శాఖల్లో జరిగిన పంపకాల తీరును సర్వీస్టాక్స్ అధికారులకు వివరించడంతో 2010-11 నుంచి 2013-14 వరకు చెల్లించాల్సిన సర్వీస్ ట్యాక్స్‌ను రెండు రాష్ట్రాలకు పంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు జనాభా, మద్యం డిపోల్లో నిర్దేశిత సేవల ఆధారంగా పన్నును విభజించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తదనుగుణంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల విలువను మదింపు చేసిన అధికారులు సోమవారం డిమాండ్ తుది నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎంత మొత్తంలో పన్ను చెల్లించాలో కూడా నోటీసుల్లో పేర్కొని, 30 రోజుల గడువిచ్చే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. -
టూకీగా ప్రపంచ చరిత్ర
ఆచారాలు-నమ్మకాలు - రచన: ఎం.వి.రమణారెడ్డి దేవాలయాల సంప్రదాయం భారతదేశంలో ఎప్పుడు, ఎక్కడ మొదలయిందో తెలుసుకునే దిశగా విశ్వసించదగిన పరిశోధన జరగలేదు. మహాభారతంలో దేవాలయాల ప్రస్తావన లేదు. అందులో పురోహితులే తప్ప పూజారులు కనిపించరు. భాగవతంలో రుక్మిణీ కల్యాణం సందర్భంగా ‘అంబికాలయం’ ఉన్నట్టు చెప్పబడింది. ఇటు అయోధ్యలోనూ, అటు లంకలోనూ అనేక దేవాలయాలు ఉన్నట్టు రామాయణంలో కనిపిస్తుంది. ఒకవైపు ఇంత భారీ సమ్మేళనం జరుగుతున్నా, మెసొపొటేమియాకు తూర్పు దిశగా ఉండే సింధూ నాగరికత మాత్రం దేవాలయాల సంప్రదాయాన్ని స్వీకరించలేదు. తవ్వకాల్లో బయటపడిన ప్రాచీన సింధూనాగరికతలో దేవాలయం ఆనవాళ్ళు లేవు. వాళ్ళ లిపిని ‘డిసెఫర్’ చేసే ఉపాయం ఇంతవరకు దొరక్కపోవడంతో, ఆ నాగరికుల విశ్వాసాలను గురించి ఊహాగానాలే తప్ప, నిర్ధారణకు వీలు కలగడం లేదు. బహుశా, వాటిల్లో కొన్ని ఆ తర్వాత వచ్చిన ఆర్యుల సంప్రదాయాలతో కలిసిపోయి ఉండవచ్చు. పూర్వకాలం ఆర్యుల్లో యజ్ఞయాగాది వైదిక కర్మలే గాని, విగ్రహారాధన లేదు. పై రెండు సంస్కృతుల సమ్మేళనంగా సింధూనది నుండి తూర్పుకు విస్తరించిన ‘హిందూ’ నాగరికతలో క్రీ.శ. 4వ శతాబ్దం దాకా కూడా ఉత్తర భారతదేశంలో దేవాలయం జాడే కనిపించదు. (దేవాలయాలు లేవంటే అసలు శిల్పమే లేదని కాదు; మౌర్యుల కాలం నాటికే శిల్పకళ బాగా అభివృద్ధి చెందిన దశకు చేరుకుంది.) ఆ తదుపరి ఉత్తరభారతదేశంలో ప్రవేశించిన జైన, బౌద్ధ మతాలకు విగ్రహారాధన లేకపోవడంతో, మెసొపొటేమియా, ఈజిప్టుల్లో దేవాలయాల నిర్మాణం ప్రారంభమైన కాలం నుండి కనీసం 4000 సంవత్సరాల దాకా ఉత్తర భారతదేశానికి ఆ సంప్రదాయం విస్తరించలేదు. దేవాలయాల సంప్రదాయం భారతదేశంలో ఎప్పుడు, ఎక్కడ మొదలయిందో తెలుసుకునే దిశగా విశ్వసించదగిన పరిశోధన జరగలేదు. మహాభారతంలో దేవాలయాల ప్రస్తావన లేదు. అందులో పురోహితులే తప్ప పూజారులు కనిపించరు. భాగవతంలో రుక్మిణీ కల్యాణం సందర్భంగా ‘అంబికాలయం’ ఉన్నట్టు చెప్పబడింది. ఇటు అయోధ్యలోనూ, అటు లంకలోనూ అనేక దేవాలయాలు ఉన్నట్టు రామాయణంలో కనిపిస్తుంది. అయితే, భాగవత రామాయణాల రచనా కాలానికి సంబంధించిన ఆధారాలు అందుబాటు కాలేదు. శ్రీరాముని విషయం మహాభారతం అరణ్యపర్వంలో ఉటంకించడాన్ని బట్టి, ఆ వృత్తాంతం భారత రచనాకాలానికే ప్రాచుర్యంలో ఉందనడానికి సందేహం లేదు. రామాయణ కావ్యం ఉపోద్ఘాతంలో వాల్మీకి తన రచనను ‘ఆదికావ్యం’గా తనకు తానే చెప్పుకోవడంతో, అది భారతానికంటే ముందు రచనగా విశ్వాసం పాతుకుపోయింది. మహాభారతం ఒక కావ్యంగా కాక, ఇతిహాసంగానూ పంచమ వేదంగానూ పరిగణించడం వల్ల, ఒక కావ్యంగా తనది మొదటిది అన్నాడో, లేక ఇతివృత్తాలతో సాగిన రచనల్లో తనది మొదటిదిగా వాల్మీకి భావించాడో చెప్పలేం. కొనామొదలు మహాభారతంలో తారసపడే వందలాది మహర్షుల జాబితాలో వాల్మీకి పేరు ఎక్కడా కనిపించదు. అరణ్యపర్వంలో రాముని కథ క్లుప్తంగా వివరించే సందర్భంలోనూ ఆ గాథ గ్రంథస్థమైన సూచన కనిపించదు. పైగా, భారతంలోని పాత్రలు వ్యాసునికి సమకాలికులైనా, వాళ్ళ వ్యవహారాలు జ్ఞాపకాల మీదా, మౌఖిక వర్తమానాల మీద నడిచాయే తప్ప లిఖితరూపమైన సందేశాలు ఎక్కడా కనిపించవు. ఇంతేకాక, భాషలోనూ, సామాజిక వ్యవస్థకు సంబంధించిన పలు అంశాల్లోనూ కనిపించే వ్యత్యాసం వల్ల రామాయణ రచనాకాలం భారతం కంటే ముందుందని చెప్పటానికి ప్రబలమైన విశ్వాసం మినహా మరో ఆధారం దొరకదు. భారత, భాగవతాలు రెండూ వ్యాస విరచితాలేనని ప్రతీతి. ఆ రెండు రచనల మధ్య వ్యవధి ఎంతుందో తెలీదుగానీ, సారాంశంలో మాత్రం విపరీతమైన వ్యత్యాసం కనిపిస్తుంది. కథ రూపంలో వైదిక కర్మకాండను ప్రోత్సహించేది మహాభారతం. కానీ, క్రీ.పూ. 600 ప్రాంతంలో వైదిక కర్మల పట్ల నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రముఖంగా ‘చార్వాకులు’ అనబడే ఒక వర్గం వాటికి వ్యతిరేకమైన తర్కాన్ని ప్రజల్లో ప్రవేశపెట్టింది. యజ్ఞయాగాదుల్లో జరిగే జంతుబలిని నిరసించే ధోరణి అప్పటికే ప్రబలిందని మహాభారతం అశ్వమేథ పర్వం వివరించే ‘ముంగిస కథ’ మూలంగా వెల్లడౌతుంది. చార్వాకుల హింసావ్యతిరేక సిద్ధాంతంలో పుట్టిన ‘అహింసావాదం’ బౌద్ధానికీ జైనానికీ ప్రాణం పోసింది. - (సశేషం) రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
సినీ తారల ‘పన్ను’పోటు
-
కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ పన్నులను మార్చొద్దు..
బడ్జెట్లో యథాతథంగానే కొనసాగించాలి: సీఐఐ న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్లో సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలతో పాటు సర్వీస్ పన్నును యథాతథంగా కొనసాగించాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సర్వీస్ పన్ను, ఎక్సైజ్ సుంకాలు 12 శాతం చొప్పున ఉండగా.. కస్టమ్స్ సుంకం 10 శాతంగా అమలవుతోంది. తయారీ రంగం ఇంకా మందగమనంలోనే ఉందని.. మరోపక్క, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం విజయవంతమవ్వాలంటే ఈ సుంకాలు, పన్నులను పెంచకూడదని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఈ నెల 28న మోదీ సర్కారు తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరున్ జైట్లీ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని సీఐఐ కోరింది. ఆదాయ తటస్థ రేటు(ఆర్ఎన్ఆర్)పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్, జీఎస్టీ ముసాయిదా బిల్లు రూపకల్పనలో పరిశ్రమ వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించాలని కూడా బెనర్జీ పేర్కొన్నారు. సీఐఐ విజ్ఞప్తుల్లో ఇతర ముఖ్యాంశాలివీ.. తయారీ రంగంలో డిమాండ్ ఇంకా మందకొడిగానే ఉన్నందున దీనికి గతంలో ఇచ్చిన సుంకాల తగ్గింపు చర్యలు చాలా అవసరం. 2014 ఫిబ్రవరిలో తయారీ రంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీలో భాగంగా ఎక్సైజ్ సుంకాన్ని 12 నుంచి 10 శాతానికి తగ్గించడం తెలిసిందే. అయితే, దీన్ని గత డిసెంబర్లో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆటోమోటివ్ విడిభాగాల పరిశ్రమకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలి. వాహన పరిశ్రమ కంటే ఈ విభాగంలో సుంకం అధికంగా ఉండటంవల్ల ఇబ్బందులు నెలకొన్నాయి. యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రీడియెంట్స్(ఏపీఐ), ఫ్లై యాష్ ఉత్పత్తులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమతో పాటు పలు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. కస్టమ్స్ సుంకాన్ని ఇప్పుడున్న 10 శాతంగానే కొనసాగించాలి. దీని గరిష్టస్థాయిల్లో తగ్గింపులు చేయొద్దు. దీనివల్ల ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ప్రతికూలంగా పరిణమిస్తుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా మలేసియా, థాయ్‌లాండ్, ఆసియాన్ ఇతరత్రా దేశాల నుంచి దిగుమతయ్యే చాలావరకూ ఉత్పత్తులపై తక్కువ కస్టమ్స్ సుంకాన్ని వర్తింపజేయాల్సి వస్తోంది. కొన్నిరకాల మెటల్ స్క్రాప్‌లపై అమల్లో ఉన్న 4 శాతం ప్రత్యేక అదనపు కస్టమ్స్ డ్యూటీ(ఎస్ఏడీ)కి మినహాయింపునివ్వాలి. మరోపక్క, యంత్రపరికరాల దిగుమతితో సంబంధం ఉన్న అన్ని ప్రాజెక్టులపై ఎస్ఏడీని విధించాలి. ద్రవీకృత సహజవాయువు(ఎల్ఎన్జీ), కోకింక్ కోల్, వైన్, ఎయిర్ కండిషనర్స్ విడిభాగాలు, భద్రత(సేఫ్టీ) పరికరాల వంటి పలు కీలక ఉత్పత్తుల దిగుమతిపై సుంకాన్ని తగ్గించాలి. -
రూ.కోటి విలువైన బంగారం పట్టివేత
సాక్షి, ముంబై: దుబాయ్ నుంచి సుమారు నాలుగు కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న మహిళను పుణే విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్ వారు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి... ముంబైలోని జోగేశ్వరిలో నివాసముంటున్న అగ్వాన్ అసమ్మ, దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో పుణేలో దిగింది. ఆమె తీరుపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదా చేయగా, ఆమె నడుం చుట్టూ సుమారు నాలుగు కిలోల బరువున్న బంగారపు కడ్డీలు ఉండటం గమనించారు. వాటి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని కస్టమ్స్ కమిషనర్ వాసా శేషగిరిరావు తెలిపారు. నిందితురాలిని పోలీసులకు అప్పగించామని తెలిపారు. -
విజయవాడలో కస్టమ్స్, ఆడిట్ కమిషనరేట్లు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల సాక్షి, గుంటూరు: కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విజయవాడకు నూతనంగా కస్టమ్స్ ప్రివెంటివ్, ఆడిట్ కమిషనరేట్లు మంజూరయ్యాయి. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు కానున్న కస్టమ్స్ కమిషనరేట్ పరిధి విశాఖపట్నం పోర్టు మినహా మిగిలిన సీమాంధ్ర జిల్లాలు, యానాం ప్రాంతం వరకు ఉంటుంది. ఆడిట్ కమిషనరేట్ పరిధిలోకి సీమాంధ్రలోని 13 జిల్లాలు వస్తాయి. విజయవాడలో ఆడిట్ ప్రధాన కార్యాలయంతోపాటు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలలో ఆడిట్ డివిజనల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. -
ఏ కష్టమ్స్ లేకుండా..
విలువైన వస్తువులను విదేశాలకు తీసుకెళ్తే.. ఏవైనా విలువైన వస్తువులు, బంగారు నగలను విదేశాలకు తీసుకు వెళ్తున్నారా? తిరిగి వచ్చేటప్పుడు వాటిని మళ్లీ భారత్‌కు తీసుకు రావాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్స్పోర్ట్ సర్టిఫికెట్ పొందాల్సిందే. ఈ సర్టిఫికెట్‌ను విమానాశ్రయాల్లోని ఇంటర్నేషనల్ డిపార్చర్ హాళ్లలోని కౌంటర్లలో మంజూరు చేస్తారు. దీన్ని పొందడానికి ముందుగా అధీకృత వాల్యూవర్‌తో వాటి విలువకు సంబంధించిన సర్టిఫికెట్ పొందాలి. ఎక్స్పోర్ట్ సర్టిఫికెట్ తీసుకుంటే తిరుగు ప్రయాణంలో ఆయా వస్తువులపై సుంకం చెల్లించక్కర్లేదు. లేదంటే ఇబ్బంది తప్పదు. బంగారంపై ఇలా.. ప్రయాణికులు ఎవరైనా ఒక కేజీ వరకు బంగారం కడ్డీలు/ నాణాలు కొన్ని నిబంధనలకు లోబడి వెంట తెచ్చుకోవచ్చు. ప్రయాణికులు భారతీయ లేదా భారత సంతతి పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. కనీసం ఒక ఏడాది విదేశాల్లో ఉండి భారత్‌కు తిరిగి వస్తున్నట్లు ఆధారాలు తప్పనిసరి. తయారీదారుల పేర్లు, సీరియల్ నెంబర్లు, బరువును సూచించే ముద్రలు ఉన్న బంగారం కడ్డీలపై నిర్ణీత దిగుమతి సుంకం వసూలు చేస్తారు. ఇవేవీ లేని వాటిపై అదనపు సుంకం ఉంటుంది. విదేశాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం ఉండి భారత్‌కు తిరిగి వచ్చే పురుషులు సగటున రూ.50 వేల విలువ చేసే బంగారు ఆభరణాలను ఉచితంగా తెచ్చుకోవచ్చు. మహిళలైతే రూ.లక్ష విలువైన ఆభరణాలు తెచ్చుకునే అవకాశం ఉంది. ముత్యాలు, విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలు మినహా ఇతర ఆభరణాలను పరిమితికి మించి తెచ్చుకుంటే సుంకం చెల్లించాల్సి ఉంటుంది. గమనించాల్సిన ఇతర అంశాలు.. కస్టమ్స్, ఇతర సుంకాలను కేవలం స్థానికంగా మార్పిడికి అవకాశం ఉన్న కరెన్సీ రూపంలోనే చెల్లించాలి. ఈ సుంకాలు, నిబంధనలు పరిస్థితులకు అనుగుణంగా మారే అవకాశం ఉంది. కస్టమ్స్ నిబంధనలపై పూర్తి సమాచారం కోసం www.cbec.gov.in వెబ్‌సైట్‌ను చూడండి. -
ఎయిర్‌పోర్ట్‌లో రెండు కేజీల బంగారం స్వాధీనం
హైదరాబాద్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి నగరానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 2 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం బ్యాంకాక్ ఎయిర్‌లైన్స్ విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సదరు ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుల లగేజీలో రెండు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. దాంతో ఆ బంగారాన్నీ స్వాదీనం చేసుకుని సీజ్ చేశారు. -
ఏపీ సర్కారుకు సెంట్రల్ కస్టమ్స్ ఝలక్
-
ఏపీ సర్కారుకు కస్టమ్స్ ఝలక్
స్మగ్లర్ల నుంచి 4,000 టన్నులకుపైగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఆ ఎర్రచందనం రాష్ట్రానిదేనని, తమకు అప్పగించాలని కస్టమ్స్ శాఖకు లేఖ రాసిన ఏపీ సర్కారు సీజ్ చేసిన ఎర్రచందనం కేంద్రానిదేనంటూ సర్కారు వినతిని తోసిపుచ్చిన కస్టమ్స్ అధికారులు ఎర్రచందనం విక్రయించి నిధులు సమకూర్చు కోవాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ సాక్షి, తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ కస్టమ్స్ శాఖ ఝలక్ ఇచ్చింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 4 వేల టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చింది. తాము సీజ్ చేసిన ఎర్రచందనం కేంద్రానికి చెందుతుందని స్పష్టంచేసింది. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని తామే టెండర్ల ద్వారా విక్రయిస్తామని కస్టమ్స్ శాఖ తేల్చిచెప్పడంతో.. దానిని తాను విక్రయించటం ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఎర్రచందనం వేలానికి కసరత్తు... శేషాచలం అడవుల్లో విస్తారంగా లభ్యమయ్యే ఎర్రచందనం వృక్ష సంపదను స్మగ్లర్లు అక్రమమార్గాల్లో దేశ సరిహద్దులు దాటిస్తోన్న విషయం విదితమే. ఓడరేవులు, విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి కూడా ఎర్రచందనాన్ని సరిహద్దులు దాటించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. చెన్నై, కొచ్చి, కాండ్లా, ముంబై వంటి నౌకాశ్రయాల్లోనూ.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల్లోనూ కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఎర్రచందనాన్ని ప్రత్యేక గోదాముల్లో నిల్వచేశారు. ఇలా నిల్వచేసిన ఎర్రచందనం దుంగలు 4,000 టన్నులకు పైగా ఉన్నట్లు అంచనా. ఎర్రచందనం దుంగలను విక్రయించేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో తిరుపతి, భాకరాపేట, కడప, ఉదయగిరి, కనిగిరి ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వ చేసిన 8,584.1353 టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో తొలి దశ కింద 4,159.693 టన్నులు అమ్మేందుకు ఈ నెల 8వ తేదీన ఈ-టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. కస్టమ్స్ శాఖకు రాష్ట్ర అటవీశాఖ లేఖ... ఈ క్రమంలోనే సెంట్రల్ కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన ఎర్రచందనం కూడా రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుబడిందేననే వాదనను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. తమ రాష్ట్రానికి చెందిన ఎర్రచందనాన్ని స్వాధీనం చేయాలని కస్టమ్స్‌శాఖకు జూలై 26న అటవీశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వం లేఖ రాయించింది. ఎర్రచందనం విక్రయానికి టెండర్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన దుంగలను తక్షణమే తమకు అప్పగించాలని ప్రభుత్వం కోరింది. అది ఏపీదేనని ఎలా చెప్పగలరన్న కస్టమ్స్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కస్టమ్స్ శాఖ తీవ్రంగా స్పందించింది. తాము సీజ్ చేసిన ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్‌దేనని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది. సెంట్రల్ కస్టమ్స్ సీజ్ చేసిన ప్రతి వస్తువూ కేంద్రానికే చెందుతుందని స్పష్టంచేసింది. తాము స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని టెండర్ల ద్వారా విక్రయిస్తామని.. వచ్చే ఆదాయాన్ని కేంద్ర ఖజానాలో జమ చేస్తామని తేల్చిచెప్పింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల మొదటి వారంలో కస్టమ్స్ లేఖ రాసినట్లు అటవీశాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. -
మరోసారి పట్టుబడిన బంగారం
-
మరోసారి పట్టుబడిన బంగారం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఉదయం ఓ ప్రయాణికుడి నుంచి 500 గ్రామల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నరు. తనిఖీల్లో భాగంగా సింగపూర్ నుంచి వచ్చిన అశోక్ లాల్ అనే వ్యక్తి నుంచి అధికారులు ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవలి కాలంలో శంషాబాద్ విమానాశ్రయం అక్రమంగా బంగారం రవాణా చేసే అడ్డాగా మారిపోయింది. స్మగ్లర్లు బంగారాన్ని విదేశాల నుంచి తీసుకు వచ్చేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఓవైపు కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో పట్టుబడుతున్నా...మరోవైపు అక్రమ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది. -
ప్ర‘వరుడు కావలెను’
జెంటిల్మన్ పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా... పెళ్లాం ఎంత అందంగా ఉన్నా సరే, మరో పడతిని పక్కచూపులు చూడటం చాలామందికి అలవాటు. అలాంటిది... కట్టుకున్న భార్య సాదాసీదాగా ఉండి... ఎదురుగా ఎంత ముద్దుగుమ్మ ఉన్నా కనీసం కళ్లు తిప్పట్లేదంటే... అతడు భార్యావిధేయుడన్నా అయి ఉండాలి, లేదా అపర ప్రవరాఖ్యుడన్నా అయి ఉండాలి. అన్నట్లు ప్రవరాఖ్యుడంటే ఎవరో కాదు, ప్రబంధనాయకుడు. అల్లసాని వారు అతడి గురించి ఏకంగా ఓ కావ్యాన్నే రచించారు. ఇంతకీ ఎవరీ ప్రవరుడు, ఏమిటతని గొప్పదనం అంటారా..! అతనిది అరుణాస్పదమనే ఊరు. డబ్బూ దస్కం... పాడీపంటా, ఇల్లూ వాకిలీ ఆచారమూ సంప్రదాయమూ, నిష్ఠా నియమమూ ఉన్నవాడు. వేదవిద్యాసంపన్నుడు. తాను నేర్చిన వేదపాఠాలను పదిమందికీ చెప్పే సుశిక్షితుడైన గురువు. నిరంతరం మాతాపితరుల సేవలో తరించేవాడు, నిత్యాగ్నిహోత్రుడు. అతిథికి అన్నం పెట్టనిదే పచ్చిగంగ కూడా ముట్టని ఆదర్శ గృహస్థు. అన్నింటికీ మించి చక్కదనాల చుక్క అయిన సోమిదమ్మకు ముద్దుల మగడు. అటువంటి ప్రవరుడు ఒక సిద్ధుడిచ్చిన పాదలేపనం సాయంతో హిమాలయాలకు వెళ్లాడు. అయితే ఆ లేపనం కరిగిపోవడంతో తిరిగి రాలేక దారికోసం వెతుకుతుండగా... ఓ అతిలోక సౌందర్యరాశి అతణ్ణి చూసి మనసు పారేసుకుంది. ఆ కాంత ఎవరో కాదు, వరూధిని అనే అప్సరస. ఆమె అందచందాలను అల్లసాని వారు ఎలా వర్ణించారంటే... మెరుపు తీగలాంటి ఒళ్లు, కలువల్లాంటి కళ్లు, నల్లద్రాక్ష గుత్తుల వంటి కనుగుడ్లు, తుమ్మెదలాంటి నల్లని జుట్టు, చంద్రబింబం లాంటి ముఖం, పగడాల్లాంటి పెదవులు, లోతైన నాభి. హంసలాంటి నడక. గరుడ పచ్చల భవనంలో... చంద్రకాంత మణులు పొదిగిన పీటపై కూర్చొని తామరతూళ్లలాంటి అందమైన వేళ్లతో వీణ తీగలను మీటుతూ... పాట పాడుతూ వుంటే పడి పోని వారుండరు. అంతటి అందాల భామ ప్రవరుణ్ణి చూసి... ‘ఆహా ఈ అందగాని కళ్లు కమలాలే! ఛాతీ మన్మధుని సింహాసనంలా ఉంది. పాదాలు ఎర్రని ముఖమల్ తివాచీని ధిక్కరిస్తున్నాయ్. సూర్యుణ్ని సానబట్టి పొడి తీసి ఆ బంగారు అడుసులో ఈ రజను కలిపి, దానిపై కాస్తంత అమృతాన్ని చిలకరించి మరీ ఆ బ్రహ్మ ఇతణ్ణి సృష్టించాడా అన్నంత అందంగా ఉన్నాడే... ఇతణ్ణి చూస్తూంటే నా మనసు, శరీరం వశం తప్పుతున్నాయే, మన్మధ తాపం నా మనస్సును వివశం చేసేస్తోంది... అసలింతటి సౌందర్యవంతుణ్ని నేను ఇన్నాళ్లూ చూడకుండా ఎలా ఉన్నానో...’ అని వాపోయిందట. అలా వాపోయి ఊరుకోలేదు. అతణ్ణి అనేక విధాలుగా కవ్వించింది. ఎంతో పుణ్యం చేస్తే తప్ప అందని స్వర ్గసుఖాలను ఇప్పుడే అందిస్తా రమ్మని రెచ్చగొట్టింది. చలించకపోయేసరికి తానుగా వచ్చి బిగి కౌగిట బంధింప జూసింది. అయినా అతను కేశమెత్త్తు కూడా కదల్లేదు. అపురూప లావణ్యవతి.. అమూల్యమైన మణిమాణిక్యాలకూ, అంతులేనంత సంపదకూ సామ్రాజ్ఞి అయిన వరూధిని క్రీగంటి చూపులకే కలల్లో తేలిపోయేవారున్నారుగానీ, తానుగా కోరి వచ్చినా కళ్లు తిప్పని నిష్ఠాగరిష్ఠుడు మన నాయకుడు. కళ్లు మిరుమిట్లు కొలిపే అందం రారమ్మంటూ కవ్విస్త్తుంటే... ‘‘అయ్యో! సాయం సంధ్య వార్చే సమయం మించిపోతున్నదే, శిష్యులకు వేదశిక్షణ ఇచ్చే వేళ మీరుతున్నదే! నా తలిదండ్రులు నాకోసం తల్లడిల్లుతుంటారే, నా ఇల్లాలు నా గురించి వెదుకుతుంటుందే’’ అని ఆలోచించాడంటే... అతనిలాంటి అందగాడు, యోగ్యుడు, గుణవంతుడు అయిన వరుడి కోసం అమ్మాయిలు వెయ్యి లెన్సులు పెట్టుకుని వెతికినా తప్పు లేదు కదా! ఈలోగా ప్ర‘వరుడు’ కావలెను అని ఓ ప్రకటన ఇచ్చేస్తే పోలా!? - డి.వి.ఆర్. -
ఆశావహులకు అశనిపాతమే
తెలుగుదేశం శ్రేణుల్లో రగులుతున్న ఆగ్రహం తోటకు కాకినాడ ,పండులకు అమలాపురం ఎంపీ సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యే ‘చందన’కు మొండిచేయి నేడు బాబుకు సోకనున్న నిరసన సెగలు సాక్షి, కాకినాడ : అభ్యర్థుల జాబితాలు ఆశావహులను నిస్పృహకు లోను చేస్తూ తెలుగుదేశంలో చిచ్చు రగిలిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తుపై ఆగ్రహంతో ఉన్న తెలుగుతమ్ముళ్లు.. మంగళవారం జిల్లాలో పర్యటించనున్న అధినేత చంద్రబాబునాయుడి వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ తొలి జాబితాలో ఇద్దరు సి ట్టింగ్లతో పాటు పార్టీ కోసం పని చేసిన ఐదుగురికి అవకాశం కల్పిం చినా మలి జాబితా నుంచి గోడ దూకినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్తపేట, రామచంద్రపురం సీట్లను ఇటీవలే పార్టీలోకి వచ్చిన బండారు సత్యానందరావు, తోట త్రిమూర్తులుకు కట్టబెట్టారు. సోమవారం నాటి మూడో జాబితా లో కూడా అదే ఫార్ములా పాటిం చారు. ఇటీవలే సైకిల్ ఎక్కిన తోట నరసింహానికి కాకినాడ ఎంపీ సీటు, విశాఖలో కస్టమ్స్ అడిషనల్ కమిషనర్‌గా వీఆర్ఎస్ తీసుకున్న పండుల రవీంద్రబాబుకు అమలాపురం ఎంపీ సీటు కట్టబెట్టారు. కా కినాడ అసెంబ్లీ స్థానాన్ని వనమాడి వెంకటేశ్వరరావు కు, రాజమండ్రి రూరల్ స్థానాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయిం చారు. కాగా తోట కాకినాడ ఎంపీ అభ్యర్థిగా మంగళవారం నా మినేషన్ వేయనున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి సైకిలెక్కిన తోట కోసం.. లోక్‌సభ సీటుపై గతంలోనే బాబు నుంచి స్పష్టమైన హామీ పొందిన కైట్ విద్యాసంస్థల అధినేత పోతుల విశ్వానికి మొండిచేయి చూపడంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కనీసం పెద్దాపురం లేదా పిఠాపురం అసెంబ్లీ సీట్లలో ఏదో ఒకటి ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని విశ్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర సమయంలోనే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యా రావుకు అమలాపురం ఎంపీ టికెట్ ఇస్తానన్న చంద్ర బాబు ఇప్పుడు మాట మార్చి రాజకీయాలతో సంబంధం లేని రవీంద్రబాబుకు టికెట్ కేటాయించడంతో గొల్లపల్లి అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బీసీ నేత అనే చందనకు మొండిచేయి.. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురికి అవకాశం కల్పించిన బాబు తనకూ చాన్సిస్తారని ఆశించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్‌కు భంగపాటు తప్పలేదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన చందనకు మొండి చేయి చూపుతూ ఆ స్థానాన్ని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కట్టబెట్టారు. బీసీ కాబట్టే తమ నాయకుడిని పక్కన పెట్టారని చందన అనుచరులు మండిపడుతున్నారు. ఎన్నికల్లో బీసీల సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక కాకినాడ అసెంబ్లీ సీటును ఆశించిన మాజీ మంత్రి ముత్తాగోపాలకృష్ణకు భంగపాటు తప్పలేదు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ముత్తాను కాదని మళ్లీ వనమాడి కొండబాబుకు టికెట్ ఇవ్వడం పట్ల ముత్తా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు తమ సామాజిక వర్గానికి ఒక అసెంబ్లీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి మోసగించిన చంద్రబాబు ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు జిల్లాలోని మాదిగలు సిద్ధమవుతుండగా, మరోవైపు టిక్కెట్లు దక్కని ఆశావహులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. -
కస్టమ్స్ అదుపులో బంగారం స్మగ్లర్ సుజాత్ అలీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా వ్యవస్థీకృత బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్న సూత్రధారుల్లో కీలకవ్యక్తి సుజాత్ అలీని కస్టమ్స్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. బుధవారం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ 13 కేజీల బంగారంతో చిక్కిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌హోస్టెస్ సదాఫ్ ఖాన్ వెనుక ఇతడే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి బుధవారం సదాఫ్ వెంట సుజాత్ అలీ కూడా ఉన్నాడు. ఆమెను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో జారుకుని నేరుగా దుబాయ్ పారిపోయాడు. ఈ విషయం పసిగట్టిన కస్టమ్స్ అధికారులు దుబాయ్ విమానాశ్రయ అధికారుల సాయంతో సుజాత్‌ను పట్టుకుని తిరిగి హైదరాబాద్‌కు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. చైనా కేంద్రంగా పని చేస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ ముఠాతో ఇతడికి లింకులు ఉన్నాయని అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల ఖర్చులకు, బంగారం స్మగ్లింగ్‌కు మధ్య ఉన్న లింకులతోపాటు దీని వెనుక ఉన్న హవాలా ముఠాల వివరాలనూ సేకరిస్తున్నారు. మరోవైపు బుధవారం పట్టుబడిన సదాఫ్ ఖాన్, ఫాతిమాలను కస్టమ్స్ అధికారులు గురువారం నాంపల్లిలోకి ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు నిమిత్తం కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. -
‘వాణిజ్యం’పై సమైక్య సమ్మెట!
అయినా లక్ష్యంలో 82.53 శాతం వసూళ్లు అదనపు ఆదాయ వసూలులో ముందంజ అమ్మకపు పన్ను వసూళ్లు రూ.1294.12 కోట్లు విశాఖ డివిజన్ డీసీ టి.శివశంకరరావు సాక్షి, విశాఖపట్నం : ‘సమైక్యాంధ్ర ఉద్యమంతో వ్యాపారాలు మందగించాయి. కస్టమ్స్ సుంకం పెంపు, నిబంధనలు కఠినతరం కావడంతో బులియన్ రాబడి తగ్గుముఖం పట్టింది. ఈ విభాగంలో ఒక్క ఎంఎంటీఎస్ డీలర్ ద్వారానే రూ.31 కోట్లు తక్కువగా అమ్మకపు పన్ను వసూలు జరిగింది. వరుస సమ్మెలతో పారిశ్రామిక రంగం డీలాపడింది. అయినా 2012-13 ఆర్థిక సంవత్సరం అమ్మకపు పన్ను వసూలు (రూ.1254.16 కోట్లు) కంటే ఇటీవల ముగిసిన ఆర్ధికేడాదిలో 3.19 శాతం (రూ.39.96 కోట్లు) వృద్ధితో రూ.1294.12 కోట్లు వసూలు సాధించినట్టు’ విశాఖపట్నం డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ టి.శివశంకరరావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి డివిజన్ సాధించిన అమ్మకపు పన్ను, వసూళ్ల ప్రగతిని వివరించారు. ప్రధాన డివిజన్లలో ముందంజ : గత ఏడాది వ్యాట్ రూ.1254.16 కోట్లు వసూలవగా, ఈసారి రూ.1294.12 కోట్లు వసూలైంది. గతేడాది పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలో ఉండటంతో అమ్మకపు పన్ను వసూళ్ల లక్ష్యం రూ.1568.06 కోట్లలో 82.53 శాతం మాత్రమే సాధించగలిగినట్టు పేర్కొన్నారు. పన్నేతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంతో కలిపితే రూ.1351.47 కోట్లు వసూలైనట్టు తెలిపారు. డివిజన్లో 58 శాతంగా ఉన్న ఎల్టీయూ సర్కిల్ ఈ సారి కేవలం 0.15 శాతం మాత్రమే ప్రగతి నమోదు చేసుకుందన్నారు. రూ.130 కోట్లు వరకు ఈ ఒక్క విభాగంలోనే గతంలోకంటే గతేడాదికంటే పన్ను వసూళ్లు తగ్గడంతో ఆ ప్రభావం డివిజన్‌పై స్పష్టంగా కనిపించిందన్నారు. పనిచేసే సిబ్బందిని ప్రోత్సహించడం, తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం, ఆడిట్లపై అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆశించిన స్థాయిలో వ సూళ్లు సాధించగలిగినట్టు తెలిపారు. భారీ క్షీణత వీటిలోనే.. కొన్ని ప్రధాన సంస్థలు 2012-13 కంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో భారీ క్షీణత నమోదు చేసుకున్నాయి. ఎంఎంటీసీ 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.205.32 కోట్లు అమ్మకపు పన్ను చెల్లించింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఇది రూ.117.42 కోట్లుకు తగ్గింది. ఈసారి ఇందులో కూడా రూ.31 కోట్లు తక్కువగా ఈ సంస్థ పన్ను చెల్లించింది. ఆర్థిక సమస్యలతో పీఎస్ఎల్ లిమిటెడ్ సంస్థ గతంలో కంటే రూ.13 కోట్లు తక్కువగా చెల్లించింది. ఎన్టీపీసీ ఆర్డర్స్ లేక బొగ్గు దిగుమతులు క్షీణించి కోస్టల్ ఎనర్జీ సంస్థ కూడా 29 కోట్లు తక్కువగా పన్ను చెల్లించింది. -
ఎయిర్ పోర్ట్ లో కండోమ్స్ లో లిక్విడ్ గోల్డ్ పట్టివేత
విమానాశ్రాయాల్లో వివిధ పద్దతుల ద్వారా అక్రమ బంగారం రవాణ చేస్తున్న నిందితులను పట్టుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువగానే మన దృష్టికి వస్తున్నాయి. బంగారాన్ని ఘన రూపంలో అక్రమ రవాణాకు ఇబ్బందులు ఏర్పడుతున్న కారణంగా ఓ వ్యక్తి ఎంచుకున్న కొత్త పద్దతి ద్వారా చేసిన ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. కోచి విమానాశ్రయంలో లిక్విడ్ గోల్డ్ (ద్రవ రూపంలో బంగారాన్ని) ను కండోమ్ లో అక్రమంగా రవాణా చేస్తూ ప్రయాణికుడు పట్టుపడ్డారు. ప్లాస్టిక్ కంటైనర్ లో రంగుతో కూడిన ద్రవ పదార్ధాన్ని నింపిన కండోమ్స్ తనిఖీల్లో బయటపడ్డాయని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నెడుంబస్సెరీ ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడ్ని తనిఖీ చేయగా కండోమ్స్ లో అక్రమంగా రవాణా చేస్తున్న 5.345 కిలోల లిక్విడ్ గోల్డ్ బయటపడిందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
త్వరలో ఎయిర్ పోర్ట్ ల్లో కొత్త కస్టమ్స్ నిబంధనలు!
న్యూఢిల్లీ: త్వరలో ఎయిర్పోర్ట్ ల్లో కొత్త కస్టమ్స్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దేశం విడిచి వెళ్లే భారతీయులు ఎయిర్ పోర్ట్ ల్లో కొత్తగా ప్రవేశపెట్టనున్నకస్టమ్స్ దరఖాస్తును పూరించాల్సి ఉంటుంది. వారు ఎంతకాలం విదేశాల్లో ఉండదలుచుకున్నారు, ఎప్పుడు తిరిగి స్వదేశానికి చేరుకుంటారు తదితర వివరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ విధానం అమల్లోకి వస్తే విదేశాల నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఎటువంటి ఇమ్మిగ్రేషన్ దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాగా విదేశాల నుంచి తిరిగి వచ్చే సమయంలో మాత్రం దేశీయ ఎయిర్ పోర్ట్ ల్లో కస్టమ్స్ కు సంబంధించిన దరఖాస్తులో ప్రయాణికుల పూర్తి వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. దేశం లో కరెన్సీ బెడద, నిషేధిత వస్తువులను నిషేధించే క్రమంలో భాగంగానే కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది మరో రెండు నెలల్లో దేశంలోని ఎయిర్ పోర్ట్ ల్లో అమలు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. జనవరి 1 వ తేదీ నుంచి ఈ విధానాలపై కసరత్తు ఆరంభించామన్నారు. కాగా అమల్లోకి రావడానికి మరో రెండు నెలలు సమయం పడుతుందని హోం శాఖ వెల్లడించింది. మార్చి తొలి వారం నుంచి ఈ విధానాన్ని సమర్ధవంతంగా అన్ని ఎయిర్ పోర్ట్ ల్లో అమలు చేస్తామని పేర్కొంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 18కిలోల బంగారం సీజ్
హైదరాబాద్ : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు అంతర్జాతీయ స్మగ్లర్లను కష్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అక్రమంగా తరలిస్తున్న 18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురు తమిళనాడుకు చెందిన ఆదిమహ్మాద్, జైనుద్దీన్, చొక్కలింగం మురుగనందన్లుగా గుర్తించారు. ఎయిర్పోర్ట్ కేంద్రంగా అంతర్జాతీయస్థాయిలో బంగారం స్మగ్లింగ్ జరుగుతుందని సమాచారం రావడంతో.. సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. స్మగ్లర్లు సింగపూర్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారుల విచారణలో తేలింది. వారి ముగ్గురిని అదుపులోకి తీసుకొని...వారి పాస్‌పోర్ట్‌లను అధికారులు సీజ్ చేశారు. ఈ ఏడాది శంషాబాద్ విమానాశ్రయంలో మొత్తం 43 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 13కేసులు నమోదు కాగా, 23మందిని అరెస్ట్ చేశారు. బంగారంపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో స్మగ్లర్లు తమ రూట్ మార్చారు. ప్రయాణికులు రూపంలో విమానాశ్రయాల నుంచి వీటిని అక్రమంగా తరలిస్తున్నారు. బంగారం బిస్కెట్లు, కడ్డీలు, ఆభరణాల రూపంలో వాటిని లోదుస్తుల్లోనూ, షూలలో పెట్టుకుని వస్తున్నారు. ఇటీవలి కాలంలో శంషాబాద్ విమానాశ్రం నుంచి కేజీల స్థాయిలో బంగారం పట్టుపడుతోంది.