ప్రతీకాత్మక చిత్రం
హిమాయత్‌నగర్: నాకు తెలిసిన కస్టమ్స్ అధికారులు ఉన్నారు. వారి వద్ద పట్టుబడిన బంగారం తక్కువకు వస్తుంది. ఇది మంచి అవకాశంగా తీసుకోవాలంటూ నగర వాసి టి.మల్లికార్జున్‌రెడ్డికి టోకరా వేశాడు బెంగుళూరుకు చెందిన కిరణ్ అనే వ్యక్తి. కిరణ్, మల్లికార్జున్‌లు కొంతకాలంగా స్నేహితులు. బెంగుళూరు ఎయిర్‌పోర్టులో విధులు నిర్వర్తించే కస్టమ్స్ అధికారులతో పరిచయాలు ఉన్నాయన్నాడు కిరణ్.
దుబాయి తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ బంగారం తెచ్చి ఇక్కడ పట్టుబడ్డ వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం అధికారులు బయట రేటు కంటే తక్కువకు ఇస్తారని నమ్మించాడు. పదేపదే ఫోన్లు చేసి బంగారం కొనగోలు చేయమనడంతో 15 తులాల బంగారు ఆభరణాలకు గాను మల్లికార్జున్‌రెడ్డి కిరణ్‌కు రూ.4లక్షలు పంపాడు. డబ్బు పంపినాక బంగారం ఇవ్వకపోగా.. ఫోన్లకు కూడా సరిగ్గా స్పందించకపోడంతో కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని మంగళవారం బాధితుడు మల్లికార్జున్‌రెడ్డి సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment