తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్కామ్ కేసు విచారణ మరో అడుగు ముందుకు పడింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మాజీ ఐటీ అధికారి అరుణ్ బాలచంద్రన్ శుక్రవారం కొచ్చిలో కస్టమ్స్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్మగ్లింగ్ నిందితులకు చేసిన సహాయంపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా అరుణ్ ఈ కేసులో కీలక పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఇతను ఈ కేసులో నిందితుడైన సీఎం మాజీ సలహాదారు ఎం శివశంకర్‌కు అత్యంత సన్నిహితుడుగా అధికారులు పేర్కొంటున్నారు. (చదవండి: కేరళ గోల్డ్ స్కామ్ : మరో కీలక అప్ డేట్)
శివశంకర్.. మరో నిందితురాలైన స్వప్న సురేశ్ కోసం సచివాలయం సమీపంలో మంచి ఫ్లాట్ చూసి పెట్టాలని బాలచంద్రన్‌ను కోరినట్లు తెలిపారు. అక్కడైతే ఎవరికీ ఏ అనుమానం రాకుండా బంగారం అక్రమ రవాణాను సులభంగా చేసుకోవాలనుకున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు ఇప్పటివరకు 20 మందిని అరెస్ట్ చేయగా మరో ఐదుగురి కోసం గాలింపు చేపట్టారు. కాగా జూలై 5న కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో యూఏఈ కాన్సులేట్‌కు బంగారంతో వచ్చిన పార్శిల్ గుట్టు ఆ రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. (చదవండి: తిరుచ్చిలో ఎన్‌ఐఏ దూకుడు)
Comments
Please login to add a commentAdd a comment