తిరువొత్తియూరు: చెన్నై నుంచి దుబాయ్‌కి టెలిస్కోప్‌లో దాచి తరలిస్తున్న రూ. 5.76 కోట్ల విలువవైన 1052 క్యారెట్ వజ్రాలు నగలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చెన్నైకి చెందిన యువకుడిని అధికారులు అరెస్టు చేశారు. గురువారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి వెళ్లే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులను, వారి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో చెన్నైకి చెందిన 30 ఏళ్ల యువకుడి సూట్‌కేసు, బ్యాగ్‌లను తనిఖీ చేయగా నాలుగు టెలిస్కోపులు ఉన్నాయి. వాటిని విప్పి చూడగా 22 చిన్న ప్లాస్టిక్ సంచుల్లో వజ్రాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని యువకుడిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment