daimond
-
వజ్రాల వేట.. 9 వజ్రాలు లభ్యం..
-
ఆకాశంలో వజ్రం.. 'లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై'
వాషింగ్టన్: సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమైన బుధుడి ఫోటోను తీసింది నాసాకు చెందిన వ్యోమనౌక 'మెసెంజర్'. నాసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫోటోను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై' పదాలు గుర్తుకు రాక మానవు. అచ్చంగా వజ్రాన్ని పోలి ఉన్న బుధుడు ఆకాశంలో వెలుగుజిలుగులతో నిజంగానే డైమండ్‌లా మెరిసిపోతున్నాడు. 'మెసెంజర్' 'అడ్వెంచర్' ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యోమనౌక 'మెసెంజర్' తీసిన ఈ అద్భుతమైన ఫొటోను నాసా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫోటోలో మెర్య్కురీ వజ్రకాంతి ధగధగలతో తళుకులీనుతోంది. సూర్యుడికి అత్యంత చేరువలో ఉన్నట్లు కనిపించే ఈ గ్రాహం సూర్యుడికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిజంగా వజ్రమేనా.. ఈ ఫోటో కింద నాసా రాస్తూ.. వారు నన్ను మిస్టర్ ఫారన్‌హీట్ అని పిలుస్తారు. సైజులో భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడి కంటే కొంచెం పెద్దగా ఉండే ఈ గ్రహం మన సౌర కుటుంబంలోనే అత్యంత చిన్నది. ఇది సూర్యునికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం చిన్నదే అయినప్పటికీ తన కక్ష్య చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంది. సెకనుకి 47 కిలోమీటర్ల వేగంతో ఇది చక్కర్లు కొడుతుంది. ఈ గ్రహంపై ఒక సంవత్సర కాలం భూమిపై 88 రోజులతో సమానం. ఈ కక్ష్యలోకి ప్రవేశించిన మొట్టమొదటి స్పేస్‌క్రాఫ్ట్ మెసెంజర్ బుధుడి ఉపరితలంపై ఉన్న రాళ్లల్లో రసాయన, ఖనిజ, భౌతిక వ్యత్యాసాల్ని గుర్తించేందుకు వీలుగా ఇలా బుధుడి కలర్ ఫోటోని తీసింది. జూ. సూర్యుడు.. వాతావరణానికి బదులుగా బుధుడిపై చాలావరకు ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం, పొటాషియంతో కూడిన సన్నని ఎక్సోస్పియర్‌ను కలిగి ఉంటుంది. ఈ గ్రహంపై వాతావరణం లేకపోవడం, సూర్యునికి అత్యంత చేరువగా ఉండటంతో పగటిపూట 800ºF (430ºC) నుండి రాత్రికి -290 ºF (-180 ºC) వరకు ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. భూమితో పోలిస్తే దీని అయస్కాంత క్షేత్రం చాలా బలహీనంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీని ఉపరితలాన్ని పరీక్షించేందుకు వీలుగా నీలి రంగు వర్ణాల ఉపరితలాన్ని అక్కడక్కడా గుంతలు ఉండటాన్ని మనం గమనించవచ్చని రాసింది. View this post on Instagram A post shared by NASA (@nasa) ఇది కూడా చదవండి: ఢిల్లీ హోటల్లో హైడ్రామా సృష్టించిన జీ20 చైనా బృందం -
వజ్రాల వేలం.. పోలో అంటూ వచ్చిన వ్యాపారులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ ఇటీవల నిర్వహించిన వజ్రాల వేలానికి మంచి స్పందన లభించింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల నుంచి వెలికితీసిన 8,337 క్యారట్ల రఫ్ డైమండ్లకు నిర్వహించిన ఈ–వేలంలో సూరత్, ముంబై, పన్నా ప్రాంతాల్లోని వర్తకులు పాల్గొన్నట్లు సంస్థ తెలిపింది. 2020 డిసెంబర్ ముందు వెలికి తీసిన వజ్రాలను ఇందులో విక్రయించినట్లు పేర్కొంది. ఈ వజ్రాల వేలానికి నూటికి నూరు శాతం బిడ్లు వచ్చినట్లు ఎన్ఎండీసీ సీఎండీ సుమీత్ దేవ్ తెలిపారు. దేశీయంగా 90% మేర వజ్రాల వనరులు మధ్యప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఎన్ఎండీసీకి చెందిన పన్నా గనుల్లో ఏటా 84,000 క్యారట్ల డైమండ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. దేశంలో యాంత్రీకరించిన వజ్రాల గని ఇదొక్కటే. -
అందులో దాచి తరలిస్తుండగా.. కోట్ల విలువైన వజ్రాలు సీజ్
తిరువొత్తియూరు: చెన్నై నుంచి దుబాయ్‌కి టెలిస్కోప్‌లో దాచి తరలిస్తున్న రూ. 5.76 కోట్ల విలువవైన 1052 క్యారెట్ వజ్రాలు నగలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చెన్నైకి చెందిన యువకుడిని అధికారులు అరెస్టు చేశారు. గురువారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి వెళ్లే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులను, వారి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో చెన్నైకి చెందిన 30 ఏళ్ల యువకుడి సూట్‌కేసు, బ్యాగ్‌లను తనిఖీ చేయగా నాలుగు టెలిస్కోపులు ఉన్నాయి. వాటిని విప్పి చూడగా 22 చిన్న ప్లాస్టిక్ సంచుల్లో వజ్రాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని యువకుడిని అరెస్టు చేశారు. -
ఆస్పత్రికి డబ్బుల్లేక చందాలు.. క్రికెటర్ క్రిస్ కెయిన్స్ జీవితం నేర్పే పాఠాలివే!
ఇప్పుడు న్యూజిల్యాండ్ అంటే కెయిన్ విలియమ్సన్ గుర్తొస్తాడు. ముఖ్యంగా మన తెలుగు వాళ్లయితే ముద్దుగా కెన్ మామ అని పిలుస్తారు. కానీ కెయిన్ కంటే ముందే ఇండియన్ల మనసు దోచుకున్న క్రికెటర్ మరొకరు ఉన్నారు అతనే క్రిస్ కెయిన్. ఇండియాతో జరిగిన మ్యాచుల్ల్లో బ్యాటు, బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసిన కెయిన్స్ మనకు ఓటమి రుచి చూపించాడు, కానీ నిజ జీవితంలో ఆర్థిక పాఠాలు నేర్చుకోలే తానే ఓటమి అంచున ఉన్నాడు. సాక్షి, వెబ్‌డెస్క్: ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం సహజమే. కానీ, దానికి కారణమయ్యే పరిస్థితులు మాత్రం మన చేతుల్లోనే ఉంటాయన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. సాధారణంగా డౌన్ టు హై సక్సెస్ స్టోరీలు మనిషికి ఒక ఊపుని ఇస్తే... హై టు డౌన్ స్టోరీలు గుణపాఠాలు నేర్పుతుంటాయి. క్రికెట్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న క్రిస్ కెయిన్స్ కథ.. రెండో కేటగిరీకి చెందిందే. రిటైర్ అయ్యాక విలాసాలకు బానిసై.. చివరికి రోడ్డున బస్సులు కడిగే స్థాయికి చేరుకుని వార్తల్లో నిలిచింది ఈ మాజీ ఆల్‌రౌండర్ జీవితం. న్యూజిల్యాండ్ స్టార్ హాలీవుడ్ హీరో లాంటి రూపం, రింగుల జుత్తు.. మీడియం పేస్‌తో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్. గాయాలు ఆయన కెరీర్‌ను కిందకి లాగేశాయి. దీంతో ఆడే వయసులో ఉండగానే 2006లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటికే ఇటు టెస్టులు, వన్డేల్లో న్యూజిల్యాండ్ స్టార్ ఆటగాడు కెయిన్స్. ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ తర్వాత ఆ స్థాయిని అందుకున్న రెండో కివీస్ క్రికెటర్ తను ఎదిగాడు. పైసల్లేక ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండా గడిపేయడం క్రిస్ కెయిన్స్ జీవితాన్ని నిండా ముంచేసింది. ఒకప్పుడు నలుగురి మధ్య హుందాగా బతికిన కెయిన్స్ చివరకు బస్సులు కడిగే క్లీనర్ స్థాయికి చేరుకున్నాడు. గంటకు 17 డాలర్లు సంపాదించే జీవితంలో కొన్నాళ్లు గడిపాడు. క్రికెటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించి డైమండ్ ట్రేడర్‌గా కొత్త మలుపు తీసుకున్న క్రిస్ కెయిన్స్ కెరీర్ దశాబ్దం తిరగకుండానే బస్సు డ్రైవర్ స్థాయికి చేరుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగానే మారింది. ఈ క్రమంలో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి... ట్రీట్మెంట్ కోసం దాతల వైపు చూడాల్సిన దీనస్థితికి చేరుకున్నాడు. ఒకప్పుడు మూడున్నర క్యారెట్ల వజ్రాల రింగుతో తనకు ప్రపోజ్ చేసిన భర్త, ఆస్పత్రి ఖర్చులకు పైసా లేక ఇబ్బంది పడుతున్న తీరుని చూసి కెయిన్స్ భార్య మెలనీ కన్నీటి పర్యంతం అవుతోంది. అదుపులేని ఖర్చులతో కెయిన్స్ వజ్రాల వ్యాపారిగా న్యూజిలాండ్‌లో ఓక్టగాన్ కంపెనీని సక్సెస్‌ఫుల్‌గానే నడిపించాడు. కానీ, డబ్బుని పొదుపు చేయడంలో ఘోరంగా విఫలం అయ్యాడు. వస్తున్న రాబడి చేస్తున్న ఖర్చులకు పొంతన లేని జీవితానికి అలవాటు పడ్డాడు. ముఖ్యంగా ఆకర్షణ మోజులో పడి అవసరం లేనివి కొనడం అతనికి వ్యసనంగా మారింది. చివరకు అదే కెయిన్స్ జీవితాన్ని నిండా ముంచింది. విలాసాలకు అలవాటుపడి అడ్డగోలుగా ఖర్చు పెట్టాడు. చివరకు రాబడి తక్కువ అప్పులు ఎక్కువ అయ్యే పరిస్థితి ఎదురైనా అతని తీరులో మార్పు రాలేదు. చివరకు భారీ నష్టాలతో డైమండ్ కంపెనీ మూసేయాల్సి వచ్చింది. ఇదంతా ఐదేళ్ల వ్యవధిలోనే జరిగిపోయింది. ఒక క్రీడాకారుడిగా గెలుపోటముల గురించి కెయిన్స్‌కి కొత్తగా చెప్పక్కర్లేదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటే గెలుపును తన వశం చేసుకునేవాడు. కానీ అవసరాలు మించి ఖర్చు చేసే నైజం అతడిలోని స్పోర్ట్స్‌మన్ స్పిరిట్‌ని కూడా నాశనం చేసింది. అందువల్లే చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించిన డబ్బును నిర్లక్ష్యంగానే ఖర్చు చేశాడు. ఫలితంగా కనీసం ఇన్సురెన్స్ కూడా చేయించుకోలేదు. చివరకు ప్రాణాపాయ స్థితిలో మరొకరిపై ఆధారపడాల్సిన దుస్థితిలోకి తనంతట తానుగా వెళ్లి పోయాడు. అవనసర ఖర్చులు వద్దు అనవసర ఖర్చులకు తగ్గించుకోవడం ఎంతో అవసరం. ఆకర్షణల మోజులో పడి అనవసరమైన వస్తువులపై మన డబ్బులు వెచ్చించడం వల్ల తాత్కాలిక ప్రయోజానాలు తీరుతాయే తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. అందువల్లే మన ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ఏ అంశాలపై ఎంత ఖర్చు చేస్తున్నామనే దానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక వేసుకోవాలి. అనవసర ఖర్చులను సాధ్యమైనంతగా తగ్గించాలి. ఇది లోపించడం వల్ల క్రిస్ కెయిన్స్ దుర్భర పరిస్థితిల్లోకి జారుకున్నాడు. ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి అభిప్రాయం ప్రకారం మనం ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు. మనం ఎంత మిగుల్చుతున్నాం, సమయానికి అది మనకు ఎలా ఉపయోపడుతుంది, ఎన్ని తరాలకు సరిపడ డబ్బు మనదగ్గర ఉందని అనేదే ముఖ్యం. డబ్బును ఎక్కువ కాలం పొదుపు చేయడం, జాగ్రత్త దాచడం అనేది డబ్బు సంపాదించడం కంటే ఎంతో కష్టమైన పని అని కియోసాకి అంటారు. కెయిన్స్ విషయంలో ఈ పొరపాటు నూటికి నూరుపాళ్లు జరిగింది. డబ్బు సంపాదిస్తున్నానే భ్రమలో పడి పొదుపు, చేయడం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా దాచుకోవడంపై నిర్లక్షం చేశాడు. అందువల్లే పదేళ్లలోనే ఆకాశం నుంచి అథఃపాతాళానికి చేరుకున్నాడు. ఖర్చులు కాదు పెట్టుబడి కావాలి డబ్బును పెట్టుబడిగా మార్చితే డబ్బుని డబ్బే సంపాదిస్తుంది. అందుకు కావాల్సింది ఓపిక, సహానం. వెనువెంటనే లాభాలు వచ్చి పడాలి అన్నట్టుగా ఖర్చు పెట్టడం కాకుండా క్రమ పద్దతిలో పొదుపు చేసిన లేదా అందుబాటులో ఉన్న డబ్బును పెట్టుబడిగా మార్చితే లాంగ్ రన్లో ఆర్థికంగా దన్నుగా నిలుస్తుంది. వారెన్ బఫెట్ మొదలు ఎందరో కుబేరులు ఈ సూత్రం ఆధారంగానే కోటీశ్వరులు అయ్యారు. ఉదాహరణకు 12 శాతం రిటర్నలు వస్తాయనే నమ్మకంతో ప్రతీనెల రూ.5000 వంతున మార్కెట్లో పెట్టుబడిగా పెడితే 20 ఏళ్లు తిరిగే సరికి 12 లక్షల పెట్టుబడి మీద 37 లక్షల రిటర్న్ దక్కుతుంది. మొత్తంగా ఇరవై ఏళ్లు పూర్తయ్యే సరికి 50 లక్షల రూపాయలు మనకు అండగా ఉంటాయి. అయితే కెయిన్స్ పెట్టుబడులు పెట్టకుండా ఖర్చులు పెట్టుకుంటూ పోయాడు. దీంతో రివర్స్ పద్దతిలో పదేళ్లు పూర్తవకముందే చేతిలో చిల్లిగవ్వ లేని స్థితికి చేరుకున్నాడు. ఆలోచన ధోరణి మారాలి డబ్బు సంపాదించాలంటే ఏళ్లు పట్టవచ్చు, కానీ దాన్ని కోల్పోవడానికి క్షణాలు చాలు. కాబట్టి డబ్బు కంటే ముఖ్యమైంది మన ఆలోచనా ధోరణి. పేదరికం, డబ్బు పట్ల మనకున్న దృక్పథం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చలేము అనుకుంటూ అలానే ఉండిపోతాం. అలా కాకుండా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే అన్ని విషయాలు మనకే తెలియక్కర్లేదు. ఆర్థిక నిపుణులను కలిస్తే మన ఆదాయానికి తగ్గట్టుగా పెట్టుబడి ఎలా పెట్టాలో చెబుతారు. వాటిని పాటించినా చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవచ్చు. క్రీడాకారుడిగా అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కెయిన్స్ అడిగితే ఆర్థిక సలహాలు ఇచ్చే వారు కోకొల్లలు. కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చాలని అతను బలంగా కోరుకోలేదు. అందుకే స్టార్ క్రికెటర్ నుంచి క్లీనర్‌గా, ట్రక్ డ్రైవర్‌గా దిగజారిపోతూనే వచ్చాడు. -
జొన్నగిరిలో జోరుగా కొనసాగుతున్న వజ్రాలవేట
-
జొన్న గిరి లో వజ్రాల వేట
-
నుదుటిపై పింక్ డైమండ్.. విలువెంతో తెలుసా!
వాషింగ్టన్: సాధారణంగా ర్యాప్ సింగర్స్ అంటేనే భిన్నమైన వస్త్రధారణ, హేయిర్కట్స్తో వింత పోకడలకు పోతుంటారు. ఇక హాలీవుడ్ ర్యాపర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రొటీన్‌కు భిన్నంగా ఉండేందుకు శరీరంపై కొత్తకొత్త ప్రయోగాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ అమెరికా ర్యాప్ సింగర్ లిల్ ఉజీ వెర్ట్ కూడా వెరైటీగా ఆలోచించాడు. అందుకే కోట్ల రూపాయలు విలువ చేసే పింక్ డైమండ్‌ను ఏకంగా నుదుటిపైనే అమర్చుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతర్జాతీయ ర్యాప్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న లిల్ ఇటీవల ఓ వీడియో షేర్ చేశాడు. ‘బ్యూటీ ఈజ్ పెయిన్’ అంటూ షేర్ చేసిన ఈ వీడియోలో లిల్ నుదుటిపై పింక్ డైమండ్ ధరించి కనిపించాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అవెంజర్స్ సిరీస్‌లో మార్వెల్ సూపర్ హరో పవర్‌లా ఉందంటూ అభిమానులు లిల్ గురించే చర్చించుకుంటున్నారు. (చదవండి: హత్యాయత్నం: మృతి చెందిన వ్యక్తిపై కేసు) కాగా అతడి నుదుటిపై అమర్చుకున్న ఈ పింక్ డైమండ్ ఖరీదు రూ. 175 కోట్లు అంట. అది తెలిసి నెటిజన్లంతా కోట్లు విలువ చేసే డైమండ్‌ను మెడలో చైన్‌గా కానీ, ఉంగరంలా ధరించకుండా అలా నుదుటి ధరించడమేంటని అవాక్కవుతున్నారు. ఇక దీనిపై లిల్ స్పందిస్తూ... తన దగ్గర ఉన్న ఖరీదైన కార్లు, వాచ్‌లు, డిజైనింగ్ క్లాత్స్ కంటే ఇది అంత్యంత ఖరీదైందని, ఇది కొనేందుకు తన నాలుగేళ్ల సంపాదనను వెచ్చించినట్లు చెప్పాడు. ఈ డైమండ్ 10 నుంచి 11 క్యారెట్లు ఉంటుందని, ఇది తన ఖరీదైన ప్యాలెస్ కంటే ఎక్కువ అని తెలిపాడు. దీనిని మేడలో ధరించోచ్చు కదా అని నెటిజన్ పెట్టిన కామెంట్‌కు లిల్ ఒకవేళ అది ఎక్కడైన పడిపోతే అంటూ సరదాగా సమాధానం ఇచ్చాడు. ఇక ఇది చూసిన నెటిజన్లు అతడిపై విమర్శలు చేస్తుంటే మరికొందరు ఆ డైమండ్ కోసం లిల్కు ఎవరైనా హాని చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Marni Life( NO STYLIST)1600 (@liluzivert) -
అందాల సుందరీమణులు
-
వజ్రాల పేరిట ఘరానా మోసం
కళ్లలో కారం కొట్టి రూ.15 లక్షలు చోరీ బాధితులు కృష్ణాజిల్లా వాసులు నిందితుల్లో ఒకరు అల్లవరం వాసిగా గుర్తింపు మామిడికుదురు : లక్షల విలువ చేసే వజ్రాలు అతి తక్కువ మొత్తానికి మీ సొంతం అవుతాయంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్లల్లో కారం కొట్టి రూ.15 లక్షలతో ఉడాయించిన సంఘటన మండల పరిధిలోని కొమరాడ గ్రామంలో జరిగింది. బాధితుడు విజయవాడకు చెందిన మేదరమట్ల శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేదరమట్ల శ్రీధర్ తన సోదరుడు గంటా రాజేష్, స్నేహితుడు ఎలీషాలకు పది రోజుల క్రితం కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన పాస్టర్ ఎంఎస్ రాజుతో పరిచయం ఏర్పడింది. అతను అమలాపురానికి చెందిన తన స్నేహితుని వద్ద రూ.40 లక్షల విలువ చేసే నాలుగు వజ్రాలు ఉన్నాయని, అవి కేవలం రూ.15 లక్షలకే మన వశమవుతాయని నమ్మించాడు. దీంతో అన్నదమ్ములిద్దరూ స్నేహితుడు రాజును ముందువెళ్లి వజ్రాలు చూడమని, వెనుక తాము వస్తామని బుధవారం రాత్రి అమలాపురం పంపారు. వజ్రాలు తాను చూశానని, డబ్బు తీసుకుని రావడమే తరువాయన్న రాజు సూచన మేరకు గురువారం విజయవాడ నుంచి వారు ముగ్గురూ కారులో అమలాపురం వచ్చారు. ఇక్కడ జనం రద్దీ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ డీల్ అంత కరెక్టు కాదు పాశర్లపూడి రేవులో మా గెస్ట్ హౌస్ ఉంది అక్కడ డబ్బు తీసుకుని వజ్రాలు ఇస్తామని చెప్పడంతో అక్కడి నుంచి బాధితులు మధ్యాహ్నం పాశర్లపూడి రేవు దగ్గరకు వచ్చారు. తీరా ఇక్కడ వచ్చాకా ఇక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా లేవని మామిడికుదురు వెళ్దామని చెప్పడంతో ఇక్కడకు వచ్చారు. ఇక్కడకు సమీపంలోని కొమరాడలో వజ్రాలు ఇస్తామని చెప్పి అక్కడకు వెళ్లాకా కారు వెనుక మోటార్ సైకిళ్లపై వచ్చిన పాస్టర్ రాజుతో సహా ముగ్గురు వ్యక్తులు గంటా రాజేష్‌ను ఎక్కించుకుని మళ్లీ వచ్చి మిమ్మల్ని ఇద్దరినీ తీసుకు వెళ్తామని చెప్పి వెళ్లారు. పొలాల్లో రాజేష్‌తో పాటు పాస్టర్ రాజు కళ్లలో కారం కొట్టిన నిందితులు రూ.15 లక్షలు తీసుకుని పరారయ్యారు. జరిగిన విషయాన్ని బాధితులు కారులో వేచి ఉన్న మేదరమట్ల శ్రీధర్, ఎలీషాలకు చెప్పడంతో వారు లబోదిబోమన్నారు. నగరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై జి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు అల్లవరానికి చెందిన పి.రాజేష్‌గా గుర్తించి కేసు దర్యాప్తు చేపట్టారు.