వాషింగ్టన్: సాధారణంగా ర్యాప్ సింగర్స్ అంటేనే భిన్నమైన వస్త్రధారణ, హేయిర్‌కట్స్‌తో వింత పోకడలకు పోతుంటారు. ఇక హాలీవుడ్ ర్యాపర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రొటీన్‌కు భిన్నంగా ఉండేందుకు శరీరంపై కొత్తకొత్త ప్రయోగాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ అమెరికా ర్యాప్ సింగర్ లిల్ ఉజీ వెర్ట్ కూడా వెరైటీగా ఆలోచించాడు. అందుకే కోట్ల రూపాయలు విలువ చేసే పింక్ డైమండ్‌ను ఏకంగా నుదుటిపైనే అమర్చుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతర్జాతీయ ర్యాప్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న లిల్ ఇటీవల ఓ వీడియో షేర్ చేశాడు. ‘బ్యూటీ ఈజ్ పెయిన్’ అంటూ షేర్ చేసిన ఈ వీడియోలో లిల్ నుదుటిపై పింక్ డైమండ్ ధరించి కనిపించాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అవెంజర్స్ సిరీస్‌లో మార్వెల్ సూపర్ హరో పవర్‌లా ఉందంటూ అభిమానులు లిల్ గురించే చర్చించుకుంటున్నారు. (చదవండి: హత్యాయత్నం: మృతి చెందిన వ్యక్తిపై కేసు)
కాగా అతడి నుదుటిపై అమర్చుకున్న ఈ పింక్ డైమండ్ ఖరీదు రూ. 175 కోట్లు అంట. అది తెలిసి నెటిజన్లంతా కోట్లు విలువ చేసే డైమండ్‌ను మెడలో చైన్‌గా కానీ, ఉంగరంలా ధరించకుండా అలా నుదుటి ధరించడమేంటని అవాక్కవుతున్నారు. ఇక దీనిపై లిల్ స్పందిస్తూ... తన దగ్గర ఉన్న ఖరీదైన కార్లు, వాచ్‌లు, డిజైనింగ్ క్లాత్స్ కంటే ఇది అంత్యంత ఖరీదైందని, ఇది కొనేందుకు తన నాలుగేళ్ల సంపాదనను వెచ్చించినట్లు చెప్పాడు. ఈ డైమండ్ 10 నుంచి 11 క్యారెట్లు ఉంటుందని, ఇది తన ఖరీదైన ప్యాలెస్ కంటే ఎక్కువ అని తెలిపాడు. దీనిని మేడలో ధరించోచ్చు కదా అని నెటిజన్ పెట్టిన కామెంట్‌కు లిల్ ఒకవేళ అది ఎక్కడైన పడిపోతే అంటూ సరదాగా సమాధానం ఇచ్చాడు. ఇక ఇది చూసిన నెటిజన్‌లు అతడిపై విమర్శలు చేస్తుంటే మరికొందరు ఆ డైమండ్ కోసం లిల్‌కు ఎవరైనా హాని చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment