ఎయిర్పోర్ట్లో రెండు కేజీల బంగారం స్వాధీనం | 2 Kgs gold seized by Customs in Shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో రెండు కేజీల బంగారం స్వాధీనం

Published Sun, Aug 17 2014 8:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

2 Kgs gold seized by Customs in Shamshabad airport

హైదరాబాద్: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి నగరానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 2 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు  స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం బ్యాంకాక్ ఎయిర్లైన్స్ విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న సదరు ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ప్రయాణికుల లగేజీలో రెండు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. దాంతో ఆ బంగారాన్నీ స్వాదీనం చేసుకుని సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement