ఎయిర్ పోర్ట్ లో కండోమ్స్ లో లిక్విడ్ గోల్డ్ పట్టివేత
Published Thu, Mar 6 2014 5:11 PM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
విమానాశ్రాయాల్లో వివిధ పద్దతుల ద్వారా అక్రమ బంగారం రవాణ చేస్తున్న నిందితులను పట్టుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువగానే మన దృష్టికి వస్తున్నాయి. బంగారాన్ని ఘన రూపంలో అక్రమ రవాణాకు ఇబ్బందులు ఏర్పడుతున్న కారణంగా ఓ వ్యక్తి ఎంచుకున్న కొత్త పద్దతి ద్వారా చేసిన ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. కోచి విమానాశ్రయంలో లిక్విడ్ గోల్డ్ (ద్రవ రూపంలో బంగారాన్ని) ను కండోమ్ లో అక్రమంగా రవాణా చేస్తూ ప్రయాణికుడు పట్టుపడ్డారు.
ప్లాస్టిక్ కంటైనర్ లో రంగుతో కూడిన ద్రవ పదార్ధాన్ని నింపిన కండోమ్స్ తనిఖీల్లో బయటపడ్డాయని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నెడుంబస్సెరీ ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడ్ని తనిఖీ చేయగా కండోమ్స్ లో అక్రమంగా రవాణా చేస్తున్న 5.345 కిలోల లిక్విడ్ గోల్డ్ బయటపడిందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement