condoms
-
ఆన్లైన్లో కండోమ్స్ ఆర్డర్.. అడ్రస్ మార్చడం మర్చిపోయాడు..
ఒక యువకుడు తెలిసి చేశాడో తెలియక చేశాడో గాని ఆన్లైన్లో కండోమ్స్ ఆర్డర్ చేశాడు. అది తానున్న చోటికి కాకుండా ఇంటికి చేరడంతో యువకుడి తల్లి షాక్ కు గురైంది. ఈ సంఘటనను ఆ యువకుడి సోదరి సోషల్ మీడియాలో పంచుకోగా నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఓ యువకుడు ఆన్లైన్ షాపింగుకు బాగా అలవాటు పడ్డాడో ఏమో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కండోమ్స్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ అయితే బాగానే చేశాడు కానీ అడ్రస్ మార్చడం మర్చిపోయాడా ప్రబుద్ధుడు. దీంతో ఆ కండోమ్స్ పార్సిల్ కాస్తా తానున్న చోటికి కాకుండా తన ఇంటికి చేరింది. ఆ యువకుడి తల్లి తన కొడుకు ఎదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడనుకుందో ఏమో ఆతృతగా పార్సిల్ తెరిచింది. లోపల కండోమ్స్ చూసి పాపం ఆ తల్లి షాక్ కు గురైంది. ఈ సంఘటనను ఆ యువకుడి సోదరి ఎలెనా ట్విట్టర్లో పోస్ట్ చేసి.. అన్నయ్య పాపం అడ్రస్ మార్చడం మర్చిపోయినట్టున్నాడు.. అమ్మ ఈ పార్సిల్ రిసీవ్ చేసుకుందని రాసి కండోమ్స్ ఫోటోను షేర్ చేసింది.. Looks like my brother forgot to change the address because my mom just received his instamart order💀💀 pic.twitter.com/BmZbLyEAtr — elena (@elena4yo) July 4, 2023 ఈ పోస్ట్ కు అతి తక్కువ వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చాలా మంది తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించగా.. అమ్మకు దిమ్మతిరిగి తమ ఫ్యామిలీ గ్రూపు నుంచి అన్నయ్యని తొలగించిందని చెబుతూ వాట్సప్ గ్రూపులో తన సోదరుడిని తొలగించిన స్క్రీన్ షాట్ పోస్ట్ చేసింది. దీంతో ట్విట్టరంతా నవ్వులమయమైంది. pic.twitter.com/FGU8tUIyuV — elena (@elena4yo) July 4, 2023 ఇవ్వాళ రేపు ఏమి కొనాలన్నా అంతా ఆన్లైన్లో నడుస్తోంది మరి. మొబైల్ ఆన్ చేసి మీట నొక్కితే చాలు కాళ్ళకు భారం తగ్గి అన్నీ కళ్ల ముందుకు వచ్చి వాలుతున్నాయి. అలాగని అన్నిటినీ ఆన్లైన్లో ఆర్డర్ చేయకుండా కొన్నిటిని వెళ్లి కొనుక్కోవడమే మంచిదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇది కూడా చదవండి: బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. ఎందుకంటే.. -
Shocking: వధువులకు ఇచ్చిన మేకప్ కిట్లలో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు..
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం చేపట్టిన సామూహిక వివాహ పథకం మరోసారి వివాదంలో చిక్కుకుంది. గతంలో వివాహానికి ముందు కొంతమంది వధువులకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పెళ్లిలో వధువులకు అందించే మేకప్ కిట్‌లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు అందజేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కన్య వివాహ/ నిఖా యోజన పథకం కింద సోమవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ పథకం ద్వారా 296 జంటలు ఒకటయ్యాయి. కాగా కొత్తగా పెళ్లైన వధువులకు ఈ పథకం కింద అందించిన మేకప్ కిట్ బాక్స్‌లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేశారు. మేకప్ కిట్ తెరిచి చూసిన వధువులు వాటిలో కండోమ్స్, బర్త్ కంట్రోల్ పిల్స్ ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. దీంతో సీఎం చౌహాన్నపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే దీనిపై జిల్లా అధికారి భుర్సింగ్ రావత్ స్పందించారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అధికారులు కండోమ్‌లు, గర్భనిరోధక మందులను పంపిణీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలను పంపిణీ చేసే బాధ్యత తమది కాదని. కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ వీటిని అందజేసే అవకాశం ఉందన్నారు. తాము కేవలం ముఖ్యమంత్రి కన్యా వివాహ/నిఖా యోజన కింద లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలోకి రూ.49,000ని ట్రాన్స్ఫర్ చేస్తామని, పెళ్లి సమయంలో ఆహారం, వాటర్, టెంట్, వాటికి సంబంధించిరూ. 6000 వేలు అందిస్తామని తెలిపారు. అయితే పంపిణీ చేసిన ప్యాకెట్లలో ఏముంటుందో తమకు తెలీదని పేర్కొన్నారు. కాగా ముఖ్యమంత్రి కన్య వివాహ/ నిఖా యోజన పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2006 ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాల మహిళలకు పెళ్లికి సాయం అందించాలనే నేపథ్యంలో దీనిని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వధువు కుటుంబానికి ప్రభుత్వం రూ.55,000 వేల అందిస్తుంది. చదవండి: Protesting Wrestlers: పతకాలు విసిరేస్తాం! నిరహార దీక్షకు దిగుతాం! Shamelessness at its peak in @ChouhanShivraj’s Govt : The @BJP4India government of #MadhyaPradesh has distributed #condoms and #contraceptivepills in the make-up boxes given under the #KanyaVivahYojana. Do you have any shame left, #CM Ji❓ pic.twitter.com/Cz8WRIGgcl — MD Kareem (@MDKareemWadi) May 30, 2023 -
అక్కడ 25 ఏళ్లలోపు మహిళలకు కండోమ్స్ ఫ్రీ
పారిస్: లైంగిక వ్యాధుల బాధితుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. లైంగిక సాంక్రమిక వ్యాధుల (ఎస్టీడీ) నియంత్రణకు దేశంలో 25 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు వారికి 2023 జనవరి నుంచి ఉచితంగా కండోమ్స్ అందిస్తామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ శుక్రవారం ప్రకటించారు. వాటిని ఏ ఫార్మసీలోనైనా పొందొచ్చని చెప్పారు. పురుషులకు మాత్రం వాటిని ఉచితంగా ఇవ్వబోరు. ఫ్రాన్స్‌లో అదుపులోలేని ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు పెరిగిపోయిన ఈ తరుణంలో అవాంఛిత గర్భం దాలిస్తే, అమ్మాయిలు, మహిళల ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువయ్యే అవకాశముందని, అందుకే వారికే వీటిని ఉచితంగా అందివ్వనున్నారని తెలుస్తోంది. హెచ్ఐవీ, ఇతర లైంగిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు విస్తృత స్థాయిలో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రాన్స్‌లో 2020, 2021 ఏడాదిలో లైంగిక సాంక్రమిక వ్యాధు(ఎస్టీడీ)లు ఏకంగా 30 శాతం పెరిగాయి. 2018లో ఫ్రాన్స్ ఒక పథకం తెచ్చింది. పౌరులు కండోమ్స్ కొనుగోలు చేస్తే వాటికయిన ఖర్చును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ ఏడాది తొలినాళ్లలో 26 ఏళ్లలోపు మహిళలకు గర్భనిరోధకాలు ఉచితంగా పంపిణీచేసింది. డాక్టర్ ప్రిస్రిప్షన్ లేకుండానే 26 ఏళ్లలోపు మహిళలకు ఉచితంగా లైంగికవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఫ్రాన్స్‌లో అబార్షన్ ఉచితంగా చేస్తారు. ఇదీ చదవండి: నమ్మకమే మార్గం.. మోసమే లక్ష్యం -
షాకింగ్: కండోమ్స్, గర్భనిరోధకాలతో స్కూల్‌కు విద్యార్థులు..!
బెంగళూరు: హైస్కూల్ విద్యార్థుల బ్యాగులను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. విద్యార్థుల బ్యాగుల్లో మొబైల్ ఫోన్స్, కండోమ్స్, నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధకాలు, లైటర్స్, సిగరెట్స్, వైట్నర్స్ వంటివి చూసి నివ్వెరపోయారు. ఈ సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఆ బ్యాగులు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు చెందినవి కావటం గమనార్హం. విద్యార్థులు మొబైల్ ఫోన్స్ తీసుకొస్తున్నారనే ఫిర్యాదుతో నగరంలోని పలు పాఠశాలల్లో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయాలని పాఠశాలలను ఆదేశించింది కర్ణాటకలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(కేఏఎంఎస్). ‘ఒక విద్యార్థి బ్యాగులో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు(ఐ-పిల్) లభించాయి. అలాగే వాటర్ బాటిల్లో లిక్కర్ దొరికింది.’ అని కేఏఎంఎస్ ప్రధాన కార్యదర్శి డి.శశికుమార్ తెలిపారు. ఆకస్మిక తనిఖీల అనంతరం కొన్ని పాఠశాలలు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులే షాక్‌కు గురయ్యారని నగరభావి స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనలో తేడా వచ్చినట్లు గుర్తించినట్లు చెప్పారని వెల్లడించారు. వారిలో మార్పు తీసుకొచ్చేందుకు మానసిక చికిత్స అందించేందుకు 10 రోజుల పాటు సెలవులు ఇచ్చామన్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. పలువురు నెటిజన్లు తమ ఆలోచనలను ట్విటర్లో షేర్ చేశారు. తాము స్కూల్‌కి వెళ్లినప్పుడు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్లేవాళ్లం అంటూ ఓ యూజర్ పేర్కొన్నారు. ఈ ఇంటర్నెట్ కాలంలో తల్లిదండ్రుల పాత్ర చాలా క్లిష్టమైనదని మరొకరు రాసుకొచ్చారు. ఇదీ చదవండి: Labour Union Protest: పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్! -
ఇదేం యుద్ధంరా బాబు! బర్గర్లు, ఫోన్లే కాదు ఆఖరికి కండోమ్ కొనాలన్నా కష్టమే?
నాటోతో వచ్చిన ముప్పు సంగతేమిటో కానీ.. ఉక్రెయిన్‌పై పుతిన్ తలపెట్టిన యుద్ధం రష్యన్లకు ఇప్పటికప్పుడు కష్టాలను తెచ్చిపెడుతోంది. యాపిల్ ఫోన్లు, మెక్‌డొనాల్డ్ బర్గర్ల కోసం జనాలు ఎగబడుతున్నారు. మరోవైపు చాపకింద నీరులా ఆ దేశంలో కండోమ్‌ల కొరత ఏర్పడుతోంది. అక్కడి జనాలు అవసరానికి మించి గర్భనిరోధక సాధనమైన కండోమ్‌లు కొనుగోలు చేస్తున్నారు. రష్యలోని సూపర్ మార్కెట్లు, మెడికల్ స్టోర్లలో కండోమ్‌ల అమ్మకాలు భారీ స్థాయిలో సాగుతున్నాయి. డూరెక్స్ బ్రాండ్‌తో కండోమ్స్ తయారు చేసే రెకిట్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది మార్చితో పోల్చితే మొదటి పదిహేను రోజుల్లోనే రష్యాలో కండోమ్‌ల అమ్మకాలు 170 శాతం పెరిగాయి. ఇప్పటి వరకు సగటు అమ్మకాలను పోల్చినా ఈ ఏడాది 36 శాతం అమ్మకాలు పెరిగాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరసిస్తూ అమెరికా సహా పలు యూరప్ కంట్రీలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ దేశాలకు చెందిన కంపెనీలో రష్యాతో తమ వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటున్నాయి. దీంతో కండోమ్‌లు దేశంలో లభించవేమోనన్న పుకారు బయల్దేరింది. ఫలితంగా రష్యన్లు భవిష్యత్తు అవసరాల కోసం అన్నట్టుగా వేలం వెర్రిగా మెడికల్ స్టోర్లు, సూపర్ మార్కెట్లలో కండోమ్ ప్యాకెట్లను కొనేస్తున్నారు. కండోమ్‌లు భారీ ఎత్తున అమ్ముడైపోవడం పట్ల అక్కడి మార్కెట్ నిపుణులు స్పందిస్తూ వాస్తవానికి రష్యపై ఆర్థిక ఆంక్షలు విధించిన దేశాలకు కండోమ్ తయారీ కంపెనీలు పెద్ద సంబంధం లేదు. కానీ కండోమ్ తయారీలో ఉపయోగించే లేటెక్స్ పదార్థాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే యుద్ధం కారణంగా డాలర్‌తో పోల్చితే రూబుల్ విలువ భారీగా పడిపోయింది. దీంతో లేటెక్స్ దిగుమతి చేయాలంటే భారీ ఖర్చు తప్పదు. అంతిమంగా ఈ భారం ధరల పెరుగుదల రూపంలో ప్రజలపైనే పడుతుంది. ఆర్థిక ఆంక్షల ప్రభావం, రూబుల్ విలువ పడిపోవడంతో అక్కడి బిజినెస్ సెక్టార్‌కి చెందినవారు ఆందోళనగా ఉన్నారు. అందువల్లే ఏ వస్తువుకు డిమాండ్ ఉన్న ఎక్కువ రేటుకు అమ్ముతూ సాధ్యమైనంత వరకు లాభాలు పోగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వెరసి రష్యా చేపట్టిన యుద్ధం ఆ దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. -
ఐదో తరగతి విద్యార్థులకు ఫ్రీ కండోమ్స్.. తల్లిదండ్రుల ఆగ్రహం
వాషింగ్టన్/చికాగో: యుక్త వయసులో పిల్లల్లో కలిగే శారీరక, మానసిక మార్పుల గురించి వారితో చర్చిస్తే ఎంతో మేలని మానసిక నిపుణులు సలహా ఇస్తుంటారు. ఈ క్రమంలో పాఠశాల విద్యాబోధనలో భాగంగా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకంగా బోధిస్తారు. అయితే దేని గురించి అయినా చెప్పే పద్దతిలో.. అవసరం ఉన్న వరకు తెలియజేస్తే తప్పులేదు. అలా కాదని అత్యుత్సాహం ప్రదర్శిస్తే అబాసు పాలవ్వాల్సి వస్తుంది. అమెరికాలోని చికాగో ఎడ్యుకేషన్ బోర్డు కూడా తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటుంది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఐదో తరగతి.. ఆపై విద్యార్థులకు పాఠశాలలో కండోమ్స్ ఇవ్వాలని చికాగో ఎడ్యుకేషన్ బోర్డ్ నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. చికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గతేడాది డిసెంబర్లో సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించింది. దీనిలో భాగంగా విద్యార్థులకు 'ఆరోగ్యకర సంబంధాలు-సమ్మతి, శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం, కౌమార యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణులు, లైంగిక ఆరోగ్యం' తదితర అంశాలను విద్యార్థులకు బోధించనున్నారు. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులకు దీనిపై అభ్యంతరం ఉంటే లిఖితపూర్వకంగా బోర్డుకు, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇక సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎలిమెంటరీ స్కూళ్లలో 250 వరకు, హైస్కూళ్లలో ఒక వెయ్యి వరకు కండోమ్స్‌ను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. ఇవి పూర్తిగా ఉచితం. విద్యార్థుల్లో లైంగిక వ్యాధులు, అవాంఛిత గర్భాలను నిరోధించేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు సీపీఎస్(చికాగో పబ్లిక్ స్కూల్స్) అధికారులు చెబుతున్నారు. అంతేకాక బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు కండోమ్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కండోమ్స్ అయిపోతే ప్రిన్సిపాల్స్ సదరు ఉన్నతాధికారులకు తెలియజేసి.. తెప్పించుకోవాలని తెలిపింది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇలా ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచాలన్న పాలసీని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే కేవలం 12 ఏళ్ల వయసు ఉంటుందని... అప్పటికీ వారు ఇంకా చిన్నపిల్లలే అని చెబుతున్నారు. పిల్లలకు కండోమ్స్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదని... దీనిపై మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నారు. కానీ వైద్యులు, మానసిక విశ్లేషకులు మాత్రం విద్యార్థుల ఆరోగ్య రీత్యా ఈ పాలసీ చాలా అవసరమని.. విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచకపోతే... వారికి సరైన జాగ్రత్తలు చెప్పకపోతే... వారికి చెడు జరిగే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యకర నిర్ణయాలు తీసుకునేందుకు కచ్చితమైన, స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కు యువతకు ఉందన్నారు. తద్వారా వారితో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారని పేర్కొన్నారు. -
కండోమ్‌లు ఇస్తాం.. కానీ, వాడొద్దు
టోక్యో: సమ్మర్ ఒలంపిక్స్ 2020(2021) నిర్వాహకులు ఆటగాళ్లకు ఒక ముఖ్యమైన గమనిక తెలియజేశారు. ఒలంపిక్ విలేజ్‌లో సోషల్ డిస్టెన్స్ అమలులో ఉన్నందున అథ్లెట్స్ కండోమ్‌లను ఉపయోగించడానికి వీల్లేదని పేర్కొన్నారు. బదులుగా వాటిని తమ వెంట ఇంటికి(స్వంత దేశాలకు) తీసుకెళ్లొచ్చని తెలిపారు. ఒలంపిక్స్ నేపథ్యంలో ఆటగాళ్లకు కండోమ్‌లు సరఫరా చేస్తుండడం షరా మామూలే. 1988 సియోల్ ఒలంపిక్స్ నుంచి హెచ్ఐవీ-ఎయిడ్స్ మీద అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ పని చేస్తున్నారు. అయితే కరోనా నిబంధనలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఈసారి సోషల్ డిస్టెన్స్ కఠినంగా అమలయ్యేలా చూస్తున్నామని, అందుకే కండోమ్‌లు ఇంటికి తీసుకెళ్లాలని ఈసారి ఆటగాళ్లకు సూచించనున్నట్లు ఓ ప్రముఖ మీడియా హౌజ్ అడిగిన ప్రశ్నకు కమిటీ సీఈవో తోషిరో ముటో బదులిచ్చారు. ఇదిలా ఉంటే ఈసారి ఆటగాళ్ల కోసం లక్షా యాభై వేల కండోమ్‌లను నిర్వాహకులు సిద్ధం చేశారు. కాగా, తాజా ప్రకటనతో ఆటగాళ్లు దూరంగా ఉండాలని, ఒలంపిక్ విలేజ్‌లో శృంగారంలో పాల్గొనడానికి వీల్లేదని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఇక కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆటగాళ్లకు భోజన సదుపాయాలు అందించడం దగ్గరి నుంచి ప్రతీది ఈసారి ఛాలెంజింగ్‌గా ఉండబోతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధం విధించారు కూడా. చదవండి: మాకొద్దీ చైనా దుస్తులు! -
నిరసన: జడ్జికి కండోమ్‌లు పంపిన మహిళ..
ముంబై: లైంగిక దాడి కేసులో వివాదాస్పద తీర్పులు వెల్లడించిన బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ జడ్జి జస్టిస్ పుష్ప గనేడివాలా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద తీర్పులు ఆమె పదోన్నతికి ఎసరు పెట్టాయి. కేంద్రం ఆమెకు పదోన్నతి కల్పించకూడదనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఓ మహిళ పుష్ప గనేడివాలా తీర్పులను వ్యతిరేకిస్తూ.. నిరసనగా జడ్జికి కండోమ్‌లు పంపింది. అహ్మదాబాద్‌కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు దేవ్‌శ్రీ త్రివేది.. జస్టిస్ గనేడివాలా పని చేస్తోన్న బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ రిజిస్ట్రీతో పాటు ముంబైలోని మరో 12 వేర్వేరు ప్రదేశాలకు కండోమ్‌లు పంపినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా దేవ్‌శ్రీ త్రివేది మాట్లాడుతూ.. ‘‘అన్యాయాన్ని నేను సంహించలేను. గనేడివాలా తీర్పు వల్ల ఓ మైనర్ బాలికకు న్యాయం జరగలేదు. ఆమెని సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఆమె తీర్పు పట్ల నా నిరసన తెలియజేయడం కోసం ఇలా కండోమ్ ప్యాకెట్లు పంపాను. మొదట ఈ నెల 9న కొన్ని ప్యాకెట్లు పంపాను. అవి చేరుకున్నట్లు రిపోర్ట్ అందింది. ఆ తర్వాత మరో 12 చోట్లకు కండోమ్ ప్యాకెట్లు పంపాను అని తెలిపింది. ‘‘ఓ మహిళగా నేను చేసిన పని తప్పని భావించడం లేదు. దీని గురించి నాకు ఎలాంటి చింత లేదు. మహిళలు తమ హక్కుల కోసం పోరాడాలి. ఇక జస్టిస్ గనేడివాలా లాంటి వారి వాల్ల మగాళ్లు మరింత రెచ్చిపోతారు. ఆడవారిపై అఘాయిత్యాలు మరింత పెరుగుతాయి. అప్పుడు అత్యాచారాలు స్త్రీల దుస్తుల మీదుగానే జరుగుతాయి’’ అంటూ దేవ్‌శ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బాలికలపై లైంగిక దాడుల కేసులో జస్టిస్ పుష్ప గనేడివాలా వివాదాస్పద తీర్పులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘‘నేరుగా బాలిక శరీరాన్ని తాకుకుండా జరిగే లైంగిక దాడి పోక్సో కిందకు రాదని’’.. ‘బాలిక చేతిని పట్టుకుని అతను ప్యాంట్ జిప్ తెరిచినంత మాత్రాన లైంగిక దాడిగా పరగణించలేం’’ అంటూ సంచలన తీర్పులు వెల్లడించారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. చదవండి: చర్మాన్ని చర్మం తాకలేదు గనుక.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు -
వలస కూలీలకు ఉచితంగా కండోమ్‌ల పంపిణీ
పట్నా: సొంత రాష్ట్రం చేరుకున్న వలస కూలీలకు బిహార్ ప్రభుత్వం ఉచితంగా కండోమ్‌లను పంపిణీ చేస్తోంది. బిహార్‌కు చెందిన 30 లక్షల మంది వలస కార్మికులు వివిధ దశల్లో రాష్ట్రానికి చేరుకున్నారు. వారిలో కొందరు ఇప్పటికే 14 రోజుల క్వారంటైన్ ముగిసి ఇళ్లకు చేరగా.. మరికొంతమంది హోం క్వారంటైన్లో ఉన్నారు. ఈక్రమంలో అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ కండోమ్‌ల పంపిణీ నిర్ణయం తీసుకుంది. క్వారంటైన్ సెంటర్లలో ఉన్నవారికి, ఇళ్లకు చేరుకున్న వలస కూలీలకు కండోమ్‌లు పంపిణీ చేస్తున్నామని బిహార్ ఆరోగ్యశాఖకు చెందిన డాక్టర్ ఉత్పల్ దాస్ వెల్లడించారు. కేర్ ఇండియా సంస్థ సహకారంతో ఈ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8.77 లక్షల మంది క్వారంటైన్ ముగించుకుని ఇళ్లకు వెళ్లారని, మరో 13 లక్షల మంది క్వారైంటైన్ సెంటర్లలో ఉన్నారని చెప్పారు. బ్లాక్‌లు, జిల్లా కేంద్రాల్లో ఇంకా 5.30 లక్షల మంది క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. అవాంఛిత గర్భధారణ విషయంలో ఇంటికి వెళ్లే ముందు వలస కూలీలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇది పూర్తిగా కుటుంబ నియంత్రణ కోసం చేపట్టిన కార్యక్రమం అని కోవిడ్-19తో ఎటువంటి సంబంధం లేదని ఉత్పల్ దాస్ స్పష్టం చేశారు. ఆరోగ్యశాఖ అధికారిగా జనాభాను అదుపులో ఉంచడం తమ బాధ్యత అన్నారు. కాగా, బిహార్‌లో ఈ నెల 15తో క్వారంటైన్ సెంటర్ల సేవలు ముగియనున్నాయి. బిహార్ జనాభా 11.5 కోట్లు కావడం గమనార్హం. -
ఇక గర్భ నిరోధానికి ఇంజెక్షన్లు!
అనవసరంగా గర్భం రాకూడదనుకుంటే ఆడవాళ్లకు టూబెక్టమీ ఆపరేషన్ సహా పలు మార్గాలు ఉన్నాయి. టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, ఇంప్లాంట్స్, నిరోధ్‌లు. టూబెక్టమీ మినహా మిగతా అన్నింటి వల్ల మహిళలకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మగవాళ్లకు వాసెక్టమీ ఆపరేషన్‌తోపాటు నిరోధ్‌లు ఉన్నాయి. నిరోధ్‌ల వల్ల భావ సంతప్తి కలగదనే భావం చాలా మందిలో ఉండడంతో ఆడవాళ్లకు తరహాలో ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ల కోసం భారత పరిశోధకులు కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు జరుపుతున్నారు. చివరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఈ దిశగా 13 ఏళ్లపాటు ప్రయోగాలు నిర్వహించి ఇప్పుడు విజయం సాధించింది. గర్భ నియంత్రణ కోసం మగవాళ్లకు ఓ ఇంజెక్షన్‌ను కనిపెట్టింది. ఈ ఇంజెక్షన్‌ను వరి బీజాలకు ఇస్తారు. అందుకు నొప్పి తెలియకుండా అనెస్తీసియా ఇవ్వాల్సి ఉంటుంది. వరి బీజం నుంచి వీర్యం బయటకు రాకుండా ఈ ఇంజెక్షన్ అడ్డుకుంటుందని సీనియర్ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ మీడియాకు తెలిపారు. చట్టబద్ధమైన మూడు ట్రయల్స్‌ను ఐసీఎంఆర్ విజయవంతంగా పూర్తి చేసిందని పాతికేళ్లపాటు ఈ విషయంలో పరిశోధనలు సాగించిన శర్మ చెప్పారు. ఈ ఇంజెక్షన్ ఉత్పత్తికి లాంఛనంగా భారత్ లైసెన్స్‌తోపాటు ‘అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్’ అనుమతి తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. మరో ఆరు నెలల్లో ఈ ఇంజెక్షన్ అందుబాటులోకి రానుంది. అమెరికాలాంటి దేశాల్లో మహిళలు గర్భం రాకుండా 70శాతం మంది మాత్రలు, ఇంజెక్షన్లు వాడుతున్నారు. 22 శాతం మహిళలు టూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. భారత్‌లో 50 శాతం మంది మహిళలు మాత్రమే గర్భనిరోధక మందులు, ఇంజెక్షన్లు వాడుతుండగా, మిగతా మహిళల్లో ఎక్కువ మంది మగవారి నిరోధ్‌లను ప్రోత్సహిస్తున్నారు. ఏ నిరోధక సాధనాలను వాడని స్త్రీ, పురుషులు కూడా భారత్‌లో గణనీయంగా ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు కనుగొన్న ఇంజెక్షన్ ఎంతో ఉపకరిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ప్రపంచంలో గర్భ నిరోధానికి మగవారికి ఇంజెక్షన్ పద్ధతిని ప్రవేశపెడుతున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించబోతోందని డాక్టర్ శర్మ తెలిపారు. 303 మందికి ఈ ఇంజెక్షన్ ఇవ్వగా 97.3 శాతం మందికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఆయన చెప్పారు. -
కడుపు నొప్పి అని వెళితే.. కండోమ్స్ తెమ్మన్నాడు
రాంచీ : కడుపునొప్పితో బాధపడుతున్న ఓ మహిళ ఆస్పత్రికి వెళితే.. ప్రిస్కిప్షన్‌లో కండోమ్స్ రాసిచ్చాడో కీచక డాక్టర్. అది తెలియక మెడికల్ దుకాణానికి వెళ్లిన మహిళ.. మందుల చీటీ చూపించి మందులు అడగ్గా కండోమ్స్ ప్యాకెట్‌ను చేతిలో పెట్టారు. ఇది చూసి కంగుతిన్న మహిళ సదరు డాక్టర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. జిల్లాకు చెందిన నాలుగో తరగతి మహిళా ఉద్యోగికి ఈనెల 23న కడుపు నొప్పి రావడంతో ఘాట్షీలా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షలు నిర్వహించిన కాంట్రాక్ట్ డాక్టర్ అస్రప్ మందులు తెచ్చుకోమని ప్రిస్కిప్షన్ రాసిచ్చారు. డాక్టర్ రాసిచ్చిన మందుల చీటీని తీసుకున్న సదరు మహిళ.. సమీపంలో ఉన్న మెడికల్ దుకాణానికి వెళ్లి మందులు ఇవ్వమని అడిగారు. ప్రిస్కిప్షన్ చూసిన సిబ్బంది ఆమెకు కండోమ్స్ ప్యాకెట్‌ను అందజేశారు. ఇదేంటి మందులు అడిగితే ఈ ప్యాకెట్ ఇచ్చారని సదరు మహిళ సీరియస్ అవ్వగా.. మందుల చీటీలో అదే రాసి ఉందని మెడికల్ సిబ్బంది చెప్పింది. దీంతో షాక్‌కు గురైన మహిళ.. జార్ఖండ్ ముక్తి మోర్చా శాసన సభ్యులు కునాల్ సారంగికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కునాల్ సారంగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని సీనియర్ డాక్టర్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సీనియర్ డాక్టర్లు విచారణ ప్రారంభించారు. మెడికల్ విభాగ సిబ్బంది, ఓ మానసిన వైద్యుడుతో కూడిన కమిటీ ఈ ఘటనపై విచారణ జరుపుతోందని ఆస్పత్రి ఇన్చార్జ్ శంకర్ పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై డాక్టర్ అస్రఫ్ ఇంతవరకూ స్పందిచకపోవడం గమనార్హం. -
అఆ ట్యాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడొచ్చు
నా వయసు 23. బరువు 55కిలోలు, నాకు సిజేరియన్ ద్వారా ఒక బాబు పుట్టాడు. పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించు కోలేదు. లూప్ వేయించుకున్నాను కానీ కొన్ని రోజులకు దురద రావడంతో దాన్ని తీయించేసుకున్నాను. మావారు కండోమ్స్ వాడుతున్నారు. ఒకసారి కండోమ్స్ వాడనందు వల్ల అనుకోకుండా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. డాక్టర్‌ను కలిసి నాకు అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని చెబితే, ఏవో మందులు ఇచ్చారు. అవి వేసుకున్న తర్వాత ఎనిమిది రోజుల వరకు నాకు బ్లీడింగ్ అయింది. ఆ ట్యాబ్లెట్స్ నేను ఎన్ని సంవత్సరాల వరకు వాడవచ్చు? దీని వల్ల నాకు ఏమైనా ప్రమాదం ఉందా? – సుకన్య, చౌటుప్పల్ మొదటి బాబు తర్వాత అప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నారు కాబట్టి గర్భం రాకుండా ఉండటానికి తాత్కాలిక పద్ధతులను అనుసరించాలి. అసలింక పిల్లలు వద్దనుకుంటే.... కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. అంటే మీకైతే ట్యూబెక్టమీ ఆపరేషన్, మీవారికైతే వేసెక్టమీ ఆపరేషన్. తాత్కాలిక పద్ధతులు అంటే.. ఇవి వాడినంత కాలమే గర్భం రాదు, ఆపిన తర్వాత గర్భం వస్తుంది. వీటిలో లూప్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, కండోమ్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ వంటివి ఎన్నో ఉంటాయి. ఇవి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, కొందరికి సెట్ అవుతాయి. మరికొందరికి సెట్ అవ్వవు. ఇవి ఫెయిలై గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మీకు డాక్టర్ ఇచ్చినవి అనుకోని పరిస్థితుల్లో గర్భం వచ్చి, గర్భం వద్దనుకుంటే ఎప్పుడో ఒకసారి అదీ గర్భం రెండునెలల లోపు ఉంటే వాడటానికి మాత్రమే. అంతేకానీ గర్భం వచ్చినప్పుడల్లా అబార్షన్ అవ్వడానికి కాదు. వీటి వల్ల 100 శాతం అబార్షన్ అవుతుందని చెప్పలేం. బ్లీడింగ్ అయినప్పటికీ 10–15 శాతం మందిలో ముక్కలు ఉండిపోవడం, వాటివల్ల అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు వచ్చి.. అప్పటికీ డాక్టర్‌ను సంప్రదించకపోతే ప్రాణాపాయం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో బ్లీడింగ్ అయినా గర్భం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ గర్భాన్ని అలాగే ఉంచుకుంటే పుట్టబోయే బిడ్డలో అవయవలోపాలు, మానసిక, శారీరక లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇవి ఏదో ఒకసారి పని చేసిందని, ప్రతిసారీ పని చేస్తుందనే నమ్మకం లేదు. ఇవి వాడేముందు ఒకసారి స్కానింగ్ చేయించుకొని గర్భాశయంలో గర్భం ఉందా లేదా.. ఉంటే ఎంత సైజు, ఎన్ని వారాలు ఉందో చూసుకొని డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. వాడిన 10–15 రోజుల తర్వాత కూడా మరోసారి స్కానింగ్ చేయించుకొని, మొత్తంగా అబార్షన్ అయిందా లేదా, ఇంకా ఏమైనా ముక్కలు ఉన్నాయా అనేది తెలుసుకోవడం తప్పనిసరి. గర్భం 7–8 వారాలు ఉన్నప్పుడే వీటిని వాడటం మంచిది. కొంతమందిలో గర్భం ట్యూబ్‌లో ఉన్నప్పుడు స్కానింగ్ చేయించుకోకుండా, అబార్షన్‌కు మందులు వాడితే ట్యూబ్ పగిలి, కడుపులో అధిక రక్తస్రావమై ప్రాణానికి ముప్పుగా మారొచ్చు. కాబట్టి మీరు ఈ కిట్‌ను గర్భం వచ్చినప్పుడల్లా వాడాలనుకునే ఆలోచనను మానేయండి. ఇంక పిల్లలు వద్దనుకుంటే మీరు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు లేదా మీవారు సింపుల్‌గా అయిపోయే వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. నా వయసు 45. రెండేళ్ల క్రితమే పీరియడ్స్ ఆగిపోయాయి. కానీ నెల క్రితం మూడు రోజుల పాటు బ్లీడింగ్ కనిపించింది. ఈ నెల కూడా దాదాపు ఆ తేదీలోనే బ్లీడింగ్ కనిపించింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. నా గర్భసంచికి ఏదైనా సమస్య వచ్చిందా లేదా ఇంకేమైనా సమస్య ఉందా, దయచేసి చెప్పగలరు. – సత్యవేణి, గాజువాక ఆడవారిలో పీరియడ్స్ ఆగిపోయిన సంవత్సరం తర్వాత కాలాన్ని మెనోపాజ్ దశ అంటారు. ఈ సమయంలో అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ ఆగిపోయిన సంవత్సరం తర్వాత బ్లీడింగ్ అవ్వడాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. గర్భాశయం లోపల పొరలో ఎండోమెట్రియల్ పాలిప్ ఏర్పడటం వల్ల గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, పుండ్లు, ఎండోమెట్రియల్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్, ఈస్ట్రోజన్ మాత్రలు వాడటం వల్ల ఎండోమెట్రియల్ పొర పెరగడం వల్ల, అండాశయాలలో గడ్డలు వంటి అనేక కారణాల వల్ల పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అవ్వవచ్చు. దీనిని అశ్రద్ధ చెయ్యడం అంత మంచిది కాదు. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, స్పెక్యులమ్ పరీక్ష, స్కానింగ్, పాప్ స్మియర్ వంటి పరీక్షలు చేయించుకోండి. అవసరమైతే ‘డి అండ్ సి’ పరీక్ష చేసి ముక్కని ఎండోమెట్రియల్ బయాప్సీ, సెర్వికల్ బయాప్సీకి పంపించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత పరీక్షలో వచ్చే రిపోర్ట్‌ను బట్టి చికిత్స సరిపోతుందా? లేక గర్భాశయాన్ని తొలగించవలసి వస్తుందా అనే నిర్ణయానికి రావొచ్చు. మా అత్తగారి వయసు 48. షుగర్, బీపీ లేవు. కానీ కొన్నాళ్లుగా పొత్తి కడుపులో కుడిపక్క నొప్పి వస్తోంది. అది కిడ్నీ వరకూ వచ్చింది. కిందికి వంగినప్పుడల్లా నొప్పి వస్తోందని అనడంతో యూరాలజిస్టుకు చూపించాం. స్కాన్ చేసి ఏ సమస్యా లేదన్నారు. ఏవో మందులిస్తే వాడినా తగ్గలేదు. ఆకలి లేదు. రాత్రిళ్లు ఐదారుసార్లు యూరిన్‌కి వెళ్లాల్సి వస్తోంది. అండాశయ క్యాన్సర్ ఉన్నవాళ్లకి ఈ లక్షణాలుంటాయని తెలిసింది. అది నిజమేనా? – స్వర్ణలత, తాడేపల్లిగూడెం అండాశయ క్యాన్సర్ ఉంటే పొట్టలో ఇబ్బంది, ఏదో తెలియని నొప్పి, పొట్ట ఉబ్బడం, అలసిపోవడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, బద్ధకం, మందులు వాడినా తగ్గకపోవడం వంటి లక్షణాలుంటాయి. అయితే ఏ గ్యాస్వల్లో, ఎసిడిటీ వల్లో అలా ఉంటోందని అనుకుని చాలామంది ఏవో మందులు వాడేసి సమయం వృథా చేస్తుంటారు. అండాశయ క్యాన్సర్‌ని ఆరంభ దశలో కనుక్కోవడం చాలా కష్టం. మెల్లగా పెరిగేకొద్దీ స్కానింగ్‌లో చిన్న గడ్డలాగా లేదా కాంప్లెక్స్ సిస్ట్లాగా కనిపిస్తుంది. అలా అన్నీ క్యాన్సర్ గడ్డలే కానక్కర్లేదు. నిర్ధారణ కోసం ఇ్చ125, ఇఉఅ, అఊ్క వంటి ట్యూమర్ మార్కర్స్ రక్తపరీక్షలు చేయించు కోవాల్సి ఉంటుంది. అవసరమైతే సీటీ, ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకుంటే వ్యాధి ఎంతవరకూ పాకిందో తెలుస్తుంది. వ్యాధి ముదిరిన తర్వాత స్కాన్ చేస్తే అండాశయంలో పెద్ద పెద్ద ట్యూమర్లు, పొట్టలో నీరు చేరడం వంటివి కనిపిస్తాయి. మొదటి స్టేజిలోనే ఉంటే అబ్డామినల్ స్కానింగ్‌లో అంతగా ఏమీ కనిపించదు. ట్రాన్స్ వెజైనల్ పెల్విక్ స్కాన్ చేయించుకుంటే అండాశయాల్లో ఏవైనా చిన్న చిన్న గడ్డలు లేదా ఏవైనా అనుమానాస్పద మార్పులు ఉంటే తెలుస్తుంది. కొందరికి కనిపించకుండా మిస్సయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ వ్యాధి కనుక నిర్ధారణ అయితే... స్టేజిని బట్టి ఆపరేషన్ ద్వారా ట్యూమర్ తొలగించి, చుట్టుపక్కల ఏమైనా పాకిందా లేదా అనేది గమనించి, పక్కన ఉన్న టిష్యూస్‌ని కూడా బయాప్సీకి పంపించడం జరుగుతుంది. బయాప్సీ రిపోర్ట్‌ని బట్టి తర్వాత అవసరాన్ని బట్టి కీమోథెరపీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పిన అన్ని లక్షణాలకీ క్యాన్సరే కారణం అవ్వాలని లేదు. కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పేగుల్లో టీబీ ఉన్నా కూడా ఈ లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి మీరోసారి డాక్టర్ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, తద్వారా చికిత్స తీసుకోండి. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
ట్రిమ్మర్‌కు బదులు కండోమ్స్ ప్యాకెట్లు!
కోల్‌సిటీ(రామగుండం): ఆన్లైన్ సంస్థల మోసం మరోసారి వెలుగు చూసింది. గడ్డం గీసుకోవడానికి ఉపయోగించే ఎలక్ట్రిక్ షేవర్ (ట్రిమ్మర్) మిషన్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే... కస్టమర్‌కు కండోమ్ ప్యాకెట్లు పంపించిన విడ్డూరమైన సంఘటన గోదావరిఖనిలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... గోదావరిఖని లక్ష్మీనగర్‌లో ఎనగందుల శ్రీనివాస్ సెలూన్‌నిర్వహిస్తున్నాడు. కస్టమర్లకు మెరుగైన సేవలందించడం కోసం ఇటీవల ఎలక్ట్రిక్‌షేవర్ మిషన్ కొనుగోలు చేయాలని స్మార్ట్‌ఫోన్ ద్వారా ఓ ప్రముఖ ఆన్లైన్ కంపెనీలో ఆర్డర్ చేయడంతో పంపించారు. షేవర్‌ను వాడకముందే అది పని చేయలేదు. దీంతో ఆన్లైన్ సంస్థకు ఫిర్యాదు చేయడంతో, షేవర్‌ను స్వాధీనం చేసుకొని డబ్బులు తిరిగి పంపించారు. సదరు కంపెనీపై నమ్మకం ఏర్పడడంతో ఈనెల 11న మరో షేవర్ మిషన్ కొనుగోలుకు అదే సంస్థకు ఆర్డర్ ఇచ్చారు. ఆదివారం కొరియర్ బాయ్ ఇంటికి వచ్చి పార్సిల్ ఇచ్చాడు. తీరా దాన్ని తెరిచి చూడగా దాంట్లో కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. విస్తూపోయిన బాధితుడు హుటాహుటిన సదరు కొరియర్ కార్యాలయానికి వెళ్లి నిలదీశాడు. తమకు సంబంధం లేదని, ఆర్డర్ ఇచ్చిన ఆన్లైన్ సంస్థకే ఫిర్యాదు చేయాలని చెప్పి తప్పించుకున్నారు. దీంతో సదరు సంస్థకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడంతో, ఆర్డర్ చేసిన వస్తువుకు మరోసారి పరిశీలించి పంపిస్తామని అప్పటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. కస్టమర్ చేతికి రిటన్ ఆర్డర్‌గా బుక్ చేసిన షేవింగ్ మిషన్ పార్సిల్ వచ్చాక, కండోమ్ ప్యాకెట్లను తిరిగి పంపించాలని సంస్థ ప్రతినిధులు సూచించారని బాధితుడు తెలిపాడు. తక్కవ ధరలో లభిస్తున్నాయనే ఆశతో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇలాంటి మోసాలే జరుగుతాయని పలువురు వెల్లడిస్తున్నారు. అయితే ఇలాంటి మోసాలపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. -
కండోమ్ రీసైక్లింగ్ కేంద్రంపై దాడి
నాచారం: నాచారం దుర్గానగర్‌లో కండోమ్‌లను రీసైక్లింగ్ చేస్తున్న కేంద్రంపై స్థానికుల ఫిర్యాదు మేరకు శుక్రవారం నాచారం పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా నజీర్ అనే వ్యక్తి నాచారం దుర్గానగర్‌లో అక్రమంగా కండోమ్స్ రీసైక్లింగ్ చేస్తున్నాడు. దీంతో కాలనీలో దుర్గందం వెదజల్లుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా కండోమ్ రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. -
రైల్వేస్టేషన్లలో శానిటరీ నాప్కిన్ల అమ్మకం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల లోపల, బయట శానిటరీ నాప్కిన్లతో పాటు కండోమ్స్‌ను అమ్మాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వేస్టేషన్ల సమీపంలో నివసించే ప్రజల కోసం ఉచిత మరుగుదొడ్లను నిర్మించాలన్న ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఈ మేరకు అధికారులు రూపొందించిన ‘టాయిలెట్ పాలసీ’కి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు రైల్వేస్టేషన్ల సమీపంలో మరుగుదొడ్లను నిర్మించాలని సూచించినట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రైల్వేస్టేషన్ల లోపల, బయట చౌకగా లభించే శానిటరీ నాప్కిన్లు, కండోమ్స్ అమ్మేందుకు కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధి సాయంతో దేశవ్యాప్తంగా 8,500 రైల్వేస్టేషన్లలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. -
69 రోజులు.. 10 లక్షల కండోమ్స్
సాక్షి, బెంగళూరు : దేశంలోని శృంగార పురుషులు కండోములను విచ్చలవిడిగా ఉపయోగించేస్తున్నారు. గర్భధారణ నిరోధక సాధనాల మార్కెట్లో కేవలం 5 శాతం ఉన్న కండోముల అమ్మకాలు.. ఆన్లైన్లో ఫ్రీ కండోమ్ స్టోర్ ఆరంభించాక.. ఒక్కసారిగా డిమాండ్ఆకాశాన్ని అంటుకుంది. ఆన్ స్టోర్ ప్రారంభించిన 69 రోజుల్లోనే 10 లక్షల కండోములను ఉచితంగా డెలివరీ చేసినట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ అనే సంస్థ ఏప్రిల్ 28న ఆన్లైన్లో ఫ్రీ కండోమ్ స్టోర్‌ను ఆరంభించింది. ఈ స్టోర్‌లో ఇప్పటి వరకూ 9.56 లక్షల కండొమ్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు సంస్థ తెలిపింది. ఎన్జీవో సంస్థలు, ఇతర వర్గాలకు 5.14 లక్షల కండోములు సరఫరా చేయగా.. వ్యక్తిగత ఆర్డర్లు 4.41 లక్షలు వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో కండోములకు అధికంగా డిమాండ్ ఉన్నట్లు ఆర్డర్ల ద్వారా తెలుస్తోంది. దేశంలోని శృంగార పురుషుల కోసం హిందుస్తాన్ లేటెక్స్ లిమిటెడ్ ఈ కండోములను ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు ఎయిడ్స్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ఇండియా డైరెక్టన్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ నెలాఖరు వరకు 10 లక్షల కండోములు వస్తాయని అంచనా. అయితే స్టోర్ ప్రారంభించిన కొద్ది రోజులకే స్టాక్ పూర్తవడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, తాజాగా 20 లక్షల కండోములకు ఆర్డర్ ఇచ్చినట్లు శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మరో 50 లక్షల కండోములు జనవరికల్లా అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. -
కండోమ్స్ కోసం యువకుడి ధర్నా
తుమకూరు: ఆస్పత్రిలో కండోమ్‌లు అందుబాటులో ఉంచలేదని ఓ యువకుడు ధర్నాకు దిగిన ఘటన కర్ణాటక జిల్లాలోని తిపటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. చిక్కమంగళూరు జిల్లాకు చెందిన గణేశ్ మడేనహళ్లి గ్రామానికి చెందిన మహిళను వివాహాం చేసుకున్నాడు. మంగళూరు నుంచి అత్త గారి ఇంటికి వచ్చిన అతను కండోమ్ కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అక్కడ కండోమ్స్ బాక్స్ లేకపోవడంతో ఆరా తీశాడు. కండోమ్స్ లేవని సిబ్బంది పేర్కొనడంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు. కండోమ్స్ నిల్వ లేవని, తామేమి చేయలేమని సిబ్బంది అతనికి నచ్చజెప్పారు. అయితే అతను ఆందోళన కొనసాగించడంతో చేసేదేమి లేక సిబ్బంది బయట మెడికల్ దుకాణానికి వెళ్లి కండోమ్స్ పాకెట్లు తెచ్చి అతనికి అందజేశారు. దీంతో అతను ఆందోళన విరమించి వెళ్లిపోయాడు. -
కండోమ్స్‌లో డ్రగ్స్ దాచి..
పనాజీ(గోవా): కండోమ్స్ ప్యాకెట్లలో డ్రగ్స్ తరలిస్తూ ఓ బ్రిటిష్ పౌరుడు గోవా పోలీసులకు దొరికిపోయాడు. యూకేకు చెందిన డేవిడ్ జాన్సన్ గత ఫిబ్రవరిలో గోవాకు చేరుకున్నాడు. ఉత్తర గోవా ప్రాంతంలోని అంజునా గ్రామంలో నివాసం ఏర్పరచుకున్నాడు. డేవిడ్ జాన్సన్ ఇక్కడి బీచ్‌ల్లో జరిగే పార్టీల సందర్భంగా కావల్సిన వారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న యాంటీ నార్కోటిక్ విభాగం పోలీసులు ఇతనిపై నిఘా ఉంచారు. శుక్రవారం రాత్రి ఇతని నివాసంపై దాడి చేసి రూ.18 లక్షల విలువైన ఎక్స్టసీ, ఎల్ఎస్డీ అనే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక డ్రగ్స్ మాఫియా ఉన్నట్లు తాము అనుమానిస్తున్నామని ఎస్పీ ఉమేష్ గవోన్కర్ శనివారం విలేకరులకు తెలిపారు. కండోమ్స్‌తోపాటు మందులను నిల్వ ఉంచే డబ్బాల్లో షుగర్ క్యూబ్స్‌ను పోలి ఉండేలా సింథటిక్ డ్రగ్స్‌ను దాచేవాడు. వాటిని దొంగచాటుగా తీసుకుని లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టు అధికారులను ఏమార్చి గత ఫిబ్రవరిలో ముంబైకి చేరుకున్నాడు. అక్కడి నుంచి గోవా వచ్చి ఇక్కడి పర్యాటకులకు మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు తాము గుర్తించామన్నారు. తీరప్రాంతంలో నిత్యం జరిగే పార్టీలకు వెళ్లే వారు ఈ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారన్నారు. గోవా సముద్ర తీరంలో గడిపేందుకు ఏటా 40 లక్షల మంది టూరిస్టులు వస్తుంటారు. వీరిలో 5లక్షల మంది విదేశీయులే. -
ఒక్కో క్రీడాకారునికి 42 కండోమ్‌లు
రియో డి జెనీరో: నాలుగేళ్లకోసారి వచ్చే ఒలింపిక్స్‌ను విజయవంతం చేయడాన్ని ఆతిథ్య దేశం బ్రెజిల్ ఏర్పాట్లు భారీగా చేసింది. స్టేడియాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం దగ్గర్నుంచి క్రీడాకారులకు సౌకర్యాల కల్పన, క్రీడా గ్రామంలో పరిశుభ్రత, ఈవెంట్‌కు భారీ భద్రతలపై అధికారులు ఎక్కడా రాజీపడటంలేదు. చివరకు కండోమ్ ల సరఫరాలోనూ అదే విధానాన్ని అవలంభిస్తున్నారు. ఆగస్ట్ 5 నుంచి 21 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్ లో 206 దేశాలకు చెందిన 11 వేల మంది అథ్లెట్లు, 7 వేల మంది సిబ్బంది పాల్గొంటారు. వీరి బస కోసం రూపొందించిన స్పోర్ట్స్ విలేజ్(క్రీడా గ్రామం)లో మొత్తం 4.50 లక్షల కండోమ్‌లను సిద్ధంగా ఉంచారు. అంటే ఒక్కొక్కరికి 42 కండోమ్‌లు అందుబాటులో ఉన్నాయన్నమాట! జికా వైరస్ బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా తగిన చర్యలు తీసుకున్నారు. మొత్తం 3604 అపార్ట్మెంట్లతో కూడిన కాంప్లెక్స్‌లో టెన్నిస్ కోర్టులు, సాకర్ మైదానాలు, స్విమ్మింగ్ పూల్స్, అధునాతన జిమ్‌తో పాటు ఇతర వసతులు కల్పించారు. 13 వేల టాయ్‌లెట్ సీట్లు, 2.75 లక్షల క్లాత్ హ్యాంగర్స్, 18,500 బెడ్స్ అందుబాటులో ఉంచారు. -
'సురక్షిత శృంగారంపై నమ్మకముంది'
ముంబై: అవాంఛిత గర్భం, లైంగిక వ్యాధుల బారిన పడకుండా కండోమ్ వాడాలని అభిమానులకు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సూచించింది. కండోమ్ బ్రాండ్ కంపెనీకి ఆమె ప్రచారకర్తగా వ్యహరిస్తున్న ఆమె మాట్లాడుతూ.. 'సురక్షిత శృంగారం మంచిదని నేను నమ్ముతాను. లైంగిక వ్యాధుల బారిన పడకుండా ప్రజలను చైతన్య వంతులను చేయాల్సిన అవసరముంది. అందుకే కండోమ్ బ్రాండ్ లకు ప్రచారకర్తగా ఉన్నాన'ని వెల్లడించింది. పాపులర్ కండోమ్ బ్రాండ్ లకు ఆమె ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. అయితే అగ్ర కథానాయికలు ఎందుకు కండోమ్ ప్రకటనలు చేయడం లేదని ప్రశ్నించగా... 'ఇలాంటి అంశాల్లో ఎవరి ఇష్టం వారిది. వ్యక్తిగత లక్ష్యాలు ఆధారంగా తమ పని తాము చేసుకుపోతార'ని గడుసుగా సమాధానం ఇచ్చింది. సెలబ్రిటీ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ దబ్బూ రత్నాని రూపొందించిన బికినీ కేలండర్ ను సన్నీ లియోన్ ఆవిష్కరించింది. ఇందులో ఆమె ఫొటో కూడా ఉంది. -
ఒలింపిక్స్ కోసం 90లక్షల కండోమ్‌లు
రియోడిజనిరో: మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ సంరంభం ప్రారంభమవనుండగా అన్ని రకాల ఏర్పాట్లతో బ్రెజిల్ సిద్ధమైపోయింది. ఏర్పాట్లలో భాగంగా దాదాపు 90లక్షల కండోమ్స్ ను సిద్ధం చేసింది. వీటన్నింటిని ఉచితంగానే పంచుతారంట. ఆగస్టులో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ కు భారీ సంఖ్యలో క్రీడాకారులు, అథ్లెట్లు రావడంతోపాటు వీక్షకులు కూడా పలు దేశాల నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే, కొద్ది రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ముందస్తు భద్రత, సేఫ్టీ సెక్స్ లో భాగంగా వారికోసం ఈ ఉచిత కండోమ్స్ సిద్ధం చేసినట్లు అధికారులు ప్రకటించారు. వీటిన్నింటిని నాటెక్స్ ల్యాబ్ సిద్ధం చేసినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెజాన్ ప్రాంతంలో పెరిగే రబ్బర్ చెట్ల ద్వారా వీటిని తయారు చేసినట్లు పేర్కొన్నారు. అందరి భద్రతే తమకు ముఖ్యం అని, అందులో భాగంగానే లైంగిక చర్యల వల్ల ఎవరూ హెచ్ఐవీలాంటి వాటికి గురి కాకుండా ఈ చర్యలు తీసుకున్నామన్నారు. -
తాగేసి కండోమ్ మర్చిపోయా
లాస్ ఏంజెలిస్: తనకు హెచ్ఐవీ వ్యాధి ఉందని హాలీవుడ్ ప్రముఖ నటుడు చార్లీ షీన్ గతేడాది డిసెంబర్ లో అంగీకరించాడు. ఓ ప్రైవేట్ చానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఆయన ఈ నిజాన్ని వెల్లడించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. నిజానికి తాను కేవలం రెండుసార్లు మాత్రమే రక్షణ(కండోమ్) లేకుండా శృంగారంలో పాల్గొన్నట్లు తాజాగా తెలిపాడు. తరచుగా కండోమ్స్ యాడ్స్, వాటిపై ప్రచారం చేయడంతో కనిపించే చార్లీ.. తాను దురదృష్టవంతుడినని ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు నాలుగున్నర ఏళ్ల కిందట తనకు హెచ్ఐవీ సోకిందని తెలిసిందని, అప్పటినుంచి చికిత్స పొందుతున్నానని ఆయన వివరించారు. కేవలం రెండుసార్లు మాత్రమే అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొన్నాను, అందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానని చెప్పాడు. ఫుల్లుగా తాగి కండోమ్ వాడటం మరిచిపోయానని దీంతో వైరస్ సంక్రమించి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. హెచ్ఐవీ సోకిన విషయం తెలిసిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు శృంగారంలో పాల్గొనడం మానలేదని చార్లీ వెల్లడించాడు. తనకు సోకిన వ్యాధిని ఇతరులకు అంటించలేదని వ్యాఖ్యానించాడు. తనకు హెచ్ఐవీ ఉందన్న విషయం ఏడాది కిందటే తెలిసినా.. ఆ విషయాన్ని చార్లీ షీన్ దాచిపెట్టారని, ఆయనతో లైంగిక సంబంధం ఉన్న ఓ పోర్న్ స్టార్ కూడా వెల్లడించడంతో ఈ వార్త అప్పట్లో సంచలనం అయింది. -
పెళ్లయి నాలుగేళ్లు అవుతోంది...గర్భం వస్తుందా?
టర్నర్స్ సిండ్రోమ్ అంటున్నారు.. గర్భం వస్తుందా? హోమియో కౌన్సెలింగ్ నా మిత్రుడి వయసు 30 ఏళ్లు. తరచూ కండరాల నొప్పులు. దాంతో పాటు ఎముకలు సన్నబడి ఎక్కువ దూరం నడవలేక బాధపడుతున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే క్యాల్షియం లోపం వల్ల ఎముకల్లో బలహీనత ఏర్పడింది అన్నారు. దీనికి హోమియోలో శాశ్వత చికిత్స ఉందా? - మోహన్, కొత్తగూడెం సగటున ప్రతి మానవుడికి రోజుకు 1200 నుంచి 1500 మి.గ్రా. క్యాల్షియం అవసరం. శరీరంలోని గుండె కండరాలు, నరాలు సరిగా పని చేయడానికి, ఎముకల పెరుగుదలకు ఈ క్యాల్షియం ఆవశ్యకత ఎంతో ఉంటుంది.ఎముకలలో పాతకణాలు అంతరించి కొత్త కణాలు అంకురించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది. ఏ కారణంగానైనా తరిగిపోతున్న ఎముకకు సమానంగా కొత్త ఎముక ఏర్పడకపోతే ఎముకలు బలహీనమై, పెళుసుబారి విరిగిపోతాయి. ఇలా జరగడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎముకల ఎదుగుదలకు క్యాల్షియం ముఖ్య భూమిక పోషిస్తుంది. క్యాల్షియం లోపాలకు కారణాలు: శరీరంలో హార్మోన్ల అవసమతౌల్యత వల్ల క్యాల్షియం లోపిస్తుంది మనం తీసుకునే ఆహారంలో క్యాల్షియం తక్కువగా ఉండటం నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్లో క్యాల్షియం లోపాలు అధికంగా ఉంటాయి శరీరంలో విటమిన్-డి తక్కువగా ఉండటం తీసుకున్న ఆహారంలోని క్యాల్షియం పోషకాన్ని గ్రహించే తత్వం శరీరానికి తక్కువగా ఉండటం. లక్షణాలు: క్యాల్షియం లోపం వల్ల... ఎముకలు సన్నబడి, పెళుసుగా మారడం పెళుసుగా మారి సులువుగా విరిగిపోవడం. ఈ లక్షణాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ వ్యాధి లక్షణాలు తొలి దశలో కనిపించవు. కానీ ఎముకలు లోలోపలే క్షీణిస్తూ ఉంటాయి. ఎప్పుడో సమస్య మరీ తీవ్రమై ఎముకలు విరిగిపోయినప్పుడు గానీ ఆ విషయం తెలిసిరాదు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఉన్నట్లుండి కండరాల నొప్పులు రావడం, ఎముకలు సన్నగా ఉండి పెళుసుగా మారి సులువుగా విరిగిపోయే తత్వం పెరుగుతుంది. అంతేకాకుండా ఎముకల ఆకృతి మారిపోతుంది. చిన్నపిల్లల్లోనే కాకుండా పురుషులు, స్త్రీలలోనూ ఈ సమస్య కనిపించినా, నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వృద్ధులలో కండరాల బలహీనత ఏర్పడి సరిగా నడవలేకపోతారు. జాగ్రత్తలు-నివారణ: క్యాల్షియం ఎక్కువగా లభించే పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, వేరుశనగలు, రాగులు వంటి పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి క్యాల్షియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం ఉండే పండ్లు, కూరగాయలు కూడా తరచూ తీసుకోవాలి క్యాల్షియం పొందడానికి విటమిన్-డి కూడా ముఖ్యమైనది. విటమిన్-డి లోపాన్ని నివారించడం కోసం ఉదయం వేళ రోజూ కొద్దిసేపు ఎండలో ఉండాలి. చికిత్స: హోమియో వైద్య విధానంలో ఎలాంటి సమస్యలకైనా రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకునే కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా చికిత్స అందించవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 25 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లు అవుతోంది. మేం గర్భనిరోధక సాధనాలు ఏవీ వాడటం లేదు. కానీ నేనింకా గర్భం ధరించలేదు. నాకు రుతుక్రమం సరిగా రావడం లేదు. మందులు తీసుకున్న తర్వాతే పీరియడ్స్ వస్తున్నాయి. నేను ఇటీవలే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాను. ఆమె కొన్ని పరీక్షలు చేయించి నాకు టర్నర్స్ సిండ్రోమ్ ఉందని చెప్పారు. అంటే ఏమిటి? నాకు గర్భం వచ్చే అవకాశం ఉందా? తగిన సలహా ఇవ్వండి. - సోదరి, హైదరాబాద్ టర్నర్స్ సిండ్రోమ్ అనేది మీ క్రోమోజోములకు సంబంధించిన సమస్య. సాధారణంగా మహిళల్లో రెండు ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. అయితే టర్నర్స్ సిండ్రోమ్ ఉన్న మహిళల్లో మాత్రం ఒక ఎక్స్ క్రోమోజోము పూర్తిగా లేకపోవడమో లేదా పాక్షికంగా ఉండటమో జరుగుతుంది. ఫలితంగా ఈ సమస్య ఉన్న మహిళలకు రుతుక్రమం సరిగా రాదు. ఈ సమస్య ఉన్న చాలామంది మహిళలకు సాధారణంగానే గర్భం రాకపోవచ్చు. టర్నర్స్ సిండ్రోమ్ ఉన్న కొంతమంది మహిళలకు గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలే లేదా శరీర నిర్మాణపరమైన లోపాలు కూడా ఉండే అవకాశం ఉంది. మీలా టర్నర్స్ సిండ్రోమ్ ఉన్న మహిళలు చాలామందికి దాత నుంచి అండం స్వీకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే మీ విషయంలోనూ ఎవరైనా దాత నుంచి స్వీకరించిన అండంలోకి మీ భర్త వీర్యకణాన్ని ఫలదీకరణం చేయించి, దాన్ని మీ గర్భంలోకి ప్రవేశపెట్టాల్సి రావచ్చు. అయితే మీరు గర్భధారణను ప్లాన్ చేసుకునే ముందర ఒకసారి మీకు ఎమ్మారై, ఎకోకార్డియోగ్రఫీ, గర్భధారణకు అవసరమైన ఫిట్నెస్ మీలో ఉందా లేదా అని తెలుసుకునేందుకు కొన్ని వైద్య పరీక్షలు చేయించాల్సి వస్తుంది. ఎందుకంటే మీ లాంటి మహిళల్లో గర్భధారణ సమయంలోనూ, ప్రసవం కాగానే కూడా గుండెకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అలాంటప్పుడు కార్డియాలజిస్ట్, అబ్సెట్రీషియన్ ఆధ్వర్యంలో మీకు తక్షణ చికిత్స చేయించాల్సి రావచ్చు. థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యలూ రావచ్చు. అవి ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం కొన్ని వైద్య పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఉంటే.... వాటిని వెంటనే నియంత్రించడం కోసం మందులు వాడాల్సి ఉంటుంది. ప్రసవం తర్వాత కూడా మీకు కొన్ని హార్మోన్లు ఇవ్వాల్సి రావచ్చు. కాబట్టి మీరు వైద్య నిపుణులను సంప్రదించి, అనేక విషయాలు చర్చించడం వల్ల మీకు సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గృహిణిని. నాకు ఇద్దరు పిల్లలు. కొన్నాళ్ల నుంచి నేను తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, టీవీ ఎక్కువగా చూడటం వల్లనే అస్తమానం తలనొప్పి వస్తోందని భావించి, ఇంటి దగ్గర్లోని మెడికల్ షాపులో ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకుంటున్నారు. తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈమధ్య తలపోటుతో పాటు తలతిప్పడం, వాంతి అయ్యేలా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - మాధురి, హైదరాబాద్ తలనొప్పికి చాలారకాల కారణాలు ఉంటాయి. ఆహారం తినే వేళల్లో తేడా రావడం, ఆలస్యం కావడం లేదా ఆ పూటకు మానేయడం వల్ల తలనొప్పి వస్తుంది. ఇంట్లోగానీ ఆఫీసులో గానీ విపరీతమైన పని ఒత్తిడి ఉండటం కూడా తలనొప్పికి ఒక కారణమే. ‘మైగ్రేన్’ అని తలకు ఒకవైపు మాత్రమే వచ్చే నొప్పి కూడా దీనికి కారణమయ్యే అవకాశం ఉంది. ఇక మీ విషయానికి వస్తే తీవ్రమైన తలపోటు అంటున్నారు. అది సైనసైటిస్ కూడా కావచ్చు. అయితే మీకు తలనొప్పి చాలా రెగ్యులర్‌గా వస్తోందని అంటున్నారు. అంతేకాకుండా వికారం (వామిటింగ్ సెన్సేషన్) కూడా కలుగుతుందంటున్నారు. ఈ లక్షణాలతో పాటే మీకు తరచూ కళ్లు తిరగడం, ఒళ్లు తూలడం, నీరసం, శరీరం నిస్సత్తువకు లోనుకావడం లాంటి లక్షణాలకు గురవుతున్నారా అన్నది ఒక్కసారి సరిచూసుకోండి. ఒకవేళ ఈ లక్షణాలతో కూడా బాధపడుతున్నట్లయితే ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా తక్షణమే పరీక్షలు చేసి, అవసరమైతే ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. భరించలేనంత తలనొప్పి వస్తుంటే అది చాలా ప్రమాదకరమైన మెదడు సంబంధిత వ్యాధికి సూచనగా భావించాలి. బ్రెయిన్క్లాట్, బ్రెయిన్ ఎన్యుమరిజం, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ సిస్ట్... లాంటివి ఏవైనా కావచ్చు. కాబట్టి మీరు ఇబ్బంది పడుతున్న తలనొప్పి విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించకుండా మంచి నిపుణులైన వైద్యుడిని సంప్రదించండి. మీ సమస్యను వారికి వివరించండి. అలాగే తలనొప్పి వచ్చినప్పుడు మీలో కనపడుతున్న లక్షణాలను కూడా వివరించండి. వైద్యులు మిమ్మల్ని పరీక్షించి, మీ సమస్యను నిర్ధారణ చేసి, తగిన చికిత్స అందించగలరు. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ట్రెండ్ అవుతున్న 'బీజేపీ కౌంట్స్ కండోమ్స్'!
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ)పై బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహూజ చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జెఎన్యూ వ్యవహారంలో బాధ్యతారహితమైన వ్యాఖ్యలను చేసిన ఆయన పట్ల బీజేపీ అధినాయకత్వం కన్నెర్ర జేసింది. వెంటనే ఢిల్లీకి వచ్చి ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సదరు ఎమ్మెల్యేను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తోంది. 'జెఎన్యూలో మూడు వేల బీర్ బాటిళ్లు, రెండువేల భారత మద్యం బాటిళ్లు, 10వేల సిగరెట్ పీకలు, నాలుగు వేల బీడీలు, 50వేల మాంసం ఎముకలు, రెండువేల చిప్ కవర్లు, మూడువేల వాడిన కండోమ్‌లు, 500 అబార్షన్ ఇంజెక్షన్లు ప్రతిరోజూ లభిస్తాయి' అని రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో బీజేపీ ఒక్కసారిగా ఆన్లైన్లో ట్రెండింగ్ అంశమైపోయింది. బీజేపీ కౌంట్స్ కండోమ్స్ (#BJPCountsCondoms) హ్యాష్ ట్యాగ్‌తో ఈ వ్యాఖ్యలపై విమర్శలు, సెటైర్లు ఆన్లైన్లో వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే అహూజా (63) గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదాలు రేపారు. కాలేజీ చదువులు చదవని ఆయన ప్రతి ఏడాది జరిగే 'రామ్‌లీలా' నాటకంలో రావణ పాత్ర పోషించడం ద్వారా కూడా ప్రముఖుడయ్యారు. -
కండోమ్స్‌లో కొకైన్ నింపి మింగేశాడు !!
బెంగళూరు: అక్రమంగా డబ్బు సంపాదించడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొకైన్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. సినిమాల్లో చేసే స్మగ్లింగ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా నిజ జీవితంలో కొకైన్ స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా కొకైన్ నింపిన కండోమ్స్‌ను మింగి స్మగ్లింగ్ చేయటానికి యత్నించిన వ్యక్తిని మంగళవారం బెంగళూరు విమానాశ్రయం అధికారులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన ఇరోన్శ్యామురన్ పర్యాటక ముసుగులో కండోమ్స్‌లో కొకైన్ నింపుకుని వాటిని మింగేశాడు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు కెంపేగౌడ విమానాశ్రయంలో అతడు దిగిన వెంటనే అరెస్ట్ చేసి విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు విరోచన మందులు ఇచ్చి కొకైన్ క్యాప్సుల్‌ను బయటకు తీశారు. కొకైన్ విలువ రూ. 3.71 లక్షలు ఉంటుంటుందని తెలుస్తుంది.