ఒలింపిక్స్ కోసం 90లక్షల కండోమ్లు
రియోడిజనిరో: మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ సంరంభం ప్రారంభమవనుండగా అన్ని రకాల ఏర్పాట్లతో బ్రెజిల్ సిద్ధమైపోయింది. ఏర్పాట్లలో భాగంగా దాదాపు 90లక్షల కండోమ్స్ ను సిద్ధం చేసింది. వీటన్నింటిని ఉచితంగానే పంచుతారంట. ఆగస్టులో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ కు భారీ సంఖ్యలో క్రీడాకారులు, అథ్లెట్లు రావడంతోపాటు వీక్షకులు కూడా పలు దేశాల నుంచి వచ్చే అవకాశం ఉంది.
అయితే, కొద్ది రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ముందస్తు భద్రత, సేఫ్టీ సెక్స్ లో భాగంగా వారికోసం ఈ ఉచిత కండోమ్స్ సిద్ధం చేసినట్లు అధికారులు ప్రకటించారు. వీటిన్నింటిని నాటెక్స్ ల్యాబ్ సిద్ధం చేసినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెజాన్ ప్రాంతంలో పెరిగే రబ్బర్ చెట్ల ద్వారా వీటిని తయారు చేసినట్లు పేర్కొన్నారు. అందరి భద్రతే తమకు ముఖ్యం అని, అందులో భాగంగానే లైంగిక చర్యల వల్ల ఎవరూ హెచ్ఐవీలాంటి వాటికి గురి కాకుండా ఈ చర్యలు తీసుకున్నామన్నారు.