రియోకు చేరిన సచిన్ | Sachin Tendulkar has reached Brazil to support India’s Quest for Gold at the Rio Olympics | Sakshi
Sakshi News home page

రియోకు చేరిన సచిన్

Published Thu, Aug 4 2016 6:03 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

రియోకు చేరిన సచిన్

రియోకు చేరిన సచిన్

రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ లో పాల్గొనే  భారత జట్టుకు గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్  బ్రెజిల్కు చేరుకున్నాడు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ ఆహ్వానం మేరకు సచిన్ రియోలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా భారత ఒలింపిక్ జట్టుకు అభినందనలు తెలిపాడు. తాను రియోకు వెళ్లడంపై సరికొత్త అనుభూతికి లోనైనట్లు వెల్లడించిన సచిన్.. ఈ ఒలింపిక్స్లో భారత జట్టు మెరుగైన ప్రదర్శనతో రాణించాలని ఆకాంక్షించాడు.

 

ఈ మేరకు తన ఒలింపిక్స్ పర్యటనను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అనేక రికార్డులను సాధించిన సచిన్ కు ఇదే తొలి ఒలింపిక్స్ ఆహ్వానం కావడం విశేషం. ఈసారి అత్యధిక సంఖ్యలో భారత అథ్లెట్లు ఒలింపిక్స్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 119 మంది అథ్లెట్లు భారత్ నుంచి  ఒలింపిక్స్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement