rio
-
కొత్త క్రెడిట్ కార్డ్.. లైఫ్ టైమ్ ఫ్రీ!
ఎటువంటి జాయినింగ్ ఫీజు లేకుండా లైఫ్ టైమ్ ఫ్రీ ఆఫర్‌తో కొత్త క్రెడిట్ కార్డ్ వచ్చింది. యెస్ బ్యాంక్, ఎన్పీసీఐ భాగస్వామ్యంతో ఫిన్ టెక్ సంస్థ రియో.. యెస్ బ్యాంక్ రియో రూపే క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించింది.యూపీఐతో మిళితం చేసిన ఈ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను సులభతరం చేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు దేశవ్యాప్తంగా 10 కోట్లకుపైగా వ్యాపార స్థానాల నుండి షాపింగ్ చేయవచ్చు. ఈ కార్డ్ రియో యాప్‌లోని నో యువర్ ఆఫర్స్ ఫీచర్ ద్వారా వినియోగదారులకు రూ. 5 లక్షల వరకు క్రెడిట్ పరిమితి, వ్యక్తిగతీకరించిన రివార్డ్‌లు, ప్రత్యేకమైన డీల్స్‌ను అందిస్తుంది.ఈ కార్డు కావాలంటే..చిన్న నగరాల వినియోగదారులే ఈ కార్డుపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. దాని బీటా లాంచ్ సమయంలో 60 శాతం అప్లికేషన్లు టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే వచ్చాయి. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు, ఉద్యోగం లేదా స్వంత వ్యాపారం కలిగి ఉన్నవారెవరైనా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇందుకోసం దరఖాస్తుదారు కనీసం రూ. 25,000 నికర నెలవారీ జీతం లేదా రూ. 5 లక్షల వార్షిక ఆదాయపు పన్ను రిటర్న్ కలిగి ఉండాలి. అయితే ఇప్పటికే ఉన్న యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు ఈ కొత్త కార్దుకు అర్హులు కాదు.ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానాజీవితకాలం ఉచితంఈ కార్డ్ జీవితకాలం ఉచితం. జాయినింగ్ ఫీజు కూడా లేదు. ఈ కార్డ్ అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, కొన్ని నిర్దిష్ట లావాదేవీలకు ఛార్జీ ఉంటుంది. ఒక నెలలో రూ. 15,000 కంటే ఎక్కువ యుటిలిటీ చెల్లింపులపై 1% రుసుము, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడ్ లేదా ఫోన్‌పే వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా ఎడ్యుకేషన్ ఫీజుల చెల్లింపుపై 1% రుసుము, జీఎస్టీ ఉంటుంది. అదేవిధంగా రూ. 10,000లకు మించి ఇంధన లావాదేవీలకు ఒక్కో దానిపై 1% రుసుముతో పాటు జీఎస్టీ విధిస్తారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ నటుడు రియో కపాడియా(66) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సప్నే సుహానే లడక్పాన్ కే, మహాభారత్ సీరియల్స్‌లోనూ నటించారు. దిల్ చాహ్తా హై, చక్ దే ఇండియా, మర్దానీ చిత్రాల్లో కనిపించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రియో మృతి పట్ల సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) సంతాపం ప్రకటించింది. కపాడియా బాలీవుడ్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. షారుక్ ఖాన్ నటించిన చక్ దే ఇండియాలో చిత్రంలో కనిపించారు. ఆయన చివరిసారిగా మేడ్ ఇన్ హెవెన్- 2 అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ తండ్రిగా నటించారు. దాదాపు మూడు దశాబ్దాల తన కెరీర్లో కుటుంబం, జుద్వా రాజా, క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్స్‌లో నటించి మెప్పించారు. మహాభారతం సీరియల్లో గంధర్ రాజు పాత్రకు ప్రశంసలు అందుకున్నారు. CINTAA expresses its condolences on the demise of Rio Kapadia (Member since 2004) .#condolence #condolencias #restinpeace #rip #RioKapadia #condolencemessage #heartfelt #cintaa pic.twitter.com/d6GOLdtUZu — CINTAA_Official (@CintaaOfficial) September 14, 2023 -
అతనో ‘కింగ్’
రియో, బ్రెజిల్ : అతను ఓ రాజు. శరవేగంగా కాలంతో పాటు ఉరుకుల పరుగుల జీవనానికి దూరంగా ఒంటరిగా నివసిస్తున్న వాడు. అతనే మార్సియో మిజయెల్ మటొలియస్. మార్సియో సామ్రాజ్యం చూడముచ్చటైనది. రియోలోని బర్రా డ టిజుకా బీచ్‌లో ఇసుకతో తన కోటను తనే నిర్మించుకున్నాడు మార్సియో. గత 22 ఏళ్లుగా అందులోనే జీవనం సాగిస్తున్నాడు. చుట్టుపక్కల నివసించే వారు మార్సియోను ‘ది కింగ్’ అని పిలుచుకుంటుంటారు. ఇసుకతో నిర్మించుకున్న కట్టడం కూలిపోకుండా నీటితో రోజూ తడుపుతుంటానని మార్సియో ఓ మీడియా ప్రతినిధికి చెప్పాడు. ఎప్పటినుంచో ఇక్కడే జీవనం సాగిస్తున్నానని వివరించాడు. మిగిలినవారిలా ఉరుకుల పరుగుల జీవనం నుంచి దూరంగా ఉంటూ ప్రశాంతంగా హాయిగా ఉంటున్నట్లు తెలిపాడు. బీచ్‌కు వచ్చే పర్యాటకులతో, ఇసుక కోట ముందు కూర్చొని ఫొటోలు దిగడం తన హాబీ అని వెల్లడించాడు. ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో స్నేహితుల ఇళ్లకు వెళ్తానని తెలిపాడు. ఈ జీవితం తనకు తృప్తినిస్తోందని చెప్పాడు. చిన్నవయసులో రియోకు చేరువలోని బే ఆఫ్ గ్వనాబరాలో నివసించినట్లు చెప్పాడు. బీచ్‌కు చేరువలో నివసించేందుకు చాలా ఖర్చు చేస్తారని, ఎలాంటి బిల్లులు లేకుండా బీచ్ ఒడ్డున నివసిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపాడు. కోటకు పక్కనే బీచ్ గోల్ఫ్ కోర్సు, లైబ్రరీని నిర్మించుకున్నట్లు వెల్లడించాడు. -
చుట్టూ చేపలు... మధ్యలో మనుషులు
ఒలింపిక్స్ ముగిసి రెండు మూడు నెలలు అవుతోంది. కానీ బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో మరో సూపర్ టూరిస్ట్ అట్రాక్షన్‌కు సిద్ధమవుతోంది. మొత్తం దక్షిణ అమెరికాలోనే అతిపెద్దదైన అక్వేరియం వచ్చే నెల తొమ్మిదిన ప్రారంభం కానుంది. అక్కడెక్కడో యూరప్‌లో కిలోమీటర్ లోతైన అండర్‌గ్రౌండ్ టన్నెల్ ఉంటే... ఇక్కడ 650 అడుగుల పొడవైన అండర్‌వాటర్ టన్నెల్ ఉందీ చేపలతొట్టిలో. దాదాపు 45 లక్షల లీటర్ల నీటిని 28 ట్యాంకుల్లో నింపడం ద్వారా ఈ అక్వేరియంను సిద్ధం చేశారు. ఈ ట్యాంకులన్నింటినీ కలుపుతూ ఈ టన్నెల్ ఉంటుందన్నమాట. ఆక్వా రియో అని పేరుపెట్టన ఈ అక్వేరియంలో దాదాపు 350 జాతుల జలచరాలు 8000 వరకూ ఉంటాయి. సింగపూర్ తదితర దేశాల్లో అండర్ వాటర్ టన్నెల్స్‌తో కూడిన అక్వేరియంలు ఉన్నప్పటికీ ఇంత భారీస్థాయిలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని అంచనా. అక్వేరియంతోపాటు ఆక్వా రియోలో ఒక సర్ఫ్ మ్యూజియం, సైన్స్ మ్యూజియం కూడా ఉంటాయి. జలచరాలను దగ్గర నుంచి చూడాలనుకునే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కావాలంటే ఈ అక్వేరియంలో ఒక రాత్రి మొత్తం గడిపేందుకూ అవకాశముంది. ఇలాంటిదేవో ఇక్కడ ఒకటి అరా ఏర్పాట చేస్తే బాగుండు అనిపిస్తోంది కదూ.... నిజమే! -
ఇంతకీ సాక్షి మాలిక్ కోచ్ ఎవరు?
కోల్‌కతా: రియో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా రెజ్లర్ సాక్షి మాలిక్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ కుల్దీప్ మాలిక్ కు హరియాణా ప్రభుత్వం రూ.10 లక్షల నజరానాను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా ఓ సన్మాన కార్యక్రమం ఏర్పాటు అతనికి ఆ చెక్ ఫోటో కాపీని కూడా అందించింది. కాగా, ఆ చెక్ కు సంబంధించి ఇంతవరకూ అసలు చెక్ మాత్రం అందలేదు. ఇదంతా పక్కను పెడితే సాక్షి మాలిక్ 'రియల్'కోచ్ ఎవరు అనే దానిపై ఇప్పడు చర్చ నడుస్తోంది. తన కోచ్‌లు ఇశ్వర్ దాహియా, మన్ దీప్ సింగ్ లు అంటూ సాక్షి తెలియజేయడమే తాజా వివాదానికి కారణమైంది. మరోవైపు రజ్ బీర్ సింగ్ కూడా తానే సాక్షి కోచ్నంటూ పేర్కొనడంతో అసలు చెక్ ను ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు ఆలోచనలో పడ్డారు. దీనిపై తన కోచ్ ఎవరో, ఆ ప్రైజ్ మనీ ఎవ్వరికీ ఇవ్వాలో సాక్షినే స్పష్టం చేయాలని ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆ రాష్ట్ర క్రీడామంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు. రియోలో సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించిన అనంతరం హరియాణా ప్రభుత్వం ఆమెకు రూ.2.5 కోట్ల నజరానా ప్రకటించింది. దానిలో భాగంగా ఆమె కోచ్ మన్ దీప్ కు రూ. 10లక్షలను ఇస్తామని వెల్లడించింది. అయితే సాక్షి కోరిక మేరకు రియోలో సాక్షితో ఆమెతోపాటు ఉన్న కోచ్ కుల్దీప్ కూడా రూ. 10 లక్షల ఇవ్వనున్నట్లు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖతర్ తెలిపారు. అయితే ఇప్పడు మరో ఇద్దరు కోచ్‌లు కూడా ఆమె విజయంలో ముఖ్య భూమిక పోషించామని, ఆ పది లక్షల రూపాయిలు తమకే ఇవ్వాలనడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. -
ఆ రెజ్లింగ్ కోచ్‌లపై నిషేధం!
రియో డీ జనీరో:ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో జడ్జిల నిర్ణయాన్ని తప్పుబడుతూ అర్థనగ్న ప్రదర్శనతో నిరసన చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మంగోలియాకు చెందిన ఇద్దరు రెజ్లింగ్ కోచ్‌లపై మూడేళ్ల నిషేధం పడింది. కాంస్య పతక పోరులో తమ దేశానికి చెందిన గంజోరిగీన్ మందఖ్నారన్ గెలుపును జడ్జిలు అడ్డుకున్నారంటూ కోచ్ లు సెరెంబాతర్ సోగ్బాయర్, బయారాలు తీవ్రంగా నిరసించడంతో వారిపై నిషేధం విధిస్తూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం 2019 ఆగస్టు వరకూ అమల్లో ఉండనుంది. రియో ఒలింపిక్స్ రెజ్లింగ్ కాంస్య పతక పోరులో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన రెజ్లర్ కు పెనాల్టీ పాయింటు ఇవ్వడంతో పాయింట్ తేడాతో మంగోలియా రెజ్లర్ ఓడిపోయాడు. కాగా, అప్పటికి వరకూ తమవాడు గెలిచాడని భావిస్తున్న మంగోలియా కోచ్‌లు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టేశారు. కానీ కొన్ని సెకండ్ల తర్వాత.. వాళ్లకు అసలు విషయం తెలిసింది. జడ్జీల నిర్ణయాన్ని సవాలు చేయాలని కోచ్‌లు భావించారు. కానీ, అలా చేయడానికి వీల్లేదని జడ్జీలు వాళ్లకు చెప్పారు. దాంతో ఒకరు షర్టు విప్పేయగా, మరొకరు షర్టు, ప్యాంటు రెండూ విప్పేసి రింగ్‌లోనే పడేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో వారిపై కొన్నేళ్ల పాటు నిషేధం పడింది. -
స్ఫూర్తినిచ్చారు..
పారాలింపిక్స్‌లో అదరగొట్టిన భారత్ చరిత్రలో తొలిసారి ఒకే టోర్నీలో నాలుగు పతకాలు ఒలింపిక్స్‌లో కనీసం పది పతకాలైనా తెస్తారని భావించిన భారత క్రీడాభిమానుల ఆశలపై మన అథ్లెట్లు నీళ్లు చల్లారు. చివర్లో రెండు పతకాలు వచ్చాయన్న సంతృప్తి మిగిలినా ఎక్కడో ఏదో తెలీని వెలితి. ఆ వెలితి తీరిపోయి.. అభిమానులకు ఊహించని స్థాయి ఆనందం మరో నెలరోజుల్లోపే కలుగుతుందని ఎవరూ అనుకోలేదు. అయితే మన పారాథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచారు. చరిత్రలో ఎన్నడూ లేని ఒకే పారాలింపిక్ టోర్నీలో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించి అభిమానులకు వెల కట్టలేని ఆనందం అందించారు. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా పతకాలు నెగ్గిన మన క్రీడారులు.. అలాగే ఆ ఈవెంట్ పాల్గొన్న మొత్తం 19 మంది భారత ప్లేయర్లు మనందరికీ స్ఫూర్తిదాయకం. రియో డీ జనీరో: రియో పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు పోటీ పడుతున్న క్రీడాంశాల్లో పోటీలు ముగిశాయి. మన క్రీడాకారులు ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో మనకు గర్వకారణంగా నిలిచారు. నిజానికి రియో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల ప్రదర్శనతో నిరాశ చెందిన క్రీడాభిమానులకు పారాలింపిక్స్ మొదలయ్యేంత వరకు అందులో పోటీపడుతున్న ఆటగాళ్ల గురించి మనవాళ్లకు పెద్దగా తెలియదు. ఈ పోటీల్లో పాల్గొన్న భారత క్రీడాకారులు 19 మందే. పైగా అంచనాలు లేవు. కానీ ఒక్కసారి పోటీలు ఆరంభమాయ్యక అద్భుత ప్రదర్శనతో అందరీ దృష్టీ తమవైపు మళ్లేలా చేశారు. దృఢ సంకల్పంతో శారీరక వైకల్యాన్ని జరుుంచి పతకాలతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. శనివారంతో రియో పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల ప్రస్థానం ముగిసింది. ఆఖరి రోజు పోటీపడ్డ ముగ్గురు భారత క్రీడాకారులూ విఫలమయ్యారు. పురుషుల షాట్‌పుట్ (ఎఫ్56/57)లో వీరేందర్ 8వ స్థానంలో నిలవగా.. . హైజంప్ (టీ45/46/47)లో రాంపాల్ ఆరో స్థానం సాధించాడు. మహిళల డిస్కస్ త్రో (ఎఫ్55)లో కర్మజ్యోతి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. రెండు స్వర్ణాలు, ఒక రజతం, మరొక కాంస్యం.. పారాలింపిక్స్‌లో 1968 నుంచి పోటీపడుతున్న భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఒకే పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి. చిన్నప్పుడే ప్రమాదంలో కాలు కోల్పోయిన తమిళ తంబి తంగవేలు మారియప్పన్ హైజంప్‌లో పసిడితో ఘన బోణీ కొట్టగా.. పోలియో కారణంగా వికలాంగుడిగా మారిన వరుణ్ సింగ్ భాటి కాంస్యం కొల్లగొట్టాడు. శస్త్రచికిత్సల వల్ల చక్రాల కుర్చీకి పరిమితమైన దీపా మాలిక్ షాట్‌పుట్ రజతం గెలిచి పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించగా.. ఎనిమిదేళ్లవయసులో విద్యుదాఘాతానికి ఓ చేరుుకోల్పోరుున దేవేంద్ర జజారియా పారాలింపిక్స్‌లో రెండో స్వర్ణం నెగ్గిన భారత తొలి పారాఅథ్లెట్‌గా ఘనత వహించాడు. వైకల్యం శరీరానికే కాని సవాళ్లకు కాదని చాటి చెప్పిన ఈ అథ్లెట్ల విజయగాథ కోట్ల మందికి స్ఫూర్తిదాయకం. -
రియల్ చాంపియన్
-
తండ్రి నిరాదరణ.. కటిక దారిద్ర్యం.. ఆపై స్వర్ణం!
-
తండ్రి నిరాదరణ.. కటిక దారిద్ర్యం.. ఆపై స్వర్ణం!
రియో డీ జనీరో: నిన్న మొన్నటివరకు ఎవరికీ పెద్దగా తెలియని తమిళనాడుకు చెందిన తంగవేలు పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇందుకు కారణం రియో పారాలింపిక్స్‌లో స్వర్ణంతో సత్తా చాటడమే. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని 21 ఏళ్ల తంగవేలు నిరూపించాడు. కటిక దరిద్రాన్ని అనుభవించి నిలచిన తంగవేలు జీవితం ఇప్పుడు అందిరికీ స్ఫూర్తిదాయకం. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలోని ఓ చిన్నగ్రామం తంగవేలుది. తంగవేలుకు ఐదు సంవత్సరాల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదం అతని జీవితంలో చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. స్కూల్ కు వెళ్తుండగా తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తంగవేలు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని కుడి మోకాలు తీవ్రంగా దెబ్బతింది. దీంతో అతని జీవితంలో అలుముకున్న చీకటిని జయించడానికి తల్లి విశ్వప్రయత్నమే చేసింది. మరియప్పన్ తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోవడంతో ఆ భారం తల్లికి మరింత ఎక్కువైంది. ఒక గదిలో 500 రూపాయిలకు అద్దెకు ఉంటూనే కూరగాయలు వ్యాపారం చేసుకునే మరియప్పన్ తల్లి.. కుమారుని వైద్యం కోసం మూడు లక్షల అప్పు తీసుకుంది. అయితే ఆ అప్పుతీర్చడానికి అతని తల్లి పడని కష్టాలంటూ లేవు. ఇదంతా ఒక ఎత్తైతే.. అతనిలోని ప్రతిభ గుర్తించింది మాత్రం కోచ్ సత్యనారాయణ. 2013 లో జరిగిన పారా అథ్లెటిక్స్ చాంపియన్స్షిప్లో తంగవేలు సత్తాచాటడంతో అతనిలో అపారమైన నైపుణ్యం ఉందని కోచ్ భావించాడు. దీనిలో భాగంగా అతన్ని ప్రత్యేక శిక్షణ కోసం బెంగళూరు తీసుకొచ్చాడు. అదే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. గతేడాది జరిగిన సీనియర్ లెవల్ పోటీలో తంగవేలు టీ-42 కేటగిరీలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ట్యునిసియాలో జరిగిన క్వాలిఫికేషన్ పోటీల్లో సత్తా చాటి రియోకు అర్హత సాధించాడు. పారాలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా అక్కడకు వెళ్లిన తంగవేలు.. పసిడితో యావత్ భారతాన్ని ఆనందంలో ముంచెత్తాడు. -
ఎత్తుకు ప్రాధాన్యత లేదు: సింధు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో తాను గెలిచిన ప్రతీ మ్యాచ్ ఒక సవాల్‌గానే ఉందని భారత షట్లర్, రజత పతక విజేత పివి సింధు స్పష్టం చేసింది. సోమవారం రాష్ట్రపతి భనవ్‌లో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును అందుకున్న సింధు.. తన రియో ఒలింపిక్స్ ప్రస్థానం గురించి వివరించింది. రియో ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయి రజతం సాధించినా, ప్రతీ మ్యాచ్ కూడా తుది పోరు తరహాలోనే ఆడాల్సి వచ్చిందని తెలిపింది. ' రియోలో ప్రతీ మ్యాచ్ నాకు సవాల్‌గానే ఉంది. ఆడిన ప్రతీ మ్యాచ్ ఫైనల్ పోరునే తలపించింది. మ్యాచ్‌లకు ముందు కోచ్ గోపీచంద్‌తో కలిసి గేమ్ వ్యూహంపై చర్చించే వాళ్లం. ఇలా చేయడం మ్యాచ్‌ల్లో విజయం సాధించడానికి చక్కగా ఉపయోగపడింది' అని సింధు తెలిపింది. కాగా, రియో ఒలింపిక్స్‌లో సింధు చక్కటి ఆటతీరుతో ఆకట్టుకోవడం వెనుక ఆమె ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు కూడా ప్రధాన పాత్ర పోషించిందంటూ చర్చలు సాగాయి. దీనిపై స్పందించిన సింధు.. బ్యాడ్మింటన్‌లో ఎత్తు అనేది ఎప్పుడూ ప్రధానం కాదని తెలిపింది. అసలు షట్లర్లకు ఎత్తుతో పనిలేదని సింధు అభిప్రాయపడింది. -
లగ్జరీ గిఫ్ట్‌లు ఇచ్చిన 24 గంటల్లోనే..
మాస్కో: రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన రష్యా క్రీడాకారులు లగ్జరీ గిఫ్ట్‌లు అందుకున్న అనంతరం వాటిని అమ్మకానికి పెట్టడం వివాదాస్పదంగా మారింది. రియోలో పతకాల్ని సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టిన క్రీడాకారులకు అటు ప్రభుత్వం పాటు, పలు సంస్థలు బంఫర్ ఆఫర్లు ప్రకటించాయి. దీనిలో భాగంగా వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం పతక విజేతలకు భారీ స్థాయిలో నగదును రూపంలో నజరానా ఇవ్వడంతో పాటు బీఎండబ్యూ కార్లను కూడా అందజేసింది. అయితే ప్రధానంగా కార్లను అందుకున్న 24 గంటల్లోనే అత్యధిక స్థాయిలో అమ్మకాల ప్రకటనలు ఆన్ లైన్లో దర్శనిమిచ్చాయి. తమ కార్లను అమ్మకానికి సిద్ధంగా ఉంచుతూ పతక విజేతలు ఇచ్చిన ఫోజులు రష్యా ప్రభుత్వంలో ఆందోళన పెంచాయి. క్రీడాకారులకు బహుమతులుగా ఇచ్చిన గిఫ్ట్‌లను ఇలా అమ్ముకోవడాన్ని ప్రభుత్వ పెద్దలు తప్పుబట్టారు. అయితే ఇలా అమ్ముకోవడం తప్పేముందని రష్యా క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కార్లను ఉన్నవారు గిఫ్ట్‌లుగా అందిన కార్లను విక్రయించకపోతే ఏం చేస్తారని 2014 వింటర్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మాక్సిమ్ ట్రాంకోవ్ ప్రశ్నించాడు. తనకు లైసెన్స్ ను పొందడానికి తగిన వయసు లేకపోవడంతో కారును అమ్ముకోవడం ఒక్కటే మార్గమని 17 జిమ్నాస్ట్ సెదా తుఖాల్యాన్ స్పష్టం చేసింది. ఒక బీఎండబ్యూ కారుకు డ్రైవర్ ను పెట్టుకునే స్థోమతకు తనకు లేదని ఆమె పేర్కొంది. ఇలా ఒలింపిక్ మెడలిస్ట్‌లకు లభించిన గిఫ్ట్‌లను అమ్ముకోవడాన్ని నెటిజన్లు సైతం సమర్ధిస్తున్నారు. ఆ గిఫ్ట్ లను ఉంచుకోవాలా?లేదా అనేది ఆయా క్రీడాకారులకు సంబంధించిన హక్కుగా వారు అభిప్రాయపడుతున్నారు. -
వెయిటర్ స్థాయి నుంచి ఒలింపిక్స్ వరకూ..
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాలు రెండు. ఒకరు రజత పతక విజేత పీవీ సింధు అయితే, మరొకరు రెజ్లర్ సాక్షి మాలిక్. ఈ రెండు పతకాలు భారత పరువును నిలబెట్టగా, తృటిలో పతకాన్ని కోల్పోయిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కూడా భారతీయుల మనసుల్ని గెలుచుకుంది. అయితే రియో రేస్ వాకింగ్‌లో ఆకట్టుకున్న భారత అథ్లెట్ మనీష్ సింగ్ రావత్ ప్రదర్శనను కూడా ఏమాత్రం తక్కువ అనలేం. రేస్ వాకింగ్ ఫైనల్లో భాగంగా 20 కిలో మీటర్ల వాకింగ్ ను ఒక గంటా 20 నిమిషాల 21 సెకెండ్లలో పూర్తి చేసి 13వ స్థానంలో నిలిచాడు. కాగా, ఇది కాంస్య పతకం సాధించే క్రమంలో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ నమోదు చేసిన సమయం కంటే నిమిషం తక్కువ. దీంతో పతకం సాధించాలనుకున్న మనీష్ ఆశలను ఆ నిమిషం మింగేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సాగర్ గ్రామానికి మనీష్ సింగ్ రావత్.. పేదరికంలోనే పుట్టాడు. దీనికి తోడు మనీష్ తండ్రి కూడా చిన్నతనంలోనే చనిపోవడంతో అతని కష్టాలకు అధికమయ్యాయి. దాంతో కుటుంబాన్ని పోషించడానికి వెయిటర్ అవతారం ఎత్తాడు. బద్రినాథ్‌లోని కృష్ణ హోటల్ వెయిటర్ గా తన జీవిత ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. అయితే అతని చిన్ననాటి కల మాత్రం రేస్ వాకర్‌గా సత్తాచాటాలనే. తన బలమైన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి తెల్లవారుజామునే నిద్రలేచి బద్రీనాథ్ రోడ్లపై ప్రాక్టీస్ చేసేవాడు. ఆ క్రమంలో అతని రేస్ వాక్‌ను చూసి రోడ్డుపై చాలా మంది నవ్వుకునే వారు. కానీ వాటిని ఏమీ లెక్క చేసేవాడు కాడు. వాకింగ్ చేయడంతో పాటు, వెయిటర్ గా డ్యూటీ చేయడమే తనకు తెలిసిన పనులు. అలా రేస్ వాక్ ను ప్రారంభించిన మనీష్ జాతీయ అథ్లెట్‌గా ఎదిగాడు. అనంతరం గతేడాది బీజింగ్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటుకుని రియోకు అర్హత సాధించాడు. ఒక వెయిటర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి రియో ఒలింపిక్స్ వరకూ వెళ్లిన మనీష్ జీవితం అందరికీ ఆదర్శమే కదా. -
స్విమ్మర్ లోక్టేపై కేసు నమోదు
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ సందర్భంగా కొంతమంది దొంగలు కత్తులతో బెదిరించి విలువైన వస్తువులను అపహరించుకుపోయారంటూ తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన అమెరికా స్టార్ స్విమ్మర్ ర్యాన్ లోక్టేపై కేసు నమోదయ్యింది. తాజాగా లోక్టేపై బ్రెజిల్ పోలీసులు కేసు నమోదు చేయడంతో అతనికి జైలు శిక్ష పడే అవకాశం కనబడుతోంది. గతవారం రియో ఒలింపిక్స్‌లో తనతో పాటు మరో ఇద్దరు స్విమ్మర్లు ఒక అర్ధరాత్రి పార్టీ వెళుతుండగా కొంతమంది దొంగలు బెదిరించి తమ వద్ద నగదును దొంగిలించారంటూ లోక్టే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు లోక్టే ఇచ్చిన ఫిర్యాదు నమ్మకశక్యంగా లేదని తేల్చారు. లోక్టేతో పాటు ఉన్న మిగతా ఇద్దరు స్విమ్మర్లు కూడా ఎటువంటి దొంగల బారిన పడలేదని రియో పోలీస్ చీఫ్ ఫెర్నాండో వెలాసో స్పష్టం చేశారు. ఆ దీనికి సంబంధించిన తుది నివేదికను కోర్టు ముందుంచారు. ఒకవేళ లోక్టే తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు కోర్టు భావిస్తే అతనికి సమన్లు జారీ చేయడంతో పాటు ఒకటి నుంచి ఆరు నెలల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని సదరు పోలీస్ అధికారి పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్‌లో 4x 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో లోక్టే స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. గతవారం స్విమ్మర్లు జాక్ కాంగర్, గున్నార్ బెంట్జ్లతో కలిసి ట్యాక్సీలో సెంట్రల్ రియోలో పార్టీకి వెళుతున్నప్పుడు దొంగల బారిన పడినట్లు పేర్కొన్నాడు. అయితే దీనిపై బ్రెజిల్ అధికారులు సీరియస్‌గా దృష్టి సారించడంతో అది కాస్తా తప్పుడు ఫిర్యాదు అని తేలింది. స్విమ్మర్లు జాక్ కాంగర్, గున్నార్ బెంట్జ్లు అమెరికాకు బయల్దేరిన క్రమంలో వారిని విమానం నుంచి దింపి మరీ పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో లోక్టే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు. దీనిపై బ్రెజిల్ అధికారులను క్షమాపణలు కూడా కోరాడు. తాను మోసపూరితమైన ఫిర్యాదు చేసినట్లు లోక్టే తెలిపాడు. -
అథ్లెట్ జైశాకు స్వైన్ ఫ్లూ
న్యూఢిల్లీ: తనకు రియో ఒలింపిక్స్ మారథాన్ రన్లో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని అధికారులపై ఆరోపణలు చేసిన భారత మహిళా అథ్లెట్ ఓపీ జైశా స్వ్లైన్ ఫ్లూ బారిన పడింది. రియో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం భారత్ కు వచ్చిన జైశా అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు బెంగళూరులోని ఆస్పత్రిలో అందిస్తున్నారు. దీనిలో భాగంగా జైశాకు నిర్వహించిన పరీక్షల్లో స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్దారణ అయ్యింది. జైశా ఆరోగ్యంపై స్పోర్ట్స్ అథారిటీ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డా. ఎస్ సరళ స్పందించారు. అథ్లెట్ జైశాకు స్వైన్ జాతికి చెందిన హెచ్1ఎన్1 వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. జైశా ఆరోగ్యంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రత్యేక డాక్టర్ల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, రియో ఒలింపిక్స్ అనంతరం పలువుర భారత అథ్లెట్లు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో కొంతమంది చికిత్స అనంతరం ఇంటికి చేరగా, స్టీపుల్ చేజ్ క్రీడాకారిణి సుధాకు జికా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సుధాకు బెంగుళూరులోని స్పోర్ట్స్ అథారిటీ హాస్టల్లో చికిత్స అందిస్తున్నారు. -
రియో విన్నర్లకు మరో ఆఫర్!
న్యూఢిల్లీ: ఇటీవల రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి భారత్ కు పతకాలు సాధించిన షట్లర్ పీవీ సింధు, మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్‌లపై వరాల జల్లు కురుస్తోంది. ఇక నుంచి ఆ ఇద్దరు క్రీడాకారిణులు లగ్జరీ టూరిజం ట్రైన్ మహరాజ ఎక్స్ప్రెస్ల్లో ఉచితంగా ప్రయాణించవచ్చంటూ ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పేరేషన్) తాజాగా ఆఫర్ చేసింది. వీరితో పాటు ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో తృటిలో పతకాన్నికోల్పోయిన త్రిపుర అమ్మాయి దీపా కర్మాకర్‌కు సైతం మహరాజస్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ ఐఆర్సీటీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా క్రీడాకారిణులకు ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏకే మనోకా ట్విటర్ట్లో అభినందనలు తెలియజేశారు. ఇది వారికిచ్చే అరుదైన గౌరవంగా భావిస్తున్నామని మనోకా తెలిపారు. ఇప్పటికే నార్తరన్ రైల్వేస్‌లో సీనియర్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్న సాక్షి మాలిక్‌కు రూ. 60 లక్షల పురస్కారాన్ని ఐఆర్సీటీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రికార్డు స్థాయిలో రియో టికెట్ల అమ్మకాలు!
రియో డీ జనీరో: వచ్చే నెలలో రియోలో ఆరంభం కానున్న పారా ఒలింపిక్స్ నేపథ్యంలో అక్కడ అప్పుడే టికెట్ల అమ్మకాల సందడి ఊపందుకుంది. గతవారం ముగిసిన రియో ఒలింపిక్స్ విజయవంతం కావడంతో పారా ఒలింపిక్స్‌ను చూసేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. పారా ఒలింపిక్స్ టికెట్లు అమ్మకాలు మొదలుపెట్టిన నాలుగు రోజుల్లోనే దాదాపు మూడు లక్షల టికెట్లు అమ్మడైపోయాయి. గత మంగళవారం ఒక్క రోజే లక్షా ముప్పై మూడు వేల టికెట్లు అమ్ముకావడంతో సరికొత్త రికార్డు నమోదయ్యింది. రియో ఒలింపిక్స్ లో ఒక్క రోజులోనే అత్యధిక సంఖ్యలో టికెట్లను విక్రయించడం ఇదే ప్రథమం. 'గడిచిన 48 గంటల్లో టికెట్లు అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. ఇలా పారా ఒలింపిక్ టికెట్లకు డిమాండ్ పెరగడం గేమ్స్నిర్వహణకు ప్రోత్సాహకంగా ఉంది. తొలి రోజు పదహారు వేల టికెట్లు అమ్ముడుపోగా, రెండో రోజు యాభై టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక మూడు, నాలుగు రోజుల్లో లక్షల సంఖ్యలో టికెట్లను విక్రయించాం'అని అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోన్జాలెజ్ పేర్కొన్నారు. -
నా కెరీర్ ముగిసిపోయినట్లే!
న్యూఢిల్లీ: తనపై విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని మరొకసారి సమీక్షించకపోతే ఇక కెరీర్ ముగిసిపోయినట్లేనని భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో భారత దేశం జోక్యం చేసుకోవాలని నర్సింగ్ పేర్కొన్నాడు. 'కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పును పునఃసమీక్షించకపోతే నా కెరీర్ ముగిసినట్లే. ఈ నిషేధం అనేది కేవలం నా ఒక్కడికే పరిమితం కాదు.. యావత్ దేశానికే సంబంధించింది. నా కేసును సమీక్షించడానికి దేశంలోని పెద్దలు చొరవచూపకపోతే ఒక అమాయకుడు బలవుతాడు' అని నర్సింగ్ తెలిపాడు. ఈ డోపింగ్ ఉదంతంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని నర్సింగ్ మరోసారి పునరుద్ఘాటించాడు. జూన్ 25వ తేదీన నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో నర్సింగ్ యాదవ్ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత నర్సింగ్ కు రెండోసారి పరీక్షలు నిర్వహించిన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా).. రెండు సార్లు తీర్పును వాయిదా వేసిన అనంతరం ఆగస్టు 1వ తేదీన అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో నర్సింగ్ యాదవ్ ఎన్నో ఆశలతో రియోలో అడుగుపెట్టాడు. కాగా, నాడా' ఇచ్చిన క్లీన్ చీట్ ను సీఏఎస్ లో వాడా సవాల్ చేయడం, ఆపై నర్సింగ్ పై నిషేధం పడటంతో అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
భారత అథ్లెట్ సుధాకు 'జికా'పరీక్షలు!
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ సుధా సింగ్ తీవ్ర జ్వరానికి గురి కావడంతో ఆమెకు జికా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒలింపిక్స్ ముగిసిన అనంతరం బెంగుళూరులోని స్పోర్ట్స్ అథారిటీ హాస్టల్‌కు చేరిన సుధా సింగ్‌కు విపరీతమైన జ్వరం వచ్చింది. దాంతోపాటు బాగా నీరసించిపోవడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ఫోర్టిస్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే దోమ కాటు ద్వారా వచ్చే డెంగ్యూ, చికెన్‌గున్యాలు ఆమెకు సోకలేదని లేదని అక్కడ చేసిన టెస్టుల్లో తేలింది. కాగా, బ్రెజిల్ లో జికా వైరస్ తీవత్ర హెచ్చుగా ఉండటంతో ఆ మేరకు టెస్టులు కూడా చేయాలని డాక్టర్లు భావించారు. దానిలో భాగంగా ఆమె రక్త నమూనాను పుణెలోని జికా వైరస్ ఇనిస్టిట్యూట్‌కు పంపారు. మంగళవారం ఈ వైరస్‌కు సంబంధించిన టెస్టులు పూర్తయిన తరువాత రిపోర్ట్ వెల్లడిస్తామని కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో సుధా సింగ్ మూడు వేల మీటర్ల స్టీపల్ చేజ్లో పాల్గొంది. -
అగ్రరాజ్యం ‘ఆడేసుకుంది’
ఒలింపిక్స్‌లో తిరుగులేని అమెరికా పేరులోనే కాదు.. పతకాల్లోనూ అగ్రరాజ్యమే... ఒలింపిక్స్ పుట్టినప్పటినుంచి వెయ్యి స్వర్ణాలు గెలిచినా.. బరిలో దిగితే కచ్చితంగా పతకం పట్టుకురావడమైనా... అది కేవలం అమెరికాకే చెల్లుతుంది. రియోలోనూ పతకాల సెంచరీ కొట్టిన అగ్రరాజ్యం.. మరోసారి తనకు ఎవరూ పోటీ లేరని నిరూపించుకుంది. బ్రెజిల్లో 17 రోజుల పాటు జరిగిన క్రీడోత్సవంలో 207 దేశాలు, 11,544 మంది క్రీడాకారులు పాల్గొన్నా.. పూర్తి ఆధిపత్యం అమెరికాదే. రియోలో మొత్తం 121 పతకాలతో అగ్రరాజ్యం మొదటి స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శనతో.. సరికొత్త రికార్డులతో సత్తాచాటింది. ఈత కొలను రారాజు ఫెల్ప్స్ ఐదు బంగారు, ఒక రజత పతకాన్ని సాధించాడు. కేటీ లెడెకీ, సిమోన్ బైల్స్ వంటి క్రీడాకారిణులూ ఈసారి అమెరికా అగ్రస్థానంలో కీలకపాత్ర పోషించారు. అమెరికా తరపున 552 మంది రియో బరిలో దిగగా.. 213 మందికి పతకాలొచ్చాయి. బ్రిటన్ పునరుత్థానం ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో బ్రిటన్ హవా కనిపించింది. అమెరికా తర్వాత 67 పతకాలతో బ్రిటన్ రెండో స్థానంలో నిలించింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో కేవలం ఒకే బంగారు పతకం గెలిచాక మొత్తం క్రీడా విధానాన్నే మార్చేసిన బ్రిటన్.. దీని ఫలితంగా చేపట్టిన మార్పుల ద్వారా రియో పతకాల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఒలింపిక్స్‌లో అమెరికాకు కాస్తో కూస్తో పోటీ అనుక్నున చైనా కూడా ఈసారి పతకాల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. 20 ఏళ్లలో చైనాకు ఇదే చెత్త ప్రదర్శన కావడం గమనార్హం. -
రియో ఒలంపిక్స్ గ్రాండ్ సక్సెస్
-
బ్రెజిల్ అమ్మాయితో బోల్ట్ రాసలీలలు
జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌కు ట్రాక్‌పై ఎదురేలేదు. బోల్ట్ రిటైరయినట్టు ప్రకటించినా.. అతణ్ని ఓడించే మొనగాడు ఇంకా రాలేదు. బోల్ట్ వరుసగా మూడు ఒలింపిక్స్‌లోనూ స్ప్రింట్‌లో మూడేసి స్వర్ణాలు చొప్పున తొమ్మిది పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడు. బీజింగ్, లండన్, రియో ఒలింపిక్స్ ఈవెంట్లో బోల్ట్ స్టార్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ప్రపంచ స్టార్ స్ప్రింటర్‌గా బోల్ట్ సాధించిన ఘనతలు అందరికీ తెలుసు. ట్రాక్‌పై చిరుతలా పరుగెత్తే బోల్ట్ అమ్మాయిల విషయంలోనూ చాలా ఫాస్టే. జమైకాకు చెందిన గాళ్‌ఫ్రెండ్ కాసి బెనెట్‌తో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే వీరద్దరూ వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. గత ఆదివారం రియోలో 30వ బర్త్ డే పార్టీ చేసుకున్న బోల్ట్ ఓ అమ్మాయితో కలసి హుషారుగా డాన్స్ చేశాడు. ఈ ఫొటోలు బయటకు వచ్చాయి. బ్రెజిల్‌కు చెందిన 20 ఏళ్ల జేడీ డార్టె అనే విద్యార్థిని వాట్సాప్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు సంచలనం రేపాయి. బెడ్ మీద బోల్ట్ తో కలసి ఉన్నప్పటి ఫొటోలను కొన్నింటిని అప్లోడ్ చేసింది. ఒలింపిక్స్ సందర్భంగా రియోలో ఓ రాత్రి బోల్ట్‌తో గడిపినట్టు ఈ అమ్మడు బాంబు పేల్చింది. వెస్ట్ రియోలోని ఓ క్లబ్లో జమైకా స్ప్రింటర్‌ను కలిసినట్టు ట్వీట్ చేసింది. కాగా తన ఫ్రెండ్ చెప్పేంత వరకు బోల్ట్ స్టార్ అథ్లెట్ అన్న విషయం తెలియదని చెప్పింది. ఇది సాధారణ విషయమని, ఫేమస్ కావడం కోసం ఫొటోలను వాట్సప్‌లో షేర్ చేయలేదని వ్యాఖ్యానించింది. బోల్ట్ కూడా ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్నాడు. జమైకా సంస్కృతి విభిన్నంగా ఉంటుందని, మహిళలతో పోలిస్తే పురుషులకు ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములుంటారని చెప్పాడు. ఓ సెలెబ్రిటీగా ఒకే మహిళతో కలసి ఉండటం కష్టమని అంగీకరించాడు. ఈ విషయంపై బోల్ట్ సోదరి క్రిస్టినె బోల్ట్ హైల్టన్ మాట్లాడుతూ.. తన సోదరుడు కాసి బెనెట్‌ను వివాహం చేసుకుంటాడని చెప్పింది. త్వరలో ఇద్దరికీ నిశ్చితార్థం జరుగుతుందని వెల్లడించింది. -
చైనా ఎందుకిలా?
రియో డీ జనీరో: దాదాపు పదహారు సంవత్సరాల నుంచి బ్యాడ్మింటన్ క్రీడలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నచైనాకు తాజాగా జరిగిన రియో ఒలింపిక్స్ లో చుక్కెదురైంది. ఈ ఒలింపిక్స్‌లో చైనా బ్యాడ్మింటన్ కు పలు దేశాల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అటు స్పెయిన్ తో పాటు జపాన్ , మలేషియా, డెన్మార్క్, భారత క్రీడాకారులు రియో బ్యాడ్మింటన్ రాణిస్తే.. చైనా మాత్రం పేలవ ప్రదర్శనతో తగిన సంఖ్యలో పతకాలను సాధించలేకపోయింది. కేవలం బ్యాడ్మింటన్ లో రెండు స్వర్ణాలను మాత్రమే చైనా ఖాతాలో చేరడం వారి గత వైభవానికి చెక్ పడినట్లు కనిపిస్తోంది. గత లండన్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో ఐదు స్వర్ణపతకాలతో క్లీన్ స్వీప్ చేసి సగర్వంగా స్వదేశానికి చేరిన చైనా.. ప్రస్తుత ఒలింపిక్స్ లో అంచనాలకు తగ్గట్టు రాణించకలేకపోయింది. మరోవైపు చైనా స్టార్ ఆటగాడు, గత ఒలింపిక్స్ చాంపియన్ లిన్ డాన్ కాంస్య పతకాన్ని కూడా సాధించలేకపోయాడు. మరోవైపు ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో కేవలం ఒక చైనా క్రీడాకారిణి మాత్రమే సెమీస్ అర్హత సాధించడం సుమారు 20 ఏళ్ల తరువాత ఇదే ప్రథమం. 2000, 04 సంవత్సరాల్లో స్వర్ణం, కాంస్య పతకాల్ని సాధించిన చైనా క్రీడాకారిణులు.. 2008, 12ల్లో స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకున్నారు. దీంతో వారి పూర్వవైభవానికి చెక్ పడిందనే చెప్పాలి. సుమారు రెండు దశాబ్దాలుగా పోడియం పొజిషన్ సాధించడంలో సఫలమైన చైనా బ్యాడ్మింటన్ మహిళలకు ఈసారి తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ ఒలింపిక్స్లోచైనా క్రీడాకారిణి లీ ఘురీ సెమీస్ కు చేరినా కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది. ఆ తరువాత కాంస్య పతకం కోసం జరిగిన పోరులో గాయం కారణంగా లీ ఘురీ ఆడకపోవడంతో జపాన్ క్రీడాకారిణి ఓకుహారాకు కాంస్య దక్కింది. దీంతో మహిళల బ్యాడ్మింటన్ లో చైనా కనీసం పతకం కూడా సాధించకుండా రిక్తహస్తలతో వెనుదిరిగింది. ఈ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో చైనా మూడు పతకాల్ని సాధించింది. పురుషుల సింగిల్స్ లో ఒలింపిక్స్ లో చెన్ లాంగ్ తన వ్యక్తిగత తొలిసారి స్వర్ణం సాధించగా, పురుషుల డబుల్స్‌లో జంగ్ నాన్-షు హైపంగ్ జోడీ పసిడిని సాధించింది. ఆ తరువాత మిక్స్ డ్ డబుల్స్‌లో చైనాకు కాంస్య పతకం దక్కింది. ఇదిలా ఉండగా, పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలవడం కూడా చైనా క్రీడా శిబిరంలో ఆందోళన పెంచుతుంది. ఈ మెగా ఈవెంట్‌కు రష్యా క్రీడాకారులు తక్కువ శాతంలో రావడంతో చైనా పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఆశించింది. అయితే తొలి స్థానంలో అమెరికా నిలిస్తే, రెండో స్థానాన్ని బ్రిటన్ చేజిక్కించుకుంది. ఇలా చైనా 26 స్వర్ణాలతో మూడో స్థానానికి పడిపోవడానికి వారు బ్మాడ్మింటన్ లో ఆశించిన పతకాలు రాకపోవడమే. -
ఒలింపిక్స్ లో క్రికెటర్ కొత్త చరిత్ర!
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో ఓ మహిళా క్రికెటర్ కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సునీత్ విల్జోయిన్.. తాజా ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి కొత్త అధ్యాయానికి తెరలేపింది. ఇటీవల రియోలో జరిగిన జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్లో రజతాన్ని సాధించింది. దీంతో 96 ఏళ్ల తరువాత ఒలింపిక్స్ లో పతకం సాధించిన రెండో క్రికెటర్ గా గుర్తింపు సాధించింది. ఒలింపిక్స్‌లో ఒక క్రికెటర్ పతకం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 1920లో బ్రిటన్ హాకీ జట్టు స్వర్ణం సాధించిన జట్టులో సభ్యుడైన జాక్ మెక్ బ్రయాన్ కూడా ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెటర్. సుమారు శతాబ్దం తరువాత ఆ ఘనతను విల్జోయిస్ అందుకుంది. ఈ 33 ఏళ్ల విల్జోయిస్.. 2000-02 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌తో పాటు 17 వన్డేలు ఆడింది. ఆ తరువాత తనకిష్టమైన జావెలిన్ త్రోలోకి ప్రవేశించిన విల్జోయిస్.. రియోలో రజతంతో మెరిసింది. గురువారం జరిగిన ఫైనల్ ఈవెంట్లో జావెలిన్‌ను 64. 92 మీటర్లు విసిరి రజతం సాధించింది.ఈ పోటీలో క్రొయేషియా క్రీడాకారిణి సోరా కోలక్ స్వర్ణం గెలుచుకుంది. -
రియోకు బై బై.. టోక్యోకు వెల్కమ్
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ క్రీడలు ముగిసాయి. పదహారు రోజుల పాటు అభిమానుల్ని అలరించిన ఒలింపిక్స్ పోటీలకు సోమవారం(భారతకాలమాన ప్రకారం) తెరపడింది. మారకానా స్టేడియంలో ఒలింపిక్ జ్యోతిని అర్పివేసిన అనంతరం ఈ మెగా ఈవెంట్‌కు ముగింపు పలుకుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) చీఫ్ థామస్ బాచ్ ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన ముగింపు వేడుకలు చూపరులను ఆకట్టుకున్నాయి. చివర్లో జరిగిన బాణసంచా విన్యాసాలతో ఒలింపిక్స్ కు రియో ఘనంగా వీడ్కోలు పలికింది. రియో మేయర్ ఎడ్యూర్డో పైస్ ఒలింపిక్ పతాకాన్ని 2020 ఒలింపిక్స్ జరిగే టోక్యో గవర్నర్ యురికే కొయికేకు అప్పగించారు. దీంతో రియోకు గుడ్ బై చెబుతూ, టోక్యోకు స్వాగతం పలికారు. ఈ ముగింపు వేడుకలకు జపాన్ ప్రధాని షింజూ అబే హాజరయ్యారు. ఆయన ఎరుపు టోపీ ధరించి సూపర్ మారియా వేష ధారణలో టోక్యో నుంచి రియోకు రావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రియో ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు నుజ్మాన్ కార్లోస్ ప్రసంగించిన అనంతరం థామస్ బాచ్ తన సందేశాన్ని వెల్లడించారు. -
‘రెండు’ విధాలా మేలు!
బీజింగ్‌లో మూడు... లండన్‌లో ఆరు... ఈసారి రియోలో పది ఖాయం.... ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు భారత్ అంచనా ఇది. ప్చ్... ఈసారికి ఇంతే... ఇక పతకాలేం రావు... బింద్రా, సైనా, సానియాలాంటి స్టార్ క్రీడాకారులంతా వెనుదిరిగిన తర్వాత కలిగిన అభిప్రాయం. ఇక పతకాలు రావనే నైరాశ్యంలో ఉన్న సమయంలో సాక్షి, సింధు రెండు పతకాలు తెచ్చి భారత్‌కు ఊపిరి పోశారు. గతంతో పోలిస్తే ఈసారి పతకాల సంఖ్య తగ్గినా... మనకు రెండు విధాలా మేలే జరిగింది. ఒకటి... పాయింట్ల పట్టికలో మన పేరు పోకుండా చూసుకున్నాం. రెండు... మన వ్యవస్థలో ఉన్న లోపాలను, ప్రపంచంలో పెరిగిన పోటీని తెలుసుకోగలిగాం. సాక్షి క్రీడా విభాగం: బ్యాడ్మింటన్‌లో నవ తార పీవీ సింధు రజత పతకంతో అభిమానులకు ఆనందాన్ని పంచింది. తన కఠోర శ్రమ, పోరాట పటిమతో పాటు కోచ్ గోపీచంద్ మార్గనిర్దేశనం ఆమెను ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత మహిళగా నిలబెట్టాయి. అంతకు ముందు అనూహ్యంగా రెజ్లింగ్‌లో సాక్షి మలిక్ కాంస్యంతో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. ఒలింపిక్స్ ముగింపు దశకు వచ్చిన వేళ, ఇక ఖాళీ చేతులతోనే వెనుదిరగాల్సి వస్తుందేమో అని ఆందోళన చెందిన క్షణాన ఆమె సాధించిన కంచు పతకం కూడా మనకు పసిడితో సమానంగా కనిపించింది. రియోకు సంబంధించి మనల్ని ఆనందంలో ముంచిన, గర్వపడిన ఈ రెండు క్షణాలు ఇక ముందు కూడా ఎప్పటికీ మన మనసుల్లో నిలిచిపోతాయి. చేరువగా వచ్చినా... రెండు పతకాలకు తోడు మరో రెండు సార్లు పతకంపై ఆశలు కలిగాయి. జిమ్నాస్టిక్స్‌లో తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్న దీపా కర్మాకర్ మెడల్‌కు అతి చేరువగా వచ్చినా, చివరకు నాలుగో స్థానమే దక్కింది. చెప్పుకోదగ్గ నేపథ్యం, సౌకర్యాలు, ఎలాంటి ఆర్థిక మద్దతూ లేకపోయినా దీపా సాధించిన ఘనత చాలా పెద్దది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆమె దేశవ్యాప్తంగా అందరి మనసులు గెలుచుకుంది. భవిష్యత్తులో అమ్మాయిలు జిమ్నాస్టిక్స్ను ఎంచుకునేందుకు కావాల్సిన ఒక రకమైన వేదికను దీపా సిద్ధం చేసిందనడంలో సందేహం లేదు. మరో వైపు భారత ఏకైక గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా రెండో పతకాన్ని త్రుటిలో కోల్పోయాడు. 10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో 0.5 పాయింట్ల తేడాతో అతను కాంస్యానికి దూరం కావడం కూడా అందరినీ నిరాశపర్చింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో కూడా వచ్చిన మంచి అవకాశాన్ని సానియామీర్జా-రోహన్ బోపన్న వృథా చేశారు. సెమీస్‌లో అద్భుతంగా ఆడిన ఈ జోడి కాంస్య పతక పోరులో తలవంచింది. వీరిద్దరు సఫలమైతే మరో మూడు పతకాలు మన ఖాతాలో చేరేవేమో! చాలా మంది గుర్తించకపోయినా... 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో లలితా బబర్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో సఫలమైంది. పీటీ ఉష తర్వాత ట్రాక్ ఈవెంట్లో ఫైనల్‌కు లలిత మాత్రమే వెళ్లగలిగింది. పేదరికంలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి రియోలో కనబర్చిన పట్టుదల అసమానం. హీరోలు జీరోలుగా... భారత్‌కు గ్యారంటీగా పతకాలు తీసుకొస్తారని నమ్మిన చాలా మంది ఆటగాళ్లు రియోలో పేలవంగా నిష్ర్కమించడం బాధించే అంశం. క్రీడలపరంగా చూస్తే షూటింగ్ పూర్తిగా నిరాశపర్చింది. 12 మంది వెళ్లినా ఒక్క పతకం కూడా దక్కలేదు. ప్రపంచ కప్‌లలో రికార్డుల మోత మోగించే నారంగ్, జీతూరాయ్, హీనా సిద్ధు, అపూర్వి చండీలా, మానవ్‌జీత్ కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేదు. ఇక మహిళల ఆర్చరీ కూడా అదే చేసింది. ప్రపంచంలోని అన్ని వేదికలపై అదరగొట్టిన దీపిక కుమారి వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పేలవంగా ఆడింది. బొంబేలా, లక్ష్మీరాణి, అతాను దాస్ అంతా విఫలమయ్యారు. బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ వైఫల్యం తీవ్రంగా నిరాశపర్చింది. ఒలింపిక్స్‌కు ముందు చాంపియన్స్ ట్రోఫీలో రెండో స్థానంలో నిలిచి ఆశలు రేపిన భారత హాకీ జట్టు మళ్లీ తమ పాత ఆటకే పరిమితమైంది. లీగ్ దశలోనే ఇబ్బందిగా ఆడిన జట్టు నాకౌట్ తొలి మ్యాచ్‌లోనే నిష్ర్కమించడం విషాదం. ఇక బాక్సర్లు కూడా ఆకట్టుకోలేదు. రెజ్లింగ్‌లో యోగేశ్వర్ కూడా తన గత ఫలితాన్ని పునరావృతం చేయలేకపోగా... నర్సింగ్ వివాదం ఒలింపిక్స్ సమయంలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అథ్లెటిక్స్‌లో మనం ప్రపంచం కంటే చాలా వెనుకబడి ఉన్నామని మరోసారి నిరూపణ అయింది. ఇక టీటీ, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, రోయింగ్, జూడోలలో మన పేరు హాజరు పట్టికలోనే కనిపించింది! టోక్యోలో ఏం చేస్తారు... ‘నాలుగేళ్లలో ప్రపంచంలోని అన్ని దేశాలు ఒలింపిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తమ ప్రమాణాలు పెంచుకున్నాయి. మేం దీనిని అంచనా వేయలేక వెనుకబడ్డాం’... రియోలో మూడో స్థానానికి దిగజారిన తర్వాత సూపర్ పవర్ చైనానుంచి వచ్చిన వ్యాఖ్య ఇది. భారత్ కూడా విఫలం కావడానికి ఇదీ ఒక కారణమే. కేవలం లండన్ ప్రదర్శనతో మురిసి మేం బాగా మెరుగయ్యాం కాబట్టి పది పతకాలైనా వస్తాయి అని వేసిన అంచనాలు తప్పయ్యాయి. వ్యక్తిగత ప్రతిభతో విజయాలు దక్కిన తర్వాత ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు కోట్లాభిషేకం చేసేందుకు పోటీ పడుతున్నాయి. కానీ పోటీలకు ముందు సౌకర్యాలు కల్పించి ప్రోత్సహించమని అదే సంస్థలను ఒప్పించేందుకు నానా యాతన పడాల్సిన పరిస్థితి. బ్రిటన్ ఒక్కో పతకం కోసం రూ. 48 కోట్లు ఖర్చు చేస్తుండటం, మనం ఒక్కో అథ్లెట్‌పై రోజుకు 3 పైసలు ఖర్చు పెడుతుండటాన్ని పోలిస్తే భూమ్యాకాశాలకు ఉన్నంత తేడా ఉంది. అయితే డబ్బు మాత్రమే పతకాలు తీసుకు రాలేదని చెప్పేందుకు జమైకా, కెన్యాలాంటి ఎన్నో విజేతల ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఆటలను అలుసుగా చూసే వ్యవస్థలో మాత్రం మార్పు వచ్చి మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆట గురించి తెలిసి, దూరదృష్టి గల వ్యక్తులను వ్యవస్థలోకి తీసుకు వచ్చి వారికి బాధ్యత అప్పచెప్పాలి. ఎన్నడూ క్రీడా మంత్రినే పెట్టుకోని అమెరికా, అడ్మినిస్ట్రేటర్ల ప్రణాళికతోనే అద్భుతాలు చేస్తూ వస్తోంది. ‘ఖేలో ఇండియా’ పేరుతో కొత్తగా ప్రభుత్వం రూపొందించిన పథకంలో ఇప్పటికే గోపీచంద్, అంజూ జార్జ్ సభ్యులుగా ఉన్నారు. అభినవ్ బింద్రాలాంటి మేధావిని కూడా ఇందులో చేర్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ బృందం భారత జట్టు బలాలు, మన లోపాలు, ఏమేం అవసరంవంటి అంశాలపై తగిన ప్రణాళికలు, వ్యూహాలు రూపొందిస్తే 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనైనా మన జాతీయ గీతం వినిపించవచ్చు. -
అలీసన్ ఫెలిక్స్ నవ చరిత
రియో డీ జనీరో:అమెరికా మహిళా స్ప్రింటర్ అలీసన్ ఫెలిక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలను తన ఖాతాలో వేసుకున్న తొలి మహిళా అథ్లెటిక్‌గా నవ చరితను లిఖించింది. రియో ఒలింపిక్స్‌లో భాగంగా 4x 400 రిలేలో అమెరికా జట్టు అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం సాధించింది. అలీసన్ ఫెలిక్స్, కర్ట్నీ ఒకోలో, నతాషా హెస్టింగ్స్, ఫిల్లిస్ ఫ్రాన్సిస్‌లతో కూడిన అమెరికా బృందం ఈ రేసును 3:19:06 నిమిషాల్లో పూర్తి చేసి పసిడిని ముద్దాడింది. తద్వారా అలీసన్ ఫెలిక్స్ ఖాతాలో ఆరో స్వర్ణం చేరింది. దీంతో ఒలింపిక్స్ లో ఆరు స్వర్ణాలు సాధించిన ఏకైక మహిళా అథ్లెట్‌గా ఫెలిక్స్ నిలిచింది. బీజింగ్ ఒలింపిక్స్ లో 4x 400 రిలేలో స్వర్ణం సాధించిన ఫెలిక్స్.. లండన్ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో, 4x 100, 4x 400 పరుగులో స్వర్ణాలను సాధించింది. తాజాగా ఒలింపిక్స్ మహిళల 4x100 రేసులో పసిడి సాధించిన అమెరికా.. 4x 400 రిలేలో కూడా విజేతగా నిలవడంతో ఫెలిక్స్ 'సిక్సర్' కొట్టింది. దాంతో పాటు ఒలింపిక్స్ లో అమెరికా మహిళల జట్టుకు 4x 400 రిలేలో ఇది వరుసగా ఆరో స్వర్ణం. దాదాపు 20 ఏళ్ల క్రితం ఈ విభాగంలో పసిడి ఖాతా ఆరంభించిన అమెరికా మహిళలు ఇప్పటికే సత్తా చాటుతూనే ఉండటం విశేషం. ఇదిలా ఉండగా జమైకా మహిళల జట్టు రెండో స్థానంతో రజతం, బ్రిటన్ కాంస్య పతకాలను దక్కించుకున్నాయి. -
సింధు రాక కోసం..
-
బ్యాడ్ లక్.. పతకం చేజారింది!
రియో డీ జనీరో: ఒలింపిక్స్‌లో పతకం సాధించడమంటే అదొక ఘనకీర్తి. అసలే కొన్ని దేశాలు పతకాలు రావడం లేదని తెగ ఆందోళన చెందుతుంటే, అమెరికా జట్టుకు పతకం అందినట్టే అంది చేజారింది. ఒలింపిక్స్ భాగంగా పురుషుల 4x 100 రిలేలో అమెరికా తృతీయ స్థానంలో నిలిచినా పతకం సాధించడంలో విఫలమైంది ఈ రేసులో తొలి స్థానంలో నిలిచిన జమైకా జట్టు స్వర్ణం గెలిస్తే, జపాన్ రజతం సాధించింది. కానీ లెక్కప్రకారం మూడో స్థానంలో నిలిచిన అమెరికాకు కాంస్యం దక్కాలి. అయితే అమెరికా సాధించింది అనుకున్న పతకం కెనడా జట్టు ఖాతాలో పడింది. ఇందుకు కారణం నిబంధనల ఉల్లంఘనే. రూల్ 170.7 ప్రకారం బాటన్‌ను తర్వాతి రన్నర్ టేకోవర్ జోన్లోనే అందుకోవాలి. ఫోర్ లెగ్లతో కూడిన ఈ రేసులో బాటన్ ను కాస్తా గాట్లిన్ టేకోవర్ జోన్ లోపలే అందిపుచ్చుకున్నాడు. దీని ఫలితంగా నిబంధన ఉల్లంఘన జరిగిందని ఒలింపిక్స్ నిర్వహకులు తేల్చడంతో అమెరికా పతకం చేజారిపోయింది. అమెరికా స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ చేసిన పొరబాటే ఆ జట్టు పతకం కోల్పోవడానికి ప్రధాన కారణమైంది. రేసులో నాల్గో స్థానంలో నిలిచి కెనడాను కాంస్య పతకం వరించింది. ఇప్పటికే పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాకు ఇది ఓ రకంగా బ్యాడ్ లక్. జమైకా జట్టును సవాల్ చేస్తున్న అమెరికా జట్టు ఇలా వెనుదిరగడం అందర్నీ ఆశ్చర్యాలకు గురి చేసింది. ఇదిలా ఉండగా 4x 100 రిలేలో అమెరికా మహిళల జట్టు స్వర్ణాన్ని సాధించడం విశేషం. గత ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం సాధించిన మహిళల జట్టు..డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సత్తా చాటింది. -
మో ఫరా.. డబుల్ డబుల్
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ లో బ్రిటన్ అథ్లెట్ మో ఫరా సరికొత్త రికార్డు సృష్టించాడు. గత వారం పది మీటర్ల రేసులో స్వర్ణం పతకం సాధించిన ఫరా.. తాజాగా జరిగిన ఐదు వేల మీటర్ల రేసులో కూడా పసిడిని సొంతం చేసుకుని కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. రియోలో రెండు ఈవెంట్లలో స్వర్ణ పతకాల్ని కైవసం చేసుకోవడం ద్వారా తన గత లండన్ ఒలింపిక్స్ రికార్డును ఫరా నిలబెట్టుకున్నాడు. దీంతో ఫిన్లాండ్కు చెందిన మాజీ అథ్లెట్ లాసె వెరెన్ సరసన ఫరా నిలిచాడు. 1972 మోన్రిచ్ ఒలింపిక్స్‌లో వెరెన్ రెండు ఈవెంట్లో బరిలోకి దిగి విజేతగా నిలిచాడు. ఆపై 1976లో మోంట్రీల్లో జరిగిన ఒలింపిక్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా పోరుకు సిద్ధమైన వెరెన్ దాన్ని నిలబెట్టుకున్నాడు. దాదాపు 40 సంవత్సరాల తరువాత ఆ రికార్డును సమం చేసిన ఏకైక అథ్లెట్‌గా ఫరా నిలిచాడు. ఈ పోరును 13:03:30 నిమిషాల్లో పూర్తి చేసిన ఫరా పసిడిని ముద్దాడాడు.దీంతో బ్రిటన్ తరపున నాలుగు వ్యక్తిగత స్వర్ణాలు అందుకున్న తొలి అథ్లెట్‌గా ఘనత సాధించాడు. ఫరా రికార్డులు.. 1999 నుంచి వివిధ అంతర్జాతీయ, యురోపియన్ యూనియన్ ఈవెంట్లలో రికార్డు టైమింగ్‌తో సత్తా చాటాడు మో ఫరా. అయితే.. బీజింగ్ ఒలింపిక్స్‌లో మాత్రం నిరాశతోనే వెనుదిరగాల్సి వచ్చింది. లండన్ ఒలింపిక్స్‌లో 10వేల మీటర్ల పరుగులో, 5వేల మీటర్ల పరుగులో బంగారు పతకాలు సాధించి బ్రిటన్ తరపున డిస్టెన్స్ రన్నింగ్‌లో తొలి స్వర్ణం అందుకున్న అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత మాస్కోలో జరిగిన ప్రపంచచాంపియన్ షిప్‌లోనూ స్వర్ణం సాధించాడు. 2015లో యూరో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో గోల్డ్‌మెడల్ ‘డబుల్’ రికార్డు సృష్టించాడు. పడి లేచిన తరంగం.. రియో ఒలింపిక్స్ లో భాగంగా గత వారం జరిగిన పది వేల మీటర్ల పరుగులో ఫరా ట్రాక్ పై కింది పడినా, చివరకు విజేతగా నిలవడమే అతని పోరాట పటిమకు నిదర్శనం. ఆ పోరులో ఫరా పడిపోయేటప్పటికి 16 ల్యాప్‌ల రేసు మిగిలి ఉంది. ఆ క్షణంలో తన పోరాటం ముగిసినట్లేనని అతను భావించాడు. కానీ కొద్ది సేపటికే తేరుకొని మొండిగా పరుగెత్తాడు. చివరకు తన స్థాయికి తగిన రీతిలో రేస్‌ను ముగించి సత్తా చాటాడు. ఈ రేసును 27 నిమిషాల 5.17 సెకన్లలో లక్ష్యం చేరి ఫరా స్వర్ణం సాధించాడు. -
యోగేశ్వర్ సాధిస్తాడా?
రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చే అవకాశం రెజ్లర్ యోగేశ్వర్ దత్పైనే ఆధారపడి వుంది. గత లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్పై భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. భారతకాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం జరుగనున్న 65 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో యోగేశ్వర్ బరిలోకి దిగనున్నాడు. హరియాణాకు చెందిన యోగేశ్వర్ రెజ్లింగ్‌లో మరో పతకాన్ని సాధిస్తాడనేది విశ్లేషకుల అంచనా. అయితే ఎన్నో ఆశలతో రియోకు వెళ్లిన మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పోరుకు సిద్ధం కాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. గతంలో అతనిపై వచ్చిన డోపింగ్ ఆరోపణలతో ఒలింపిక్స్ కు దూరం కావాల్సి వచ్చింది. నర్సింగ్ యాదవ్‌కు వ్యతిరేకంగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పు రావడంతో యోగేశ్వర్పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఒక వాదనగా వినబడుతోంది. అయితే గేమ్స్‌లో ఈ తరహా ఘటనలు సహజం కావడంతో యోగేశ్వర్ ఎటువంటి ఒత్తిడి లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ ఒక పతకం తేవడంతో మరో పతకాన్ని యోగేశ్వర్ కూడా తెస్తాడని యావత్ భారతదేశం ఆశగా ఎదురుచూస్తోంది. మరోవైపు భారత రెజ్లింగ్ ఫ్రీ స్టయిల్ కోచ్ జగ్మిందర్ సింగ్ కూడా యోగేశ్వర్ పతకంపై ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ఏది చేయాలో అది చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతామని పేర్కొన్నారు. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ నిషేధం విధించడం తమను నిరాశకు గురి చేసినా, ప్రస్తుతం భారత్ ఖాతాలో పతకం చేర్చడమే తమ లక్ష్యమన్నారు. ఈ రోజు జరిగే యోగేశ్వర్ రెజ్లింగ్ పోరు కోసం మరోసారి అభిమానులు టీవీలకు అతుక్కుపోయే అవకాశం ఉంది. మొత్తం అన్ని రౌండ్ల రెజ్లింగ్ ఒకేసారి జరుగుతుండటంతో యోగేశ్వర్ ఏం చేస్తాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. -
సింధు రాక కోసం..
హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు సోమవారం నగరానికి రానుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం సింధు రియో నుంచి బయల్దేరింది. రేపు ఉదయం హైదరాబాద్ కు చేరుకునే అవకాశం ఉండటంతో ఆమెకు స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ భారీయెత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి, జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ రజత్ కుమార్ తదితరులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజేంద్ర నగర్, అత్తాపూర్, మెహిదిపట్నం, టౌలిచౌకి మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు ఉన్న మార్గాన్ని పరిశీలించారు. సింధు వచ్చే ఈ మార్గాల్లో ఎక్కడెక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలి, ఎలాంటి అలంకరణలు చేపట్టాలనే ప్రాంతాలను ఎంపిక చేశారు. చేపట్టాల్సిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం స్వాగత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన అనంతరం పి.వి. సింధు పై మార్గంలో గచ్చిబౌలి స్టేడియం వరకు ర్యాలీగా చేరుకుంటుందని కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ మార్గం ప్రధాన కూడళ్ల వద్ద పాఠశాలల విద్యార్థులు, నగర పౌరులు సింధుకు అపూర్వ స్వాగతం పలుకుతారని కమిషనర్ తెలిపారు. అనంతరం గచ్చిబౌలి స్టేడియంలో నగర పౌరులు, క్రీడాకారుల సమక్షంలో ప్రత్యేక సన్మాన సభ ఉంటుందన్నారు. ఈ స్టేడియంలో జరిగే సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను జోనల్ కమిషనర్ గంగాధర్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ సమీక్షించారు. సింధు ప్రయాణించే శంషాబాద్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు పెద్ద ఎత్తున స్వాగత హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే సింధు సన్మాన సభ ఏర్పాట్లను శనివారం రాత్రి కమిషనర్ జనార్దన్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణా ఇన్చార్జీ, ఎండీ అబ్దుల్ రహీమ్‌తో కలిసి పరిశీలించారు. -
'ఇక కెప్టెన్‌గా చేసే ఉద్దేశం లేదు'
రియో డీ జనీరో:ఒలింపిక్స్ ఫుట్ బాల్ చరిత్రలో బ్రెజిల్‌కు తొలి స్వర్ణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్ నేమార్ ఇక సారథిగా చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని ఇప్పటికే తమ జాతీయ కోచ్ కు తెలిపినట్లు నేమార్ వెల్లడించాడు. తాజా విజయంపై చెప్పడానికి మాటలు రావడం లేదంటూ ఆనందంతో ఉబ్బితబ్బైన నేమార్.. తాము కొత్త చరిత్రను సృష్టించామనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఇది తన జీవితంలోనే మరపురాని జ్ఞాపకమని నేమార్ అభివర్ణించాడు ఇక బ్రెజిల్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగే ఉద్దేశం లేదని నేమార్ తెలిపాడు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్ 5-4 తేడాతో జర్మనీపై గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు తలో గోల్ తో సమంగా ఉండటంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో తొలి నాలుగు కిక్‌లను గోల్ గా మలచడంలో సఫలమైన జర్మనీ.. తన ఐదో కిక్ ను గోల్ గా మలచలేకపోయింది. అయితే బ్రెజిల్ స్టార్ ఆటగాడు నేమార్ మాత్రం తమ చివరి కిక్ ను గోల్ గా మలచడంతో బ్రెజిల్ ఖాతాలో స్వర్ణం చేరింది. దీంతో మ్యాచ్ జరిగిన మారకనా మైదానం హోరెత్తిపోయింది. ఒకవైపు బాణాసంచా వెలుగులతో స్టేడియం మెరిసిపోగా, మరోవైపు కారు హారన్లతో దద్దరిల్లింది. -
నాణేల ప్రేమికులకు ‘ఒలింపిక్స్’ ఉత్సాహం
ఒలింపిక్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులకే కాదు.. నాణేల ప్రేమికులకు కూడా కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. ఈ ప్రపంచ క్రీడా సంబరాన్ని పురస్కరించుకుని వివిధ దేశాలు సరికొత్త నాణేలు విడుదల చేశాయి. వీటిల్లో ఆస్ట్రేలియా విడుదల చేసిన నాణేలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన ప్రముఖ నాణేల సేకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ ప్రత్యేక ఆర్డర్‌పై అయిదు ఒలింపిక్స్ నాణేలను సేకరించారు. వీటి గురించి ఆయన ఇలా వివరించారు. ‘ఒలింపిక్స్ చిహ్నాన్ని 1912లో రూపొందించారు. అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య 1914 జూన్‌లో దీనిని స్వీకరించి 1920 నుంచి వినియోగిస్తోంది. ఒకదానితో ఒకటి గొలుసులా కలిసిన అయిదు రింగులు ఒలింపిక్ క్రీడల చిహ్నం. నీలం, పసుపుపచ్చ, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉండే ఈ అయిదు రింగులు వరుసగా యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా ఖండాలను సూచిస్తాయి. ఇవి క్రీడా స్ఫూర్తికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ చిహ్నాన్ని శాంతికి ప్రతీకగా నిలిచే తెల్లని వస్త్రంపై ముద్రిస్తారు. రియో ఒలింపిక్స్ సందర్భంగా ఆస్ట్రేలియా రెండు డాలర్ల ముఖ విలువ ఉన్న అయిదు నాణేలను ముద్రించింది. ఒక్కో నాణెంపై ఒలింపిక్ చిహ్నంలోని ఒక్కో రంగును ముద్రించింది. అలాగే ఈ అయిదు నాణేలపై ఆస్ట్రేలియా క్రీడాకారులు పాల్గొనే పలు క్రీడాంశాలను కూడా ముద్రించారు’ అని కామేశ్వర్ తెలిపారు. – అమలాపురం టౌన్ -
బోల్ట్ కు మంత్రి పదవి?
రియో డీ జనీరో: తన ఒలింపిక్స్ కెరీర్‌ను దిగ్విజయంగా ముగించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ తన రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకూ పరుగులో అలరించిన బోల్ట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నాడు. ఈ మేరకు జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ నుంచి ఓ సందేశం బోల్ట్ కు చేరింది. ఇప్పటికే తమ కీర్తిని ఎంతో ఉన్నతిలో నిలబెట్టిన బోల్ట్‌కు రాజకీయ ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ ఆయన సంకేతాలు పంపారు. 'బోల్ట్ ప్రదర్శనతో జమైకాకు చాలా లాభం చేకూరింది. ఎన్నో ఘనతలను సాధించిన బోల్ట్ పేరును ఉపయోగించుకోవడం మాకు చాలా ముఖ్యం. అందుకు మా తలుపులు తెరిచే ఉన్నాయి' అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో హాలెన్స్ పేర్కొన్నారు. అతను ఒకవేళ మంత్రి పదవి కోరుకున్నా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఆయన స్పష్టం చేశారు. ఆదివారం 30వ బర్త్ డే చేసుకుంటున్న బోల్ట్..తన రెండో ఇన్నింగ్స్‌పై త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. జమైకా ప్రజల కోరిక మేరకు బోల్ట్ రాజకీయ ప్రవేశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బోల్ట్ రాజకీయ ప్రవేశం జరిగితే ఆ ఘనత సాధించిన తొలి ఒలింపియన్ గా బోల్ట్ నిలిచిపోతాడు. -
ఒలింపిక్ప్లో ఓ శకం ముగిసినట్లే!
రియో డీ జనీరో: ఇక ఒలింపిక్స్ లో ఉసేన్ బోల్ట్ శకం ముగిసినట్లే. పరుగును పరుగుల రారాజు బోల్ట్ తన ఒలింపిక్స్ కెరీర్ ను ఘనంగా ముగించాడు. రియో ఒలింపిక్స్ లో 4x100 రిలేలో జమైకా జట్టు స్వర్ణం గెలవడంతో ట్రిపుల్ ట్రిపుల్ గా నిలవాలన్న కోరికను తీర్చుకున్న బోల్ట్.. తన చివరి ఒలింపిక్ రేసును అభిమానులకు మధుర జ్ఞాపకంగా మిగిల్చాడు. బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణంతో మొదలైన బోల్ట్ పరుగు.. రియో వరకూ ఆగలేదు. ఈ ఒలింపిక్స్ బరిలోకి దిగిన మూడు ఈవెంట్లోనూ పసిడిని సాధించాలనే తపనతో చెలరేగిన బోల్ట్ ఒలింపిక్స్ లో పరుగుల రారాజుగా నిలిచాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన 4x100 రిలేలో బోల్ట్,అసాఫా పావెల్, నికెల్ అష్మేడ్, యొహాన్ బ్లేక్‌లతో కూడిన జమైకా జట్టు 37.27 సెకెండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో మూడు వరుస ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4x 100 మీటర్ల రిలేలో పసిడి సాధించిన స్ప్రింటర్ గా బోల్ట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత బీజింగ్, లండన్ ఒలింపిక్స్ల్లో కూడా బోల్ట్ పసిడి పంట పండించిన బోల్ట్.. ఒలింపిక్స్ లో అపజయమే ఎరుగని చిరంజీవిగా నిలిచాడు. అయితే ఇదే తన చివరి ఒలింపిక్స్ అన్న బోల్ట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, జమైకాకు రేస్ కింగ్‌గా నిలిచిన బోల్ట్ పరుగును ఒలింపిక్స్ లో చూసే అవకాశం దాదాపు లేనట్లే. రియో ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలను సాధించాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగిన బోల్ట్ ఆద్యంతం ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రియోలో వంద మీటర్ల పరుగును 9.81 సెకెండ్లలో ముగించి పసిడిన గెలిచిన బోల్ట్.. 200 మీటర్ల పరుగు పందెంలో 19.78 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించాడు. ఇక జట్టు రేసుకొచ్చేసరికి జమైకా స్వర్ణం సాధించడంలో బోల్ట్ కీలక పాత్ర పోషించాడు. రికార్డులు.. ఈ ఒలింపిక్స్ లో 100 మీటర్ల ఈవెంట్లో స్వర్ణం గెలుచుకున్న బోల్ట్.. ఈ ఘనతను వరుసగా మూడు ఒలింపిక్స్‌లో సాధించిన ఏకైక అథ్లెట్‌గా నిలిచాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో కూడా బోల్ట్ ఈ ఈవెంట్లో పసిడి పతకం సాధించి 120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానిదాన్ని సాధించాడు. మరోవైపు 4x 100 రిలేలో స్వర్ణం సాధించడంతో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఒలింపిక్స్ లో తొమ్మిది పతకాలు సాధించిన అథ్లెటిక్స్ కార్ల్ లూయిస్, ఫిన్ పావో నుర్మిస్ల సరసన బోల్ట్ నిలిచాడు. దాంతో పాటు 4x 100 రిలేలో పసిడి సాధించి ఈ విభాగంలో వరుసగా మూడు స్వర్ణాలు సాధించిన రెండో స్ప్రింటర్ గా బోల్ట్ నిలిచాడు. అంతకుముందు అమెరికన్ దిగ్గజం ఫ్రాంక్ వైకాఫ్(1928, 1932, 1936) ఒక్కడే 4x 100 రిలేలో వరుస పసిడి పతకాలను సాధించాడు. మొత్తంగా ఒలింపిక్స్‌లో బోల్ట్ ఖాతాలో తొమ్మిది స్వర్ణ పతకాలు చేరగా, 2008నుంచి ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లు కలిపి 20 స్వర్ణాలు సాధించాడు. -
'మూడు నెలలుగా ఫోనే వాడలేదు'
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు విజయం వెనుక ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కృషి వెలకట్టలేనిది. తనకు తెలిసిన విద్యతోనే ప్రపంచాన్ని గెలవాలనే కోరికను సింధు ద్వారా గురువు గోపీచంద్ నెరవేర్చుకున్నాడనంలో ఎటువంటి సందేహం లేదు.అయితే రియోలో సింధు రాణించడం వెనుక ఆమె విశేష కృషితో పాటు పట్టుదలే కారణమన్నాడు గోపీచంద్. తాను కొన్ని నిబంధనలను విధిస్తే వాటిని తూచా తప్పకుండా పాటించడమే సింధు విజయం వెనుక రహస్యమంటున్నాడు. 'ఆట గురించి కొన్ని కఠినమైన నిబంధనలను ఆమె అవలంభించక తప్పలేదు. చివరకు సింధుకు ఇష్టమైన తియ్యటి పెరుగును కూడా ఆమెకు అందకుండా చేశా. దాదాపు 12-13 రోజుల నుంచి ఇదే చేశా. దాంతో పాటు గత మూడు నెలల నుంచి సింధు ఫోన్ వాడటమే మానేంది. ఫోన్ కాల్స్ కూడా దూరంగా ఉండమని చెప్పి ఆమె ఫోన్ ను నేను తీసుకున్నా. ఆమె ఫోన్ ను తిరిగి ఇవ్వడమే నేను చెసే మొదటి పని . ఇప్పుడు సింధు ఏమి కావాలనుకుంటే అది తినొచ్చు'అని గోపీ చంద్ పేర్కొన్నాడు. -
సింధుపై కాసుల వర్షం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధుపై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించగా, ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆమెకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు సిద్ధమైంది. ఒలింపిక్స్‌లో రజతం సాధించినందుకు గాను రెండు కోట్ల రూపాయిల నజరానాను ఇస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. దాంతోపాటు మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్‌కు కోటి రూపాయిలను ఇవ్వనున్నట్లు తెలిపింది. మరోవైపు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా తనకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనుంది. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును సింధుకు ప్రకటించింది. మహిళల బ్యాడ్మింటన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్లో సింధు 21-19, 12-21, 15-21తో టాప్ సీడ్ మారిన్ చేతిలో ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడింది. దీంతో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను గెలిచిన సింధు.. ఆపై వరుస రెండు గేమ్‌లలో ఒత్తిడికి లోనై ఓటమి చెందింది. -
సింధు-మారిన్‌ల మ్యాచ్‌పై ఉత్కంఠ
-
'సింధు..నాతో జాయిన్ కావాలి'
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకాన్ని ఖాయం చేసుకున్న భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. శుక్రవారం జరిగే తుదిపోరులో సింధు విజయం సాధించి బంగారు పతకాన్ని తీసుకురావాలని భారత షూటర్ అభినవ్ బింద్రా ఆకాంక్షించాడు. ఒలింపిక్స్‌లో సింధు పసిడి సాధించి తనతో జాయిన్ కావాలంటూ బింద్రా కోరాడు. ఇందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్న బింద్రా.. ఆ క్లబ్లో తాను ఒక్కడినే ఉన్న సంగతిని గుర్తు చేసుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా స్వర్ణం పతకం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణం రాలేదు. ఆ తరువాత ఇన్నాళ్లకు సింధు స్వర్ణానికి అడుగు దూరంలో నిలవడంతో ఆ ఘనతను సాధించాలని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్లు సింధు స్వర్ణ పతకంపై ధీమా వ్యక్తం చేశారు. తుదిపోరులో సింధు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇప్పటివరకూ సింధు ప్రదర్శన ఆద్యంత అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. గురువారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21-19, 21-10తో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై ఘనవిజయాన్ని నమోదు చేసింది. దీంతో శుక్రవారం జరిగే ఫైనల్ పోరులో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు అమీతుమీకి సిద్ధమైంది. -
సింధు తండ్రి ప్రత్యేక పూజలు
పెదవేగి: రియో ఒలంపిక్స్‌లో పీవీ సింధు బంగారు పతకం సాధించాలని ఆమె తండ్రి వెంకటరమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలోని శ్రీ రత్నాలమ్మ ఆలయంలో శుక్రవారం ఆయన పూజలు చేశారు. సింధు బంగారు పతకం గెలిచి దేశ ఖ్యాతిని పెంచుతుందనే నమ్మకం తనకుందని రమణ తెలిపారు. ఇక్కడ కుల దేవతను పూజలు చేయడం ఆచారంగా వస్తోందన్నారు. మరో వైపు సింధు బంగారు పతకం సాధించాలని అభిమానులు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఈరోజు పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయంలో పలువురు పూజలు చేశారు. అలాగే, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కార్పొరేటర్ అరుణ శ్రీనివాస్‌గౌడ్..108 కిలోల పసుపు, కుంకుమలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. -
సింధు-మారిన్‌ల మ్యాచ్‌పై ఉత్కంఠ
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు మరికాసేపట్లో తెరలేవనుంది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ పివి సింధు, స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌ల తుది పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సింధు పసిడి పతకంతో కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఒకవేళ ఓడినా రజతంతో సగర్వంగా భారత్ కు తిరిగి వస్తుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21-19, 21-10తో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై ఘనవిజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగే ఫైనల్ పోరులో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు అమీతుమీకి సిద్ధమైంది. ఇరువురి మధ్య రాత్రి గం.7.30 ని.లకు తుది పోరు జరుగనుంది. ఇప్పటివరకూ ఇద్దరు క్రీడాకారిణులు ఏడు మ్యాచ్‌ల్లో తలపడగా సింధు మూడింట, మారిన్ నాల్గింట గెలుపొందింది. 2015 అక్టోబర్‌లో డెన్మార్ ఓపెన్‌లో మారిన్‌ను సింధు ఓడించగా, అదే ఏడాది నవంబర్ లో జరిగిన హాంకాంగ్ ఓపెన్‌లో సింధుపై మారిన్ గెలిచింది. ఇప్పటివరకూ సింధు తన కెరీర్లో 184 మ్యాచ్‌లు గెలవగా, 86 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇక మారిన్ తన కెరీర్లో 239 మ్యాచ్‌లు గెలిచి, 74 ఓడింది. మారిన్ విజయాల శాతం 76.36గా ఉండగా, సింధు విజయాల శాతం 67.00 గా ఉంది. మరోవైపు మారిన్ 19 టైటిల్స్‌ను సాధించగా, సింధు ఖాతాలో మూడు టైటిల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక 21 ఏళ్ల సింధు 65 కేజీల బరువుతో పాటు, 5.8 అడుగుల ఎత్తు కల్గి ఉండగా, 23 ఏళ్ల మారిన్ 65 కేజీల బరువు, 5.6 అడుగుల ఎత్తు ఉంది. తన అంతర్జాతీయ కెరీర్‌ను సింధు 2012 లో ఆరంభించగా, మారిన్ 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. -
ఒలింపిక్స్ హాకీలో కొత్త చరిత్ర!
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో అర్జెంటీనా పురుషుల హాకీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ పురుషుల హాకీలో తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని కొత్త అధ్యాయాన్ని లిఖించింది. గురువారం జరిగిన తుదిపోరులో అర్జెంటీనా 4-2 తేడాతో బెల్జియంను ఓడించి పసిడిని సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో అర్జెంటీనా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి జయకేతనం ఎగురవేసింది. ఆట తొలి అర్ధభాగంలో భాగంగా 10వ నిమిషంలో గోల్ సాధించిన అర్జెంటీనా.. ఆ తరువాత మరింత దూకుడగా ఆడి విజయాన్ని సాధించింది. దీంతో ఒలింపిక్స్ పురుషుల హాకీలో తొలి పతకాన్ని సాధించడమే కాకుండా, స్వర్ణాన్ని కూడా చేజిక్కించుకోవడం విశేషం. అయితే రజత పతకానికే పరిమితమైన బెల్జియం కూడా ఒలింపిక్స్ లో కొత్త చరిత్రను సృష్టించింది. ఒలింపిక్స్ హాకీలో బెల్జియంకు ఇదే అత్యుత్తమ పతకం. 1920లో కాంస్యాన్ని సాధించిన బెల్జియం.. ఆపై పతకాల వేటలో మాత్రం విఫలమైంది. తాజా రజతంతో 96 సంవత్సరాల ఒలింపిక్స్ హాకీలో పతకాల నిరీక్షణకు బెల్జియం తెరదించింది. -
'పసిడిని గెలవడమే నా లక్ష్యం'
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం పతకం సాధించడమే తన లక్ష్యమని ఇప్పటికే రజత పతకం ఖాయం చేసుకున్న భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు స్పష్టం చేసింది. ఇందుకోసం పూర్తిస్థాయిలో ప్రదర్శన ఇవ్వడానికి యత్నిస్తానని పేర్కొంది. 'ఒలింపిక్స్ లో పతకం గెలవడం ప్రతీ అథ్లెట్ లక్ష్యం. ఆ ఘనతను సాధించినందుకు గర్వంగా ఉంది. ఇంకా నా ముందు మరొక టార్గెట్ ఉంది. స్వర్ణ పతకం సాధించి ఘనంగా ఒలింపిక్స్‌ను ముగించాలని అనుకుంటున్నా. అందుకోసం శక్తివంచన లేకుండా ఆడతా. పసిడిని సాధిస్తానననే నమ్మకం ఉంది' అని సింధూ పేర్కొంది. తనపై ఎటువంటి ఒత్తిడి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పిన సింధూ.. 100 శాతం ఆట తీరును కనబరచడమే తన తదుపరి లక్ష్యమని తెలిపింది. ఇప్పటికే ఫైనల్ పోరు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని, కాకపోతే ఆ మ్యాచ్‌లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌ను ఓడించడం అంత సులువు కాకపోవచ్చని పేర్కొంది. వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా ఒక కఠినమైన ప్రత్యర్థి అనడంలో ఎటువంటి సందేహం లేదని సింధూ అభిప్రాయపడింది. గత కొంతకాలంగా కరోలినా మెరుగైన ప్రదర్శన ఇస్తున్న సంగతిని సింధు గుర్తు చేసింది. కాగా, తన పూర్తిస్థాయి ఆటను ప్రదర్శిస్తే మాత్రం కచ్చితంగా విజయం దక్కుతుందని పేర్కొంది. శనివారం రాత్రి గం.7.30 ని.లకు పివి సింధు-మారిన్‌ల మధ్య అంతిమ పోరు జరుగనుంది. -
సింధు సాధించేనా!
-
బోల్ట్ ఇన్.. గాట్లిన్ అవుట్!
రియో డీ జనీరో: ఒకరు జమైకా దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ అయితే, మరొకరు అమెరికా స్టార్ స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్. ఇద్దరూ రేసులో దిగారంటే పసిడి పోరు ఆసక్తికరంగా సాగుతుంది. రియో ఒలింపిక్స్ 100 మీటర్ల రేసులో కూడా ఇదే ఆవిష్కృతమైంది. బోల్ట్ స్వర్ణం సాధిస్తే.. గ్లాటిన్ రజతం సాధించాడు. అయితే 200 మీటర్ల ఫైనల్ రేసుకు వచ్చేసరికి మాత్రం గాట్లిన్ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం ఇద్దరు మాత్రమే అర్హత సాధించే సెమీస్ పోరులో ఉసేన్ బోల్ట్ ప్రథమ స్థానంలో నిలవగా, కెనడా స్ప్రింటర్ ఆండ్రీ డీ గ్రాస్సె రెండో స్థానంతో తుది పోరుకు సిద్ధమయ్యాడు. దీంతో గాట్లిన్ కు నిష్క్రమణ తప్పలేదు. ఈ రేసును 19.78 సెకెండ్లలో బోల్ట్ పూర్తి చేయగా, డీ గాస్సె 19.80 సెకెండ్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంతో ఫైనల్ రౌండ్ కు ప్రవేశించాడు. కాగా, గాట్లిన్ 20.13 సెకెండ్లలో రేసును పూర్తి చేయడంతో ఫైనల్ కు క్వాలిఫై కాలేకపోయాడు. ఇప్పటికే 100 మీటర్ల రేసులో బోల్ట్ పసిడిని సాధించాడు. దీంతో 100 మీటర్ల రేసులో వరుసగా మూడో స్వర్ణం సాధించిన ఏకైక అథ్లెట్ గా రికార్డు సాధించాడు. మరోవైపు వరుసగా ఏడో పసిడిని కూడా బోల్ట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 200 మీటర్ల ఫైనల్ రేసుతో పాటు 4x100 పరుగులో బోల్ట్ పసిడిని సాధిస్తే ఒలింపిక్స్ లో అపజయం లేని ధీరుడిగా మిగిలిపోతాడు. -
నెయమార్ అరుదైన ఫీట్
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్ ఫుట్ బాల్ స్టార్ నెయమార్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో అత్యంత వేగంగా గోల్ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బుధవారం రాత్రి హెండూరాస్ తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో బ్రెజిల్ కెప్టెన్ నెయమార్ అత్యంత వేగవంతమైన గోల్ సాధించి ఒలింపిక్స్ చరిత్రను తిరగరాశాడు. ఆట ప్రారంభమైన 15 సెకండ్లలోనే గోల్ సాధించి ఈ ఘనతను అందుకున్నాడు. ఇది నెయమార్ కెరీర్లో రెండో అత్యంత వేగవంతమైన గోల్ కాగా, ఒలింపిక్స్ లో అతనికి ఇదే మొదటి ఫాస్టెస్ట్ గోల్. గత ఒలింపిక్స్ లో మెక్సికో ఫార్వర్డ్ ఆటగాడు పెరాల్టా 29 సెకెండ్లలో గోల్ నమోదు చేయగా, రియో ఒలింపిక్స్‌లో హెండూరాస్ స్ట్రైకర్ అలబెర్త్ ఎలిస్ ఈ మార్కును చేరాడు. కాగా, ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు ముందే ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో కెనడా క్రీడాకారిణి జనైన్ బెకీ కేవలం 20 సెకెండ్లలోపే గోల్ సాధించి ఫాస్టెస్ట్ గోల్ సాధించింది. తాజాగా నెయమార్ అంతకంటే ముందుగానే గోల్ సాధించడంతో బెకీ రికార్డు తెరమరుగైంది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ 6-0 తేడాతో విజయం సాధించి జర్మనీతో తుదిపోరుకు సిద్దమైంది. ఆగస్టు 20 వ తేదీన జరిగిన పోరులో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటివరకూ ఒలింపిక్స్ ఫుట్ బాల్ లో స్వర్ణాన్ని సాధించని బ్రెజిల్.. జర్మనీపై గెలిచి తమ చిరకాల కోరికను తీర్చుకోవాలని భావిస్తోంది. గత లండన్ ఒలింపిక్స్‌లో ఫైనల్ కు చేరిన బ్రెజిల్ రజతంతోనే సరిపెట్టుకుంది. దాంతోపాటు స్వదేశంలో జరుగుతున్న ఒలింపిక్స్ లో విజేత గా నిలిచి 2014 వరల్డ్ కప్ లో జర్మనీ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని బ్రెజిల్ యోచిస్తోంది. -
యూఎస్ స్విమ్మర్లకు చేదు అనుభవం
రియో డీ జనీరో: ఒలింపిక్స్‌కు పాల్గొన్న ఇద్దరు యూఎస్ స్విమర్లను బ్రెజిల్లో చేదు అనుభవం ఎదురైంది. తమను కొంతమంది దోచుకునేందుకు యత్నించారంటూ స్విమ్మర్లు జాక్ కాంగర్, గున్నార్ బెంట్జ్లు ఇచ్చిన ఫిర్యాదు నమ్మశక్యం లేకపోవడంతో వారిని ఎయిర్ పోర్ట్ లో బ్రెజిల్ అధికారులు నిర్భదించారు. ఆ ఇద్దరూ తిరుగు ప్రయాణానికి సిద్ధమైన క్రమంలో ఉన్నపళంగా వారిని విమానం నుంచి దించేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ ఇద్దరి స్విమ్మర్లను నిర్భందించిన పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తున్న వీడియోను బ్రెజిల్ న్యూస్ ఆర్గనైజేషన్ గ్లోబో ఆన్ లైన్లో పోస్ట్ చేసింది. అయితే దీనిపై మరింత సమాచారం ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. దొంగతనం కేసుకు సంబంధించి ఆ ఇద్దర్నీ పోలీసులు విచారిస్తున్నట్లు యూఎస్ ఒలింపిక్ కమిటీ అధికార ప్రతినిది పాట్రిక్ సాండుస్కీ గురువారం తెలిపారు. దొంగతనం కేసులో యూఎస్ స్విమ్మర్లు చెప్పిన కథ ఎంతమాత్రం వాస్తవం లేదని బ్రెజిల్ జడ్జి అభిప్రాయం మేరకు వారిని ఆకస్మికంగా విమానం నుంచి దింపాల్సి వచ్చిందని బ్రెజిల్ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే యూఎస్ చేరిన మరో స్విమ్మర్ ర్యాన్ లాథే మాత్రం తాము దోపిడీకి గురైన విషయం వాస్తవమేనన్నాడు. సెంట్రల్ రియోలో ఓ అర్థరాత్రి పార్టీకి వెళ్లిన క్రమంలో కొంతమంది తమను గన్ బెదిరించినట్లు పేర్కొన్నాడు. ట్యాక్సీలో వెళుతున్న తమను కొందరు క్రిమినల్స్ అడ్డగించి డబ్బుతో పాటు కొన్ని విలువైన వస్తువుల్ని కూడా దోచుకెళ్లినట్లు పేర్కొన్నాడు. -
సింధు సాధించేనా!
రియో డీ జనీరో: రియో ఒలింపిక్సలో మన తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పివి సింధు పతకం సాధించడానికి అడుగుదూరంలో నిలిచింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత యిహాన్ వాంగ్‌పై అద్భుత విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. ఎలాంటి అంచనాలు లేకుండా రియోకు వెళ్లిన సింధు... సంచలన ఆటతీరుతో క్వార్టర్స్‌లో చైనా వాల్‌ను అధిగమించి పతకంపై ఆశలు రేపింది. ఇక ఒక విజయం సాధిస్తే సింధూకు రజత పతకం దక్కుతుంది. ఒక వేళ ఓడితే మాత్రం కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ వరకూ నిరీక్షించక తప్పుదు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్, లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత యిహాన్ వాంగ్‌పై సింధు సంచలన విజయం సాధించింది. ఈ ఒలింపిక్స్ లో తొమ్మిదో సీడింగ్ గా బరిలోకి దిగిన సైనా 22-20, 21-19 తేడాతో వాంగ్‌ను మట్టికరిపించింది. 2015లో డెన్మార్క్ ఓపెన్‌లో వాంగ్‌ను ఓడించిన సింధు అదే తరహా ఆట తీరుతో ఒలింపిక్స్‌లోనూ చెలరేగింది. దీంతో వాంగ్ పై వరుసగా రెండో విజయం సాధించింది. ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా మ్యాచ్ చివరి వరకూ అత్యంత నిలకడను ప్రదర్శించింది. ఓ దశలో తొలి గేమ్‌లో వెనుకబడిన సింధు... అంచనాలకు అందుకుంటూ నెమ్మదిగా ముందంజ వేసింది. ఆ తరువాత రెండో గేమ్‌లో కూడా సింధు తన సహజ సిద్ధమైన ఆట తీరునే ప్రదర్శించింది. విజయమే తుది లక్ష్యంగా చెలరేగిన సింధుపై ఇప్పుడు యావత్ భారతవాని కోటి ఆశలు పెట్టుకుంది. గురువారం రాత్రి గం.7.30 ని.లకు సింధు .. జపాన్ క్రీడాకారిణి ఒకుహారాతో అమీతుమీ తేల్చుకోనుంది. స్మాష్లే సింధు ఆయుధం ఇటీవల కాలంలో స్మాష్‌లను కొట్టడంలో సింధు ఆరి తేరిందనే చెప్పాలి. సింధు కచ్చితమైన స్మాష్లతోనే ఒలింపిక్స్ లో కీలక విజయాల్ని సొంతం చేసుకుంది. ప్రత్యర్థి ఎటువంటి తప్పిదం చేసినా అందుకు బదులు చెప్పేందుకు స్మాష్లనే ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తోంది. మరోవైపు సింధు మంచి ఎత్తు ఉండటం కూడా ఆమెకు బాగా కలిసొస్తుంది. ఈ రోజు జరిగే సెమీస్ పోరులో సింధు.. ప్రపంచ ఆరో ర్యాంక్ క్రీడాకారిణి, జపాన్ స్టార్ ఒకుహురాతో తలపడనుంది. తన కంటే ఎంతో మెరుగైన ఇద్దరు క్రీడాకారిణులను ఇప్పటికే ఓడించిన సింధు.. తాజా పోరును కూడా అలానే కొనసాగించాలని ఆశిస్తుంది. ప్రిక్వార్టర్, క్వార్టర్ల్లో వరుస సెట్లలో మ్యాచ్‌లను కైవసం చేసుకున్న సింధు అదే ఆట తీరును ప్రదర్శించాలని భారత అభిమానుల ఆకాంక్ష కూడా. 20 ఏళ్ల తరువాత.. ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో కేవలం ఒక చైనా క్రీడాకారిణి మాత్రమే సెమీస్ అర్హత సాధించడం సుమారు 20 ఏళ్ల తరువాత ఇదే ప్రథమం. ఒక సెమీస్ లో భారత క్రీడాకారిణి సింధు, జపాన్ క్రీడాకారిణి ఓకుహరాలు పోరుకు సిద్ధమవ్వగా, మరో సెమీస్‌లో కరోలిన్ మారిన్(స్పెయిన్)తో లీ ఘురీ(చైనా) తలపడనుంది. దీంతో రెండు పతకాలకు చైనా క్రీడాకారిణులు దూరం కాక తప్పలేదు. 2000, 04 సంవత్సరాల్లో స్వర్ణం, కాంస్య పతకాల్ని సాధించిన చైనా క్రీడాకారిణులు.. 2008, 12ల్లో స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకున్నారు. దీంతో 1996 తరువాత తొలిసారి చైనా హవాకు మళ్లీ ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాలి. -
నన్ను పెళ్లి చేసుకోవూ!
వెయిట్ లిఫ్టింగ్‌లో లాషా ప్రపంచ రికార్డు రియో డి జనీరో: అథ్లెటిక్స్‌లో 100మీ. పరుగు గెలిచిన వ్యక్తిని ప్రపంచంలో వేగవంతమైన మనిషి అంటారు. అలాగే వెయిట్ లిఫ్టింగ్‌లో 105 ప్లస్ కిలోల సూపర్ హెవీ వెయిట్ విభాగంలో గెలిచిన వ్యక్తిని ఉక్కుమనిషి అంటారు. ఈసారి ఒలింపిక్స్‌లో జార్జియా వెయిట్ లిఫ్టర్ లాషా తలఖజ్దే ‘ఉక్కుమనిషి’గా అవతరించారు. స్నాచ్‌లో 215 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 258 కిలోల బరువు ఎత్తిన లాషా... రెండూ కలిపి మొత్తం 473 కిలోలతో ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణపతకం సాధించాడు. అర్మెనియా లిఫ్టర్ గోర్ మినస్యాన్ 451 కేజీలతో రజతాన్ని, జార్జియాకే చెందిన ఇరాకీ తుర్మానిజ్దే 448 కిలోలతో కాంస్య పతకాన్ని సాధించారు. అయితే.. స్నాచ్‌లో ఇరాన్ లిఫ్టర్ బెహ్దాద్ సలీమీకోర్దసైబీ 216 కిలోల బరువు ఎత్తి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పినా... క్లీన్ అండ్ జర్క్‌లో విఫలమై తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ‘హర్డిల్స్’ దాటిన జమైకా స్ప్రింట్‌లో ప్రపంచాన్ని వెనక్కు నెట్టి ముందుకెళ్తున్న జమైకన్లు ఇప్పుడు హర్డిల్స్‌లోనూ మేమున్నామంటున్నారు. రియోలో 110 మీటర్ల హర్డిల్స్‌లో జమైకన్ ఓమర్ మెక్ లియోడ్ 13.05 సెకన్లలోనే రేసు పూర్తి చేసి శభాష్ అనిపించాడు. క్యూబా అథ్లెట్ ఓర్లాండో ఓర్టెగా 13.17 టైమింగ్‌తో రజతం, ఫ్రాన్స్‌కు చెందిన దిమిత్రి బాస్కౌ 13.24 టైమింగ్‌తో కాంస్యాన్ని చేజిక్కించుకున్నారు. 1992లో బార్సిలోనా ఒలింపిక్స్ తర్వాత 110 మీటర్ల హర్డిల్స్ ఒలింపిక్స్ ఫైనల్లో ఇంత తక్కువ టైమింగ్ నమోదవటం ఇదే తొలిసారి. అమెరికాకు 120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో హర్డిల్స్‌లో మెడల్ రాకపోవటం కూడా ఇదే మొదటిసారి. తీరిన బ్రెజిల్ కల బ్రెజిల్ లైట్‌వెయిట్ బాక్సర్ రాబ్సన్ కాన్సీకావ్ ఆతిథ్య జట్టు తరపున ఒలింపిక్స్‌లో రికార్డు సృష్టించాడు. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో బ్రెజిల్‌కు తొలి స్వర్ణం అందించాడు. స్థానిక అభిమానుల సమక్షంలో వారి నినాదాల స్ఫూర్తితో.. ఫైనల్లో ఫ్రాన్స్ బాక్సర్ సొఫైన్ ఔహిమాను 3-0తో ఓడించాడు. ‘ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవటం నమ్మశక్యంగా లేదు. నా ప్రత్యర్థి చాలా మంచి ఆటగాడు. అతనిపై గెలవటం ఆనందంగా ఉంది. ఈరోజుకోసం కలగన్నాను, సాధించాను’ అని రాబ్సన్ తెలిపాడు. బాక్సింగ్‌ను ప్రొఫెషన్‌గా తీసుకోకముందు రాబ్సన్ కూరగాయలు అమ్ముకునేవాడు. 84 ఏళ్ల తర్వాత... కెనడా హైజంప్ అథ్లెట్ కొరున్నా రియో ఒలింపిక్స్‌లో 2.38 మీటర్ల ఎత్తుకు ఎగిరి స్వర్ణం సాధించాడు. 2.39 మీటర్లతో ఉన్న ఒలింపిక్స్ రికార్డును బ్రేక్ చేసే ప్రయత్నంలో విఫలమైనా.. మొదటి స్థానంలో నిలిచాడు. రియో ఒలింపిక్స్‌లో కెనడాకు తొలి పురుషుల విభాగంలో స్వర్ణం ఇది. దీంతోపాటు 1932 లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్ తర్వాత కెనడాకు హై జంప్‌లో ఇదే మొదటి బంగారుపతకం. ముతాజ్ (ఖతార్) 2.36 మీటర్లు, బోహ్దన్ (ఉక్రెయిన్) 2.33 మీటర్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. నన్ను పెళ్లి చేసుకోవూ! రియో ఒలింపిక్స్ మొదలైనప్పటినుంచి క్రీడాకారులు.. మెడల్స్ గెలిచాక తమ ప్రేయసిలను కలిసి పెళ్లికి ప్రతిపాదించటం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ జాబితాలోకి ఓ అమెరికన్ అథ్లెట్ల జంట చేరింది. అమెరికన్ ట్రిపుల్ జంపర్ విల్ క్లే మంగళవారం రజతం గెలిచాడు. ఈ ఆనందంలో వెంటనే స్టాండ్స్‌లో కూర్చున్న అమెరిన్ హర్డిల్స్ క్రీడాకారిణి క్వీన్ హారిసన్‌కు ప్రపోజ్ చేశాడు. దీనికి క్వీన్ వెంటనే ‘యస్’ చెప్పటంతో ఆనందంతో ఎగిరిగంతేశాడు. క్వీన్ హారిసన్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోయినా.. విల్ క్లే కోసమే బ్రెజిల్‌కు వచ్చింది. -
తల ముందుకుపెట్టి.. స్వర్ణం కొట్టేసింది!
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. బహమాయికి చెందిన స్ప్రింటర్ షాన్ మిల్లర్ ఊహించని విధంగా తలను ముందుగా లైన్‌పై పెట్టి పసిడిని సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున జరిగిన 400 మీటర్ల రేసులో మిల్లర్ అందరికంటే ముందు లైన్‌పై డైవ్ కొట్టి మరీ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ రేసు మొదలయ్యాక అమెరికా స్ప్రింటర్ అలైసన్ ఫెలిక్స్, మిల్లర్లు హోరీహోరీగా తలపడ్డారు. అయితే 398 మీటర్ల వరకూ ఈ ఇద్దరూ సరిసమానం పరుగెత్తగా, చివర్లో మిల్లర్ డైవ్ చేసి తన తలను ముందు లైన్‌పై ఉంచి విజేతగా నిలిచింది. దీంతో ఒలింపిక్స్ లో ఐదో స్వర్ణం సాధించాలనుకున్న అలైస్ ఫెలిక్స్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీరిద్దరూ రేసును పూర్తి చేసే క్రమంలో వారి మధ్య వ్యవధి 0.07 సెకండ్లుగా నమోదు కావడం గమనార్హం. అయితే మిల్లర్ ఇలా డైవ్ కొట్టి స్వర్ణాన్ని కైవసం చేసుకోవడం రియో ఒలింపిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు ఇలా తల ముందుకు పెట్టి గెలిచిన వాళ్లు ఎవరూ లేరని.. ఈ తరహాలో గెలవడం ఇదే మొదటిసారని అంటున్నారు. -
ఒలింపిక్ గ్రామంలో కార్చిచ్చు కలకలం
రియో డీ జనీరో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ జరుగుతున్న రియో గ్రామంలో మంటల కలకలం రేగింది. రియో నగరానికి చివర ఉన్న డీయోడోరోలో మౌంటేన్ బైక్ ఈవెంట్లు, హాకీ మ్యాచ్‌లు జరుగుతున్న మైదానాల్లో బూడిద వ్యాపించడంతో మంటల ఘటన వెలుగుచూసింది. సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా చోటు చేసుకున్న కార్చిచ్చు కారణంగా బీఎంఎక్స్ సెంటర్‌ను ఉన్న పళంగా ఖాళీ చేయించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగానే మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు. సుమారు 97 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడమే మంటలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో పాటు గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో మంటల తీవ్రత బాగా పెరిగిపోయింది. గాలుల కారణంగా 65 అడుగుల ఎత్తులో ఉన్న కెమెరా ఒకటి ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మంటలు అదుపులోకి వచ్చినట్లు ఒలింపిక్ నిర్వాహకులు తెలియజేశారు. -
సీమా పూనియా అవుట్
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్ లో భారత డిస్కస్క త్రో క్రీడాకారిణి సీమా పూనియా నిరాశపరిచింది. గ్రూప్-బిలో జరిగిన డిస్కస్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో పూనియా ఫైనల్ కు అర్హత సాధించడంలో వైఫల్యం చెందింది. తొలి ప్రయత్నంలో 57.58 మీటర్లు డిస్క్ విసిరిన సీమా.. ఆ తరువాత ప్రయత్నాలో ఘోరంగా విఫలమై 20వ స్థానానికి పరిమితమైంది. డిస్కస్ త్రో పాల్గొనే వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒకో గ్రూపులో 17 మంది క్రీడాకారిణులు పాల్గొనగా, ఫైనల్‌కు మాత్రం రెండు గ్రూపుల్లో కలిపి 12 మంది మాత్రమే అర్హత సాధిస్తారు. దీంతో డిస్కస్ త్రో ఈవెంట్లో ఫైనల్ కు చేరాలన్న సీమా ఆశలు తీరలేదు. కాగా, క్యూబీ క్రీడాకారిణి యెమీ పెరెజ్ 65. 38 మీటర్లు డిస్క్ విసిరి అగ్రస్థానంలో నిలిచింది. -
సింధు సంచలనం
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సంచలన విజయం సాధించింది. మహిళల సింగిల్స్ విభాగంలో తన కంటే ఎంతో మెరుగైన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ ఝు యింగ్‌పై సింధు గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున జరిగిన పోరులో సింధు 21-13, 21-15 తేడాతో ఝు యింగ్ ఓడించి క్వార్టర్స్ కు చేరింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ వీరిద్దరి ముఖాముఖి పోరులో యింగ్ 4-2తో ముందంజంలో ఉంది. దీంతో యింగ్ నే మ్యాచ్ ఫేవరెట్‌గా పరిగణించగా, సింధు మాత్రం అంచనాలను తారుమారు చేస్తూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆద్యంతం దూకుడును కనబరిచిన సింధు.. తొలి గేమ్‌ను అవలీలగా గెలుచుకుంది. అయితే రెండో గేమ్‌లో యింగ్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా చివరకు సింధునే పైచేయి సాధించింది. వరుస రెండు గేమ్‌ల్లో ఏకపక్ష విజయం సాధించిన సింధు పదునైన స్మాష్‌లతో అలరించి నాకౌట్ పోరుకు సిద్ధమైంది. దీంతో క్వార్టర్స్ లో చైనా క్రీడాకారిణి, ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ యిహాన్తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. అంతకుముందు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. -
స్కూలింగ్..నాకో సెల్ఫీ ఇవ్వవా!
సింగపూర్:జోసెఫ్ స్కూలింగ్..ఈ పేరు ఇప్పుడు సింగపూర్ దేశమంతటా మారుమోగిపోతోంది. రియో ఒలింపిక్స్ స్విమ్మింగ్ 100 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలోలో దేశానికి తొలిసారి బంగారు పతకం సాధించాడు. అంతేకాకుండా స్విమ్మింగ్ లో పసిడి అంటే అమెరికన్ దిగ్గజం మైఖేల్ ఫిల్ఫ్ కే సొంతం అనే ముద్రను కూడా చెరిపేశాడు. ఆ ఈవెంట్లో ఫెల్ప్స్‌ను రెండో స్థానానికి నెట్టి మరీ పసిడిని దక్కించుకున్నాడు. అయితే సోమవారం తెల్లవారుజామున సింగపూర్‌కు చేరుకున్న స్కూలింగ్ ఆ దేశం ఘనస్వాగతం పలికింది. ఈ క్రమంలోనే సింగపూర్ ఎయిర్ పోర్టు భారీ అభిమానులతో నిండిపోయింది. స్కూలింగ్ బ్యానర్లతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణం మెరిసిపోయింది. దాదాపు ఆరు గంటల పాటు విమానాశ్రయంలో అభిమానులు స్కూలింగ్ రాకకోసం నిరీక్షించడమే అతని ప్రతిభకు అద్దం పడుతుంది. అయితే సింగపూర్ ప్రధాని లీ హసేన్ లూంగ్ సైతం స్కూలింగ్‌కు వీరాభిమాని అయిపోయాడు. ఈ క్రమంలోనే స్కూలింగ్ తో సెల్ఫీ దిగాలని ముచ్చటపడ్డారు. దేశ కీర్తిని ఇనుమడింపజేసిన స్కూలింగ్‌కు తాను ప్రస్తుతం అభిమానిని అయ్యానంటూ లూంగ్ పేర్కొన్నారు. 'ఐ లవ్ యూ జో్సెఫ్. దేశ కీర్తిని మరింత పెంచావ్. నీతో సెల్పీ దిగాలని ఉంది'అని లూంగ్ తన మనసులో మాటను బయటపెట్టారు. ఆ ఫోటోను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసి స్కూలింగ్‌పై అభిమనాన్ని చాటుకున్నారు. సాధారణంగా తనతో్ సెల్పీలు దిగాలని ప్రజలు అడుగుతుంటారు. కానీ ఈరోజు స్కూలింగ్ను సెల్ఫీ అడగటాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నా అని ప్రధాని తెలిపారు. ఇదిలా ఉండగా, దేశ మిలటరీ సర్వీస్ నుంచి స్కూలింగ్ మరో నాలుగు సంవత్సరాల పాటు మినహాయింపు ఇస్తున్నట్లు రక్షణ మంత్రి ఇంగ్ హెన్ పేర్కొన్నారు. వచ్చే టోక్యో ఒలింపిక్స్ వరకూ స్కూలింగ్ మిలటరీకి దూరంగా ఉండవచ్చంటూ హెన్ పేర్కొన్నారు. ఆ ఒలింపిక్స్‌లో కూడా స్కూలింగ్ విజయవంతం కావాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
దీప అదృష్టం అక్కడే తారుమారు..
రియో డీ జనీరో: దీపా కర్మాకర్.. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్. అంతేకాకుండా రియోలో ప్రొడునోవా వాల్ట్ విభాగంలో తుది పోరుకు అర్హత సాధించి సరికొత్త చరిత్రను కూడా లిఖించింది. అయితే భారత కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో దీపా నాల్గో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. కాగా, దీపను పాయింట్ల పరంగా వెనుక్క నెట్టింది మాత్రం సిమోన్ బైల్స్ (అమెరికా-15.966 పాయింట్లు), మరియా పాసెకా (రష్యా-15.253 పాయింట్లు)లు మాత్రమే. ఫైనల్ పోరులో భాగంగా వరల్డ్ టాప్ జిమ్నాస్ట్లైన బైల్స్, పాసెకాలు చివర్లో బరిలోకి దిగి దీప ఆశలను నీరుగార్చారు. క్వాలిఫికేషన్ రౌండ్లో టాప్-8కు అర్హత సాధించిన వారు ఫైనల్ పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో దీపా ఆరో స్థానంలో బరిలోకి దిగింది. తొలి ప్రయత్నంలో14.866 పాయింట్లుసాధించిన దీప... రెండో ప్రయత్నంలో 15.266 పాయింట్లు సంపాదించింది. దీంతో ఓవరాల్ సగటు 15.066 పాయింట్లగా నమోదైంది. దీంతో దీప తన రౌండ్ ను ముగించిన తరువాత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి పతకంపై ఆశలు రేపింది. కాగా, చివర్లో పాసికా, బైల్స్‌లు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో దీపా అనూహ్యంగా వెనక్కిపడిపోయింది. అయినప్పటికీ యావత్ భారతావని మనసును మాత్రం గెలుచుకుంది. కష్టసాధ్యమైన ప్రొడునోవాలో ముందుకు వెళ్లడమే తలకు మించిన భారం. మరి అటువంటింది 'టాప్' జిమ్నాస్ట్‌ల చేతిలో ఓడిపోయిన దీపది కచ్చితంగా అత్యుత్తమ ప్రదర్శనే కదా.ప్రస్తుతం భారత్ లో దీప ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురవడమే ఆమె పోరాట స్ఫూర్తికి నిదర్శనం. -
బోల్ట్ 'పరుగు' వెనుక రహస్యం?
రియో డీ జనీరో: 'నాలో చురుకుదనం తగ్గింది. రేసును పూర్తి చేసే క్రమంలో సరైన ప్రదర్శన చేయలేదు. రేస్‌లో నా ప్రారంభం అంత గొప్పగా జరగలేదు. ఏ పెద్ద ఈవెంట్లోనూ ఈ సమయంలో పరుగెత్తిన అలవాటు నాకు లేదు. గాడిలో పడటానికి యత్నిస్తా. ' ఇవన్నీ రియో ఒలింపిక్స్‌లో వంద మీటర్ల పరుగు పందెంలో సెమీ ఫైనల్ కు అర్హత సాధించిన తరువాత బోల్డ్ చెప్పిన మాటలు. తొలి రౌండ్ హీట్స్ పోటీల్లో భాగంగా 10.07 సెకన్లలో లక్ష్యం చేరి అగ్రస్థానంలో నిలిచినా బోల్ట్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే పతకం పోరుకు వచ్చేసరికి బోల్ట్ తనలోని చురుకుదనం తగ్గలేదని నిరూపించుకుని.. రియోలో తొలి స్వర్ణాన్ని అందుకున్నాడు. కేవలం 9.81 సెకన్లలో పురుషుల వందమీటర్ల ఫైనల్ పరుగుపందెన్ని పూర్తిచేసి.. వరుసగా మూడోసారి ఒలింపిక్స్ స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి స్ప్రింటర్ గా చరిత్ర సృష్టించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్ లలో పురుషుల వందమీటర్ల పరుగు పందెంలో బోల్ట్ స్వర్ణాలను సాధించగా.. ఆయా ఒలింపిక్స్‌లలో 200 మీటర్ల వ్యక్తిగత రేసులో, 4x100 జట్టు పరుగు పందెంలో ఆ స్పీడ్ స్టార్ పసిడి పతకాలను కైవసం చేసుకున్నాడు. అయితే.. బోల్ట్‌కు మాత్రమే ఇదెలా సాధ్యమైంది? అతను బుల్లెట్లా దూసుకెళ్లడం వెనక రహస్యమేంటి? 2008లో ఒలింపిక్స్‌లో పసిడి పండించడంతో మొదలుపెట్టి.. ఇప్పటి వరకూ ప్రపంచ ఛాంపియన్ షిప్, ఒలింపిక్స్.. ఆటేదైనా.. మెడల్ మాత్రం బోల్ట్ దే. మామూలుగా వేగంగా పరిగెత్తాలంటే.. కాళ్లు వేగంగా కదిలించాలి. కానీ బోల్ట్ మాత్రం వేరే చిట్కా పాటిస్తాడట. అగ్రశ్రేణి స్ప్రింటర్లు 100 మీటర్ల రేసును పూర్తి చేయడానికి 50 నుంచి 55 అంగలు ఉపయోగిస్తే.. ఈ జమైకా స్టార్ 40 అంగల లోపే రేసును పూర్తి చేస్తాడట. కొన్ని సందర్బాల్లో కేవలం 35 అంగల్లోనే ఆ రేసును పూర్తి చేయడమే బోల్ట్ ను మిగతావారి కంటే ముందంజలో నిలబెడుతుందట. గతంలో బోల్ట్ వేగంపై పరిశోధన చేసిన అమెరికాకు చెందిన శాస్త్ర వేత్త డాక్టర్ ఎలెన్ ఈ విషయాలను వెల్లడించారు. అదే బోల్ట్‌ను మిగతావారి కంటే ముందు రేస్ పూర్తి చేసేందుకు సహాయపడుతుంది.అంతే కాదు.. సాధారణంగా అగ్రశ్రేణి రన్నర్ ప్రతి అంగలో భూమి మీద కాలు మోపే కాలం 0.12 సెకండ్లు కాగా.. బోల్ట్ కేవలం 0.8 సెండ్లు మాత్రమే నేల మీద కాలు పెడతాడు. మిగతా వారితో పోలిస్తే బోల్ట్ 10 నుంచి 15 శాతం ఎక్కువ సమయం గాలిలో ఉంటాడట. ఇవన్నీ బోల్డ్ రేసును వేగంగా పూర్తి చేయడానికి ప్రధాన కారణమని తేల్చారు. -
సైనా నెహ్వాల్ అవుట్
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారణి సైనా నెహ్వాల్ నిరాశపరిచింది. గ్రూప్ -జిలో భాగంగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్ లో మారియా ఉలితినా(ఉక్రెయిన్)చేతిలో 18-21, 19- 21 తేడాతో సైనా పరాజయం చెందింది. దీంతో ఒలింపిక్స్ లో సైనా పోరాటం ముగిసింది. రియో ఒలింపిక్స్ లో ఐదో సీడ్ బరిలోకి దిగిన సైనా.. 61వ ర్యాంక్ క్రీడాకారిణి ఉలితినా చేతిలో ఓటమి పాలు కావడంతో భారత పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడింది. ఈ గ్రూప్ లో తొలి మ్యాచ్ లో గెలిచిన సైనా.. రెండో మ్యాచ్ లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ మ్యాచ్ లో తొలి గేమ్ ఆరంభంలో ఆధిక్యంలోకి వెళ్లినట్లు కనిపించిన సైనా.. అనూహ్యంగా వెనుబడి ఆ గేమ్‌ను చేజార్చుకుంది. అనంతరం రెండో గేమ్‌లో తీవ్ర ఒత్తిడిలోనైన సైనా ఉలితినాను నిలువరించలేకపోయింది. అటు ఎఫెన్స్లోనూ, ఇటు డిఫెన్స్‌లోనూ అత్యంత పేలవ ప్రదర్శనతో సైనా తగిన మూల్యం చెల్లించుకుంది. గత లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన సైనా..మరోసారి ఒలింపిక్స్ పతకం సాధించాలన్న ఆశలు తీరలేదు. ఇక మహిళల సింగిల్స్ లో పివీ సింధుపైనే భారత పతకం ఆశలు ఆధారపడి ఉన్నాయి. -
వ్యక్తిగత కోచ్‌లను అనుమతించడం వల్లే..
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న షూటర్ల పేలవ ప్రదర్శనపై భారత రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రణీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనను నిందించుకోవడం తప్ప చేసేదేమీ లేదంటూ ఆవేదన చెందారు. కొంతమంది షూటర్లకు వ్యక్తిగత కోచ్‌లను అనుమతించమే తాము చేసిన అతి పెద్ద తప్పిదమని రణీందర్ పేర్కొన్నారు.ఈ విషయంపై భవిష్యత్తులో తాము ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 'పలువురు వ్యక్తిగత కోచ్‌లను నియమించుకోవడానికి గతంలో అనుమతినిచ్చాం. అదే మేము గుడ్డిగా చేసిన తప్పిదం. ఈ కారణం చేత తుది ఫలితం రాబట్టడంలో విఫలమయ్యాం. ముఖ్యంగా ముగ్గురు అథ్లెట్ల ప్రదర్శన చాలా పేలవంగా ఉండగా, మిగతా వారు బాగానే ఆకట్టుకున్నారు'అని ఆయా షూటర్ల పేర్లను ప్రస్తావించని రణీందర్ విమర్శలు గుప్పించారు. రియో ఒలింపిక్స్‌కు 12 మంది షూటర్ల బృందం వెళితే ప్రదర్శన ఎంతమాత్రం ఆశాజనకంగా లేదన్నారు. దీనిపై తనను విమర్శించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నాడు. ఇప్పటికే పలు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఒక భారత షూటర్ ఏ ఒక్క దాంట్లోనూ కనీసం ప్రదర్శన చేయలేదని గగన్ నారంగ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. దీనిపై తమ ఫెడరేషన్ సీరియస్ దృష్టి సారించిందని రణీందర్ పేర్కొన్నాడు. -
ధైర్యం కోల్పోవద్దు: మోదీ
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు మద్దతుగా నిలవాలంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన విజ్ఞప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రియోకు వెళ్లిన అథ్లెట్లు ఎట్టిపరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని మోదీ హితవు పలికారు. జీవితంలో గెలుపు-ఓటములు అనేవి సహజమని, దానిపై ఆలోచించకుండా మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నించాలని మోదీ పేర్కొన్నారు. 'రియోలో భారత అథ్లెట్లకు ఒకటే విన్నవిస్తున్నా. ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నించండి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఫలితం గురించి ఆలోచించకుండా ప్రదర్శన ఇవ్వండి. మన అథ్లెట్ల ఇప్పటివరకూ పతకం తేలేకపోయినా, వారి ప్రదర్శన గర్వించే విధంగా ఉంది. ఫలితం కోసం ఆలోచించి అదనపు భారాన్ని వేసుకోవద్దు. ఓర్పు, అంకితభావం, పట్టుదల అనేది మాత్రమే ఇక్కడ ప్రధానం. అప్పుడే మనల్ని నిరూపించుకునే ఆస్కారం ఉంది' అని మోదీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మద్దతు తెలిపారు. -
'పసిడి'పై డెల్ పాట్రో గురి!
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ఫామ్‌తో చెలరేగిపోతున్న అర్జెంటీనా స్టార్ టెన్నిస్ ఆటగాడు పసిడిపై గురి పెట్టాడు. శనివారం అర్థరాత్రి జరిగిన సెమీ ఫైనల్లో డెల్ పాట్రో సంచలన విజయం నమోదు చేసి ఫైనల్‌కు చేరాడు. పురుషుల సింగిల్స్ లో భాగంగా స్పెయిన్ బుల్, మూడో సీడ్ రఫెల్ నాదల్ ను బోల్తా కొట్టించిన డెల్ పాట్రో తుది పోరుకు అర్హత సాధించాడు. హోరాహోరీగా మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో పాట్రో 5-7, 6-4, 7-6(7/5) తేడాతో నాదల్‌ను ఓడించి పసిడి పోరుకు సిద్ధమయ్యాడు. తొలి సెట్‌ను కోల్పోయిన పాట్రో.. ఆ తరువాత ఏమాత్రం బెదరకుండా నాదల్‌ను ఇంటికి పంపించాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పోరులో డెల్ పాట్రో ఒత్తిడిని జయించి ఫైనల్ కు చేరగా, నాదల్ మాత్రం తీవ్రమైన ఒత్తిడిలోనై ఓటమి పాలయ్యాడు. ప్రధానంగా టై బ్రేక్ కు దారి తీసిన మూడో సెట్ లో డెల్ పాట్రో అద్భుతమైన ఏస్ లతో ఆకట్టుకున్నాడు. దీంతో రెండో ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించాలన్న నాదల్ ఆశలకు బ్రేక్ పడింది.2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో తొలిసారి చాంపియన్‌గా నిలిచిన నాదల్.. 2012 లండన్ ఒలింపిక్స్‌కు మాత్రం గాయంతో దూరమయ్యాడు.కాగా, రియో ద్వారా రెండో సింగిల్స్ ఒలింపిక్ పసిడిని సాధించి మరోసారి పూర్వవైభవాన్ని చాటుకోవాలని నాదల్ యత్నించినా, డెల్ పాట్రో లాంటి పటిష్టమైన ప్రత్యర్థి ముందు తలవంచక తప్పలేదు. రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్లోనే వరల్డ్ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకొవిచ్‌ను ఇంటికి పంపిన డెల్ పాట్రో మరోసారి అదే తరహా ఆట తీరుతో నాదల్కు చుక్కలు చూపించాడు. దీంతో మరో సెమీ ఫైనల్లో జపాన్ ఆటగాడు నిషాకోరిపై విజయం సాధించిన ఆండీ ముర్రేతో అమీతుమీ తేల్చుకునేందుకు పాట్రో సిద్ధమయ్యాడు. అయితే గత నెల్లో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ గెలిచి మంచి ఊపుమీద ఉన్న ముర్రేను పాట్రో ఎంతవరకూ నిలువరిస్తాడని అర్జెంటీనా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, లండన్ ఒలింపిక్స్ లో స్వర్ణాన్ని సాధించిన ముర్రే... అదే ఫలితాన్ని రియోలో కూడా పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. -
అది నిజంగా బాధాకరం: కోహ్లి
గ్రాస్ ఐలెట్: రియో ఒలింపిక్స్‌లో భారత్ ఇంకా పతకాల ఖాతా తెరవకపోవడంపై కొంతమంది చేస్తున్న విమర్శలు ఎంతమాత్రం సరికాదని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. ఒలింపిక్స్‌కు వెళ్లిన అథ్లెట్లకు అక్కడ ఉన్నతమైన సౌకర్యాలు లేకపోయినా, వారు ఎటువంటి శక్తివంచనలేకుండా తమ మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తున్న విషయాన్ని గుర్తించాలన్నాడు. వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు మద్దతుగా నిలిచాడు. 'ఒలింపిక్స్‌లాంటి ఒక మెగా ఈవెంట్‌కు మన అథ్లెట్లు ఎలా సన్నద్ధమయ్యారు అనే కోణంలో మాత్రమే చూడాలి. అక్కడ వారు ఏమి చేస్తున్నారు అనే విషయాన్ని వదిలిపెట్టండి. తమ తమ స్థాయిలో అత్యున్నత ప్రదర్శన ఇవ్వడానికి యత్నిస్తునే ఉన్నారు. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మన అథ్లెట్లపై విమర్శలు రావడం నిజంగా చాలా బాధాకరం. ప్రతీరోజూ మనది కాదు. గెలుపు-ఓటములు అనేది క్రీడలో సహజం. క్రికెట్లో కూడా ప్రతీ సిరీస్‌ను గెలవలేము కదా. భారత అథ్లెట్లపై విమర్శలు ఆపి, వారికి మద్దతుగా నిలవండి' అని కోహ్లి హితవు తెలిపాడు. -
లెడెకీ ప్రపంచ రికార్డు
రియో డీ జనీరో :రియో ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రాతినిథ్యం వహిస్తున్న 19 ఏళ్ల మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ సరికొత్త వరల్డ్ రికార్డును నమోదు చేసింది. ఇప్పటికే 200, 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణపతకాలను కైవసం చేసుకున్న లెడెకీ.. తాజాగా జరిగిన 800 మీటర్ల ఫ్రీ స్టయిల్ పోరులో కూడా పసిడిని ఒడిసి పట్టుకుంది. ఈ రేసును 8:04.79 నిమిషాల్లో పూర్తి చేసి గత జనవరిలో నెలకొల్పిన తన రికార్డును మరోసారి సవరించుకుంది. మరోవైపు 48 ఏళ్ల తరువాత ఈ మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలను సాధించిన అమెరికా స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించింది. 1968లో అమెరికా మాజీ స్విమ్మర్ డెబీ మెయర్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించింది. కాగా, ఒలింపిక్స్ 800 మీటర్ల ఫ్రీ స్టయిల్లో రెండోసారి స్వర్ణాన్ని సాధించిన మూడో అమెరికా స్విమ్మర్‌గా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. గత లండన్ ఒలింపిక్స్‌లో లెడెకీ ఈ విభాగంలో బరిలోకి దిగి పసిడి పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల ప్రాయంలోనే లెడెకీ 800 మీటర్ల ఫ్రీ స్టయిల్లో స్వర్ణాన్ని సాధించి దిగ్గజాలను సైతం నివ్వెరపరిచేలా చేసింది. రియో ఒలింపిక్స్ లో లెడెకీ ఇప్పటివరకూ నాలుగు పసిడి పతకాలను సాధించింది. 4x200 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించిన అమెరికా జట్టులో లెడెకీ ప్రధాన పాత్ర పోషించింది. ఓవరాల్ గా లెడెకీఖాతాలో ఐదు పతకాలుండగా, అందులో ఒకటి మాత్రమే రజతం ఉంది. -
భళా భోకనాల్ దత్తు!
రియో డీ జనీరో:తొలి ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత రోయర్ దత్తు భోకనాల్ అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సీ/డీ సెమీ ఫైనల్ స్కల్స్‌లో రెండో స్థానంలో నిలిచి ఫైనల్-సీకి అర్హత సాధించాడు. 2 వేల మీటర్ల రేసును 7:19.02 నిమిషాల్లో పూర్తి చేసి శభాష్ అనిపించాడు. దీంతో ఈరోజు జరిగే ఫైనల్ -సీ పోరుకు భోకనాల్ సిద్ధమయ్యాడు. అయితే ఇది సీ/డీ స్కల్స్ ఈవెంట్ కావడంతో భోకనాల్కు పతకం దక్కే అవకాశం లేదు. కేవలం ఫైనల్ -ఏకు అర్హత సాధించిన వారికి మాత్రమే ఇక్కడ పతకం దక్కనుండగా.. భోకనాల్ వరల్డ్ ర్యాంకింగ్ మాత్రం మెరుగుపడనుంది. ఈ పోరులో పదిహేను వందల మార్కు వరకూ ఆధిక్యంలో ఉన్న భోకనాల్.. ఆ తరువాత కాస్త వెనుకబడి తృటిలో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. కాగా, హంగేరీకి చెందిన రోయర్ మోల్నార్ పీటర్వేరీ 7:18.88 లక్ష్యాన్ని పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో 6:59.89 నిమిషాల్లో పూర్తి చేసిన భోకనాల్ ఒలింపిక్ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ద్యుతీ 'పరుగు' ముగిసింది!
రియో డీ జనీరో:దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించిన స్ప్రింటర్ ద్యుతీచంద్.. రియో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ రేసుకు క్వాలిఫై కావడంలో విఫలమైంది. తొలి రౌండ్ లో భాగంగా భారతకాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల రేసులో ద్యుతీ చంద్ ఏడో స్థానంలో నిలిచి రియో నుంచి నిష్క్రమించింది. హీట్ -5లో జరిగిన ఈ రేసును ద్యుతీచంద్ 11.69 సెకెండ్లలో ముగించి సెమీస్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఒక్కో హీట్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే సెమీస్ కు అర్హత సాధించే అవకాశం ఉండటంతో భారత పెట్టుకున్న ఆశలకు ఆదిలోనే బ్రేక్ పడింది. అంతకుముందు పురుషుల 400 మీటర్ల ఈవెంట్లో భారత స్ప్రింటర్ మొహ్మద్ అనాస్ కూడా నిరాశపరిచాడు. ఈ రేసును 45. 95 సెకెండ్లలో పూర్తి చేసి ఆరోస్థానంలో నిలవడం ద్వారా సెమీస్‌కు అర్హత సాధించడంలో విఫలం చెందాడు. మరోవైపు లాంగ్ జంప్‌లో అంకిత్ శర్మ సైతం నిరాశపరిచాడు. ఈ ఈవెంట్లో 24వ స్థానంలో నిలిచిన అంకిత్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించలేకపోయాడు. -
నాదల్ కు డబుల్స్ గోల్డ్
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ స్వర్ణాన్ని సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్ పోరులో నాదల్-మార్క్ లోపెజ్ జోడి 6-2, 3-6, 6-4 తేడాతో ఫ్లోరిన్ మెర్జియా-హోరియా టెకూ(రొమేనియా)పై గెలిచి పసిడిని కైవసం చేసుకుంది. తొలి సెట్‌ను అవలీలగా గెలిచి మంచి ఊపుమీద కనిపించిన నాదల్ ద్వయం.. ఆ తరువాత రెండో సెట్‌ను చేజార్చుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో నాదల్ జంట తిరిగి పుంజుకుని రొమేనియా జోడిని చిత్తుచేసింది. ఈ సెట్ల్ అత్యంత నిలకడగా ఆడిన ఈ స్పెయిన్ జంట అనవసర తప్పిదాలకు ఎక్కువ ఆస్కారం ఇవ్వకుండా స్వర్ణాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో కూడా నాదల్ సెమీస్ కు చేరి పతకానికి చేరువగా వచ్చాడు. క్వార్టర్ ఫైనల్ పోరులో నాదల్ 2-6, 6-4, 6-2 తేడాతో థామస్ బెల్లుక్కి(బ్రెజిల్)పై విజయం సాధించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను చేజార్చుకుని వెనుకబడిన నాదల్ పూర్వపు ఫామ్‌ను అందిపుచ్చుకుని వరుస రెండు సెట్లను కైవసం చేసుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో నాదల్ సింగిల్స్, డబుల్స్‌లో స్వర్ణ పతకాలను సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘనతను సాధించిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో తొలిసారి చాంపియన్‌గా నిలిచిన నాదల్.. 2012 లండన్ ఒలింపిక్స్‌కు మాత్రం గాయంతో దూరమయ్యాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నుంచి మధ్యలో వైదొలిగిన నాదల్.. ఆ తరువాత జరిగిన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లో కూడా పాల్గొనలేదు. గత కొంతకాలంగా మణికట్టు గాయం బాధిస్తుండటంతో ఈ రెండు ప్రధాన టోర్నీలకు దూరమయ్యాడు. గత లండన్ ఒలింపిక్స్ లో గాయం కారణంగా పాల్గొనలేకపోయిన నాదల్..రియోలో మాత్రం అంచనాలను అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. -
ముర్రే జోడిపై బోపన్న జంట విజయం
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో నాలుగో సీడ్, భారత టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ జోడీ సానియా మీర్జా-రోహన్ బోపన్నలు సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా జంట 6-4, 6-4 తేడాతో ఆండీ ముర్రే- హీతర్ వాట్సన్ ద్వయం(బ్రిటన్)పై గెలిచి సెమీస్ కు చేరింది. ఈ మ్యాచ్ లో సానియా జోడి ఏమాత్ర తడబాటు లేకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సానియా జోడి పతకాన్ని సాధించేందుకు అడుగుదూరంలో నిలిచింది. ఈ ద్వయం ఫైనల్ కు చేరితే కనీసం రజతాన్ని తమ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సెమీస్ లో నిష్క్రమిస్తే మాత్రం కాంస్య పతకం కోసం మరో ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. ఒలింపిక్స్ చరిత్రలో భారత టెన్నిస్ ఈవెంట్లో ఇప్పటివరకూ ఒక పతకాన్ని మాత్రమే చేజిక్కించుకుంది. భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత్ కు కాంస్య పతకాన్ని సాధించాడు. దీంతో భారత్ చరిత్రను మరోసారి తిరగరాసేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ విజయంపై లియాండర్ పై బోపన్న జోడికి అభినందలను తెలియజేశాడు. -
పతకానికి అడుగు దూరంలో..
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ పంచ్ అదిరింది. 75 కేజీల మిడిల్‌వెయిట్ విభాగంలో బరిలోకి దిగిన వికాస్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన పోరులో వికాస్ 3-0 తేడాతో సైపల్ ఓండర్(టర్కీ)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థిపై విరుచుకుపడ్డ వికాస్ ఆద్యంత పైచేయి సాధించి నాకౌట్ విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాకుండా పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. ఒకానొక దశలో వికాస్ పంచ్‌లకు ఓండర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని కంటినుంచి రక్తం కారడంతో 38 సెకెండ్లపాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత కూడా వికాస్ మరింత దూకుడునే కొనసాగించి ఓండర్ ను చిత్తు చేశాడు. దీంతో జడ్జిల ఏకపక్ష నిర్ణయంతో విజయాన్ని సొంతం చేసుకుని క్వార్టర్స్‌లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ బెక్తిమిర్ మెలికుజివ్తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. 2015 ఆసియన్ చాంపియన్‌షిప్స్ ఫైనల్లో వీరిద్దరి మధ్య జరిగిన ముఖాముఖి పోరులో మెలికుజివ్ విజయం సాధించాడు. మరోవైపు 2014 యూత్ ఒలింపిక్ చాంపియన్ అయిన మెలికుజివ్.. గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో వీరి మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. -
‘డ్రా’తో గట్టెక్కిన భారత్
హాకీ రియో డి జనీరో: తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న కెనడా జట్టుతో జరిగిన మ్యాచ్‌ను భారత పురుషుల హాకీ జట్టు 2-2 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (33వ నిమిషంలో), రమణ్‌దీప్ సింగ్ (41వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... కెనడా జట్టుకు స్కాట్ టప్పర్ (33వ నిమిషంలో, 52వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు. భారత్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ రెండింటిలో గెలిచి, మరో రెండింటిలో ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించి ఏడు పాయింట్లతో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సంపాదించింది. మరోవైపు జర్మనీ తమ చివరి మ్యాచ్‌లో 2-1తో నెదర్లాండ్స్‌ను ఓడించి మొత్తం 13 పాయింట్లతో గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచింది. నెదర్లాండ్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అర్జెంటీనా, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిస్తే... భారత్ నాలుగో స్థానంలో నిలుస్తుంది. అర్జెంటీనా ఓడిపోతే భారత్ మూడో స్థానంలో, ఐర్లాండ్ నాలుగో స్థానంలో నిలుస్తాయి. మరోవైపు మహిళల హాకీలో భారత జట్టు 0-3తో అమెరికా చేతిలో ఓడి వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. -
ప్రి క్వార్టర్స్‌కు దీపికా
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో మరో భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి ప్రి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గురువారం తెల్లవారుజామున జరిగిన తొలి రౌండ్లో క్రిస్టైన్ ఎసెబ్యా(జార్జియా)ను 6-4 తేడాతో ఓడించిన దీపికా.. రెండో రౌండ్లో సర్తోరి గ్వేన్దోలిన్(ఇటలీ)పై 6-2 తేడాతో విజయం సాధించి ప్రి క్వార్టర్స్ కు అర్హత సాధించింది. దీపికా కుమారికి తొలి రౌండ్లో క్రిస్టెన్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంది. ఇద్దరు క్రీడాకారిణులు చెరో రెండు సెట్లను గెలుచుకోవడంతో నిర్ణయాత్మక ఐదో సెట్ అనివార్యమైంది. ఈ సెట్లో ఆకట్టుకున్న దీపికా.. ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా స్కోరును కాపాడుకుని పైచేయి సాధించింది. ఇక రెండో రౌండ్లో మూడు సెట్లను దీపిక గెలుచుకోగా, ఒక సెట్‌ను మాత్రమే గ్వేన్దోలిన్ గెలుచుకుంది. అంతకుముందు మహిళల ఆర్చరీ విభాగంలో బొంబాలే దేవి ప్రి క్వార్టర్స్ కు చేరిన సంగతి తెలిసిందే. -
మనోజ్ 'పంచ్' పడింది!
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు పతకంపై ఆశలు పెంచుతున్నారు. ఇప్పటికే బాక్సర్ వికాస్ కృష్ణన్ ప్రి క్వార్టర్స్‌కు చేరగా, తాజాగా మరో బాక్సర్ మనోజ్ కుమార్ కూడా ప్రి క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన బౌట్లో 64 కేజీల వెల్టర్ వెయిట్ విభాగంలో మనోజ్ కుమార్ 2-1 తేడాతో గత ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎవాల్దాస్ పెట్రాస్కాస్(లూథియానా)పై విజయం సాధించాడు. మూడు రౌండ్ల పాటు జరిగిన పోరులో మనోజ్ కుమార్ పదునైన పంచ్‌లతో అదరగొట్టాడు. ప్రత్యేకంగా తొలి రెండు రౌండ్లలో పూర్తి ఆధిక్యం కనబరిచిన మనోజ్ కుమార్.. చివరి రౌండ్ లో ఎక్కువగా డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. దీంతో ముగ్గురు జడ్జిల నిర్ణయంలో కేవలం ఒక పాయింట్ ను (29-28, 29-28, 28-29) మాత్రమే చేజార్చుకుని తదుపరి రౌండ్లో అడుగుపెట్టాడు. రియో ఒలింపిక్స్‌లో ఆరంభంలోనే మన బాక్సర్లకు కఠినమైన డ్రా ఎదురైనప్పటికీ వారు అంచనాలు మించి రాణించడంతో భారత శిబిరంలో ఆనందం వెల్లివిరుస్తోంది. అంతకుముందు పురుషుల బాక్సింగ్ 75 కేజీల విభాగంలో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ ప్రి-క్వార్టర్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. అమెరికన్ చార్లెస్ కాన్వెల్తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 3-0తో వికాస్ గెలిచాడు. ఆరంభం నుంచే దూకుడుగా కనిపించిన వికాస్.. రైట్ స్ట్రయిట్స్, అప్పర్ కట్స్‌తో ప్రత్యర్థిని డిఫెన్స్‌లో పడేసి విజయాన్నికైవసం చేసుకున్నాడు. -
'ఒలింపిక్స్ లో భారత ప్రాతినిథ్యం శుద్ధ దండగ'
ఢిల్లీ: రియో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత అథ్లెట్లపై ప్రముఖ రచయిత్రి శోభా డే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఒలింపిక్స్ లో భారత ప్రాతినిథ్యం అనేది శుద్ద దండగ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పతకాలు తేలేనప్పుడు ఒలింపిక్స్‌కు వెళ్లడం అనవసరమని విమర్శనాస్త్రాలు సంధించారు. కేవలం అక్కడ సెల్ఫీలు తీసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్న భారత క్రీడాకారులు.. తమ తమ ప్రదర్శనలపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్నారు. ఈ వృథా ప్రయాసతో చాలా ధనవ్యయం తప్పితే ఏమీ కనిపించడం లేదన్నారు. అయితే దీనిపై భారత షూటర్ అభినవ్ బింద్రా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాలు స్పందించారు. ఈ తరహా విమర్శలు చేయడం శోభా డేకు తగదని, ఒక మెగా ఈవెంట్లో భారత్ ప్రాతినిథ్యం ఉన్నందుకు సంతోషించాలని బింద్రా తెలపగా, ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్లపై విమర్శలు చేస్తూ నిరూత్సాహపరచడం తగదని గుత్తా జ్వాలా పేర్కొంది. మరోవైపు నెటిజన్లు సైతం శోభా తీరును తప్పుబట్టారు. ఏదొక వంకతో సోషల్ మీడియాలోకి రావడం, విమర్శలు చేయడం కొంతమంది సెలబ్రెటీలకు పరిపాటిగా మారిపోయిందని నెటిజన్లు మండిపడ్డారు. -
వారిపై నిషేధం విధించండి:ఫెల్ప్స్
రియో డీ జనీరో; క్రీడల్లో డ్రగ్ చీటింగ్‌కు పాల్పడే వారిపై జీవిత కాల నిషేధం విధించాలంటూ అమెరికా మేటి స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ ధ్వజమెత్తాడు. అసలు ఒకసారి డోపింగ్ పాల్పడిన వారిలో తిరిగి అనుమతించడం అంటూ ఉండకూడదన్నాడు. ఇలా తరచు కొంతమంది అథ్లెట్లు డ్రగ్స్ తీసుకోవడం తన హృదయాన్ని తీవ్రంగా కలిచి వేస్తుందన్నాడు. 'ఇటీవల కాలంలో అథ్లెట్లు డ్రగ్స్ తీసుకోవడం అనేది పరిపాటిగా మారిపోయింది. అది ఒక స్విమ్మింగ్ కే మాత్రమే పరిమితం కాదు.. ప్రతీ క్రీడలోనూ డ్రగ్స్ చీటింగ్ కొనసాగుతోంది. అలా ఒకసారి డోపింగ్ చేసిన వారికి కొంతకాలం వరకే నిషేధం విధిస్తున్నారు. డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినా వారిని గేమ్స్ కు అనుమతించడం చాలాసార్లు జరిగింది. అలా చేయకుండా మొత్తం జీవితకాల నిషేధమే సరైనది' అని ఫెల్ప్స్ విమర్శించాడు. రియో ఒలింపిక్స్ లో చైనా స్విమ్మర్ సున్ యాంగ్ గోల్డ్ మెడల్ సాధించిన అనంతరం ఆస్ట్రేలియా స్విమ్మర్ మాక్ హార్టన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. డోపింగ్ దొంగలు వచ్చారంటూ సున్ యాంగ్ పై మాక్ విమర్శలు సంధించాడు. ఈ నేపథ్యంలో ఫెల్ప్స్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయి. -
ఫెల్ప్స్ కు రెండో స్థానం!
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్ లో అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ మరో పసిడిపై దృష్టిసారించాడు. మూడో రోజు గేమ్స్ లో భాగంగా సోమవారం 4 x100 మీటర్ల ఫ్రీ స్టయిల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణంతో పతకాల వేటను ఆరంభించిన ఫెల్ప్స్.. ఆ తరువాత జరిగిన 200 మీటర్ల బటర్ ఫ్లయ్ సెమీ ఫైనల్ వ్యక్తిగత రేసులో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించాడు. గత అర్థరాత్రి జరిగిన 200 మీటర్ల బటర్ ఫ్లయ్ రేసును ఒక నిమిషం 54.12 సెకెండ్లలో ముగించిన ఫెల్ఫ్స్ ..మంగళవారం రాత్రి జరిగే ఫైనల్ పోరుకు సిద్దమయ్యాడు. ఈ రేసులో కూడా ఫెల్ఫ్స్ స్వర్ణం సాధించే అవకాశాలు మెండుగానే ఉన్నా.. హంగేరీ స్విమ్మర్ థామస్ కెండెర్సీ నుంచి తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ స్టార్ స్విమ్మర్లిద్దరూ ఫైనల్ కు అర్హత సాధించే క్రమంలో థామస్ కెండెర్సీ అగ్రస్థానంలో నిలిచాడు. సెమీ ఫైనల్ రేసును ఒక నిమిషం 53.96 సెకెండ్లలో పూర్తి చేసి మొదటి స్థానం సాధించాడు. దీంతో ఫైనల్లో కెండెర్సీ , ఫెల్ఫ్స్ ల మధ్య ఆసక్తికర రేసు జరగవచ్చు. మరోవైపు సెమీ ఫైనల్ రేసును మూడో స్థానంతో ముగించిన మరో హంగేరీ స్విమ్మర్ స్టాల్ వార్ట్ లాస్ జ్లో కూడా దీటైన సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు. ఒలింపిక్స్ లో భాగంగా పురుషుల 4 x100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలోసెలెబ్ డ్రెసెల్, రియాన్ హెల్డ్, నాథన్ ఆడ్రియన్లతో కలిసి ఫెల్ఫ్స్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఫెల్ప్ష్ ఖాతాలో 19వ ఒలింపిక్స్ పసిడి చేరింది. రియో ఒలింపిక్స్‌లో భాగంగా 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ వ్యక్తిగత ఫైనల్ రేసుకు అర్హత సాధించిన ఫెల్ఫ్స్.. ఇంకా 100 మీటర్ల బటర్‌ఫ్లయ్, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే రేసుల్లో పోటీపడాల్సి ఉంది. -
మూడో రౌండ్‌కు సెరెనా
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సెరెనా విలియమ్స్ మూడో రౌండ్‌కు చేరుకుంది. మూడో రోజు ఆటలో భాగంగా సోమవారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ టెన్నిస్ పోరులో సెరెనా 7-6(5), 6-2తేడాతో అలైజ్ కార్నెట్(ఫ్రాన్స్)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి సెట్లో కార్నెట్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న సెరెనా టై బ్రేక్ ద్వారా గట్టెక్కింది. అనంతరం రెండో సెట్లో సెరెనా ఎటువంటి తప్పిదాలు చేయకుండా కార్నెట్‌ను కంగుతినిపించింది. ఇప్పటికే నాలుగు ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు సాధించిన సెరెనా.. మరో పసిడి దిశగా సాగుతోంది. అయితే ఈ పోరు తరువాత మాట్లాడిన సెరెనా.. ఆటలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించే అవసరం ఉందని పేర్కొంది. కార్నెట్ తో జరిగిన మ్యాచ్‌లో కొన్ని పొరపాట్లు చేసినట్లు పేర్కొంది. తాను చేసిన కొన్ని అనవసర తప్పిదాల కారణంగానే తొలి సెట్ టైబ్రేక్ కు దారితీసినట్లు నల్లకలువ తెలిపింది. మరోపోరులో స్పెయిన్ క్రీడాకారిణి గార్బెన్ ముగురుజా 6-1, 6-1 తేడాతో హిబినో(జపాన్)పై గెలిచింది. -
రియోలో నేటి భారతీయం
రియో ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత్‌కు పూర్తిగా నిరాశే ఎదురైంది. ఆర్చరీ, ట్రాప్ షూటింగ్లో కనీస పోరాటం లేకుండానే భారత క్రీడాకారులు చెతులెత్తేయగా.. హాకీలో పోరాడి ఓటమి చెందారు. నాల్గో రోజు మహిళల షూటింగ్, ఆర్చరీ, పురుషుల హాకీ, రోయింగ్, బాక్సింగ్ ఈవెంట్లలో భారత జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. షూటింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ హీనా సిద్దూ సాయంత్రం 5.30 నుంచి ఆర్చరీ పురుషుల (రౌండ్ 64) అతాను దాస్ (భారత్) వర్సెస్ జీత్ బహదూర్ (నేపాల్) సాయంత్రం 5.30 నుంచి హాకీ (పురుషులు) భారత్ వర్సెస్ అర్జెంటీనా (గ్రూప్-బీ) సాయంత్రం 7.30 గంటలనుంచి బాక్సింగ్ పురుషుల మిడిల్ 75 కేజీల విభాగం (రౌండ్ 32) వికాస్ క్రిషన్ యాదవ్ (భారత్) వర్సెస్ చార్లెస్ కాన్వెల్ (అమెరికా) బుధవారం తెల్లవారుజామున 2.30 నుంచి రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్స్ (క్వార్టర్ ఫైనల్స్) బబన్ భోకనాల్ సాయంత్రం 5.20 నుంచి -
జొకోవిచ్ కు మరో షాక్
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ కు మరో షాక్ తగిలింది. ఆదివారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్ లోనే వెనుదిరిగిన జొకోవిచ్.. రోజు గడవకముందే మరో ఓటమిని ఎదుర్కొన్నాడు. సోమవారం అర్థరాత్రి జరిగిన పురుషుల డబుల్స్‌లో జొకోవిచ్- నెనాడ్ జిమానిక్ జోడి పరాజయం చవిచూసింది. రెండో రౌండ్ లో భాగంగా జొకోవిచ్ జంట 4-6, 4-6 తేడాతో ఆతిథ్య బ్రెజిల్‌కు చెందిన నాల్గో సీడ్ మార్సెలో మీలో-బ్రూనో సోర్స్ ద్వయం చేతిలో ఓటమి పాలైంది. గతంలో 2008 ఒలింపిక్స్‌లో మాత్రమే కాంస్య పతకం సాధించిన జొకోవిచ్.. ఆ తరువాత లండన్ ఒలింపిక్స్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు. రియో ఒలింపిక్స్ నుంచి ఆదిలోనే టాప్ సీడ్లు వెనుదిరగడంతో ఆ మెగా ఈవెంట్ లో కాస్త కళ తప్పినట్లు కనబడుతోంది. ఇప్పటికే మహిళల డబుల్స్‌లో సెరెనా విలియమ్స్-వీనస్ విలియమ్స్ జోడి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
జొకోవిచ్ ఇంటికి..
-
విలియమ్స్ సిస్టర్స్‌కు షాక్
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన మహిళల టెన్నిస్ డబుల్స్ జోడీ సెరెనా విలియమ్స్-వీనస్ విలియమ్స్‌లకు ఆదిలోనే చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన తొలి రౌండ్ పోరులో లియమ్స్ జోడి 3-6, 4-6 తేడాతో చెక్ రిపబ్లిక్ జంట లూసీ సఫరోవా-బార్బోరా స్ట్రైకోవా చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో ఓటమి ఎరుగని విలియమ్స్ జోడికి తొలిసారి చేదు అనుభవం ఎదురైంది. అంతకుముందు ఒలింపిక్స్ బరిలోకి దిగిన మూడు సార్లు(2000,08, 12) స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అమెరికా జోడీ .. రియోలో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం గమనార్హం. దీంతో రియోకు ముందు వరకూ 15-0 తో ఉన్న సెరెనా జోడి ఒలింపిక్ కెరీర్ రికార్డుకు బ్రేక్ పడింది. గత నెల్లో జరిగిన వింబుల్డన్ టైటిల్ ను గెలవడం ద్వారా 14 వ గ్రాండ్ స్లామ్ డబుల్స్ చాంపియన్‌షిప్‌ను సెరెనా ద్వయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, మహిళల సింగిల్స్ లో సెరెనా తొలి రౌండ్లో విజయం సాధించి తదుపరి రౌండ్ కు చేరింది. -
జొకోవిచ్ ఇంటికి..
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో సంచలనం నమోదైంది. పురుషుల టెన్నిస్ సింగిల్స్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ఒలింపిక్స్ రెండో రోజు గేమ్స్‌లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన పోరులో జొకోవిచ్ 6-7(4/7), 6-7(2/7)తేడాతో డెల్ పాట్రో(అర్జెంటీనా) చేతిలో పరాజయం చవిచూశాడు. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన పోరులో రెండు సెట్ లూ టై బ్రేక్ కు దారి తీశాయి. అయితే పెట్రో దాటికి జొకోవిచ్ తలవంచతూ ఒలింపిక్స్ నుంచి భారంగా నిష్క్రమించాడు. గత లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో జొకోవిచ్ ను ఓడించిన డెల్ పోట్రో.. మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. దీంతో గోల్డెన్ స్లామ్ సాధించే అవకాశాన్ని జొకోవిచ్ జారవిడుచుకున్నాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అనంతరం కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన జొకోవిచ్.. తాజా ఒలింపిక్స్‌లో స్వర్ణం పతకం గెలిస్తే గోల్డెన్ స్లామ్ అతని సొంతమయ్యేది. కాగా, తొలి రౌండ్లోనే జొకోవిచ్ వెనుదిరగడంతో ఆ అవకాశం కోసం మరో నాలుగు సంవత్సరాల పాటు నిరీక్షించక తప్పదు. ఒలింపిక్స్ నుంచి జొకోవిచ్ నిష్క్రమించడంతో బ్రిటన్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రే మరోసారి పసిడి రేసులో నిలిచే అవకాశం ఉంది. గత లండన్ ఒలింపిక్స్‌లో ముర్రే స్వర్ణం సాధించగా, రోజర్ ఫెదరర్ కు రజతం, డెల్ పెట్రోకు కాంస్యం దక్కాయి. -
దీపా కర్మాకర్ కొత్త చరిత్ర
రియో డీ జనీరో: భారత్ నుంచి ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఇటీవల రికార్డు సృష్టించిన దీపా కర్మాకర్.. రియో ఒలింపిక్స్ లో కొత్త చరిత్ర సృష్టించింది. వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు చేరి సరికొత్త చరిత్రను లిఖించింది. క్వాలిఫయింగ్ రౌండ్ లో భాగంగా ప్రొడునోవా వాల్ట్ విభాగంలో 14.850 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇందులో టాప్-8లో ఉన్నవారు మాత్రమే ఫైనల్ కు అర్హత సాధిస్తారు. అయితే దీపా ఏడో స్థానంలో నిలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. కెనడా జిమ్నాస్ట్ షాలోన్ ఓల్సేన్ 14.950 పాయింట్ల్లు సాధించడంతో దీపా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. దీంతో ఒలింపిక్స్‌లో దాదాపు ఐదు దశాబ్దాలుగా భారతీయులకు కలగా మిగిలిన జిమ్నాస్టిక్స్ పతకంపై ఆశలను పెంచుతూ ఆగస్టు 14వ తేదీన జరిగే ఫైనల్లో పోరుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్ లో రియో డీ జెనీరియోలో జరిగిన ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసిన దీపా కర్మాకర్ రియోకు అర్హత సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీప రికార్డు నెలకొల్పింది. త్రిపురకు చెందిన ఈ 22 ఏళ్ల అమ్మాయి.. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించడమే కాకుండా, ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్‌షిప్ కు అర్హత సాధించింది. ఒలింపిక్స్‌లో ఫైనల్ రౌండే లక్ష్యంగా బరిలోకి దిగిన దీపా కర్మాకర్ అంచనాలను అందుకోవడం పతకంపై ఆశలను పెంచుతుంది. -
వల్డ్ నెంబర్ వన్ జొకోవిచ్ ఔట్
-
ఆస్పత్రి పాలైన జిమ్నాస్ట్
రియో డీ జనీరో: ఒలింపిక్స్‌లో పతకం సాధించడమనేది ప్రతీ క్రీడాకారుడి కల. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ఒక ఎత్తైతే, అక్కడ సత్తా చాటడం మరొక ఎత్తు. అందులోనూ జిమ్నాస్టిక్స్ అంటే మరింత కఠినమైన సాధన చేయాల్సి ఉంటుంది. తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నంలో జిమ్నాస్ట్‌లు గాయాలు బారిన పడటం అధికంగానే జరుగుతూ ఉంటుంది. తాజాగా ఈ తరహా ఘటనే రియో ఒలింపిక్స్ లో చోటు చేసుకుంది. ఓ ఫ్రెంచ్ జిమ్నాస్ట్ ఫీట్ చేసే క్రమంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. పురుషుల క్వాలిఫయింగ్‌లో భాగంగా నిర్వహించిన వాల్ట్ జిమ్నాస్టిక్స్ లో సమిర్ ఎయిట్ సెడ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను బ్యాక్ ఫ్లిప్స్ను పూర్తి చేసే క్రమంలో గాలిలోకి ఎగిరి అదుపు తప్పి నేలపై పడ్డాడు. దీంతో విలవిల్లాడిపోయిన సమిర్ను ప్రాథమిక చికిత్స చేసిన తరువాత స్ట్రైచర్ పై ఆస్పత్రికి తరలించారు. సమిర్ కిందకు పడేటప్పుడు కాలిపిక్కలోని ప్రధాన ఎముక తీవ్రంగా ఫ్రాక్చరైనట్లు డాక్టర్లు ధృవీకరించడంతో అతని ఒలింపిక్స్ కల ముగిసింది. అయితే ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న సమిర్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. -
'ఇక్కడ గ్యారంటీ ఏమీ ఉండదు'
రియో డీజనీరో: 'మనస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం ఒక్కటే మన చేతుల్లో ఉంది. అంతేకానీ గెలుపు-ఓటములు ఎవ్వరూ చెప్పలేరు. అసలు క్రీడల్లో గ్యారంటీ అంటూ ఉండదు 'అని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యాఖ్యానించింది. మహిళల డబుల్స్ లో భాగంగా తొలి రౌండ్ పోరులో ప్రార్థనా తోంబ్రే-సానియా మీర్జాలు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం సానియా మాట్లాడుతూ.. గెలుపు-ఓటమి అనేది ఆటలో భాగమేనని తెలిపింది. తాను పతకం సాధించడానికి ఇంకా అవకాశం ఉందని, దాన్ని సాధించడం కోసం శ్రమిస్తానని సానియా పేర్కొంది. తాను ఎలా ఆడినా, భారత్ మాత్రం తన నుంచి స్వర్ణపతకం కోరుకుంటుందని వ్యాఖ్యానించింది. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి ఆడతున్న సానియా.. పతకంపై ధీమా వ్యక్తం చేసింది. ఈ విభాగంలో కచ్చితంగా భారత్‌కు పతకం తీసుకొస్తామనే నమ్మకం ఉందని తెలిపింది. తమపై విమర్శల దాడి చేయడం ఆపి వాస్తవాన్ని గ్రహించాలని సానియా సూచించింది. ఒలింపిక్స్ లో తీవ్రమైన పోటీ ఉంటుందుంటి కాబట్టే అది ఒలింపిక్స్ అయ్యిందని, భారత్‌కు పతకం సాధించడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్న సంగతి అభిమానులు గుర్తించుకోవాలని సానియా హితవు పలికింది. -
వెయిట్‌లిఫ్టింగ్‌లోనూ తప్పని నిరాశ
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో భాగంగా తొలిరోజు తొమ్మిది పతకాలకు గాను మూడు ఈవెంట్లలో పాల్గొన్న భారత ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో జీతూరాయ్, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అపూర్వ చండీలా, అయోనికా పాల్ నిరాశపరచగా, మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో మిరాబాయ్ చానూ సైతం ఆకట్టుకోలేకపోయింది. భారతకాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారజామున జరిగిన వెయిట్‌లిప్టింగ్ 48 కేజీల కేటగిరీలో మిరాబాయ్ స్నాచ్ విభాగంలో 82 కేజీలను ఎత్తడంలో విఫలమైంది. దీంతో క్లీన్ అండ్ జర్క్కు అర్హత సాధించలేక భారత అభిమానులు పతకంపై పెట్టుకున్న ఆశలను నిరాశపరిచింది. వెయిట్ లిఫ్టింగ్ పోరులో థాయ్‌లాండ్‌కు చెందిన సోపితా తనాసన్ స్వర్ణ పతకం సాధించగా, ఇండోనేషియాకు చెందిన ఆగస్టియానికి రజతం సొంతం చేసుకుంది. జపాన్ క్రీడాకారిణి మియాకి కాంస్య పతకం దక్కింది. ఇక వెయిట్ లిఫ్టింగ్‌లో సతీష్ శివలింగం భారత్‌కు మిగిలిన ఆశాకిరణం. ఆగస్టు 10వ తేదీన 77 కేజీల కేటగిరీలో సతీష్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. -
సానియా జోడీ నిష్క్రమణ
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.మహిళల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగిన సానియా మీర్జా- ప్రార్థన తోంబ్రే జోడి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. భారత కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారజామున జరిగిన మ్యాచ్‌లో సానియా ద్వయం 6-7, 5-7, 7-5 తేడాతో చైనా జోడి షాయి జంగ్-షాయి పెంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి సెట్లో పోరాడిన సానియా జంట, రెండు, మూడు సెట్లలో పూర్తిస్థాయి ఆటను ప్రదర్శించలేక పోయింది. దీంతో సానియా ద్వయం తొలి రౌండ్ లోనే ఓటమి పాలైంది. ఇక టెన్నిస్ లో భారత ఆశలు మిక్స్డ్ డబుల్స్పైనే ఆధారపడి ఉన్నాయి. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా-రోహన్ బోపన్నలు జోడి కట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు పురుషుల డబుల్స్ పోరులో లియాండర్ పేస్-బోపన్నల జోడి కూడా తొలి రౌండ్లో పరాజయం ఎదుర్కొన్నారు. ఆగస్టు 10వ తేదీన సానియా-రోహన్ బోపన్నలు మిక్స్ డ్ డబుల్స్ లో బరిలోకి దిగనున్నారు. -
రన్ ఫర్ రియో -ఖేలో ఔర్ జియో..
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు మద్దతు తెలుపుతూ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) ఆధ్వర్యంలో సోమవారం ‘రన్ ఫర్ రియో- ఖేలో ఔర్ జియో’ కార్యక్రమం జరగనుంది. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఉదయం 7 గంటలకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు ప్రారంభిస్తారు. జల విహార్, పీవీ జ్ఞానభూమి మీదుగా సాగే ఈ రన్లో శాట్స్ ఎండీ దినకర్ బాబు, ఐఏఎస్ బి. వెంకటేశం పాల్గొంటారు. ఆసక్తి గల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. -
భారత 'గురి' కుదిరేనా?
రియో డీ జనీరో: నాలుగేళ్లకు ఒకసారి వచ్చే క్రీడా పండుగ వచ్చేసింది. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారజామున ఒలింపిక్స్ క్రీడలకు అధికారికంగా తెరలేచింది. రియో ఒలింపిక్స్‌లో భాగంగా తొలి రోజు స్వర్ణం షూటర్ల ఖాతాలో చేరనుంది. అయితే ఈ విభాగంలో 11 వేర్వేరు ఈవెంట్లలో మొత్తం 12 మంది భారత్ షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, తొలి రోజు పురుషుల ఈవెంట్లో జీతూరాయ్(10 మీటర్ల ఎయిర్ పిస్టల్), మహిళల విభాగంలో అపూర్వ చండీలా, అయోనికా పాల్(10 మీటర్ల ఎయిర్ రైఫిల్)లు తమను పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో తొలి స్వర్ణం ఖాయం కానుండగా, రాత్రి గం. 12.30 నిమిషాలకు షూటింగ్లో రెండో స్వర్ణం (పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్) ఖాయమవుతుంది. 2008లో బీజింగ్‌లో అభినవ్ బింద్రా షూటింగ్లో స్వర్ణం సాధించిన తరువాత భారత్ కు ఈ విభాగంలో పసిడి దక్కలేదు. ప్రస్తుతం భారత షూటింగ్ బృందం మెరుగ్గా ఉండటంతో పతకంపై ఆశలు చిగురిస్తున్నాయి. తొలి రోజు నాలుగు స్వర్ణాల కోసం పోటీలు జరుగనుండగా, షూటింగ్లో రెండు పసిడి పతకాలకు ప్రధానంగా పోటీ జరుగనుంది. -
మరకానా జిగేల్
రియోడిజనీరో: క్రీడా ప్రపంచమంతా అతి పెద్ద సంబరంగా భావించే ఒలింపిక్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 31వ ఒలింపిక్స్ లో భాగంగా బ్రెజిల్ నగరం రియో డి జనీరో పక్షం రోజులకు పైగా పాటు జరిగే క్రీడా సంబరాలకు అధికారికంగా తెరలేచింది. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున మరకానా స్టేడియంలో ఒలింపిక్స్ క్రీడలు ఆరంభమయ్యాయి. కళ్లు మిరమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు, అదిరిపోయే అథ్లెట్ల కవాతులు, ఆకట్టుకునే నృత్యాల నడుమ విశ్వ క్రీడా వేడుకలు 'కలర్ ఫుల్' గా ప్రారంభమయ్యాయి. బ్రెజిల్ చరిత్రను పరిచయం చేసే కళారూపం జిగేల్ మనిపించింది. దాదాపు ఆరువేల మంది కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు వారి చరిత్రకు అద్దం పట్టాయి. అలాగే బ్రెజిల్ సంస్కృతిని చాటే సాంబా, కార్నివాల్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆగస్టు 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ మరకానాతో సహా మొత్తం 37 వేదికల్లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతాయి. భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించిన అభినవ్ బింద్రా ఆరంభోత్సవంలో మన బృందానికి నాయకత్వం వహించాడు. ఈసారి భారత్ నుంచి అత్యధిక స్థాయిలో 118 మంది ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్నారు. మరోవైపు భారీ ఒలింపిక్ బృందంతో ఒలింపిక్స్ కు సిద్ధమైన అమెరికా ఆరంభ వేడుకల్లో ప్రత్యేకగా ఆకర్షణగా నిలిచింది. ఒలింపిక్స్ వేడుకలకు విచ్చేసిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తమ దేశ క్రీడాకారులను చప్పట్లతో ఉత్సాహపరిచారు. భారత కాలమానం ప్రకారం రియో ఎనిమిదిన్నర గంటలు వెనక ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ మన కాలమానం సాయంత్రం ఆరు గంటల నుంచి పోటీలు జరుగుతాయి. ఉదయం ఏడు గంటల వరకూ పోటీలు సాగుతాయి. -
గెమ్స్ విలేజీకి అమెరికా బాస్కెట్ బాల్ టీమ్ నో
-
రిమో ఆరంభ వేడుకల్లో క్రికెట్ దేవుడు
-
'నా ఎజెండాలో రిటైర్మెంట్ ను చేర్చలేదు'
రియోడీ జనీరో: ఆరో ఒలింపిక్ స్వర్ణంపై కన్నేసిన అమెరికా నల్లకలువ, ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను ఖండించింది. తనకు ఇప్పుడే ఆట నుంచి దూరమయ్యే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. ఇటీవల వింబుల్డన్ టైటిల్‌ను గెలిచి 22 గ్రాండ్ స్లామ్‌లతో స్టెఫీ గ్రాఫ్ రికార్డును సమం చేసిన సెరెనా.. వీడ్కోలు నిర్ణయం అనేది ఇంకా తన ఎజెండాలో చేర్చలేదని స్పష్టం చేసింది. 'టెన్నిస్ ను ప్రేమిస్తాను. దాంతో పాటు కోర్టులో ఆడటాన్ని ఆరాధిస్తాను. పోటీని ఎదుర్కొవడం అంటే నాకు ఇష్టం. ఇంకా రిటైర్మెంట్ ఆలోచన చేయలేదు. ఆ వార్తల్లో కూడా నిజం లేదు. అలా వీడ్కోలు చెప్పడాన్ని కూడా స్వాగతించలేనేమో. ఒకవేళ ఆ సమయం వస్తే కచ్చితంగా చెబుతాను. సాధ్యమైనంతవరకూ విజయాలు సాధించడంపై ప్రస్తుతం నా దృష్టి ఉంది' అని రియో ఒలింపిక్స్ కు సన్నద్ధమైన 34 ఏళ్ల సెరెనా పేర్కొంది. -
భారత బాక్సర్లకు క్లిష్టమైన డ్రా
రియో డీజనీరో:రియో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లకు క్లిష్టమైన డ్రా ఎదురైంది. భారత్ నుంచి బాక్సింగ్ విభాగంలో శివ థాపా(56కేజీలు), మనోజ్ కుమార్(64కేజీలు), వికాస్ క్రిషన్(75 కేజీలు)లు తమ తొలి పోరులో కఠినమైన ప్రత్యర్థులను ఎదుర్కొనున్నారు. ఈ మేరకు గురువారం ప్రకటించిన డ్రాలో వికాస్ క్రిషన్ ఒక్కడికే సీడింగ్ లభించగా, మిగతా ఇద్దరూ అన్ సీడెడ్‌గా బరిలోకి దిగనున్నారు. రియో ఒలింపిక్స్‌లో వికాస్ ఏడో సీడ్‌గా పోరుకు సన్నద్ధమయ్యాడు. కాగా, ఈ మెగా ఈవెంట్లో శివ థాపా తన తొలి పోరులో గత లండన్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతక విజేత, క్యూబా బాక్సర్ రాబ్సీ రామ్రెజ్తో తలపడనున్నాడు. అయితే 2010 యూత్ ఒలింపిక్స్‌లో శివ థాపాతో జరిగిన ముఖాముఖి పోరులో రాబ్బీ విజేతగా నిలిచాడు. ఈ బాక్సర్లు ఇద్దరూ వరల్డ్ చాంపియన్ షిప్లో కాంస్య పతకాలు సాధించడంతో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. వీరి మద్య ఆగస్టు 9వ తేదీన బౌట్ జరుగనుంది. మరో భారత బాక్సర్ వికాస్ క్రిషన్.. అమెరికా యువ బాక్సర్ చార్లెస్ కోన్ వెల్‌తో ఓపెనింగ్ గేమ్ లో తలపడనుండగా, గత ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎవాల్దాస్ పెట్రాస్కాస్తో మనోజ్ కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ రెండు బౌట్లు ఆగస్టు 10 వ తేదీన జరుగనున్నాయి. -
బ్యాడ్మింటన్‌లో 'డబుల్' చాన్స్
బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ విభాగంలో మన దేశం నుంచి మంచి ఆటగాళ్లు ఉన్నారు. అందులోనూ హైదరాబాద్ నుంచి ప్రముఖ క్రీడాకారులు బరిలో ఉండడం ఆనందించదగ్గ విషయం. పతకాల విషయానికొస్తే సింగిల్స్, డబుల్స్‌లోనూ మనవాళ్లు సాధించుకొస్తారన్న నమ్మకం ఉంది. కనీసం రెండు మెడల్స్ తక్కువ కాకుండా మనకు వస్తాయి. దేశం గర్వపడే విధంగా ఆటగాళ్లందరూ రాణించాలనుకుంటున్నా. - రాజగోపాల్‌చారి, బ్యాడ్మింటన్ కోచ్ -
రియోకు చేరిన సచిన్
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత జట్టుకు గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్రెజిల్‌కు చేరుకున్నాడు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ ఆహ్వానం మేరకు సచిన్ రియోలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా భారత ఒలింపిక్ జట్టుకు అభినందనలు తెలిపాడు. తాను రియోకు వెళ్లడంపై సరికొత్త అనుభూతికి లోనైనట్లు వెల్లడించిన సచిన్.. ఈ ఒలింపిక్స్‌లో భారత జట్టు మెరుగైన ప్రదర్శనతో రాణించాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు తన ఒలింపిక్స్ పర్యటనను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అనేక రికార్డులను సాధించిన సచిన్ కు ఇదే తొలి ఒలింపిక్స్ ఆహ్వానం కావడం విశేషం. ఈసారి అత్యధిక సంఖ్యలో భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 119 మంది అథ్లెట్లు భారత్ నుంచి ఒలింపిక్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
ఆతిథ్య జట్టు శుభారంభం
రియోడీజనీరో: రియో ఒలింపిక్స్ ఆరంభ వేడుకులకు రెండు రోజుల ముందే జరిగిన మహిళల ఫుట్ బాల్ మ్యాచ్‌లో ఆతిథ్య బ్రెజిల్ జట్టు శుభారంభం చేసింది. భారతకాలమాన ప్రకారం బుధవారం రియోడీజనీరో నగరంలో జరిగిన సాకర్ పోరులో బ్రెజిల్ 3-0 తేడాతో చైనా మహిళలపై ఘన విజయం సాధించింది. బ్రెజిల్ తరపున మోనికా, ఆండ్రెస్సా ఎల్వెస్, క్రిస్టేన్లు తలో గోల్ చేసి గెలుపులో ముఖ్య పాత్ర పోషించారు. ఆట 10 వ నిమిషంలోనే గోల్ సాధించిన బ్రెజిల్.. 59వ నిమిషంలో మరో గోల్ సాధించి పైచేయి సాధించింది. అయితే ఆట చివరి నిమిషంలో క్రిస్టేన్ హెడర్ ద్వారా గోల్ సాధించడంతో బ్రెజిల్ ఖాతాలో సంపూర్ణ విజయం చేరింది. మరో మ్యాచ్‌లో స్వీడన్ 1-0 తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఆట రెండో అర్థభాగంలో స్వీడన్ క్రీడాకారిణి నిల్లా ఫిచర్ గోల్ సాధించడంతో స్వీడన్ ఆధిక్యం సాధించింది. ఆ తరువాత ఇరు జట్లు చివరి వరకూ పోరాడినా గోల్ నమోదు కాలేదు. దీంతో స్వీడన్ ఏకైక గోల్ తో విజయం సాధించింది. -
నేను షాకయ్యా: జొకోవిచ్
రియోడీజనీరో: పలువురు అగ్రశ్రేణి క్రీడాకారులు రియో ఒలింపిక్స్ కు దూరం కావడంపై ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వరల్డ్ టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఉన్న ఐదుగురు టెన్నిస్ క్రీడాకారులు ఒలింపిక్స్ నుంచి ముందుగానే వైదొలగడం తనను ఒకింత షాక్‌కు గురి చేసిందన్నాడు. ప్రత్యేకంగా టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్‌తో పాటు, స్టాన్ వావ్రింకా, మిలాస్ రోనిచ్, బెర్డిచ్, డొమినిక్ థీమ్‌లు ఒలింపిక్స్‌కు దూరం కావడాన్ని జొకోవిచ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ' టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఉన్న టెన్నిస్ క్రీడాకారులు రియోకు దూరం కావడం ఆశ్చర్య పరిచింది. ఇంతమంది ఒలింపిక్స్‌కు దూరమవుతారని అస్సలు అనుకోలేదు. వారు అలా దూరం కావడానికి కారణాలు వేరుగా ఉండవచ్చు. ఆ ఆటగాళ్ల నిర్ణయాన్ని కచ్చితంగా గౌరవించాలి. అయినప్పటికీ పోరు ఆసక్తికరంగానే సాగుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, నిషాకోరి తదితర దిగ్గజాలు ఒలింపిక్స్‌లో ఆడుతున్నారు. దీంతో కఠినమైన పోటీ ఉండి తీరుతుంది' అని జొకోవిచ్ తెలిపాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అనంతరం జొకోవిచ్ కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో జొకోవిచ్‌కు గోల్డెన్ స్లామ్ సాధించే అరుదైన అవకాశం కూడా రియో ఒలింపిక్స్ రూపంలోముందుంది. ఈ ఏడాది కెరీర్ గ్రాండ్ స్లామ్ ను సాధించిన జొకోవిచ్.. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన పక్షంలో గోల్డెన్ స్లామ్ అతని సొంతమవుతుంది. ఇప్పటివరకూ గోల్డెన్ స్లామ్ సాధించిన ఘనత జర్మనీ మాజీ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్ పేరిటే ఉంది. కాగా, తాజా ఒలింపిక్స్ లో కొంతమంది అగ్రశ్రేణి క్రీడాకారులు ఒలింపిక్స్ దూరం కావడాన్ని జొకోవిచ్ ఎంత వరకూ తనకు అనుకూలంగా మార్చుకుంటాడో వేచి చూడాల్సిందే. -
రియోలో వసతిపై భారత హాకీ జట్టు ఫిర్యాదు
రియో డి జనీరో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ జరుగనున్న రియోలో వసతులు దయనీయంగా ఉన్నాయంటూ భారత హాకీ జట్టు ఫిర్యాదు చేసింది. ఒలింపిక్స్ విలేజ్‌లో తాము బస చేసే చోట కనీసం కూర్చోవడానికి తగినన్ని కుర్చీలు లేవని భారత చీఫ్ కోచ్ ఓల్ట్‌మన్స్ ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఆటగాళ్లు ఉండే అపార్ట్మెంట్లలో ఇంకా పూర్తిగా సిద్ధం చేయలేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు రియోలో భారత వ్యవహారాలను పర్యవేక్షించే రాకేశ్ గుప్తాకు లేఖలో తెలియజేశారు. 'మాకు ఇంకా పూర్తికాని అపార్ట్మెంట్లు కేటాయించారు. ఇక్కడ కనీసం కుర్చీలు కూడా లేవు. దాంతో పాటు తగినన్ని టీవీ సెట్లు కూడా లేవు. పురుషుల హాకీ జట్టుతో పాటు మహిళా క్రీడాకారిణులు పరిస్థితి ఇలానే ఉంది . సరైన టేబుల్స్ కూడా లేదు' అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తొమ్మిది అపార్ట్మెంట్లలో ఉంటున్న పురుష, మహిళా హాకీ జట్లకు ఇంకా 28 కుర్చీలు అవసరమని పేర్కొన్నారు. దాదాపు ఏడు అపార్ట్మెంట్లలో కనీసం ఒక్కో టేబుల్ ను అమర్చడంతో పాటు, ఒలింపిక్స్ గేమ్స్ జరిగే సమయంలో మ్యాచ్‌లను చూడటానికి కూడా తగినన్ని టీవీ సెట్లు సిద్ధం చేయాలన్నారు. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ల ఆట తీరును తెలుసుకోవడానికి టీవీలు దోహదం చేస్తాయన్నారు. తమ అభ్యర్థనను సాధ్యమైనంత తొందరగా అమలు చేయడానికి యత్నించాలని విన్నవించారు. -
రియో స్పెషల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్
-
రన్ ఫర్ రియో..
ఢిల్లీ: నగరంలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో భారత రియో ఒలింపిక్స్ పరుగును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రియో పరుగులో భాగంగా ఆదివారం ఉదయం ఇక్కడకు విచ్చేసిన మోదీ.. తొలుత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు నివాళులు అర్పించిన అనంతరం రియో పరుగును జెండా ఊపి ఆరంభించారు. దాదాపు ఇరవై వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియం నుంచి నెహ్రూ మైదానం వరకూ సాగింది. ఈ సందర్భంగా భారత అథ్లెట్లకు ముందుగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే పలు రకాలుగా క్రీడలకు ఎంతో సహకారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కల్గిన ఒలింపిక్స్ లో భారత ప్రాతినిథ్యం నిజంగా అద్భుతమని మోదీ తెలిపారు. ఈసారి అత్యధిక సంఖ్యలో 119 మంది అథ్లెట్లు ఒలింపిక్స్ లో పాల్గొనడం భారత్ నుంచి ఇదే తొలిసారి కావడం గర్వకారణమన్నారు. వచ్చే 2020 టోక్యో ఒలింపిక్స్ నాటికి మన క్రీడాకారుల సంఖ్య 200కు చేరుతుందని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. -
'మేము కూడా రియోకు రాలేం'
న్యూయార్క్:ఇటీవల బ్రెజిల్లో వెలుగు చూసిన జికా వైరస్ కారణంగా పలువురు అగ్రశ్రేణ క్రీడాకారులు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వెనుకడుగు వేస్తున్నారు. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ డబుల్స్ జోడీ గా పేరుగాంచిన బ్రయాన్ బ్రదర్స్ రియో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అక్కడ ప్రబలిని ప్రాణాంతక జికా వైరస్ కారణంగా ఆ మెగా టోర్నీకి దూరమవుతున్నట్లు బ్రయాన్ జంట స్పష్టం చేసింది. 'మేము రియో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నాం. జికా వైరస్‌తో ఎటువంటి రిస్క్ చేయదలుచుకోలేదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యమే మా తొలి ప్రధాన్యత' అని ఈ జోడి స్పష్టం చేసింది. ఈ మేరకు రియో ఒలింపిక్స్ విషయాన్ని తమ ఫేస్ బుక్ అకౌంట్లో బ్రయాన్ ద్వయం పోస్ట్ చేసింది. ఇప్పటివరకూ ఈ అమెరికా జోడి 112 టైటిల్స్ తమ ఖాతాలో వేసుకోగా, 16 గ్రాండ్ స్లామ్‌లను సొంతం చేసుకుంది. గత లండన్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని గెలిచి సత్తా చాటింది. జికా వైరస్ భయంతో ఇప్పటికే కొంతమంది టాప్ అథ్లెట్లు రియోకు గుడ్ బై చెప్పారు. వింబుల్డన్ రన్నరప్ రానిచ్, 2014 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ హాలెప్లతో పాటు, చెక్ రిపబ్లిక్కు చెందిన వరల్డ్ ఎనిమిదో ర్యాంక్ టెన్నిస్ ఆటగాడు టామస్ బెర్డిచ్, అదే దేశానికి చెందిన కరోలినా ప్లిస్కోవాలు రియో నుంచి వైదొలిగారు. -
రష్యాకు మరో ఎదురుదెబ్బ!
పారిస్: రియో ఒలింపిక్స్ విషయంలో ఇప్పటికే పలువురు అథ్లెట్లపై నిషేధం ఎదుర్కొంటున్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా రష్యా వెయిట్ లిఫ్టింగ్ బృందాన్ని ఒలింపిక్స్ లో పాల్గొనకుండా అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్(ఐడబ్యూఎఫ్) అడ్డుకుంది. గతంలో బీజింగ్, లండన్ ఒలింపిక్స్ల్లో రష్యా వెయిట్ లిఫ్టర్ల డోపింగ్ ఫలితాల నివేదిక ఆధారంగా ఆ జట్టుపై నిషేధం విధిస్తూ ఐడబ్యూఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐడబ్యూఎఫ్ తాజా ప్రకటన విడుదల చేసింది. గత ఒలింపిక్స్ ల్లో రష్యన్ వెయిట్ లిఫ్టర్లలో అధికశాతం మంది డోపింగ్‌కు పాల్పడి ఆ క్రీడకు మచ్చ తెచ్చారని పేర్కొన్న ఐడబ్యూఎఫ్.. మొత్తం ఆ జట్టుపై ఒలింపిక్స్ నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లతో కలుపుకుని 117 మంది రష్యా క్రీడాకారులపై నిషేధం పడింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తాజా నిబంధనల ప్రకారం రియోలో పాల్గొనే రష్యా అథ్లెట్లు ముందుగా ఆయా అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. దీంతో ఆ సమాఖ్యలు తీసుకునే నిర్ణయాన్నే బట్టే రష్యా అథ్లెట్ల భవితవ్యం ఆధారపడివుంది. రియో ఒలింపిక్స్‌కు సమయం దగ్గరపడుతున్నా...రష్యా అథ్లెట్ల నిషేధ పరంపర కొనసాగుతూనే ఉండటం గమనార్హం. -
'నా కొడుకు బోల్ట్ సక్సెస్ మంత్రం అదే'
కింగ్స్టన్: స్ప్రింట్ విభాగాల్లో వరుసగా మూడో ఒలింపిక్ స్వర్ణంపై గురి పెట్టిన ప్రపంచ చాంపియన్ ఉసేన్ బోల్ట్ కూల్ గా రికార్డులు బద్దలు కొట్టడానికి కారణం ఏంటో తెలుసా?, అతని చిరునవ్వేనట. ఈ విషయాన్ని ఉసేన్ బోల్ట్ తల్లి జెన్నీఫర్ బోల్ట్ స్పష్టం చేశారు. తన కొడుకు బోల్డ్ ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే అతన్ని చాంపియన్‌గా నిలబెడుతుందని జెన్నీఫర్ తెలిపారు. అదే అతని సక్సెస్ కు ప్రధాన కారణమన్న జెన్నీఫర్.. వచ్చే ఒలింపిక్స్‌లో కూడా బోల్ట్ కచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా చాలా సానుకూలంగా ఆలోచించే ధోరణి బోల్ట్ కు తన నుంచే వచ్చిందని ఇటీవల ఓ ఇంటర్య్వూలో పేర్కొన్న జెన్నీఫర్.. అదే విషయాన్ని తన కొడుక్కి పదే పదే చెబుతుంటానని పేర్కొన్నారు. 'రియో గేమ్స్‌కు బోల్ట్ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాడు. ఆ గేమ్స్‌లో బోల్ట్ నుంచి మెరుగైన ప్రదర్శన ఉంటుందని తెలుసు. కేవలం ఆటపై మాత్రమే ఫోకస్ చేయమని నా కొడుక్కి చెప్పా. దేవుడ్ని ఎప్పుడూ మరవద్దని తెలిపా. బైబిల్‌ను చదువుకోమని చెప్పా'అని జెన్నీఫర్ తెలిపారు. 100 మీటర్ల, 200 మీటర్ల పరుగులో వరల్డ్ రికార్డులు సృష్టించిన బోల్ట్.. ఇప్పటివరకూ రెండు ఒలింపిక్స్‌లో పాల్గొని ఆరు స్వర్ణాలను కైవసం చేసుకున్నాడు. రియో అర్హతలో భాగంగా జమైకా జాతీయ మీట్ నుంచి గాయం కారణంగా అర్థాంతరంగా వైదొలిగిన బోల్ట్.. ఆ తరువాత లండన్‌లో జరిగిన డైమండ్ లీగ్ ద్వారా ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. జూలై 22 వ తేదీన జరిగిన 200 మీటర్ల రేసులో బోల్ట్ సత్తా చాటి రియోకు సిద్ధమయ్యాడు. -
ఇంకా సిద్ధం కాలేదు!
* అసంపూర్తిగా ఒలింపిక్ విలేజ్ * వారంలో సిద్ధం చేస్తామన్న నిర్వాహకులు రియో డి జనీరో: మురుగు నీటితో నిండిపోయిన టాయిలెట్లు, లీకేజ్ పైపులు, ప్రమాదభరితంగా మారిన వైరింగ్, మెట్లపై అడుగుల మందం పేరుకుపోయిన మట్టి, ఇంకా పూర్తికానీ లైటింగ్ వ్యవస్థ, దుమ్ముపట్టిన రూమ్‌లు, ఫ్లోరింగ్, నీటితో తడిసిపోయిన గోడలు... ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం... ఒలింపిక్స్ విలేజ్ ప్రస్తుత పరిస్థితి ఇది. గేమ్స్‌కు 10 రోజుల సమయం కూడా లేదు. కానీ అక్కడ పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. గేమ్స్ కోసం రియో చేరుకుంటున్న చాలా దేశాల అథ్లెట్లు... విలేజ్ పరిస్థితి చూసి అక్కడికి వెళ్లేందుకు జంకుతున్నారు. సోమవారం ఆస్ట్రేలియా అథ్లెట్లు అపార్ట్మెంట్లో వసతులు చూసి వెనుదిరిగిపోయారు. దీంతో ఆఘామేఘాల మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన నిర్వాహకులు వారం రోజుల్లో ఒలింపిక్ విలేజ్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను పరిష్కరించేందుకు 630 మంది పని చేస్తున్నారని కమిటీ అధికార ప్రతినిధి మారియో ఆండ్రెడా తెలిపారు. గురువారానికి విలేజ్‌ను అందుబాటులో తెస్తామన్నారు. రోయింగ్, సెయిలింగ్ జరిగే ప్రాంతాల్లో అధిక జనాభా కారణంగా జికా వైరస్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న నిర్వాహకులు అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల కోసం అపార్ట్మెంట్లలో ఓపెన్ చేసిన నల్లాలను ఆపి వేయకపోవడంతో రూమ్‌లన్నీ నీటితో నిండిపోయి విపరీతమైన దుర్గంధం, గ్యాస్ వాసన వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో షార్ట్ సర్క్యూట్ జరుగుతోంది. మొత్తానికి తొలిసారి గేమ్స్‌కు ఆతిథ్యమిస్తున్న ఆనందం దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌కు లేకుండా పోతోంది. అనుభవరాహిత్యం, ప్రణాళిక లోపంతో ఒకేసారి పలు రకాల సమస్యలు చుట్టుముట్టుతుండటం తలకు మించిన భారంగా మారింది. -
రష్యా షూటర్స్‌కు క్లియరెన్స్
లాసానే: వచ్చే నెలలో రియోలో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రష్యన్ షూటర్స్‌కు క్లియరెన్స్ లభించింది. ఈ మేరకు మంగళవారం అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) .. రియోలో పాల్గొనే 18 మంది రష్యన్ షూటింగ్ బృందానికి ఆమోదం తెలిపింది. రియోలో పాల్గొనే రష్యా షూటర్ల వివరాలతో సంతృప్తి చెందినట్లు ఐఎస్ఎస్ఎఫ్ పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. 'మెక్ లారెన్ నివేదిక ప్రకారం వీరిలో ఎవరికీ డోపింగ్ కు పాల్పడిన రికార్డు లేదు. అందుచేత టెస్టుల్లో పాజిటివ్ వచ్చే సందర్భం కూడా ఉండదు. ఈ రష్యన్ అథ్లెట్లను క్షుణ్ణంగా పరీక్షించాం. వీరికి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది' అని ఐఎస్ఎస్ఎఫ్ పేర్కొంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తాజా నిబంధనల ప్రకారం రియోలో పాల్గొనే రష్యా అథ్లెట్లు ముందుగా ఆయా క్రీడల అంతర్జాతీయ సమాఖ్యల ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా ఇప్పుడు రష్యా ఆటగాళ్లపై డోపింగ్ రికార్డును ఆయా ఒలింపిక్ సమాఖ్యలు పరీక్షించే పనిలో పడ్డాయి. ప్రస్తుతం రష్యాకు షూటింగ్ లో క్లియరెన్స్ లభించడంతో వారికి మోస్తరు ఉపశమనం లభించింది. -
'నర్సింగ్ వివాదంలో ఏమీ చేయలేం'
న్యూఢిల్లీ:డోపింగ్ టెస్టుల్లో విఫలమైన భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేనట్లే కనబడుతోంది. ఈ వ్యవహారంలో తాము ఏమీ చేయలేమని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రకటనతో నర్సింగ్ ఒలింపిక్స్ కు వెళ్లేది అనుమానంగా మారింది. డోపింగ్ టెస్టుల్లో పట్టుబడటమనేది న్యాయపరమైన అంశమైనందున ఇందులో ఎవరికీ తలదూర్చే అవకాశమే లేదని క్రీడా మంత్రి విజయ్ గోయెల్ తెలిపారు. 'నేషనల్ యాంటీ డోపింగ్ ఏజన్సీ(నాడా) అనేది క్రమశిక్షణా సంఘం. డోపింగ్ కేసుల్లో ఆ ఏజెన్సీదే ప్రముఖ పాత్ర. ఈ విషయంలో నర్సింగ్ తన సచ్ఛీలతను అక్కడే నిరూపించుకోవాలి. మేము చేసేది ఏమీ లేదు' అని విజయ్ గోయెల్ అన్నారు. అయితే తనను కుట్ర పూరితంగా ఇరికించారని ఆరోపిస్తున్న నర్సింగ్ యాదవ్ వ్యాఖ్యలపై గోయెల్ దాటవేత ధోరణి అవలంభించారు. ఆ విషయం తమకు తెలియదన్నారు. దానికి సంబంధించి నర్సింగ్ తమతో ఏమీ చెప్పలేదని బదులిచ్చారు. నర్సింగ్ కు అండగా ఉంటాం రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్ అవకాశాలు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదని మరోవైపు భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్యూఎఫ్ఐ) వాదిస్తోంది. కుట్ర పూరిత చర్యలో భాగంగానే నర్సింగ్ యాదవ్ ఆహారంలో నిషేధిత డ్రగ్స్ కలపారనే అనుమానం వ్యక్తం చేసిన డబ్యూఎఫ్ఐ.. అతనికి పూర్తి స్థాయిలో న్యాయపరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఒక అతి పెద్ద కుట్రలో బాధితుడైన నర్సింగ్ కు ఇప్పుడు మద్దతుగా నిలవడమే తమ కర్తవ్యమని తెలిపింది. 'నర్సింగ్ యాదవ్‌పై పూర్తి నమ్మకం ఉంది. అతను అమాయకుడు. అతనిపై కక్ష గట్టే ఎవరో డ్రగ్స్‌ను ఆహారంలో కలిపారు. నర్సింగ్కు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ సమస్య నుంచి నర్సింగ్‌ను బయట తీసుకొచ్చేందుకు మా శాయశక్తుల ప్రయత్నిస్తున్నాం. ఇంకా నర్సింగ్ రియో అవకాశాలు మూసుకుపోలేదు. భారత్ నుంచి రెజ్లింగ్ 74 కేజీల విభాగంలో నర్సింగ్ వెళతాడు. ఈ విషయంలో మాకు అపారమైన నమ్మకం ఉంది. రియోకు వెళ్లడమే కాదు.. పతకం కూడా సాధిస్తాడు' అని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ తెలిపారు. మరోవైపు డబ్యూఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ అసిత్ సాహా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అతని రెండు శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చిన తరుణంలో ఒలింపిక్స్ కు వెళ్లే అవకాశం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఒలింపిక్స్ లో భాగంగా ఏర్పాటైన ఒక కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తుందన్నారు. ఆ కమిటీ తీసుకునే తుది నిర్ణయంపై నర్సింగ్ రియో భవితవ్యం ఆధారపడి వుంటుందన్నారు. దీనిలో భాగంగా నర్సింగ్ కు అవసరమైన సహకారాన్ని అందిస్తామని అసిత్ సాహా తెలిపారు. -
23లోగా కళాశాలల వివరాలు పంపాలి
ఆదిలాబాద్ టౌన్ : 2016–17 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం లాగిన్ అవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఆర్ఐవో కార్యాలయంలో ఈ నెల 23లోగా సమర్పించాలని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షకుడు నాగేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వివరాలను ఇంటర్ బోర్డుకు పంపాల్సి ఉంటుందని, వివరాలు సమర్పించని వారికి అడ్మిషన్ లాగిన్ ఇవ్వబోమని తెలిపారు. కళాశాలల్లో సీసీ కెమెరాలను అమర్చాలని తెలిపారు. అక్టోబర్‌లో బోర్డు ప్రతినిధులు ప్రతి కళాశాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. -
52 సంవత్సరాల తర్వాత...
రియోకు భారత్ నుంచి ఈసారి ఒకే ఒక్క ప్రాతినిధ్యం ఉంది. ఆర్టిస్టిక్స్‌లో దీపా కర్మాకర్ తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 1964 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలుగా ఘనత సాధించింది. రియోలోనే జరిగిన ఒలింపిక్స్ అర్హత పోటీల్లో దీపా కర్మాకర్ ఆకట్టుకుంది. -
ఖచ్చితమైన సమాచారం పొందుపరచాలి
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థుల వివరాలతోపాటు కళాశాలలోని వసతులకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచాలని, లేకుంటే చర్యలు తప్పవనిఆర్ఐవో రవి, డీవీఈవో చంద్రమౌళి పేర్కొన్నారు. కడప నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆన్లైన్ ఆడ్మిషన్లు, జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్‌పై ప్రిన్సిపల్‌తో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్ఐవో, డీవీఈవోలు మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన ప్రతి అడ్మిషన్‌ను ఆన్లైన్లో పెట్టాలన్నారు. ఆన్లైన్లో పెట్టేటప్పుడు విద్యార్థులకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఖచ్చితంగా ఉండాలన్నారు. అలాగే కళాశాలలోని సైన్సుల్యాబ్, ల్యాబ్‌లో పరికరాలు, అధ్యాపకుల వివరాలతోపాటు అన్ని రకాల వసతులకు సంబంధించి ప్రతి విషయాన్ని ఖచ్చితంగా తప్పులు లేకుండా ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. సంబంధిత విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. అలాగే జంబ్లింగ్విధానంలో ప్రయోగ పరీక్షల గురించి విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలన్నారు. ప్రతి ల్యాబ్‌లో పరికరాలు కల్పించి విద్యార్థుల చేత ప్రయోగాలను చేయించాలన్నారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ సెక్రటరీ రేణుకాప్రసాద్, ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ సెక్రటరీ రమణరాజుతోపాటు ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
రియోలోనూ ఎగరాలి
దక్షిణ కొరియాపై భారత్ జట్టు డేవిస్ కప్ విజయం సాధించడం ఊహించిన ఫలితమే. ఈ పోరులో ప్రధానంగా అందరూ దృష్టి సారించింది పేస్, బోపన్న జోడీ మీద. గతంలోనూ డేవిస్కప్లలో పేస్, బోపన్న కలిసి ఆడారు, విజయాలు సాధించారు. కానీ గత నాలుగేళ్లుగా భారత టెన్నిస్‌లో నెలకొన్న పరిస్థితులు చూస్తే.. ఈ ఇద్దరూ కలిసి ఏ మేరకు సమన్వయంతో ఆడతారనే సందేహం చాలామందికి ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్ సమయంలో పేస్‌తో కలిసి ఆడబోనంటూ బోపన్న తేల్చేయడం, ఈసారి రియో ఒలింపిక్స్‌కు ముందు తనకు జోడీగా సాకేత్ మైనేని కావాలని బోపన్న కోరడం లాంటి పరిణామాలు భారత టెన్నిస్‌లో ఆందోళన పెంచాయి. అయితే భారత టెన్నిస్ సంఘం పట్టుబట్టి మరీ బోపన్నను ఒప్పించి పేస్‌తో కలిపి రియోకి పంపుతోంది. ఒలింపిక్స్‌కు ముందు ఈ ఇద్దరూ కలిసి ఆడటానికి లభించిన చివరి అవకాశం కొరియాతో మ్యాచ్. ఇందులో ఇద్దరూ అంచనాలకు తగ్గట్లుగా రాణించారు. నిజానికి నాణ్యత పరంగా కొరియా జోడీ ఏ మాత్రం భారత జోడీకి పోటీ ఇవ్వదని తెలిసినా... కోర్టులో సమన్వయానికి, ఒకరి ఆటను ఒకరు అర్థం చేసుకోవడానికి లభించిన అవకాశాన్ని పేస్, బోపన్న సద్వినియోగం చేసుకున్నారనే భావించాలి. పేస్ ఘన చరిత్ర లియాండర్ పేస్ రియో ఒలింపిక్స్ ద్వారా చరిత్ర సృష్టించబోతున్నాడు. వరుసగా ఏడు ఒలింపిక్స్ల్లో పాల్గొనబోతున్న తొలి టెన్నిస్ క్రీడాకారుడు పేస్. అలాగే భారత్ నుంచి ఏ క్రీడలో అయినా ఓ ఆటగాడు ఏడు ఒలింపిక్స్ల్లో పాల్గొనడం అద్భుతమైన విషయం. 1992 నుంచి లండన్ ఒలింపిక్స్ వరకు ఆరుసార్లు పాల్గొన్న పేస్... 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో కాంస్యం గెలిచాడు. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో జాదవ్ రెజ్లింగ్‌లో పతకం గెలిచిన తర్వాత... మళ్లీ భారత్‌కు వ్యక్తిగత పతకం అందించిన క్రీడాకారుడిగా పేస్ చరిత్ర సృష్టించాడు. ఒక్క ఒలింపిక్స్ అనే కాదు... డేవిస్ కప్‌లలోనూ పేస్‌ది గొప్ప రికార్డు. మామూలు టోర్నీలలో, గ్రాండ్‌స్లామ్‌లలో ఓడిపోయిన మేటి క్రీడాకారుల మీద డేవిస్‌కప్‌లో పేస్ సంచలన విజయాలు సాధించాడు. తనకంటే చాలా మెరుగైన, బలమైన ఆటగాళ్లని ఓడించిన ఘనత పేస్‌ది. భారత జాతీయ జెండా కనిపిస్తూ ఉంటే పేస్‌లోని నైపుణ్యం మరింత బయటకు వస్తుందనేది వాస్తవం. అందుకే భారత క్రీడాచరిత్రలోనే గొప్పవాడిగా పేస్ ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. ఇక బోపన్నకు రియో వరుసగా రెండో ఒలింపిక్స్. లండన్‌లో భూపతితో జోడీగా బరిలోకి దిగినా ఆకట్టుకోలేకపోయాడు. ఈసారి భారత్‌కు టెన్నిస్‌లో డబుల్స్‌లో రియోకు వెళ్లే అవకాశం రావడానికి కారణం బోపన్న. పేస్ వరుసగా ఏడో ఒలింపిక్స్‌లో ఆడుతున్నాడంటే దానికి బోపన్న ర్యాంకింగ్ కారణం. నిజానికి పేస్‌తో కలిసి ఆడే ఏ ఆటగాడైనా కోర్టులోకి దిగితే ఆ దిగ్గజం స్ఫూర్తితో మరింత బాగా ఆడతాడు. రియోలో బోపన్న కూడా అలాగే ఆడతాడని ఆశిద్దాం. కొరియాపై గెలిచిన తర్వాత పేస్, బోపన్నలతో పాటు భారత బృందం అంతా త్రివర్ణ పతాకంతో టెన్నిస్ కోర్టులో తిరుగుతూ ఉంటే చూసిన ప్రతి భారతీయుడూ గర్వపడ్డాడు. మరో నెల రోజుల్లో రియోలోనూ పేస్, బోపన్న ఇదే త్రివర్ణాన్ని రెపరెపలాడించాలి. అప్పుడే సగటు భారత క్రీడాభిమానికి సంతోషం, సంబరం. - సాక్షి క్రీడావిభాగం -
ఒలింపిక్స్ కు తొలి బంగ్లాదేశీ అర్హత
ఢాకా: బంగ్లాదేశ్ కు చెందిన క్రీడాకారుడు తొలిసారి ఒలింపిక్స్ కు అర్హత సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. రియో అర్హత ర్యాంకింగ్స్ లో భాగంగా బంగ్లాదేశ్ కు చెందిన గోల్ఫర్ సిద్దికూర్ రెహ్మాన్ 56వ స్థానంలో నిలిచి ఒలింపిక్స్ కు బెర్తును దక్కించుకున్నాడు. దీంతో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి బంగ్లాదేశీగా ఘనత సాధించాడు. ఈ మేరకు అంతర్జాతీయ గోల్ఫ్ ఫెడరేషన్ విడుదల చేసిన రియో ఒలింపిక్స్ ర్యాంకింగ్స్ లో రెహ్మాన్ చోటు దక్కించుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కాగా, బంగ్లాదేశ్ నుంచి స్మిమ్మర్లు మహిజుర్ రెహ్మాన్, సోనియా అక్తర్ తింపా, ఆర్చరీ విభాగంలో షైమోలీ రాయ్, అబ్దుల్లాహెల్ బాకీలు రియోలో పాల్గొంటున్నారు. అయితే వీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాత్రమే రియోకు అర్హత సాధించగా, గోల్ఫర్ సిద్ధికూర్ మాత్రం ర్యాంకింగ్ ఆధారంగా ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి బంగ్లాదేశీగా నిలవడం విశేషం. ఇదిలా ఉంగా, దాదాపు శతాబ్దం తరువాత గోల్ప్ క్రీడను ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టడం మరో విశేషం. ఒలింపిక్స్ లో గోల్ప్ ను ప్రవేశపెట్టడం ఇప్పటికి మూడు సార్లు మాత్రమే జరిగింది. తొలిసారి 1900వ సంవత్సరంలో ఈ ఆటను ప్రవేశపెట్టగా, ఆ తరువాత 1904 ఒలింపిక్స్ లో ఆ క్రీడను చివరిసారి కొనసాగించారు. -
హాకీ కెప్టెన్ ను మార్చేశారు..
-
హాకీ కెప్టెన్ ను మార్చేశారు..
న్యూఢిల్లీ: వచ్చే నెలలో బ్రెజిల్ లో జరుగనున్న రియో ఒలింపిక్స్ కు వెళ్లే భారత హాకీ జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ పురుషుల హాకీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న సర్దార్ సింగ్ ను ఆ పదవి నుంచి తప్పిస్తూ హాకీ ఇండియా(హెచ్ఐ) నిర్ణయం తీసుకుంది. వెటరన్ ఆటగాడైన సర్దార్ సింగ్ ను రియో స్క్వాడ్ లో ఎంపిక చేయగా, కెప్టెన్సీని నుంచి తొలగించారు. అతని స్థానంలో 28 ఏళ్ల శ్రీజేష్ రవీంద్రను కెప్టెన్ గా నియమించారు. ఈ మేరకు మంగళవారం రియోకు వెళ్లే 16 మందితో కూడిన భారత పురుషుల, మహిళల హాకీ జట్లను హాకీ ఇండియా ప్రకటించింది. తాజా ఎంపికలో డిఫెండర్ బరిందర్ లక్రాకు చోటు దక్కలేదు. బరిందర్ గాయపడటంతో అతని స్థానంలో సురిందర్ కుమార్ కు అవకాశం కల్పించారు. మరోవైపు ఎస్ వి సునీల్ వైస్ కెప్టెన్ గా నియమించారు. ఇదిలా ఉండగా, మహిళల హాకీ జట్టు నుంచి రీతూ రాణిని తొలగించారు.చాలాకాలంగా భారత మహిళ హాకీ జట్టుకు కెప్టెన్ గా చేస్తున్న రీతూనూ రియోకు వెళ్లే జట్టులో స్థానం కల్పించలేదు. గత కొంతకాలంగా రీతూ ప్రదర్శనతో పాటు ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో ఆమెపై వేటు వేశారు. రీతూ స్థానంలో సుశీల్ చానుకు కెప్టెన్ గా నియమించారు. భారత పురుషుల హాకీ స్క్వాడ్ ; శ్రీజేష్ రవీందర్(కెప్టెన్), ఎస్ వి సునీల్( వైస్ కెప్టెన్), హర్మన్ ప్రీత్ సింగ్, రూపేందర్ పాల్ సింగ్, కొతాజిత్ సింగ్, సురేందర్ కుమార్, మన్ ప్రీత్ కుమార్, సర్దార్ సింగ్, వీఆర్ రఘునాథ్, ఎస్ కే ఉతప్ప, దనిష్ ముజ్ తాబా, దేవేందర్ వాల్మికీ, అక్షదీప్ సింగ్, చింగ్లేన్ సానా సింగ్, రమణ్ దీప్ సింగ్, నిఖి తిమ్మయ్య స్టాండ్ బై: ప్రదీప్ మోర్, వికాష్ దాహియా భారత మహిళల హాకీ స్క్వాడ్: సుశీల్ చాను(కెప్టెన్), దీపికా(వైస్ కెప్టెన్), దీప్ గ్రీస్ ఎక్కా, నమితా తొప్పో, సునీతా లక్రా, నవజోత్ కౌర్, మోనికా, రేణుకా యాదవ్, లిలిమా మింజ్, అనురాధా దేవి, పూనమ్ రాణి, వందనా కటారియా, ప్రీతి దుబే, నిక్కీ ప్రధాన్ స్టాండ్ బై: రజని ఎతిమార్పు, లాల్ రౌత్ ఫెలీ -
'రియో' అర్హతలో నీరజ్ విఫలం
న్యూఢిల్లీ:రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో భారత ప్రొఫెషనల్ బాక్సర్ నీరజ్ గోయట్ విఫలమయ్యాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం నిర్వహించిన ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ లో నీరజ్ కాంస్య పతకానికే పరిమితమై రియో బెర్తును సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శుక్రవారం వెనుజులాలో జరిగిన సెమీ ఫైనల్ పోరులో నీరజ్ గోయట్ (69 కేజీలు) 0-3 తేడాతో అరాజిక్ మారుట్జాన్(జర్మనీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. మరోవైపు సెమీ ఫైనల్లో ఓడిన బాక్సర్ల మధ్య జరిగిన పోరులో కూడా నీరజ్ పరాజయం చెందాడు. సిసోకో డియే యూబా (స్పెయిన్)తో జరిగే బౌట్లో కూడా నీరజ్ వైఫల్యం చెందడంతో రియో అర్హతపై పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడింది. అంతకుముందు మరో ఇద్దరు భారత ప్రొ బాక్సర్లు గౌరవ్ బిదురి, దిల్బాగ్ సింగ్‌లు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. రియో అర్హతలో భాగంగా ప్రపంచంలోని ప్రొ బాక్సర్లకు ఐబా పోటీలు నిర్వహిస్తోంది. ప్రొ బాక్సర్లకు 26 రియో బెర్తులు ఉన్నా, ప్రతీ కేటగిరీ నుంచి ముగ్గురు మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. -
రియో ఒలింపిక్స్‌కు మరో తలనొప్పి
బ్రెజిల్ రియో ఒలంపిక్స్ క్రీడల్ని మొన్నటి వరకు జికా వైరస్ భయపెడితే.. తాజాగా మరో కీలక పరిణామం వేధిస్తోంది. బ్రెజిల్ లో నెలకొన్న సంక్షోభం రియో ఒలింపిక్స్ పై ప్రభావాన్ని పడేయనుందా... అంటే అవునే అనిపిస్తోంది. బ్రెజిల్ రాజధాని నగరం రియో డి జనీరో లో తీవ్ర ఆర్థిక మాంద్య పరిస్థితులతో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో 2016 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ వ్యవహారంలో కొత్త తలనొప్పి మొదలైంది. నగరంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మధ్యంతర గవర్నర్ ఫ్రాన్సిస్కో డోర్నెల్లస్ శుక్రవారం ప్రకటిచారు. బ్రెజిల్లో రెండవ అత్యధిక జనాభా కలిగిన పెద్ద నగరం, రాజధాని రియో లో ప్రతిష్టాత్మక ఒలంపిక్స్‌కు ఈ ఏడాది అతిధ్యమిస్తున్న నగరంలో...ఒలింపిక్స్ కు సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ఆందోళన రేపింది. ప్రజా విపత్తుమూలంగా ప్రజల భద్రత, ఆరోగ్యం, విద్య ప్రజా, రవాణా, పర్యావరణ మేనేజ్మెంట్ తదితర సేవల్లో మొత్తం పతనానికి దారి తీయవచ్చనే ఆందోళనతో ఈ అత్యవసర చర్య అవసరమైందని రాష్ట్ర అధికారిక గెజిట్ స్పష్టం చేసింది. గేమ్స్ నిర్వహణలో సహాయం చేయాల్సిందిగా బ్రెజిల్ మధ్యంతర అధ్యక్షుడు మైకేల్ టెమర్ ఫెడరల్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రపంచ చమురు ధరలు పడిపోవడంతో ముఖ్యంగా పెట్రోలియం రంగంతోముడిపడివున్నరాష్ట్ర రెవెన్యూ క్షీణించింది. గత రెండేళ్లుగా నెలకొన్న సంక్షోభం రియో ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీసింది. అయితే రాష్ట్ర ఆర్థిక అత్యవసర పరిస్థితి ఒలింపిక్స్ నిర్వహణ పై ప్రభావం చూపదని, అనుకున్నట్టుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని రియో మేయర్ ఎడ్యరాడో పేస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే నగరంలోని మెట్రో విస్తరణ పనులు కూడా ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే పూర్తి అవుతాయని చెప్పారు. ఒలింపిక్స్ కు సంబంధించి అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు గేమ్స్ స్థానిక నిర్వాహక కమిటీ దీనిపై స్పందించ లేదు . కాగా సుమారు 5లక్షలమంది మందివిదేశీ సందర్శకులు ఒలింపిక్స్ క హాజరయ్యే అవకాశం ఉందని అంచాన. ఒలింపిక్ మౌలిక వ్యయాల్లో ఎక్కువభాగం ప్రైవేట్ కంపెనీల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. దీంతోపాటు నగరం , రాష్ట్ర , సమాఖ్య బడ్జెట్లు కేటాయించాల్సి ఉండగా...భద్రత , ఆరోగ్య సేవలు లాంటివాటి ప్రధాన బాధ్యత మాత్రం రియోదే. -
'రియో'కు మహిళా ఆర్చర్ల త్రయం
న్యూఢిల్లీ: భారత మహిళా ఆర్చర్లు దీపికా కుమారి, బాంబాయ్లా దేవి, లక్ష్మీరాణి మహిలు రియో ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. గత మూడు నెలల ప్రదర్శన ఆధారంగా చేసుకుని భారత ఆర్చరీ సంఘం వీరిని ఎంపిక చేసింది.ఈ ముగ్గురు వ్యక్తిగత విభాగాల్లో పోటీ పడటంతో పాటు, టీమ్ ఈవెంట్లో కూడా ఈ త్రయమే జట్టు కట్టనుంది. ఆర్చరీ ట్రయల్స్, శిక్షణలో భాగంగా గత మూడు నెలల నుంచి వివిధ నగరాల్లో ఆరు స్టేజ్లలో నిర్వహించిన సెలక్షన్ అనంతరం ఈ ముగ్గురు పేర్లను భారత అర్చరీ సంఘం ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం మహిళా ఆర్చర్ల పేర్లను ప్రకటించింది. -
సుశీల్ కుమార్‌కు ఆశాభంగం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ బెర్తును ఆశించిన భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతని స్థానంలో మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను ఎంపిక చేస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్యూఎఫ్ఐ) తాజాగా నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి సోన్పేట్లో భారత రెజ్లింగ్ రియో సన్నాహకాల్లో ఆరంభమవుతున్న నేపథ్యంలో సుశీల్ కుమార్-నర్సింగ్ యాదవ్‌ల రియో బెర్తుపై నెలకొన్న వివాదానికి డబ్యూఎఫ్ఐ ఎట్టకేలకు తెరదించింది. వాస్తవానికి రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో పాల్గొంటామని ఇద్దరు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ పోటీ పడ్డారు. భారత్ తరఫున ఈ కేటగిరిలో సుశీల్ (ఢిల్లీ), నర్సింగ్ (ముంబై) అత్యుత్తమ రెజ్లర్లు కాగా, కేవలం ఒకరికి మాత్రమే ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది. గతేడాది లాస్వేగాస్లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గడంతోపాటు టాప్-6లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఆ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక... మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడకూడదు. గతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పతకాలు తెచ్చానని తనకు ఈసారి మరో అవకావం ఇవ్వాలని సుశీల్ పట్టుబట్టినా.. నిబంధనల ప్రకారం నర్సింగ్ యాదవ్ కు అవకాశం కల్పించారు. '74 కేజీల విభాగంలో సుశీల్-నర్సింగ్ల మధ్య ట్రయల్స్ నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ అందలేదు. అందుజేత నర్సింగ్ యాదవ్ ను ఈ కేటగిరీ నుంచి రియో సన్నాహకానికి ఎంపిక చేశాం. నిబంధనల మేరకు నర్సింగ్ యాదవ్ ఎంపిక జరిగింది. రాబోవు రోజుల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా?అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ సుశీల్ రియో సన్నాహకాలకు వస్తానంటే కాదనం 'అని డబ్యూఎఫ్ఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఒలింపిక్స్ లో భారత రెఫరీ..
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బ్రెజిల్ లోని జరుగనున్న రియో ఒలింపిక్స్ లో భారత్ కు చెందిన అశోక్ కుమర్ రిఫరీగా ఎంపికయ్యాడు. దీంతో అశోక్ కుమార్ ఒలింపిక్స్ కు ఎంపికైన తొలి భారతీయ రెజ్లింగ్ రిఫరీగా స్థానం సంపాదించాడు. యునైటెట్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్యూడబ్యూ) మ్యాచ్ ల నిర్వహణలో భాగంగా సూపర్ వైజర్లు, సలహాదారులను కలుపుకుని మొత్తంగా 50 మందిని ఎంపిక చేసింది. వీరిలో తొమ్మిది మందికి ఆసియానుంచి చోటు లభించగా, వారిలో అశోక్ కుమార్ ఒకరు. ప్రస్తుతం అశోక్ కుమార్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వారెంట్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. ఈ ఏడాది లాస్ వేగాస్‌లో జరిగిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పనితీరును పరిగణనలోకి తీసుకుని రిఫరీల ఎంపిక జరిగింది. -
‘పది’లో కాకతీయ ప్రభంజన
విద్యార్థులను సన్మానించిన ఆర్ఐఓ నిజామాబాద్‌అర్బన్ : పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన కాకతీయ విద్యార్థులను ఆర్ఐఓ విజయ్‌కుమార్ మంగళవారం సన్మానించారు. 10 జీపీఏ సాధించిన సీహెచ్.దినేష్, ఆర్.జిగీషతో పాటు 9.8 జీపీఏ సాధించిన ఏడుగురిని అభినందించారు. ఈ సందర్భంగా ఆర్ఐవో మాట్లాడుతూ ఉత్తమఫలితాలు సాధించడంలో కాకతీయ విద్యార్థులు ముందంజలో ఉంటారని అన్నారు. 9 రాష్ట్ర స్థాయి జీపీఏ మార్కులతో 102 మంది, 8 రాష్ట్ర స్థాయి గ్రేడు మార్కులతో 300 మంది విద్యార్థులు ప్రభంజనం సృష్టించారన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం ఫరీదొద్దీన్ మాట్లాడుతూ.. ఇటీవల వెలువడిన ఐఐటీ రామయ్య ఫలితాల్లో కుమారి, జగదీష్, సీహెచ్.భానుతేజ ఎంపికయ్యారన్నారు. అంతేకాకుండా ఐఐటీ మెరుున్స్‌లో 20 మంది విద్యార్థులు సత్తా చాటారని అన్నారు. భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తితో మెరుగైన ప్రణాళికలతో విద్యార్థులను తీర్చిదిద్ది జాతీయ స్థాయిలో ప్రతిభ చూపేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కాకతీయ హైస్కూల్ అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
-
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మం, న్యూస్‌లైన్ : ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 62,898 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం 93 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 11,390 బాలురు, 13,249 మంది బాలికలు మొ త్తం 24,639 మంది, ఒకేషనల్ విభాగంలో బాలురు 1859 మంది, బాలికలు 1468 మంది పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 11,782 మంది, బాలికలు 12, 426 మంది మొత్తం 24,208 మంది రెగ్యులర్ విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం ప్రైవేట్‌గా బాలురు 2,786 మంది, బాలికలు 2,085 మంది మొత్తం 4,872 పరీక్షలకు హాజరు కానున్నారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్సులో రెగ్యులర్ అభ్యర్థుల్లో బాలురు 2913 మంది, బాలికలు 2723 మంది మొత్తం 4,736 మంది ఉండగా ఇదే విభాగంలో ప్రైవేట్ అభ్యర్థులు బాలురు 524 మంది, బాలికలు 592 మంది మొత్తం 1116 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు సర్వం సిద్ధం: ఆర్ఐవో ఇంటర్ మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని ఆర్ఐవో విశ్వేశ్వర్రావు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 93 సెంటర్ల ద్వారా 62,898 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వాజేడు, ఏపీటీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల గుండాల, జీజేసీ గుండాల, జీజేసీ పినపాక, జీజేసీ ఏన్కూరు, జీజేసీ చర్ల, జీజేసీ గార్ల, జీజేసీ కూనవరం, జీజేసీ పాల్వంచ, జీజేసీ వీఆర్‌పురం, జీజేసీ నాగులవంచ, జీజేసీ వేలేరుపాడు, జీజేసీ బూర్గంపాడు, జీజేసీ దుమ్ముగూడెం, జీజేసీ కామేపల్లి సెంటర్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని వివరించారు. ఆ సెంటర్లలో పరీక్షలు సజావుగా నిర్వహించేం దుకు అదనపు ఉద్యోగులను నియమించామని చెప్పారు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగానే విద్యార్థులు హాల్లోకి వెళ్లాలని సూచించారు. ఉదయం 8:45 నుంచి 8: 59 మధ్య వచ్చిన వారు ఆలస్యానికి కారణం తెలుపుతూ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల్లో ఏ ఇద్దరు ఒకే కళాశాల వారై ఉండరాదన్నారు. సెంటర్‌కు కనీసం 300 మీటర్ల పరిధిలో సెల్ఫోన్లు నిషేధిస్తున్నామని తెలిపారు. దీనిని పసిగట్టేందుకు జీసీఎస్, జీపీఆర్ యంత్రాలను అమర్చుతున్నామని చెప్పారు. ఇన్విజిలేటర్ల కోసం అన్వేషణ... పరీక్షల నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్ల కోసం జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. రోజుకు సుమారు 28 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా, ఇందుకోసం కనీసం 1400 మంది ఇన్విజిలేటర్లు అవసరం. అయితే జూనియర్ కళాశాలల పరిధిలో పనిచేసే అధ్యాపకులు 400 మంది మాత్రమే ఉండటంతో మిగిలిన వారికోసం ప్రభుత్వ పాఠశాలల ఉపాద్యాయులను ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే ఎన్నికల డ్యూటీ, టెట్ పరీక్షల కసరత్తు, పదో తరగతి విద్యార్థులకు బోధన వంటి పనులతో బీజీగా ఉన్న ఉపాధ్యాయులకు ఇంటర్ డ్యూటీలు వేయడం కుదరదని డీఈవో ఇంటర్ బోర్డు అధికారులకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. అయితే ఉపాధ్యాయులను తప్ప మిగిలిన వారికి డ్యూటీలు వేయలేమని ఆర్ఐవో జిల్లా విద్యాశాఖ అధికారికి వివరించడంతో ఇంటర్ డ్యూటీల కోసం ఉపాధ్యాయులను అనుమంతించారు. -
కాపీయింగ్‌కు చెక్
ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని అమలు చేస్తోంది ఇంటర్ బోర్డు. సాంకేతిక పరిజ్ఞానంతో మాస్ కాపీయింగ్‌కు పాల్పడాలనుకున్న వారికి అదే సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అన్ని ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) సెల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేనుంది. రీక్ష ప్రారంభమైన క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు బయట ప్రత్యక్షమవటం.. సెల్ఫోన్ల ద్వారా ప్రశ్నలు బయటకు చేరవేస్తూ మాస్ కాపీయింగ్‌కు పాల్పడటం.. ర్యాంకుల కోసం పాకులాడే కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా చేసే చర్యలివి. దీని ఫలితంగా కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు సెల్‌ట్రాకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చి మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు భావిస్తోంది. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులకు ఉన్నతాధికారులు సమాచారం అందించారు. పనితీరు ఇలా... ప్రతి ఇంటర్ పరీక్ష కేంద్రంలో జీపీఎస్ సిస్టం ఏర్పాటుచేసి హైదరాబాద్‌లో ఉన్న ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా ఆ సెంటర్‌కు వంద మీటర్ల దూరంలో ఉన్నవారు సెల్ఫోన్ల ద్వారా ఎవరెవరితో మాట్లాడుతున్నారనే సమాచారం ఇంటర్ బోర్డుకు అందుతుంది. దీనిద్వారా ఏ సెంటర్లో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ విధానం వల్ల ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. మాస్‌కాపీయింగ్ అరికట్టేందుకే.. - కె.వెంకట్రామయ్య, ఆర్ఐవో జిల్లాలో 159 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నాం. వంద శాతం మేర అన్ని సెంటర్లలో జీపీఎస్ నిఘా ఉంటుంది. ఈ విధానం డీజీపీ పర్యవేక్షణలో ఉంటుంది. జీపీఎస్ పరికరాలు ఎక్కడ అమర్చారనేది కూడా తెలుసుకోవటం కష్టం. ఈ విధానం ద్వారా పూర్తిగా పారదర్శకంగా ఎటువంటి కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహిస్తాం. ఎవరైనా కాపీయింగ్‌కు ప్రయత్నించినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం. సంబంధిత సెంటర్ల సూపర్వైజర్లను బాధ్యుల్ని చేసి సస్పెండ్ చేస్తారు. అందుకే సూపర్వైజర్లుగా ప్రభుత్వ శాఖలకు చెందినవారిని మాత్రమే నియమిస్తున్నాం. -
నిమిషం ఆలస్యమైనా నోఎంట్రీ!
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్ :ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఆర్ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పరీక్ష ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు. ప్రథమ సంవత్సరంలో 37,455 మంది, ద్వితీయ సంవత్సరంలో 33,125 మంది, ప్రైవేటు విద్యార్థులు 7,058 మంది కలిపి మొత్తం 77,638 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. 110 కే ంద్రాల్లో పరీక్షలు కొనసాగనున్నాయని, ఈ సారి కొత్తగా ఆలూరు, కోడుమూరు మోడల్ స్కూళ్లనూ కేంద్రాలుగా ఎంపిక చేశామని అన్నారు. మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్, ద్వితీయ సంవత్సరం సైన్స్ సబ్జెక్టులకు పాత, కొత్త సిలబస్‌లలో ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు. పరీక్షల పర్యవేక్షణకు నాలుగు ఫ్లైయింగ్స్క్వాడ్లు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, రవాణా సౌకర్యం కల్పించాలని, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో, ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖలకు విన్నవించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని చెప్పారు. పాత, కొత్త పేపర్లు ఇచ్చే విషయంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. పాత విద్యార్థులందరినీ ఒక రూంలో ఉంచి పరీక్ష రాయించాలని సూచించారు. ఫీజు పెండింగ్ ఉన్నా హాల్‌టికెట్ ఇవ్వాల్సిందే... ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఫీజు పెండింగ్‌లో ఉన్నా హాల్‌టికెట్ ఇవ్వాలని ఆర్ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు చెప్పారు. ముందుగా హాల్‌టికెట్ ఇచ్చేసి మార్క్‌లిస్ట్ ఇచ్చే సమయంలో ఫీజు వసూలు చేసుకోవాలన్నారు. హాజరుశాతం తక్కువగా ఉండే వారికి అపరాద రుసుము కట్టించుకుని హాల్‌టికెట్ ఇవ్వాలని సూచించారు. 70 నుంచి 75 శాతానికి రూ.200లు, 65 నుంచి 70 శాతానికి రూ.250లు, 60 నుంచి 65 శాతానికి రూ.500లను డీడీ ద్వారా ఫీజు చెల్లించి, దానిని ప్రిన్సిపాల్‌కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాపీయింగ్‌ను అరికట్టేందుకు బోర్డు చర్యలు పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టేందుకు బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇంటర్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నాపత్రాన్ని 8.45 గంటలకు తీస్తారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట నుంచి పరీక్ష నిర్వహణాధికారులు సెల్‌ఫోన్ ద్వారా పేపర్ లీక్ చేసేవారు. క్షణాల్లోనే కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఆ ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థులకు చెప్పేవి. 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో ప్రశ్నలకు సమాధానాలు చూసుకున్న విద్యార్థులు 9.15 గంటలకు పరీక్షా కేంద్రంలోకి వెళ్లేవారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఇంటర్ మీడియట్ బోర్డు కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు ఈ యేడాది సరికొత్త ఎత్తుగడ వేసింది. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా విద్యార్థులను 8.30 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. 8.45 నుంచి 9 గంటల మధ్య వచ్చే విద్యార్థులను ఆలస్యంగా వచ్చే వారిగా గురించి పేర్లు నమోదు చేస్తారు. ఆ వివరాలను ఇంటర్ మీడియట్ బోర్డుకు అదే రోజు పంపిస్తారు. దీంతో పాటు ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్ ఉపయోగించరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ మాత్రమే సెల్‌ఫోన్ వాడేందుకు అనుమతించారు. అది కూడా ఆండ్రాయిడ్ వర్షన్ ఫోన్ కాకుండా సాధారణ మొబైల్ ఫోన్‌ను వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మొబైల్ ఫోన్ ద్వారా బయటి వారికి సమాచారం చేరవేసినా క్షణాల్లో జియో పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ద్వారా ఇంటర్ మీడియట్ బోర్డు అధికారులకు తెలిసిపోతుంది. ఏ ఫోన్ నెంబర్ నుంచి ఏ ఫోన్ నెంబర్‌కు ఏ సమాచారం పంపించారో సులభంగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధానం రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ మీడియట్ పబ్లిక్ పరీక్షల నుంచి అమలు కానుంది. -
రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు తీరని నష్టం
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘ నాయకుడు తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ విద్యా సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐఓ) కార్యాలయం ఎదుట కొనసాగిస్తున్న రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఐదో రోజు దీక్షను సోమవారం ఇంటర్మీడియట్ విద్య జేఏసీ కన్వీనర్ పీ రంగనాయకులు, విశ్రాంత అధ్యాపకులు కే గణపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల నదీ జలాల పంపిణీ విషయంలో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా, ఉపాధి రంగాల్లో కూడా అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఆదాయం, రుణాలు, హైదరాబాద్ లాంటి కీలక అంశాల పరిష్కారం, సీమాంధ్ర ప్రజలకు జరిగే అన్యాయం గురించి వెంకటేశ్వరరెడ్డి వివరించారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ రాయపాటి జగదీష్.. విభజన వల్ల విద్య, ఉపాధి తదితర విషయాల్లో తలెత్తే సమస్యలను వివరించారు. సీమాంధ్ర విద్యార్థులందరూ చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్ఐఓ పి.మాణిక్యం దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమైఖ్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది జిల్లా అధ్యక్షుడు యూ కోటేశ్వరరావు సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరించారు. జిల్లాలోని 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలల బోధనేతర సిబ్బంది ఉద్యమంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 5వ రోజు దీక్షలో దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జే సువర్ణబాబు, అధ్యాపకులు సీహెచ్ తారావాణి, వీ కోటయ్య, జీ మనోహర్‌రెడ్డి, రామాచారి, ఇతర కళాశాలలకు చెందిన బోధనేతర సిబ్బంది ఎం.మాల్యాద్రి, పీ వెంకటేశ్వర్లు, టీ ప్రవీణ్‌కుమార్, ఐవీ సుజాత, ఫాతిమా మేరి, అద్దంకి తెలుగు అధ్యాపకులు ఆనందబాబు కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని ప్రిన్సిపాళ్ల సంఘం నాయకులు డీఆర్ కే పరమహంస, ఎస్.సత్యనారాయణ, ఎయిడెడ్ కళాశాల సంఘ నాయకులు పోటు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరెడ్డి, జీజేఎల్ఏ నాయకులు నారాయణరావు, టీ వెంకటేశ్వరరెడ్డి, పీడీ సంఘ నాయకులు ఎం.హరనాథబాబు, రిటైర్డ్ డిగ్రీ అధ్యాపకులు కంచర్ల సుబ్బారావు, ఎండీ రహమాన్, పీ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాళ్ల సంఘ మాజీ అధ్యక్షుడు పీ నరసింహారెడ్డి, ఎన్జీఓ నాయకులు గోవిందరావు, తిరుమలయ్య, ఆర్ఐఓ కార్యాలయం ఏవో ఆంజనేయులు, సిబ్బంది సందర్శించి సంఘీభావం తెలిపారు.