హాకీ కెప్టెన్ ను మార్చేశారు..
న్యూఢిల్లీ: వచ్చే నెలలో బ్రెజిల్ లో జరుగనున్న రియో ఒలింపిక్స్ కు వెళ్లే భారత హాకీ జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ పురుషుల హాకీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న సర్దార్ సింగ్ ను ఆ పదవి నుంచి తప్పిస్తూ హాకీ ఇండియా(హెచ్ఐ) నిర్ణయం తీసుకుంది. వెటరన్ ఆటగాడైన సర్దార్ సింగ్ ను రియో స్క్వాడ్ లో ఎంపిక చేయగా, కెప్టెన్సీని నుంచి తొలగించారు. అతని స్థానంలో 28 ఏళ్ల శ్రీజేష్ రవీంద్రను కెప్టెన్ గా నియమించారు.
ఈ మేరకు మంగళవారం రియోకు వెళ్లే 16 మందితో కూడిన భారత పురుషుల, మహిళల హాకీ జట్లను హాకీ ఇండియా ప్రకటించింది. తాజా ఎంపికలో డిఫెండర్ బరిందర్ లక్రాకు చోటు దక్కలేదు. బరిందర్ గాయపడటంతో అతని స్థానంలో సురిందర్ కుమార్ కు అవకాశం కల్పించారు. మరోవైపు ఎస్ వి సునీల్ వైస్ కెప్టెన్ గా నియమించారు. ఇదిలా ఉండగా, మహిళల హాకీ జట్టు నుంచి రీతూ రాణిని తొలగించారు.చాలాకాలంగా భారత మహిళ హాకీ జట్టుకు కెప్టెన్ గా చేస్తున్న రీతూనూ రియోకు వెళ్లే జట్టులో స్థానం కల్పించలేదు. గత కొంతకాలంగా రీతూ ప్రదర్శనతో పాటు ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో ఆమెపై వేటు వేశారు. రీతూ స్థానంలో సుశీల్ చానుకు కెప్టెన్ గా నియమించారు.
భారత పురుషుల హాకీ స్క్వాడ్ ; శ్రీజేష్ రవీందర్(కెప్టెన్), ఎస్ వి సునీల్( వైస్ కెప్టెన్), హర్మన్ ప్రీత్ సింగ్, రూపేందర్ పాల్ సింగ్, కొతాజిత్ సింగ్, సురేందర్ కుమార్, మన్ ప్రీత్ కుమార్, సర్దార్ సింగ్, వీఆర్ రఘునాథ్, ఎస్ కే ఉతప్ప, దనిష్ ముజ్ తాబా, దేవేందర్ వాల్మికీ, అక్షదీప్ సింగ్, చింగ్లేన్ సానా సింగ్, రమణ్ దీప్ సింగ్, నిఖి తిమ్మయ్య
స్టాండ్ బై: ప్రదీప్ మోర్, వికాష్ దాహియా
భారత మహిళల హాకీ స్క్వాడ్: సుశీల్ చాను(కెప్టెన్), దీపికా(వైస్ కెప్టెన్), దీప్ గ్రీస్ ఎక్కా, నమితా తొప్పో, సునీతా లక్రా, నవజోత్ కౌర్, మోనికా, రేణుకా యాదవ్, లిలిమా మింజ్, అనురాధా దేవి, పూనమ్ రాణి, వందనా కటారియా, ప్రీతి దుబే, నిక్కీ ప్రధాన్
స్టాండ్ బై: రజని ఎతిమార్పు, లాల్ రౌత్ ఫెలీ