Ritu Rani
-
రీతూ..గుడ్ బై
న్యూఢిల్లీ: ఇటీవల రియోలో జరిగిన ఒలింపిక్స్ ముందు భారత మహిళ హాకీ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన మాజీ కెప్టెన్ రీతూ రాణి అంతర్జాతీయ హాకీకి గుడ్ బై చెప్పింది. ఈ విషయాన్ని రీతూ మెయిల్ ద్వారా వెల్లడించినట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు నరేందర్ బత్రా తెలిపారు. 'రెండు రోజుల క్రితం జాతీయ హాకీ శిబిరంలో పాల్గొనడం లేదని రీతూ పేర్కొంది. దాంతో పాటు అంతర్జాతీయ హాకీ నుంచి వీడ్కోలు చెబుతున్న విషయాన్ని కూడా ఆ మెయిల్ స్పష్టం చేసింది. అది ఆమె వ్యక్తిగత నిర్ణయం. భారత హాకీ జట్టుకు సేవలందించిన రీతూ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం' అని బత్రా పేర్కొన్నారు. గత రెండు నెలల క్రితం రీతూను అటు కెప్టెన్‌గా, ఇటు క్రీడాకారిణిగా జట్టు నుంచి తొలగిస్తూ హాకీ ఇండియా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లోనే రీతూ ఆవేదన వ్యక్తం చెందింది. తనపై వివక్ష చూపించి జట్టు నుంచి తొలగించారంటూ కన్నీటి పర్యంతమైంది. -
'ఆ వార్త విని షాక్ అయ్యాను'
న్యూఢిల్లీ: భారత మహిళ హాకీ జట్టు నుంచి తనను తప్పించడంపై రీతూ రాణి ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఎందుకు జట్టులోంచి తీసేసారో చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకుంది. చాలాకాలంగా భారత మహిళ హాకీ జట్టుకు కెప్టెన్ గా చేస్తున్న రీతూనూ రియో ఒలింపిక్స్ కు వెళ్లే జట్టులో స్థానం కల్పించలేదు. గత కొంతకాలంగా రీతూ ప్రదర్శనతో పాటు ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో ఆమెపై వేటు వేశారు. రీతూ స్థానంలో సుశీల్ చానుకు కెప్టెన్ గా నియమించారు. 'ఈ వార్త విని షాకయ్యాను. ఫిట్నెస్, ప్రవర్తన సమస్యలు లేవు. ట్రైనింగ్, క్యాంపులకు నేను గైర్హాజరు కాలేదు. క్యాంపుకు బ్రేక్ ఇచ్చినప్పుడు నాకు ఎంగేజ్మెంట్ అయింది. జట్టులోంచి తీసేయడంతో నన్ను పెళ్లిచేసుకోబోయే వ్యక్తి చాలా బాధ పడ్డాడు. వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్న పురుషుల హాకీ జట్టు ప్లేయర్ సర్దార్ సింగ్ ను కెప్టెన్ పదవి నుంచి తీసేసినా, టీమ్ లో ఉంచారు. నన్ను మాత్రం ఏకంగా జట్టులోంచి తొలగించారు. నాకు ఈవిధంగా ఎందుకు చేశార'ని రీతూ రాణి ప్రశ్నించింది. తనపై అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొంది. ఒలింపిక్స్ మ్యాచ్ లను టీవీలో చూడాల్సిన పరిస్థితి తనకు వస్తుందని ఊహించలేదని వాపోయింది. -
హాకీ కెప్టెన్ ను మార్చేశారు..
-
హాకీ కెప్టెన్ ను మార్చేశారు..
న్యూఢిల్లీ: వచ్చే నెలలో బ్రెజిల్ లో జరుగనున్న రియో ఒలింపిక్స్ కు వెళ్లే భారత హాకీ జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ పురుషుల హాకీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న సర్దార్ సింగ్ ను ఆ పదవి నుంచి తప్పిస్తూ హాకీ ఇండియా(హెచ్ఐ) నిర్ణయం తీసుకుంది. వెటరన్ ఆటగాడైన సర్దార్ సింగ్ ను రియో స్క్వాడ్ లో ఎంపిక చేయగా, కెప్టెన్సీని నుంచి తొలగించారు. అతని స్థానంలో 28 ఏళ్ల శ్రీజేష్ రవీంద్రను కెప్టెన్ గా నియమించారు. ఈ మేరకు మంగళవారం రియోకు వెళ్లే 16 మందితో కూడిన భారత పురుషుల, మహిళల హాకీ జట్లను హాకీ ఇండియా ప్రకటించింది. తాజా ఎంపికలో డిఫెండర్ బరిందర్ లక్రాకు చోటు దక్కలేదు. బరిందర్ గాయపడటంతో అతని స్థానంలో సురిందర్ కుమార్ కు అవకాశం కల్పించారు. మరోవైపు ఎస్ వి సునీల్ వైస్ కెప్టెన్ గా నియమించారు. ఇదిలా ఉండగా, మహిళల హాకీ జట్టు నుంచి రీతూ రాణిని తొలగించారు.చాలాకాలంగా భారత మహిళ హాకీ జట్టుకు కెప్టెన్ గా చేస్తున్న రీతూనూ రియోకు వెళ్లే జట్టులో స్థానం కల్పించలేదు. గత కొంతకాలంగా రీతూ ప్రదర్శనతో పాటు ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో ఆమెపై వేటు వేశారు. రీతూ స్థానంలో సుశీల్ చానుకు కెప్టెన్ గా నియమించారు. భారత పురుషుల హాకీ స్క్వాడ్ ; శ్రీజేష్ రవీందర్(కెప్టెన్), ఎస్ వి సునీల్( వైస్ కెప్టెన్), హర్మన్ ప్రీత్ సింగ్, రూపేందర్ పాల్ సింగ్, కొతాజిత్ సింగ్, సురేందర్ కుమార్, మన్ ప్రీత్ కుమార్, సర్దార్ సింగ్, వీఆర్ రఘునాథ్, ఎస్ కే ఉతప్ప, దనిష్ ముజ్ తాబా, దేవేందర్ వాల్మికీ, అక్షదీప్ సింగ్, చింగ్లేన్ సానా సింగ్, రమణ్ దీప్ సింగ్, నిఖి తిమ్మయ్య స్టాండ్ బై: ప్రదీప్ మోర్, వికాష్ దాహియా భారత మహిళల హాకీ స్క్వాడ్: సుశీల్ చాను(కెప్టెన్), దీపికా(వైస్ కెప్టెన్), దీప్ గ్రీస్ ఎక్కా, నమితా తొప్పో, సునీతా లక్రా, నవజోత్ కౌర్, మోనికా, రేణుకా యాదవ్, లిలిమా మింజ్, అనురాధా దేవి, పూనమ్ రాణి, వందనా కటారియా, ప్రీతి దుబే, నిక్కీ ప్రధాన్ స్టాండ్ బై: రజని ఎతిమార్పు, లాల్ రౌత్ ఫెలీ -
భారత మహిళా హాకీ కెప్టెన్‌పై వేటు?
న్యూఢిల్లీ:త్వరలో రియో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత మహిళా హాకీ జట్టు నుంచి కెప్టెన్ రీతూ రాణిని తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల కాలంలో రీతూ రాణి ప్రదర్శన, తీరు కూడా హాకీ ఇండియాకు నచ్చకపోవడంతో రియోకు వెళ్లే భారత జట్టు నుంచి తప్పించడానికి నిర్ణయించారు. మరో మూడు రోజుల్లో 16 మంది క్రీడాకారిణులతో కూడిన మహిళా హాకీ జట్టును ప్రకటించే నేపథ్యంలో రీతూ రాణి తొలగింపు దాదాపు ఖాయంగానే కనబడుతోంది. ఈ మేరకు జట్టు మేనేజ్మెంట్లోని సీనియర్ సభ్యుడు ఒకరు ఒలింపిక్స్‌కు రీతూరాణిని ఎంపిక చేయడం లేదని ముందుగానే సంకేతాలిచ్చారు. 'అవును మీరు విన్నది నిజమే. రియోకు వెళ్లే భారత మహిళా హాకీ జట్టులో రీతూకు స్థానం కల్పించడం లేదు. ఇందుకు రీతూ ప్రదర్శనతో పాటు, ఆమె ప్రవర్తన కూడా బాలేదు. ఈ విషయాన్ని ఆమెకు చాలా సార్లు చెప్పాం. అయినప్పటికీ ఆమె ఆటలో, తీరులో ఏమాత్రం మార్పులేదు. ప్రస్తుతం మహిళా హాకీ క్యాంప్ బెంగళూరులో నిర్వహిస్తున్నాం. మరో రెండు రోజుల్లో ఢిల్లీలో క్యాంప్ ఉంటుంది. అందులో రీతూ ఉండకపోవచ్చు'అని తెలిపారు. భారత మహిళా హకీ జట్టు 36 సంవత్సరాల తరువాత ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. చివరిసారి 1980లో ఒలింపిక్స్‌కు వెళ్లిన మహిళా జట్టు దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఒలింపిక్స్‌కు పాల్గొనబోతుంది. రియోకు అర్హత సాధించిన భారత మహిళా జట్టుకు రీతూ రాణినే కెప్టెన్ గా సారథ్యం వహించింది. -
సుశీలా చానుకు సారథ్యం
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో ఈనెల 30 నుంచి జరిగే నాలుగు దేశాల మహిళల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ రీతూ రాణికి విశ్రాంతి ఇచ్చి... ఆమె స్థానంలో సుశీలా చానుకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రజని ఎతిమరపు గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. భారత మహిళల హాకీ జట్టు: సుశీలా చాను (కెప్టెన్), దీపిక (వైస్ కెప్టెన్), సవిత, రజని, సునీతా లాక్రా, నిక్కి, దీప్ గ్రేస్, హినియాలుమ్ లాల్, రాణి, నమిత, నవ్‌జ్యోత్, మోనికా, రేణుక, పూనమ్, వందన, అనురాధ, లిలిమా మింజ్. -
వరల్డ్ లీగ్‌కు బయల్దేరిన మహిళల హాకీ జట్టు
న్యూఢిల్లీ : హాకీ ప్రపంచకప్ లీగ్ సెమీ ఫైనల్స్ కోసం రీతూ రాణి నేతృత్వంలోని 18 మంది సభ్యుల భారత మహిళల జట్టు బెల్జియంకు పయనమైంది. ఈనెల 20 నుంచి జూలై 5 వరకు లీగ్ జరుగనుంది. పూల్ ‘బి’లో ఉన్న భారత్.. ఆసీస్, కివీస్, బెల్జియం, పోలండ్‌లను ఎదుర్కోవాల్సి ఉంది. 20న తొలి మ్యాచ్‌ను బెల్జియంతో ఆడుతుంది. హాకీ వరల్డ్ లీగ్ రౌండ్2 టైటిల్‌ను గెలుచుకున్న జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉందని, ఈ టోర్నీ తమకు చాలా ముఖ్యమైందని కెప్టెన్ రీతూ తెలిపింది. ఈ టోర్నీలో మొత్తం పది జట్లు పోటీ పడుతుండగా టాప్-3లో నిలిచిన జట్లు హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. -
రీతూ రాణికే పగ్గాలు
ఆసియా క్రీడలకు భారత మహిళల హాకీ జట్టు న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ లో కెప్టెన్‌గా వ్యవహరించిన రీతూ రాణి సారథ్యంలోనే భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల్లోనూ బరిలోకి దిగనుంది. బీపీ గోవిందా, హర్బీందర్ సింగ్, సురీందర్ కౌర్, హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలెంట్ ఓల్ట్‌మన్స్, చీఫ్ కోచ్ నీల్ హవ్గుడ్లతో కూడిన సెలక్షన్ ప్యానెల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఈనెల 13న ఇంచియోన్కు బయలుదేరుతుంది. ఆసియా క్రీడలు ఈనెల 19 నుంచి అక్టోబరు 4 వరకు జరుగుతాయి. కామన్వెల్త్ గేమ్స్ కంటే మరింత మెరుగైన స్థానం సాధించాలన్న లక్ష్యంతో ఆమెను ఎంపిక చేశామని ప్యానెల్ తెలిపింది. జట్టు: రీతూ రాణి (కెప్టెన్, మిడ్ ఫీల్డర్), సవిత (గోల్‌కీపర్), దీప్ గ్రేస్ ఎక్కా, దీపిక, సునీతా లక్రా, నమితా టోపో, జస్ప్రీత్ కౌర్, సుశీలా చాను, మోనిక (డిఫెండర్లు), లిలిమా మిన్జ్, అమన్‌దీప్ కౌర్, చంచన్ దేవి (మిడ్ ఫీల్డర్లు), రాణి రాంపాల్, పూనమ్ రాణి, వందన కటారియా, నవజ్యోత్ కౌర్ (ఫార్వర్డులు).