వచ్చే నెలలో బ్రెజిల్ లో జరుగనున్న రియో ఒలింపిక్స్ కు వెళ్లే భారత హాకీ జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ పురుషుల హాకీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న సర్దార్ సింగ్ ను ఆ పదవి నుంచి తప్పిస్తూ హాకీ ఇండియా(హెచ్ఐ) నిర్ణయం తీసుకుంది. వెటరన్ ఆటగాడైన సర్దార్ సింగ్ ను రియో స్క్వాడ్ లో ఎంపిక చేయగా, కెప్టెన్సీని నుంచి తొలగించారు. అతని స్థానంలో 28 ఏళ్ల శ్రీజేష్ రవీంద్రను కెప్టెన్ గా నియమించారు.