వరల్డ్ లీగ్‌కు బయల్దేరిన మహిళల హాకీ జట్టు | World League women's hockey team | Sakshi
Sakshi News home page

వరల్డ్ లీగ్‌కు బయల్దేరిన మహిళల హాకీ జట్టు

Published Fri, Jun 12 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

World League women's hockey team

న్యూఢిల్లీ : హాకీ ప్రపంచకప్ లీగ్ సెమీ ఫైనల్స్ కోసం రీతూ రాణి నేతృత్వంలోని 18 మంది సభ్యుల భారత మహిళల జట్టు బెల్జియంకు పయనమైంది. ఈనెల 20 నుంచి జూలై 5 వరకు లీగ్ జరుగనుంది. పూల్ ‘బి’లో ఉన్న భారత్.. ఆసీస్, కివీస్, బెల్జియం, పోలండ్‌లను ఎదుర్కోవాల్సి ఉంది. 20న తొలి మ్యాచ్‌ను బెల్జియంతో ఆడుతుంది. హాకీ వరల్డ్ లీగ్ రౌండ్2 టైటిల్‌ను గెలుచుకున్న జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉందని, ఈ టోర్నీ తమకు చాలా ముఖ్యమైందని కెప్టెన్ రీతూ తెలిపింది. ఈ టోర్నీలో మొత్తం పది జట్లు పోటీ పడుతుండగా టాప్-3లో నిలిచిన జట్లు హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement