రెండో వన్డే బరిలో భారత మహిళలు
ఆ్రస్టేలియాతో నేడు పోరు
బ్రిస్బేన్: ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిన భారత మహిళల జట్టు సిరీస్‌ను కాపాడుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. నేడు జరిగే రెండో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్ లోపాలను అధిగమించి పటిష్టమైన ఆసీస్‌తో ఢీకొనేందుకు భారత్ సిద్ధమైంది. ఇదే వేదికపై జరిగిన తొలి మ్యాచ్‌లో అమ్మాయిల జట్టు కనీసం 35 ఓవర్లయినా ఆడలేక 100 పరుగులకే కుప్పకూలింది.
టాపార్డర్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన (8), ప్రియా పూనియా (3) ఇద్దరు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరడం, వన్‌డౌన్‌లో హర్లీన్ డియోల్ (19) వైఫల్యం బ్యాటింగ్ ఆర్డర్‌పై పెను ప్రభావమే చూపింది. ఓవరాల్‌గా 11 మంది బ్యాటింగ్‌కు దిగితే ఒక్క జెమీమా రోడ్రిగ్స్ (23) మాత్రమే ఇరవై పైచిలుకు స్కోరు చేయగలిగింది. అనుభవజు్ఞరాలైన కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఆసీస్ బౌలింగ్‌కు చేతులెత్తేసింది.
ఇప్పుడు రెండో వన్డేలో ఈ పేలవ ఆటతీరు కొనసాగిస్తే మాత్రం పెర్త్‌కు ముందే ఇక్కడే సిరీస్‌ను ప్రత్యర్థి జట్టుకి సమరి్పంచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ విభాగంలో అందరు సమష్టి బాధ్యత తీసుకోవాలి. క్రీజులో నిలబడి పరుగులు రాబడితే బౌలర్లకు మ్యాచ్ గెలిపించేందుకు ఆస్కారం ఉంటుంది. అంతే కానీ వారి సొంతగడ్డపై వందకో... 150 పరుగులకో కుప్పకూలితే ఆసీస్ చకచకా ఛేదించడం ఖాయం.
ఆసీస్ స్పీడ్‌స్టర్ మేగన్ షట్ (5/19)ను ఎదుర్కోవడంపై భారత బ్యాటర్లు కసరత్తు చేయాలి. బౌలర్లలో రేణుక, ప్రియా మిశ్రా ఆకట్టుకున్నారు. బౌలింగ్ దళంతో ఏ ఇబ్బంది లేకపోయినా కీలకమైన రెండో వన్డేలో అన్ని విభాగాలు సత్తా చాటాల్సిన అవసరముంది. బ్యాటింగ్‌లోనూ ఆసీస్ బలంగా కనిపిస్తోంది. ఎలైస్ పెరీ, లిచ్‌ఫీల్డ్, బెత్‌మూనీ, సదర్లాండ్, గార్డ్‌నర్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థులు.
Comments
Please login to add a commentAdd a comment