రియో ఒలింపిక్స్కు మరో తలనొప్పి
బ్రెజిల్ రియో ఒలంపిక్స్ క్రీడల్ని మొన్నటి వరకు జికా వైరస్ భయపెడితే.. తాజాగా మరో కీలక పరిణామం వేధిస్తోంది. బ్రెజిల్ లో నెలకొన్న సంక్షోభం రియో ఒలింపిక్స్ పై ప్రభావాన్ని పడేయనుందా... అంటే అవునే అనిపిస్తోంది. బ్రెజిల్ రాజధాని నగరం రియో డి జనీరో లో తీవ్ర ఆర్థిక మాంద్య పరిస్థితులతో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో 2016 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ వ్యవహారంలో కొత్త తలనొప్పి మొదలైంది. నగరంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మధ్యంతర గవర్నర్ ఫ్రాన్సిస్కో డోర్నెల్లస్ శుక్రవారం ప్రకటిచారు. బ్రెజిల్లో రెండవ అత్యధిక జనాభా కలిగిన పెద్ద నగరం, రాజధాని రియో లో ప్రతిష్టాత్మక ఒలంపిక్స్కు ఈ ఏడాది అతిధ్యమిస్తున్న నగరంలో...ఒలింపిక్స్ కు సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ఆందోళన రేపింది.
ప్రజా విపత్తుమూలంగా ప్రజల భద్రత, ఆరోగ్యం, విద్య ప్రజా, రవాణా, పర్యావరణ మేనేజ్మెంట్ తదితర సేవల్లో మొత్తం పతనానికి దారి తీయవచ్చనే ఆందోళనతో ఈ అత్యవసర చర్య అవసరమైందని రాష్ట్ర అధికారిక గెజిట్ స్పష్టం చేసింది. గేమ్స్ నిర్వహణలో సహాయం చేయాల్సిందిగా బ్రెజిల్ మధ్యంతర అధ్యక్షుడు మైకేల్ టెమర్ ఫెడరల్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రపంచ చమురు ధరలు పడిపోవడంతో ముఖ్యంగా పెట్రోలియం రంగంతోముడిపడివున్నరాష్ట్ర రెవెన్యూ క్షీణించింది. గత రెండేళ్లుగా నెలకొన్న సంక్షోభం రియో ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీసింది.
అయితే రాష్ట్ర ఆర్థిక అత్యవసర పరిస్థితి ఒలింపిక్స్ నిర్వహణ పై ప్రభావం చూపదని, అనుకున్నట్టుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని రియో మేయర్ ఎడ్యరాడో పేస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే నగరంలోని మెట్రో విస్తరణ పనులు కూడా ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే పూర్తి అవుతాయని చెప్పారు. ఒలింపిక్స్ కు సంబంధించి అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు గేమ్స్ స్థానిక నిర్వాహక కమిటీ దీనిపై స్పందించ లేదు .
కాగా సుమారు 5లక్షలమంది మందివిదేశీ సందర్శకులు ఒలింపిక్స్ క హాజరయ్యే అవకాశం ఉందని అంచాన. ఒలింపిక్ మౌలిక వ్యయాల్లో ఎక్కువభాగం ప్రైవేట్ కంపెనీల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. దీంతోపాటు నగరం , రాష్ట్ర , సమాఖ్య బడ్జెట్లు కేటాయించాల్సి ఉండగా...భద్రత , ఆరోగ్య సేవలు లాంటివాటి ప్రధాన బాధ్యత మాత్రం రియోదే.