financial emergency
-
ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి ఆయన వాకౌట్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అరెస్ట్‌కు నిరసనగా బుధవారం నిర్వహించిన ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిత్రా వాకౌట్ అయ్యారు. దేశంలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ ఉందని, భయానక పరిస్థితుల్లో రాజకీయ వాతావరణమున్నట్టు అమిత్ మిత్రా ఆరోపించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరుగుతున్న రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్ భేటీకి హాజరైన ఆయన, ఆశ్చర్యకరంగా ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి వైదొలిగారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై రాష్ట్రాల అభిప్రాయాలు స్వీకరిస్తానని తాను భావించానని, పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన ఫైనాన్సియల్ ఎమర్జెన్సీపై ఆర్థికమంత్రికి అవగాహన ఉందని అనుకున్నట్టు ఆయన చెప్పారు. కానీ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. తాజా పరిస్థితులపై సమస్యలను ఆర్థికమంత్రి పట్టించుకోవాలని మిత్రా కోరారు. దేశంలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ నెలకొని ఉందని, ఆందోళనకరమైన రాజకీయ వాతావరణం ప్రతి సందర్భంలోనూ మూలమూలన దాగి ఉందని విమర్శించారు. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కాంలో బందోపాధ్యాయను సీబీఐ కోల్‌కత్తాలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తాము చేపడుతున్న నిరసన వల్లే కేంద్రం ఈ మాదిరి వ్యవహరిస్తుందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్లమెంట్లను వాడుకుని మోదీ రాజకీయ ప్రత్యర్థులను అణచి వేస్తున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుతో చిన్న పరిశ్రమల్లో వందల కొలది ఉద్యోగులు రోడ్డున పడ్డారని చెప్పారు. పశ్చిమబెంగాల్లో లెదర్ పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో పడిందని, మహారాష్ట్రలోనూ మిర్చి పరిశ్రమకు కోలుకోలేని దెబ్బతగిలిందన్నారు. కనీసం ఈ ఫైనాన్సియల్ ఎమర్జెన్సీపై ఆర్థికమంత్రి ఊసైనా ఎత్తడం లేదన్నారు. నిజనిజాలను ఆయన వినాలని కోరారు. తన ప్రజంటేషన్ అనంతరం బరువెక్కిన గుండెతో మీటింగ్ నుంచి బయటికి వచ్చేసినట్టు ఆవేదన వ్యక్తంచేశారు. చరిత్రలోనే ఇది మొదటిసారి అర్థరహితమైన బడ్జెట్‌గా నిలవబోతుందని మిత్రా పేర్కొన్నారు. -
దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ: మమతా బెనర్జీ
దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. శివసేన, అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెద్దనోట్ల రద్దుపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సామాన్య ప్రజలను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాలని.. పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరామన్నారు. రాష్ట్రపతి కూడా ఆర్థికమంత్రిగా పనిచేసినవారేనని, అందువల్ల ఆయనకు దేశ పరిస్థితి మిగిలిన అందరికంటే బాగా తెలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి.. దేశంలో సాధారణ పరిస్థితి తిరిగి వచ్చేలా చూడాల్సిందిగా చెప్పాలని కోరామని ఆమె తెలిపారు. ఇంతకుముందు ఏటీఎం అంటే ఎనీటైమ్ మనీ అని చెప్పేవారని, కానీ ఇప్పుడు మాత్రం అది 'ఆయేగా తబ్ మిలేగా (వస్తే అప్పుడు కలుద్దాం)' అన్నట్లు అయిపోయిందని ఎద్దేవా చేశారు. మార్కెట్లలోకి డబ్బులు తేవాలని, ప్రజలకు సాయం చేయాలని అన్నారు. స్వచ్ఛంద ఆస్తుల వలెల్డి పథకంలో రూ. 65 వేల కోట్లు జమ అయినట్లు చెప్పారని, అందులోంచి ఒక్క పైసా కూడా ప్రజలకు ఇవ్వలేదని ఆమె విమర్శించారు. మార్కెట్లో కూరగాయలు దొరకడం లేదని, పిల్లలకు పాలు లేవని, దుకాణాల్లో మందులు కూడా లేవని అన్నారు. ఇప్పటికి క్యూలలో నిలబడి ఎంతమంది చనిపోయారో తెలుసా అని ప్రశ్నించారు. గుండెపోటు వల్ల చనిపోయారని చెబుతున్నారని.. అది ఎందుకు వస్తుందని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షం మొత్తం పోరాటం సాగిస్తోంది. దీనివల్ల పేదలపైనే ప్రభావం పడుతోంది తప్ప ధనవంతులైన పన్ను ఎగవేతదారులపై కాదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ: మమతా బెనర్జీ
-
రియో ఒలింపిక్స్‌కు మరో తలనొప్పి
బ్రెజిల్ రియో ఒలంపిక్స్ క్రీడల్ని మొన్నటి వరకు జికా వైరస్ భయపెడితే.. తాజాగా మరో కీలక పరిణామం వేధిస్తోంది. బ్రెజిల్ లో నెలకొన్న సంక్షోభం రియో ఒలింపిక్స్ పై ప్రభావాన్ని పడేయనుందా... అంటే అవునే అనిపిస్తోంది. బ్రెజిల్ రాజధాని నగరం రియో డి జనీరో లో తీవ్ర ఆర్థిక మాంద్య పరిస్థితులతో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో 2016 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ వ్యవహారంలో కొత్త తలనొప్పి మొదలైంది. నగరంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మధ్యంతర గవర్నర్ ఫ్రాన్సిస్కో డోర్నెల్లస్ శుక్రవారం ప్రకటిచారు. బ్రెజిల్లో రెండవ అత్యధిక జనాభా కలిగిన పెద్ద నగరం, రాజధాని రియో లో ప్రతిష్టాత్మక ఒలంపిక్స్‌కు ఈ ఏడాది అతిధ్యమిస్తున్న నగరంలో...ఒలింపిక్స్ కు సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ఆందోళన రేపింది. ప్రజా విపత్తుమూలంగా ప్రజల భద్రత, ఆరోగ్యం, విద్య ప్రజా, రవాణా, పర్యావరణ మేనేజ్మెంట్ తదితర సేవల్లో మొత్తం పతనానికి దారి తీయవచ్చనే ఆందోళనతో ఈ అత్యవసర చర్య అవసరమైందని రాష్ట్ర అధికారిక గెజిట్ స్పష్టం చేసింది. గేమ్స్ నిర్వహణలో సహాయం చేయాల్సిందిగా బ్రెజిల్ మధ్యంతర అధ్యక్షుడు మైకేల్ టెమర్ ఫెడరల్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రపంచ చమురు ధరలు పడిపోవడంతో ముఖ్యంగా పెట్రోలియం రంగంతోముడిపడివున్నరాష్ట్ర రెవెన్యూ క్షీణించింది. గత రెండేళ్లుగా నెలకొన్న సంక్షోభం రియో ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీసింది. అయితే రాష్ట్ర ఆర్థిక అత్యవసర పరిస్థితి ఒలింపిక్స్ నిర్వహణ పై ప్రభావం చూపదని, అనుకున్నట్టుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని రియో మేయర్ ఎడ్యరాడో పేస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే నగరంలోని మెట్రో విస్తరణ పనులు కూడా ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే పూర్తి అవుతాయని చెప్పారు. ఒలింపిక్స్ కు సంబంధించి అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు గేమ్స్ స్థానిక నిర్వాహక కమిటీ దీనిపై స్పందించ లేదు . కాగా సుమారు 5లక్షలమంది మందివిదేశీ సందర్శకులు ఒలింపిక్స్ క హాజరయ్యే అవకాశం ఉందని అంచాన. ఒలింపిక్ మౌలిక వ్యయాల్లో ఎక్కువభాగం ప్రైవేట్ కంపెనీల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. దీంతోపాటు నగరం , రాష్ట్ర , సమాఖ్య బడ్జెట్లు కేటాయించాల్సి ఉండగా...భద్రత , ఆరోగ్య సేవలు లాంటివాటి ప్రధాన బాధ్యత మాత్రం రియోదే.