ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి ఆయన వాకౌట్ | WB Finance Minister Amit Mitra walks out of pre-Budget meet, cites financial emergency’ | Sakshi
Sakshi News home page

ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి ఆయన వాకౌట్

Published Thu, Jan 5 2017 3:45 PM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM

ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి ఆయన వాకౌట్

ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి ఆయన వాకౌట్

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అరెస్ట్కు నిరసనగా బుధవారం నిర్వహించిన ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిత్రా వాకౌట్ అయ్యారు. దేశంలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ ఉందని, భయానక పరిస్థితుల్లో రాజకీయ వాతావరణమున్నట్టు అమిత్ మిత్రా ఆరోపించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరుగుతున్న రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్ భేటీకి హాజరైన ఆయన, ఆశ్చర్యకరంగా ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి వైదొలిగారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్న బడ్జెట్పై రాష్ట్రాల అభిప్రాయాలు స్వీకరిస్తానని తాను భావించానని, పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన ఫైనాన్సియల్ ఎమర్జెన్సీపై ఆర్థికమంత్రికి అవగాహన ఉందని అనుకున్నట్టు ఆయన చెప్పారు. కానీ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. తాజా పరిస్థితులపై సమస్యలను ఆర్థికమంత్రి పట్టించుకోవాలని మిత్రా కోరారు. దేశంలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ నెలకొని ఉందని, ఆందోళనకరమైన రాజకీయ వాతావరణం ప్రతి సందర్భంలోనూ మూలమూలన దాగి ఉందని విమర్శించారు.
 
రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కాంలో బందోపాధ్యాయను సీబీఐ కోల్కత్తాలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తాము చేపడుతున్న నిరసన వల్లే కేంద్రం ఈ మాదిరి వ్యవహరిస్తుందని పశ్చిమబెంగాల్  సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్లమెంట్లను వాడుకుని మోదీ రాజకీయ ప్రత్యర్థులను అణచి వేస్తున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుతో చిన్న పరిశ్రమల్లో వందల కొలది ఉద్యోగులు రోడ్డున పడ్డారని చెప్పారు. పశ్చిమబెంగాల్లో లెదర్ పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో పడిందని, మహారాష్ట్రలోనూ మిర్చి పరిశ్రమకు కోలుకోలేని దెబ్బతగిలిందన్నారు. కనీసం ఈ ఫైనాన్సియల్ ఎమర్జెన్సీపై ఆర్థికమంత్రి ఊసైనా ఎత్తడం లేదన్నారు. నిజనిజాలను ఆయన వినాలని కోరారు.  తన ప్రజంటేషన్ అనంతరం బరువెక్కిన గుండెతో మీటింగ్ నుంచి బయటికి వచ్చేసినట్టు ఆవేదన వ్యక్తంచేశారు. చరిత్రలోనే ఇది మొదటిసారి అర్థరహితమైన బడ్జెట్గా నిలవబోతుందని మిత్రా పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement