Amit Mitra
-
జీఎస్టీ.. చప్పట్లు తప్ప చేసేదేముంది?
న్యూఢిల్లీ: ఒకవైపు దేశమంతా ఒకే పన్ను విధానమంటూ చారిత్రాత్మక పన్ను విధానం జీఎస్టీ నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రాబోతుంది. మరోవైపు ఈ విధానాన్ని ప్రతిపక్షాలే కాదు దేశ ప్రజలు స్వాగతించడం లేదని నేతల నుంచి నూతన పన్ను విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీఎస్టీ విధానం అనేది ఎవరికీ ఆమోదయోగ్యం కాని నల్ల చట్టమని రాజ్యసభ సభ్యుడు, సమాజ్ వాదీ పార్టీ నేత నరేశ్ అగ్రవాల్ అభిప్రాయపడ్డారు. ఈ వివాదంతో సంబంధం లేకుండా మీడియా అయితే కచ్చితంగా ఈ సమావేశానికి హాజరవుతుందన్నారు. కేవలం జీఎస్టీ వ్యతిరేఖ వైఖరిని మాత్రమే తాము అవలంభిస్తున్నామని, అయితే కొత్త వివాదాలను తెరపైకి తేవడం తమ ఉద్దేశం కాదని ఎస్పీ ఎంపీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ఆర్థికశాఖ మంత్రి అమిత్ మిత్రా నూతనంగా అమల్లోకి రానున్న ఏకపన్ను విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడికి వచ్చి కూర్చుని చప్పట్లు కొట్టడం తప్ప.. చేయాల్సిందేమీ లేదన్నారు. జీఎస్టీ విధానంపై దేశంలో మెజార్టీ ప్రజలు మొగ్గుచూపడం లేదని తెలిపారు. కేవలం కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు మాత్రమే ఏక పన్ను విధానాన్ని స్వాగతించారని, అయితే దీన్ని మొత్తం దేశంపై రుద్దుతున్నారని విమర్శించారు. కాగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా లాంచ్ కాబోతున్న జీఎస్టీ వేడుకకు, ప్రతిపక్షాలన్నీ దాదాపు బాయ్ కాట్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే జీఎస్టీ వేడుకకు కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు హాజరుకావాలని సమాచార, ప్రసారాల శాఖా మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ వేడుకను బాయ్ కాట్ చేయడం సరియైనది కాదని నాయుడు పేర్కొన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షాలు మాత్రం ఈవెంట్‌కు హాజరయ్యేలా కనిపించడం లేదని తెలుస్తోంది. -
ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి ఆయన వాకౌట్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అరెస్ట్‌కు నిరసనగా బుధవారం నిర్వహించిన ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిత్రా వాకౌట్ అయ్యారు. దేశంలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ ఉందని, భయానక పరిస్థితుల్లో రాజకీయ వాతావరణమున్నట్టు అమిత్ మిత్రా ఆరోపించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరుగుతున్న రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్ భేటీకి హాజరైన ఆయన, ఆశ్చర్యకరంగా ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి వైదొలిగారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై రాష్ట్రాల అభిప్రాయాలు స్వీకరిస్తానని తాను భావించానని, పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన ఫైనాన్సియల్ ఎమర్జెన్సీపై ఆర్థికమంత్రికి అవగాహన ఉందని అనుకున్నట్టు ఆయన చెప్పారు. కానీ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. తాజా పరిస్థితులపై సమస్యలను ఆర్థికమంత్రి పట్టించుకోవాలని మిత్రా కోరారు. దేశంలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ నెలకొని ఉందని, ఆందోళనకరమైన రాజకీయ వాతావరణం ప్రతి సందర్భంలోనూ మూలమూలన దాగి ఉందని విమర్శించారు. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కాంలో బందోపాధ్యాయను సీబీఐ కోల్‌కత్తాలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తాము చేపడుతున్న నిరసన వల్లే కేంద్రం ఈ మాదిరి వ్యవహరిస్తుందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్లమెంట్లను వాడుకుని మోదీ రాజకీయ ప్రత్యర్థులను అణచి వేస్తున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుతో చిన్న పరిశ్రమల్లో వందల కొలది ఉద్యోగులు రోడ్డున పడ్డారని చెప్పారు. పశ్చిమబెంగాల్లో లెదర్ పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో పడిందని, మహారాష్ట్రలోనూ మిర్చి పరిశ్రమకు కోలుకోలేని దెబ్బతగిలిందన్నారు. కనీసం ఈ ఫైనాన్సియల్ ఎమర్జెన్సీపై ఆర్థికమంత్రి ఊసైనా ఎత్తడం లేదన్నారు. నిజనిజాలను ఆయన వినాలని కోరారు. తన ప్రజంటేషన్ అనంతరం బరువెక్కిన గుండెతో మీటింగ్ నుంచి బయటికి వచ్చేసినట్టు ఆవేదన వ్యక్తంచేశారు. చరిత్రలోనే ఇది మొదటిసారి అర్థరహితమైన బడ్జెట్‌గా నిలవబోతుందని మిత్రా పేర్కొన్నారు. -
రతన్ టాటాకు మతి తప్పిందా?
విరుచుకుపడిన బెంగాల్ సర్కారు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి లేదన్న వ్యాఖ్యలపై ఎద్దేవా కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు చెప్పుకోదగినట్టుగా లేవని టాటా గ్రూప్ మాజీ చీఫ్ రతన్ టాటా చేసిన వ్యాఖ్యలపట్ల పశ్చిమబెంగాల్ పాలకపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ గురువారం తీవ్రంగా ప్రతిస్పందించింది. రతన్ టాటాకు మతిభ్రమించిట్టు కనిపిస్తోందంటూ తృణమూల్ పార్టీనేత, పశ్చిమబెంగాల్ ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రి అమిత్ మిత్రా మీడియా ముందు వ్యాఖ్యానించారు. రత న్ టాటా మతితప్పి మాట్లాడుతున్నారని, ఆయన ఇక, విమానాల్లో ప్రయాణించే తన హాబీని కొనసాగిస్తే బాగుంటుందని సూచించారు. పశ్చిమ బెంగాల్ పట్టణాభివృద్ది మంత్రి ఫర్హాద్,. హకీమ్ మరింతగా విరుచుకుపడ్డారు. టాటా సంస్థల చైర్మన్‌గా బాధ్యతలనుంచి తప్పుకున్న తర్వాత రతన్ టాటాకు కచ్చితంగా మతితప్పి ఉంటుందన్నారు. పశ్చిమబెంగాల్లో తన గ్రూపు కంపెనీ విస్తరణ గురించే తనకు తెలియదని, బహుశా,.. తాజా పరిస్థితిని కంపెనీ అధికారులు ఆయనకు వివరించలేదోమోనని మిత్రా వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు క్యూక డుతున్నాయని, అలాంటి కంపెనీల జాబితా చదవడానికే రోజంతా సరిపోతుందని అన్నారు.