declares
-
గెలుపు తర్వాత ట్రంప్ సంతోష క్షణాలు.. ప్రసంగం (ఫొటోలు)
-
ఏడుపు కూడా మంచిదే, లేదంటే గుండెపోటు వస్తుంది
మనుషులు ఏడవ లేక పోవటం వల్ల నవ్వుతారు అంటాడు జార్జ్ బెర్నార్డ్ షా. నిజమే కదా! పిల్లలు కింద పడి దెబ్బతగిలితే ఏడుస్తారు. పెద్దవాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. పైకి ఏడవరు. ఎవరు ఏమనుకుంటారో అని సంకోచం. ఇతరుల అభిప్రాయాల కోసం బతకటం అలవాటు అవుతుంది ఎదుగుతున్న కొద్దీ. చిన్న పిల్లలకి ఆ బాధ లేదు. తమ నొప్పి మాత్రమే వాళ్ళకి ప్రధానం. భావాలని దాచుకోవటం తెలియదు. అవసరం లేదు. బాల్యావస్థ దాటి ఎదుగుతున్న కొద్దీ ఇతరులు తనని గురించి ఏమనుకుంటున్నారో అన్న దానికి ప్రాధాన్యం ఇవ్వటం ఎక్కువ అవుతూ ఉంటుంది. తన ప్రవర్తన మార్చుకునే ఉద్దేశం ఉండదు గాని, అందరు తనని గొప్పవాడుగా భావించాలనే తపన ఉంటుంది. దాని కోసమే నటించటం. ఏడుపు వచ్చినా దాన్ని అదుపులో పెట్టి, బాధాప్రకటనకి ఒక మాధ్యమం కావాలి కనుక ఏడుపునే నవ్వుగా మార్చటం జరుగుతుంది. తెలివితేటలు పెరుగుతున్న కొద్దీ ఆ సంఘటనకి రకరకాల చిలవలు పలవలు చేర్చటం కూడా చూస్తాం. తాను కావాలనే పడినట్టు చెప్పటమో, అదే బండి అయితే అది బాగుండ లేదనో, బాగు చేయటానికి ఇస్తే సరిగ్గా చేశారో లేదోనని పరీక్ష చేయబోయాననో చెపుతూ ఉంటారు. ‘‘అసలు దెబ్బ తగలనే లేదు’’, ‘‘ఇట్లాంటివి ఎన్ని చూశాం? ఇదొక లెక్కా?’’ వంటి వ్యాఖ్యానాలు విషయాన్ని తేలిక చేయటానికి చెప్పినా చెప్పకపోతేనే మర్యాదగా ఉండేది అనిపిస్తుంది. ఇది నేలమీద పడటం అన్నదానికి సంబంధించింది మాత్రమే కాదు. అన్ని విషయాలకి వర్తిస్తుంది. ఆర్థికంగా కాని, వ్యాపారపరంగా కాని, ఉద్యోగపరంగా కాని, కుటుంబపరంగా కాని, మరేదైనా కాని, దెబ్బ తగిలినప్పుడు గుట్టుగా ఉండటం మంచిదే కాని, అదేదో ఘనతగా చెప్పుకోవటం హర్షణీయం కాదు. ఏడిస్తే చూసి సంతోషించేవారు, ఓదార్చి తృప్తిపడే వారు ఉంటారు. మరింత నైతిక ధైర్యాన్ని దిగజార్చే వారూ ఉంటారు. కనుక బాధ పడుతున్నట్టు చెప్పకూడదు. అసలు విషయం ఏమంటే బాధపడకూడదు. పైకి నవ్వేసి లోపల బాధతో కుమిలి పోవటం మంచిది కాదు. ప్రస్తుతం మనం సమకాలిక సమాజాన్ని గమనించినట్టయితే చాలా మంది మనుషులు నవ్వుతూ కనపడటం ఏడవ లేక మాత్రమే అని అర్థం అవుతుంది. ఆ నవ్వులలో ఏ మాత్రం స్వచ్ఛత కనపడదు. లోపల ఉన్న బాధని, దుఃఖాన్ని, కష్టాలని, దిగులుని, నిరాశా నిస్పృహలని తెచ్చిపెట్టుకున్న నవ్వు వెనక దాచి కనపడతారు. ఆ నవ్వుల్లో జీవం ఉండదు. సహజత్వం ఉండదు. నవ్వు ఒక ముసుగు. నటులు ముఖానికి వేసుకున్న రంగు లాంటిది. మనోభావాలని యథేచ్ఛగా ప్రకటించ కలిగితే, కనీసం ఆత్మీయుల ముందు గుండెల్లో ఉన్న బరువు తగ్గుతుంది. తరువాత హాయిగా నవ్వగలుగుతాం. ఏడవటం తప్పు కాదే! మనిషికి సహజంగా ఉన్న లక్షణం. ఒకరు బాగుపడుతుంటే చూసి ఏడవటం తప్పు కాని, కష్టం వచ్చినప్పుడు ఏడవటం మానవ సహజం. శ్రీరామచంద్రుడంతటి వాడే తండ్రి మరణవార్త విని భోరున విలపించాడు. అది మానవత్వం. బాధ కలిగినప్పుడు ఏడిచి మనసులో ఉన్న బాధని బయటికి వెళ్ళగక్కకపోతే ఎన్నోరకాల అనారోగ్యాలు వస్తాయి. గుండె బరువుని తగ్గించి తేలిక పరచకపోతే అది గుండెపోటు, రక్తపోటు, మధుమేహం మొదలైన రూపాంతరాలు చెందుతుంది. నవ్వు ముఖకండరాలకి మంచి వ్యాయామం. శరీరానికి ఆరోగ్యం. మనస్సుకి రసాయనం ఎదుటివారికి ఆహ్లాదం. అట్లా ఉండాలంటే ఏడవలేక నవ్వకూడదు. ఆనందంతో నవ్వాలి. – డా. ఎన్. అనంతలక్ష్మి -
సనాతన దినోత్సవంగా సెప్టెంబర్ 3
న్యూయార్క్: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ నేత ప్రియాంక ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్‌లో సనాతన ధర్మంపై ఇలాంటి వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికాలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని కెంటకీలోని లూయిస్విల్లే నగర మేయర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు. US city declares September 3 as Sanatana Dharma Day https://t.co/YCCgNFK5Q9 — IndiaToday (@IndiaToday) September 6, 2023 లూయిస్‌విల్లేలోని హిందూ దేవాలయంలో జరిగిన మహా కుంభాభిషేకం వేడుకలో డిప్యూటీ మేయర్ బార్బరా సెక్స్టన్ స్మిత్ అధికారిక ప్రకటనను అందరికి చదివి వినిపించారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 3న సనాతన ధర్మం రోజుగా జరుపుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు చిదానంద సరస్వతి, పరమార్థ నికేతన్ అధ్యక్షుడు రిషికేశ్, శ్రీశ్రీ రవిశంకర్, భగవతీ సరస్వతి, లెఫ్టినెంట్ గవర్నర్ జాక్వెలిన్ కోల్మన్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కైషా డోర్సీ, పలువురు ఆధ్యాత్మిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇదీ చదవండి: మరో వివాదం: ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు -
మహీంద్రా సూపర్.. రూ. 2,637 కోట్ల లాభం
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,637 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2021–22) క్యూ4లో నమోదైన రూ. 2,237 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం అధికం. ఆదాయం రూ. 25,934 కోట్ల నుంచి రూ. 32,366 కోట్లకు చేరింది. ఇక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 6,577 కోట్ల నుంచి 56 శాతం ఎగిసి రికార్డు స్థాయిలో రూ. 10,282 కోట్లకు చేరిందని సంస్థ తెలిపింది. ఆదాయం రూ. 90,171 కోట్ల నుంచి 34 శాతం పెరిగి రూ. 1,21,269 కోట్లకు చేరింది. రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 16.25 (325 శాతం) డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. ఫలితాల నేపథ్యంలో మహీంద్రా షేరు బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 1,282 వద్ద ముగిసింది. ఇదీ చదవండి: ఎఫ్డీ రేట్ల పెంపు.. అత్యధికంగా 7.65 శాతం వడ్డీ -
శ్రీలంక అధ్యక్షడు సంచలన నిర్ణయం
-
హిల్లరీని మరోసారి టార్గెట్ చేసిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ హిల్లరీగా భారీగానే టార్గెట్ చేశారు. ఎన్నికల్లో తనకు ప్రధానపోటీ ఇచ్చిన డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీని ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. తాను అధికారంలోకి వస్తే హిల్లరీ క్లింటన్ ను జైలుకు పంపిస్తానని పదే పదే హెచ్చరించిన ట్రంప్ ఆ వైపుగా పావులు కదుపుతున్నారు. క్లింటన్ పై దాడిని ఎక్కుపెడుతూ శుక్రవారం చేసిన ట్వీట్ ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. ఈ-మెయిల్స్ అస్త్రాన్ని మరోసారి వాడుకున్న ట్రంప్. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెకు అసలు పోటీచేసే అవకాశమే లేదన్నారు. కానీ ఆమె పట్ల చాలా ఉదాహరంగా వ్యవహరించారన్నారు. ఆమె తప్పుడు ప్రచారం చేశారు కనుకనే ఎన్నికల్లో ఓడిపోయారని.. ఇందులోఆశ్చర్యం ఏమీ లేదంటూ హిల్లరీ అనుచరులపై మండిపడ్డారు. అలాగే యూఎస్ న్యాయాధికారి ఇనస్పెక్టర్ జనరల్ ఆండ్రూ నపోలిటానో గురువారం వ్యాఖ్యానించారు. హిల్లరీ ఈ-మెయిల్స్ వ్యవహారంపై ఎఫ్ బీఐ రెండుసార్లు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, మరోసారి విచారణ చేసే అవకాశం ఉందని ఆండ్రూ వెల్లడించారు. ఈ కేసు విచారణను పునః ప్రారంభించాలంటూ పిటిషన్ దాఖలు అయిందని వెల్లడించారు. మరోవైపు దర్యాప్తునకు పూర్తి సహాకారాన్ని అందిస్తామని హిల్లరీ ప్రతినిధి బ్రియాన్ ఫల్లోన్, గురువారం చెప్పారు. అలాగే జనవరి 20 న ప్రమాణ స్వీకారం చేసే ట్రంప్ కు విచారణ రద్దుచేసే అధికారం ఉండదంటున్నారు.. ఫెడరల్ చట్టం ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్‌కు 30 రోజులు ముందుగానే రాతపూర్వక సమాధానం ఇవ్వాలని వాదిస్తున్నారు. కాగా విదేశాంగ శాఖ కార్యదర్శిగా హిల్లరీ కొనసాగిన సమయంలో, తన అధికారిక కార్యకలాపాలకు వ్యక్తిగత ఈ-మెయిల్స్ ను వాడారంటూ, ఆరోపణలు వచ్చాయి. దీంతో తన ప్రచారం సందర్భంగా ట్రంప్ హిల్లరీ శిక్ష నుంచి తప్పించుకోలేరని, ఆమెను పారిపోనివ్వమని హెచ్చరించిన సంగతి తెలిసిందే. What are Hillary Clinton's people complaining about with respect to the F.B.I. Based on the information they had she should never..... — Donald J. Trump (@realDonaldTrump) January 13, 2017 have been allowed to run - guilty as hell. They were VERY nice to her. She lost because she campaigned in the wrong states - no enthusiasm! — Donald J. Trump (@realDonaldTrump) 13 January 2017 -
టర్కీలో మూడు నెలలు ఎమర్జెన్సీ
-
టర్కీలో మూడు నెలలు ఎమర్జెన్సీ
అన్కారా: టర్కీలో సైనికులు తిరుగుబాటు చేసి అశాంతి సృష్టించిన అనంతరం మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటించారు. క్యాబినెట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో సైనిక స్వేచ్ఛకు తావులేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను కొలవడానికి కొలమానాలు లేవన్నారు. సైనిక దళాల ఛీఫ్ గా తాను సైనికులలోని వైరస్ ను తొలగించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. సైనిక కుట్రలో విదేశాల హస్తం ఉందని ఎర్డోగాన్ ఆరోపంచారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. 60 వేల మంది సైనికులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన చేసిన 246 మందిని హతమార్చినట్టు, అందులో 24 మంది సైనికులు కూడా ఉన్నట్టు ఎర్డోగాన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 15,200 మంది విద్యాశాఖ అధికారులను, 21 వేలమంది ఉపాధ్యాయులను, 1500 మంది ఆర్థిక శాఖ అధికారులను, 1,577 మంది యూనివర్సిటీ డీన్లను, ప్రధానమంత్రి కార్యాలయంలోని 257 మంది అధికారులను తొలగించారు. 600 ప్రైవేట్ పాఠశాలను మూసివేశారు. -
నలంద కు యునెస్కో గుర్తింపు!
పాట్నాః దక్షిణాసియాలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయంగా పేరుపొందిన నలంద విశ్వవిద్యాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. ప్రపంచ చారిత్రక సంపద జాబితాలో బీహార్ లోని నలందకు యునెస్కో స్థానం కల్పించింది. టర్కీలోని ఇస్తాంబుల్ లో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 40వ సమావేశం సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా యునెస్కో ఆసియా డైరెక్టర్ జనరల్ ఇరినా బొకొనాకు భారత సాంస్కృతిక శాఖ కృతజ్ఞతలు తెలిపింది. పాట్నాకు 98 కిలోమీటర్ల దూరంలో నలంద మహావీర విశ్వవిద్యాలయానికి యునెస్కో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. బోధ్ గయ లోని మహాబోధి ఆలయం తర్వాత, యునెస్కో గుర్తింపు పొందిన రెండవ చారిత్రక సంపద నలంద. గుప్తుల నేతృత్వంలో ప్రారంభమైన అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయంగా పేరొందిన నలంద.. ప్రపంచంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటి. విజ్ఞాన బోధనలో 800 సంవత్సరాల చరిత్ర కలిగిన నలందా లోని విద్యా సంప్రదాయాల్లో బౌద్ధమతం, సన్యాసం వంటివి కనిపిస్తాయని యునెస్కో తన వెబ్ సైట్ లో పేర్కొంది. క్రీ.శ. 427 నుంచి క్రీ.శ. 1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉన్న ఈ విద్యాలయం చరిత్ర ఆధారంగా చూస్తే.. ప్రపంచంలోని తొలి విశ్వవిద్యాలయాల్లోనూ ఒకటి. బుద్ధుని కాలంలో అత్యంత జనాభా కలిగిన నగరంగా నలందా అభివృద్ధి చెందినప్పటికీ, ఆ తర్వాత చాలా కాలానికి గానీ అదో విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందలేదు. ఒకప్పుడు జైనమత కార్యకలాపాలకు కేంద్రమైన నలంద లో మహావీరుడు బసచేసినట్లు చారిత్రక కథనం. మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ఆఫ్ పారిస్ ఆధారిత అంతర్జాతీయ కౌన్సిల్ లోని నిపుణుల బృందం గత యేడాది నలంద యూనివర్శిటీని సందర్భించింది. ఈ చారిత్రక సంపదకు యునెస్కో గుర్తింపు లభించే అవకాశం ఉండటంతో వారు బీహార్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం సాంస్కృతిక శాఖ 200 పేజీల నామినేషన్ పత్రాన్ని వారికి అందించింది. 12 హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్న నలంద ను పరిశీలించిన జపనీయుల నిపుణుడు మసాయా మట్సు వారసత్వ సంపదగా గుర్తించడంపై సానుకూలంగా నోట్ ఇవ్వడంతో నలందా యునెస్కో ప్రపంచ చారిత్రక సంపద జాబితాలో చేరిపోయింది. -
రియో ఒలింపిక్స్‌కు మరో తలనొప్పి
బ్రెజిల్ రియో ఒలంపిక్స్ క్రీడల్ని మొన్నటి వరకు జికా వైరస్ భయపెడితే.. తాజాగా మరో కీలక పరిణామం వేధిస్తోంది. బ్రెజిల్ లో నెలకొన్న సంక్షోభం రియో ఒలింపిక్స్ పై ప్రభావాన్ని పడేయనుందా... అంటే అవునే అనిపిస్తోంది. బ్రెజిల్ రాజధాని నగరం రియో డి జనీరో లో తీవ్ర ఆర్థిక మాంద్య పరిస్థితులతో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో 2016 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ వ్యవహారంలో కొత్త తలనొప్పి మొదలైంది. నగరంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మధ్యంతర గవర్నర్ ఫ్రాన్సిస్కో డోర్నెల్లస్ శుక్రవారం ప్రకటిచారు. బ్రెజిల్లో రెండవ అత్యధిక జనాభా కలిగిన పెద్ద నగరం, రాజధాని రియో లో ప్రతిష్టాత్మక ఒలంపిక్స్‌కు ఈ ఏడాది అతిధ్యమిస్తున్న నగరంలో...ఒలింపిక్స్ కు సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ఆందోళన రేపింది. ప్రజా విపత్తుమూలంగా ప్రజల భద్రత, ఆరోగ్యం, విద్య ప్రజా, రవాణా, పర్యావరణ మేనేజ్మెంట్ తదితర సేవల్లో మొత్తం పతనానికి దారి తీయవచ్చనే ఆందోళనతో ఈ అత్యవసర చర్య అవసరమైందని రాష్ట్ర అధికారిక గెజిట్ స్పష్టం చేసింది. గేమ్స్ నిర్వహణలో సహాయం చేయాల్సిందిగా బ్రెజిల్ మధ్యంతర అధ్యక్షుడు మైకేల్ టెమర్ ఫెడరల్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రపంచ చమురు ధరలు పడిపోవడంతో ముఖ్యంగా పెట్రోలియం రంగంతోముడిపడివున్నరాష్ట్ర రెవెన్యూ క్షీణించింది. గత రెండేళ్లుగా నెలకొన్న సంక్షోభం రియో ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీసింది. అయితే రాష్ట్ర ఆర్థిక అత్యవసర పరిస్థితి ఒలింపిక్స్ నిర్వహణ పై ప్రభావం చూపదని, అనుకున్నట్టుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని రియో మేయర్ ఎడ్యరాడో పేస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే నగరంలోని మెట్రో విస్తరణ పనులు కూడా ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే పూర్తి అవుతాయని చెప్పారు. ఒలింపిక్స్ కు సంబంధించి అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు గేమ్స్ స్థానిక నిర్వాహక కమిటీ దీనిపై స్పందించ లేదు . కాగా సుమారు 5లక్షలమంది మందివిదేశీ సందర్శకులు ఒలింపిక్స్ క హాజరయ్యే అవకాశం ఉందని అంచాన. ఒలింపిక్ మౌలిక వ్యయాల్లో ఎక్కువభాగం ప్రైవేట్ కంపెనీల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. దీంతోపాటు నగరం , రాష్ట్ర , సమాఖ్య బడ్జెట్లు కేటాయించాల్సి ఉండగా...భద్రత , ఆరోగ్య సేవలు లాంటివాటి ప్రధాన బాధ్యత మాత్రం రియోదే.