అన్కారా: టర్కీలో సైనికులు తిరుగుబాటు చేసి అశాంతి సృష్టించిన అనంతరం మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటించారు. క్యాబినెట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో సైనిక స్వేచ్ఛకు తావులేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను కొలవడానికి కొలమానాలు లేవన్నారు. సైనిక దళాల ఛీఫ్ గా తాను సైనికులలోని వైరస్ ను తొలగించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. సైనిక కుట్రలో విదేశాల హస్తం ఉందని ఎర్డోగాన్ ఆరోపంచారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు.
60 వేల మంది సైనికులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన చేసిన 246 మందిని హతమార్చినట్టు, అందులో 24 మంది సైనికులు కూడా ఉన్నట్టు ఎర్డోగాన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 15,200 మంది విద్యాశాఖ అధికారులను, 21 వేలమంది ఉపాధ్యాయులను, 1500 మంది ఆర్థిక శాఖ అధికారులను, 1,577 మంది యూనివర్సిటీ డీన్లను, ప్రధానమంత్రి కార్యాలయంలోని 257 మంది అధికారులను తొలగించారు. 600 ప్రైవేట్ పాఠశాలను మూసివేశారు.
టర్కీలో మూడు నెలలు ఎమర్జెన్సీ
Published Thu, Jul 21 2016 9:46 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
Advertisement