Erdogan
-
ఇజ్రాయెల్‌కు హెచ్చరిక.. టర్కీ సంచలన నిర్ణయం!
అంకారా: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్.. గాజాపై r/ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే గాజా ప్రజలకు సాయం చేసేందుకు తాము ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తామని ఎర్డోగాన్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు.కాగా, తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎర్డోగాన్.. గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలస్తీనా ప్రజలకు అండగా టర్కీ అండగా నిలుస్తుందన్నారు. అలాగే, టర్కీ గతంలో లిబియా నాగోర్నో-కరాబాఖ్‌లలో ప్రవేశించినట్టుగా ఇజ్రాయెల్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌లోకి వెళ్తే కనుక వారి సైన్యంపై తీవ్రమైన దాడులు జరుగుతాయి అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఎర్డోగాన్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం. కాగా 2020లో ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన లిబియా జాతీయ ఒప్పందానికి మద్దతుగా టర్కీ సైనిక సిబ్బందిని లిబియాకు పంపింది.ఇదిలా ఉండగా.. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబుల మోత మోగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ స్కూల్ భవనంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 100 మంది గాయపడ్డారు. సెంట్రల్ గాజాలోని డీర్-అల్-బలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల, యువత మృతదేహాలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. వీరి మృతదేహాలను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. -
Earthquakes: రెస్క్యూ ఆపరేషన్‌లో చిన్నారులు సేఫ్!
గజియాన్టెప్(తుర్కియే): భూకంప శిథిలాలను తొలగించేకొద్దీ వెలుగుచూస్తున్న విగతజీవులు.. ప్రాణాధార వ్యవస్థలు అందుబాటులోలేక రక్తమోడుతూ సాయం కోసం ఎదురుచూస్తున్న క్షతగాత్రులు.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు కాలంతో పోటీపడుతూ నిర్విరామంగా శ్రమిస్తున్న సహాయక సిబ్బంది, స్థానికులు.. ఎటుచూసినా ఆప్తుల ఆక్రందనలు, మిన్నంటిన రోదనా దృశ్యాలతో తుర్కియే, సిరియా భూకంప ప్రభావ ప్రాంతాలు భయానకంగా తయారయ్యాయి. దశాబ్దకాలంలో ఎన్నడూలేనంతటి ఘోర మృత్యుకంపం ధాటికి ఇరుదేశాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య తాజాగా 11,200 దాటేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎర్డోగన్ పర్యటన సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ హతే ప్రావిన్స్, కహ్రామన్మరాస్ పట్ణణం, భూకంప కేంద్రం గుర్తించిన పజార్సిక్ పట్టణాల్లో పర్యటించారు. క్షతగాత్రులతో నిండిన తాత్కాలిక ‘టెంటుల సిటీ’లో బాధితులతో మాట్లాడారు. ‘ఎవరినీ ఇలా వీధుల్లో వదిలేసి వెళ్లిపోము. అందరినీ ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు. భూకంపం మిగిల్చిన విషాదం మొదలై రెండ్రోజులైన తర్వాత కహ్రామన్మరాస్ పట్టణంలో శిథిలాల నుంచి మూడేళ్ల బాలుడు ఆరిఫ్ ఖాన్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగారు. అదియామన్ సిటీలో పదేళ్ల బాలిక బీటల్ ఎడీస్‌ను కాపాడారు. A baby and his mother were rescued from the rubble after spending 55 hours in Turkey's Gaziantep. #TurkeyQuake#Turkiye #Turkiye#Turkey #TurkeySyriaEarthquake #TurkeyQuake #earthquakes #Syria #زلزال #زلزال_سوريا_تركيا #TurkeySyriaEarthquake pic.twitter.com/Kt5NFteETZ — Ali Cheema🔥🥀 (@ali_cheema10) February 8, 2023 కుప్పకూలిన వేలాది భవంతుల కింద చిక్కుకున్న వారి కోసం కొనసాగుతున్న అన్వేషణకు గడ్డకట్టే చలి, మంచు పెద్ద అవరోధంగా మారాయి. తుర్కియేలోని మలాట్యా సిటీలో వీధి పొడవునా మృతదేహాలు ఉంచి మార్చురీ వాహనాల కోసం జనం ఎదురుచూస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. మైనస్ ఆరు డిగ్రీ సెల్సియస్ వాతావరణంలో శిథిలాల్లో కొందరు చలికే గడ్డకట్టుకుని చనిపోయి ఉంటారని సహాయక సిబ్బందిలో ఒకరైన పికల్ వ్యాఖ్యానించారు. టర్కీ అత్యవసర సిబ్బందికి దాదాపు డజను దేశాల నుంచి ఆగమేఘాల మీద వచ్చేసిన సహాయక బృందాలు జతకలిసి బాధితుల అన్వేషణలో బిజీగా మారాయి. This video broke my heart 💔 The little girl says to the rescuer when he reaches her: Get me out from under this wreckage,sir,me and my sister, and I will become your slave.#earthquakeinturkey #Syria #هزه_ارضيه #زلزال #İstanbul #earthquake #Turkey #PrayForTurkey pic.twitter.com/U9mMrZdROM — Zuher Almosa (@AlmosaZuher) February 7, 2023 సిరియాలో పరిస్థితి దారుణం తుర్కియేతో సత్సంబంధాల కారణంగా చాలా దేశాలు తమ బృందాలను ఆ దేశానినికి పంపి సాయపడుతున్నాయి. కానీ, అంతర్యుద్దం, ద్వైపాక్షిక సంబంధాలు బొత్తిగాలేని సిరియాకు ఇతర దేశాల నుంచి సాయం సరిగా అందట్లేదు. దీంతో అక్కడ సహాయక చర్యలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. దీంతో శిథిలాల్లో బాధితుల ఆక్రందనలు అరణ్యరోదనలయ్యాయి. సిరియాను ఆదుకునే మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. భూకంపంతో ఆ దేశాల్లో 2.3 కోట్ల ప్రజల బ్రతుకులు దుర్భరంగా మారనున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. A young Syrian boy smiled and started to play with rescue workers who pulled him from the rubble of a building that was destroyed following deadly earthquakes in Turkey and Syria pic.twitter.com/kM3Qt4UqvG — Reuters (@Reuters) February 8, 2023 భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిన భారత్ మరో బృందాన్నీ తుర్కియేకి పంపనుంది. ‘తుర్కియేలో 11 మంది భారతీయులు చిక్కుకున్నారు. వారిలో ఒకరి జాడ తెలియాల్సిఉంది. మిగతావారు క్షేమం’ అని భారత విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. మరోవైపు ఆరు టన్నుల సహాయక సామగ్రిని సిరియాకు భారత్ అందజేసింది. My heart goes out to the people of Turkey and Syria and all affected by the devastating Turkey-Syria earthquake. The death toll continues to grow in Turkey and northern Syria where two powerful earthquakes destroyed buildings and left some villages in total rubble. 🙏💔 pic.twitter.com/Gv8ZGnvBHw — Maha Mehanna (@MahaMehanna) February 7, 2023 -
ఉక్రెయిన్ యుద్ధం.. చర్చల్లో పురోగతి
కీవ్: ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం లభించే సూచనలు కన్పిస్తున్నాయి. నెలకు పైగా సాగుతున్న యుద్ధానికి తెర దించేందుకు టర్కీ వేదికగా రష్యా, ఉక్రెయిన్ జరుపుతున్న తాజా చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి కన్పిస్తోంది. ఉక్రెయిన్‌కు విశ్వాసం కల్పించే చర్యల్లో భాగంగా రాజధాని కీవ్, చెహిర్నివ్ నగరాల నుంచి సైన్యాన్ని భారీగా ఉపసంహరిస్తున్నట్టు రష్యా మంగళవారం ప్రకటించింది. వాటినుంచి రష్యా దళాలు వెనుదిరుగుతున్నాయని ఉక్రెయిన్ కూడా ధ్రువీకరించింది. అంతేగాక ఇరు దేశాల అధ్యక్షులు పుతిన్, జెలెన్స్కీ ముఖాముఖి సమావేశమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చర్చల్లో పాల్గొంటున్న ఉక్రెయిన్ బృందం సభ్యుడొకరు వెల్లడించారు! టర్కీ విదేశాంగ మంత్రి మేవ్లట్ కౌసోగ్లు కూడా దీన్ని ధ్రువీకరించారు. చర్చలు అర్థవంతంగా సాగాయని, పలు అంశాలపై ఇరు పక్షాలకు ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. వీటికి కొనసాగింపుగా త్వరలో రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు భేటీ అవుతారన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య గతంలో బెలారస్ తదితర చోట్ల జరిగిన నాలుగైదు రౌండ్ల చర్చల్లో పెద్దగా ఏమీ తేలకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు వారాల పై చిలుకు విరామం తర్వాత ఇరు దేశాల బృందాలు తాజాగా మంగళవారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో సమావేశమయ్యాయి. ఇరు దేశాల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించాయి. చర్చల నేపథ్యంలో పరస్పర విశ్వాస కల్పన ప్రయత్నాల్లో భాగంగానే సైన్యాన్ని వెనక్కు రప్పించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ చెప్పారు. భవిష్యత్తులో ఏవైపూ మొగ్గకుండా తటస్థంగా ఉంటామని, అణ్వస్త్రరహిత దేశంగా కొనసాగుతామని చర్చల్లో ఉక్రెయిన్ ప్రతిపాదించిందని ఫోమిన్ చెప్పారు. బదులుగా ఆ దేశానికి ఇవ్వాల్సిన భద్రతా హామీలపై కూడా ఏకాభిప్రాయం కుదిరేలా కన్పిస్తోందన్నారు. ఆ మేరకు ఒప్పంద రూపకల్పన దిశగా చర్చలు సాగాయని వివరించారు. తటస్థంగా ఉండాలంటే రష్యాతో పాటు అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, టర్కీ, చైనా, పోలండ్, ఇజ్రాయెల్ వంటి దేశాలు తమకు భద్రతా హామీ ఇవ్వాలని ఉక్రెయిన్ బృందం ప్రతిపాదించినట్టు సమాచారం. సదరు హామీ ‘ఒక్కరిపై దాడి, అందరిపైనా దాడి’ అన్న నాటో సూత్రం మాదిరిగా ఉండాలని కోరిందంటున్నారు. 2014లో రష్యా ఆక్రమించిన క్రిమియా ద్వీపకల్పం హోదాపై 15 ఏళ్ల సంప్రదింపుల అవధి ఉండాలని ఉక్రెయిన్ ప్రతిపాదించింది. వీటిపై రష్యా స్పందన తెలియాల్సి ఉంది. అయితే చర్చలు అర్థవంతంగా సాగాయని రష్యా బృందం కూడా సంతృప్తి వెలిబుచ్చింది. ఉక్రెయిన్ ప్రతిపాదనలను సమీక్షించి పుతిన్‌కు నివేదిస్తానని రష్యా బృందంలోని కీలక సభ్యుడు వ్లాదిమిర్ మెడిన్స్కీ తెలిపారు. అధ్యక్షుల స్థాయి చర్చలకు ఈ మాత్రం పురోగతి చాలని ఉక్రెయిన్ బృంద సభ్యుడు డేవిడ్ అర్కామియా అన్నారు. చర్చల వేదిక వద్ద పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన రష్యా కుబేరుడు, చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ యజమాని రోమన్ అబ్రమోవిచ్ ప్రత్యక్షమయ్యారు! ఇరు దేశాల అంగీకారంతోనే చర్చల్లో ఆయన అనధికారిక మధ్యవర్తిగా ఉన్నారని పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ చెప్పారు. యథాతథంగా కొనసాగుతున్న దాడులు ఓవైపు చర్చలు జరుగుతుండగా∙పశ్చిమ, దక్షిణ ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాలపై రష్యా దాడులు తీవ్రస్థాయిలో కొనసాగాయి. పశ్చిమ ప్రాంతంలోని ఓ ఇంధనాగారంపై భారీగా క్షిపణి దాడులు జరిగాయి. దక్షిణాదిన రేవు పట్టణం మైకోలేవ్‌లో 9 అంతస్తుల పాలనా భవనంపై క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇందులో ఏడుగురిదాకా మరణించారని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఉద్యోగులు భవనంలోకి వెళ్లేదాకా ఆగి మరీ దాడికి దిగి పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రష్యా దళాలను తమ సైన్యాలు అద్భుతంగా తిప్పికొడుతున్నాయన్నారు. కీవ్ శివార్లలోని కీలకమైన ఇర్పిన్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 60కిపైగా మతపరమైన కట్టడాలను రష్యా నేలమట్టం చేసిందని ఉక్రెయిన్ పేర్కొంది. తమకు పూర్తిస్థాయిలో సాయం చేసేందుకు వెనకాడుతున్న పశ్చిమ దేశాలు ఈ విధ్వంసానికి పరోక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమీ సమీపంలోని ట్రోస్టియానెట్స్ నగరాన్ని ఉక్రెయిన్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. రష్యా సైనికుల మృతదేహాలు, కాలిపోయిన రష్యా యుద్ధ ట్యాంకులు నగరంలో పర్యటించిన ఏపీ వార్తా సంస్థ సిబ్బందికి కన్పించాయి. రష్యా, బెలారస్‌ల్లో కార్యకలాపాలను ఆపేస్తున్నట్టు ఆర్థిక సేవల సంస్థ బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఉక్రెయిన్‌లోని అణు వ్యవస్థల భద్రతను సమీక్షించేందుకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) చీఫ్ ఆ దేశంలో పర్యటించారు. -
333మంది సైనికులకు అరెస్టు వారెంట్లు !
అంకారా(టర్కీ): గత ఏడాది తిరుగుబాటు ప్రయత్నం నేపథ్యంలో అనుమానితులపై ఎర్డోగన్ ప్రభుత్వ చర్యలు ఇంకా కనసాగుతూనే ఉన్నాయి. తిరుగుబాటుకు సహకరించారనే ఆరోపణలపై ప్రస్తుతం దాదాపు 333 మంది సైనికులకు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అమెరికాలో అజ్ఞాత జీవితం గడుపుతున్న మత గురువు ఫెతుల్లా గులెన్ తమ ప్రభుత్వంపై తిరుగుబాటుకు ప్రోత్సహించారని అధ్యక్షుడు ఎర్డోగన్ ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఇప్పటి వరకు 50వేల మందిని అరెస్టు చేయటంతోపాటు లక్షమందికి పైగా సైనికులు, ఉద్యోగులను తొలగించారు. ఇప్పటికీ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వారెంట్లు జారీ అందుకున్న వారిలో 333 మంది సైనికులు, 27 మంది సాధారణ పౌరులు ఉన్నారు. వీరంతా గులెన్ తరపున రహస్య ఇమామ్‌లుగా పని చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకులకు వీరు సమాచారం అందిస్తున్నారని అంటోంది. కాగా, ఇటీవల వారెంట్లు అందుకున్న వారిలో కొందరిని ఇప్పటికే ప్రభుత్వం అదుపులోకి తీసుకుందని సమాచారం. -
టర్కీ అధ్యక్షుడికి విస్తృతాధికారాలు!
-
టర్కీ అధ్యక్షుడికి విస్తృతాధికారాలు!
ఇస్తాంబుల్: టర్కీ అధ్యక్షుడికి విస్తృతాధికారాలు కల్పించే అంశంపై ఆదివారం జరిగిన రెఫరెండంలో ప్రజలు సానుకూలంగా స్పందించారు. 92 శాతం బ్యాలట్ బాక్సుల కౌంటింగ్ జరగ్గా, అధ్యక్షుడికి విస్తృతాధికారాలు ఇవ్వాలన్న ప్రతిపా దనకు అనుకూలంగా 52.1శాతం ఓట్లు, వ్యతి రేకంగా 47.9 శాతం ఓట్లు పడినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. దేశాధ్యక్షుడు తయ్యప్ ఎర్దోగన్ నేతృత్వంలో జరిగిన రెఫరెండం టర్కీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని భావి స్తున్నారు. 5 కోట్ల 80 లక్షల మంది రెఫరెండంలో ఓటేశారు. ఫలితం ఎర్దోగన్‌కు అనుకూలంగా రావడంతో దేశ చరిత్రలో ఇంతవరకు ఏ అధ్యక్షునికీ లేనన్ని విస్తృతాధికారాలు ఆయనకు లభిస్తాయి. ఆధునిక టర్కీ వ్యవస్థాపకుడు అటాటర్క్, అతని తరువాత విజయవంతమైన అధ్యక్షునిగా పేరుగడించిన ఇస్మత్ ఇనోనూకు కూడాలేని అధికారాలు ఎర్దోగన్ వశమవుతాయి. కాగా, రిఫరెండంలో అక్రమాలు జరిగాయని, విపక్షాలు ఆరోపించాయి. -
సూసైడ్ బాంబర్ వయస్సు 12 నుంచి 14 ఏళ్లు!
అంకారా: టర్కీలోని ఘజియాన్టేప్ నగరంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో 51 మంది మృతి చెందగా.. 69 మంది గాయపడ్డారు. క్షతగాత్రులలో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే, వివాహ వేడుకను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్కులని టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ఆదివారం వెల్లడించారు. ఓ టీనేజర్ చేత దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు ఆపరేషన్ చేపడుతున్నాయని తెలిపారు. భద్రతా బలగాలు ఘజియాన్టేప్ సరిహద్దు మార్గాలను మూసివేసి.. ఆయా ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి. -
టర్కీలో మూడు నెలలు ఎమర్జెన్సీ
-
టర్కీలో మూడు నెలలు ఎమర్జెన్సీ
అన్కారా: టర్కీలో సైనికులు తిరుగుబాటు చేసి అశాంతి సృష్టించిన అనంతరం మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటించారు. క్యాబినెట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో సైనిక స్వేచ్ఛకు తావులేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను కొలవడానికి కొలమానాలు లేవన్నారు. సైనిక దళాల ఛీఫ్ గా తాను సైనికులలోని వైరస్ ను తొలగించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. సైనిక కుట్రలో విదేశాల హస్తం ఉందని ఎర్డోగాన్ ఆరోపంచారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. 60 వేల మంది సైనికులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన చేసిన 246 మందిని హతమార్చినట్టు, అందులో 24 మంది సైనికులు కూడా ఉన్నట్టు ఎర్డోగాన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 15,200 మంది విద్యాశాఖ అధికారులను, 21 వేలమంది ఉపాధ్యాయులను, 1500 మంది ఆర్థిక శాఖ అధికారులను, 1,577 మంది యూనివర్సిటీ డీన్లను, ప్రధానమంత్రి కార్యాలయంలోని 257 మంది అధికారులను తొలగించారు. 600 ప్రైవేట్ పాఠశాలను మూసివేశారు. -
'రష్యాకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు'
రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఘటనలో క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని టర్కీ అధ్యక్షుడు ఎర్గోసన్ తెలిపారు. గురువారం ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తమ గగనతల నిబంధనలు అతిక్రమించినందుకు రష్యానే క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందన్నారు. టర్కీ సైనిక బలగాలు, పైలట్లు తమ విధిని సక్రమంగా నిర్వహించినట్లు తెలిపారు. ఇది అవసరమైనటువంటి చర్యగా తాను భావిస్తున్నట్లు ఎర్గోసన్ అన్నారు. తాము పలుమార్లు హెచ్చరించినా రష్యా పైలట్లు స్పందించలేదన్న టర్కీ వాదనతో ఏకీభవించని రష్యా విమానం కూల్చివేతను సీరియస్‌గా తీసుకుంది. టర్కీకి తగిన గుణపాఠం చెబుతామని ప్రకటించి ఆ దిశగా ముందుకు కదులుతోంది. టర్కీ సరిహద్దులో గల సిరియాలోని రష్యా ఎయిర్ బేస్‌లో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్లను మోహరించింది. -
ఎర్డోగాన్కే టర్కీ పట్టం
టర్కీకి సర్వంసహాధికారి కావాలనుకున్న ఆ దేశాధ్యక్షుడు రెసెప్ ఎర్డోగాన్ కోరిక ఈడేరింది. కేవలం ఆర్నెల్లక్రితం జరిగిన ఎన్నికల్లో భంగపడ్డ ఎర్డోగాన్ చాలా స్వల్పకాలంలోనే పుంజుకుని తాజా ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించారు. దేశ ప్రజల్ని సమ్మోహనపరచడంలో తనకెవరూ సాటిరారని నిరూపించారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ(ఏకేపీ) 49.4 శాతం ఓట్లు తెచ్చుకుని 550 స్థానాలున్న పార్లమెంటులో 216 స్థానాలను కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో ఇదే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 276 స్థానాలను సాధించలేక చతికిలబడింది. పైగా అప్పుడు దానికొచ్చిన ఓట్ల శాతం 40 మాత్రమే. విపక్షాలన్నీ కలిసి 60 శాతం ఓట్లు గెల్చుకున్నాయి. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి అవసరమైన మెజారిటీ ఏ పార్టీకి రాని పక్షంలో అధిక స్థానాలొచ్చిన పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పాలి. అయితే అది సాధ్యపడలేదు. పర్యవసానంగా ప్రస్తుత ఎన్నికలు అవసరమయ్యాయి. గత కొన్నాళ్లుగా టర్కీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తూ వచ్చిన రాజకీయ విశ్లేషకులు...ఈ ఎన్నికల్లో కూడా కొంచెం హెచ్చుతగ్గులతో గత ఫలితాలే పునరావృతమవుతాయని అంచనా వేశారు. టర్కీ స్వల్పకాలంలోనే మూడోసారి ఎన్నికలకు వెళ్లాల్సిరావచ్చునని భావించారు. కానీ ఎర్డోగాన్ అందరి అంచనాలనూ తలకిందులు చేశారు. పాశ్చాత్య ధోరణులను గట్టిగా వ్యతిరేకించి, ఇస్లామిక్ సిద్ధాంతాలను అవలంబించకపోతే దేశం నాశనమవుతుందని సందర్భం వచ్చినప్పుడల్లా ఎర్డోగాన్ ఊదరగొట్టారు. కుర్దులతో ప్రమాదం పొంచి ఉన్నదని, దీన్నుంచి దేశాన్ని కాపాడటం ఏకేపీకి మాత్రమే సాధ్యమని చెబుతూ వచ్చారు. అయితే ఈ పనులన్నీ గత ఎన్నికల్లోనూ చేశారు. అప్పుడు ఇవేవీ ఆయనకు అక్కరకు రాలేదు. అప్పుడు పనికిరాని అస్త్రాలు ఇప్పుడు మాత్రం ఎలా విజయాన్ని సాధించిపెట్టాయో తెలియాలంటే ఈ ఆర్నెల్లూ టర్కీలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. దేశానికి ఐఎస్ ఉగ్రవాదులనుంచి ప్రమాదం పొంచి ఉన్నదని ప్రజలను ఆయన పదే పదే హెచ్చరించారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పడి సమర్థవంతంగా వారి దాడులను తిప్పిగొట్టకపోతే దేశం చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. అంతేకాదు... కుర్దుల తరఫున పోరాడుతున్న కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే)పై ఆయన విరుచుకుపడ్డారు. కుర్దిష్ స్థావరాలపై బాంబు దాడులు చేయించారు. మరోపక్క కుర్దుల హక్కుల కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్‌డీపీ)పై అనేక ఆరోపణలు చేశారు. ఆ పార్టీ పైకి ప్రజాస్వామ్యం ముసుగు తగిలించుకున్నా అది రహస్యంగా పీకేకేతో చేతులు కలిపిందని, దేశ ప్రయోజనాలను దెబ్బతీయడంతోపాటు కుర్దుల భవిష్యత్తుకు కూడా అది ఎసరు తెస్తున్నదని ఎర్డోగాన్ ప్రచారం చేశారు. ఈ ప్రచారం సృష్టించిన భావోద్వేగాలు తీవ్ర స్థాయికి చేరుకున్న తరుణంలోనే గత నెలలో రాజధాని అంకారాలో రెండు భారీ బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. హెచ్‌డీపీ పార్టీ ఇతర వామపక్ష పార్టీలతో కలిసి నిర్వహించిన శాంతి ర్యాలీలో జరిగిన ఈ పేలుళ్ల కారణంగా 130మంది పౌరులు మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరించకపోతే ఇలాంటివి పదే పదే జరుగుతాయని, దేశం అభివృద్ధిని సాధించడం అసాధ్యమవుతుందని ఎర్డోగాన్ హెచ్చరించారు. పౌరుల్లో రేపటి గురించిన భయాందోళనలు రేకెత్తించడంలో ఎర్డోగాన్ విజయం సాధించారని ఒక విశ్లేషకుడు చెప్పిన మాటల్లో నిజముంది. అయితే ఎన్నికల్లో విజయం సాధించడానికి అక్కరకొచ్చిన అస్త్రాలు ప్రభు త్వాన్ని సాఫీగా నడపడంలో ఎర్డోగాన్‌కు తోడ్పడే అవకాశాలు లేవు. నిరుద్యోగం అక్కడి యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దేశంలో సంపద పెరిగినా అది కొన్ని వర్గాలకే సొంతం కావడంవల్ల అసమానతలు తారస్థాయికి చేరుకున్నాయి. వృద్ధి రేటు క్రమేపీ క్షీణిస్తూ వస్తున్నది. వీటన్నిటినీ ప్రతిఫలిస్తున్న మీడియా అంటే ఎర్డోగాన్ ప్రభుత్వానికి మొదటినుంచీ కడుపుమంట. వాటిపై అనేక ఆంక్షలు విధించడం, పాత్రికేయులను ఖైదు చేయడం టర్కీలో పెరిగి పోయింది. అధ్యక్షుణ్ణి అవమానించే రాతలు రాస్తున్నారన్నది వీరిపై ప్రధాన ఆరోపణ. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ కాసేపటిలోనే అక్కడి మీడియా సంస్థలపై పోలీసులు దాడిచేసిన తీరు చూస్తుంటే ఇది రాను రాను మరింతగా పెరుగుతుందని అర్ధమవుతుంది. పాత్రికేయులపై సాగుతున్న దాడులపైనా...కుర్దుల విషయంలో వ్యవహ రిస్తున్న తీరుపైనా యూరప్ దేశాలకూ, అమెరికా, రష్యాలకూ అభ్యంతరా లున్నాయి. టర్కీ ఇప్పటికే నాటో సభ్య దేశం. ఈయూలో సభ్యత్వం కోసం కూడా అది ప్రయత్నిస్తున్నది. అయితే టర్కీ వ్యవహార శైలి ఈయూ ప్రయోజనాలకు విఘాతం కలిగించేదిగా ఉన్నదని ఆ దేశాలు భావిస్తున్నాయి. ఐఎస్ ఉగ్రవాదులపై సిరియాలోనూ, ఇరాక్‌లోనూ పోరాడుతున్నది కుర్దులే. అలాంటివారిపై బాంబు దాడులకు పూనుకోవడం సరైంది కాదని యూరప్ దేశాలు విశ్వసిస్తున్నాయి. అటు అమెరికా, రష్యాలకు కూడా ఈ విషయంలో కుర్దులపై సానుభూతి ఉంది. ఆ దేశాల మనోభీష్టానికి వ్యతిరేకంగా కుర్దులపై కఠిన చర్యలు తీసుకోవడం ఎర్డోగాన్‌కు అంత సులభం కాదు. ఈ ఎన్నికల్లో సాధించిన ఘన విజయంతో రాజ్యాంగ సవరణలకు పూనుకుని అధ్యక్ష తరహా పాలనను ప్రవేశపెట్టాలని ఆయన ప్రయత్నిస్తారు. ఇప్పుడున్న మెజారిటీతో అది సాధ్యమే. భావోద్వేగాలను రెచ్చగొట్టడంవల్ల తిరుగులేని మెజారిటీ లభించి ఉండొచ్చుగానీ పరిపాలన సక్రమంగా చేయాలన్నా...దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్నా అన్ని వర్గాల సహకారం అవసరం. ఘర్షణాత్మక వైఖరివల్ల జరిగేది కీడే తప్ప మేలు కాదు. ఆ సంగతిని ఎర్డోగాన్ గ్రహించడానికి ఎంతో కాలం పట్టదు.