అంకారా: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్.. గాజాపై r/ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే గాజా ప్రజలకు సాయం చేసేందుకు తాము ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తామని ఎర్డోగాన్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు.
కాగా, తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎర్డోగాన్.. గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలస్తీనా ప్రజలకు అండగా టర్కీ అండగా నిలుస్తుందన్నారు. అలాగే, టర్కీ గతంలో లిబియా నాగోర్నో-కరాబాఖ్‌లలో ప్రవేశించినట్టుగా ఇజ్రాయెల్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌లోకి వెళ్తే కనుక వారి సైన్యంపై తీవ్రమైన దాడులు జరుగుతాయి అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఎర్డోగాన్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం. కాగా 2020లో ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన లిబియా జాతీయ ఒప్పందానికి మద్దతుగా టర్కీ సైనిక సిబ్బందిని లిబియాకు పంపింది.
ఇదిలా ఉండగా.. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబుల మోత మోగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ స్కూల్ భవనంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 100 మంది గాయపడ్డారు. సెంట్రల్ గాజాలోని డీర్-అల్-బలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల, యువత మృతదేహాలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. వీరి మృతదేహాలను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment