సూసైడ్ బాంబర్ వయస్సు 12 నుంచి 14 ఏళ్లు!
టర్కీలో వివాహ వేడుకను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది 12 నుంచి 14 సంవత్సరాల
అంకారా: టర్కీలోని ఘజియాన్‌టేప్ నగరంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో 51 మంది మృతి చెందగా.. 69 మంది గాయపడ్డారు. క్షతగాత్రులలో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే, వివాహ వేడుకను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్కులని టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ఆదివారం వెల్లడించారు.
ఓ టీనేజర్ చేత దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు ఆపరేషన్ చేపడుతున్నాయని తెలిపారు. భద్రతా బలగాలు ఘజియాన్‌టేప్ సరిహద్దు మార్గాలను మూసివేసి.. ఆయా ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి.