టర్కీలో సైనికులు తిరుగుబాటు చేసి అశాంతి సృష్టించిన అనంతరం మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటించారు. క్యాబినెట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో సైనిక స్వేచ్ఛకు తావులేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను కొలవడానికి కొలమానాలు లేవన్నారు. సైనిక దళాల ఛీఫ్ గా తాను సైనికులలోని వైరస్ ను తొలగించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. సైనిక కుట్రలో విదేశాల హస్తం ఉందని ఎర్డోగాన్ ఆరోపంచారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు.
Published Thu, Jul 21 2016 11:18 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
Advertisement