ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,637 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2021–22) క్యూ4లో నమోదైన రూ. 2,237 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం అధికం. ఆదాయం రూ. 25,934 కోట్ల నుంచి రూ. 32,366 కోట్లకు చేరింది.
ఇక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 6,577 కోట్ల నుంచి 56 శాతం ఎగిసి రికార్డు స్థాయిలో రూ. 10,282 కోట్లకు చేరిందని సంస్థ తెలిపింది. ఆదాయం రూ. 90,171 కోట్ల నుంచి 34 శాతం పెరిగి రూ. 1,21,269 కోట్లకు చేరింది. రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 16.25 (325 శాతం) డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. ఫలితాల నేపథ్యంలో మహీంద్రా షేరు బీఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ. 1,282 వద్ద ముగిసింది.
ఇదీ చదవండి: ఎఫ్‌డీ రేట్ల పెంపు.. అత్యధికంగా 7.65 శాతం వడ్డీ
Comments
Please login to add a commentAdd a comment